ఇసుక టిప్పర్ పట్టివేత
శింగనమల: వైఎస్సార్ కడప జిల్లా వేటూరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పరును శనివారం శింగనమల క్రాస్‌లో మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు జిల్లా మైనింగ్ శాఖ డీడీ ఆదినారాయణ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాడికిలో..
యాడికి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని రాయలచెరువు గ్రామంలో శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని రాజశేఖర్ నాయుడు టిప్పర్‌లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. పెద్దపప్పూరు మండలం నుంచి రాయలచెరువు, చందన గ్రామం మీదుగా డోన్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైందన్నారు. టిప్పర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి రాజశేఖర్ నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పీఏసీఎస్ ఉద్యోగుల
యూనియన్ నూతన కమిటీ
అనంతపురం అగ్రికల్చర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నూతన కమిటీ ఎన్నికైంది. శనివారం స్థానిక యాదవ కల్యాణ మంటపంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా డి. శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడిగా హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారాయణ, కోశాధికారిగా ఎం.హనుమంతరెడ్డిని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డీసీఎంస్ చైర్మన్ నెట్టం వెంకటేష్, సీఐటియూ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.


