ఏం..తల తిరుగుతోందా?! | - | Sakshi
Sakshi News home page

ఏం..తల తిరుగుతోందా?!

Dec 19 2025 8:09 AM | Updated on Dec 19 2025 8:09 AM

ఏం..త

ఏం..తల తిరుగుతోందా?!

రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రారంభించాం

కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: ‘జిల్లాలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్రంగా ఉండింది. రెవెన్యూ రికార్డులుగా సరిగ్గా లేవు. దీంతో రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రారంభించాం.’ అని విజయవాడలో జరుగుతున్న ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ వివరించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రెండోరోజు గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) వినియోగంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సర్వే నంబర్‌ లైబ్రెరీని తయారు చేశామన్నారు. రెవెన్యూ ఆఫీస్‌ టూల్‌ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని తెలియజేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రెరీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: నిధుల దుర్వినియోగం విషయంలో కంబదూరు మండలం కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి వి.అశ్వర్థరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి దాదాపు రూ. 15 లక్షల దాకా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఏపీ సీసీఏ రూల్స్‌–1991 ప్రకారం అశ్వర్థరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉన్న అందరు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు హెచ్చరించారు. పంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల నిధులును సక్రమంగా వినియోగించాలన్నారు.

రూ. 34 కోట్ల నిధుల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు జిల్లాకు రూ. 34,17,07,999 విడుదలయ్యాయి. ఇందులో 20,50,24,071 టైడ్‌ నిధులు కాగా, రూ. 13,66,83,928 బేసిక్‌ నిధులున్నాయి. ఈ నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు సూచించారు. నిధుల ఖర్చులను డెప్యూటీ ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వణుకుతున్న ‘అనంత’

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి ‘అనంత’ చలికి గజ గజ వణుకుతోంది. గురువారం మడకశిర మండలంలో 9.4 డిగ్రీలు, శెట్టూరు మండలంలో 10.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కూడా 11 డిగ్రీల నుంచి 16 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ సీఐని పోలీసుస్టేషన్‌లోనే నానా దుర్భాషలాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నియోజకవర్గంలోని ‘కీలక’ పోలీసుస్టేషన్‌లో ఓ కేసు విచారణ నిమిత్తం సీఐ గురువారం డోనేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మోపిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడితో పాటు మరికొందరిని పిలిపించారు. దీన్ని జీర్ణించుకోలేని సదరు నాయకులు ఒక్కసారిగా సీఐ చాంబర్‌లోకి వెళ్లి దుర్భాషలాడారు. ‘నీకు తల తిరుగుతోందా?! మమ్మల్నే స్టేషన్‌కు పిలిపిస్తావా? లం.. కొడకా’ అంటూ రెచ్చిపోయారు. సీఐ చాంబర్‌లో సిబ్బందితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఉన్నప్పటికీ వారు ఏమాత్రమూ వెనక్కి తగ్గకుండా దూషించారు. అనంతరం స్టేషన్‌ బయటకు వచ్చిన నేతలు ‘రేయ్‌.. ప్రభుత్వం మాది. మేం చెప్పినట్లు మూసుకుని వినండి. లేదంటే మీ తోకలు కత్తిరించి పోస్టింగ్‌ లేకుండా చేస్తాం. నా కొడకల్లారా’ అంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని స్థానికులు చర్చించుకున్నారు. సీఐని దుర్భాషలాడిన నాయకులపై కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతుండగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది.

సీఐపై టీడీపీ నేతల దౌర్జన్యం

స్టేషన్‌లోనే బండ బూతులు

ఏం..తల తిరుగుతోందా?! 1
1/1

ఏం..తల తిరుగుతోందా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement