రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు 12 మంది ఎంపిక
అనంతపురం సిటీ: ఈ నెల 27న తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన మండలి, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు జిల్లాక చెందిన 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో కేజీ నిఖిత (జెడ్పీహెచ్‌ఎస్, దోసలుడికి), ఎన్.నవీన్‌కుమార్, ఎం.ఓంకార్, తరుణ్ (కల్లిమఠం మున్సిపల్ హైస్కూల్, రాయదుర్గం), పసుపులేటి భార్గవి, పల్లె భవ్యశ్రీ (ఏపీఎంఎస్, తాడిపత్రి), ఎన్.అజయ్‌ప్రదీప్ (జెడ్పీహెచ్‌ఎస్, పోర్ట్ గుత్తి), ఎన్.లిఖిత (కేజీబీవీ, శింగనమల), ఎం.కల్పన (కేజీబీవీ, బుక్కరాయసముద్రం), ఎం.కమల్ వలి (ఏపీఎంఎస్, యాడికి), హెచ్.సందీప్ (ఎంపీయూపీఎస్, యలవగలవంక, బెళుగుప్ప మండలం), జరిపిటి అవంతిక (ఎంపీయూపీఎస్, మహమ్మదాబాద్ క్రాస్) ఉన్నారు. వీరిని అభినందిస్తూ అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సభలో ప్రశంసాపత్రాలను డీఈఓ ప్రసాద్‌బాబు అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆనంద భాస్కర్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు వసంతరాణి, రాము, సూరిబాబు పాల్గొన్నారు.


