పాఠశాలల పని రోజుల్లోనే ‘ప్రణాళిక’ అమలుకు వినతి
అనంతపురం సిటీ: పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికను పాఠశాలల పని రోజుల్లోనే అమలు చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావుకు ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయనను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు గోపాల్, శివప్రసాద్, హెచ్.రామకృష్ణ, అరుడప్ప తదితరులు కలసి వినతి పత్రాన్ని అందించి, మాట్లాడారు. అనంతరం ఇదే వినతిని డీఈఓ ప్రసాద్‌బాబుకూ అందజేశారు. వంద రోజుల ప్రణాళిక అమలులో మార్పు చేయకపోతే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒత్తిడికి గురై మంచి ఫలితాలు సాధించలేరన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.


