యువకుడి హల్‌చల్
పామిడి: మండల కేంద్రం పామిడిలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. వివరాలు... పామిడిలోని సంతమార్కెట్ వీధిలో నివాసముంటున్న యువకుడు మాల రవి ఆదివారం ఉదయం స్థానిక మెయిన్‌బజార్‌లోని ఓ దుకాణంలోకి వెళ్లి దుస్తులు కొనుగోలు చేశాడు. డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యంగా దుస్తులు తీసుకెళుతుండడంతో యజమాని నుంచి సమాచారం అందుకున్న సోదరులు అడ్డుకుని డబ్బు ఇచ్చి వెళ్లాలని నిలదీశారు. దీంతో తననే డబ్బు అడుగుతారా అంటూ తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. మెయిన్ బజార్‌లోని వారి వస్త్ర దుకాణాలపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించాడు. అడ్డుకోబోయిన వారిపై కట్టెతో దాడికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగానే వారిపై కత్తితో దాడి చేయబోతుండగా త్రుటిలో తప్పించుకుని వాహనంలోకి ఎక్కారు. ఆ సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దం బద్దలైంది. ఘటనలో జమేదార్ శ్రీనివాసులుకు తీవ్ర రక్తగాయమైంది. అనంతరం స్కూటర్‌పై ఎక్కి పారిపోతున్న రవిని పోలీసులు వెంబడించి కల్లూరు అగ్రహారం వద్ద అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.


