డాక్టర్ కల సాకారం
ఉరవకొండ మండలం రాకెట్ల తండాకు చెందిన శ్రీనివాసులునాయక్, నాగలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ, కంది తదితర పంటలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. కుమార్తెలు అనితాబాయి, ఐశ్వర్య రాకెట్లలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. అనితాబాయికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. తల్లి ప్రోద్బలంతో 2017లో నీట్‌లో ఉత్తీర్ణురాలైన అనితాబాయి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2018లో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో సంవత్సరంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాగానే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం తల్లిదండ్రుల్లో ఎంతో ధైర్యం నింపాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చక్కగా చదువుకుని అనితాబాయి డాక్టర్ కల సాకారం చేసుకుంది. మరో అమ్మాయి ఐశ్వర్య ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా హార్టికల్చర్ కోర్సు పూర్తి చేసింది. – ఉరవకొండ
అనితాబాయి


