జలం.. ఒడిసిపడితేనే పదిలం | - | Sakshi
Sakshi News home page

జలం.. ఒడిసిపడితేనే పదిలం

Dec 22 2025 8:45 AM | Updated on Dec 22 2025 8:45 AM

జలం..

జలం.. ఒడిసిపడితేనే పదిలం

రాయదుర్గం: ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్రమ్మ ఏటేటా ఉగ్రరూపం దాల్చుతోంది. అంచనాలకు మించి వరదనీరొచ్చి చేరుతోంది. ఆదేస్థాయిలో నీరూ వృథా అవుతోంది. ఎప్పటి నుంచో కార్యాచరణలో ఉండే సమాంతర కాలువను తెరకెక్కిస్తే భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుంది. జిల్లాలోనూ అపార సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ వృథా జలాలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. తుంగభద్ర జలాశయం నుంచి ఏటా వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనిని నివారించే దిశగా దివంగత నేత వైఎస్సార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పలుమార్లు అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఒక్కసారికూడా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని చర్చకు తీసుకురాలేదు. దీంతో ఆశయం నెరవేరక వెక్కిరిస్తోంది.

420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 10 వరకు తుంగభద్ర జలాశయంలోకి 420.691 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 373.137 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కోసం తుంగభద్ర బోర్డు 168 టీఎంసీలకు లెక్కించి వాటిని ఏపీ హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీకి 152.698 టీఎంసీలు, కర్ణాటక హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీకి 110.143 టీఎంసీలు, తెలంగాణకు 5.159 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కెనాళ్ల ద్వారా 116.091 టీఎంసీలు వినియోగించారు. ఈ లెక్కన గేట్ల ద్వారా 257.046 టీఎంసీల నీళ్లు దిగువన మళ్లీ సముద్రంలో కలిసిపోయాయి. వినియోగం కంటే రెట్టింపు జలాలు వృథా అయ్యాయి. ఏటా ఈ విధానం కొనసాగుతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు.

బాబు మాటలన్నీ ఉత్తివే..

సీఎం చంద్రబాబు గతేడాది నవంబర్‌ 30న రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో పర్యటించారు. ఉంతకల్లు, నేమకల్లు మధ్య 5 టీఎంసీల సామర్థ్యంతో ఓ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. సమాంతర కాలువ ఏర్పాటైతేనే ఇది సాధ్యమవుతుందని ఇంజినీరింగ్‌ నిపుణులు చెపుతున్నారు. జిల్లాలో బీటీపీ, పీఏబీఆర్‌ లాంటి జలాశయాలు, మెజార్టీ చెరువులు నింపుకోవచ్చు. కేంద్రం తలిస్తే పూర్తిచేయడం కష్టమేమీకాదు. అయితే ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది.

సమాంతర కాలువ చేపట్టాలి

ఏటా తుంగభద్ర నుంచి వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సమాంతర కాలువ ద్వారా వాటికి అడ్డుకట్టు వేస్తే జిల్లాతో పాటు రాయలసీమ సస్యశ్యామలం కానుంది. అయితే సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

– మెట్టు గోవిందరెడ్డి,

మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం

ఉంతకల్లు రిజర్వాయర్‌ ఏదీ?

ఉంతకల్లు – నేమకల్లు మధ్య బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు గతేడాది హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. తక్షణమే నిధులు విడుదల చేసి రిజర్వాయర్‌ పూర్తికి కృషి చేయాలి.

– పరమేశ్వర, సర్పంచ్‌, నేమకల్లు

జలం.. అవనికి బలం.

ప్రాణకోటికి జీవనాధారం.

పంట పొలాలకు ప్రాణాధారం.

ఇంతటి విలువైన జలాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తేనే కరువు జిల్లా అనంతపురానికి ప్రయోజనకరం. ఈ దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వందలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి.

తుంగభద్ర నీళ్లు సముద్రంపాలు

సమాంతర కాలువ ఏర్పాటుతోనే

సస్యశ్యామలం

జలం.. ఒడిసిపడితేనే పదిలం 1
1/2

జలం.. ఒడిసిపడితేనే పదిలం

జలం.. ఒడిసిపడితేనే పదిలం 2
2/2

జలం.. ఒడిసిపడితేనే పదిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement