●జీవనోపాధి మెరుగైంది
వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులతో పాటు కొడుకు కోడలు ఉంటారు. అప్పటిదాకా చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగించేవారు. రోజూ రూ.800 నుంచి రూ.1000 దాకా వ్యాపారం జరిగేది. ఇంకాస్త పెద్దగా పెట్టుకుని వ్యాపారం పెంచుకుందామంటే ఆర్థిక ఇబ్బందులు సహకరించేవి కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేదోడు ఆర్థికసాయంతో పాటు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలతో హోటల్ స్థాయిని పెంచుకుంది. ఆర్థికాభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఇప్పుడు రోజువారి వ్యాపారం రూ.5వేలు జరుగుతోంది. కణేకల్లు మండలం కణేకల్ క్రాస్‌లో హోటల్ నిర్వహిస్తున్న బసవేశ్వర స్వయం సహాయక సంఘం సభ్యురాలు గోవిందమ్మ కుటుంబం సాధించిన విజయం ఇది. – అనంతపురం ఎడ్యుకేషన్/కణేకల్లు:


