నేడు ‘అనంత’లో సున్నీ కాన్ఫరెన్సు
అనంతపురం కల్చరల్: నగరంలో రెండో రోడ్డులోని బహువుద్దీన్ మసీదు వేదికగా ఆదివారం సున్నీ కాన్ఫరెన్సు జరగనుంది. తెహరికె ఫైజానే ఉమర్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహ్మద్ ప్రవక్త (స) కేశదర్శనం, ప్రవక్త ధరించిన అరుదైన దుస్తులు, ఇతర వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సున్నీ కాన్ఫరెన్స్‌కు వివిధ రాష్ట్రాల నుంచి పేరుగాంచిన మత పెద్దలు హాజరై ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు. శనివారం సాయంత్రం మసీదు వద్ద నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పరదా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెహరిక్ అధ్యక్షుడు హసన్‌రాజా, బహువుద్దీన్ మసీదు ముతవల్లి ఫరీదుద్దీన్, పర్వీస్, షబ్బీర్ అహమద్, అబ్దుల్ సమీ, క్విజాన్, అర్వాజ్ తదితరులు పాల్గొన్నారు.


