మద్దతు ధరకు విక్రయించండి
బొమ్మనహాళ్ మండలంలో 20,355 ఎకరాల్లో వరి సాగు చేశారు. బయట మార్కెట్‌లో ధాన్యం క్వింటాలు ధర తక్కువగా ఉంది. ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట సహకార సొసైటీల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ గ్రేడ్ వరి అయితే రూ. 2,389, సాధారణం అయితే రూ.2,369 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 25 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.
– సాయికుమార్, వ్యవసాయాధికారి, బొమ్మనహాళ్


