కార్మికురాలికి పరామర్శ
ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మికులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్‌గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.


