ప్రజా శ్రేయస్సు పట్టదా?
విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారు. ఇక తన అనుయాయులైన కార్పొరేట్లకు విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. వైద్యం చేయించుకున్నందుకు పేదలతో డబ్బు వసూలు చేసి.. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నారు. ప్రజా శ్రేయస్సు గురించి ఈ ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టడం లేదు.
– మెట్టు గోవిందరెడ్డి,
నియోజకవర్గ సమన్వయకర్త,
రాయదుర్గం


