ఏసీబీ డీఎస్పీగా ప్రసాద్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత సేవల కోసం ప్రభుత్వం 1064 టోల్‌ఫ్రీ, 9440446181 డీఎస్పీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు జయమ్మ, మోహన్‌ప్రసాద్, హమీద్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.


