బధిర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
అనంతపురం అర్బన్: ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. శనివారం స్థానిక సంఘం జిల్లా బ్రాంచ్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి డి.చంద్రమోహన్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, బధిర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కుమార్ పర్యవేక్షించారు.
నూతన కార్యవర్గం ఇలా..
ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పి.హెచ్.శ్రీరాములు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా జి.సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.గోవింద కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.మోహన్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా జి.దుష్యంత్, కోశాధికారిగా సి.కుళ్లాయిస్వామి, మహిళ కార్యదర్శిగా ఎ.అక్మమ్మ, కార్యనిర్వాహక సభ్యులుగా జి. మహబూబ్‌బాషా, జి.శ్రీనాథ్‌రెడ్డి, ఎం.రాజశేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు.


