మళ్లీ ఇంటింటికీ వెళ్లండి!
● సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం
● నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్‌ఓ విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈనెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి.
సర్వేలో సేకరించాల్సిన సమాచారం..
● వందశాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి.
● మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేయాలి.
● వ్యక్తిగత డేటా, కుటుంబస్థాయి డేటా తప్పనిసరిగా సేకరించాలి.
● పేరు, లింగ (జెండర్), పుట్టినతేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి.
● మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.
● ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి.
● నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యు మెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి.
● ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్‌పీజీ, విద్యుత్, టాయిలెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి.
● ఇంటి యజమాని (హౌజ్‌హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు.
సజావుగా
నవోదయ
ప్రవేశ పరీక్ష
అనంతపురం సిటీ : జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష శనివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా జరిగింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 29 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,634 మంది విద్యార్థులకు గాను 3,899 మంది హాజరయ్యారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్ల తడబాటు
వీరవాసరం: పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం ఎంఆర్కే జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీల్లో జిల్లా బాల, బాలికల జట్లు
తడబడ్డాయి. జిల్లా బాలికల జట్టు నెల్లూరు జట్టుపై 11–01 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరినా.. అక్కడ తూర్పుగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇక.. బాలురకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు పరాజయం పాలైంది.
మళ్లీ ఇంటింటికీ వెళ్లండి!
మళ్లీ ఇంటింటికీ వెళ్లండి!


