ఇందిరాపార్కు వద్ద ధర్నాలో ఆర్టీసీ కార్మికుల హెచ్చరిక
సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని, జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి
కవాడిగూడ: దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మెకు దిగుతామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. చలో సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఆర్టీసీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్మాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక భారంలేని బెనిఫిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రక్రియను సీఎం రెండేళ్లయినా మొదలుపెట్టలేదన్నారు.
మార్చి 13లోగా డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదన్నారు. ఆర్టీసీకి రా వాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండి మౌలానా, యాద య్య, సురేశ్, యాదగిరి, కరుణాకర్‌గౌడ్, యాదయ్య, రా ఘవులు, బాల్‌రెడ్డి, బాబు, ఆర్టీసీ కారి్మకులు పాల్గొన్నారు.


