ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
ఉరవకొండ: పట్టణంలోని ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గల ఖోఖో కోర్టులో మంగళవారం రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే జిల్లా సీనియర్, జూనియర్ జట్ల ఎంపిక నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ తరఫున పుల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ పీడీల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ జరిగింది.
ఎంపిక వివరాలు..
సీనియర్ మహిళల జిల్లా జట్టు : రాజ్యలక్ష్మి, మునెమ్మ, సునీత, స్వప్న, శ్రీజ, జ్యోతి, రేణుక, భార్గవి, శ్వేత, ఇందు, అనిత, వీణా, ఇందు, శ్రావణి, హేమలత, హష్మీ, జయశ్రీ.
సీనియర్ పురుషుల జిల్లా జట్టు: పురుషోత్తం, అహ్మద్, సంతోష్, రాజమ్మ, ఆంజినేయులు, రఘు, ఆది, నిసార్, సచిన్, రవి, సురేష్, కార్తీక్, వీరశంకర్, ఉపేంద్ర, నితీష్, నరేంద్ర, అజయ్.
జూనియర్ బాలికల జట్టు: శాంతి, స్వప్న, అంజలి, పూజారెడ్డి, మనీషా, వీణా, అనిత, అనంతలక్ష్మి, సుమిత్ర, హర్షిత, ఇందు, నిహరిక, నీలాంబరి, ఇందు, అనిత, అంజలి,
జూనియర్ బాలుర జిల్లా జట్టు: హరికృష్ణ, సాయిచరణ్, వంశీ, అనిల్‌కుమార్, గణేష్, వెంకట్, మహేంద్ర, జశ్వంత్‌రాయుడు, లోక్‌నాథ్, జ్యోతిరామ్, గౌతమ్, నందకిషోర్, శివ,విన్నీ, పవన్‌సాయి.
ఎంపికై న జూనియర్ జిల్లా జట్లు ఈ నెల 19 నుంచి 21 వరకు ప్రకాశం జిల్లా జై పంగలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లోను, సీనియర్ జిల్లా జట్లు ఈ నెల 24 నుంచి 26 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లోను పాల్గొంటాయి.


