కరెంటోళ్ల జనబాట
● ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ లైన్ల పరిశీలన
అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేషాద్రిశేఖర్ మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది తమ పరిధిలోని గ్రామ, పట్టణ వార్డుల్లో తక్కువ ఎత్తులో ఉన్న స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించాలన్నారు. మార్చాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు సంబంధించి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంపై ఇప్పటికే ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించి వినియోగదారుల సమస్యలపై సమాధానాలు ఇస్తూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు.


