పల్స్ పోలియోను విజయవంతం చేయండి : డీఎంహెచ్‌ఓ
అనంతపురం మెడికల్: ఈ నెల 21న తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను అందించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, డీఐఓ డాక్టర్ శశిభూషణ్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జయలక్ష్మి, ఓబులు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిరుత దాడిలో దూడల మృతి
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున రైతు రాధాకృష్ణకు చెందిన రెండు ఆవుదూడలను చిరుత చంపి తినేసింది. ఘటనతో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నేడు ప్యాసింజర్ రైలు రద్దు..
కళ్యాణదుర్గం రూరల్: కదిరిదేవరపల్లి నుంచి గుంతకల్లు మీదుగా తిరుపతికి ప్రతి రోజూ సంచరించే ప్యాసింజర్ రైలును ఈ నెల 17న పాక్షికంగా రద్దు చేసినట్లు కళ్యాణదుర్గం రైల్వే స్టేషన్ మేనేజర్ ధర్మతేజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం, సోమలాపురం మధ్యన కొత్తగా రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
జిల్లా ఎండోమెంటు
ఏసీగా మల్లికార్జున
అనంతపురం కల్చరల్: జిల్లా ఎండోమెంటు సహాయ కమిషనర్‌గా వైఎస్సార్ కడప జిల్లా ఏసీ మల్లికార్జున నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఇన్‌చార్జ్ ఏసీగా సుధారాణి వ్యవహరిస్తూ వచ్చారు. పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ మల్లికార్జునను నియమించడంతో జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఘనంగా ఆవుల జాతర
కుందుర్పి: మండలంలోని బండమీదపల్లి రెండు రోజులుగా ఆవుల జాతర ఘనంగా సాగింది. ఏటా డిసెంబరులో ఆవుల జాతర, గ్రామోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి వందలాది మహిళలు, రైతులు పానకం బండ్లు, బోనాలతో వెళ్లి గ్రామ శివారులోని ఈడు అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బండమీదపల్లి, కుందుర్పి గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పల్స్ పోలియోను విజయవంతం చేయండి : డీఎంహెచ్‌ఓ
పల్స్ పోలియోను విజయవంతం చేయండి : డీఎంహెచ్‌ఓ


