16న జిల్లా పురుషులు, మహిళల ఖోఖో జట్ల ఎంపిక
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం హవళిగి గ్రామానికి చెందిన రాము (28) అలియాస్ గరుడచేడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆటోకు సరైన గిరాకీ లేక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు. దీంతో కుటుంబ పోషణతో పాటు ఆటో మరమ్మతులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.7 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక వేదనకు లోనైన రాము... ఆదివారం గ్రామ శివారున చెట్టుకు ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్‌ఐ మురహరి తెలిపారు.


