మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యాపారవేత్త!
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు సేవలందించే అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్‌పర్సన్ పదవిని వ్యాపార వేత్త అయిన మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవికి కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం ప్రతిపాదించింది. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 13 మంది డైరెక్టర్ల పేర్లతో కూడిన జాబితా ఆమోదం కోసం మార్కెటింగ్ శాఖకు పంపారు. త్వరలోనే ప్రభుత్వం జీఓ రూపంలో పాలక వర్గాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ కమిటీ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత జాబితాలో చైర్‌పర్సన్‌గా బల్లా పల్లవిని వృత్తిపరంగా ట్రేడర్‌గా పేర్కొన్నారు. అలాగే వైస్ చైర్మన్‌గా డెయిరీ ఫార్మర్ కింద కమ్మూరు మహమ్మద్ అర్షదుల్లా పేరు ప్రతిపాదించారు. డైరెక్టర్లుగా జాంబవంతుడు, బోయపాటి బాలప్ప, రూపనగుడి రవికుమార్, దళవాయి మారెక్క, సి.లక్ష్మిదేవి, పువ్వాడ లావణ్య, పి.మంజుల, కాంతాదేవి, అవుకునాగిశెట్టి విజయకుమార్, ముప్పూరి క్రిష్ణ, కొనకొండ్ల వెంకటేష్, బి.లక్ష్మిరమణమ్మ, శాంతిసుధ తదితరుల పేర్లు పేర్కొన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
‘దిద్దుబాటు’ చర్యలు..
వ్యాపారాలు చేసుకునే వారిని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీడీపీ అధిష్టానం ‘దిద్దుబాటు’ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ట్రేడర్ నుంచి ఫార్మర్ కింద చూపించడానికి తాజాగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 15 మంది జాబితాలో 8 మంది ఓసీ వర్గానికి చెందిన వారుండగా.. ముగ్గురు బీసీ, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, మైనార్టీ ఒకరు ఉన్నారు. టీడీపీకి ఏళ్లపాటు సేవలందించిన పలువురు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కోసం 18 నెలలపాటు ఎదురుచూసినా నిరాశే ఎదురవడంతో ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బల్లా పల్లవి పేరు ప్రతిపాదించిన
టీడీపీ అధిష్టానం


