●దారులపై ధాన్యం.. ప్రమాదాలకు కాదా ఆస్కారం!
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కేందుకు రైతులు అహర్నిశం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్‌లో చేతికి అందిన ధాన్యాన్ని కొందరు రైతులు ఆర బోస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా... రోడ్లపై ఆరబోసిన ధాన్యంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. జాతీయ రహదారి పక్కగా ఆరబోసిన ధాన్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. రాత్రి సమయాలు, తెల్లవారుజామున ధాన్యం కుప్పలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్న వారూ ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
సొరకాయలపేట క్రాస్ రోడ్డులో వరిధాన్యం ఆరబెట్టిన పరిస్థితి
●దారులపై ధాన్యం.. ప్రమాదాలకు కాదా ఆస్కారం!


