ఏఐతో భవిష్యత్తులో గణనీయ మార్పులు
గుంతకల్లు: ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక శ్రీ శంకరనంద గిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఏఐసీటీఈ సహకారంతో డిపార్టుమెంట్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ట్రెండ్స్, చాలెంజస్, ఆపర్చునిటీస్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. కళాశాల కరస్సాండెంట్ కేసీ హరి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథులుగా వరంగల్ నీట్ కళాశాల ప్రొఫెసర్ ఈ.సురేష్‌బాబు, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సీడీసీ డీన్ ప్రొఫెసర్ రామగోపాల్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ సురేష్‌బాబు, కంప్యూటర్ విభాగం అధిపతి డాక్టర్ నటరాజ్, అధ్యాపకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


