క్వింటాకు రూ.1,000 తగ్గింది
గతంలో వరి క్వింటాలు ధర రూ.3,100 వరకు ఉండేది. ఈ ఏడాది బయటి మార్కెట్‌లో రూ. 2,100 నుంచి రూ.2,150కు పడిపోయింది. మోంథా తుపాను కారణంగా వరి పంట నేలకొరిగి దిగుబడి కూడా తగ్గింది. వరి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ రూ. 2,389 ఉంది. అయితే ఈ–క్రాప్ బుకింగ్, ఈ–కై వైసీ నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా కాకుండా ప్రతి రైతు వద్దా వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, 48 గంటల్లోలోపు నగదును ఖాతాలో జమ చేయాలి.
– ప్రసాద్‌రెడ్డి, రైతు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం


