క్రీస్తు మార్గం అనుసరణీయం
అనంతపురం/ కల్చరల్: లోకానికి వెలుగులు నింపిన క్రీస్తు మార్గం అనుసరణీయమని రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ బెన్‌హర్‌బాబు అన్నారు. వైఎస్సార్‌సీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలోని ఏ7 కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ బెన్‌హర్‌బాబు తన సందేశంలో క్రీస్తు జీవిత విశేషాలను, దివ్య అనుభవాలను వివరించారు. అంతకు ముందు సామూహిక ప్రార్థనలు చేయించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వైఎస్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీస్తు జీవిత విశేషాలను పంచుకున్నారు.
వైఎస్సార్‌సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి
ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీ చైర్‌పర్సన్ బోయగిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, రాష్ట్ర కార్యదర్శి జానీ, నగర అధ్యక్షుడు సతీష్ , ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, సాకే చంద్రలేఖ, కో–ఆప్షన్ సభ్యుడు మారుతి, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రెటరీ కాగజ్‌ఘర్ రిజ్వాన్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నాయకులు జాన్, థామస్, రాజ్‌కుమార్, పుట్లూరు ప్రభాకర్, హనుమంతు, పద్మాకరబాబు, ఐజయ్య, అనిల్ మోజెస్, మనేష, ఆనంద్, జహంగీర్, అబ్రహామయ్య, సాల్మన్ రాజ్, జాకోబ్, జానీ, పుల్లయ్య కార్పొరేటర్లు కళావతి, కమల్‌భూషణ్, హసనీబేగం, రాజి, శ్రీనివాసులు, హసీనాబేగం, అనిల్‌రెడ్డి, పార్టీ జిల్లా బూత్ కమిటీ చైర్మెన్ ఎద్దుల అమరనాథ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, సంపంగి రామాంజినేయులు, కాకర్ల శ్రీనివాసరెడ్డితో, పాస్టర్ల సంఘం ప్రతినిధులు రెవ.మోసెస్ అనిల్‌కుమార్, పాస్టర్లు మనుష్యే, జీఆర్ ఆనంద్ తదితరులు మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాస్టర్లకు క్రమం తప్పకుండా రూ.5 వేలు వేతనంపడితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆ వేతనం అందకుండా పోయిందన్నారు.
రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు బెన్‌హర్‌బాబు
సందడిగా సాగిన ప్రీ క్రిస్మస్ వేడుకలు
క్రీస్తు మార్గం అనుసరణీయం


