రేపు వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ
● విజయవంతం చేయాలని వైఎస్సార్
సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా ఈ నెల 15న అనంతపురంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం పది గంటలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, పాతూరు గాంధీ విగ్రహం, చెరువు కట్ట మీదుగా బుక్కరాయసముద్రంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలి రావాలని కోరారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని అనంతపురం అర్బన్, శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో 4,55,840 సంతకాలు సేకరించినట్లు చెప్పారు. ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేస్తామని తెలిపారు.
రేపు కలెక్టరేట్‌లో
‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ‘ప్రజాసమస్యల పరిష్కారవేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దాని రసీదును వెంట తీసుకురావాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in ద్వారానూ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
‘హలో అవుట్ సోర్సింగ్’కు
స్పందన
అనంతపురం అగ్రికల్చర్: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఫోన్ ఇన్ ద్వారా గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. నగరంలోని జేఏసీ కార్యాలయంలో ఎం.ఈశ్వరయ్య, వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫోన్ ద్వారా సమస్యలను తెలియజేశారు. పని ఒత్తిడి అధికంగా ఉందని, సకాలంలో జీతాలు రావడం లేదని, పండుగలు, పర్వదినాల్లో పనిచేయాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోయారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
రేపు వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ
రేపు వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ


