భళా బసవన్న
● 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర
కిలోమీటర్ లాగిన వృషభం
బొమ్మనహాళ్: మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన రైతు వన్నూరుస్వామి వృషభం 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర కిలోమీటర్ లాగి భళా అనిపించుకుంది. 98 వరి ధాన్యం బస్తాలు (ఒక్కో బస్తా 52 కేజీలు) 8 ఎడ్ల బండ్లలో నింపి ఒకదానికొకటి జత చేశారు. ముందుభాగంలోని బండికి వన్నూరుస్వామికి చెందిన వృషభాన్ని కట్టి ముందుకు పోనివ్వగా.. ఎడ్ల బండ్లను ఒకటిన్నర కిలోమీటర్ మేర ఎద్దు లాగడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు వృషభ ‘రాజసాన్ని’ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. మరో పక్కన ఉండే మనుషులు మారుతున్నా వృషభం మాత్రం అలాగే ముందుకు సాగడం చూసి కేరింతలు, ఈలల వేస్తూ జేజేలు పలికారు. అనంతరం వృషభానికి పూలమాలు వేసి గ్రామంలో ఘనంగా ఊరేగించారు.


