breaking news
Revanth Reddy
-
తెలంగాణ రైజింగ్ విజన్ ఆచరణ సాధ్యమేనా?
‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ నేల విడిచి సాము చేస్తోందా? లక్ష్యాలు ఘనంగానే పెట్టుకున్నా.. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది వ్యూహాలు... మూడు మూల స్థంభాలున్న ఈ విజన్ డాక్యుమెంట్లో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకం. భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు అదనంగా మరికొంత చేర్చి సుమారు 30 వేల ఎకరాలు సిద్ధం చేశారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతంలోని ఊళ్లలో ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ యూనివర్శిటీలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సొంత రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలోకి తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించినభూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని వివిధ పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్టుతోనే హైదరాబాద్ న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల స్థాయికి చేరుకుంటుందని భ్రమపెట్టడం అంత మంచిది కాదు. అయితే హైదరాబాద్ పరిసరాల్లోని మరో 27 మున్సిపాల్టీలను, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులలో మూసీ పునరుద్ధరణ కూడా ఒకటి. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు.అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్బుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు ఊహాచిత్రం కూడా ఉంటుంది. కాని వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవన్ని క్లియర్ అయితే పరిశుభ్రమైన వాతావరణం, నది పూర్తిగా క్షాళన జరిగితే హైదరాబాద్ కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది. డ్రై పోర్టు, దాన్నుంచి కృష్ణపట్నం వరకు 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నైకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కావాలని ఈ విజన్ డాక్యుమెంట్ లక్షించింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కూడా ఈ ప్రతిపాదనలలో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ రైలు నడపడం కోసం ఒక కారిడార్ నిర్మిస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ రైళ్ల డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే వచ్చే రెండు, మూడేళ్లలోనే బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయన్నట్లు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.దేశం అంతటా ఇవి ఏర్పాటు కావాలంటే లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. వచ్చే దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా బాగా మెరుగైతే, అప్పుడు వేగంగా ఈ బుల్లెట్ రైళ్లు సాకారం అవుతాయేమో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ది చేయాలని ఈ విజన్ లో తెలిపారు. వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజినల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ మరింత విస్తరిస్తే ప్రభుత్వ పాలన ఎంత సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే మూడు జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు.ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరో వైపు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది మరో లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం డాలర్ విలువ 90 రూపాయలు ఉంది. వచ్చే ఇరవై,పాతికేళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యం సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్దరణ, వచ్చే వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కరువు లేకుండా చూడడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ది, సుస్థిర అభివీద్ది అనేవాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు.ఇవన్ని చదవడానికి బాగానే ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో సుమారు నలభై ఎయిర్ పోర్టులకు డిమాండ్ లేదని వార్తలు సూచిస్తున్నాయి. అయినా హైదరాబాద్ చుట్టూరా కొత్తగా ఈ ఎయిర్ పోర్టులు ఎప్పటికి వస్తాయో, అవి ఎంతవరకు బాగా నడుస్తాయో తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు, 2047 నాటికి ఎంత మొత్తం అవుతుంది? లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు? ఆర్థిక వనరులు ఎలా మెరుగు అవుతాయి? మొదలైనవాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు. అతిశయోక్తులతో అంకెల గారడి చేశారు.కాని వాటిలో ఒక్క లక్ష్యం అయినా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.ఏది ఏమైనా పాలకులకు ప్రచారానికి, ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నో మీటింగ్స్.. నో అపాయింట్మెంట్స్.. రెండోరోజూ ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’ మహాధర్నాలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ హాజరుకావాల్సి ఉంది. కానీ.. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఎంపీలు, ఇతరత్రా ఎవరితోనూ భేటీ కాలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వచ్చిన రేవంత్ పూర్తిగా వారితోనే రోజంతా గడిపారు. సాధారణ పరిస్థితులు నెలకొని విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలిస్తే.. మంగళవారం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని అధికార వర్గాలు చెప్పాయి. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
తెలంగాణలో పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ సంతృప్తి
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు ఒకే కారులో రాహుల్‌తో కలిసి వచ్చారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాందీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు. -
మెస్సీ మాయలో...
‘మెస్సీ కిక్ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’... ఒక పదో తరగతి పిల్లాడి ఆనందం... ‘పదేళ్ల క్రితం మెస్సీ చాంపియన్స్ లీగ్ గెలిచినప్పటి నుంచి అతని ఆటంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటంతో నా కల నెరవేరింది’... ఒంటిపై మెస్సీ టాటూ వేసుకున్న ఒక వీరాభిమాని సంతోషమిది. మెస్సీ మైదానంలో గడిపింది గంట సమయం మాత్రమే కావచ్చు. కానీ ఫ్యాన్స్‌కు సంబంధించి అది అమూల్యమైన సమయం... అతని ప్రతీ కదలిక, వేసిన ప్రతీ అడుగు వారిలో అమిత ఉత్సాహాన్ని రేపింది. మెస్సీ కూడా ఉన్నంత సేపు చాలాసరదాగా, జాలీగా కనిపించడం ఈ మెగా ఈవెంట్ సక్సెస్‌కు సరైన సూచిక. సాక్షి, హైదరాబాద్: నగర ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన లయోనల్ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా రెండో నగరమైన హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్ కార్యక్రమంపై కాస్త సందేహాలు తలెత్తాయి. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేసి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దాంతో అటు మెస్సీ బృందంతోపాటు ఇటు అభిమానులు కూడా సంతృప్తిగా మైదానాన్ని వీడారు. రేవంత్‌కు పాస్‌లు... మెస్సీ టూర్ ఖరారైన రోజు నుంచి ప్రభుత్వం హడావిడి చేసిన మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ మాత్రం జరగలేదు కానీ... మెస్సీ, సీఎం మధ్య కొన్ని సరదా కిక్‌లు, పాస్‌లు మాత్రం నడిచాయి. మెస్సీ ఇచ్చిన పాస్‌లు చక్కగా అందుకున్న రేవంత్ రెడ్డి వాటిని మళ్లీ రిటర్న్ కూడా చేశారు. స్వారెజ్, రోడ్రిగో కూడా దీనికి జత కలిశారు. ఈ నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విజిల్స్, కేకలతో సందడి చేశారు. చివరకు మెస్సీ కొట్టిన ఒక కిక్ రేవంత్‌ను దాటి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో ఈ ఆట ముగిసింది. దీనికి ముందు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఇందులో సింగరేణి టీమ్ విజేతగా నిలిచింది. చిన్నారులతో సందడి... ముందుగా ఎంపిక చేసిన వర్ధమాన ఫుట్‌బాలర్లు, చిన్నారులతో కూడా మెస్సీ కొద్దిసేపు ఆడాడు. వీటి కోసం నాలుగు వేర్వేరు జోన్లను ఏర్పాటు చేయగా, ప్రతీ చోటికి వెళ్లి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ కొంత సమయం కేటాయించాడు. మెస్సీతో కలిసి ఆడిన వారిలో అంతుపట్టలేని ఆనందం కనిపించింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి మనవడు కూడా సందడి చేశాడు. అతని వైపు కూడా మెస్సీ రెండు పాస్‌లు ఇవ్వడం విశేషం. స్టాండ్స్‌లోకి బంతులు... స్టేడియంలో అభిమానులను బాగా అలరించి వారంతా పూర్తిగా ఎంజాయ్ చేసింది మాత్రం మెస్సీ స్పెషల్ కిక్లతోనే. ఆ సమయంలో మాత్రం స్టేడియంలో పూర్తి స్థాయిలో హోరెత్తిపోయింది. అతను ప్రత్యేకంగా పెనాల్టీలు ఆడకపోయినా... నిర్వాహకులు ఇచ్చిన బంతులను తనదైన శైలిలో కిక్‌లతో స్టాండ్స్‌లోకి పంపించాడు. బంతిని అందుకొని అర్జెంటీనా స్టార్ కిక్కు సిద్ధమైన ప్రతీ సారి ఉప్పల్ ఊగిపోయింది. ఆ బంతులను అందుకోవడంలో స్టాండ్స్‌లో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. కానీ కొందరు అదృష్టవంతులకే ఆ అవకాశం దక్కింది! ఉల్లాసంగా...ఉత్సాహంగా... మెస్సీ మొత్తం ‘షో’లో అతను మైదానంలో గడిపిన తీరే చెప్పుకోదగ్గ విశేషం. అక్కడ ఉన్నంతసేపు అతను చాలా ఉత్సాహంగా, నవ్వుతూ గడిపాడు. ముందుగా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానంలోకి రావడం మొదలు చివరి వరకు అతను దీనిని కొనసాగించాడు. ఉదయం కోల్‌కతాలో రసాభాసగా మారిన ఈవెంట్లో పూర్తి అసౌకర్యంగా కనిపించిన అతను హైదరాబాద్‌లో మాత్రం అలాంటి ఛాయలు కూడా కనపడనివ్వలేదు. ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం, రేవంత్‌తో ఆడిన కొద్దిసేపు, ఆపై చిన్నారులతో ఆట, స్టాండ్స్‌లోకి కిక్ కొడుతూ ఉత్సాహం నింపడం, చివర్లో గ్రూప్ ఫోటోలు... ఇలా ఎక్కడైనా అతనిలో చిరునవ్వు చెక్కుచెదర్లేదు. ఎక్కడా ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ఆఖర్లో ‘హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు’ అంటూ కృతజ్ఞతలు చెప్పడం వరకు చూస్తే అతను కూడా హైదరాబాద్ టూర్‌ను బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు. ఆఖర్లో మెస్సీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించగా, స్వారెజ్‌కు రాహుల్ గాంధీ జ్ఞాపిక ఇచ్చారు. వీరిద్దరికీ మెస్సీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీలను అందించాడు. -
సీఎం రేవంత్ జోరు కొనసాగేనా..?
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్‌కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..మెస్సీతో మ్యాచ్‌ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్‌తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు. అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్‌గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్‌లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్‌లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్. అదే జోరు కొనసాగేనా..?నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్‌లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్‌బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్‌కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్‌గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్‌లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్‌లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్‌బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. -
ఫుడ్ పాయిజన్ తో పిల్లలు ఇబ్బందులు.. రేవంత్ ఫుట్ బాల్ తో బిజీ..
-
LIVE Updates: అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ టీమ్ విజయం
GOAT India Tour: దేశంలో మెస్సీ మేనియా కొనసాగుతోంది. ఎటు చూసినా ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ కోసం.. -
మెస్సీ మేనియా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లో వేచిన సాయంత్రం.. ఈ రోజే సాకారం.. నగరమంతా మంత్రముగ్ధం.. ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల కోలాహలం.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్లో మునిగితేలే అపూర్వ ఘట్టం.. భాగ్య నగరం క్రీడా స్ఫూర్తితో ఓలలాడే అరుదైన సమయం.. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ప్రత్యేక మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్‌లో పాల్గొననుండటం మరో విశేషం. భావి ఫుట్‌బాల్‌కు నాంది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్ వంటి క్రీడలకు మంచి అభిమాన వలయం ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్ అంతగా పెద్ద స్థానాన్ని సంపాదించలేదు. అయితే.. మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు లేకపోవడంతో ఈ మ్యాచ్ నగరానికి భవిష్యత్ ఫుట్‌బాల్ అభివృద్ధికి నాందిగా మారుతుందనే విశ్లేషణ నగర క్రీడాభిమానుల్లో వినిపిస్తోంది. అంబరాన్నంటే అతిపెద్ద సంబరం.. ⇒ మ్యాచ్‌లో మెస్సీతో పాటు లూయిస్ సూయారేజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. ఈ మ్యాచ్‌తో నగరంలో ఫుట్‌బాల్ పట్ల ఆసక్తిని పెంచే ప్రేరణగా భావిస్తూ, పాఠశాలలు, యూనివర్సిటీలలో ఫుట్‌బాల్ క్లబ్‌లు, ట్రైనింగ్ సెషన్ల పట్ల అభిరుచిని పెంచే అవకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రధానంగా ఉండగా.. ఫుట్‌బాల్‌కు పెద్ద సంబరంగా ఈ ఈవెంట్ నిలుస్తోంది. ⇒ మెస్సీ వంటి ప్రపంచ విజేత కావడంతో ఫుట్‌బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారనుంది. మెస్సీ కొత్త క్రీడా దశదిశలను నిర్దేశించనున్నారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లలో ఫుట్‌బాల్ శిక్షణ, స్థానిక క్లబ్‌లు, క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, మెస్సీ ఫుట్‌బాల్ క్లినిక్ ద్వారా చిన్న పిల్లలు, యువతకు అవకాశం ఇస్తున్నందున, స్థానిక క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా ఉండనుందని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా.. నగరంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఇక్కడి క్రీడా సంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే అవకాశం వంటిదేనని చెప్పుకోవచ్చు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
యాదవులు ఏ పార్టీలో ఉన్నా కలిసి ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన యాదవ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. యాదవులు ఏ పార్టీలో ఉన్నా అంతా ఒక్కటిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అనంతరం అంజన్‌కుమార్ ఏర్పాటు చేసిన విందు ఆతిథ్యంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అఖిలేశ్‌కు రేవంత్ రెడ్డి వివరించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. యాదవులకు ఇష్టమైన సదర్ పండుగను ప్రభుత్వం గుర్తించడంపై అఖిలేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని.. తెలంగాణలోని యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా గుర్తింపు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేశ్ వెంట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిణ్‌రెడ్డి తదితరులున్నారు. వారిప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారు..యాదవ సమ్మేళనం అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత వందేమాతరం ఆలపించని వారు, మూడు రంగుల జాతీయ జెండాను ఇష్టపడనివారు ఇప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో 3 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ ఓడిపోయే చోట్ల ఈసీతో కలిసి ఎక్కువ ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. యూపీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి ఆహ్వానించి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతామని, హైదరాబాద్‌లో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను టీవీలో చూస్తానని చెప్పారు. ఏఐ సమ్మిట్‌కు హాజరువిజన్ ఇండియా పేరుతో దేశమంతా పర్యటిస్తున్న ఆయన అఖిలేశ్ తాజ్‌కృష్ణలో జరిగే ఏఐ సమ్మిట్‌లో పాల్గొంటారు. విజన్ ఇండియా దేశాభివృద్ధి ప్రణాళికల విషయంలో తన దృక్పథం గురించి వివరించనున్నారు. శనివారం సాయంత్రం అఖిలేశ్ ప్రత్యేక విమానంలో లక్నో తిరిగి వెళ్లనున్నారు. -
గ్యాస్ సబ్సిడీ.. అర్హత ఉన్నా కొందరికే రాయితీ!
సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ రీఫిల్ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్‌కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి పథకం వర్తిస్తే.. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పష్టత కరువు.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం.ఆరు లక్షలు మించలే.. మహా హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలపైగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్‌దారుల్లో సుమారు 24 లక్షల కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సరెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. దీంతో, ప్రభాకర్ రావును.. సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఇంటి నుంచే భోజనం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు. డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్‌డిస్క్‌లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. -
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
-
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్‌లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్‌గా ఉండడం రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్‌ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్‌పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫుట్‌బాల్ ఆడిన సీఎం
మునిపల్లి (అందోల్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌లోని వోక్సన్ యూనివర్సిటీ క్రీడాకారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడారు. గురువారం రాత్రి యూనివర్సిటీ క్రీడాకారులతో రెండు బ్యాచ్‌లతో ఆడారు.అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. వర్సిటీ లోకి 6.32 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8.15 గంటలకు వెళ్లిపోయారు. రేవంత్‌కు వర్సి టీ యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది. -
తెలంగాణ ‘విజన్’ భేష్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’పై కాంగ్రెస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతమైన తీరును రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసుకున్న ఒప్పందాలు, విజ న్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వంటి అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమ్మిట్ నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అగ్రనేతలు ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.ప్రణబ్ ముఖర్జీకి ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో ఘన నివాళులర్పించారు. ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దశాబ్దాలపాటు ప్రజాసేవకే అంకితమైన గొప్ప దార్శనికుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోబెల్ సమ్మిట్ అంటూ.. హరీష్ రావు ఎద్దేవా..!
-
అప్పట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ టీమ్.. ఓ రేంజ్!
ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ మన భాగ్యనగరానికి వస్తున్నాడు. ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి అతడి రాకపై పలు రకాలుగా చర్చ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అతడి ఈవెంట్ కోసం భారీ ధరతో టికెట్లున్నా వెనక్కి తగ్గకుండా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడిపోతున్నారు. శనివారం జరిగే ఈ షో కోసం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో ఉప్పల్ స్టేడియం హౌస్‌ఫుల్ కావడం ఖాయం. కానీ మెస్సీ మాయ 3 గంటల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మన వద్ద అసలైన ఫుట్‌బాల్ ఏమిటో కనిపిస్తుంది. ఒక అసాధారణ ఆటగాడిపై అభిమానం ఉండటం సరే కానీ.. మన వద్ద ఆటకు ఏమాత్రం ఆదరణ ఉందనేది ఆసక్తికరం. మెస్సీ షో కారణంగా ఇక్కడ మున్ముందు ఏదైనా మార్పు కనిపిస్తుందా అనేది చర్చనీయాంశం. ఎస్ఏ రహీమ్, నయీముద్దీన్, తులసీదాస్ బలరామ్, పీటర్ తంగరాజ్, షాహిద్ వసీమ్, మొహమ్మద్ హబీబ్, షబ్బీర్ అలీ, జుల్ఫికర్ అలీ.. ఒకరా, ఇద్దరా ఎంతో మంది హైదరాబాద్ దిగ్గజాలు భారత ఫుట్‌బాల్‌ను సుదీర్ఘ కాలం నడిపించారు. 1950వ, 1960వ దశకాల్లో భారత జట్టు మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లతోనే కనిపించేది. మన సిటీ పోలీస్ టీమ్ అంటే దేశంలోని ఏ జట్టుకైనా హడల్. సంతోష్ ట్రోఫీ, డ్యురాండ్ కప్, రోవర్స్ కప్.. టోర్నీ ఏదైనా విజేత హైదరాబాద్ జట్టు మాత్రమే. ఒలింపిక్స్ క్రీడల్లో భారత అత్యుత్తమ ప్రదర్శనగా నాలుగో స్థానం 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో వచ్చింది. ఈ టీమ్‌లో ఎనిమిది మంది హైదరాబాద్ ఆటగాళ్లు ఉండటం విశేషం.మొత్తంగా 1948 నుంచి చూస్తే మన నగరం నుంచి 14 మంది ఒలింపియన్లు, 21 అంతర్జాతీయ ఫుట్‌బాలర్లు, 9 మంది కోచ్‌లు తమ ప్రతిభతో భారత ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశారు. ఇదంతా ఘనమైన గతం. 1980వ దశకంలోకి వచ్చేసరికి ఆటలో ఆ కళ తప్పింది. వేర్వేరు కారణాలతో ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి పడిపోతూ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ టీమ్ కూడా బలహీనంగా మారిపోవడంతో ఫలితాలు రావడం ఆగిపోయాయి. ఆపై బెంగాల్, కేరళ జట్లు ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించడం మొదలైంది. వీటికి తోడు గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా బలంగా దూసుకొచ్చాయి. మెలమెల్లగా హైదరాబాద్ ఫుట్‌బాల్ చివరి దశకు వచ్చేసింది. కనీసం ప్రతిభాన్వేషణ లేకపోవడం, టోరీ్నల నిర్వహణ జరగకపోవడంతో సహజంగానే ఇక్కడ ఫుట్‌బాల్ మరింతగా దిగజారిపోయింది.1962లో ఏషియన్ గేమ్స్‌లో ఎస్ఏ రహీమ్ జట్టు ఐఎస్ఎల్తో పెరిగిన ఆసక్తి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరంలో ఫుట్‌బాల్ (Football) నామ్‌కే వాస్తేగానే నడిచింది. అయితే అదృష్టవశాత్తూ కొత్త తరంలో మళ్లీ ఆటపై కాస్త ఆసక్తి పెరగడంతో పాటు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా పలు కార్పొరేట్ స్కూల్స్ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా టీమ్‌లు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో బరిలోకి దించడంతో మళ్లీ హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. ప్రతిష్టాత్మక ఐ–లీగ్‌లో నగరానికి చెందిన ‘శ్రీనిధి’ దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ టీమ్ ఉండటం కూడా ఇక్కడి ఆటకు గుర్తింపు తెచ్చింది. ఈ టీమ్‌లో నేరుగా స్థానిక ఆటగాళ్లు లేకపోయినా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) ఇక్కడ అందరిలో ఆసక్తిని పెంచడంలో సఫలమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్ఎల్ మ్యాచ్‌లకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనం. దీంతో పాటు పలు ఫుట్‌బాల్ క్లినిక్‌లు, క్యాంప్‌ల ద్వారా హెచ్ఎఫ్సీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించింది. దురదృష్టవశాత్తూ ఆర్థిక పరమైన కారణాలతో ఐఎస్ఎల్కు హెచ్ఎఫ్సీ దూరమైనా.. అది ఇక్కడ ఉన్నన్నాళ్లు మంచి ప్రభావం చూపగలిగింది.1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు ప్రైవేట్ క్లబ్‌ల చొరవతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే ఫుట్‌బాల్‌పై తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నా గ్రౌండ్ లెవల్లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. తెలంగాణ జట్టు జూనియర్ స్థాయిలో విజయం సాధించి వచ్చి సీఎంను కలిసిన తర్వాత ఆయన ఆటను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంను ఫుట్‌బాల్‌కు కేంద్రంగా మారుస్తామని చెప్పినా.. మైదానం ఎప్పటిలాగే సౌకర్యాల లేమితో కనిపిస్తోంది. జింఖానా మైదానంలో కూడా చాలా పరిమితంగానే ఆడేందుకు అవకాశం లభిస్తోంది. ఏళ్లుగా టోర్నీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇలాంటి స్థితిలో ‘శ్రీనిధి’ యాజమాన్యం ఆటకు అండగా నిలుస్తోంది. అక్కడి మైదానాల్లో ప్రాక్టీస్, టోర్నీల నిర్వహణతో పాటు కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సొంత డబ్బులతోనే ఆటను రక్షించే ప్రయత్నం చేస్తుండటం సానుకూల అంశం. పాతబస్తీలోని చారిత్రాత్మక అబ్బాస్ క్లబ్, బొల్లారం క్లబ్‌లతో పాటు కొన్ని పాత క్లబ్‌లు మాత్రమే ఇంకా ఆటను బతికిస్తున్నాయి. దేశంలో ఎక్కడ టోర్నీ జరిగినా తమ జట్లను పంపి ఆయా క్లబ్‌కు ఫుట్‌బాల్‌తో తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం తలచుకుంటే.. గత ఏడాది సెసెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించింది. భారత్‌తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. టోర్నీ నిర్వహణ సమయంలో కూడా ప్రభుత్వం బాగా హడావిడి, ప్రచారం చేసింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రికి ఈ ఆటపై ఉన్న ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కసారి టోర్నీ ముగియగానే అంతా గప్‌చుప్. ఇప్పుడు మెస్సీ రాకను కూడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రచార కార్యక్రమంలా చూస్తోంది. నిజాయితీగా చూస్తే ఈ ప్రైవేట్ కార్యక్రమంతో ఒరిగేదేమీ ఉండదు. మెస్సీ కూడా తన పరిమితుల్లో కొద్దిసేపు స్వల్పంగా పెనాల్టీలు ఆడి ఒక నాలుగు పాస్‌లు ఇచ్చి మమ అనిపిస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాం మన ఫుట్‌బాల్‌ను మార్చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఫుట్‌బాల్ రాతను మార్చాలనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఆటను అభివృద్ధి చేయాలంటే ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఆపై ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీల నిర్వహణ ఒక క్రమంలో జరగాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒక బృహత్ లక్ష్యంతో పని చేస్తే భారత ఫుట్‌బాల్‌లో మరోసారి నాటి హైదరాబాద్ మెరుపులు కనిపిస్తాయి. -
ఇక హైదరాబాద్‌లో ఐఫా
తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా)తో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల పాటు ఐఫా వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా వేడుకలకు హైదరాబాద్ వరుసగా మూడేళ్ల పాటు ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా మూడేళ్లపాటు ఐఫా ఉత్సవం నిర్వహించడం ద్వారా దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా, సినిమా ఆధారిత పర్యాటకం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ కేంద్రంగా మా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం అని చెప్పుకొచ్చారు.గత 25 ఏళ్లుగా గ్లోబల్ కల్చరల్ సూపర్ బ్రాండ్‌గా వెలుగొందుతున్న ఐఫా.. లండన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్, సింగపూర్, అబుదాబి, మాడ్రిడ్ లాంటి ప్రపంచ రాజధానులలో ఓ ఐకానిక్ లెగసీని నిర్మించింది. అలాంటిది రాబోయే మూడేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఈవెంట్స్ జరగబోతుండటం చాలా విశేషం అని చెప్పొచ్చు. -
పాసులుంటేనే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అర్జెంటీనా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ‘గోట్’ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి పాస్ లేకుంటే అనుమతి లేదని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఈ నెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– మెస్సీతో ఉప్పల్ మైదానంలో మెస్సీ– గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ సు«దీర్ బాబు తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. -
మెస్సీ@ తాజ్ ఫలక్‌నుమా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రానున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాతబస్తీలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. అక్కడ నుంచే ఆయన తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడి యానికి వెళ్లి.. సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఆపై ప్యాలెస్‌కు తిరిగి వచ్చి, ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారని తెలిసింది. శనివారం మెస్సీ పర్యటన నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్, 2010లో తాజ్ ఫలక్‌నుమా హోటల్‌గా మారింది. 2014 నవంబర్‌లో సల్మాన్‌ఖాన్ సోదరి అరి్పత ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్‌లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు తాజ్ ఫలక్‌నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండటంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. శనివారమే హైదరాబాద్ రానున్న మెస్సీ, ఆయన టీమ్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు వెళ్లి బస చేస్తుంది. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ బృందం తిరిగి నేరుగా హోటల్‌కే వెళుతుందని సమాచారం. శనివారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే బస చేసే మెస్సీ, ఆదివారం అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, జి.సుదీర్బాబులతో పాటు నగర ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్‌లు మెస్సీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఓ పక్క మెస్సీతో పాటు ఆయన బృందం, మరోపక్క సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర ప్రముఖులు స్టేడియం వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి రూట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓ సవాల్‌గా తీసుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పాస్‌లు, టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు. -
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకు ముదిని వెల్లడించారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందాక, దానిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలి పారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదు అందిందన్నా రు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విజయో త్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనుమతికి ఆమోదం తెలిపా మని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశామన్నారు. ఎంసీసీ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు పనిచేస్తు న్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్‌కీబాత్’కార్యక్రమం తాము రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నామని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారు లు అనుమతి కోరారని చెప్పారు. బుధవారం ఎస్ ఈసీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్భగ వత్, పీఆర్ఆర్డీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారి డా.జి.సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. మకరందుతో కలిసి రాణీ కుముదిని మీడియాతో మాట్లాడారు. గురువారం జరగనున్న తొలివిడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు, ఈ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్, వార్డుల ఏకగ్రీవాలకు సంబంధించి సమీక్ష, అభ్యర్థుల డిక్లరేషన్ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా ఉదంతాల్లో కేసులు నిరూపితమైతే ఆ ఎన్నికలు రద్దు అవుతాయని, ఏకగ్రీవాలపై ఆరోపణలు వచ్చిన చోట నివేదికలు కోరినట్టు చెప్పారు. నోటాను అభ్యర్థిగా పరిగణించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన వినతిపత్రంపై ఎస్ఈసీ స్పందన ఏమిటని ఓ విలేకరి కోరగా.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలి, సింగిల్ నామినేషన్ వస్తే ఏమి చేయాలి తదితరాలపై వేసిన పిల్‌పై విచారణ సుప్రీంకోర్టులో ఉందని రాణీకుముదిని తెలిపారు. దానిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా తాము కూడా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. మహేశ్‌భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, వస్తువులు, డ్రగ్స్ ఇలా అన్ని కలిపి రూ.7,54 కోట్ల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏకగ్రీవాలకు సంబంధించి సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులపై అక్కడి పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలపై 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం. గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. శరద్ పవార్ విందులో రేవంత్, రాహుల్ భేటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్ పవార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ తోపాటు, మధుయాష్కీ గౌడ్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. -
ఓయూకి వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు రాజకీయాలకు అతీతంగా చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎవరు పైరవీలు చేసినా సహించబోమని, ఇందులో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదేనన్నారు. ఎంతోమంది ఉద్యమకారులను, మేధావులను అందించిన చరిత్ర ఓయూకు ఉందని చెప్పారు. అయితే గడచిన పదేళ్ళుగా వర్సిటీ అభివృద్ధికి దూరంగా ఉందని విమర్శించారు. ఓయూ అభివృద్ధికి బాటలు వేసేందుకే తాను వచ్చానని అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని, అందుకే రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడను ఎలా వదిలించాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. బుధవారం ఓయూను సందర్శించిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రమే..నాలెడ్జ్ కాదు ‘ఏ వ్యక్తికైనా భూమి లేకపోవడాన్ని పేదరికంగా గుర్తిస్తారు. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనమనే అనాలి. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని దూరం చేస్తుంది. అయితే డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. ఆ అవకాశం లేని పేదల కోసం ఓయూలో అధునాతన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆంగ్ల భాష కమ్యూనికేషన్ మాత్రమే.. నాలెడ్జ్ కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడరు. చైనీయులకు ఇంగ్లీష్ భాష రాదు. ఆ దేశం ఉత్పత్తులు నిలిపివేస్తే అమెరికా విలవిల్లాడుతుంది. నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా. గుంటూరులో చదువుకోలేదు. గూడు పుఠాణీలు తెలియవు. నాకు విదేశీ భాష రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవడం వచ్చు. పేదలు, నిస్సహాయులకు సాయం చేయాలనే తపన నాకు ఉంది. అలాగని ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. నాలెడ్జ్, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. చరిత్ర గుర్తుంచుకునేలా పాలన అందించాలన్నదే నా లక్ష్యం..’అని సీఎం వెల్లడించారు. యువత చదువుకుని పైకి రావాలి ‘విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో చదువుకుని పైకి రావాలి. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు కావాలి. యువత డిగ్రీలు సాధిస్తున్నారు కానీ, నైపుణ్యం ఉండటం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది. నాకు ఫాం హౌస్ల్లేవ్ చేతనైతే ఓయూ ఆర్ట్స్ కాలేజీకి రమ్మని గతంలో కొంతమంది సవాల్ విసిరారు. కానీ నేను అభిమానంతో ఇక్కడికి వచ్చా. నాకు ఎక్కడా ఫాం హౌస్‌లు లేవు. నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రెండేళ్ళల్లో ఏం చేశావని నన్ను ప్రశ్నించే నేతలు పదేళ్ళ పాలనలో ఏం చేశారో చెప్పాలి. కుటుంబం మొత్తం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్ళు దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామన్న హామీని అమలు చేశారా? మేము రెండేళ్ళ పాలనలో ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేశాం. ఎస్సీ వర్గీకరణ అమలుతో సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేపట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, అద్దంకి దయాకర్, హైదరాబాద్ మేయర్ జి. విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఓయూ వీసీ కుమార్ మొలుగరం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నమూనాల ఆవిష్కరణ సభా వేదికపై ఓయూ అభివృద్ధికి సంబంధించిన పలు నమూనాలను సీఎం ఆవిష్కరించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో కొత్త అకడమిక్ బ్లాక్, పరిశోధన, అభివృద్ధి బ్లాక్, కొత్త బాలుర, బాలికల హాస్టళ్లు, బహుళార్ధసాధక క్రీడా కేంద్రం, సమీకృత గ్రంథాలయం, కొత్త ఆరోగ్య కేంద్రం, జీవ వైవిధ్య ఉద్యానవనం, కన్వెన్షన్ సెంటర్, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల నడక మార్గాలతో కూడిన విస్తృత రహదారి నెట్వర్క్ ఉన్నాయి. కాగా ఓయూ అభివృద్ధి పనులకు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. -
‘ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి’
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా.. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది.మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే. జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారుప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు..పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారుజయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారుచదువు లేకపోవడం వెనుకబాటుతనంభూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది.ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కులవివక్షను రూపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు. పిల్లల భవిష్యత్‌ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండివిద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి. నిబద్ధతతో నిరంతరం కష్టపడండి.. తప్పకుండా ఫలితం వస్తుంది.మీరంతా డాక్టర్లు లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని’ ఆకాంక్షించారు -
హైదరాబాద్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్‌గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్‌లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్‌లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్‌ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్‌తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్‌లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్‌ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్‌ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్‌తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్‌లకు సహాయపడుతుంది” అన్నారు. -
సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు
-
3 మూల స్తంభాలు 10 వ్యూహాలు..
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల అనంతర అద్భుత స్వప్నాన్ని కాంక్షిస్తూ వికసిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) రూపొందించింది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఇందులో పొందుపరిచింది. ముచ్చటగా 3 మూల స్తంభాల సాయంతో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పరిపుష్టం చేసుకోవడంతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా 83 పేజీల డాక్యుమెంట్‌ను.. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మానవ రూపంలోని రోబో వేదికపై నడుచుకుంటూ వచ్చి సీఎంకు ఈ విజన్ డాక్యుమెంట్‌ను అందజేయడం అతిథులను ఆకట్టుకుంది. ప్రగతి కోసం పది వ్యూహాలు 1. ముఖ్య సిద్ధాంతం.. 3 జోన్ల రాష్ట్రం రాష్ట్రాన్ని 3 ముఖ్య జోన్లుగా విభజించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. సుమారు 160 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి భాగంలో సేవల రంగం కేంద్రీకృతంగా హరిత మెట్రోపొలిస్ కోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), ఓఆర్ఆర్కు అవతల, 360 కిలోమీటర్ల రీజనల్ రింగు (ట్రిపుల్ ఆర్) రోడ్డు లోపలి భాగంలో తయారీ రంగంపై ఫోకస్ చేస్తూ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), ట్రిపుల్ ఆర్ ఆవలి భాగంలోని గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) ఏర్పాటు.2. సులభతర విధానాల దిశగా..గత రెండేళ్ల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే దశ నుంచి పారదర్శకంగా, వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చాం. ఈ రెండేళ్ల కాలంలో ఇందుకు అనుగుణంగా క్రీడలు, పర్యాటకం, విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, సామాజిక సమ్మిళిత రంగాల్లో విధానాలు తీసుకువచ్చాం. ఈ విధానాలు అద్భుత ఫలితాలనివ్వడంతో పాటు చెప్పుకోదగిన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రజల జీవనంలోని ప్రతి కోణంలోనూ వారి ప్రతి అవసరం తీరే విధంగా సులభతర విధానాలను తీసుకువస్తాం.3. గేమ్ చేంజర్ ప్రాజెక్టులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్, తెలంగాణను తీర్చిదిద్దేందుకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ఎంచుకున్నాం.4. పాలనలో విశిష్టత... సేవలకు గ్యారంటీ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాల మధ్య లావాదేవీలు నేరుగా కాకుండా డిజటల్ రూపంలో జరిగేలా డిజిటల్ పాలన. రాష్ట్రంలోని పౌరులందరికీ అందుబాటులో ఇంటర్నెట్, డేటా. రాష్ట్రమంతటా భూగర్భ కేబుల్, వైఫై జోన్ల ఏర్పాటు. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పద్ధతిలో సేవలందేలా పెట్టుబడులను ఆకర్షించే వ్యూహం. 5. నాలెడ్జ్ హబ్ టెక్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు, పరిశోధక సంస్థలతో కలిపి నాలెడ్జ్ హబ్ ఏర్పా టు. ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటు, విద్యార్థుల మార్పిడి, ఫ్యాకల్టీ, పరిశోధక సామాగ్రి సమకూర్చుకోవడం కోసం అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆహ్వానించడం ద్వారా క్యూర్ పరిధిలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు. 6. సమ్మిళిత, సుస్థిర సంక్షేమంరాష్ట్రంలోని ప్రతి పౌరుడూ సమానమే అయినా మూడు ముఖ్యమైన వర్గాల సంక్షేమంపై రాష్ట్రం దృష్టి. మహిళలు, రైతులు, యువత–చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు. విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజల జీవనోపాధి పెంపు, ఆర్థిక సాధికారత కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు రూపకల్పన. 7. అభివృద్ధి వనరులు ప్రపంచ స్థాయి విశ్వస నీయ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి భరోసా కలి్పంచడం, సుస్థిర అభివృద్ధి వలయం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడం. 8. పర్యావరణం సుస్థిరత ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పర్యావర ణ పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల నష్ట సంభావ్యత గురించి ఆలోచిస్తున్నారు. వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, వరద నష్టాల బారిన పడకుండా హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాలి. గోదావరిని మూసీతో అను సంధానం చేయడం ద్వారా రాబోయే 75–100 ఏళ్ల వరకు నీటి కొరత లేకుండా కరువు బారిన పడకుండా చూడటం. 9. సంస్కృతి సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్ర, స్మారక చిహ్నాలు, కళలు, జానపదాలకు ప్రోత్సాహమందించడం. 10. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమర్థతలకు అనుగుణంగా విజన్ రూపొందించాం. ఇది కేవలం నిపుణులతో సాధ్యం కాలేదు. 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. వారి నుంచి సమస్యలు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలు, అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సామూహిక చైతన్యం గురించి తెలుసుకోగలిగాం. తెలంగాణ రైజింగ్ నిరంతరం సాగుతూనే ఉంటుంది. రండి..అభివృద్ధిలో భాగస్వామి కండి. 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే.. » భారత్ ఫ్యూచర్ సిటీ » మూసీ పునరుజ్జీవనం » డ్రైపోర్టు » డ్రైపోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే » బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నైకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో తయారీ రంగం అభివృద్ధి » రీజనల్ రింగు రోడ్డు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్లు » రీజనల్ రింగ్ రైల్వే » వ్యవసాయ భూములకు గ్రీన్ ఎనర్జీ » ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్ » గ్రీన్ ఎనర్జీ హబ్స్ » ఎల్రక్టానిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడం3 మూలస్తంభాలివే.. 1. ఆర్థిక వృద్ధి..ఆవిష్కరణలు, ఉత్పాదకతల పునాదులపై జరిగే అభివృద్ధి ఆధారంగా క్యూర్–ప్యూర్–రేర్ విధానంతో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన. 2. సమ్మిళిత అభివృద్ధి..ఈ వృద్ధి ఫలాలను యువత, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వర్గాలు, సమాజంలో అన్ని వర్గాలకు అందించడం.3. సుస్థిర అభివృద్ధి..హరిత మార్గంలో 2047 నాటికి అన్ని రంగాల్లో సుస్థిరత. -
పేదలకు న్యాయం చేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నా బాల్యంలో పేదరికం, అంటరానితనాన్ని స్వయంగా చూశా. సమస్య ఏమిటో తెలుసు. నేను రైతుబిడ్డను. నాకు పేదరికం తెలుసు. కొందరు నేతలకు పేదరికం విహారయాత్ర లాంటిది. పేదలు ఎలా ఉంటారో చూడటానికి హైదరాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో చిన్న గ్రామాలకు వెళ్తారు. అంటరానితనం ఉన్నచోట నుంచి.. ఆలయాల్లో కొందరిని రానీయని చోటు నుంచి వచ్చాను. పేదలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు ఏం కోరుకుంటారో అన్ని తెలుసు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం నిర్మూలనే నా లక్ష్యం. అదే నా పాలసీ డాక్యుమెంట్. అదే ప్రజలతో నా ఒప్పందం. ఇది నా రాష్ట్రానికి, యువతకు మార్గదర్శకంగా మారుతుంది’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రేవంత్ ఆవిష్కరించారు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాధ్యమంలో చదివాను. కార్పొరేట్ బడిలో ఇంగ్లిష్ మీడియంలో కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. నాకు రాజకీయ నేపథ్యం లేదు. పేద కుటుంబం నుంచి వచ్చా. 2006లో జెడ్పీ సభ్యుడిగా ఎంపికై ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయిన. 17 ఏళ్లకు సీఎం అయిన’ అని గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. విజన్ డాక్యుమెంట్–2047 తయారీలో సహకరించిన ఐఎస్బీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, నీతి ఆయోగ్, సూచనలు ఇచి్చన వారికి కృతజ్ఞతలు తెలిపారు.అందుకే విజన్ డాక్యుమెంట్.. ‘తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చైతన్యం ఉంది. జల్ జమీన్ జంగల్ అని కుమ్రం భీమ్ పోరాడితే.. సాయుధ రైతాంగ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం వేలాది మంది పోరాడి నేలకొరిగారు. ఆ స్ఫూర్తితోనే మన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సోనియా, మన్మోహన్ నెరవేర్చినా, ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకున్నా గతంలో సాధించలేకపోయాం. నేడు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. వాటిని అందించాలనే తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్‌ను తెచ్చాం.దేశం 2047లో 100 ఏళ్ల స్వాతం్రత్యాన్ని జరుపుకోనుండగా, ఆలోగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది వికసిత్ భారత్ లక్ష్య సాధనతో ముందుండాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా కలిగి ఉన్న మన రాష్ట్రం దేశ జీడీపీలో 5 శాతం వాటాను కలిగి ఉంది. 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడానికి విజన్ డాక్యుమెంట్ తెచ్చాం’ అని సీఎం రేవంత్ అన్నారు. లక్ష్యాలు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్..‘విజన్ డాక్యుమెంట్ నాలుగు గోడల మధ్య తయారు చేసిన కాగితం కాదు. నాలుగు కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలోని మేధావులతో చర్చించి, ఆర్థికవేత్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులను భాగస్వాములను చేసి రూపొందించిన విధాన పత్రం. నెహ్రూ దేశ తొలి ప్రధానిగా బాధ్యతల స్వీకరణకు ముందు గాంధీని కలిసి సలహా కోరగా, పాలనాపర నిర్ణయం తీసుకునే సమయంలో పేదలు, నిస్సహాయులకు ఎలా సహాయం చేయగలవో ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఆ సూచనలతో నిరక్షరాస్యత నిర్మూలనకు విద్య, ఆకలి నిర్మూలనకు ఇరిగేషన్ అని విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా అనేక వర్సిటీలు, ప్రాజెక్టులను నిర్మించారు. దేశంలో బాక్రనంగల్, రాష్ట్రంలో ఎస్సారెస్పీ వంటివి నెహ్రూ కాలంలోనే ప్రారంభించారు.మా ప్రభుత్వం విద్య, ఇరిగేషన్‌తోపాటు కమ్యూనికేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. ఐటీ, రోడ్లు, పోర్టుల ద్వారా ప్రపంచంతో కమ్యూనికేట్ కావాలని నిర్ణయించాం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహా్వనిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ నాకు ఆదర్శం. వాటితో పోటీపడతా. వారిని ఆదర్శంగా తీసుకుని నా రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తా. సంక్షేమ పథకాలు అమలు చేస్తా’ అని రేవంత్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల సగటు వయస్సు 32 ఏళ్లు కాగా నెహ్రూ విజన్ కారణంగా ఇప్పుడు 73 ఏళ్లకు పెరిగిందన్నారు. వందేళ్ల సగటు ఆయుష్షును సాధించాలని అనుకుంటున్నామన్నారు. నిరుపేదలకు, మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. ‘11 ఏళ్ల వయస్సులో పెద్ద ప్రమాదానికి గురైతే నా తల్లిదండ్రులు నన్ను గ్రామం నుంచి నిజాం నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పేదరికాన్ని నిర్మూలించాలని, విద్యను అందించాలని, ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని, పౌరులకు మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కుల నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‘కుల నిర్మూలనకు పనిచేయాల్సిన ప్రభుత్వాలే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ హాస్టళ్లను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. నేను సీఎం అయిన వెంటనే వాటిని ఒకేచోట తేవాలని ఆదేశించా. అందులోభాగంగానే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నా. ఒక్కొక్కటి రూ.200 కోట్లతో 100 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. కులవివక్ష నిర్మూలనకు, సమానత్వం వచ్చే వరకు సంక్షేమంపై పెట్టుబడి అవసరం. విద్యపై ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడే. మన యువత చదువుకుని దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా చేసి కొరియాతో పోటీపడబోతున్నాం. సోనియా గాంధీ తెచ్చిన విద్యా హక్కు చట్టం ఉన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. యువతలో నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ తెచ్చాం. 140 కోట్ల జనాభా ఉన్నా ఒలింపిక్స్‌లో ఒక్క బంగారు పతకం గెలవలేకపోతున్నాం. దీనికోసమే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెస్తున్నా. నా నిరుపేదల కోసం ఇదే నా విధానం’ అని సీఎం ప్రకటించారు. -
సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజులుగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ. 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సమ్మిట్ తొలిరోజైన సోమవారం రూ. 2.43 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా రెండో రోజైన మంగళవారం రూ. 3,32,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 20కిపైగా సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఐటీ, విద్యుత్, ఫార్మా, క్రీడలు, పర్యాటకం, అటవీ, ఆహార ఉత్పత్తులు, గృహ సముదాయాల నిర్మాణానికి సంబంధించిన కంపెనీలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థల్లో రిలయన్స్, గోద్రెజ్, ఫోర్టిస్, హెటెరో, మహీంద్ర అండ్ మహీంద్ర, భారత్ బయోటెక్, అరబిందో, గ్రాన్యూల్స్, బయోలాజికల్–ఈ, వింటేజ్ కాఫీ, కేజేఎస్, కేన్స్ టెక్నాలజీస్, జేసీకే ఇన్ఫ్రా, అక్విలాన్ నెక్సస్, ఏజీపీ గ్రూప్, ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్, ప్యూర్‌వ్యూ గ్రూప్, ఎంఎస్ఎన్, సత్వా, సుమధుర ఉన్నాయి. సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలకు గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.రంగాలవారీగా మంగళవారం వివిధ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు ఇలా..డేటా సెంటర్లు, జీసీసీ..ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్: రూ. 70 వేల కోట్లతో 150 ఎకరాల్లో ఏఐ ఆధారిత ఒక గిగావాట్ డేటా పార్క్ ఏర్పాటు.జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: రూ. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు. యాన్సిలరీ మౌలిక వసతుల కల్పన. 2,000 మందికి ఉపాధి కల్పన.ఏజీపీ గ్రూప్: రూ. 6,750 కోట్లతో 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాంగణం ఏర్పాటు.కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్: ప్రస్తుత ప్లాంట్‌కు అదనంగా రూ. 1,000 కోట్లతో విస్తరణ.ప్యూర్‌వ్యూ గ్రూప్: గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ), ఏఐ డేటా సెంటర్ క్యాంపస్. 3,000 మందికి ఉపాధి. 10 ఎకరాల్లో ఏర్పాటు.అక్విలిన్ నెక్సెస్ లిమిటెడ్: గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు. 50 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు.వ్యవసాయ, అనుబంధ రంగాలు..ఫోర్టిస్ ఇండియా లిమిటెడ్: వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగంలో క్రాప్ న్యూట్రిషన్లో పరిశోధనల కోసం రూ. 2,200 కోట్లతో రెండు దశల్లో పెట్టుబడి. 100 ఎకరాల్లో 800 మందికి ఉపాధి.రిలయన్స్ కన్సూ్యమర్ పోడక్ట్స్ లిమిటెడ్: రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఆహార, పానీయాల ఉత్పత్తి ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్: రూ. 1,100 కోట్ల పెట్టుబడితో 15 ఎకరాల్లో ప్రీమియం కాఫీ పొడి ఎగుమతుల ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.కేజేఎస్ ఇండియా: ఫుడ్ అండ్ బేవరేజెస్ రెండో యూనిట్.. రూ. 650 కోట్లు పెట్టుబడి, 44 ఎకరాల విస్తీర్ణంలో 1,050 మందికి ఉపాధి. గోద్రెజ్: పాడి రంగంలో రూ. 150 కోట్ల పెట్టుబడి. ప్రతిరోజూ 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో 40 ఎకరాల్లో డెయిరీ ప్లాంట్ విస్తరణ. 300 మందికి ప్రత్యక్ష ఉపాధి.పర్యాటక రంగంలో..» మొత్తం పెట్టుబడులు: రూ. 7,045 కోట్లు. ప్రత్యక్ష ఉపాధి 10 వేలు, పరోక్షంగా 30 వేలు.» ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్: రూ. 3,000 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ట్రేడ్, ఎగ్జిబిషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు.» అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు): రూ. 800 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ వెల్నెస్ రిట్రీట్ కేంద్రం.» ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: రూ. 300 కోట్ల పెట్టుబడి.» పొలిన్ గ్రూప్ (టర్కీ) అండ్ మల్టీవర్స్ హోటల్స్ (హైదరాబాద్): రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రపంచ శ్రేణి అక్వమెరైన్ పార్క్, అక్వా టన్నెల్ నిర్మాణం.» కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్ (కామినేని గ్రూపు): గండిపేట మండలం కిస్మత్పూర్లో రూ. 200 కోట్లతో గ్లాస్,–గ్రీన్ హౌజ్ కన్వెన్షన్ సెంటర్.» రిధిరా గ్రూప్: రూ. 120 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా యాచారంలో నోవాటెల్ ఆతిథ్య రంగంలో పెట్టుబడి.ఫార్మా రంగంలో..బయోలాజికల్–ఈ లిమిటెడ్: రూ.3,500 కోట్ల పెట్టుబడితో వ్యాక్సిన్ పరిశోధన, ఉత్పత్తులకు సంబంధించి మలిదశ విస్తరణ కోసం 150 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీలో ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి. అరబిందో ఫార్మా: ఔషధ రంగంలో రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు. 3,000 మందికి ఉపాధి అవకాశాలుహెటెరో గ్రూప్: రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో దేశీయ, అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు. 9,000 మంది ఉపాధి.గ్రాన్యూల్స్ ఇండియా: రూ.1,200 కోట్ల పెట్టుబడితో కేన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు, పరికరాల ఉత్పత్తికి 100 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీలో ప్లాంట్ ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి.భారత్ బయోటెక్: పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి. 200 మందికి ఉపాధి.విద్యుత్ఆర్సీటీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్: రూ. 2,500 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, 1,600 మందికి ఉపాధిఇతర సంస్థలు» విజ్హీ హోల్డింగ్ ఐఎన్‌సీ: రూ. 2,500 కోట్లతో ప్రాణాంతక వ్యాధుల నివారణపై పరిశోధనల కోసం అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు ఒప్పందం. » అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 2,500 కోట్లతో ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్ స్థాపన. » టీడబ్ల్యూ గ్రూప్: రూ. 1,100 కోట్లతో ప్రపంచ తొలి ప్లగ్ ఇన్ మోటార్ బైక్ ఉత్పత్తుల పరిశ్రమ. » ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్: రూ. 700 కోట్లతో జినోమ్ వ్యాలీలో టీకాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ. » మహీంద్రా అండ్ మహీంద్రా: రూ. 500 కోట్లతో వచ్చే నాలుగేళ్లలో జహీరాబాద్‌లో ఎల్రక్టానిక్ ట్రాక్టర్లు, గ్రీన్‌ఫీల్డ్ ఇంజిన్ షాప్ ఇతర ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఒప్పందం. » ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 500 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో సాహస క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు. » బయోవరం: రూ. 250 కోట్లతో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్, ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు, కణ, జన్యు చికిత్సలకు సంబంధించి అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటుకు ఒప్పందం. » అనలాగ్: ఏఐ ఆధారిత ఆర్ అండ్ డీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు, ల్యాబ్‌లు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం, టీఎస్ ఐ–పాస్ సమన్వయంతో ఏర్పాటు. » ఆల్ట్‌మ్యాన్ సంస్థ బ్యాటరీ మెటీరియల్ తయారీ యూనిట్. » అజయ్ దేవ్‌గణ్ ఫిలిం స్టూడియో: వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, వర్క్‌షాప్‌లు, స్థానిక నైపుణ్యాల వెలికితీత.» జ్యూరిక్ ఇన్సూరెన్స్: హైదరాబాద్‌లో సంస్థ మొదటి జీసీసీ. » కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్: తొలి జీసీసీ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్, దేశంలో తొలి బ్యాంక్ ఏర్పాటు. » మాగ్జిమస్ (అమెరికా): భారత్‌లో తొలిసారి గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్ హబ్. ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో పెట్టుబడులు » జీఎంఆర్ స్పోర్ట్స్, వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్: భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు. స్టేడియాలు, క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. » బ్లాక్ స్టోన్ ఏసియా: డేటా సెంటర్ల ఏర్పాటు. » సత్వా గ్రూప్: అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టుల ఏర్పాటు. » బ్రిగేడ్ గ్రూప్: భారత్ ఫ్యూచర్ సిటీ–ఐటీ కారిడార్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణం.. ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు » సుమధురగ్రూప్: మధ్యాదాయ వర్గాలకు, ఐటీ, పారిశ్రామిక వాడలకు దగ్గరలో గృహ సముదాయాల నిర్మాణం » ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం. -
కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదిక నుంచి రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. దేశ, విదేశీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమె జన్మదినం డిసెంబర్ 9. ఈ రోజున రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచి్చంది.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. అందుకే ప్రతి ఏడాది ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటాం..’అని సీఎం స్పష్టం చేశారు. సోనియా ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చారు‘ఆరు దశాబ్దాల ఆకాంక్ష, 4 కోట్ల మంది ప్రజల కోరి కను కరీంనగర్లో జరిగిన సమావేశంలో సోనియాగాంధీ ప్రకటించడమే కాకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రజా పాలనకు సంకేతంగా ఉన్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఇప్పుడు జిల్లాల్లో పాలనా కేంద్రాలైన కలెక్టర్ కార్యాలయాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషకరం..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్లోబల్ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)
-
సీఎం రేవంత్‌ను సమ ఉజ్జీగా ఫీలవుతున్నా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ చూశాక.. తన టార్గెట్ పెద్దదిగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రమఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. యువత, మహిళల అభివృద్ధి ఇందులో ఉందని ఈ డ్యాకుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకెంతో ప్రత్యేకమని ఆనంద్ మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం రంగంలో ఉన్న తనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమ ఉజ్జీగా అనిపించారని తెలిపారు. ప్రస్తుతం ఎంత ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్‌కు ఉన్న ప్రత్యేకత వేరని ఆ స్కిల్‌ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీర్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున ఒప్పందాలు చేసుకుంది. మంగళవారంతో ఈ సమ్మిట్ ముగియనుంది. -
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం: హరీష్ రావు
-
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్‌కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
Hyd: సీఎం రేవంత్ కాన్వాయ్ జామర్ కారుకు తప్పిన ప్రమాదం
-
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ డే-2 అప్డేట్స్ -
సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్ లోనే సీఎం కాన్వాయ్ జామార్ టైర్ పగిలింది. జామార్ కుడి వైపు ఉన్న వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ టీమ్ వెంటనే స్పందించి స్టెప్నీ టైర్ మార్చారు. జామార్కు చేయవలసిన మరమ్మతులు పూర్తి చెయ్యడంతో వాహనం మళ్లీ సీఎం దగ్గరకు చేరుకుంది. జరిగిన ఘటన వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
తెలంగాణ రైజింగ్ విజన్ సాధిస్తాం... గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
-
రెండేళ్ల మొండిచేయి: కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెండేళ్లు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రెండేళ్లు. రెండేళ్ల మొండిచేయి ఇది. ఒక ప్రభుత్వానికి మొదటి రెండేళ్ల సమయం అనేది అత్యంత కీలకం. ప్రభుత్వ విజన్ ఏమిటో..విధానం ఏమిటో.. అభివృద్ధి, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో తేటతెల్లం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన సమయంలో దాదాపు సగం పూర్తయ్యింది. ఇక మిగిలింది రెండేళ్ల కాలమే. చివరి ఏడాదైతే ఎన్నికల హడావుడి, కోడ్‌తోనే సరిపోతుంది. రేవంత్ రెండేళ్ల పాలనను నిర్వచించాలంటే.. మూడేమూడు మాటలు నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం’అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలన– వైఫల్యాలపై బీఆర్ఎస్ చార్జిషీట్’ను హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు గుప్పించారు.ఒక్కరోజు బాగోతంగా ప్రజా దర్బార్‘సీఎం కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తామన్న ప్రజాదర్బార్ ఒక్కరోజు బాగోతమైంది. సీఎంతోపాటు మంత్రులు కూడా రావడం లేదు. ప్రగతిభవన్ ముందున్న ఇనుప గ్రిల్స్ తీసేసి షో చేసిన బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి. ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్‌గా మారింది. డిప్యూటీ సీఎం ఫ్యామిలీ సెటిల్మెంట్లు, సాయంత్రంగానా భజానాలు, సంగీత్‌లు, పెళ్లిళ్లు, రిసెప్షన్లతోని ప్రజాభవన్ ప్రీమియం భవన్‌గా, ఢిల్లీ బాసులకు గెస్ట్ హౌస్‌గా మారింది’అని హరీశ్‌రావు అన్నారు. రెండేళ్ల పాలనలో విధ్వంసం‘రెండేళ్ల పాలనలో ప్రజాధనం కొల్లగొట్టి తమ సొంత సంపాదనపై సీఎం, మంత్రులు దృష్టి పెట్టారు. బరి తెగించి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇంత ప్లాన్డ్గా, ఇంత ఆర్గనైజ్డ్గా కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు దేశంలో ఎక్కడ ఉండరు. కరప్షన్ కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలనే సిలబస్. ఆరు గ్యారంటీలు అటకెక్కించిండు. అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. హైడ్రా పేరిట కూల్చివేతల అరాచకంతో సృష్టించాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ఆగమైపోయింది’అని అన్నారు.కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్ ‘కాంగ్రెస్ పార్టీ స్కాంల వారసత్వాన్ని రేవంత్ కూడా కొనసాగిస్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్, భట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఎనుముల బ్రదర్స్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారు. హైడ్రా పేరిట విలువైన భూములు కొల్లగొట్టే స్కాం.. మూసీ సుందరీకరణ పేరిట పరీవాహక భూములు బుక్కే స్కాం, 450 ఎకరాల హెచ్‌సీయూ భూములను చెరబట్టే బడా స్కాం. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే స్కాం. హిల్ట్‌పి పేరిట రూ.5 లక్షల కోట్ల స్కాం. రూ. 50 వేల కోట్ల పవర్ స్కాం. ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను పాస్ చేసి మెడికల్ స్కాం’’అని హరీశ్‌రావు విమర్శించారు.కేసీఆర్ పథకాలు రద్దు ‘గత ప్రభుత్వాలవైనా ప్రజలకు మేలు చేసే పథకాలను కేసీఆర్ అమలు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను యథాతథంగా అమలు చేశారు. రేవంత్ మాత్రం వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ తెచి్చన పథకాలను ఆపి పేద ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కేసీఆర్ పేరు’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.ఆత్మహత్యలు పెరిగాయి రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రెండేళ్లలో 822 మంది రైతులు, 48 మంది నేతన్నలు, 116 మంది గురుకుల విద్యార్థులు, 179 మంది ఆటో డ్రైవర్లు, 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఐదుగురు బిల్డర్లు, ఒక బీసీ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులివ్వలేదు కానీ...బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.9000 కోట్లు విడుదల చేసిండు. కమీషన్లు దండుకునేందుకు రేవంత్ స్పెషల్ స్కీం తెచ్చాడు. యంగ్ ఇండియా స్కూళ్ల స్కాం త్వరలో బయటపెడుతాం.’అని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రజల సొమ్మునువాడి సొంత ఇమేజ్ పెంచుకునేందుకు మెస్సీతో మ్యాచ్ అంటూ పీఆర్ స్టంట్లు వేస్తున్నావ్. హోం శాఖ నీ దగ్గరే ఉంది..పెరుగుతున్న క్రైమ్ రేట్‌కు సమాధానం చెప్పాలి. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు నీకు దగ్గర్లోనే ఉన్నాయి’అని హెచ్చరించారు.అందరికీ...‘ఆరు గ్యారంటీల పేరుతో ఆడబిడ్డలను రేవంత్ సర్కార్ నిలువునా మోసం చేసింది. 17శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల నోట్లో మట్టి కొట్టారు. మైనారిటీలకు ద్రోహం చేశారు. ఆటో సోదరుల కష్టాల పాలయ్యారు. రెండేళ్లలో జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేదు. సాగునీటి రంగంలో చేసింది సున్నా. రెండేళ్లలో నువ్వు ఎన్ని ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్‌రెడ్డి’అని హరీశ్‌రావు అన్నారు. -
రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో సోమవారం తొలిరోజునే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. తెలంగాణలో దాదాపు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 35 అవగాహన ఒప్పందాల (ఎంఓయూ)లు కుదుర్చుకు న్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలిరోజే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో తొలిరోజు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చే శారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, భారీగా ఉద్యో గావకాశాల సృష్టికి దోహదపడనున్నట్లు ప్రభుత్వం వెల్ల డించింది. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయో టెక్, సినీ నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించిందిప్రధాన పెట్టుబడులు ఇవీ..⇒ భారత్ ఫ్యూచర్‌సిటీలో బ్రూక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్అండ్డె వలప్మెంట్, డీప్టెక్హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.⇒ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ. 41 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి.⇒ ఈవ్రెన్యాక్సిస్ ఎనర్జీ రూ. 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ⇒ పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.⇒ ఏరోస్పేస్డిఫెన్స్రంగాల్లో మెయిన్టెనెన్స్, రిపేర్, ఓవర్హాల్తోపాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.⇒ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్‌ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్రూ. 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వినోద వసతులు కల్పించనుంది. ⇒ మేఘా ఇంజనీరింగ్గ్రూప్ రూ. 8 వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ∙రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్గ్రీన్టెక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.⇒ ఇంటిగ్రేటేడ్ స్టీల్ప్లాంట్ఏర్పాటుకు కృష్ణా పవర్యుటిలిటీస్పెట్టుబడి రూ. 5,000 కోట్లు. ∙ప్రముఖ సంస్థ అతిథత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నెలకొల్పనుంది. వాటిని స్థాపించేందుకు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ∙సీతారాం స్పిన్నర్స్రూ. 3 వేల కోట్లతో టెక్స్టైల్యూనిట్ నెలకొల్పనుంది. ⇒ సిమెంట్‌రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్సిమెంట్స్, రెయిన్సిమెంట్స్రూ. 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ∙డిఫెన్స్, ఏవియానిక్స్తయారీకి అపోలోమైక్రో సిస్టమ్స్లిమిటెడ్రూ. 1,500 కోట్లు పెట్టుబడులు. ⇒ సోలార్డిఫెన్స్–ఏరోస్పేస్ లిమిటెడ్‌సంస్థ మిస్సైల్భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్షర్కు రూ. 1,500 కోట్లు. ⇒ అపోలో గ్రూప్ హైదరాబాద్‌లో రూ. 800 కోట్లతో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మించనుంది.⇒ అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్‌క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ∙ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం ‘వంతారా’ను ఏర్పాటు చేయనుంది. ⇒ యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి. ⇒ డిస్ట్రిబ్యూషన్హైడ్రో టెక్‌రంగంలో సాహీటెక్ఇండియా రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ⇒ సిడ్బీ స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూ.1,000 కోట్లు పెట్టబడులతో ముందుకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్సెంటర్ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఈ నిధులు సమకూర్చనుంది. ⇒షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్అసోసియేషన్ అండ్ జీనియస్ఫిల్టర్స్ పవర్లూమ్టెక్నికల్యూనిట్ కోసం రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ⇒ ఎంపీఎల్లాజిస్టిక్స్కంపెనీ రూ. 700 కోట్లు, టీవీఎస్ఐఎల్పీ రూ. 200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.భారీ పెట్టుబడులు ప్రభుత్వ విధానాలకు నిదర్శనం: సీఎం రేవంత్ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, తెలంగాణ ప్రభుత్వంపై దేశీయ, అంతర్జాతీయ సంస్థల విశ్వాసానికి రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీప్‌టెక్ సిటీ నుంచి టెక్స్టైల్ యూనిట్వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర ప్రారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశగా బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచి్చన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడివిడిగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపగా టైక్స్‌టైల్, ఫరి్నచర్ రంగాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో భాగస్వామ్యంపై ఐకియా సంస్థ సీఎంతో చర్చింది. -
హలో రోబో
రంగారెడ్డి జిల్లా/ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘గ్లోబల్ సమ్మిట్– 2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సుకు వచ్చిన అతిథులకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడి, భద్రాచలం జిల్లాకు చెందిన కొమ్ముకోయ కళాకారులు తమ నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు.పలువురు మంత్రులు, వీఐపీలతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగ్జి బిషన్ హాల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి..అక్కడ మానవ రూపంలో ఉన్న రోబో హాయ్ చెప్పి లోనికి ఆహ్వానించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా రోబోతో ముఖ్యమంత్రి కరచాలనం చేశారు. ఆ తర్వాత ఎంఆర్డీసీఎల్, భారత్ ఫ్యూచర్ సిటీ స్టాళ్లను, విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్‌జీరో సిటీ, పోలీసు విభాగం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఏరోస్పేస్, ఏవియేషన్ ప్రదర్శనలను వీక్షించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ స్టాల్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు.మూసీ సుందరీకరణ ఇలా..మూసీకి జీవం పోస్తూ రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదికి రెండు వైపులా భవిష్యత్తులో చేపట్ట నున్న అభివృద్ధి పనులు, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, పార్కులు, అందమైన భవనా లను ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా చూపించారు. ఏ ప్రదేశంలో ఏ ప్రాజెక్టు రాబోతుంది? వంటి అంశాలను డిజిటల్ తెరలపై ప్రదర్శించారు.ఆకట్టుకున్న ప్రదర్శనలుప్రవేశ ద్వారం మొదలుకుని సమావేశ మందిరాలకు వెళ్లే మార్గాల్లో డిజిటల్ తెరలపై వివిధ దేశాల జాతీయ పతాకాలు, డిజిటల్ టన్నెల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ హాల్ మధ్యలో గ్లోబ్‌ను ఏర్పాటు చేశారు. అంతరిక్ష ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి నిర్మించబోతున్న భవిష్యత్ నగరాన్ని కళ్లముందు ఆవిష్కరించారు.డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రదర్శించిన ‘ఫ్లైట్ సిమ్యూలేటర్’ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ధృవ స్పేస్ సెంటర్ నిర్వాహకులు శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ సహా రాడార్లను ప్రదర్శించారు. పి–30 శాటిలైట్ సహా ఆస్ట్రా వ్యూ.. ఇస్రో ప్యానల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో సిటీ స్టాల్ ఆధ్యంతం ఆకట్టుకుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సహా కాలుష్య రహితంగా ఈ ప్రాంతం ఏ విధంగా ఆవిçష్కరించబోతుందో ఇక్కడ వివరించారు.సంక్షేమ విద్యార్థుల ప్రతిభ..ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ఆదిలాబాద్ జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కాలేజీ విద్యార్థినులు సీహెచ్ రనూష, జె.వైష్ణవిలు రూ.10 వేల ఖర్చుతో రూపొందించిన ‘మల్టీ పర్పస్ అగ్రికల్చర్ మిషన్’ పారిశ్రామిక వేత్తలను ఆలోచింపజేసింది. ఇది ఇంధనం అవసరం లేకుండా ఒకే సమయంలో దుక్కి దున్నడం, విత్తనాలు వెదజల్లడం, నీటిని చల్లడం వంటి పనులు చేస్తుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహానికి చెందిన పదో తరగతి విద్యార్థి జి.గగన్‌చంద్ర రూ.25 వేల ఖర్చుతో తయారు చేసిన త్రి ఇన్ ఒన్ హైబ్రిడ్ సైకిల్ సైతం సందర్శకులను ఆకర్షించింది.12 అంశాలపై చర్చా గోష్టులుసదస్సు ప్రారంభోత్సవం తర్వాత అనుబంధ హాళ్లలో రెండు సెషన్లలో 12 అంశాలపై చర్చా గోష్టులు జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.స్కిల్స్ వర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి నమూనాలువిద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నమూనా’ సహా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్తగా నిర్మించ తలపెట్టిన ఉస్మా నియా ఆస్పత్రి భవనం నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హెచ్ ఎండీఏ, హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో రీజినల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్ మ్యాప్‌లను ప్రదర్శించారు. ఇందిరా మహిళా శక్తి స్టాల్లో ఫ్యూయల్ స్టేషన్ నమూనాను ప్రదర్శించారు. నెట్ జీరో సిటీలో ప్రభుత్వం పూర్తి ప్లాస్టిక్ రహితంగా ఏర్పాట్లు చేసింది.ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోసదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. -
పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో, ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ మీడియా అండ్ టెక్నా లజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఆహ్వానించడంతో పాటు గౌరవం, అభివృద్ధి కనిపించిన చోటే తమ పెట్టుబడులు పెడతామని అన్నారు. గత కొన్ని నెలలుగా తమను తెలంగాణకు ఆహ్వానిస్తూనే ఉన్నా, ఆలస్యం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధికి భారీ అవకాశాలుండడంతో రాక తప్పలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.భారత్‌లో అద్భుతమైన మానవ వనరులుపెట్టుబడులు పెట్టేముందు డబ్బు తిరిగి వస్తుందా.. లాభాలు వస్తాయా? అని అందరూ ఆలోచి స్తారని, అయితే అదే ప్రధానం కాకూ డదని స్వైడర్ అన్నారు. స్వల్పకాలిక ప్రయో జనాలు కాకుండా దీర్ఘకాలిక అంశాలూ దృష్టిలో ఉంచుకో వాలని చెప్పారు. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికి పెట్టు బడులు నీటి ప్రవాహంలా వెళ్తాయన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులున్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆదరాభిమానాలు మరిచిపోలేనుసదస్సుకు ఆహ్వానించి తనకు ఊహించని రీతి లో అద్భుత ఆతిథ్య మిచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి స్వైడర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనని అన్నారు. అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దాడి చేస్తున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడా నికి ‘ట్రూత్’ సోషల్ మీడియాను ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారు. తమ ఆలోచనలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు -
విజన్ సాధిస్తాం.. భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగంతో నాటి నాయకత్వం భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేసిన తరహాలోనే తెలంగాణ భవిష్యత్తు కోసం తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే పదేళ్లలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 2047లో వందేళ్లు పూర్తయ్యే నాటికి సాధించాల్సిన అంశాలపై చర్చించే క్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌కు బీజం పడిందన్నారు.విజన్ లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా అనిపించినా సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. కష్టమైన ప్రణాళికలను వెంటనే చేపట్టి, అసాధ్యమైన వాటికి కొంత గడువు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో, ‘తెలంగాణ రైజింగ్’ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో సీఎం కీలకోపన్యాసం చేశారు.రాష్ట్రం కలలు నెరవేర్చేందుకే.. ‘దశాబ్దాల పాటు సాగిన ప్రత్యేక రాష్ట్ర పోరాట ఫలితంగా దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర భవిష్యత్తు కలలు నెరవేర్చేందుకు నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో చర్చించి విజన్ డాక్యుమెంటు తయారు చేశాం. రెండు రోజుల సదస్సులో వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్య వేత్తలు, ప్రభుత్వాధికారులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.గ్వాంగ్డాంగ్ నమూనా స్ఫూర్తి దేశంలో 2.9 శాతం జనాభా కలిగిన తెలంగాణ.. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉంది. 2047 నాటికి 10 శాతం వాటాను రాష్ట్రం కలిగి ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలుగా విభజించాం. ఈ మూడు ప్రాంతాలను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా మారుస్తాం. చైనాలోని అతిపెద్ద ప్రావిన్స్ ‘గ్వాంగ్ డాండ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే ప్రపంచంలో అత్యధిక పెట్టుబడులు, వృద్ధిరేటును సాధించింది. గ్వాంగ్డాంగ్ నమూనాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందిన తెలంగాణ.. ప్రస్తుతం ఆ దేశాలతో పోటీ పడాలని అనుకుంటోంది..’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ‘ప్రదానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలు ఉన్నాయి. వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్‌లో సమగ్రాభివృద్ధి, స్థిరమైన విధానాలు, ఆవిష్కరణలు మూల స్తంభాలుగా ఉన్నాయి. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సంకల్పంతో ముందుకు సాగుతున్న రీతిలోనే తెలంగాణ కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు, రైతులు, యువత, పిల్లలను కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. మహిళల స్వశక్తీకరణలో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, రిటైల్ ఎంటర్‌ప్రైజ్‌లు, సౌర శక్తి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలను ఆర్థిక వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మార్చడంతో పాటు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల పునరుద్ధరణ వంటి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాం«దీజీ స్ఫూర్తితో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్, నైపుణ్య శిక్షణ, క్రీడా యూనివర్సిటీలు యువతను భవిష్యత్తు వైపు మళ్లిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్తగా మార్చేందుకు రాష్ట్రంలో విమానాశ్రయాలు, పునరుత్పాదక శక్తి, రవాణా వ్యవస్థలు, స్మార్ట్ జోనింగ్ వంటి ఆధునిక మౌలిక వసతులను ప్రభుత్వం చేపడుతోంది. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న విధానాలుప్రభుత్వ స్థిరమైన, స్పష్టమైన విధానాలు పెట్టుబడులను, ఆవిష్కరణలను ఆకర్షిస్తున్నాయి. మహిళా కారి్మకుల కోసం ‘గిగ్ వర్కర్ల పాలసీ’, రెస్ట్ సెంటర్లు వంటి వినూత్న ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. సాంకేతికత, వృత్తి ఆధారిత నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేస్తోంది. ప్రజల సేవకులుగా పనిచేసే ప్రభుత్వాలు బాధ్యతాయుత పాలనతో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొదిస్తాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది.’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.రాష్ట్రాల సహకారంతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి‘సాంకేతికతతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసిన హైదరాబాద్ కేవలం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిది. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాస్యూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముంది. 2047 నాటికి వికసిత భారత్‌గా వెలుగొందాలనే ప్రధాని మోదీ కల రాష్ట్రాల కీలక సహకారంతోనే సాకారమవుతుంది. పరిశ్రమలను, స్టార్టప్‌లను, టాలెంట్‌ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలి. రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీతో ప్రమాణాలు పెరగడంతో పాటు సంస్కరణలు జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా అవతరించింది.అభివృద్ధిలో రాష్ట్రంతో కలిసి పనిచేస్తాం2014 నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు, రైల్వే రంగానికి రూ.32 వేల కోట్లు కేటాయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రూ.521 కోట్లతో కాజీపేలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రామగుండంలో రూ.11 వేల కోట్లతో ఎనీ్టపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించాం. మరో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉంది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.2,300 కోట్లతో జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.బెంగళూరు హైదరాబాద్ నడుమ దృఢ బంధం: డీకే శివకుమార్‘కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నా మిత్రుడు రేవంత్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చా. అభివృద్ధి పథంలో సాగుతున్న బెంగళూరు, హైదరాబాద్ నడుమ దృఢ బంధం ఏర్పడాల్సిన అవసరముంది. రెండేళ్లలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గణనీయమైన పురోగతితో అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ సదస్సు తీరును చూస్తే బెంగళూరుతో కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయంగా పోటీ పడుతున్నట్టుంది. విజన్ డాక్యుమెంట్ 2047 వచ్చే తరం ఆకాంక్షలకు అద్దం పడుతుంది. దేశ ఆర్థిక పురోగతిలో దక్షిణాది రాష్ట్రాలు మరింత ఐక్యంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్‌ను విస్మరించలేని పరిస్థితి ఉంది. రెండు నగరాలు పరస్పరం పోటీ పడకుండా సహకారంతో ముందుకు సాగడం ద్వారా భారత సాంకేతిక, ఆర్థిక రంగాలకు మూల స్తంభాలుగా నిలుస్తాయి..’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. -
తెలంగాణలో ‘వంతారా’ జూపార్క్.. కుదిరిన ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ అధినేత అంబానీ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారా జూపార్క్ బ్రాంచ్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోనే ఈ జూపార్క్ ఏర్పాటు కాబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వంతరా బృందం.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చకుంది. వంతారా-అటవీశాఖ అధికారులు సీఎం సమక్షంలో ఒప్పందానికి వచ్చారు. ఈ సందర్భంగా జంతువుల సేవ నినాదంతో వంతారా పని చేయడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే జూపార్క్‌లో జంతువులకు.. గుజరాత్ జామ్ నగర్ వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ కల్పించాలని.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే సమయంలో.. ఈ నెల చివర్లో తానే స్వయంగా సీఎం రేవంత్ వంతారా టీంతో అన్నారు. -
చైనానే ఆదర్శం 3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం.. స్ట్రాటజీ బయటపెట్టిన రేవంత్ రెడ్డి
-
Global Summit: తెలంగాణ రైజింగ్ అనేది అన్‌స్టాపబుల్
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచ పటంలో తెలంగాణ మంచి రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని.. అది ఎంత కష్టమైనా అందరి సహకారంతో సాధించి తీరతామని మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో ఆయన ప్రసంగించారు.దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నాం. ఇందుకు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో సోనియా గాంధీ, ఆనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది... మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం.. ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలుఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం.దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం.కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం.మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీంకు నేను చెప్పేదొక్కటే. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక.. ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. Come and join the rise అని సీఎం రేవంత్ తన ప్రసంగం ముగించారు. -
Watch Live: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..
-
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. డే1 హైలైట్స్
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌లో జోష్ నెలకొంది.. -
జల్సాలు, విందులకు కేరాఫ్‌గా ప్రజాభవన్: హరీష్‌రావు
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.అలాగే, ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్‌కు రేవంత్ వచ్చారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్‌లకు ప్రజాభవన్‌ను వాడుతున్నారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన.. రెండేళ్ల పాలనలో రేవంత్ చేసింది ఒక్కటైనా చెప్పగలడా?. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలి. ఫైనాన్స్‌లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలి’ అని కామెంట్స్ చేశారు. -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. ఫ్యూచర్ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ నేడు ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.మరోవైపు.. మీర్ఖాన్పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్‌లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో..ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్‌హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. కోడ్‌ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తుశంషాబాద్లో భద్రత..గ్లోబల్ సమ్మిట్‌కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ ఏర్పాటు చేశారు. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. సిటీ ముస్తాబు..మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైంది. సమ్మిట్‌కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్‌తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. -
నేటి నుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం
-
గూగుల్ స్ట్రీట్.. టాటా రోడ్డు.. ట్రంప్ అవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌కు మరింతగా ప్రపంచ పటంలో చోటు కల్పించేందుకు ఆయన సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్‌లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమైన ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీని అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు దివంగత రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ‘టాటా ఇంటర్చేంజ్’అని పేరు పెట్టారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. మరికొన్ని ప్రధాన రోడ్లకు కూడా.. ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్íÙప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్పీఎఫ్) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, హైదరాబాద్‌లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని ‘గూగుల్ స్ట్రీట్’గా ప్రకటించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించిన వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు. -
రాష్ట్రంలో సీఎం బ్రదర్స్ పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో సీఎం అండ్ సన్స్ మోడల్ ఉండేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అది సీఎం అండ్ బ్రదర్స్ మోడల్‌గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ప్రజావంచన దినం పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని దుయ్యబట్టారు.విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిందన్నారు. వంచించే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌కు పోటీగా నిలబడే సర్పంచ్ అభ్యర్థులను హౌస్ అరెస్టులు, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లను అంతమొందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టిన రాంచందర్‌రావు.. తాము అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయట్లేదంటూ బీఆర్ఎస్ గతంలో నిందించినందుకు ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారని.. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ‘హిల్ట్’పాలసీని తెచ్చిందని.. ఇది అవినీతికి తెరతీయడం వంటిదేనని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ అక్కడ ఏం చేయబోతున్నారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడుందని ఆయన నిలదీశారు. భూములను వేలం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించిందని రాంచందర్‌రావు ఆరోపించారు. సామాన్యులకు ఒరిగిందేమీ లేనప్పుడు తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.రెండేళ్లుగా నయవంచన పాలన: కేంద్ర మంత్రి కిషన్రెడ్డిరెండేళ్లుగా కాంగ్రెస్ నయవంచన పాలన కొనసాగిస్తోందని.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం తప్ప ఏ వర్గంలోనూ పెద్దగా మార్పు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేస్తే ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప ఇతర హామీలేవీ అమలు చేయడం లేదని మండిపడ్డారు.ప్రభుత్వం భూములు అమ్మితే తప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. హామీల అమల్లో ప్రభుత్వ తీరుపై ఈ సందర్భంగా చార్జిïÙట్ విడుదల చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే లక్ష్యంతో జిల్లాలు తిరుగుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేమిటని ప్రశ్నించారు.రాష్ట్రంలో లంకెబిందెల కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెతుకుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ. 6.30 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని.. పరిశ్రమలను మూసేసి ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ వెనుక చెడ్డీ గ్యాంగ్ ఉందని.. రేవంత్‌రెడ్డి రాబందు రెడ్డిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారత గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘నేటి అవసరాలు తీర్చి..పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి.. ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. భారత దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్కం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క.నిన్న, నేడు, రేపుం..మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వంం. మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకుం ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకుం తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్’వేదికగా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం తన సందేశం ఇచ్చారు.‘జాతి కోసం, జనహితం కోసంం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలిం. గొప్ప కార్యాలు చేయాలంటేం మహా సంకల్పం కావాలిం. సరిగ్గా రెండేళ్ల కింద నాకు ఆ ధైర్యం ఇచ్చిం తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చిం నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు’అని సీఎం అన్నారు. రెండేళ్ల ప్రస్థానంలోం అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్టు తన సందేశంలో తెలిపారు. రైతుకు దన్నుగా నిలుస్తాం గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని సీఎం రేవంత్ ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీలాగా వ్యాపారరంగంలో నిలబెట్టాం’అని పేర్కొన్నారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామన్నారు.చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. ‘జయ జయహే తెలంగాణ’అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు అని తెలిపారు. -
సమ్మిట్ లక్ష్యం నెరవేరాలి
సాక్షి హైదరాబాద్: పార్ల మెంటు సమావే శాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025కు హాజరు కా లేకపోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్ వేదికగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే సదస్సు విజయవంతం కావాలని కోరుతూ వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఖర్గే ఆదివారం లేఖ రాశారు.సమ్మి ట్ విజయవంతం కావాలని లేఖలో ఆకాంక్షించారు. ఈ సద స్సు ద్వారా తెలంగాణ పెట్టుబడిదారుల గమ్యంగా.. ఇన్నోవేషన్ హబ్‌గా అవతరించాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో జరిగే చర్చలు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని.. తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలు, దేశాభివృద్ధి ప్రయాణంలో సమ్మిట్ ఫలవంతమైన తోడ్పా టు అందించాలని సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఖర్గే ఆకాంక్షించారు. -
‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’
నల్లగొండ: ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈరోజు (ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) నల్లగొండ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఏ మాత్రం తేడా లేదు. దేవుడిపై ప్రమాణం చేసి హామీలు ఇచ్చిన రేవంత్ ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలి, ఒక్క నిరుద్యోగికి కూడా భృతి ఇవ్వలేదు. సన్నబియ్యంలో కేంద్రం 43 రూపాయలు ఇస్తోంది. రాష్ట్ర వాటా కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లక్షన్నర కేంద్రం వాట కింద ఇస్తోంది. మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారుతెలంగాణలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు విపరీతంగా భూ దందా సాగుతోంది భూములు అమ్మనిదే పూటగడవట్లేదు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 42 వేల కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. ాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేళ్లలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్.. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా?
సాక్షి,హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసిందని, ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాటు నియంత పాలన చేశారు. ఆయన కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ బంధీ అయ్యింది. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఏదో మార్పు చేస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అంతే కానీ కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో కాదు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండేళ్ల పాలన పై ఉత్సవాలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రతీ సందర్భంలో ఫ్రీ బస్సు, సన్న బియ్యం రెండే విషయాలు చెబుతున్నారు. ఆ సన్న బియ్యంలో కేంద్రం వాటా ఉంది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చారు అంతే. పరిపాలనలో మార్పు రాలేదు. తెలంగాణలో ఇంకేమీ మారలేదు. ఏ రంగంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరాడు. ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా రండి. మా కార్యకర్తలు సమాధానం చెబుతారు. ప్రెస్ క్లబ్ కైనా, ఇంకా ఎక్కడికైన పర్వాలేదు. మా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. భూములు, మద్యం అమ్మకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకోవాలని సూచిస్తున్నా.బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పారు.. ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసే పార్టీలే అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించి మోసం చేయడానికి సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారు. వంచించడమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ. హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో గతంలో ద్రుష్టి మళ్ళించారు. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ పేరుతో ప్రజల ఫోకస్ మళ్లిస్తున్నారు. కరప్షన్ లో, డ్రగ్స్, గన్ కల్చర్ లో తెలంగాణ రైజింగ్ అవుతోంది.రెండేళ్లలో భూ మాఫియా పడగలెత్తింది. వాటాల కోసం మంత్రుల మధ్య గొడవలు బయటపడుతున్నాయి. పారిశ్రామిక భూములను అప్పనంగా దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణ సంపదను దోచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నారు. బీఆర్ఎస్ చేసిన పాపలు.. అప్పులు మళ్లీ కాంగ్రెస్ కూడా చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అంటూ బీజేపీ నాయకుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
రేవంత్ vs మెస్సీ.. ఉప్పల్‌లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మ్యాచ్ అంటే ఫుట్‌బాల్ ప్రేమికులు ఊగిపోతారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని వాటిని పరిశీలిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి పర్యవేక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకోవాలి. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అలాగే, గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు వస్తున్నారు.ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం మెస్సీ.. వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పాటుచేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
కమీషన్లమయంగా కాంగ్రెస్ సర్కార్: ఎంపీ ధర్మపురి సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదుఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్‌బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. బీజేపీలో మేమంతా ఒక్కటే.. తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
-
ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్–2 రెండో రౌండ్ పోటీలు హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్, ISRL బ్రాండ్ అంబాసడర్ సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరై వేదికను కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ వేడుకను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్లో బైకర్ల విన్యాసాలు చూసేందుకు 18,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. బైకర్ల వేగం, నైపుణ్యానికి రేసింగ్ అభిమానులు ముగ్దులయ్యారు. ఈ పోటీల్లో 450cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ బోర్డన్ (BB Racing) విజేతగా నిలిచారు. హోండా CRF 450 R బైకర్పై విజయం సాధించారు. 250cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన కాల్విన్ ఫోన్వియెల్ (Indewheelers Motorsports) యమహా YZ 250పై గెలిచారు. 250cc ఇండియా–ఆసియా మిక్స్ కేటగిరీ విభాగంలో ఇండోనేషియాకు చెందిన నకామి మకరిమ్ (Bigrock Motorsports SX) కవాసకి KX 250పై విజయం సాధించారు.టీమ్ గుజరాత్ ట్రైల్బ్లేజర్స్ రౌండ్–2లో ఓవరాల్ విక్టరీ సాధించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూఎస్ఏ, జర్మనీ, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి 36 మంది అంతర్జాతీయ రైడర్లు, 21 దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు. భారత రైడర్లలో రుగ్వేద్ బార్గుజే, ఇక్షన్ షణ్భాగ్ ఆకట్టుకున్నారు. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రపంచ స్థాయి క్రీడా అవకాశాలు కల్పించడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. ISRL వంటి అంతర్జాతీయ ప్రమాణాల మోటార్‌స్పోర్ట్స్ లీగ్‌లు రాష్ట్రానికి ఉద్యోగాలు, టూరిజం, గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.ఇదే సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎనర్జీ అద్భుతం. భారత, విదేశీ రైడర్లు కలిసి పోటీపడటం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ISRL యువతకు అద్భుత వేదిక అని అన్నారు. ఎండీ మరియు ISRL కో ఫౌండర్ వీర్ పటేల్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం, నిరంతర హర్షధ్వానాలు భారత యువతలో మోటార్‌స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నాయని అన్నారు.ISRL గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న కేరళలోని కోజికోడ్ EMS కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది. -
‘గ్లోబల్’ స్థాయిలో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని శనివారం సాయంత్రం ఆయన తొలుత హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన అన్ని హాళ్లను చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం, ఇతర కార్య క్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్‌ను వీక్షించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధి కారులను ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలుసూచనలు చేశారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా కలియతిరిగారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రపంచ దేశాలతోనే తెలంగాణ పోటీ : పొంగులేటిగ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుంది అని రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూప దని స్పష్టం చేశారు. శనివారం ఆయన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామని చెప్పారు. గడచిన రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతోపాటు 2037 విజన్, 2047 విజన్ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నామని చెప్పారు. -
నేను రాలేను.. రేవంత్‌కు మమతాబెనర్జీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘సమ్మిట్‌కు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే సమ్మిట్ జరుగుతున్న రోజుల్లో ముందే నిర్ణయించిన జిల్లాల పర్యటనల వల్ల నేను రాలేకపోతున్నాను. ఈ సమ్మిట్ వేదికగా నిర్మాణాత్మక చర్చలు జరగాలి. సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి అమూల్యమైన ప్రయోజనాలు చేకూరాలి’అని ఆ లేఖలో మమత పేర్కొన్నారు. -
అబ్బురం.. ఇండియన్ సూపర్ క్రాస్రేసింగ్ లీగ్
గచ్చిబౌలి (హైదరాబాద్): ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఇండియన్ సూపర్రేసింగ్ లీగ్ క్రీడా ప్రియులను అబ్బురపరిచింది. పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ రేసర్స్ గాల్లో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మెరుపు వేగంతో దూసుకెళ్లిన బైకర్లు అందరినీ ఆశ్చర్య పరిచారు. శనివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడి యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఐఎస్ఆర్ఎల్ ఆధ్వర్యంలో ఇండియన్ సూపర్ క్రాస్రేసింగ్ లీగ్ రౌండ్–2 పోటీ లను బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రారంభించారు. 450 సీసీ, 250 సీసీ ఇంటర్నేషనల్, ఇండియా–ఏసియా మిక్సింగ్ విభా గాల్లో రేసర్లు పోటీ పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్‌ఖాన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రేసర్ల విన్యాసాలను తిలకించారు. 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ బైక్ రేసింగ్‌ను చూస్తూ గడిపారు. దాదాపు 48 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్టేడియంలో బైకర్ల విన్యాసాలకు ప్రత్యేకంగా టర్ఫ్‌ను ఏర్పాటు చేశారు. మ్యూజిక్, లేజర్ షో వీక్షకులను ఆకట్టుకుంది. -
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్
సాక్షి, నల్గొండ జిల్లా: రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించిందే దివంగత నేత వైఎస్సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన దేవరకొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వేలాది మంది రైతులకు విద్యుత్ బిల్లులను వైఎస్సార్ మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అవకాశం వస్తే మంచి రోజులు కాదు.. ముంచే రోజులు వస్తాయంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ నలుగురు కలిసి పీక్కుతిన్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఎస్ఎల్బీసీని పదేళ్లలో పది కిలోమీటర్ల దూరం తవ్వలేకపోయారు. ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చనిపోతే మామా అల్లుళ్లు డ్యాన్స్‌లు చేస్తున్నారు. పదెకరాల్లో 150 రూమ్‌లతో కేసీఆర్ గడీని నిర్మించుకున్నాడు. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసి రైతుల నెత్తిన అప్పు, చేతిలో కేసీఆర్ చిప్ప పెట్టిండు. ఓటు అనే ఆయుధంతో గడీల పాలనను కూల్చారు. గత ప్రభుత్వానికి రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయింది...కాంగ్రెస్ హయాంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా?. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినవో చెప్తే ఆ ఊర్లో ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ చేశాం. పేదవాళ్ల పట్ల కేసీఆర్‌కు ఏ మాత్రం ప్రేమ, అభిమానాలు లేవు. మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నమ్మించి నట్టేట ముంచినోడు.. ఒకవైపు నమ్మినోళ్ల కోసం పనిచేసేటోడు ఒకవైపు ఉన్నారు ఎవరు కావాలో జనాలు తేల్చుకోండి. దేశానికి ఆదర్శంగా నిల్చేలా తెలంగాణను రోల్ మోడల్‌గా తయారు చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాట్లపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
-
‘రేవంత్.. ఒక్కసారి భ్రమల నుంచి బయటకొచ్చి చూడు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని, అట్లాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చుకోరని, మార్చు కోలేరని విమర్శించారు. ఈ మేరకు శనివారం(డిసెంబర్ 6వ తేదీ) ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ‘ రెండేళ్లుగా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప చేసిందేముంది రేవంత్ రెడ్డి?, విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవు. అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరిచిపోరు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్దం చెబుతున్న రేవంత్ రెడ్డి.. 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్దమా?, గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా?, నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు?, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు?, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా?, ఈ లెక్కలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? పదే పదే ఎందుకు అబద్దాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి?, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా?, రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నడు.కనీసం ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న శవాలను కూడా ఇప్పటికీ బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. రోమ్ తగలబడుతుంటే, ఫిడేల్ వాయించినట్లు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే..నువ్వు మాత్రం పాలన గాలికి వదిలి ఫుట్ బాల్ ఆడుతున్నవు. ఆటలాడటంపై ఉన్న శ్రద్ద నీకు ప్రజా సమస్యల మీద, పరిపాలన మీద లేక పోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?, భ్రమల నుంచి బయటికి వచ్చి చూడు రేవంత్ రెడ్డి. నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. నీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నరు. నీ స్కాంల పాలనను ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నరు.అందిన కాడికి దోచుకోవడం, అందరు కలిసి పంచుకోవడం ఇదే కదా మీరు చేసింది. మూటలు, వాటాలు, కమీషన్లు ఇదే కదా మీకున్న విజన్. నలుదిక్కులా గద్దల్లా మారి భూములను ఖతం పట్టిస్తున్నరు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అందిన కాడికి దండుకుంటున్నరు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని సర్కారు మీది.కూట్లో రాయి తీయని రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటుండటం హాస్యాస్పదం. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరిని మభ్య పెడుతున్నవు?, ఇందులో ఎన్ని కోట్ల స్కాంకు ప్లాన్ వేసినవు. ఇందులో ఎవరి వాటా ఎంత?, గాల్లో మేడలు కట్టడం, అబద్దాలు చెప్పి రంగుల ప్రపంచం చూపడం మానేసి.. పాలన మీద దృష్టి సారించు. చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ది చెందదు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదు.నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం గుర్తుంచుకో.. అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొలగించుకో’ అని హరీష్ ధ్వజమెత్తారు.ఇండిగో ఇష్యూపై.. కేటీఆర్ రియాక్షన్ -
42 దేశాలు.. 1,686 మంది ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లను ఆదివారంలోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సదస్సులో ఆవిష్కరించనున్న ‘తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్’కు తుది మెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల జాబితా కూడా సిద్ధమైంది. సదస్సుకు 42 దేశాల నుంచి 1,686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వారిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యూఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి. ప్రధాని రాక అనుమానమే ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ తదితరులను సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వనించడం తెలిసిందే. అయితే పార్లమెంటులో సోమ, మంగళవారాల్లో ఓటర్ల జాబితా సవరణ, వందేమాతరంపై చర్చ నేపథ్యంలో సదస్సుకు ప్రధాని హాజరయ్యే అవకాశాలు లేవని అధికార వర్గాల సమాచారం. కాంగ్రెస్ కూడా విప్ జారీ చేయడంతో ఆ పార్టీ ఎంపీలు కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం లేనట్లు తెలిసింది. మరోవైపు ఇతర రాష్ట్రాల సీఎంలను గ్లోబల్ సదస్సుకు ఆహ్వనించేందుకు పలువురు మంత్రులు శుక్రవారం ఆయా రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. ప్రారంభోత్సవ అతిథులు వీరే.. ఈ నెల 8న మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ప్రారంభ సమావేశంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తోపాటు బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కె. బెరి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచత చువాంగ్శ్రీ, ట్రంప్ మీడియా–టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులు, ప్రతినిధుల జాబితాలో స్వల్ప మార్పుచేర్పులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బగ్గా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈవో సదస్సులో వర్చువల్‌గా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. సాంకేతిక రంగం నుంచే ఎక్కువ మంది... ఈ సదస్సుకు 1,686 ప్రతినిధులు హాజరవుతుండగా వారిలో 198 మంది (11.7 శాతం) ఐటీ, సాంకేతిక రంగాలకు చెందిన వారే కావడం గమనార్హం. ప్రతినిధుల్లో ప్రభుత్వాధికారులు, రాయబార కార్యాలయ ప్రతినిధులు 75 మంది (4.4 శాతం), ఆరోగ్య, ఫార్మా రంగాలకు చెందిన వారు 66 మంది (3.9 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు 55 (3.3 శాతం), వ్యవసాయం, ఆహార భద్రతా రంగాల నుంచి 3.1 శాతం మంది హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి 704 (41.8 శాతం), జాతీయ స్థాయిలో 727 మంది (43.1 శాతం), అంతర్జాతీయ స్థాయిలో 255 మంది (15.1 శాతం ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. గూగుల్, అమెజాన్‌తోపాటు అనేక జీసీసీల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. 26 అంశాలపై చర్చాగోషు్టలు.. సదస్సులో భాగంగా సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, ఆర్థిక వృద్ధి సహా వివిధ అంశాలపై 26 చర్చాగోష్టులు ఉంటాయి. ఏకకాలంలో 15 రంగాలకు చెందిన అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించేందుకు నాలుగు సమావేశ మందిరాలు సిద్ధం చేస్తున్నారు. కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, టెక్ తెలంగాణ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టాలెంట్ మొబిలిటీ, గిగ్ ఎకానమీ, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటకం, మూసీ పునరుద్ధరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, వ్యవసాయం వంటి అంశాలపై చర్చాగోషు్టలు జరగనున్నాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడాతో వ్యూహాత్మక సంబంధాలపై ప్రత్యేకంగా చర్చ ఉండనుంది. కిరణ్ మజుమ్దార్ షా (బయోకాన్), పీవీ సింధు (ఒలింపిక్ చాంపియన్), రితేశ్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి (వినోద రంగం), సతీశ్‌రెడ్డి (ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా), ఆర్వింద్ సుబ్రహ్మణ్యం (పెటర్సన్ ఇన్స్టిట్యూట్), రజత్ గుప్తా (మెకిన్సీ భాగస్వామి), బీవీఆర్ సుబ్రమణియం (నీతి ఆయోగ్ సీఈఓ) తదితర ప్రముఖులు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు చర్చాగోష్టుల్లో ప్రసంగించనున్నారు. సెమీకండక్టర్ల రంగంలో భాగస్వామ్యాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల విస్తరణ, ఇండో–పసిఫిక్ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్–జీరో లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ప్రాజెక్టుల వేగవంతం వంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడుల ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి. -
ప్రగతి ప్రణాళికలపై ఫోకస్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో రాబోయే కాలంలో చేపట్టే ప్రగతికి సంబంధించిన రాష్ట్ర ప్రణాళికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పారు.శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్‌రూమ్‌ను సందర్శించారు. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్‌మ్యాప్ ‘ఇది పూర్తిగా ఆర్థికాంశాలతో కూడిన సమ్మిట్. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే రోడ్‌మ్యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నాం. విజన్ డాక్యుమెంట్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా డిజిటల్ రూపంలోనూ ఉండాలి. వచ్చే సంవత్సరం దావోస్‌లో జరిగే సమావేశంలో ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ విజయోత్సవాన్ని వివరించడానికి వీలుగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం సమ్మిట్ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పుడు, ఏం జరుగుతుందనే వివరాలను మీడియాకు వెల్లడిస్తారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విమానాల రద్దుకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడాలని, హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేలా చూడాలని సీఎం ..అధికారులను ఆదేశించారు. కాగా సదస్సు నిర్వహించే ప్రదేశంలో అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని సూచించే ఈ డాక్యుమెంట్ రూపకల్పన వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎస్ కె.రామకృష్ణారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం.. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా డాక్యుమెంట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. డాక్యుమెంట్ డిజైన్‌కు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ డాక్యుమెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉండనుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు త్వరలో ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. వివిధ రంగాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కవర్ పేజీని..భవిష్యత్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకోనున్న సూచనాత్మక నగరం ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. -
ఆయన ఆదేశిస్తే రాజీనామాకు రెడీ: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దానం తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదంటూ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అనర్హతల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం నా రక్తంలోనే ఉంది. 11 సార్లు ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర నాకు ఉంది. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై పెద్ద చర్చే నడుస్తోంది. బీఆర్ఎస్లో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా?.. లేదా ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా?.. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో వీరే అభ్యర్థులుగా ఉంటారు. మరి అనర్హత వేటు పడితే కూడా వీరికి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది.ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. సుప్రీం గడువు అక్టోబర్ 30 తేదీకే ముగియడంతో స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో, సుప్రీంకోర్టు మరో 4 వారాల సమయం ఇస్తూనే స్పీకర్ కార్యాలయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. అయితే, పార్టీ ఫిరాయించిన అంశంపై అనర్హత వేటు పడితే.. వచ్చే ఉపఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం ఉండదు .. అదే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే.. దాన్ని స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అర్హులు అవుతారు. -
6న నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సాధించిన పురోగతితో పాటు భవిష్యత్తులో నిర్దేశించు కోవాల్సిన లక్ష్యాలపై ఈ నెల 6న సీఎంరేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.రెండేళ్లలో చేసిన ఖర్చులు, పూర్తయిన పనులు, అందు బాటులోకి వచ్చిన కొత్త ఆయకట్టు, వచ్చే మూ డేళ్లలో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి అవసర మైన నిధులు తదితర అంశాలను సీఎం సమీ క్షించనున్నారు. వీటితో పాటు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పురోగతిపై చర్చించనున్నారు. -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు
సాక్షి, ఆదిలాబాద్: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ బీజేపీ అయినప్పటికీ వారిని కలుపుకొని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ప్రతిపక్ష నాయకులకు సీఎం సభలో పాల్గొనే, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సెక్రటేరియెట్‌లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వబోమని సీఎం అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి ‘ఈ రెండేళ్లలో నేను ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులోనే నాకు అవకాశం వచ్చింది. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ప్రస్తుతం ప్రజల కోసం, గౌరవం పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించా. తెలంగాణ ఆడబిడ్డలను గత ముఖ్యమంత్రి దివాలా తీయించాడు. మేము ఉచిత ప్రయాణం కల్పించాం. వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు పెట్రోల్ బంక్‌లు నడుపుతున్నారు. మొత్తం కోటి మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచుతాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి..అందుకే రాష్ట్రంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడ్డాయి..’అని ముఖ్యమంత్రి అన్నారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి.. ‘ప్రాణహిత–చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపాడు. పేరు, ఊరు, అంచనాలు మార్చాడు. కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసిందే తప్ప ఆదిలాబాద్‌కు నీళ్లు రాలేదు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టు కిందికి తరలిపోయింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. సొమ్ము రావడంతో సొంత కుటుంబసభ్యులు కత్తులతో పొడుచుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు తలో దిక్కు. అసలు ఆయన ఎక్కడ పడుకుంటున్నాడో అందరికీ తెలుసు..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా.. ‘మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పరపతితో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టడానికి టెండర్లు పిలిచాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీళ్లు ఇస్తాం. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇక్కడ ఎయిర్‌పోర్టు కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొస్తా. ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవాలని గతంలో కోరారు. ఇక్కడ నూటికి నూరు శాతం అభివృద్ధి పనులు చేపడతాం..’అని సీఎం చెప్పారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. ‘తెలంగాణ యువకులు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలన్నదే నా కోరిక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు లేవు. కానీ వాళ్ల ఇంట్లో మాత్రం పదవులు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దు.. వీలైతే ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవాలి. గ్లోబల్ సమ్మిట్‌కు కన్నతల్లి లాంటి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆహా్వనించాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కూడా రమ్మని కోరాం..’రేవంత్ తెలిపారు. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలోనే రూ.260 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం లాంఛనంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’చొరవకు అభినందనలు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. వీటిపై ఇటీవల ఆదిలాబాద్‌లో ‘సాక్షి’ఆధ్వర్యంలో చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘సాక్షి’చొరవను పలువురు అభినందిస్తున్నారు. సీఎంతో పాయల్ ముచ్చట కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంతో సుదీర్ఘంగా చర్చించడం సభకు హాజరైన ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. సీఎం ప్రసంగించేంత వరకు వారిరువురు మాట్లాడుకుంటూ కన్పించడం చర్చనీయాంశమయ్యింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆసీనులైన వేదికపై సీఎం పాయల్ శంకర్‌తోనే ఎక్కువసేపు మాట్లాడడంతో అంతగా ఏమి మాట్లాడి ఉంటారనే ఆసక్తి నెలకొంది. -
CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!
-
ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు. గురువారం.. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని.. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సభల్లో విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.‘‘ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆదిలాబాద్‌కు నీళ్ల కోసం ప్రాణిహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులను వైఎస్ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘జిల్లా అభివృద్ధికి రెండు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. మళ్లీ తొందరలోనే ఆదిలాబాద్ వచ్చి సమీక్ష చేస్తాను. ఇంద్రవెల్లిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. ప్రజల సొమ్ము తిన్నవారు బాగుపడరు’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ ప్రకటన
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శ్రీకాంతాచారి స్ఫూర్తితో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మరో ఆరు నెలల్లో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇచ్చారు’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్లు వృథా ‘యువత పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకమై, వీలైనంత వరకు ప్రజలను ఒప్పించి ఏకగ్రీవమైనా చేసుకోండి.. లేదా మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో.. కాళ్లలో కట్టెలు పెట్టే వారిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావన్నారు. కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందని చెప్పారు. ‘పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు. చిన్న తప్పులు చేస్తే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలున్నా కొట్లాడి నిధులు తెస్తాం. గ్రామాల అభివృద్ధికి ని«ధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా’ అని చెప్పారు. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఓ మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్‌గా ఉంటే ఆ గ్రామం అలా అభివృద్ధి చెందుతున్నారు. కాళేశ్వరం...కూలేశ్వరమైంది కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ఎలా ఉందో?.. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరమైంది.. ఆనాడు ఎస్సారెస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదదు. ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులు నిర్మించింది కాబట్టే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి చెందింది. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని చేసి చూపించింది ప్రజా ప్రభుత్వమే’ అని అన్నారు. మహిళలను ఓనర్లను చేశాం విద్య, నీటిపారుదలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయం కోసం రూ1.04 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టామని, 25 లక్షల మంది రైతులకు రూ. 21,654 కోట్లను రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ‘మహిళలకు ఫ్రీ బస్సేకాదు... మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చి ఓనర్లను చేశాం. బీఆర్ఎస్ పదేళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. పదేళ్లలో కాంగ్రెస్ 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో దేవుళ్లు పాలించారా? గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్లు ఏమైనా పాలించారా?... హుస్నాబాద్‌ను ఎందుకు పట్టించుకోలేదు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తవుతాయి. అదే హుస్నాబాద్‌లోని గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్‌లు పూర్తికావు. కేసీఆర్‌కు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్‌గా హుస్నాబాద్ కావాలి.. ని«ధులు మాత్రం సున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం... త్వరలో గౌరవెల్లిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా.. ‘ఐటీఐలు కాలం చెల్లిపోయిన శిక్షణలు ఇచ్చేవి. డీజిల్ మెకానిక్ రిపేర్ చేసే అంబాసిడర్ కార్లు షెడ్డుకు పోయాయి. నేర్చుకున్న విద్యార్థులు ఫాం హౌజ్‌లో ఉన్న కారు రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆడీ, బెంజ్ కార్లు వచ్చాయి. అందుకే ఐటీఐ కాలేజీలన్నింటినీ ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతీ విద్యార్థికి నెలనెలా రూ.2 వేలు ఇస్తున్నాం. నిరుద్యోగులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరుకావాల్సి ఉండగా సాయంత్రం 5.30 గంటలకు సభావేదిక పైకి వచ్చారు. సీఎం ఆలస్యంగా రావడంతో కొంతమంది వెళ్లిపోయారు. -
నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రూ.262.78 కోట్లతో హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరవలేనన్నారు. ‘‘మీ ఓటుతో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రజాపాలనను తీసుకొచ్చిన రోజు డిసెంబర్ 3. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోంది’’ అని రేవంత్ చెప్పారు. ‘‘బీఆర్ఎస్ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరమైపోయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ ఎలా ఉంది. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో మీరే ఆలోచించండి. దేశంలో భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకూ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణా వరి దిగుబడుల్లో నంబర్ వన్ స్టేట్‌గా నిల్చింది. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు కావాలంటే దొర గడీ ముందు చేతులు కట్టి నిల్చోవాల్సిన పరిస్థితి. ఆనాడు దొడ్డుబియ్యం ఇస్తే, మనం ఈరోజు 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం...మీ పక్కన్నే గజ్వేల్, మరోవైపు సిద్ధిపేట, ఇంకోవైపు సిరిసిల్ల ఉన్నాయి. వాటిని దేవుళ్లేమైనా పాలిస్తున్నారా..?. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయిగానీ, ఇక్కడి గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదో మీరు ఆలోచించాలి. ఇక్కడ ఓ ఆదర్శ గ్రామం అని చెప్పి చిన్నముల్కనూరును నాడు కేసీఆర్ ఏం చేశాడో మీకు తెలుసు. మేం వాళ్లలా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకే మంత్రి పొన్నం నా ముందు పెట్టిన అన్ని విజ్ఞప్తులకూ నిధులందిస్తామని హామీ. ఆ సర్కార్ లో ఎవ్వరికీ పదేళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ, మేం ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తాం.ఇవాళ మంచి ప్రభుత్వముంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా ముందుకెళ్తాయో, గ్రామాల్లో కూడా మంచి సర్పంచ్‌ను ఎన్నుకుంటేనే మీ గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మంచివాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. వీలైనంతగా ఏకగ్రీవం చేసుకునే యత్నం చేయాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్.. సర్పంచులు కిరికిరిగాళ్లు వస్తే గ్రామాలు తిరోగమనం పడతాయంటూ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు మోదీని ఆహ్వానించిన సీఎం
-
పవన్ సినిమాలు ఆపుతారా.. హిందూ దేవుళ్లను రేవంత్ ఏమన్నారు..
-
హయత్ నగర్ ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
ప్రధానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఆహ్వానం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు.సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
హయత్ నగర్ ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ (Hayathnagar)లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్ (Premchand)పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే, హయత్‌నగర్‌లో బాలుడిపై కుక్కల దాడి వార్తను పత్రికల్లో చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు బాధిత కుటుంబాన్ని వెంటనే కలవాలని, వారి బాగోగులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.ఇదిలా ఉండగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. తాపీ పనులు చేసుకుంటూ హయత్ నగర్ శివగంగ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు ప్రేమ్ చంద్ (7) పుట్టుకతోనే మూగవాడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో తాగునీరు పడుతోంది. ఆ క్రమంలో ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వచ్చిన ప్రేమ్ చంద్‌పై దాదాపు 10 నుంచి 12 వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. స్థానికులు గమనించి కుక్కల్ని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలుడి చెవి ఊడిపోగా, మెడ, చెవి, నడుము, పిక్కలతోపాటు శరీరమంతా తీవ్ర గాయాలతో రక్తసిక్తమైంది.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలు పెరిగిపోయి తాము బయటకు వెళ్లాలంటేనే ఎంతో భయపడుతున్నామని, ఈ విషయమై ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాలుడి వైద్యానికి సంబంధించిన ఖర్చులను జీహెచ్ఎంసీ భరించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇలాంటి సంఘటనలు తరుచుగా రిపీట్ అవుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
హిందూ దేవుళ్ల జోలికొస్తే..!
-
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్.. మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు హాజరు కావాలని ఆహా్వనించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపైనా ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది. ఈ సమ్మిట్ రాష్ట్రం తన అభివృద్ధి దృక్పథం, ప్రధాన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక తెలంగాణ రైజింగ్–2047 రోడ్ మ్యాప్‌ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం పార్లమెంటులో పీఎం నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని కూడా సీఎం కలవనున్నారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తారు. -
హాఫ్‌కో, ఫుల్లుకో ఓటేయొద్దు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రాష్ట్రంలో మంచి ప్రభు త్వం ఉంటే సరిపోదు.. మంచి సర్పంచ్‌లు కూడా ఉండాలి. మంత్రులతో కలిసి పని చేసే సర్పంచ్ మీ ఊర్లో లేకపోతే పనులు జరగవు. అందుకే హాఫ్‌కో, ఫుల్లుకో ఓటు వేయొ ద్దు.. గ్రామాలు దెబ్బతింటాయి. రెండేళ్ల క్రితం మీరు మంచి ప్రభుత్వం కావాలని ఓటేస్తే ప్రజా పాలన వచి్చంది. మంచి ప్రభుత్వం ఉంది కాబట్టే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత కరెంట్ వంటి పథకాలు వస్తున్నాయి. రాజకీయ కక్షలు మానుకుని పదేళ్లు అండగా ఉంటే, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణి లాంటి సంస్థలు నెలకొల్పేందుకే.. ‘ఈ ప్రాంతంలో ఉన్న సహజ సంపదలను గుర్తించి, సింగరేణి లాంటి మరిన్ని సంస్థలను నెలకొల్పాలనే లక్ష్యంతోనే డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాం. ఆనాడు ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందలాది ఎకరాల భూములను ఈ ప్రాంత రైతులు ఇస్తే.. ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారికి దక్కాయి. దీన్ని వ్యతిరేకిస్తూ తొలి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పాల్వంచలోనే పడ్డాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్వారా నెరవేర్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు దక్కుతుంది. అందుకే ఈ ప్రాంతంలో నెలకొలి్పన యూనివర్సిటీకి ఆ మహనీయుడి పేరు పెట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. నెహ్రూ స్ఫూర్తితో ఇరిగేషన్, విద్యా రంగాలపై దృష్టి ‘స్వతంత్ర భారతదేశంలో అప్పట్లో ఉన్న ఆకలి కేకలను పోగొట్టి స్వయం సమృద్ధి సాధించాలంటే నీటి పారుదల, విద్యారంగాలే ప్రధానమని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ భావించారు. అందువల్లే నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఆయన హయాంలో ఏర్పాటయ్యాయి. నెహ్రూ చూపిన స్ఫూర్తితోనే ఆరంగాలపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగాల్లో మేము తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్‌లో రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడతాయి.కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని బీడు భూముల్లో పారాల్సి ఉందని, తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పదేళ్లలో ఉన్న ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఆ పని జరగలేదు. ఎంత ఖర్చు అయినా సీతారామతో సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని, రాహుల్, ఖర్గేలను ఆహ్వానించాల్సి ఉంది కాబట్టి త్వరగా ముగిస్తున్నానని, మళ్లీ ఒకసారి మీ దగ్గరకు వస్తానంటూ సీఎం తన ప్రసంగాన్ని 12 నిమిషాల్లోనే ముగించారు. ఈ వర్సిటీ దేశానికే దిక్సూచి డాక్టర్ మన్మోహన్సింగ్ వర్సిటీ దేశానికే దిక్సూచి వంటిదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ యూనివర్సిటికీ సంబంధించిన అన్ని రకాల మౌలిక వసతులను సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రపంచంలో అక్కడక్కడ ఉన్న మంచి కోర్సులన్నింటినీ ఒక చోటకు తెచ్చి ఎర్త్ సైన్సెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మన్మోహన్ సింగ్ పేరును ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి పెట్టడం ఈ ప్రాంత ప్రజలకు లభించిన ప్రత్యేక గౌరవమని మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరామ్ నాయక్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రావాల్సి ఉంది. కానీ సాయంత్రం 5:06 గంటలకు వచ్చారు. -
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌బాల్ ఆడుతుంటే కాళ్లతో తంతారు. అలా తంతారని, కాళ్లు తగులుతాయని ఫుట్‌బాల్ ఆడకుండా ఉంటామా? అలా కాలితో తన్నడమే ఫుట్‌బాల్ గేమ్ రూల్. అలాగే రాజకీయాల్లో కూడా కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అదే రాజకీయాల గేమ్‌రూల్. ఆ కట్టెలను తీసి పక్కన పెట్టి ముందుకెళుతుండాలి. నా కాళ్లలో కట్టెలు పెట్టారు. నేను బోర్లా పడిపోతాను. ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపాలి అంటే కుదరదు. రాజకీయాల్లో మనమే లేవాలి.’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, రాహుల్‌గాంధీ లాంటి వారిని ఇబ్బంది పెట్టాలని జీ–23 పేరుతో లేఖలు వస్తుంటాయని చెప్పారు. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే పార్టీ 140 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉందని, లేదంటే జనతా పార్టీలాగానో, ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనో కనుమరుగయ్యేదని అన్నారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవికి సమయస్ఫూర్తి ముఖ్యం ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం, మంత్రులు కావడం కంటే పార్టీ అధ్యక్షుడు కావడమే కష్టం. డీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీ కుటుంబానికి పెద్దలా వ్యవహరించాలి. ఈ పదవికి వయసు ముఖ్యం కాదు. అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే సమయస్ఫూర్తి ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదు. డీసీసీ అధ్యక్షుల విషయంలోనూ అంతే. మన సమాజంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలుంటాయి. దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు. డీసీసీ అధ్యక్షుల విషయంలో ఎలా సాధ్యమవుతుంది? మీరు డీసీసీ అధ్యక్షులు అవడం కొందరికి ఇబ్బంది కావచ్చు. మీరే వెళ్లి వారితో మాట్లాడండి. సీనియర్ల దగ్గరికెళ్లి కలిసి పనిచేద్దామని అడగండి. పదవి రాకముందు అనేక సమస్యలుంటాయి. పదవి వచి్చన తర్వాత అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. పనిచేసే క్రమంలో వచ్చే సమస్యలను పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆరు నెలలే మీకు సమయం ‘కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన వారికి ఆరునెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతి నెలా రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసే దిశలో ఎవరు పనిచేయకపోయినా అధ్యక్ష పదవి ఉండదు..’ అని రేవంత్ అన్నారు. అభివృద్ధిపై చర్చ పెట్టండి ‘రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, చేసింది చెప్పుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అందరి కృషితో రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశలో నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ చేరవేయండి. అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదికపై చర్చ పెట్టండి. పెళ్లి, చావు, దావత్, కల్లు కాంపౌండ్లు.. ఇలా ఎక్కడైనా నాటి, నేటి పాలన గురించి చర్చ పెట్టండి. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు సారె కింద కోటి చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆడబిడ్డల దగ్గరికి చేర్చడం డీసీసీ అధ్యక్షులుగా మీ టాస్క్. ఏ ఆడబిడ్డా మాకు చీర రాలేదని చెప్పొద్దు. అలా చెపితే డీసీసీ అధ్యక్షులుగా మీరు పనిచేయనట్టే..’ అని సీఎం అన్నారు.మోదీ, అమిత్‌షాకు భయపడేవారెవరూ లేరు.. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ భయపడబోదు. మోదీ, అమిత్‌షాలకు భయపడేవారు ఇక్కడెవరూ లేరు. తమ ప్రాణాలనే కాదు ఆస్తులను కూడా త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కష్టపెడితే దేశ ప్రజలను కష్టపెట్టినట్టే. ఓట్ చోరీ అంశం దృష్టి మరల్చేందుకే ఈ కేసులు పెడుతున్నారు. ఇలాంటి చర్యలను దేశం సహించదు. గాంధీ కుటుంబానికి మనం అండగా నిలబడదాం. ఎందాకైనా పోరాడదాం. రావాల్సినవి ఇవ్వకపోతే కేంద్రాన్ని నేలమట్టం చేస్తాం మోదీ గుజరాత్‌కు ప్రధానిలా కాదు..దేశానికి ప్రధానిలా వ్యవహరించాలి. బుల్లెట్ ట్రైన్ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఒకటికి పదిసార్లు అడుగుతాం. ఇస్తే సరి..ఇవ్వకపోతే నేల మట్టం చేస్తాం. తెలంగాణ ప్రజల వ్యవహారం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూస్తుంది..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా సోనియా, రాహుల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2029లో రాహుల్‌ను ప్రధానిని చేయాలి మీనాక్షి మాట్లాడుతూ.. గుజరాత్ డీసీసీ అధ్యక్షుల పనితీరును ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది మనకు పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే 2028లో జరిగే పరీక్షలో గెలుస్తాం. ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసుకోగలం. అలా చేసుకోలేకపోతే మీరు నేను ఉండి ప్రయోజనం లేదు.’ అని వ్యాఖ్యానించారు. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసుకుంటూ వెళుతుంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గుర్తిస్తారని చెప్పారు. ఈ రోజు పనిచేసి రేపే ఫలితం రావాలంటే కుదరదని అన్నారు. డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, డీసీసీల కొత్త, పాత అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు పాల్గొన్నారు. కొందర్ని గదిలో వేసి కొట్టాలనిపించేది – సీఎం రేవంత్‌రెడ్డి నాకు ముఖ్యమంత్రి కాక ముందు చాలామంది మీద కోపంగా ఉండేది. కొంతమందిని గదిలో వేసి కట్టె తీసుకుని అలసి పోయేంతవరకు కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టా. మన శక్తినెందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పని మీద ఉన్నా. -
నేను చచ్చి బతికాను ఏడ్చేసిన సౌదీ మృత్యుంజయుడు
-
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
మరో 400 వృక్షాలకూ రక్షణ.. చేవెళ్ల హైవే విస్తరణకు రోడ్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ హైవేలో నగర శివారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణలో భారీ మర్రి వృక్షాలను నరికివేయకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేసిన పోరాటం, ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న ఇతర జాతుల భారీ వృక్షాలకూ రక్షణ కవచం కలి్పంచింది. 915 మర్రి వృక్షాలను తొలగించకుండా చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వృక్షాల రక్షణకు ఎలాగూ చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో, వాటితోపాటు ఆ రోడ్డు మీద ఉన్న 400 ఇతర రకాల భారీ వృక్షాలను కూడా రక్షించేలా రోడ్‌మ్యాప్‌లో చేర్చాలని అటవీశాఖ చేసిన సూచనకు ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. వెరసి 1,315 భారీ వృక్షాలు దర్జాగా నిలిచే ఉంటాయి. ఎట్టకేలకు పనులు...: పదేళ్లలో 365 నిండు ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల (బీజాపూర్ జాతీయ రహదారిలో భాగం) హైవే విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తరచూ భారీ ప్రమాదాలతో ఈ రోడ్డు రక్తసిక్తమవుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం కంకర లోడుతో వేగంగా వచ్చి అదుపు తప్పిన ట్రక్కు ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకుపోవటంతో 19 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సెంట్రల్ మీడియన్ లేకుండా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్డును ఇప్పుడు నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఎన్జీటీ తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపటం, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం అలైన్మెంట్లో మార్పులు చేయగా, నాలుగేళ్లుగా నలుగుతున్న కేసు కొలిక్కి వచి్చంది. విస్తరణ ప్లాన్‌ను మార్చిన ఫలితంగా కేవలం 136 మర్రి వృక్షాలు మాత్రమే రోడ్డు విస్తరణకు అడ్డుగా మారాయి. మిగతా 779 వృక్షాలు ఉన్నవి ఉన్నచోటనే కొనసాగనున్నాయి. వాటి కొమ్మలను మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అడ్డుగా ఉన్న 136 వృక్షాలను రోడ్డుకు కాస్త పక్కకు ట్రాన్స్‌లొకేట్ చేయాల్సి ఉంది. కేసు వేసిన వృక్ష ప్రేమికులు దీనికి సానుకూలత వ్యక్తం చేయటంతో ఎన్జీటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేసే అంశంపై లిఖితపూర్వక హామీ కూడా ఇవ్వటంతో రోడ్డు విస్తరణకు అనుమతిస్తూ గత నెల 12న ఎన్జీటీ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఎన్హెచ్ఏఐ విస్తరణ పనులు ప్రారంభించింది. అప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించి ఉండంతో, ఎలాంటి జాప్యం లేకుండా పనులు ఆరంభమయ్యాయి. ఆ 46 కిలోమీటర్ల దూరం.... అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలోని మన్నెగూడ కూడలి వరకు 60 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరించాల్సి ఉంది. ఇందుకు రెండేళ్ల సమయం పట్టనుంది. కానీ, కోర్టు కేసు మూలంగా జాప్యం అయినందున అంతకంటే ముందే పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో నిర్మాణ సంస్థ ప్రతి 10 కి.మీ.కు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి, మొత్తం నాలుగు బృందాలతో పనులు మొదలుపెట్టింది. దీంతో సమాంతరంగా నాలుగు చోట్ల పనులు ఒకేసారి జరుగుతున్నందున ఏడాదిన్నరలోనే పూర్తి అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆ చెట్లకూ రక్షణ మర్రి వృక్షాలను రక్షించేందుకు చేసిన పోరాటం మరో 400 ఇతర వృక్షాల రక్షణకు కారణమైంది. మర్రి వృక్షాల మధ్య మరో 1,600 ఇతర చెట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో 400 పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ పెద్ద చెట్లను పరిరక్షించాలని ట్రీ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఎలాగూ మర్రి వృక్షాలను రక్షించేందుకు అలైన్మెంట్లో మార్పులు చేసిన నేపథ్యంలో, ఈ ఇతర 400 పెద్ద చెట్లను కాపాడనున్నట్టు ఎన్హెచ్ఏఐ హామీ ఇచి్చంది. వాటిల్లో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న వాటిని కాస్త పక్కకు ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి నాటనున్నారు. వీటిల్లో వేప, రావి, మేడి లాంటి చెట్లున్నాయి. కాస్త చిన్నగా ఉన్న మిగతా 1,100 చెట్లను కొట్టేస్తారు.ఇప్పటికే అటవీ శాఖ అనుమతించటంతో వాటిని కొట్టేసే పని కూడా మొదలైంది. -
పరిశ్రమలే కీలకం.. డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సంపన్న, సమానత్వ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’విజన్ డాక్యుమెంట్లో పరిశ్రమల శాఖకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో పరిశ్రమలు, ఐటీ రంగాలు కీలక పాత్ర పోషించేలా డాక్యుమెంటుకు రూపకల్పన జరుగుతోంది. మేధో వలసను అరికట్టడంతో పాటు ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ స్టార్టప్‌లు, టూరిజం, సూక్ష్మ చిన్న పరిశ్రమలు, ఎగుమతులు తదితరాల ద్వారా లక్ష్యాన్ని సాధించేలా కసరత్తు జరుగుతోంది. ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ డాక్యుమెంటు రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. త్వరలో ఈ డాక్యుమెంటుకు తుదిరూపు ఇచ్చేందుకు డ్రాఫ్టింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. వెన్నెముకగా మూడు కారిడార్లు హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– విజయవాడ పారిశ్రామిక కారిడార్లు, చిన్న తరహా పారిశ్రామిక పట్టణాలు, మెగా పారిశ్రామిక పార్కులు, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలను బలోపేతం చేసేలా విజన్ డాక్యుమెంటులో పొందుపరుస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచేందుకు అనువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెంచేలా కసరత్తు జరుగుతోంది. డీప్ టెక్, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్తలో ఐటీ, పారిశ్రామిక రంగాలను భాగస్వామ్యం కల్పించేలా విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన జరుగుతోంది. తెలంగాణ భవిష్యత్తుకు మూల స్తంభాలను రంగాల వారీగా పేర్కొంటున్నారు. తెలంగాణ అభివృద్ధిలో మూల స్తంభాలు ఐటీ రంగం: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేథస్సు, క్వాంటం కంప్యూటింగ్, డిజిటల్ పరిపాలన, వీఎల్ఎస్ఐ, రోబోటిక్స్, హార్డ్‌వేర్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ వాతావరణం. పరిశ్రమలు, తయారీ రంగం: ఔషధ, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అడ్వాన్సుడ్ మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, ఫ్యాషన్, గనులు, ఖనిజాలు -
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు,సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ ని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు ‘ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే, సంక్షోభంలో ఉన్న రాష్టాన్ని గాడిన పెట్టాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దాయన ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆయనకు అవకాశం కలి్పంచారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. సాగునీటి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా సంగబండలో బండ పగులకొట్టడానికి రూ.12 కోట్లు ఇవ్వలేదు. మనకు సాగు, తాగునీరు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు..’ అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దండుకట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి.. ‘ప్రస్తుతం పాలమూరు ప్రజలు వారి బిడ్డను ఆశీర్వదించి సీఎం చేయడంతో మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల్లో భూములు కోల్పోయిన వారికి సహాయ, పునరావాసాన్ని (ఆర్అండ్ఆర్) నూటికి నూరు శాతం మంజూరు చేసి అమలు చేస్తాం. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీఓ కోసం గొంతెత్తి మాట్లాడినా అప్పట్లో మన బాధను ఎవరూ వినలేదు. ఇప్పడు కూడా కుట్రలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నిస్తే ..కేసులు వేసి ఏడాదిన్నరగా నిలిపి వేయించారు. కానీ మంత్రి శ్రీహరి రైతులతో మాట్లాడి 96 శాతం రైతులను ఒప్పించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కోసం దండుకట్టి. గుంపు కట్టి రెండేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగించండి. రాతింబ్రవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించే వారిని స్పర్పంచ్లుగా ఎన్నుకోవాలి ‘మీరు ఒక్క ఓటు వేస్తే ఇన్ని సమస్యలు తీరాయి. 2023లో ఊరు గెలిచాం. ఇప్పుడు రచ్చ గెలవాలి. ఇంకా పదేళ్లు ఉంటే అన్నీ చేయొచ్చు. ప్రభుత్వం కాళ్ల కింద కట్టె పెట్టే వారిని సర్పంచ్‌గా చేస్తే ఊరు దెబ్బతింటది. గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఎవరి మాటలో నమ్మి ఓట్లు వేస్తే గోస పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలి. మన సమస్య తెలిసి పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి..’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సభకు ముందు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి వాకిటి భావోద్వేగం సీఎం బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచి్చనా బాధలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వచి్చన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. కానీ మీ ప్రవర్తనతో మనసు గాయపడింది..’ అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో ఎప్పుడైనా రెండేళ్లలో రూ.1,000 కోట్లు వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు మరోసారి చేయకండి..’ అని కోరారు. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. -
లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి: సీఎం రేవంత్
నారాయణపేట: మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ హయాంలో మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు రేవంత్. మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కొడంగల్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తాం. భూములిచ్చిన రైతులకు రూ 20 లక్షల పరిహారం ఇస్తున్నాం. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలి. దండు కట్టండి.. దగ్గరుండి పనిచేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి.ఇరిగేషన్‌తో పాటు విద్యకూ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతీ పేదబిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాం. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పక్కనే ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని సోయి 70 ఏళ్లుగా పాలకులు లేకుండా పోయింది. ఆ పని నేను చేస్తున్నందుకు ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. రెండేళ్లలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. సన్నబియ్యం ఇస్తున్నాం. బీసీల జనాభా 56 శాతం ఉన్న లెక్క తేల్చిన ఘనత మాది. గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. అభివృద్ధి ఆకాంక్షించే వారిని సర్పంచ్‌గా గెలిపించాలి’ అని సీఎం రేవంత్ సూచించారు. -
TS: రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
-
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రేవంత్ సరికొత్త స్ట్రాటజీ..!
-
ఆసక్తికర పోరుకు సీఎం రేవంత్ సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తో సీఎం రేవంత్‌రెడ్డి తలపడనున్నారు. అదేంటి... మెస్సీతో రేవంత్ తలపడటమేంటని అనుకుంటున్నారా...ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ఆడటమే కాదు.. ఇద్దరూ రెండు టీంలతో ప్రత్య ర్థులుగా తలపడనున్నారు. ఇందుకు ఈనెల 13న ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్ ఖరారైందని, ఆర్ఆర్–9, ఎల్ ఎం–10 టీంల మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరుగుతుంది. -
ప్రజల ఆస్తి కాంగ్రెస్‌కు ఏటీఎం.. రాహుల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షల కోట్ల విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారుస్తామంటే ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతానికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీకి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్‌పి)ని భారత్‌లోని అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసీ మౌనంగా ఉందా?’అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేటాయించాయని వివరించారు. అయితే, ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను హిల్ట్‌పి కింద తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకు క్రమబద్ధీస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం ఈ పాలసీలో దాగున్న రాజకీయ అవినీతిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల కోసమే... ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలని పైకి చెబుతున్నా.. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే, తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని చెప్పారు. ఈ భూముల బదిలీ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని వివరించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ‘ఈ విధానాన్ని కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు తమ కోసం ఈ పాలసీని తెచ్చారు’అని కేటీఆర్ ఆరోపించారు. స్పందించకుంటే మీకూ భాగస్వామ్యం ఉన్నట్లే..: ‘పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణాన్ని అడ్డుకోండి. మౌనంగా ఉంటే మీకు (రాహుల్ గాం«దీని ఉద్దేశించి), కాంగ్రెస్ పారీ్టకి భాగస్వామ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ భూ కుంభకోణం జరుగుతున్నదని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఈ జిల్లాలకు సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ముందుకువెళ్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరుతో డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 9న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడానికి భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతామన్నారు. -
తెలంగాణ అభివృద్ధికి మూడు సూత్రాలు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్‌కు తెలంగాణ రైజింగ్ 2047 అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.‘‘విజన్ డాక్యుమెంట్లో లక్షలాది మందిని భాగం చేశాం. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్నదే మా లక్ష్యం. ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థల సలహాలు కూడా తీసకున్నాం. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నామని వివరించారు. కోర్ అర్బన్, రీజియన్ ఎకనామిగా హైదరాబాద్ మాడిఫికేషన్ చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు ఉండడం వల్ల వ్యవస్థల మధ్య సమన్యాయం లోపిస్తుంది. అందుకే కోర్ అర్బన్ రీజియన్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కాలుష్య రహితనగరంగా హైదరాబాద్‌ను మారుస్తాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలిస్తాం. కోర్ అర్బన్ రీజియన్‌ను తీసుకొస్తున్నాం. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంతో పాటు రామగుండంలో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. కోర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. సమగ్రంగా మూడు రీజియన్ల అభివృద్ధి చేపడతాం. సర్వీస్ సెక్టార్‌గా కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి చేస్తాం. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్‌గా గుర్తించాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎల్) పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. డిసెంబర్ 6 గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఐఎస్ఆర్ఎల్ రౌండ్ 2 రేసింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. ఐఎస్ఆర్ఎల్ (ISRL) వ్యవస్థాపకులు, నిర్వాహకులు అయిన ఇషాన్ లోఖండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి ఫ్రాంచైజీ బేస్డ్ రేసింగ్ లీగ్ అయిన సూపర్ క్రాస్ రేసింగ్ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దీనికి హాజరు కానుండటం విశేషం. ఐఎస్ఆర్ఎల్ నిర్వహణకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా తాము ప్రోత్సహిస్తున్న వివిధ క్రీడా, పర్యాటక కార్యక్రమాల్లో భాగంగా దీనిని నిర్వహిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఆసక్తి గల అభిమానులు బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఐఎస్ఆర్ఎల్ ఫైనల్ రేసు డిసెంబర్ 21న కోల్‌కతాలో జరుగుతుంది. -
నేడు మంత్రులతో సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం తన మంత్రివర్గ సహచరులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీలో వచ్చే నెల 8–9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి చర్చించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ గురించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రూపొందించిన ప్రజెంటేషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ సమావేశంలోనే ఆయన మంత్రులకు పని విభజన చేయనున్నారు.దీని గురించి ఆదివారం సాయంత్రం సీఎం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. శనివారం కూడా సీఎం రేవంత్‌ను పలువురు మంత్రులు కలిశారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సీఎంను కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించారని, ప్రజా పాలన వారోత్సవాల నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. -
తెలంగాణ విలన్ కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కథలో విలన్, శాశ్వత శత్రువు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యేనని చెప్పారు. తెలంగాణ చరిత్రలో మూడు తరాలను ముంచి రక్తం తాగిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’నినాదంతో ఆమరణ దీక్ష చేస్తే విరమించుకోవాలని నాడు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వేడుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని గుర్తు చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘దీక్షా దివస్’లో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను మింగడానికి కాంగ్రెస్ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని మండిపడ్డారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కౌరవులు, సైంధవులు, మారీచుల్లా పన్నాగాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.మేడిగడ్డ బరాజ్‌ను పేల్చేసే దుర్మార్గం ‘తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం బరాజ్‌ను బాంబులతో పేల్చే దుర్మార్గం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దు్రష్పచారం చేస్తూ గోదావరి జలాలు మనకు దక్కకుండా కుట్ర జరుగుతోంది. కేసీఆర్ మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది. కేసీఆర్ మాట్లాడినా.. మౌనంగా ఉన్నా సంచలనమే. ఎదురుదాడి ఎప్పుడు చేయాలో, వెనుకడుగు ఎక్కడ వేయాలో తెలిసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన మాయల ఫకీర్లు తెలంగాణ చరిత్రను తుడిచేస్తామని విర్రవీగుతున్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో ఢిల్లీ తోలు»ొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు కనిపిస్తున్నారు. నెలకు మూడుమార్లు ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టి వచ్చే సామంతులను చూస్తున్నాం. ఎనిమిదేసి మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలున్నా పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించేవారు లేరు. గులాముల నుంచి తెలంగాణను కాపాడి వచ్చే కాలంలో గులాబీ జెండా ఎగురవేస్తాం. కుంభకోణాల కుంభకర్ణుల భరతం పట్టి తెలంగాణ సింహాసనం మీద కేసీఆర్‌ను మళ్లీ కూర్చోబెడతాం. మన అమ్మ తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ బొమ్మను పెట్టి బతుకమ్మను మాయం చేశారు. తెలంగాణ చేతిలో మళ్లీ బతుకమ్మను పెడదాం’అని కేటీఆర్ చెప్పారు. ఉద్యమ ఘట్టాలతో ఫొటో ప్రదర్శన దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతోపాటు అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఉద్యమ ఘట్టాలతో కూడిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసి వీక్షించారు. మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు ప్రసంగించారు. చరిత్రను మలుపుతిప్పిన సందర్భం ‘తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన సమున్నత సందర్భం కేసీఆర్ ఆమరణ దీక్ష. ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్ చేసిన దీక్షతో పార్లమెంటు కంపించి డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఆ తర్వాత కేంద్రం వెనక్కి తగ్గినా రాజీలేని పోరాటం, రాజీనామాలు, పదవీ త్యాగాలతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. బాలనాగమ్మ కథలో తల్లిని కాపాడుకున్న బాలవర్దిరాజులా తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన తనయుడు కేసీఆర్. తెలంగాణ ఎవడి భిక్ష కాదు, ఢిల్లీ మెడలు వంచి సాధించాం. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ వేదికగా సోనియా గాం«దీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిరిగా ఏనాడూ తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని మేము అనలేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రభుత్వం భారీయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన 3 వేల మంది ప్రముఖులను ఆహ్వానించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మ కంగా సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయంగా పేరున్న పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు హాజరు కానున్నారు. యూఏఈ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ ఖాసిమీ, రస్ అల్ ఖైమా, డ్యూచ్ సె గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెనెట్ నియోతో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌ల వ్యవస్థాప కులు రానున్నారు. ఇక వివిధ రంగాల ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట స్వయంగా ఆహ్వానాలు పంపిస్తున్నారు. తప్పకుండా రండి..‘వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యు మెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025ను నిర్వహిస్తు న్నాం, తప్పకుండా రండి..’ అనే ప్రభుత్వ ఆహ్వానానికి పలు దేశాల ప్రతినిధులు సమ్మతి తెలిపారని సీఎంవో వర్గాలు తెలిపాయి.రెండు రోజుల పాటు జరిగే సదస్సులో భాగంగా డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. -
సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దాదాపు గంటసేపు జరిగిన ప్రత్యేక భేటీలో పంచాయతీ ఎన్ని కలు, ప్రజాపాలన వారోత్సవాల గురించి ఇరువురు చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్టు తెలిసింది. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఆ మేరకు రిజర్వేషన్ల కల్పనపై సాధ్యాసాధ్యాల గురించి వీరు చర్చించినట్టు సమాచారం.ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల బీసీలకు అవకాశం వచ్చేలా చూడాలని, సర్పంచ్ స్థానాలకు పోటీ పడే ఇతర వర్గాల నేతలకు నచ్చచెప్పాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాలుపంచుకునేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ పక్షాన పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.అందులో భాగంగా డిసెంబర్ రెండవ తేదీన గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తగా నియామకమైన నేతలతో సమావేశం నిర్వహించాలని, అదే రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించి దిశా నిర్దేశం చేయాలని సీఎం, పీసీసీ చీఫ్‌లు నిర్ణయించారు. మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్ష తన జరగబోయే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటారు. -
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. కాగా మెస్సీ తన టూర్లో భాగంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. -
సీఎం కాదు.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లా రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఒక సీఎంలా కాకుండా కేవలం రియ ల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చౌకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ఐదారు వందల మంది కోసం 5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్‌రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు చుక్కనీరు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్‌టి.రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజావ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్వీ విభాగం పాటను ఆవిష్కరించిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్వీ విభాగం పాటను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ పాటను బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించారు. గురువారం నందినగర్ కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీష్, బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు. -
మన రైజింగ్ ప్రతిబింబించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్..పాలసీ డాక్యుమెంటులో కనిపించాలన్నారు. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడే లక్ష్యాలతో ముందుకుపోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) అనే మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ (విధానపరంగా క్రియారాహిత్యం) ఉండదు అని చాటి చెప్పేలా డాక్యుమెంట్ ఉండాలన్నారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025పై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మహ్మద్ అజహరుద్దీన్, సీతక్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరంసీఎంఓ దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. విజన్ డాక్యుమెంట్ ఒక దార్శనిక పత్రం ‘రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం విజన్–2047కు సిద్ధమౌతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా వచ్చే 22 ఏళ్లకి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్‌ను కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే డిసెంబర్ 8, 9న నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో ప్లాన్ చేసింది. విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించటంతో పాటు వివిధ రూపాల్లో అందించే ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం. రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి,.. ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణను దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం..’ అని సీఎంఓ పేర్కొంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా.. ‘రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించింది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థికాభివృద్ధికి కీలకమైనవని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శక పాలన, సులభ అనుమతులు (ఈఓడీబీ), గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి. ఈ బలాలే పునాదిగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా డాక్యుమెంట్లో భాగమౌతోంది. నెట్–జీరో తెలంగాణను అవిష్కరించనుంది. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో స్వచ్చమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయనుంది..’ అని సీఎంఓ వివరించింది. హై–స్పీడ్ మొబిలిటీ కారిడార్లు ‘ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తుంది. హై–స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించనుంది. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయనుంది. ఏటా 2 లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా క్రీడా గ్రామాలు నిర్మితమవుతాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్టŠస్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది..’ అని సీఎంఓ తెలిపింది. -
మాపై లాఠీ ఛార్జ్ చేస్తారా..? రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్
-
రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అన్ని వర్గాల సంక్షేమానికి చిరునామాగా ఉన్న తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీ కుంభకోణాలకు కేంద్రంగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రూ.50 వేల కోట్ల అతి పెద్ద పవర్ స్కామ్‌కు రూపకల్పన చేసి 30 నుంచి 40శాతం కమీషన్లు దండుకునేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు.రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల «అంచనాలు పెంచి భారీ స్కామ్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రతీ చర్య వెనుకా ‘కమీషన్’అనే మిషన్ దాగుంటుందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట బడా స్కామ్ ‘రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్కోలో తక్కువ రేటుతో ముందుకు వచ్చే వారికి అవకాశమిస్తామని చెప్పడం పెద్ద డ్రామా. ఒక మెగావాట్ ఉత్పత్తికి ఎన్టీపీసీకి రూ.12.23 కోట్లు, జెన్కోకు రూ.14 కోట్లు అవుతుందని ఇప్పటికే డీపీఆర్‌లు ఇచ్చాయి. గతంలో యాదాద్రి ప్లాంటును రూ.8.63 కోట్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను రూ.9.74 కోట్లకే నిర్మించాం. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో యూనిట్ విద్యుత్‌కు రూ.5 వెచి్చంచడాన్ని తప్పుపట్టిన రేవంత్.. ఇప్పుడు రూ.8 నుంచి రూ.10 ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నాడు.800 మెగావాట్ల ఒక్కో ప్లాంటు నిర్మాణ వ్యయం రూ.10,880 కోట్లు కాస్తా పూర్తయ్యే నాటికి రూ.15 వేల కోట్లకు చేరుతుంది. అదే జరిగితే యూనిట్ విద్యుత్ వ్యయం రూ.10కి పెరుగుతుంది. మూడు 800 మెగావాట్ల సామర్ద్యం కలిగిన యూనిట్లకు రూ.50 వేల కోట్లు ఖర్చు అయితే అందులో 80 శాతం అప్పు, మరో 20శాతం జెన్కో ఖర్చు చేస్తుంది. చెప్పులు ఎత్తుకుపోయే వారికి రూ.40వేల కోట్ల అప్పు, రూ.10వేల కోట్ల పెట్టుబడి ఎలా వస్తాయో చెప్పాలి. ఎన్టీపీసీ నుంచి యూనిట్ ధర రూ.4.88 నుంచి రూ.5.96 వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఎన్టీపీసీ 2400 మెగావాట్లు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.12లకు సరఫరా చేస్తామని చెప్తున్నా ప్రభుత్వం తిరస్కరించింది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. యాదాద్రి వపర్ ప్లాంట్‌ను తాము అధికారంలోకి వస్తే మూసేస్తామన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు కొత్త థర్మల్ కేంద్రాలకు కేబినెట్లో ఆమోదం తెలిపితే.. ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బీజేపీ డైరెక్షన్లో రేవంత్ యాక్షన్ ‘లాభాలు తెచ్చే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ప్రైవేటీకరణ చేసి కమీషన్లు దండుకునే కుట్రకు రేవంత్ తెరలేపాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్లోనే రేవంత్ యాక్షన్ చేస్తుండు. రేవంత్ చేసిన అంతర్రాష్ట్ర స్కామ్ వివరాల సేకరణ 90 శాతం పూర్తయింది. త్వరలో హైదరాబాద్ అండర్‌గ్రౌండ్ కేబుల్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కామ్‌లను కూడా ఆధారాలతోసహా బయటపెడతాం. వాటాలు, కమిషన్ల కోసం కేబినెట్ మీటింగ్‌లు పెట్టి పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి సీఎం, మంత్రులు పరస్పరం నిందలు వేసుకుంటున్నారు.పరిశ్రమల భూముల బదలాయింపులో రూ.5 లక్షల కోట్లు దండుకునే కుట్ర సీఎంతోపాటు కేబినెట్ సబ్ కమిటీది కూడా అని మంత్రులు చెబుతున్నారు. కాంగ్రెస్ కుంభకోణాలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాకుంటే ప్రభుత్వ కుంభకోణాలపై కేంద్రం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు చెప్పారు. -
విమానయాన రంగానికి కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రస్తుతం సంస్కరణల ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థ సఫ్రాన్ రూ. 1,300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండ్రస్టియల్ పార్క్ సెజ్‌లో ఏర్పాటు చేసిన ‘లీప్’ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని (సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా) ప్రధాని బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు.వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కేంద్రంలో ఏటా 300 వాణిజ్య విమానాలకు చెందిన ‘లీప్’ఇంజిన్ల సరీ్వసింగ్ వీలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. సఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓగా మార్చేందుకు సహాయపడుతుంది’అని చెప్పారు.ఈ కేంద్రం విమానాయన రంగంలో దేశ యువతకు ప్రత్యేకించి దక్షిణాది ప్రాంత యువతీయువకులకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. సఫ్రాన్ బోర్డు, అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భారత్‌పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో సఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సఫ్రాన్ బృందానికి ప్రధాని అభినందనలు తెలియజేశారు. సఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేసిన విమాన ఇంజిన్ సర్వీస్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సంస్థ ప్రతినిధులు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి... భారత విమానయాన రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటని ప్రధాని మోదీ చెప్పారు. దేశీయ విమానయాన మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయన్న ఆయన.. వాటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. పెరిగిన ఎంఆర్ఓ అవసరం... విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నందున ఎంఆర్ఓ కేంద్రాల అవసరం కూడా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మరమ్మతుల కోసం దేశంలో 85 శాతం విమానాలు విదేశాలకు వెళ్తున్నాయని.. ఈ పరిణామం విమానయాన సంస్థల ఖర్చుల పెరుగుదల, సరీ్వసుల్లో జాప్యానికి కారణమవుతోందని మోదీ పేర్కొన్నారు. ఇది దేశ విమానయాన రంగానికి ఏమాత్రం మంచిది కాదని.. అందుకే ప్రపంచంలోని ప్రధాన ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటిగా భారత్‌ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.తొలిసారిగా ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డీప్ లెవెల్ సరీ్వసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని మోదీ తెలియజేశారు. సఫ్రాన్ అందించే అంతర్జాతీయ స్థాయి శిక్షణ, విజ్ఞాన బదిలీ, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం రాబోయే ఏళ్లలో మొత్తం ఎంఆర్ఓ వ్యవస్థకు కొత్త ఊపు, దిశను ఇచ్చే శ్రామిక శక్తిని తయారు చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. డిజైన్ ఇన్ ఇండియా.. ‘డిజైన్ ఇన్ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. ఈ నేపథ్యంలో భారత్‌లో విమాన ఇంజిన్, విడిభాగాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని మోదీ సఫ్రాన్ బృందాన్ని కోరారు. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో సఫ్రాన్ కంపెనీ విస్తృతంగా పనిచేస్తోందన్న ప్రధాని.. ప్రొపల్షన్ వ్యవస్థల డిజైన్, తయారీ కోసం కూడా భారత నైపుణ్యాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలని కంపెనీని కోరారు. ‘మేం పెద్ద కలలు కంటున్నాం. అంతకంటే పెద్ద పనులు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాం’అని ప్రధాని పేర్కొన్నారు. సులభతర వ్యాపారానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలోనూ 74 శాతం ఎఫ్‌డీఐ.. ప్రైవేటు రంగానికి అవకాశంలేని రక్షణ వంటి రంగాల్లోనూ ఇప్పుడు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతిచి్చనట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ కీలక విధానాన్ని అవలంబించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు ప్రపంచానికి ‘భారత్ పెట్టుబడులను స్వాగతిస్తుంది.. ఆవిష్కరణలను స్వాగతిస్తుంది’అనే స్పష్టమైన సందేశాన్ని పంపాయన్నారు.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు అంతర్జాతీయ తయారీదారులను భారత్‌లో తయారీ వైపు ఆకర్షించాయని ప్రధాని చెప్పారు. తమ పాలనలో 40 వేలకుపైగా నిబంధనలను తగ్గించి జాతీయ ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్‌లెస్ ట్యాక్స్ అసెస్మెంట్, కొత్త కారి్మక కోడ్లు, దివాలా కోడ్ వంటి చర్యల ఫలితంగా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు ఒక విశ్వసనీయ భాగస్వామిగా, ఒక ప్రధాన మార్కెట్‌గా, వేగంగా దూసుకుపోతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధికి ‘సఫ్రాన్’మైలురాయి: సీఎం రేవంత్‌రెడ్డి సఫ్రాన్ సంస్థ తమ కార్యకలాపాల విస్తరణకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర వృద్ధికి ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ‘లీప్’ఇంజిన్ల తొలి ఎంఆర్వో కేంద్రం ఇదేనన్నారు. ఈ కేంద్రంలో వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇది రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల్లో వినియోగించే ఎం88 సైనిక ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం సఫ్రాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న మరో ఎంఆర్ఓకు శంకుస్థాపన చేసుకున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌లోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమని చెప్పారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సీఎం తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని వ్యాఖ్యానించారు.9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను ఈ రంగం అధిగమించిందన్నారు. 100 ఐటీఐలను ఏటీఎస్లుగా మార్చామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విమానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర విజన్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు అందర్నీ ఆహ్వనిస్తున్నట్లు సీఎం తెలిపారు.బెంగళూరు–హైదరాబాద్‌ను డిఫెన్స్, ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంతి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సఫ్రాన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈవో, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫెన్ క్యూయల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్.: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(బుధవారం, నవంబర్ 26వ తేదీ) తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పీఎం మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలన్నారు. అలాగే దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్దం చేయాలన్నారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాన్ని అందించామని సీఎంకు తెలిపారు అధికారులు. సమ్మిట్ లో స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇన్ఫ్రా స్ట్రక్చర్, సంక్షేమం, ఇండస్ట్రీ, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించగా, ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, టైమ్ నిడివి ముందుగానే నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈవెంట్స్ వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్న సీఎం.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
‘రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారు’
వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల గొంంతుకోసారంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు(బుధవారం, నవంబర్ 26వ తేదీ) వరంగల్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీ విస్తరణ చేపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారు. తెలంగాణను రాహుల్‌కు ఏటీఎంలా మార్చారు’ అంటూ ధ్వజమెత్తారు. ఈరోజు కేటీఆర్.. వరంగల్ పర్యటనకె వెళ్లారు. ఉదయం 11:30 గంటలకు హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీరవెళ్లి భారత్ కుమార్‌రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు. అపై మధ్యాహ్నం 3 గంటలకు జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. -
రేవంత్‌కు పాత వాసనలు పోనట్టుంది!
ఈనాడు గ్రూపు అధినేత, దివంగత రామోజీరావు ఎన్నడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో చెప్పినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చెప్పిన ఈ మాటలను ఉమ్మడి ఏపీ రాజకీయాలను, విభజిత ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను గమనించిన వారెవ్వరూ నమ్మరనే చెప్పాలి.రేవంత్‌తోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామోజీ గుణగణాలను కీర్తిస్తూ ప్రజల పక్షాన నిలిచిన యోధుడు అని పేర్కొన్నారు. ఇలాంటి ఫంక్షన్స్‌లో ప్రశంసలు సహజం. కాని అవి అతిశయోక్తులుగా మారినప్పుడు, నమ్మదగినవిగా లేనప్పుడు, వాస్తవాలకు దూరంగా ఉన్నప్పుడే చర్చనీయాంశం అవుతాయి. 2009 శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడానికి నెల రోజుల ముందు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమి గెలుస్తుందన్న అంచనాతో, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారన్న నమ్మకంతో ఆ రోజుల్లో టీడీపీలో ఉన్న రేవంత్, మరో ముగ్గురు నేతలు రామోజీని కలిశారట.ఆ సందర్భంలో వీరు ప్రస్తావన చేయడానికి ముందే తానెప్పుడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పలేదని రామోజీ అన్నారట. మంత్రులుగా కన్నా ఎమ్మెల్యేలుగానే రాణిస్తారని తన దగ్గరకు వచ్చేవారికి సూచిస్తానని ఆయన చెప్పారని రేవంత్ వివరించారు. నిజానికి ఈ అంశంపై రేవంత్ కు క్లారిటీ ఉండదని అనుకోనవసరం లేదు. రామోజీ ఇలాంటివి ప్రోత్సహించరని రేవంత్, ఇతర టీడీపీ నేతలు భావించి ఉంటే అసలు ఆయనను కలిసేవారు కాదు కదా! రామోజీ ఏమి చెబితే అది చంద్రబాబు వింటారన్న అభిప్రాయమో, నమ్మకమో లేకుండా వీరు వెళతారా? రామోజీ మీడియా రంగ ప్రవేశం, ఆ తర్వాత రాజకీయాలను ప్రభావితం చేసిన తీరు పరిశీలనార్హమే. ఆయన తెలివిగా వ్యాపారాన్ని,రాజకీయాలను కలగలిపి తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు.1970లలో ఈనాడు మీడియా ఎదుగుదలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సహకారం తీసుకున్న విషయం వయసులో చిన్నవాడైన రేవంత్‌కు తెలియకపోవచ్చు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రామోజీ ఆ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇస్తూ అది చారిత్రక అవసరమని తన జర్నలిస్టులకు ఉద్బోధించారు. తెలుగుదేశం పార్టీ తన మీడియావల్లే అధికారంలోకి వచ్చిందన్న భావనను కల్పించగలిగారు. కానీ ఎన్టీరామారావుకు ఎన్.టి.రామారావుకు, ఆ పార్టీలో పలువురికి ఇది అంతగా నచ్చలేదు. ఎన్టీఆర్ బొమ్మలను తన పత్రికలో ముద్రిస్తూ రామోజీ సర్కులేషన్ పెంచుకున్నారన్నది వారి భావన. ఒక సందర్భంలో ఈ విషయమై ఎన్టీఆర్ వద్ద చర్చ కూడా జరిగింది.1983 శాసనసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో ఈనాడు సిబ్బంది గణనీయ పాత్ర పోషించింది. నియోజకవర్గాలలో టీడీపీ టిక్కెట్ కోరుకుంటున్న అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించి ఎన్టీఆర్‌కు తమ సిఫారసులను అందించేవారు. ఒక మీడియా సంస్థ ఇలా రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పనిచేయడం కరెక్టేనా? ఎమ్మెల్యే అభ్యర్ధులనే నిర్ణయించినవారు మంత్రి పదవులను కనీసం కొందరికైనా చెప్పి ఉండరంటే నమ్మగలమా? టీడీపీ పక్షాన పనిచేస్తే ప్రజల పక్షాన పనిచేసినట్లు అవుతుందేమో చంద్రబాబే వివరించాలి. అప్పట్లో వామపక్షాలు, జనత, లోక్‌దళ్ వంటి పార్టీలు కూటమిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవి. సరిగ్గా ఆ టైమ్‌లో ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో రాజకీయం మారిపోయింది. దాంతో టీడీపీ, వామపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. ఆ చర్చలు కూడా రామోజీ నివాసంలో జరిగాయని చెబుతారు. టీడీపీ గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పడప్పుడూ రామోజీని నివాసంలో కలుస్తుండేవారు. టీడీపీ విజయం సాధించడం, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయిన ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చేశారు. అప్పట్లో చంద్రబాబుపై కూడా ఈనాడు మీడియాలో కొంత వ్యతిరేక కథనాలు వచ్చేవి. కార్టూన్లు కూడా వేసేవారు, కాని తదుపరి కాలంలో ఎన్టీఆర్‌కు రామోజీకి మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. ఒక భవన నిర్మాణ అనుమతి విషయంలో వీరిద్దరికి తేడా వచ్చిందని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అలాగే రామోజీ తాను చెప్పినట్లు జరగాలని ఆశించేవారట. దానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని అంటారు. ఈ లోగా చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీని కలిసి తనపై వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు. కారణం ఏమైనా కాని 1989 ఎన్నికల సమయంలో ఈనాడు టీడీపీకి అనుకూలంగా లైన్ తీసుకోలేదని చెప్పాలి. ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు సీఎంలు రామోజీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి యత్నించకపోలేదు. కొన్నిసార్లు వారికి అనుకూలంగా వ్యహరించే వారు. అందులో తన వ్యాపార ప్రయోజనాలను కూడా చూసుకునేవారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల్లోని కొందరు నాయకులను ఆకట్టుకుని వారితో సంబంధాలు నెరపేవారు. అంతేకాదు.కొందరు ఐఏఎస్ అధికారులకు కూడా ప్రత్యేక విందులు ఇచ్చేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మరికొందరు టీడీపీ నేతలు తరచు రామోజీని సంప్రదించేవారు. మీడియా రంగంలో ఒక మెరుపులా వచ్చిన ఉదయం దినపత్రికను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సరిగా నడపలేక కాంగ్రెస్ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డికి బదలాయించారు. సరిగ్గా ఆ తరుణంలోనే నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి రామోజీ మద్దతు ఇచ్చారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమాగమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆహ్వానించి ఒక కార్యక్రమం పెట్టారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, విపక్ష నేత ఎన్టీఆర్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్పీచ్ విన్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి నచ్చక విజయభాస్కరరెడ్డి సభ నుంచి నిష్క్రమించారు. ఈనాడు మీడియాలో నిత్యం కొన్ని పేజీలు కేటాయించి సారా వ్యతిరేక ఉద్యమ వార్తలు ఇస్తుండే వారు. ఆ క్రమంలో కోట్ల ప్రభుత్వం సారాను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఈనాడు మీడియా ప్రచారం ఆగుతుందని ఆయన భావించారు. కాని రామోజీ ఆపలేదు. సంపూర్ణ మద్య నిషేధం చేయాలన్న డిమాండ్‌తో వార్తలు ఇచ్చేవారు. పలు చోట్ల కృత్రిమ ఆందోళనలు సృష్టించి ఆ వార్తలను కూడా ఇస్తుండేవారు. దీనిపై కోట్లకు అసంతృప్తి ఉండేది. తాను రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటుకు సహకరించి, కీలకమైన భూమి సుమారు పదెకరాలు కేటాయించానని అయినా రామోజీ ద్రోహ చింతనతో వ్యహరించారని కోట్ల వాపోయేవారు. ఇదంతా మాగుంటను దృష్టిలో పెట్టుకునే చేశారని చాలా మంది నమ్ముతారు. అప్పటికే మాగుంట మద్యం వ్యాపారంలో ఉండడంతో, ఆ డబ్బుతో పత్రికను సక్సెస్ చేస్తే తనకు నష్టం అని ఆయన భావించే ఇలా సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఎత్తుకున్నారన్నది పలువురి భావన. ఇంతలో ఎన్టీఆర్ ఇదే నినాదంతో జనంలోకి వెళ్లారు.1994లో అన్ని కలిసి వచ్చి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఒక దశలో రామోజీరావు సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. దాని అనుపానుల మీద అభిప్రాయ సేకరణ కూడా చేశారు. కాని ఎందువల్లో ముందుకు తీసుకువెళ్లలేదు. 1994లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని రామోజీ ఊహించలేదు. కొన్నిసీట్లు తక్కువ వస్తే ప్రత్యామ్నాయంగా రాజకీయం ఎలా చేయాలన్న దానిపై చంద్రబాబు వంటివారితో చర్చలు జరిగాయని కూడా ఆరోజుల్లో వినిపించేది. కాని అనూహ్య స్థాయిలో ఎన్టీఆర్ గెలిచారు. రామోజీతో తిరిగి ఎన్టీఆర్‌కు సత్సంబందాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా కొన్నిసార్లు చొరవ తీసుకున్నారు. అవన్ని పెద్దగా ఫలించలేదు. ఈలోగా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలపై ఈనాడులో దారుణమైన కార్టూన్లు వేయించడం, సంపాదకీయాలు రాయడం వంటివి జరిగాయి. తదుపరి టీడీపీలో జరిగిన పరిణామాలలో చంద్రబాబు కొమ్ముకాశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంలో రామోజీ ముఖ్య భూమిక పోషించారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీ ఏమి అనుకుంటే అది జరిగేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం చంద్రబాబు ప్రతి వారం రామోజీ ఇంటికి వెళ్లేవారు. ఇద్దరూ ప్రభుత్వ పార్టీ విషయాలను మాట్లాడుకునేవారు. అప్పుడే ఈయనకు రాజగురు అన్న పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మంత్రుల పేర్లు సిఫారస్ చేశారా ? లేదా? అన్నది చర్చకాదు. స్వతంత్రంగా ఉండవలసిన మీడియాను ఒక పార్టీకి అనుబంధంగా మార్చడం సరైనదేనా? అంశాల మీద రాయడం వేరు. స్వతంత్ర మీడియా ముసుగులో ఒక పార్టీ కొమ్ము కాయడం వేరు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో రామోజీ ఎవరిని సిఫారస్ చేయలేదన్నది మాత్రం అసత్యం. గుంటూరు జిల్లా టీడీపీ నేతకు మంత్రి పదవి రావడంలో, 2014 తర్వాత మరో ముఖ్యమైన పదవి రావడంలో రామోజీ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు మద్య నిషేధం ఎత్తి వేసినా ఒక సంపాదకీయం రాసేసి సరిపెట్టుకోవడంలో ఆయనకు ఉన్న హోటళ్లు, రామోజీ ఫిలిం సిటీ వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. రింగ్ రోడ్డులో తన భూమి కొంత కోల్పోవలసి వస్తోందన్న కోపంతో వైఎస్సార్‌పై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు. ఒక సందర్భంలో ‘‘ఉల్టాచోర్, కొత్వాల్ కో డాంటే’’ అంటూ ఒక సంపాదకీయం రాశారు. ఆ సమయంలోనే రామోజీ మార్గదర్శి ఫైనాన్స్‌లో చట్టవిరుద్దంగా సాగుతున్న డిపాజిట్ల సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెలుగులోకి తెచ్చారు. దానిపై వైఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంపై రామోజీ పగపట్టినట్లు వ్యవహరిస్తూ వచ్చారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌పై కూడా అదే ద్వేషంతో విష ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయినా, విపక్షంలో ఉన్నా ఇదే పద్దతి అనుసరిస్తుంటుంది. చంద్రబాబు ఏమి చేసినా సమర్థిస్తూ టీడీపీని భుజాన వేసుకుని ఈనాడు మీడియా పనిచేస్తోంది. ఆ రోజుల్లో టీడీపీలో రామోజీని రాజగురు అని కూడా సంబోధించే వారు .ఈనాడు మీడియాకు చంద్రబాబు విధేయుడుగా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం తన పాత వాసనలు మరవలేకపోతున్నారేమో అనిపిస్తుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కూల్చివేతలు
సాక్షి పెద్దపల్లి/ఓదెల/జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతోందని.. టెర్రరిస్టులకన్నా కాంగ్రెసోళ్లు దుర్మార్గులని దుయ్యబట్టారు. రైతులకు అవసరమైన చెక్‌డ్యాంలు, హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం తప్ప కాంగ్రెస్‌కు కట్టడం తెలియదని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా గుంపుల–కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల మధ్య మానేరుపై గత శుక్రవారం రాత్రి దుండగులు పేల్చేసిన చెక్‌డ్యామ్‌ను హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ మానేరుపై రూ. 24 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఇసుక మాఫియా వెనుక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. గతంలో పెద్దపల్లి మండలం భోజన్నపేట శివారులోని హుస్సేనిమియావాగు చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ నేతలు జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేసేందుకు యత్నించగా రైతులు పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినా ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పుడే దోషులను శిక్షించి ఉంటే గుంపుల చెక్‌డ్యామ్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ ఎల్ఎండీ గేట్లు ఎత్తినప్పుడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూలిపోని చెక్‌డ్యామ్.. నాణ్యత లోపంతో కూలిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఒకవేళ నాణ్యత లోపంతో కూలిపోతే చెక్‌డ్యామ్ నిర్మించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని, దోషులను పట్టుకొని రూ. 24 కోట్లు రికవరీ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. మహిళలకు చీరలు ఇచ్చిసీఎం ఓట్లడుగుతున్నారు సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మహిళలకు చీరలు ఇచ్చి ఓట్లడుగుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నియోజకవర్గంలోని 3,129 మహిళా సంఘాలకు రూ. 3.61 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాల్లోని 46 లక్షల మందికే చీరలు ఇవ్వడం విడ్డూరమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలూ ఇవ్వలేదని విమర్శించారు. -
‘నన్నే దుర్భాషలాడుతూ’.. సీఎం రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి లేఖ
సాక్షి,నల్గొండ: జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గతంగా కలహాలు మొదలయ్యాయి.పున్నా కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి అతన్ని తొలగించి, అర్హులైన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. అంతేకాక, పున్నా కైలాష్‌పై పోలీసు కేసు నమోదు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం.మరోవైపు, కాంగ్రెస్‌లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఎదగడాన్ని కోమటిరెడ్డి సహించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి తమ్ముడిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలుజిల్లాలో కోమటిరెడ్డి అన్నదమ్ముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.వారికి నచ్చని నాయకులు ఎదగకుండా అడ్డుకోవడం, పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యతిరేక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో సీఎం సన్నిహితుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కక్ష గట్టారని ఆరోపణలు ఉన్నాయి.అగ్రకుల అహంభావంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా కొంతమంది నాయకుల నుంచి వెలువడుతున్నాయి.జిల్లా కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతడీసీసీ నియామకంపై మొదలైన ఈ వివాదం ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్‌లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో, డీసీసీ పదవిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: నేటి నుంచి సీఎం సమీక్షా సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.నవంబర్ 25 – సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సంబంధిత విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొని సమ్మిట్ నిర్వహణ, కీలక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.నవంబర్ 26న లాజిస్టిక్స్, ఇతర ఏర్పాట్ల గురించి సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొంటారు. సమ్మిట్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రతినిధుల రవాణా, నివాసం, భద్రత వంటి లాజిస్టిక్స్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.నవంబర్ 27న జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సమ్మిట్ వేదిక, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్, అతిథి సదుపాయాలు మొదలైన మౌలిక వసతులపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు సీఎం, మంత్రి వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి పాల్గొని విద్యాసంస్థల భాగస్వామ్యం, యువజన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. దాంతో పాటు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొని పర్యాటక ప్రోత్సాహక ప్రణాళికలను పరిశీలించనున్నారు.నవంబర్ 29న సాయంత్రం 4 గంటలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్‌లో అగ్రి–ఇన్నోవేషన్ సెషన్లపై చర్చించనున్నారు.సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొని సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు.నవంబర్ 30న సీఎంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టూరిజం అవకాశాలు, గ్లోబల్ హెల్త్ సెషన్లపై సమగ్ర సమీక్ష జరుగుతుంది. -
Revanth Reddy: అదొక్కటే మన తలరాతను మార్చేది వేరే ఆప్షన్ లేదు..
-
సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు
ప్రశాంతి నిలయం: సత్యసాయి మానవతా విలువల బోధనతోపాటు నిస్వార్థసేవలతో సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మానవతా వాదులు, భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఆదివారం అశేష భక్తుల నడుమ విశ్వవేడుకలా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచారన్నారు. తన చిన్నతనంలో తమిళం మాత్రమే మాట్లాడే తన అత్త సుదూరంలో ఉండే పుట్టపర్తికి వచ్చి 15రోజులు ఇక్కడే నుండి సత్యసాయి ఆశీర్వాదాలు పొందడం బాబా దైవిక శక్తికి నిదర్శనమని చిన్ననాటి అనుభవాన్ని స్మరించుకున్నారు.‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది గుండెలను కదిలించాయన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు కోట్లాది మంది ప్రజలకు జీవనాడిగా ఉన్నాయన్నారు. ప్రపంచం ఘర్షణలు, ఒత్తిడితో నిండిన పరిస్థితులలో సత్యసాయి చూపిన మార్గం వాటికి పరిష్కారం చూపగలదన్నారు. ఆధ్యాత్మిక, సేవాస్ఫూర్తి సత్యసాయి నేటి తరానికి ఇచి్చన వారసత్వం అన్నారు. రాబోయే తరానికి బాబా వారసత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిçÜ్తూ అందించాలని పిలుపునిచ్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సంకల్ప బలం కుగ్రామం పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందన్నారు.సత్యసాయి నిరాడంబరతతో మానవాళికి నిస్వార్థ సేవలు అందించి ప్రేమ మూర్తిగా, సేవా స్ఫూర్తిగా కోట్లాది మంది భక్తులను సేవామార్గం వైపు నడిపారన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్త సేవా ఉద్యమంగా మారిందని, ఇది సత్యసాయి సంకల్ప బలానికి నిదర్శనమని అన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాలలో సత్యసాయి అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడన్నారు. మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం నేటి తరం బాధ్యత అన్నారు. కనుల పండువగా స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా సాగింది. దేశం నలుమూలల నుంచి తరలివచి్చన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, భక్తులు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సత్యసాయి బోధనలు, సూక్తుల ప్లకార్డులను చేతబూని, నృత్య ప్రదర్శనలతో ముందు సాగగా.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. ‘కదిలింది.. కదిలింది సాయి రథం.. స్వర్ణరథం’ అంటూ ప్రముఖ గాయకుడు మను గానానికి అనువుగా భక్తులు ఆనంద డోలికల్లో తేలుతూ రథోత్సవాన్ని సాగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు మానవతా విలువలను చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరపించాయి. సాయంత్రం సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు.ప్రజల్లో దేవుడిని చూసిన మహానుభావుడు: సీఎం రేవంత్సత్యసాయి ప్రజల్లో దేవుడిని చూస్తూ మానవసేవే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బాబా తన ప్రేమతో మనుషుల్ని గెలిచారని, ప్రేమతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని చెప్పారు. ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను సత్యసాయి చేసి చూపించి తన సంకల్ప బలాన్ని చాటుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం లాంటి తన సేవలతో దేవుడిగా పూజింపబడుతున్నారు.గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది. మనతో పాటు ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు. తెలంగాణలోనూ ఉత్సవాలు సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం. తెలంగాణలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు మా ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన హైదరాబాద్‌కు వస్తారని, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు వెళ్లి సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడంతోపాటు అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పటా్నయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
చిన్న పొరపాటూ జరగొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/కందుకూరు: డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, అందువల్ల భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన గ్లోబల్ సమ్మిట్ జరిగే కందుకూరు మండలం మీర్ఖాన్పేట సందర్శించారు. మధ్యాహ్నం హెలీకాప్టర్‌లో పుట్టపర్తి నుంచి ఫ్యూచర్‌సిటీ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు.అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. గంటకు పైగా అక్కడ గడిపిన ముఖ్యమంత్రి సమ్మిట్ ఏర్పాట్ల గురించి తెలుసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. ‘సమ్మిట్‌కు ఫారŠూచ్యన్– 500 కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్న సమయంలో ఏ చిన్న సమస్య కూడా ఉత్పన్నం కావొద్దు. మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడొద్దు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుభ్రం చేసిన నీటిని ఫ్యూచర్ సిటీ అవసరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి..’అని ఆదేశించారుఅపరిచితులను అనుమతించొద్దుమీర్ఖాన్పేట నుంచి సమీపంలోని స్కిల్స్ యూనివర్సిటీకి చేరుకున్న సీఎం.. అక్కడ కొనసాగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏఫ్సీడీఓ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని కోరారు. మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి తదితర నేతలు, కలెక్టర్ నారాయణరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
TG: ‘హిల్ట్ పి’కి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘హిల్ట్ పి’ రాజకీయంగా హీట్ పెంచుతున్నా.. ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో వినియోగంలో లేని, నిరుపయోగంగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్ పి)లో భాగంగా పారిశ్రామిక వాడల్లోని భూములను బహుళ వినియోగ జోన్ల కిందకు మారుస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ జీఓ 27 జారీ చేశారు.దీంతో ఈ పారిశ్రామిక వాడల్లో వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు అంటే..రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్స్టిట్యూషన్ తదితర కేటగిరీల కింద ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఇది రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.టీజీఐఐసీ ధరల కంటే సబ్ రిజి్రస్టార్ ఆఫీస్ (ఎస్ఆర్ఓ) రేట్లు తక్కువగా ఉంటాయంటూ, ఆ ఎస్ఆర్ఓ రేటు కంటే తక్కువ విలువకే భూ మారి్పడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎస్ఆర్ఓ విలువ కంటే 100, 200 శాతం అదనంగా వసూలు చేసిందంటూ, ఆ మేరకు ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఎప్పటికప్పుడు దీటుగా తిప్పికొడుతున్నారు.గతంలో ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట.. మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై లీజుదారులకు పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) ఇచ్చేందుకు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు వేర్వేరు జీవోలు ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ విధంగా ‘హిల్ట్ పి’ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సమయంలోనే..ఆ పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం గమనార్హం. అందుబాటులో 4,740.14 ఎకాల భూమిప్రస్తుతం ఔటర్ రింగురోడ్డు పరిధిలో, దానికి సమీపంలో దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటికి అప్పట్లో 9,292.53 ఎకరాల భూమి కేటాయించగా.. ప్రస్తుతం అందులో 4,740.14 ఎకాల భూమి వినియోగానికి అందుబాటులో ఉంది. ఈ పారిశ్రామికవాడలన్నీ ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు కాగా.. ఇప్పుడు జనసాంద్రత పెరగడంతో కీలక నగరంలో భాగమయ్యాయి.దీంతో వివిధ కారణాలతో కొంతకాలంగా పలు పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ భూములను బహుళ వినియోగ (మల్టీ యూజ్) జోన్లుగా మార్చి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు పారిశ్రామిక వాడల వారీగా కేటాయించిన భూ విస్తీర్ణం, ప్రస్తుతం మారి్పడికి అనువైన భూ విస్తీర్ణం, వాటికి టీజీఐఐసీ విలువను చదరపు గజాల్లో వెల్లడించగా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) విలువను చదరపు మీటర్లలో వెల్లడిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. హిల్ట్ పి అమలవుతుందిలా...! హిల్ట్ పి–2025 ప్రకారం ఈ పారిశ్రామిక వాడల్లోని వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. రెసిడెన్షియల్ కేటగిరీలో అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్íÙప్లు.. వాణిజ్య కేటగిరీలో ఆఫీసులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు.. ఇన్స్టిట్యూషన్ కేటగిరీలో పాఠశాలలు, ఆసుపత్రులు, రీసెర్చ్ సెంటర్లు..రెక్రియేషనల్ కేటగిరీలో పార్కులు, క్రీడా వేదికలు.. ఐటీ/ఐటీఈఎస్ పార్కుల కేటగిరీలో గ్రిడ్ పాలసీకి అనుగుణంగా టెక్ క్యాంపస్‌లకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ భూ వినియోగ మార్పు ప్రక్రియను హెచ్ఎండీఏ, ఎంఏయూడీ విభాగాలు సమన్వయం చేస్తాయి. ఈ పాలసీ అమలుకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వ్యవహరిస్తుంది. ధరలు ఇలా.. ఈ భూమి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ధరను నిర్దేశించింది. 80 అడుగుల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు ఎస్ఆర్ఓ రేటులో 30 శాతం, 80 అడుగుల కంటే పెద్ద రోడ్లు ఉంటే 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే భూ వినియోగ చార్జీలు (సీఎల్‌యూ) ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ సింగిల్ విండో విధానంలో ఉంటాయి. టీజీఐపాస్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియ అంతా టీజీఐపాస్ పోర్టల్ ద్వారానే సాగుతుంది. దరఖాస్తు సమయంలో 20 శాతం ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.దరఖాస్తు అందిన వారం రోజుల్లో టీజీఐఐసీ/ఐలా ప్రాథమిక పరిశీలన పూర్తి చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ వారం రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. తదుపరి వారం రోజుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత 45 రోజుల గడువులో మిగిలిన 80 శాతం రుసుమును రెండు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చెల్లింపుల్లో విఫలమైతే నెలరోజుల్లో ప్రతి స్టేజిలో ఒక శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు.నిర్దిష్ట గడువులోగా చెల్లింపులు చేయడంలో విఫలమైతే దరఖాస్తుదారుడు ఏ విధంగానూ రీఫండ్‌కు అర్హత సాధించరు. హిల్ట్ పి విధానంతో ప్రభుత్వానికి భారీగా పన్నేతర ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండీఏ, ఎంఏయూడీలకు చార్జీల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో 25 శాతం టీజీఐఐసీ ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వులకు హిల్ట్ పి అమలు మార్గదర్శకాలను రూపొందించాలని టీజీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. -
‘మా ముఖ్యమంత్రి ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారు’
జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేవలం పార్టీ ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారని చురకలు అంటించారు. జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు నందయ్యకు తన ఇంట్లో సన్మాన కార్యక్రమానికి హాజరైన జీవన్‌రెడ్డి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మండిపడ్డారు. ‘లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చినా సరే… కానీ, మా పోటీ పక్కవాళ్లతో కాదు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే. కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీ. తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ మా లాంటి వాళ్లను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదు. అసలైన కాంగ్రెస్‌కు కార్యకర్తలను వదిలేస్తున్నారు.. ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారు. జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ చేసేందేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సంజయ్ ఏం చేశారు?’ అని ధ్వజమెత్తారు. -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మిట్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.సీఎం రేవంత్ పేర్కొన్న ముఖ్య విషయాలు.. సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు హాజరయ్యే అవకాశం ఉంది. పలు దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొననున్నారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రొఫెషనల్‌గా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.పాస్‌లతో ఉన్న అధికారులకు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. సమ్మిట్‌కు సంబంధం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా ఎంట్రీ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు. సమ్మిట్ ప్రాంగణం, రూట్ మ్యాప్‌లపై పోలీస్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పార్కింగ్ సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. -
‘సీఎం రేవంత్ నా గొంతు కోశారు’
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న గుమ్ముల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు. ప్రతిసారి డీసీసీ పదవి అడిగినా మొండిచెయ్యి చూపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్లను వెంట తిప్పుకోవడం మేము అసలు సహించము. కాంగ్రెస్‌లో తిడితేనే పదవులు వస్తున్నాయి. తన కులం, సీనియారిటీ, సేవలను పక్కన పెట్టి తనను పరిగణనలోకి తీసుకోలేదని మోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టి నాకు అడ్డుపడ్డారు. నా సీనియారిటీ, నా సర్వీస్ ఏం పనికిరాలేదా? ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కన పెట్టారు.డీసీసీ నియామకంలో అధిష్టానం కుల ఆధారిత నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు కూడా మోహన్ రెడ్డి చేశారు. తన తర్వాత వచ్చిన 20 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, వలస వచ్చిన నాయకులకే కాంగ్రెస్‌లో పెద్దపీట వేస్తున్నారు. అంతేకాక తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి వస్తుంది. రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వచ్చేవి. నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తాను సపోర్ట్ చేయలేదని, అప్పటికే తనపై అనవసర అపోహలు సృష్టించారని’ధ్వజమెత్తారు. తాజా గుమ్మల మోహన్‌రెడ్డి కామెంట్స్‌తో డీసీసీ పదవి చుట్టూ వచ్చిన ఈ ఆరోపణలు జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి, వర్గపోరు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకల్లో రెండేళ్ల విజయోత్సవాలు ప్రతిబింబించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలన్నారు.డిసెంబర్ 8వ తేదీ..తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలని చెప్పారు. 9న రెండో రోజు తెలంగాణ భవిష్యత్ దార్శనికత, భవిష్యత్ ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్–2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.అన్ని విభాగాలు తమ భవిష్యత్ లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వనించాలని ఆదేశించారు. వేడుకలకు వచి్చన అతిథులకు తగిన వసతి సదుపాయాలతోపాటు అత్యున్నత భద్రత కల్పించాలని కోరారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. సమ్మిట్‌కు ఏర్పాట్లలో భాగంగా 25 నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్‌లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల 25 నుంచి వరుసగా సమీక్షిస్తానని చెప్పారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామ ని తెలిపారు.గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతోపాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్–2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు సూచనలతోపాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్– 2047 రూపకల్పన జరిగిందని తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్‌కు తుదిరూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. -
మన కవులు రత్నాలు
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని చైతన్య పర్చడంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గూడ అంజయ్య, గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్ లాంటి వాళ్లంతా రాష్ట్రానికి రత్నాల్లాంటివాళ్లన్నారు. అందెశ్రీ కోహినూర్ వజ్రం అని చెప్పొచ్చన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమందిని ఉద్యమబాట పట్టించి తెలంగాణ జాతిని జాగృతం చేశారని సీఎం కొనియాడారు. అవసరమైతే ఇప్పుడు రాష్ట్రంలోని కవులంతా ప్రజా సమస్యలే ఇతివృత్తంగా గొంతెత్తుతారని చెప్పారు.కవులు రాసే పాటలు, పద్యాల్లో, కళాకారుల కళలో జనజీవన స్థితి ఆవిష్కృతమవుతుందని, అంతటి మహా కవులు తెలంగాణలో మాత్రమే ఉన్నారన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు, కళాకారుల గొంతు వినిపించకుండా కుట్ర జరిగిందని సీఎం విమర్శించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అందెశ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం మాట్లాడారు. ప్రతి పాఠ్య పుస్తకం తొలిపేజీలో ‘జయ జయహే తెలంగాణ’ ‘రాష్ట్రంలో పదేళ్ల పాటు కవులు, కళాకారుల గొంతు అణచివేశారు. ఉద్యమ సమయంలో వారి కృషికి ఏమాత్రం ప్రచారం జరగకుండా కుట్ర చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ భవిష్యత్తరాలకు కవులు, కళాకారుల రచనలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పదేళ్ల పాటు ఏలిన దొరలు అధికారం శాశ్వతమనే భావనలో ఇలాంటి కుట్ర చేశారు. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. చూడడానికి అమాయకంగా కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు పోరాట పటిమను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. పదేళ్లపాటు దొరల ప్రభుత్వం పెన్నులపై మన్ను కప్పే ప్రయత్నం చేస్తే.. ఆ పెన్నులే గన్నులై మొలిచాయి. దొరల గడీలను పగలగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వర్గీకరణతో వైరం సమసిపోయింది ‘షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ప్రక్రియను న్యాయ సమస్యలు లేకుండా చట్టబద్ధంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు పూర్తి చేశాం. వర్గీకరణతో ఎన్నో ఏళ్లుగా దళిత కులాల మధ్య ఉన్న వైరం సమసిపోయింది. ఇప్పటివరకు ఉన్నత చదువులకు అర్హత సాధించని కులాలు కూడా వర్గీకరణ ప్రక్రియతో సీట్లు దక్కించుకున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన కులాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం కృషి ఫలితంగా ఈ విజయం సాధ్య మయ్యింది..’అని రేవంత్ చెప్పారు. కాగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాటలతో అందెశ్రీకి నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందెశ్రీ పేరిట స్మృతి వనం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘జయ జయహే తెలంగాణ’గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలోనే అది ప్రచురితమవుతుంది. దీంతో భవిష్యత్తరాలకు ఆ పాట విలువ తెలుస్తుంది. గద్దర్, అందెశ్రీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అందెశ్రీ పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చాం. భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి అందమైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మంత్రి రాజనర్సింహకు అప్పగిస్తున్నా. వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయాన్ని కూడా అందించాం.’అని సీఎం వివరించారు. -
అప్పులపై రేవంత్ తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న ’కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగ్ అక్టోబర్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీల లెక్కలను స్పష్టంగా పేర్కొందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పదేపదే అప్పులపై కాకి లెక్కలు చెప్తోందని తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దు్రష్పచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ.7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని విమర్శించారు. కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల పైన మరోసారి చెంపదెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టిందని కేటీఆర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. సగటు వడ్డీ రూ.2,361 కోట్లు ‘కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ.16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే. వడ్డీల పేరిట అబద్ధాలతోపాటు చేతకానితనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచి పెట్టుకుంటోంది. పార్లమెంట్ లెక్కల ప్రకారం.. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రూ.2.30 లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలి. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారు’అని కేటీఆర్ చెప్పారు. -
‘ఈ నిర్ణయం వెనుక వేలకోట్లు చేతులు మారే ప్రమాదం ఉంది’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టిందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పులే రేవంత్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు,. బావితరాలకు భవిష్యత్ లేకుండా భూములు బడా బాబులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ గతంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలనుకున్నారు. కోర్టు ప్రమేయంతో అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ ఇంద్రస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వెనుక పెద్ద కుంభకోణం ఉంది. క్యాబినేట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లోని స్థలాల కోసం ఎన్టీఆర్ స్టేడియం స్పూర్తితో ఉద్యమిస్తాం. మల్టిపుల్ జోన్లుగా మార్చేందుకు, ఎవరు అనుమతి ఇచ్చారు. భూములు లాక్కునే హక్కు ఎవరు ఇచ్చారు?, దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక వేలకోట్లు చేతులు మారే ప్రమాదం ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు కప్పం కడుతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉందా, ఉన్నపుడే సర్దుకుందామని చూస్తున్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. ఎన్టీఆర్ స్టేడియంలో ఆనాడు కేసీఆర్ నిర్మాణం చేపట్టాలని ప్రయత్నం చేశారు. నేను అడ్డుకుని పోరాటం చేశాను ఇందిరాపార్క్ విషయంలోనూ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజల అవసరాల గురించి కాకుండా స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. Hmda మాస్టర్ ప్లాన్ పై పునఃసమీక్షించు జరగాలి. రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు జరగాలి. రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలి. హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగల్‌గా మారుస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై సమీక్ష జరుగుతోంది. తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం. గెలుపుకోసం మేం ప్రయత్నం చేస్తాం. తెలంగాణలోనూ పార్టీకి మంచి రోజులు వస్తాయి. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సహా, ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి. కొన్ని ప్రాజెక్టుల్లో రాష్ట్రం సహకరించడం లేదు. ఎంపీకి నోటీసు ఇచ్చిన విషయం నా దృష్టిలో లేదు’ అని తెలిపారు. -
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ము
ద్రౌపది ముర్ము పుట్టపర్తి పర్యటన అప్డేట్స్..సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ముపుట్టపర్తి:పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముసాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముర్ము. పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..శ్రీ సత్య సాయి జిల్లా..పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మురాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రజా ప్రతినిధులు.తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన పుట్టపర్తికి బయలు దేరిన రాష్ట్రపతిబేగంపేట విమానశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముమరికాసేపట్లో పుట్టపర్తికి ద్రౌపదీ ముర్ముబేగంపేట్ నుంచి పుట్టపర్తికి బయలు దేరిన రాష్ట్రపతిరాష్ట్రపతితోపాటు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నంహైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మిభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం, శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.ఇక, రాష్ట్రపతి ముర్ము శుక్రవారం హైదరాబాద్ చేరుకుని ఇక్కడ బస చేశారు. కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి పుట్టపర్తికి వెళ్లనున్నారు. పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి పుట్టపర్తి వస్తుండటంతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలకనున్నారు. -
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఈవెంట్
సాక్షి, హైదరాబాద్: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్–2025 పేరుతో దక్షిణాసియాలోనే అతి పెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు హాజరు కానున్న ఈ ఎగ్జిబిషన్‌ను నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు..ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎగ్జిబిషన్లో చర్చ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.కాగా ఈ ఈవెంట్‌కు హాజరు కావాల్సిందిగా..శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసిన పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, కోశాధికారి శ్రీకాంత్‌తో పాటు చక్రధర్‌రావు, వెంకటేశ్వరరావు, కేజీ ఆనంద్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.నరసింహారెడ్డి, జీకే మురళి తదితరులు సీఎంను కలిశారు. వన్ నేషన్–వన్ ఎక్స్పో: పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు బాటలు వేసేలా వన్ నేషన్–వన్ ఎక్స్పో అనే థీమ్‌తో 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్స్, 40 వేలకు పైగా సందర్శకులు పాల్గొంటారన్నారు. -
సేవ్ బనియన్ ట్రీస్ ప్రతినిధులను అభినందించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్–హైదరాబాద్ హైవేలో భాగంగా తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణకు సహకరించడానికి కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకున్న సేవ్ బనియన్ ట్రీస్ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ ప్రతినిధులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. దాదాపు 56 కిలోమీటర్ల రహదారి విస్తరణకు సంబంధించి ఎక్కువగా మర్రిచెట్లు ఉండటం వల్ల వాటి పరిరక్షణకు ఈ సంస్థ ప్రతినిధులు కోర్టులో కేసులు వేసిన సంగతి తెలిసిందే.దీంతో చాలా కాలంగా ఈ రహదారి విస్తరణకు ముందుకు సాగకుండా ఆగింది. ఇటీవలే చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద బస్సు–టిప్పర్ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. రహదారి విస్తరణ కోసం రామ్మోహన్‌రెడ్డి ఎల్లప్పుడూ చొరవ తీసుకుని, పనులను ముందుకు తీసుకెళ్లడంలో చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు. సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి: హరీశ్ రావు
-
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపింది
-
రేవంత్ ముఠా హవా.. 9300 ఎకరాల కుంభకోణం: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతోంది. ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబ సభ్యుల కన్ను పడింది. బాలానగర్ పరిసరాల్లో సుమారు 9300 ఎకరాల భూకుంభకోణం జరుగుతోంది. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లతో తన వాళ్లకు రేవంత్ భూములిచ్చారు. నాలుగు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది. జపాన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్‌పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.కుంభకోణంలో బీజేపీ..రేవంత్ భూకుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలి. బీజేపీ కూడా కుంభకోణంలో భాగం. అందుకే స్పందించడం లేదు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోంది. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తాం. రేవంత్ ప్రభుత్వంతో పాటు.. భూములు పొందినవారు ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పేటీఎంగా మార్చుకున్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతాం.ప్రతీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపారు. బీఆర్ఎస్ హయాంలో 2022లో భూముల రెగ్యులేషన్‌కు చట్టం తెచ్చాం. భూములకు వంద శాతం ఫీజు కట్టేలా నిబంధన చేర్చాం. వేరే వాళ్లకు అమ్ముకుంటే రెండు వందల శాతం చెల్లించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేసింది. 30 శాతం కడితే రెగ్యులర్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారు అని ఆరోపణలు చేశారు. నేను ఏ తప్పు చేయలేదు..అలాగే, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో గవర్నర్ ప్రాసిక్యూషన్‌కి అనుమతిపై కేటీఆర్ స్పందిస్తూ..‘చట్టం తన పని తాను చేసుకుంటుంది. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు. ఫార్ములా కారు రేసింగ్‌లో నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టివ్ టెస్టుకు నేను రెడీ. కారు రేసులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసు. కడియం శ్రీహరిని కాపాడి దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా GHMC ఎన్నికలు వస్తాయి. తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి. దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే.. ఇజ్జత్ పోతుందని.. రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి.. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం.. అన్ని లెక్కలు తెలుస్తాం’ అని హెచ్చరించారు. -
కలెక్టర్ గారూ తెలుగులో మాట్లాడండి..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అనర్గళంగా తెలుగులో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి బుధ వారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలను ఇన్చార్జి కలెక్టర్ గరీమా ఇంగ్లిష్ లో వివరిస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ‘కలెక్టర్ గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వచ్చుకదా.. అన్ని జిల్లాల మహిళా సంఘాల మహిళలు ఉన్నారు.వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి’అని నవ్వుతూ అన్నారు. దీంతో కలెక్టర్ వెంటనే తెలుగు వస్తుంది సార్.. కచ్చితంగా మాట్లాడుతా అంటూ జిల్లాలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ విధానం, ఇతర వివరాలను తెలుగులో అనర్గళంగా వివరించారు. అన్ని జిల్లాల సమాఖ్యల మహిళలు సిరిసిల్ల జిల్లాకు వచ్చి చీరల ఉత్పత్తిని చూసి, నాణ్యతను చూసి సంతోషపడ్డారని చెప్పారు. సిరిసిల్లలో మరో వారంలో చీరల ఉత్పత్తి పూర్తవుతుందన్నారు. బుధవారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తెలుగు ప్రసంగం గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
24న హకీంపేట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 24న వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయభాస్కర్‌రెడ్డి గురువారం హకీంపేట్‌కు చేరుకుని, స్థల పరిశీలన చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన స్థలాల వివరాలను తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభాస్థలం, హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవలే ఇక్కడ మెడికల్, నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, పశువైద్య, మహిళా డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి కేటాయించారు. వీటికి సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వీరి వెంట ట్రైనీ కలెక్టర్ హర్‡్షచౌదర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మేర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం ‘అనలాగ్ ఏఐ’సీఈఓ అలెక్స్ కిప్మన్ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రద్దీ, నగర ప్రాంతాల్లో వరదలు, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరిష్కార మార్గాలపై చర్చించారు.‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఎనిమిదివారాల పాటు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయా లని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సీసీ టీవీ వ్యవస్థను ‘రియ ల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్’గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజాభద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు.ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ ప్రాజెక్టును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఇది పూర్తయ్య–2047’లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా కిప్‌మన్‌ను రేవంత్ ఆహ్వానించారు. -
కేటీఆర్‌పై అక్రమ కేసు.. రేవంత్ రాక్షసానందం: హరీష్
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆరోపించారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ ట్విట్టర్ వేదికగా..‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది.రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి @revanth_anumula నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై…— Harish Rao Thanneeru (@BRSHarish) November 20, 2025 -
TG: 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఆయా శాఖలు, విభాగాల పరంగానూ సన్నాహాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో ఈ నెల 26న గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి లోబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ.. గురు లేదా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం.ఈ నివేదిక అందగానే దానిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు అందజేసి, వెంటనే జిల్లాల్లో ఆయా పంచాయతీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఆదేశించనుంది. ఆ వెంటనే రెండురోజుల్లోనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎండీఓలు పంచాయతీల వారీగా రిజర్వేషన్లను రెడీ చేస్తారు. ఒకవేళ 26న ఈ షెడ్యూల్ విడుదలైన పక్షంలో డిసెంబర్ 2, 3 వారాల్లోగా లేదా ఎక్కువలో ఎక్కువగా డిసెంబర్ 20–25వ తేదీల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.మూడువిడతల్లో నిర్వహించే ఈ ఎన్నికలను మూడేసి రోజుల అంతరంతో నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెల 24న హైకోర్టులో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారన్న దానిపై తదుపరి విచారణ జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24న లేదా ఆ లోగానే ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనున్నట్టు అధికారవర్గాల సమాచారం. కోర్టు చేసే సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సిద్ధంగా ఉన్నాయి.ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ ఆదేశాలు తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎస్ఈసీ కూడా ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం కాగా... గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను వెంటనే సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెపె్టంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని తాజా ఉత్తర్వుల్లో ఎస్ఈసీ సూచించారు పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్లను రీ–అరేంజ్ చేసి మళ్లీ ప్రచురించాలని డీపీఓలను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తవ్వగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్ఈసీ ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డీపీఓలను ఎస్ఈసీ ఆదేశించింది.గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితా రీ–పబ్లికేషన్‌కు సంబంధించిన దశలు ఇలా... ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యా పింగ్‌లో తప్పుల సవరణ (అడ్రస్‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది.గురువారం.. సెప్టెంబర్ 2న జీపీ/వార్డు/పోలింగ్‌స్టేషన్ వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్‌పై ఓటర్ల నుంచి దరఖాస్తు స్వీకరణ, వాటి పరిశీలన22వ తేదీన అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభ్యంతరాలను సంబంధిత డీపీఓల ద్వారా పరిష్కారం23వ తేదీన సంబంధిత గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాల రీ–పబ్లికేషన్, అదే రోజు మారిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను తిరిగి ప్రచురించాలి -
భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చేలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గత రెండేళ్లలో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన సీఎం రేవంత్‌రెడ్డి కల. దీన్ని సాకారం చేసే దిశగా ప్రతీ ఒక్కరం అడుగులు వేస్తున్నాం, ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం నాకు అప్పగించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్బీతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుంది. అన్ని శాఖలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలి’అని భట్టి అధికారులకు సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ‘2047 రైజింగ్ విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’సమావేశంలో భట్టి ప్రసంగించారు. రెండేళ్లలో ఏం చేశామని చెప్పడమేకాక, భవిష్యత్ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నాం, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దబోయే విషయాలను ప్రపంచానికి విజన్ డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు తెలిపారు. ‘రింగ్’పూర్తయితే.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 13 శాతం జీడీపీగా తెలంగాణను నిలపడం అసాధారణమేనని, దీన్ని సాధించేందుకే విజన్ డాక్యుమెంట్‌ను పకడ్బందీగా సిద్ధం చేయాలని భట్టి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మంచి వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయని, ఫార్మా, ఐటీ రంగాలకు దేశంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ అంశాలన్నింటికీ విజన్ డాక్యుమెంట్లో చోటు కల్పించాలని వివరించారు. రూ.36 వేల కోట్లతో చేపట్టే రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీపడలేదని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 39 రేడియల్ రోడ్లు, వాటిని కలుపుతూ పెద్ద సంఖ్యలో ఇండ్రస్టియల్ క్లస్టర్లు రానున్నాయని వివరించారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయన్నారు. దేశంలోని ప్రముఖ నిపుణులను, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సీఈఓలను ఆహా్వనించి గ్లోబల్ సమ్మిట్‌ను పెద్ద పండుగలా నిర్వహించనున్నామని, వారి సలహాలను స్వీకరిస్తామని భట్టి చెప్పారు. గురువారం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలని కోరారు. ఫైనల్‌గా సీఎం కసరత్తు సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్‌కు ఆమోదం తెలియజేస్తారని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.85 వేల కోట్లతో చేపడుతున్న పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మహిళలకు అందజేసిందని చెప్పారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నతాధికారులు సంజయ్ కుమార్, వికాస్ రాజ్, శ్రీధర్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, హరీశ్, బుద్ధ ప్రకాష్, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ, నాగిరెడ్డి, చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 9 కమిటీలు.. గ్లోబల్ సమ్మిట్ కోసం హాస్పిటాలిటీ అండ్ లాజిస్టిక్స్, ఫుడ్ అండ్ కల్చరల్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ మీడియా, కంటెంట్ క్రియేషన్ అండ్ ఐఈసీ, సెక్యూరిటీ అండ్ ప్రొటోకాల్, ఎంవోయూలు, ప్రకటనలు, ప్రోగ్రాం డిజైన్ సమన్వయం, ఇని్వటేషన్స్ అండ్ ఔట్రీచ్ కమిటీలను ఏర్పాటు చేశారు. -
మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ‘తెలంగాణ సారె’కార్యక్రమాన్ని తలపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వారి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. అవకాశం ఉన్న చోటల్లా ప్రోత్సహిస్తోంది. ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు, అన్నదమ్ములు సారె, చీర పెట్టడం సంప్రదాయం. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తోంది..’అని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ప్రతినిధులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమానంతరం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని ఎస్ హెచ్‌జీల సభ్యులతోనూ ఆయన మాట్లాడారు ఇందిర స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాలన ‘ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. భారత్‌కు బలమైన నాయకత్వాన్ని అందించారు. ఆమె స్పూర్తితోనే రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. 1,000 బస్సులకు వారిని యజమానులుగా చేశాం. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పెట్టించాం. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. రాయితీపై సిలిండర్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే..ప్రస్తుత ప్రజా ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల మేర ఆర్థికసాయం అందిస్తోంది. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పాం. తాజాగా ‘తెలంగాణ సారె’పేరిట రెండు విడతల్లో కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. ప్రతి మహిళకు చీర అందాలి ‘తెలంగాణ సారె’కోసం ఆర్నెల్ల క్రితం చీరలు ఆర్డర్ చేస్తే.. ఇప్పటివరకు 65 లక్షల చీరలు మాత్రమే అందాయి. అందువల్ల తొలి విడత కింద డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చీరలు పంపిణీ చేస్తాం. మిగతా 35 లక్షల చీరలు రెండో విడతలో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో పంపిణీ చేస్తాం. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో మహిళలకు ఎన్నో రకాల ఆశలు పెట్టి అడియాసలు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. చీరల పంపిణీ బాధ్యత మంత్రి సీతక్కకు అప్పగిస్తున్నా. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిపి ప్రతి మహిళకు చీర అందేలా చర్యలు తీసుకోవాలి. అంతా ఈ చీరలు ధరించాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులకు కూడా చీరలు పంపిణీ చేయాలి. అయితే వాటికి మాత్రం బిల్లులు తీసుకోవాలి. రాష్ట్రంలోని మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు కూడా ఈ చీరలు ధరించాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి.. ఆ చీరలతో ఫోటోలు దిగి వాటిని అప్లోడ్ చేసే వీలు కల్పించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పండుగ వాతావరణంలో నిర్వహించాలి ఎస్‌హెచ్‌జీల సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా..మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల వస్తువులను ఈ–కామర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో అధికారులు సంప్రదింపులు జరపాలని రేవంత్ ఆదేశించారు. ‘చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కలెక్టర్లు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలి. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి. చీర అందించే సమయంలో ఆధార్ నంబర్ తీసుకోవాలి. ముఖ గుర్తింపు చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల దగ్గరకే వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లకు సీఎం చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది... వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి ఉందని ఆమె తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు.. రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. చీరల డిజైన్లు బాగున్నాయి తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడంతో తమకు యూనిఫాం వచి్చందనే సంతోషం కలుగుతోందని కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. -
ఇందిరమ్మే స్పూర్తి.. కోటి మందికి చీరలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రేవంత్.. చీరలను అందించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇవ్వనున్నారు. తొలి దశలో నేటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. బ్యాంకుల జాతీయం, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైంది. పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధే. ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళలకు పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశాం. సోలార్ ప్లాంట్ మహిళలకే ఇస్తున్నాం. ఇందిరా గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నాం. మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఆడబిడ్డలకే ఇస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి అని పిలుపునిచ్చారు.వైఎస్సార్ హయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని నేను చెప్పాను. లబ్ధిదారులకు తప్పకుండా ఇళ్లు కట్టిస్తాం. ఇందిరా గాంధీ పాలన దేశానికి దిక్సూచి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సింగపూర్, టోక్యో, న్యూయార్క్తోనే మా పోటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి, మౌలిక వస తుల కల్పనలో తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని నగరాలతో కాకుండా సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో పోటీ పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లా డారు. కేంద్ర పట్టణాభివృద్ధి, భవనాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఏపీ నుంచి మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్‌లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘భారతదేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారు. అదే కోవలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలి. మెట్రో రైలు మార్గ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్‌కు గోదా వరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతోపాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి’అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..: ‘ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా పది శాతం ఉండేలా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’అని సీఎం రేవంత్ వెల్లడించారు. పట్టణాలు వికసిత్ భారత్ ప్రతిబింబాలు : మనోహర్‌లాల్ ఖట్టర్ దేశంలోని పట్టణాలు వికసిత్ భారత్ ప్రతిబింబాలు అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్)లో అంతర్భాగమైన డంప్‌సైట్ రిమిడియేషన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ (డీఆర్ఏపీ)లో 100 శాతం పారిశుధ్యాన్ని సాధించేలా మంత్రులు, ఉన్నతాధికారులు పనిచేయాలని సూచించారు. డీఆర్ఏపీ కింద చేపట్టిన 214 డంప్సైట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు. అటల్ మిషన్ ఫర్ రీజ్యూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) కింద నీటి సరఫరా, నీటి పునర్వినియోగం, వర్షపు నీటి సేకరణ వంటి అంశాలపై చర్చ జరగాలని మంత్రి ఖట్టర్ సూచించారు. అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లోని పట్టణాలలో వచ్చే మూడేళ్లలో తాగునీటి సరఫరా సాధించేలా చూస్తామని ప్రకటించాయి. మహారాష్ట్ర, డమన్లోని పట్టణాలు 90 శాతం పైగా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించాయి. నీటి పునర్వియోగం, నీటి శుద్ధికి సంబంధించిన అంశాలపైనా ఈ సమావేశం చర్చించింది. అమృత్ రెండో దశ కింద మహారాష్ట్ర రోజుకు 3వేల మిలియన్ లీటర్లు శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2030 నాటికి కనీసం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగం తేవాలనే లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు గుజరాత్ ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద గృహ నిర్మాణ పురోగతిపై కూడా చర్చించారు. తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వగా, రెండు సెషన్లుగా సమావేశం జరిగింది. మొదటి సెషన్లో ‘తెలంగాణ రైజింగ్ 2044’, రెండవ సెషన్లో కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకాలు, వాటి అమల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతిపై సమీక్షించారు. -
TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
-
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుండి 9వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల సమయంలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలను క్యాబినెట్ చర్చిస్తోంది. ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల నిర్వహణపై పిటిషన్ విచారణకు రానుంది. దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. తాజాగా పరిణామాలతో డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని సమాచారం. -
గ్రేటర్ ఎలక్షన్ పై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
-
రేవంత్ పరపతి పెంచిన జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చే అంశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. గెలుపు ద్వారా పార్టీలో తన పట్టు పెంచుకున్నాడు. రాష్ట్రంలో తనపై వ్యతిరేకత పెరుగుతోందన్న వదంతులు పుంజుకుంటున్న సమయంలో దాన్ని పూర్వపక్షం చేసేందుకు రేవంత్ ఈ ఉప ఎన్నికలను వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘట్టం మొదలైనప్పుడు రాజకీయ వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌లు విస్తృత ప్రచారం చేశారు కూడా. కాంగ్రెస్ తరఫున తొలుత ముగ్గురు.. ఆ తరువాత మరింత మంది మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్సహా ఇతర నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆగలేదు. రేవంత్ స్వయంగా పలు సభలు నిర్వహించారు. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటి అర సభల్లో పాల్గొనడం కద్దు. కానీ రేవంత్ ఈ రిస్క్ తీసుకోలేదు. ఎప్పటికప్పుడు అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరించుకుని తన వ్యూహాలకు పదును పెట్టుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం అలాంటిదే. మైనార్టీ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ను మంత్రిని చేసేశారు. అంతేకాక ఆ వర్గం బాగా బలంగా ఉన్న చోట మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు మనుగడ అన్న రీతిలో ప్రసంగాలు చేశారు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్‌కు లాభించింది. రాజీలేకుండా డబ్బులు ఖర్చు చేశారన్న అభిప్రాయమూ సర్వత్రా ఉంది. వీటన్నింటి ఫలితంగా అప్పటివరకూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న మౌత్ టాక్ కాస్తా చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా డబ్బు పంపిణీ చేసినా అది అధికార పక్షానికి సరితూగలేదని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఎలా గెలిచారన్నది ముఖ్యం కాకుండా పోతోంది. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం పెరిగిపోతోంది. గెలిచాక మాత్రం ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం రివాజుగా మారింది. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో తప్ప, మిగిలిన ఉప ఎన్నికలలో విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి వచ్చారు. అయినా బీఆర్ఎస్ గెలవగలిగింది. బీజేపీ జూబ్లి హిల్స్ ఉపఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేనలు ప్రచారంలో పాల్గొనలేదు. పైగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. గత సాధారణ ఎన్నికలవరకు కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లు కనిపించేది కాదు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం, కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం,నాయకులందరిని ఏకం చేయడం తదితర వ్యూహాలతో అధికారంలోకి తేగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విజయం ద్వారా అసమ్మతి ఆలోచన చేసే నేతలు కూడా కిమ్మనే పరిస్థితి ఉండదు. అధిష్టానం వీక్ గా ఉండడం, బీహారులో దారుణమైన పరాజయం చెందడం కూడా రేవంత్ కు కలిసి వచ్చే అంశమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసిందనాలి. నవీన్‌పై కుటుంబపరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరిగేలా చేసుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జరిగిన ఈ ఉప ఎన్నికకు సానుభూతి ఉపకరిస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను ఎంపిక చేసుకుంది. అయినా అది ఫలించలేదు. కాకపోతే గత లోక్‌సభ ఎన్నికలలో మాదిరి మూడో స్థానంలోకి పడిపోకుండా గట్టిపోటీ ఇవ్వగలగడం, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని కేడర్‌లో కలిగించే విధంగా 74 వేల ఓట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ కు 99 వేల ఓట్లు రావడం బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందే అయినా, లోక్ సభ ఎన్నికలతో పోల్చితే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాం కదా అన్న భావన కలుగుతుంది. అధతికార దుర్వినియోగంతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. బీజేపీ పరిస్థితి మాత్రం కాస్త గడ్డుగా మారిందనే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం పరువు తక్కువే. బీహారులో ఎన్డీయే విజయ దుందుభి మోగించిన తరుణంలో జూబ్లిహిల్స్‌లో ఈ రిజల్ట్ రావడం మింగుడుపడని విషయమే. అయితే వచ్చే ఎన్నికలకు హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు కృషి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాగా ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన అంతా సజావుగా ఉందని కాంగ్రెస్ భావిస్తే అది తప్పే అవుతుంది. విజయం సాధించారు కనుక ఆ ఉత్సాహం ఉంటుంది.కాని దాని వెనుక ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు చేయాల్సి వచ్చింది వారికే తెలుసు. ఏపీలో 2018 నాటి నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి విజయం కోసం అన్ని వ్యూహాలు అమలు చేశారు. తద్వారా గెలవగలిగారు.కాని ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆ సీటు మళ్లీ వైసీపీ పరమైంది.అన్నిసార్లు అలా జరగాలని లేదు.కాని అలాంటి ఉదాహరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అడుగుజాడలోనే నడిచి ఉప ఎన్నికలో గెలిచారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులకు, హైడ్రా యాక్టివిటి అంతటికి ప్రజామోదం లభించిందని కూడా అనుకోరాదు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల రేవంత్ పరపతి పెరిగే మాట నిజం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.


