బొమ్మనహాళ్ ఇన్‌చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మ
బొమ్మనహాళ్: మండల ఇన్‌చార్జి ఎంపీపీగా నాగరత్నమ్మను ఎంపిక చేశారు. బొమ్మనహాళ్ ఎంపీపీ పద్మ ఇటీవల రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీగా ఉన్న నాగరత్నమ్మకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మంగళవారం ఆమెకు ఎంపీడీఓ విజయభాస్కర్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ లక్ష్మీకాంతబాయి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఎల్.లోకేష్, ఆనందరెడ్డి, అనిల్‌రెడ్డి, రామకృష్ణ, నుంకేష్ పాల్గొన్నారు.
ఇడ్లీ బండ్లకు నిప్పు
గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న రెండు ఇడ్లీ బండ్లకు సోమవారం అర్ధరాత్రి దుండగులు నిప్పు పెట్టారు. ఇడ్లీ బండ్లు, స్టవ్ కాలిపోవడంతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బొమ్మనహాళ్ ఇన్‌చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మ


