breaking news
Rahul Gandhi
-
ప్రభుత్వ విందు వివాదం: విమర్శలపై థరూర్ ఏమన్నారంటే..
పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన అధికారిక విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది.శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించడం.. దానిని అంగీకరించి ఆయన హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలను బయటపెట్టింది. పలువురు సీనియర్లు ఆయన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. థరూర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ ఖేడా, జైరాం రమేష్‌లాంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. థూరూర్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ అంటోంది. ఈ అభ్యంతరాలు.. రాజకీయ విమర్శల దరిమిలా శశిథరూర్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.తిరువనంతపురం(కేరళ) ఎంపీ శశిథరూర్.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ హోదాలోనే తాను కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని అన్నారాయన. ‘‘20 ఏళ్ల క్రితం నేను జియోపాలిటికల్ అలైన్మెంట్స్ కోసం అన్వయించిన ఓ పదం.. ఇప్పుడు వాస్తవరూపం దాల్చినందుకు సంతోషం. రాష్టప్రతి భవన్లో గతంలో భిన్నమైన వైఖరి ఉండేది. కానీ, ఈసారి ఇతర గళాలను కూడా వినిపించాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అందుకే నన్ను ఆహ్వానించి ఉంటారు. అలాగే..ఇతర దేశాలతో సంబంధాలు మా కమిటీ పరిధిలోకి వస్తాయి. అందువల్ల అక్కడ జరిగే సంభాషణలు, వాతావరణం గురించి అవగాహన కలగడం మాకూ మంచిదే అని అన్నారాయన. అంతేకాదు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ విందును అద్భుతం(Excellent Dinner) అని అభివర్ణించారు.ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో రెండు రోజులు పర్యటించారు. ఆయన కోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే అధికారిక కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామంపై థరూర్ స్పందిస్తూ.. ఆ విషయం తనకు తెలీదన్నారు. ఏ ప్రతిపాదికన ఆహ్వానాలు పంపారో తనకు అవగాహన లేదన్నారు. అలాగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం కోరారా? అనే ప్రశ్నకు.. రాష్ట్రపతి భవన్ విందుతో దానికి సంబంధం లేదన్నారు. విందు ముందు జరిగిన సంభాషణల్లో తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ అధికారులతో ప్రస్తావించానని తెలిపారు. “ప్రజల కోసం, ఓటర్ల కోసం పని చేయడం నా రాజకీయ బాధ్యత” అని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడంపై స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాం. ఏకీభవించే చోట కలిసి పనిచేయాలి అని వ్యాఖ్యానించారు. థరూర్ గతకొంతకాలంగా ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం.. ఆపరేషన్ సిందూర్ కోసం దూతలా ప్రపంచమంతా తిరగడం కాంగ్రెస్‌లో అసంతృప్తికి దారి తీసింది తెలిసిందే. ఈ తరుణంలో.. ఆయనకు పార్టీ మారతారా? అనే ప్రశ్నా తాజా ఇంటర్వ్యూలోనూ ఎదురైంది. ‘‘నేను కాంగ్రెస్ ఎంపీని. ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడ్డాను. వేరే నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచన అవసరం’’ అంటూ ఆచితూచి స్పందించారాయన. -
కేంద్రం ఏకపక్ష పోకడల ఫలితమిది
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘ఇండిగో’లో తలె త్తిన గందరగోళ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ‘ప్రతి రంగంలోనూ ఆరోగ్య కర మైన పోటీ ఉండాలే తప్ప, మ్యాచ్– ఫిక్సింగ్ ఏకపక్ష పోకడలు తగవు. విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు తదితరాలతో సామాన్య భారతీయులు ఇందుకు మూల్యం చెల్లిస్తున్నారు’అని శుక్రవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.దీంతోపాటు ఆయన గతేడాది వార్తా పత్రికకు రాసిన కథనాన్ని షేర్ చేశారు. ఈస్టిండియా కంపెనీ 150 క్రితమే మూతపడినా అది మరో రూపంలో తిరిగి అవతరించిందంటూ అందులో ఆయన పేర్కొ న్నారు. కాంగ్రెస్ పవన్ ఖేరా కూడా ఇండిగో సమ స్యకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ‘ఇద్ద రు వ్యక్తులు పార్టీని నడుపుతున్నారు. ఇద్దరే ప్రభు త్వాన్నీ నిర్వహిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులే వ్యాపా రాలను శాసిస్తున్నారు. ఇప్పుడు జరుగుతు న్నదంతా ఇదే’అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. -
పుతిన్‌తో అధికారిక విందుకు శశిథరూర్‌కు ఆహ్వానం!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో ఇచ్చే అధికారిక విందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం అందింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలను బలపరచడానికి ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు(శుక్రవారం) రాత్రి పుతిన్‌తో కలిసి శశిథరూర్ విందలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జన ఖర్గేలక ఆహ్వానం అందలేదట. కేవలం కాంగ్రెస్ నుంచి శశిథరూర్‌ను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్ల తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీతో ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్న శశిథరూర్.. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో విందుకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడికి ఇచ్చిన మర్యాదను తన ఆహ్వానం ప్రతిబింబిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (External Affairs)కి శశి థరూర్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బయట శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ ఇదొక సాంప్రదాయం. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వమే మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ దీన్ని ప్రారంభించింది. ఏ దేశం నుంచైనా అధ్యక్షులు ఇక్కడకు(భారత్) వస్తే ప్రతిపక్షం నుంచి ఒకరు హాజర కావడం జరగుతుంది. కానీ ప్రస్తుత రోజల్లో విదేశీ నేతల్ని.. ప్రతిపక్ష నేతలు కలవ కూడదని కూడా కొన్ని ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి’ అని అని స్పష్టం చేశారు. -
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ సంక్షోభానికి ‘గుత్తాధిపత్య మోడల్’ ఫలితమంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విమానాల ఆలస్యం, కాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు కారణంగా సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలి. న్యాయమైన పోటీ ఉండాలన్న రాహల్... మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కిందటి ఏడాది ఆయన చేసిన ఓ ట్వీట్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు.IndiGo fiasco is the cost of this Govt’s monopoly model. Once again, it’s ordinary Indians who pay the price - in delays, cancellations and helplessness.India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025దేశవ్యాప్తంగా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 220పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయాల్లో ఒకే రోజు 70కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. -
మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందని, అందుకే విదేశాల అధినేతలు, ప్రముఖులు మన దేశానికి వచి్చనప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడొద్దంటూ వేడుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ గానీ, విదేశాంగ శాఖ గానీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో విదేశీ అతిథులు ప్రతిపక్ష నాయకుడిని కలిసి మాట్లాడే సంప్రదాయం చక్కగా కొనసాగిందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయిందని ఆక్షేపించారు. -
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌బాల్ ఆడుతుంటే కాళ్లతో తంతారు. అలా తంతారని, కాళ్లు తగులుతాయని ఫుట్‌బాల్ ఆడకుండా ఉంటామా? అలా కాలితో తన్నడమే ఫుట్‌బాల్ గేమ్ రూల్. అలాగే రాజకీయాల్లో కూడా కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అదే రాజకీయాల గేమ్‌రూల్. ఆ కట్టెలను తీసి పక్కన పెట్టి ముందుకెళుతుండాలి. నా కాళ్లలో కట్టెలు పెట్టారు. నేను బోర్లా పడిపోతాను. ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపాలి అంటే కుదరదు. రాజకీయాల్లో మనమే లేవాలి.’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, రాహుల్‌గాంధీ లాంటి వారిని ఇబ్బంది పెట్టాలని జీ–23 పేరుతో లేఖలు వస్తుంటాయని చెప్పారు. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే పార్టీ 140 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉందని, లేదంటే జనతా పార్టీలాగానో, ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనో కనుమరుగయ్యేదని అన్నారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవికి సమయస్ఫూర్తి ముఖ్యం ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం, మంత్రులు కావడం కంటే పార్టీ అధ్యక్షుడు కావడమే కష్టం. డీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీ కుటుంబానికి పెద్దలా వ్యవహరించాలి. ఈ పదవికి వయసు ముఖ్యం కాదు. అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే సమయస్ఫూర్తి ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదు. డీసీసీ అధ్యక్షుల విషయంలోనూ అంతే. మన సమాజంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలుంటాయి. దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు. డీసీసీ అధ్యక్షుల విషయంలో ఎలా సాధ్యమవుతుంది? మీరు డీసీసీ అధ్యక్షులు అవడం కొందరికి ఇబ్బంది కావచ్చు. మీరే వెళ్లి వారితో మాట్లాడండి. సీనియర్ల దగ్గరికెళ్లి కలిసి పనిచేద్దామని అడగండి. పదవి రాకముందు అనేక సమస్యలుంటాయి. పదవి వచి్చన తర్వాత అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. పనిచేసే క్రమంలో వచ్చే సమస్యలను పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆరు నెలలే మీకు సమయం ‘కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన వారికి ఆరునెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతి నెలా రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసే దిశలో ఎవరు పనిచేయకపోయినా అధ్యక్ష పదవి ఉండదు..’ అని రేవంత్ అన్నారు. అభివృద్ధిపై చర్చ పెట్టండి ‘రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, చేసింది చెప్పుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అందరి కృషితో రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశలో నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ చేరవేయండి. అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదికపై చర్చ పెట్టండి. పెళ్లి, చావు, దావత్, కల్లు కాంపౌండ్లు.. ఇలా ఎక్కడైనా నాటి, నేటి పాలన గురించి చర్చ పెట్టండి. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు సారె కింద కోటి చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆడబిడ్డల దగ్గరికి చేర్చడం డీసీసీ అధ్యక్షులుగా మీ టాస్క్. ఏ ఆడబిడ్డా మాకు చీర రాలేదని చెప్పొద్దు. అలా చెపితే డీసీసీ అధ్యక్షులుగా మీరు పనిచేయనట్టే..’ అని సీఎం అన్నారు.మోదీ, అమిత్‌షాకు భయపడేవారెవరూ లేరు.. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ భయపడబోదు. మోదీ, అమిత్‌షాలకు భయపడేవారు ఇక్కడెవరూ లేరు. తమ ప్రాణాలనే కాదు ఆస్తులను కూడా త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కష్టపెడితే దేశ ప్రజలను కష్టపెట్టినట్టే. ఓట్ చోరీ అంశం దృష్టి మరల్చేందుకే ఈ కేసులు పెడుతున్నారు. ఇలాంటి చర్యలను దేశం సహించదు. గాంధీ కుటుంబానికి మనం అండగా నిలబడదాం. ఎందాకైనా పోరాడదాం. రావాల్సినవి ఇవ్వకపోతే కేంద్రాన్ని నేలమట్టం చేస్తాం మోదీ గుజరాత్‌కు ప్రధానిలా కాదు..దేశానికి ప్రధానిలా వ్యవహరించాలి. బుల్లెట్ ట్రైన్ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఒకటికి పదిసార్లు అడుగుతాం. ఇస్తే సరి..ఇవ్వకపోతే నేల మట్టం చేస్తాం. తెలంగాణ ప్రజల వ్యవహారం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూస్తుంది..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా సోనియా, రాహుల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2029లో రాహుల్‌ను ప్రధానిని చేయాలి మీనాక్షి మాట్లాడుతూ.. గుజరాత్ డీసీసీ అధ్యక్షుల పనితీరును ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది మనకు పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే 2028లో జరిగే పరీక్షలో గెలుస్తాం. ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసుకోగలం. అలా చేసుకోలేకపోతే మీరు నేను ఉండి ప్రయోజనం లేదు.’ అని వ్యాఖ్యానించారు. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసుకుంటూ వెళుతుంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గుర్తిస్తారని చెప్పారు. ఈ రోజు పనిచేసి రేపే ఫలితం రావాలంటే కుదరదని అన్నారు. డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, డీసీసీల కొత్త, పాత అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు పాల్గొన్నారు. కొందర్ని గదిలో వేసి కొట్టాలనిపించేది – సీఎం రేవంత్‌రెడ్డి నాకు ముఖ్యమంత్రి కాక ముందు చాలామంది మీద కోపంగా ఉండేది. కొంతమందిని గదిలో వేసి కట్టె తీసుకుని అలసి పోయేంతవరకు కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టా. మన శక్తినెందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పని మీద ఉన్నా. -
ఓట్ చోర్ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
-
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు
ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్ వెజ్ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు. హైకమాండ్ ఆవరణలో బంతి.. గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది. హైకమాండ్ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్‌గాందీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్ త్వరలోనే ఇద్దరినీ పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. -
ప్రజల ఆస్తి కాంగ్రెస్‌కు ఏటీఎం.. రాహుల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షల కోట్ల విలువైన తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారుస్తామంటే ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతానికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీకి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్‌పి)ని భారత్‌లోని అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటిగా కేటీఆర్ అభివర్ణించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసీ మౌనంగా ఉందా?’అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేటాయించాయని వివరించారు. అయితే, ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను హిల్ట్‌పి కింద తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకు క్రమబద్ధీస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం ఈ పాలసీలో దాగున్న రాజకీయ అవినీతిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల కోసమే... ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలని పైకి చెబుతున్నా.. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే, తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని చెప్పారు. ఈ భూముల బదిలీ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని వివరించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ‘ఈ విధానాన్ని కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు తమ కోసం ఈ పాలసీని తెచ్చారు’అని కేటీఆర్ ఆరోపించారు. స్పందించకుంటే మీకూ భాగస్వామ్యం ఉన్నట్లే..: ‘పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణాన్ని అడ్డుకోండి. మౌనంగా ఉంటే మీకు (రాహుల్ గాం«దీని ఉద్దేశించి), కాంగ్రెస్ పారీ్టకి భాగస్వామ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ భూ కుంభకోణం జరుగుతున్నదని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
National Herald Case: ‘గాంధీ’లకు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) నేరపూరిత కుట్ర అభియోగాలు మోపింది. గాంధీలతో పాటు సామ్ పిట్రోడా, మరో ముగ్గురు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), యంగ్ ఇండియన్ (వైఐ), డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేర్లను కూడా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో చేర్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ అక్టోబర్ 3న రూపొందించారు. ఇందులో గాంధీలు దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్‌ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.ఈ కేసు 2012 నాటిది. నాడు బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని స్వామి ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్ ప్రచురించేది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు. ఈ యంగ్ ఇండియన్‌లో గాంధీ కుటుంబం 76 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన వాటాలను మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సామ్ పిట్రోడా, సుమన్ దూబే కలిగి ఉన్నారు. ఈ విధంగా యంగ్ ఇండియన్ ఏజెఎల్‌లో మెజారిటీ వాటాదారుగా మారింది.ఈ లావాదేవీలో కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీ అయిన డోటెక్స్ మర్చండైజ్, యంగ్ ఇండియన్‌కు రూ. కోటి అందించింది. ఈ డబ్బులో యంగ్ ఇండియన్.. కాంగ్రెస్‌కు రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి, రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్ నియంత్రణను పొందిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టు ఈ కేసులో నిర్ణయం ప్రకటించడానికి డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే ఈ నేరపూరిత కుట్ర అభియోగాలతో కూడిన తాజా ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే.. -
ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చించాలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చిన వాయు కాలుష్యంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించకుండా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే కఠినమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై మోదీ ప్రభుత్వం స్పందించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో తనను కలిసేందుకు వచి్చన మహిళలతో మాట్లాడారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ విడుదల చేశారు. ‘కాలుష్యం ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. నా వద్దకు వచి్చన ప్రతి మహిళా కాలుష్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు. ఎదిగే చిన్నారులు విష వాయువులను పీల్చుతున్నారంటూ వారు ఆగ్రహం, ఆందోళన చెందుతున్నారు. మీరెందుకు ఇది అత్యవసర సమస్య అని భావించడం లేదు? బాధ్యతగా ఎందుకు తీసుకోవడం లేదు?’అంటూ ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మన చిన్నారులకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి.. సాకులు గానీ, పక్కదారి పట్టించే చర్యలు గానీ కాదు’అని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలో జీవించే అత్యంత నిరుపేదల నుంచి అత్యంత ధనికుల వరకు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాలుష్యంతో లాభాలను ఆర్జిస్తున్న వారు బాధితుల కంటే శక్తివంతైన వారు కావడం వల్లే ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కలుషిత గాలిని పీల్చుతూ దేశంలో రోజుకు 500 మంది వరకు చిన్నారులు చనిపోతున్నారని రాహుల్ చెప్పారు. అయినప్పటికీ దీనినో అత్యవసర అంశంగా ప్రభుత్వం భావించడం లేదని నిప్పులు చెరిగారు. బాధితులుగా ఉన్న సామాన్యులకు సంఘటితమైన రాజకీయ శక్తి లేకపోవడం వల్లే సమస్య తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన తెలిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరపాల్సిందేనన్నారు. ‘గడిచిన 15 ఏళ్లుగా ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి పడిపోయింది. వచ్చే పదేళ్లలో మరింత అధ్వానంగా మారనుంది. ఇప్పటికీ స్పందించకుంటే ఇదో విస్ఫోటంలా మారుతుంది’అని ఈ సందర్భంగా ఓ మహిళ రాహుల్‌తో అన్నారు. -
కర్ణాటకం.. ఓవర్ టు ఢిల్లీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పారీ్టలో నెలకొన్న అధికార పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో శనివారం సాయంత్రం 5 గంటలకు అగ్ర నేత సోనియాగాంధీ నేతృత్వంలో హైక మాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాం«దీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇంచార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా పాల్గొననున్నారు. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఆయ నను కొనసాగిస్తే గనుక ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది హైకమాండ్ చర్చించనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదివారం ఢిల్లీ రావాలని అధిష్ఠానం కోరింది. దీంతో కర్ణాటకలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సూచనలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు, సిద్ధరామయ్య, శివకుమార్‌లతో మాట్లాడి, ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. విదేశాల నుంచి సోనియా రాకతో... కర్ణాకటలో ఓవైపు సిద్ధు, డీకే వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా... కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓసారి (గురువారం) సమావేశమై రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే, విదేశాల్లో ఉన్న సోనియా అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం నాయకుల సలహాలు తీసుకుని భేటీని ముగించారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచి్చన సోనియా శనివారం అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఇందులో సోనియాతో పాటు అధిష్ఠానం పెద్దలు కర్ణాటకపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే సిద్ధు, డీకేలను ఢిల్లీ రమ్మని కోరినట్లు సమాచారం. వారితో సమాలోచనలు చేసి ఆదివారం సాయంత్రంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తమ నిర్ణయాన్ని వెల్లడించి... ఇద్దరినీ సముదాయించి పారీ్టకి నష్టం కలగకుండా చూసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నేడు డీకే–సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ హైకమాండ్ పిలిస్తే తప్పకుండా ఢిల్లీకి వెళతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారు ఏమి తీర్మానిస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తానన్నారు. అధిష్ఠానం సూచనలతో డీకేను శనివారం తన నివాసం కావేరికి బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహా్వనించానన్నారు. ఇద్దరం మాట్లాడుకుని ఢిల్లీకి వెళతామని తెలిపారు. కాగా, నాయకత్వ మార్పుపై సిద్ధు, డీకే కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ధారణకు వచ్చాకనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ మేరకే సిద్ధు బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జోరందుకున్న విందు రాజకీయాలు అధికార మారి్పడిపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నేతలతో రహస్య చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీంతో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. శుక్రవారం మంత్రి కేహెచ్ మునియప్ప నివాసంలో అహింద నాయకుల సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ అల్పాహార విందులో హైకమాండ్ వద్ద పరపతి ఉన్న ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కూడా పాల్గొనడం విశేషం. వీరితోపాటు మాజీ మంత్రి ఆంజనేయ, మాజీ ఎంపీ చంద్రప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణయ్య తదితరులు గంటకుపైగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అనేక సామాజికవర్గాలు, సంఘాలు, కాంగ్రేసేతర సంస్థలు శ్రమించాయని బీకే హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను అధిష్ఠానం చాలా సీరియస్‌గా తీసుకుందని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. మునియప్ప మాట్లాడుతూ అధికార మార్పిడి వివాదాన్ని హైకమాండ్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే తాను కూడా వెళ్లి హైకమాండ్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. డీకేకు మద్దతుగా ఒక్కలిగలు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పట్టనాయకనహళ్లికి చెందిన నంజావధూత స్వామిజీ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార మారి్పడిపై మాట తప్పితే పరమాత్మ అభినందించడని నంజావధూత పదేపదే మాట్లాడుతూ డీకేకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. కాగా, డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ ఢిల్లీ చేరుకుని అధిష్ఠానం పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి డీకేను సీఎం చేయాలనే తమ డిమాండ్ వినిపించారు. సీఎంకు మద్దతుగా కురబలు డీకే వర్గం ప్రయత్నాలకు ప్రతిగా సిద్ధు వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు గళం వినిపిస్తున్నారు. ఐదేళ్లు సిద్ధునే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్‌ఖాన్, హెచ్‌సీ మహదేవప్ప, రామలింగారెడ్డి తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నారు. సిద్ధు సొంత సామాజిక వర్గం కురుబ వర్గానికి చెందిన స్వామిజీలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బలప్రదర్శనకు కూడా కురుబలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం.. కానీ, మాటల్లేవ్ ఓవైపు కుర్చీలాట కొనసాగుతున్నా.. సిద్ధు, డీకే శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చొన్నప్పటికీ ఎవరికి వారు యమునా తీరు చందంగా మాట్లాడుకోలేదు. ఇద్దరు నేతలు చూసీ చూడనట్లుగా ప్రవర్తించడం గమనార్హం. డీకే కుర్చీలో కూర్చొనే సమయంలో సిద్ధు వైపు చూసేందుకు ప్రయత్నించలేదు. ఇదంతా గమనించిన సిద్ధు ఆహ్వాన పత్రం చదువుకుంటూ ఉండిపోయారు. నమ్మకాన్ని మించిన గుణం లేదు అన్ని వర్గాలు నాకు మద్దతు ఇస్తున్నాయి నా కులం కాంగ్రెస్ పార్టీ..: డీకే ‘ఇచ్చిన మాట’విషయమై గురువారం సిద్ధు, డీకే మధ్య ట్వీట్ల వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ఓ బహిరంగ సమావేశంలో డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారాయి. ‘‘నిమ్మ కంటే పులుపైన వస్తువు ఇంకోటి లేదు. శంభు అంటే పరమేశ్వరుడు. ఆయన కంటే దేవుడు లేడు. నమ్మకం కంటే ఇంకో గుణం లేదు’’అంటూ సర్వజ్ఞ వచనాలను ఉటంకిస్తూ హైకమాండ్‌పై తన నమ్మకాన్ని, విశ్వాసం గురించి పరోక్షంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు దేవాలయం. ఢిల్లీలో మాకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. అందుకే అక్కడికి వెళ్తుంటాం. నాకు ఎలాంటి సామాజికవర్గాల వ్యాఖ్యానాలు, మద్దతు అవసరం లేదు. నా కులం కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలు నాకు మద్దతుగా ఉన్నాయి. ఏ ఒక్క వర్గానికో నేను పరిమితం కాదు’’అని పేర్కొన్నారు. 28బీఎన్‌జీ70: బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ -
ఇంత జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారేం?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన. ‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం!
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆయా అంశాలు ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యపై రాహుల్ అసహనానికి కారణాలను విశ్లేషిస్తే... అధిష్టానం ఎవరనే చర్చకు తావిచ్చిన సీఎం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియజేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ గడచిన వారాంతంలో సూచించారు. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ.. తాను రాహుల్‌తో మాత్రమే చర్చిస్తానని, నేరుగా అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. బహుషా ఈ కారణంతోనే మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మారి్పడి విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ‘పార్టీ హైకమాండ్’ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఖర్గే ఈ ‘అసహాయ వ్యాఖ్యలు’ చర్చనీయాంశమయ్యాయి. దీనంతటికీ సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే కారణమని రాహుల్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నట్లు నివేదికల అందడం రాహుల్ అసహనానికి మరొక కారణం. దేవరాజు అరస్ రికార్డును అధిగమించిన తర్వాత రాజీనామా? మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య డిసెంబర్లో అధిగమిస్తారు. దీంతో అప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్ అంటే అదొక బృందం: ఖర్గే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మరో ముగ్గురు నలుగురు కీలక నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని చర్చించి అన్నింటికి పరిష్కారం చూపుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం బెంగళూరులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఒకే ఒక్కరు కాదని, అదొక బృందమని, పార్టీ పెద్దలంతా కలసికట్టుగా కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామన్నారు. సోనియాగాంధీ శుక్రవారం విదేశాల నుంచి వచ్చాక ఈ సమస్య పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వీలుంది.సీఎం, డిప్యూటీ సీఎం ‘ట్వీట్ల’ యుద్ధం!కర్ణాటక పరిణామాలు తాజాగా ‘ట్వీట్ల’ రాజకీయానికి దారితీశాయి. డిప్యూటీ సీఎం చేసినట్లు చెబుతున్న ఒక ట్వీట్‌కు కౌంటర్‌గా అన్నట్లు సీఎం మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలో పెద్ద శక్తి’ (వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్) అని డీకే శివకుమార్ ‘ట్వీట్’ చేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ‘ఈ ట్వీట్ ద్వారా’ గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని, అదొక నకిలీ పోస్టు అని డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కాగా ‘ప్రజల కోసం మంచి ప్రపంచం నిరి్మంచలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే’ అని అర్థం వచ్చేలా సీఎం ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదేళ్ల పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వ చేపట్టిన పలు పథకాలను వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకు ఒక ప్రపంచమని ట్వీట్ చేశారు. -
సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే
సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారుపవర్ షేరింగ్ ఏంటంటే..2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. -
DK.. నేను ఫోన్ చేస్తా.. రాహుల్ మెసేజ్
-
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్‌లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ఎస్ఐఆర్)ను ఉద్దేశ పూర్వక కుట్రగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తు న్నారని మండిపడ్డారు. బీఎల్వోల మరణాలపై ఆదివారం ఎక్స్‌లో వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీని ఫలితంగా మూడు వారాల్లో 16 మంది బీఎల్వోలు ప్రాణాలు తీసుకున్నారు. గుండెపోటు, ఒత్తిడి, ఆత్మహత్యలకు దారి తీశాయి. ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, ఇది మోపబడిన నేరం. మన దేశం ప్రపంచం కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కాగితపు అడవిని సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర. పౌరులు ఇక్కడ వేధింపులకు గురవుతున్నారు. అనవసరమైన ఒత్తిడి కారణంగా బీఎల్వోల మరణాలను అనుకోకుండా జరిగిన నష్టంగా భావించి విస్మరిస్తున్నారు. ఇది వైఫల్యం కాదు, కుట్ర. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తున్నారు’అని రాహుల్ ఈసీ, కేంద్రంపై విరుచుకుపడ్డారు.బీఎల్వోల పాలిట మృత్యుపాశం: ఖర్గేవివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ బీఎల్వోల పాలిట మృత్యుపాశంగా మారుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పని భారం తట్టుకోలేక బీఎల్వోలు ప్రాణాలు తీసుకుంటుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడంపై ఆయన నిప్పులు చెరిగారు. గతంలో నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ నిర్ణయాలను ప్రజల మీద ఎలాగైతే రుద్దారో.. ఇప్పుడు ‘ఎస్ఐఆర్’ను కూడా అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా అమలు చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేవలం 19 రోజుల్లోనే 16 మంది బీఎల్వోలు పని ఒత్తిడి కారణంగా మరణించారని, ఇవి ఇంకా కొనసాగుతున్నాయని ఖర్గే ‘ఎక్స్’వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కానీ ఈ కుటుంబాలకు న్యాయం చేసేదెవరు? బీజేపీ ఓట్ల చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. అధికార దాహంతో రాజ్యాంగ సంస్థల అధికారులను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు’అని విమర్శించారు. -
డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలంటున్న ఆయన వర్గం ఎమ్మెల్యేలు
-
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాంఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్‌బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్‌కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్‌కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్‌పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్‌లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. -
నవీన్ యాదవ్‌కు రాహుల్ అభినందనలు
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌నూ ఆయన అభినందించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. -
అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..
-
‘ఇప్పుడు సఫారీనా?’.. రాహుల్‌పై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ నేపధ్యంలో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ఉల్లాసంగా మధ్యప్రదేశ్‌లో జంగిల్ సఫారీకి వెళ్లడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. LoP means Leader of Paryatan and partying for Rahul GandhiEven as Bihar elections are on : Rahul Gandhi goes for vacationElection in Bihar, Rahul Gandhi enjoying a "Jungle Safari" in PachmarhiThis shows his priorities When they lose elections they will blameECI & do a… pic.twitter.com/GBCCCqTziR— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) November 9, 2025ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకమైన ఎన్నికల దశలో రాజకీయ వాస్తవికతకు దూరమయ్యారని, ఆయనలో సీరియస్ నెస్ లోపించిందిన బీజేపీ ఆరోపించింది.‘ఎక్స్’ పోస్ట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా స్పందిస్తూ, ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ)రాహుల్ గాంధీ పర్యాటక నేతగా మారి, పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాహుల్ గాంధీ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారని. బీహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా రాహుల్ గాంధీ పచ్మరిలో జంగల్ సఫారీని ఆస్వాదించారని, ఇది ఆయన ప్రాధాన్యతలను తెలియజేస్తుందని’ ఆరోపించారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు వారు భారత ఎన్నికల సంఘాన్ని నిందిస్తారని , హెచ్ ఫైల్స్ అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారని షెహజాద్ పూనవాలా దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ వారు జీవితమంతా ఇదే తప్పు చేస్తారని, వారి ముఖం మీద దుమ్ము ఉన్నప్పటికీ, వారు అద్దం శుభ్రం చేస్తూనే ఉంటారని ఆయన ఒక సామెతను ఉదహరించారు. కాగా శనివారం మధ్యప్రదేశ్ చేరుకున్న రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మరోమారు ఓటు చోరీ గురించి మాట్లాడారు. ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్ -
‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్
భోపాల్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ’ అంశాన్ని ఆయుధంగా చేసుకుని, బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నర్మదాపురంలోని పచ్మరి కొండ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు చోరీ’ని కప్పిపుచ్చేందుకే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)నిర్వహించారని, అలాగే ఇది ఓటు చోరీని సంస్థాగతీకరించడానికి చేసిన ఒక ప్రయత్నమని ఆరోపించారు.విలేకరులతో రాహుల్ మాట్లాడుతూ..హర్యానాలో మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లలో కూడా ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను హర్యానాలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చానని, అప్పుడు ఓటు దొంగతనం ఓలా జరుగుతోందో స్పష్టంగా వివరించానని అన్నారు. హరాన్యాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి ఎనిమిది ఓట్లలో ఒక కోటు చోరీ అయ్యిందని రాహుల్ ఆరోపించారు. ఈ డేటాను చూసిన తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదే జరిగిందని తాను నమ్ముతున్నానని అన్నారు.తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని తాము క్రమంగా అందిస్తామని రాహుల్ పేర్కొన్నారు. తొలుత తన సమస్య ఓటు చోరీ అని, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అన్నారు. కాగా విలేకరులు రాహుల్‌ను ‘భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వివరాలను వెల్లడిస్తారా?’ అని అడిగినప్పుడు ఆయన తమ దగ్గర చాలా భిన్నమైన సమాచారం, వివరణాత్మక సమాచారం ఉందని, దానిని వెల్లడిస్తామని అన్నారు. ఇప్పటివరకూ కొంచెమే వెల్లడించామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ల ఉమ్మడి భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతున్నదని రాహుల్ ఆరోపించారు. దీని కారణంగా భారతమాతకు హాని జరుగుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం -
ఎన్నికల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు..!
బంకా: ఓట్లనే కాదు, కాషాయ దళం ఏకంగా ఎన్నికలనే చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో చేసినట్లే బీజేపీ చోరీ చేసిందని, గుజరాత్లో మళ్లీ మళ్లీ ఇదే జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని జెన్ జెడ్‌కు, యువతకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చూపిస్తుందని, ఇందులో సందేహమే లేదని తెలిపారు. బీజేపీ నేతలే లక్ష్యంగా ఆయన మరోసారి ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ నేతలు కొందరు, బిహార్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్‌లోనూ పాల్గొని ఓటేశారని విమర్శించారు. సంబంధించిన పేర్లు తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. బిహార్‌లోని బంకాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. హరియాణాలో చోటుచేసుకున్న ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధారాలను అందజేసినా ఎన్నికల కమిషన్ మాత్రం ఖండించలేదన్నారు. హరియాణా ప్రభుత్వం చోరీతో ఏర్పాటైన ప్రభుత్వమని ధీమాతో చెప్పగలనన్నారు. గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాష్ట్ర ఓటరు జాబితాలోని 2 కోట్లకుగాను కనీసం 25 లక్షల నకిలీ పేర్లున్నాయని, బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఆ పారీ్టతో కుమ్మక్కయిందని విమర్శించారు. ఈసారి బిహార్‌లో అలా కానివ్వబోమన్నారు. ఇందుకు ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం యువతను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలంటూ ప్రేరేపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు వ్యసనమే రీల్స్ అన్నారు. బిహార్ రైతులకు బ్యాంకులు రుణాలి్వడం లేదు, రుణాలను మాఫీ చేయడం లేదని భాగల్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన ఆరోపించారు. కానీ, ఇష్టమైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. బీజేపీ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రోజులో 24గంటలూ ప్రధాని మోదీ మొహం చూపించేందుకు టీవీ చానెళ్లకు బీజేపీ భారీగా చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు. -
‘నేను బిహార్‌లో ఓటేశా.. ఇక మీ వంతు..!’
పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్‌లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్‌లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్‌నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్‌లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు. Voted for a Modi-fied India! 🇮🇳Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025 ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.लोकसभा में महाराष्ट्र में वोट करूंगी विधानसभा में बिहार में वोट करूंगी मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025ఇవీ కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు -
ఈసీ మౌనం సిగ్గుచేటు!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా ప్రయోగిస్తానంటూ చెప్పిన ‘హైడ్రోజన్ బాంబు’ ఎట్టకేలకు బిహార్ తొలి దశ పోలింగ్‌కు 24 గంటల ముందు బుధవారం బద్దలైంది. ఇది నిరుడు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల జాబితాకుసంబంధించింది. రాహుల్ చెబుతున్న ప్రకారం అందులో 25 లక్షలమంది నకిలీ ఓటర్లున్నారు. సహజంగానే ఎన్నికల సంఘం(ఈసీ) మినహా దేశంలో అందరికీ ఈ విషయం దిగ్భ్రాంతి కలిగించింది. బ్రెజిల్లో ఉంటున్న పోర్చుగీసువాసి హెయిర్ డ్రెసర్ లారిసా నెరి అనే యువతి ఫొటోకు ఈ జాబితాలో చోటు దొరికింది. ఒకసారి కాదు... 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 22 సార్లు వినియోగించారు. ‘సెర్చ్’లో దొరక్కుండా ఒక్కో చోట ఒక్కో పేరు తగిలించారు. స్వీటీ, సరస్వతి, సీమ...ఇలా బహుళ నామధేయాలతో ఆమె మన ఎన్నికల జాబితాలో వర్ధిల్లింది. బహుశా 22 సార్లూ తన ఓటు హక్కు ‘విని యోగించుకుని’ ఆమె తన ‘పవిత్ర కర్తవ్యాన్ని’ నెరవేర్చి ఉంటుంది. మీడియా సమావేశంలో ఆమెను రాహుల్ బ్రెజిల్ మోడల్‌గా చెప్పారు. ఇది స్పీడ్ యుగం కనుక ఆ సమా వేశం ముగిసిన వెంటనే విషయం ఆమెకు చేరిపోయింది. ఏనాడూ సందర్శించని దేశంలో ఎన్నికల జాబితాలో తన పాత ఫొటో రావటంపై ఆమె బోలెడు ఆశ్చర్యపోతోంది. జనాన్ని దగా చేయటానికి తన ఫొటో వినియోగించి ఉంటారని సరిగానే గుర్తుపట్టింది.నకిలీ ఓటర్ల పంచాయతీ రాహుల్–ఈసీలకు సంబంధించింది కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరి మాటే నిజం కావాలి కనుక జరిగిందేమిటో ఈసీ సంజాయిషీ ఇచ్చితీరాలి. తప్పు తనవైపుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ ఆరోపణ అవాస్తవమైతే ఆయనపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదీ చేయకుండా ‘అప్పుడెందుకు చెప్పలేద’ంటూ దబాయింపులకు దిగటం నైతిక పతనానికి చిహ్నమవుతుందే తప్ప సమర్థవంతమైన జవాబు కానేరదు. సీ–డాక్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉపకర ణాన్ని 2022లో వినియోగించారు. వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) పేరిట జరిగిన ఆ ప్రక్రియలో దాని సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగించారు. ఇవన్నీ ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదైన ఓట్లు, చెల్లని ఓట్లు. ఆ ఉపకరణం ఒకటికన్నా ఎక్కువసార్లు వినియోగించిన ఫొటోను కూడా పసిగడుతుంది. దానికి ఎందుకు స్వస్తి చెప్పారో ఈసీ సంజాయిషీ ఇవ్వాలి.అసలు ఈసీకీ, ఈ 12.5 శాతానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటో అర్థంకాదు. రాహుల్ లెక్క ప్రకారం హరియాణాలో 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలైన వెంటనే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికీ, నాలుగు రోజుల తర్వాత అదే సంస్థ చెప్పిన శాతానికీ మధ్య వ్యత్యాసం కూడా 12.5 శాతమే! ఇంత శ్రద్ధగా లెక్క పాటిస్తున్న మాయావులెవరో ఈసీ తేల్చుకోవాలి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఎగవేత ధోరణిలో జవాబిస్తున్నందువల్ల కేంద్రం జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. జాబితాలో చేరిన నకిలీ ఓట్ల సంగతలా ఉంచి... గల్లంతైన ఓట్లు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్డీటీవీ బృందం ఆరా తీసిన ప్రకారం హరి యాణాలో ఒక గ్రామంలోని పలు కుటుంబాల్లో రెండు నుంచి నాలుగు ఓట్లు గల్లంత య్యాయి. చిత్రమేమంటే వీరు ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాదిరి లీలలు బహు విధాలు! నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచే అక్రమాలు మొదలైపోయాయి. నిజానిజాలేమిటో నిర్ధారించుకోకుండానే కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయి దేళ్లుగా అమలవుతున్న పథకాలు ఆపేశారు. బదిలీల వెనకున్న కుతంత్రమేమిటో పోలింగ్ రోజు హింస బయటపెట్టింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షలు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇక ఈవీఎంల విన్యాసాలు అనంతం. సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసి 17 నెలలు గడుస్తున్నా జవాబు లేదు! కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించి కూడా ఇలాగే ఫిర్యాదులొచ్చాయి. ఈ స్థితిలో జరుగుతున్న, జరగబోయే ఎన్నికలపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇకనైనా ఈసీ బాధ్యులు నోరు విప్పాలి. ఆ ఉద్దేశం లేకుంటే తప్పుకోవాలి. -
నెట్టింట వైరల్ గా మారిన బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ
-
‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్
న్యూఢిల్లీ: హార్యానా ‘ఓట్ చోరీ’ ఆరోపణల సందర్భంగా రాహుల్ గాంధీ చూపిన ఫొటోపై బ్రెజిలియన్ మోడల్ లారెస్సా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఈ మోడల్ ఫొటోతో ఏకంగా 22 పేర్లు నమోదై ఉన్నాయని రాహుల్ గాంధీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫొటో ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో లారెస్సా ఎక్స్ వేదికపై స్పందించారు. రాహుల్ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు. The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన -
అప్పుడెందుకు చెప్పలేదు?
న్యూఢిల్లీ: బీజేపీతో అంటకాగి హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన ఎన్నికల కమిషన్ కారణమైందంటూ రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెనువెంటనే స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ఎందుకు ఆనాడే ఈ అభ్యంతరాలను తెలపలేదని ఈసీ ఎదురు ప్రశ్నించింది. హరియాణాలో ఎన్నికల ముందు జరిగిన ఓట్ల సవరణల ప్రక్రియ వేళ కాంగ్రెస్ ఎందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ ప్రశ్నించింది. ‘‘గత ఏడాది అక్టోబర్‌లో హరియాణాలో ఎన్నికలు జరిగాయి. అంతకుముందే ఆయా నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓట్లు ఉంటే తక్షణం రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నట్లు? ఓట్లేసేటప్పుడు పోలింగ్ కేంద్రాల్లో కూర్చున్న కాంగ్రెస్ ఏజెంట్లు చూస్తూ ఊరుకున్నారా? ఫలానా ఓటు అప్పటికే పోల్ అయినట్లు మీకు అనుమానం వస్తే ఎందుకు వెంటనే అక్కడి అధికారులకు తెలియజేసి అభ్యంతరం చెప్పలేదు? ఓటరు గుర్తింపుపై అనుమానాలుంటే ఎందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదు?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఇంటి నంబర్ సున్నా ఎందుకు వేశారని, ఈ ప్రక్రియలో తప్పలు ఉన్నాయంటూ రాయ్, హోడల్ నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 22 పిటిషన్లు అందాయి. అవన్నీ ఇంకా పంజాబ్, హరియాణా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి 23 పిటిషన్లు వస్తే ఒకటి ఉపసంహరించుకున్నారు. తన ఆరోపణలకు సంబంధించి పూర్తి, సమగ్ర ఆధారాలను రాహుల్ బయటపెడితే బాగుంటుంది’’ అని అధికారి హితవు పలికారు. ‘‘ ప్రతి రాష్ట్రంలో డూప్లికేట్ ఓ ట్లు, మృతిచెందిన ఓటర్ల ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేను మొదలెట్టాం. ఎస్ఐఆర్కు రాహుల్ మద్దతు పలుకుతున్నారా? వ్యతిరేకిస్తున్నారా? కనీసం బిహార్‌లో అయినా ఎస్ఐఆర్ వేళ ఎందుకు కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లు అభ్యంతరాలు తెలపలేదు?’’ అని అధికారి ప్రశ్నించారు. రాహుల్ అబద్ధాలాడుతున్నారు: హరియాణా సీఎం నకిలీ ఓట్లతో హరియాణాలో బీజేపీ గెల్చిందని, అందుకే నాయబ్ సింగ్ సైనీ సర్కార్ కొలువుతీరందని రాహుల్ చేసిన విమర్శలపై సైనీ స్పందించారు. ‘‘ రాహుల్ అబద్ధాలు చెప్తున్నారు. ఆయన కుటుంబంలో నాలుగు తరాల వాళ్లు దేశాన్ని పరిపాలించారు. అయినాసరే అబద్ధాలు చెప్పే అలవాటు రాహుల్‌కు పోలేదు. ఇక్కడ ఎలాంటి చర్చనీయాంశం లేకపోయినా కాంగ్రెస్ వాళ్లు జనాలను తప్పుదోవ పట్టిస్తారు’’ అని సైనీ వ్యాఖ్యానించారు. -
ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నిల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై సాధారణ విమర్శలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం భారీ హైడ్రోజన్ బాంబు పడేశారు. ఏకంగా పాతిక లక్షల నకిలీ ఓట్లతో, ఈసీ అండదండలతో హరియాణా ఎన్నికల్లో బీజేపీ దొంగమార్గంలో గెలిచిందని రాహుల్ విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను చోరీచేశారని ఆరోపించారు. హరియణాలో బీజేపీ విజయం సాధించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు బీజేపీతో కలిసి పనిచేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీళ్లంతా ప్రధాని మోదీకి భాగస్వాములని వ్యాఖ్యానించారు. ఈ విమర్శల జడివానకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికైంది. బుధవారం మీడియా సమావేశంలో రాహుల్ పలు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. బిహార్ తొలి దశ పోలింగ్‌కు కొన్నిగంటల ముందు రాహుల్ ఈ విమర్శల జల్లు కురిపించారు. సీమా.. స్వీటీ.. సరస్వతి.. ‘‘హరియాణాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ఐదు వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కాంగ్రెస్ 73 చోట్ల గెలిస్తే బీజేపీకి 17 సీట్లే వస్తాయని చెప్పాయి. కానీ బీజేపీ చేసిన ఈ ఓట్ల చోరీ, నకిలీ ఓట్ల దందాతో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ వ్యక్తులు అటు ఉత్తరప్రదేశ్‌లో ఓటేసి తర్వాత హరియాణాలోనూ ఓటేశారు. పాతిక లక్షల ఓట్లు ఉన్నాయనడానికి ఈ బ్రెజిల్ మోడలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈమె ఫొటో, వివరాలతో 22 ఓట్లు ఉన్నాయి. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా 22 పేర్లతో ఉన్న ఓట్లన్నీ ఈమె ఫొటోతో నమోదై ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో 10 బూత్‌లలో ఆ ఓట్లన్నీ పోలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు నేతలు అటు ఉత్తరప్రదేశ్‌లో ఇటు హరియాణాలో ఓటర్లుగా నమోదయ్యారు. బీజేపీ నేత దాల్చంద్ యూపీ, హరియాణాల్లో ఓటేశారు. మథురలో బీజేపీ సర్పంచ్ ప్రహ్లాద్ అదే పనిచేశారు. ఇలాంటి వాళ్లు వేలల్లో ఉన్నారు. పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్, బీజేపీ నేత 150వ నంబర్ ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఏకంగా 66 ఓట్లు ఉన్నాయి. ఇంకొకరైతే తన ఇంట్లో 500 మంది ఓటర్లు ఉన్నారని అన్ని ఓట్లను నమోదుచేశాడు. ఇవన్నీ మేం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి తెల్సుకున్నవే. ఇక హరియాణా ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బ్యాలెట్ ఓట్లు అనేవి వాస్తవ ఓటర్లతో సరిపోలలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. కాంగ్రెస్ చరిత్రాత్మక విజయాన్ని వ్యవస్థీకృత నేరం ద్వారా ఓటమిగా మార్చేశారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అటు పోరాడుతుంటే ఇటు చంపేశారు ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని సర్కార్చోరీ విధానంతో నాశనంచేశారు. ఈ వినాశనానికి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అనేది సరికొత్త ఆయుధంగా దాపురించింది. బిహార్‌లోనూ ఓటు చోరీని మొదలెట్టారు. మేం విపక్ష పార్టీలతో కలసి ఓ వైపు ఎస్ఐఆర్పై పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కొన్ని శక్తులు చంపేస్తున్నాయి. ఆనాడు హరియాణా ఓట్ల లెక్కింపునకు రెండ్రోజుల ముందు సీఎం నయాబ్ సైనీ ఓ మాట అన్నారు. ఒక వ్యవస్థను సిద్ధంచేశాం. అందుకే మేం గెలవబోతున్నాం అని అన్నారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. కర్ణాటకలోని మహాదేవపుర, ఆలంద్ నియోజకవర్గాల్లో జరిగిన మోసమే రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో జరుగుతోందని మాకు అర్థమైంది’’ అని రాహుల్ వివరించారు.మోదీ, ఈసీల సారథ్యంలో వ్యవస్థీకృత ఓటు చోరీ ‘‘ప్రధాని మోదీ, ఎలక్షన్ కమిషన్ సంయుక్తంగా వ్యవస్థీకృత ఓటు చోరీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈసారి బిహార్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు దానిని రంగంలోకి దింపుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈసీ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. వీళ్లంతా మూకుమ్మడిగా దేశ ప్రజాస్వామ్య పునాదులను పెకలిస్తున్నారు. ఓట్ల చోరీని ఓ పరిశ్రమగా మార్చేశారు. పోలింగ్ జరిగే ప్రతి రాష్ట్రానికి దానిని పట్టుకొస్తున్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేదిక మీదకు రాహుల్ కొందరు బిహారీ ఓటర్లను ఆహా్వనించారు. తన ఒక్కడి ఓటే తీసేశామని అధికారులు చెప్పారని, తీరాచూస్తే గ్రామంలో మరో 187 ఓటర్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయని ఆ బిహారీలు చెప్పారు. ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదే ‘‘ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకునే ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’కి ఈసీ తెరతీసింది. ఇంటి నంబర్ లేని సందర్భాల్లో, నిరాశ్రయులకు మాత్రమే ‘జీరో నంబర్’ ఇస్తామనేది శుద్ధ అబద్ధం. మా బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి లెక్కలేనన్ని లొసుగులను పట్టుకుంది. ఇంటి నంబర్ జీరో అని ఓటరు జాబితాలో ఉన్న వాళ్లెందరో తమ సొంత ఇళ్లలో ఉంటున్నారు. ఇల్లు లేని వాళ్లకు మాత్రమే జీరో నంబర్ కేటాయించామని ఈసీ చెబుతున్న దాంట్లో నిజం లేదు. హరియాణాలో 25,41,144 నకిలీ ఓట్లు ఉన్నాయి. వీటిలో చాలా ఓట్లు రెండు మూడు చోట్ల ఉన్నాయి. అంటే 5,21,619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. అడ్రస్‌లేని 93,174 ఓట్లు ఉన్నాయి. ఒక అడ్రస్‌పై వందల ఓట్లున్నాయి. అలాంటివి రాష్ట్ర ఓట్ల జాబితాలో ఏకంగా 19,26,351 ఓట్లు ఉన్నాయి. నకిలీ ఓటర్ల ఫొటోలతో 1,24,177 ఓట్లు సృష్టించారు. హరియణాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీదే. పాతికలక్షల ఓట్లు అంటే రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో 12 శాతం ఓట్లు నకిలీవే. ఒక్క నియోజకవర్గంలో 22,000 ఓట్ల మెజారిటీ అంటేనే చాలా పెద్ద సంఖ్య. అలాంటిది 25 లక్షల ఓట్లు అంటే ఇక లెక్కేసుకోండి. ఎంతటి కుట్ర జరిగిందో. ఈ కారణంగానే గత ఏడాది హరియాణా ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ 22,779 ఓట్ల తేడాతోఓడిపోయింది. ఈ అంకెల గారడీలు చూస్తే నేనే షాక్ అయ్యా. మీ భవిష్యత్తు ఎలా చోరీకి గురవుతోందో జెన్‌జెడ్ యువత ఇకనైనా తెల్సుకోవాలి’’ అని రాహుల్ అన్నారు. -
హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్ .. కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ విజయంగా మార్చేందుకు ఒక ప్రణాళికను అమలు చేశారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని విలేకరుల సమావేశంలో రాహుల్ తెలిపారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని, హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారున్నారు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలను చూపించే స్లయిడ్లను రాహుల్ ప్రదర్శించారు. ఓటు చోరీ కోసం బ్రెజిలియన్ మోడల్ వాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌ను నిర్వహిస్తోందని రాహుల్ ఆరోపించారు.అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని గుర్తుచేశారు. హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా “సున్నా అప్పీళ్లు” దాఖలు అయ్యాయన్నారు.ఇది కూడా చదవండి: నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ -
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
దర్భంగా: భారత్‌పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు.అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేలి్చచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. -
ఉచితంగా బైక్ ఇచ్చిన రాహుల్.. ట్విస్ట్ ఇచ్చిన యువకుడు
ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్‌ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్‌కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్‌లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్‌పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్‌ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్‌లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్‌కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్‌తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.‘ఓ కొత్త మోటార్ బైక్‌ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్‌కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.-సత్య. -
రాహుల్ తన ఇటలీ మూలాలు బయటపెట్టారు: అమిత్ షా
నలంద/లఖీసరాయ్: బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు. ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్‌పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది. నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్‌లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు. -
యుద్ధం ఆపానన్న ట్రంప్‌తో మోదీ వాదనలో గెలవలేరు
షేక్‌పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్‌పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్‌కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్‌లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. -
ఓట్ల కోసం అవమానిస్తున్నారు: ప్రధాని మోదీ
ముజఫర్‌పూర్: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్- ఆర్జేడీల మధ్య విభేదాలున్నాయని, అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలు, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. తనను చెడ్డ చేయడం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని ప్రధాని నర్రేంద మోదీ వ్యాఖ్యానించారు.ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గొడవలకు సంబంధించిన నివేదికలు తనకు అందుతున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు పరస్పర విభేదాలతో నీరు, నూనె మాదిరిగా ఉన్నాయని, అవి అధికారాన్ని చేజిక్కించుకుని, బీహార్‌ను దోచుకునేందుకే కలిసి వచ్చాయని ప్రధాని ఆరోపించారు. బీహార్‌లో వారి ర్యాలీలు బూటకం తప్ప మరేమీ కాదని, ఆ పార్టీలు ఎప్పటికీ బీహార్‌ను అభివృద్ధి చేయలేవని ప్రధాని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కొన్ని దశాబ్దాలుగా బీహార్‌ను పాలించాయని, అయితే వారు ప్రజలకు ఇచ్చినది ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమేనంటూ ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు.ఐదు నిదర్శనాలుఆర్జేడీ, కాంగ్రెస్‌ల దుష్ప్రవర్తనకు నిదర్శనాలుగా ఐదు విషయాలు ఉన్నాయని, అవి.. దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, క్రూరత్వం, సామాజిక ద్వేషం, దుష్ఫరిపాలన, అవినీతి.. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లో అత్యంత వేడుకగా జరుపుకునే ఛట్ పై ప్రధాని డ్రామా చేస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆరోపించారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఓట్ల కోసం ఛటీ మయ్యాను అవమానించారని ఆరోపించారు. వారికి ఛటీ మయ్యాను పూజించడం కేవలం ఒక నాటకం, ప్రహసనంలా కనిపించిందా అని ప్రధాని ప్రశ్నించారు. ఛట్ పూజను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ ‘బీజేపీతో సంబంధం కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని రాహుల్ పేర్కొన్నారు.గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది -
‘రైళ్లలో అమానవీయం’: బీహార్‌పై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్‌లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.‘బీహార్‌లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు. त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్‌ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. -
‘త్వరలో రాహుల్ పెళ్లి.. స్వీట్స్‌కు ఆర్డర్’?.. సంబరంగా చెప్పిన దుకాణదారు
న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని ఆ వివరాలు వెల్లడించారు.దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్ మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు. पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025రాహుల్ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్‌కు బేసన్ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.దుకాణానికి వచ్చిన రాహుల్ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి తీపిదనం ఇప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు. -
దళితుడిగా పుట్టడమే నేరమా?
కాన్పూర్: అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దళితులపై అణచివేత నానాటికీ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణాలో దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దళితుడైన హరిఓం వాల్మీకిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యాకాండ మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి గొంతు నొక్కేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని ఆరోపించాచారు. రాహుల్ గాంధీ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరిఓం తండ్రి, సోదరుడు, సోదరితో మాట్లాడారు. సంతాపం ప్రకటించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఇక్కడికి రాకుండా ఉత్తరప్రదేశ్ అధికారులు అడ్డంకులు సృష్టించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ దేశంలో దళితుడిగా జని్మంచడమే నేరమా? అనే ప్రశ్న బాధితుల కళ్లల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అకృత్యాలకు పాల్పడిన నేరగాళ్లను కాపాడడం, బాధితులనే శిక్షించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. న్యాయాన్ని గృహ నిర్బంధంలో ఉంచలేరని తేల్చిచెప్పారు. హరిఓం వాల్మీకి కుటుంబాన్ని వేధించడం ఇకనైనా మానుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హరిఓం వాల్మీకి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి బాధితుడికి, అణగారిన వర్గాలకు తన అండదండలు ఉంటాయన్నారు. ఈ పోరాటం కేవలం హరిఓం కోసం కాదని.. అన్యాయానికి తలవంచని ప్రతి గొంతుక కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. 40 ఏళ్ల హరిఓం వాల్మీకిని ఈ నెల 2న రాత్రిపూట గ్రామస్థులు కొట్టిచంపారు. అతడిని దొంగగా భావించి దాడిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్‌కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్‌గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
ఐపీఎస్ పూరన్ కుటుంబ సభ్యులకు రాహుల్ పరామర్శ
చండీగఢ్: హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్ కుమార్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్ అన్నారు. ఈ నెల 7న పూరన్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు.అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్ కుమార్ భార్య అమ్నీత్ పీ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఐపీఎస్ పురాన్ కుమార్‌ను పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని అమ్నీత్ పీ కుమార్ ఆరోపించారు. -
Bihar Elections : 40 ఏళ్ల తర్వాత రెండు దశలు.. మరిన్ని ఆసక్తికర సంగతులు
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్‌పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్డేట్ చేస్తారు.ఎవరి సంగతి ఏమిటి?నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.చిరాగ్ పాస్వాన్.. బీహార్‌లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.నితీష్‌కు నిజమైన పరీక్షఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.లాలూ కుటుంబంలో అంతర్గత పోరులాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మహిళల చేతుల్లో ఫలితాలు?బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి. -
అది భారత్‌కు అతిపెద్ద ముప్పు.. విదేశీ గడ్డపై రాహుల్
బొగోటా: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలోని భారత్‌లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్శిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. దీనిలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు. ‘ ప్రజాస్వామ్యం అనేది ప్రతీ ఒక్కరికీ చోటును కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరగుతున్నాయి. భారత దేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థలా ఏకరీతిలో ఉంది. భారత్ వికేంద్రీకృతమై ఉంది. సంస్కృతులు, సంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. చైనా చాలా కేంద్రీకృతమై, ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ వద్ద ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత భారత్ ఒకే లైన్లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి’ అంటూ విమర్శించారు.రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రచార ఆర్భాట నాయకుడే తప్ప ఏమీ లేదంటూ కౌంటరిచ్చింది. విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమే ఇందుకు నిదర్శమనమంటూ ధ్వజమెత్తింది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ప్రపంచ పటంలో భారత్ గణనీయ అభివృద్ధి రాహుల్‌కు కనబడటం లేనట్లుంది అంటూ ఎద్దేవా చేసింది. -
కరూర్ తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సోమవారం ఎఫ్ఐఆర్లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది. ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత కరూర్‌లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
‘రాహుల్ ప్రాణాలకు ముప్పు’.. అమిత్ షాకు కాంగ్రెస్ సంచలన లేఖ
న్యూఢిల్లీ: ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఏబీవీపీ మాజీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన నేతపై వెంటనే చర్యలు తీసుకోకపోతే లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై హింసకు పాల్పడినట్లు నిర్ధారణ అవుతుందని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఆ లేఖలో కేసీ వేణుగోపాల్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింటు మహదేవ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహదేవ్ బీజేపీ ప్రతినిధి అని, ఒక మలయాళ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. రాహుల్ గాంధీని ఛాతీపై కాల్చి చంపాలని మహదేవ్ బహిరంగ ప్రకటన చేశారని, ఇది ఎంతమాత్రం నోరు జారడం కాదని, పొరపాటు, అతిశయోక్తి అంతకన్నా కాదన్నారు. ఇది ప్రతిపక్ష నేత, దేశంలోని అగ్ర రాజకీయ నాయకులలో ఒకరైన వ్యక్తికి ఎదురైన హత్యా బెదిరింపని వేణుగోపాల్ పేర్కొన్నారు.బీజేపీ అధికార ప్రతినిధి ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడటం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరునికి ఇవ్వవలసిన ప్రాథమిక భద్రతా హామీలకు భంగం వాటిల్లినట్లు అవుతుందని వేణుగోపాల్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఇటీవల రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు పలు లేఖలు రాసిందని వేణుగోపాల్ గుర్తు చేశారు. అలాగే సీఆర్పీఎఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన ఒక లేఖ అనుమానాస్పద పరిస్థితుల్లో మీడియాకు లీక్ అయ్యిందని అన్నారు. రాహుల్ గాంధీని తమ హక్కుల పరిరక్షకునిగా భావిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసి, తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ఎదురైన బెదిరింపు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడి అని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, అందుకే దీనిపై హోంశాఖ త్వరగా, నిర్ణయాత్మకంగా, బహిరంగంగా చర్య తీసుకోవడంలో విఫలమైతే, ఈ చర్యకు సహకరించినట్లు అవుతుందని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
బీహార్‌లో విజయానికి.. రాహుల్ 10 పాయింట్ల ప్రణాళిక
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే, రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టులలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) రిజర్వేషన్లు కల్పిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పట్నాలో జరిగిన అతి పిచ్రా న్యాయ సంకల్ప్ సింపోజియంలో రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీనిచ్చారు.నేటికీ ఈ దేశంలో అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలవారు ఉన్నారు. వారిలోని అర్హులైనవారికి అన్నింటా భాగస్వామ్యం లభించడం లేదు. దేశం అంతటా ఇలానే ఉంది. తాము కుల గణన నిర్వహించి, ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నామని రాహుల్ పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, జేడీయూ ప్రభుత్వం ఈబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. న్యాయ సంకల్ప్ సింపోజియంలో పది అంశాల తీర్మానాన్ని రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తామని తెలిపారు. ‘ఎక్స్’లో కాంగ్రెస్ పోస్ట్ లోని వివరాల ప్రకారం పది అంశాలు.. VIDEO: “A ten-point resolution was passed at the 'Ati Pichra Nyay Sankalp' symposium today, to be implemented when the INDIA bloc comes to power in Bihar,” said Congress leader and Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi).(Full video available on PTI Videos -… pic.twitter.com/HQgqtsST1x— Press Trust of India (@PTI_News) September 24, 20251. అత్యంత వెనుకబడిన తరగతులపై దురాగతాల నివారణ చట్టానికి ఆమోదం.2. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఈబీసీలకు రిజర్వేషన్లను 20శాతం నుండి 30శాతానికి పెంచడం.3. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను సవరించడం.4. నియామకాలలో సముచితమైనది కాదు (ఎన్ఎఫ్ఎస్) నిబంధన చెల్లదని ప్రకటించడం.5. ఈబీసీ జాబితా రూపకల్పనలో సమతుల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం.6. భూమిలేని కుటుంబాలకు భూమిని కేటాయించడం. 7. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈబీసీల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు.8. విద్యా హక్కు చట్టం (2010) కింద ప్రైవేట్ పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఈబీసీ, ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల పిల్లలకు కేటాయింపు.9 రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం.10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) కింద అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లను వర్తింపజేయడం.బీహార్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రముఖ పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. -
ఓట్ల చోరీతో నిరుద్యోగం
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీ జరుగుతున్నంత కాలం నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతూనే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఓట్ల దొంగతనాన్ని, ఉద్యోగాల దొంగతనాన్ని యువత ఇక సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశవ్యాప్తంగా యువత నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వివరించారు. నిజంగా ప్రజల విశ్వాసం పొంది, వారి ఓట్లతో అధికారంలోకి వచి్చన ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని తెలిపారు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజాయతీగా, ప్రజల మద్దతుతో అధికారంలోకి రాలేదని స్పష్టంచేశారు. ఓట్లను దొంగిలించి, వ్యవస్థలను శాసించి అధికారంలోకి వచి్చందని ఆరోపించారు. అందుకే దేశంలో నిరుద్యోగంలో గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి రావడంతో గత 45 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని, నియామక ప్రక్రియ కుప్పకూలిందని, ఫలితంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. అదే అసలైన దేశభక్తి చక్కటి భవిష్యత్తు కోసం, కలలు నిజం చేసుకోవడం కోసం యువత కష్టపడి పని చేస్తున్నారని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వారిని పట్టించుకోకుండా ప్రచారాన్నే నమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రముఖులు, బడా బాబుల నుంచి ప్రశంసలు, కీర్తనలు పొందుతూ మోదీ మురిసిపోతున్నారని విమర్శించారు. మోదీ పాలనలో ధనవంతులే మరింత బాగుపడుతున్నారని, సాధారణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. నిరుద్యోగం, ఓట్ల చోరీ నుంచి భారత్‌కు విముక్తి కల్పించడమే అసలైన దేశభక్తి అని ఉద్ఘాటించారు. -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
ఓట్ చోరీ వ్యవహారం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
గుల్బర్గా: ‘అలంద్’లో ఓట్ల తొలగింపు ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలో కర్ణాటక సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.గురువారం (సెప్టెంబర్ 18) ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడిన రాహుల్.. కర్ణాటకలోని కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారన్నారు. ‘‘ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి’’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. -
ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ జరుగుతోందని, ఓట్ల దొంగలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఖండించింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, రాహుల్ నిరాధార ఆరోపణలు చేశారని తేలి్చచెప్పింది. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది. ఎవరి ఓటునైనా తొలగించాలనుకుంటే వారి వాదన తప్పనిసరిగా వింటామని వెల్లడించింది. సంప్రదించి అభిప్రాయం తెలుసుకోకుండా ఓటును తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. సామాన్య ప్రజలు ఆన్లైన్లో తమ ఓటును తొలగించుకోలేరని వివరణ ఇచి్చంది. రాహుల్ చెబుతున్నదాంట్లో నిజం లేదని తెలియజేసింది. 2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదని పేర్కొంది. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు గుర్తుచేసింది. అక్కడ ఓట్ల తొలగింపునకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని 2023 సెపె్టంబర్ 6న పోలీసులకు ఇచ్చామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓట్లు తొలగించాలంటూ వచి్చన దరఖాస్తులను పరిశీలించగా 24 మాత్రమే అసలైనవని, 5,994 తప్పుడు దరఖాస్తులేనని తేలినట్లు తెలిపింది. తప్పుడు దరఖాస్తులను తిరస్కరించామని, ఓట్లను తొలగించలేదని పేర్కొంది. -
ఓట్ల దొంగలకు ఈసీ అండ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువా రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీని బహిర్గతం చేస్తూ తెరపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు సైతం వేదికపైకి వచ్చారు. నిజానికి వారు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. వారి పేరిట ఇంకెవరో దరఖాస్తు చేశారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. రాహుల్ ఏం మాట్లాడారంటే... ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో... ‘‘కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారు. ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి. సీఐడీకి ఆధారాలివ్వడానికి భయమెందుకు? కర్ణాటకలో ఓట్ల చోరీపై ఫిర్యాదు చేశాం. దీనిపై రాష్ట్ర సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఆధారాలు ఇవ్వాలని అధికారులు 18 నెలల్లో ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాస్తే ఇప్పటికీ స్పందించలేదు. ఎన్నికల సంఘం ఆధారాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలిస్తే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నది ఎవరో తెలిసిపోతుంది కాబట్టి భయపడుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికైనా నోరువిప్పాలి. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించాలి. సీఐడీ దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దు. సీఐడీకి వారం రోజుల్లోగా ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ఎన్నికల సంఘం సహకరిస్తున్నట్లేనని భావిస్తాం. ఓట్ల దొంగతనాన్ని ఇకనైనా ఆపాలని కోరుతున్నాం. వ్యతిరేకుల ఓట్లే టార్గెట్ మన దేశంలో ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో కొన్ని రోజులుగా యువతకు తెలియజేస్తున్నా. అందులో ఈరోజు మరో మైలురాయి. ఓట్ల తొలగింపు అనేది అనుకోకుండా జరుగుతున్నది కాదు. దేశవ్యాప్తంగా వ్యతిరేకుల ఓట్లను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారు. మైనార్టీలు, దళితుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవడంతోపాటు తప్పుడు దర ఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలకు బలం ఉన్న ప్రాంతాల్లో లక్షలాది ఓట్లు గల్లంతవుతున్నాయి. ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తును పూరించడం సాఫ్ట్‌వేర్‌తో సెకండ్లలోనే పూర్తయిపోతోంది. తెల్లవారుజామునే ఇది జరుగుతోంది. మరోవైపు నకిలీ వ్యక్తులు అసలైన ఓటర్ల ముసుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. తమ ఓట్లు తొలగించాలంటూ తప్పుడు పత్రాలతో దరఖాస్తులు సమరి్పస్తున్నారు. ఓట్ల చోరీపై మా దగ్గర 100 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయి. నేను నా దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమిస్తున్నా. వాటిని కాపాడుకోవడానికి పోరాటం సాగిస్తా’’ అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ సహా ఇతర విభాగాలు జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవారిని కాపాడుతున్నారు. నేను ప్రతిపక్ష నేతను. ఈ విషయం మామూలుగా చెప్పడం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొందరు హైజాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. నేను నిజాన్ని మాత్రమే చూపించగలను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నరోజు వాటిని కాపాడుకోవడానికి వారే నడుం బిగిస్తారు. అందుకు నేను పునాది వేస్తున్నా. ఈ ఉద్యమం కొనసాగుతుంది. -
రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్.. పటాకులే పేలాయంటూ సెటైర్లు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్‌ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. ‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు -
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. 100 శాతం ఆధారాలున్నాయ్ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్‌కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్‌తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా.. సీఈసీపై సంచలన ఆరోపణలుఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్‌గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి. ఓట్ల దొంగలను రక్షిస్తూ.. కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నాఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు. VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025 LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd— Congress (@INCIndia) September 18, 2025 -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్ గాంధీ
పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్ పోలీసులు, ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों… pic.twitter.com/f1nUxJ945S— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2025గురుదాస్‌పూర్ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..రాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?పోలీస్ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాంరాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?పోలీస్ అధికారి: అది భారత్ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టంఅయినప్పటికీ రాహుల్ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్సర్) మరియు గుర్చక్ (గుర్దాస్పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.पंजाब: गुरदासपुर में राहुल गांधी पाकिस्तान सीमा के पास प्रभावित गांवों का दौरा करने गए◆ सुरक्षा कारणों से SP जुगराज सिंह ने उन्हें आगे जाने से रोका, दोनों में बहस हुई◆ राहुल गांधी गांवों का दौरा किए बिना लौट आए, सुरक्षा मुद्दों पर विवाद बना@RahulGandhi | Punjab | pic.twitter.com/n8OtBTUjOc— Zuber Chaudhary (@ZuberChaudhar18) September 16, 2025మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.పంజాబ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్‌లోనే ఉంది. పంజాబ్ గుర్దాస్పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్‌కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. -
విమర్శల బదులు విస్తృత దర్యాప్తు చేయించాల్సింది
న్యూఢిల్లీ: బిహార్‌లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషి వ్యాఖ్యానించారు. ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్‌ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్‌గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు. అఫిడవిట్ అడగడం సబబుకాదు ‘‘ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్‌ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్‌సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా.. ‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి. రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్‌ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
Rahul Gandhi: సెక్యురిటీ ప్రోటోకాల్స్ పాటించడం లేదంటూ లేఖ
-
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
నిరసనకారులకు చాక్లెట్లతో సమాధానం.. రాహుల్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నవారికి అత్యంత విచిత్రంగా సమాధానం చెప్పారు. బీహార్‌లోని ఆరాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న రాహుల్ గాంధీ తనకు ఎదురైన నిరసనకారులకు ప్రేమతో సమాధానం చెప్పారు. ఇటీవల బీహార్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపైనున్న కొందరు నేతలు.. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై దుర్భాషలాడారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు బాధ్యత వహిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రాహుల్ గాంధీ యాత్రకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. తాజాగా ఆరా జిల్లాలో జరుగుతున్న ఈ నిరసనలకు రాహుల్ గాంధీ అనూహ్యంగా స్పందించారు. నిరసనకారులకు చాక్లెట్లు ఇచ్చి, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే రాహుల్ యాత్ర మరింతమంది దృష్టిని ఆకర్షించింది. #WATCH | Arrah, Bihar: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi offered candies to BJYM workers who showed him black flags and confronted him over the alleged derogatory remarks made against the Prime Minister and his late mother at a Mahagathbandhan event in Darbhanga. pic.twitter.com/dkFXz8WJeB— ANI (@ANI) August 30, 2025కాంగ్రెస్ నేతలు ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దర్భంగా ఘటనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీజేపీ ఏజెంట్ అని, యాత్ర జనాదరణను అడ్డుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించింది.రాహుల్ చేపట్టిన ఈ యాత్ర బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నదని పలువురు అంటున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లతో పాటు ఇతర ఇండియా బ్లాక్ నేతలు ఈ యాత్ర ద్వారా ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా రహుల్ చాక్లెట్ ఆఫర్ ఘటన.. రాహుల్ గాంధీ యాత్రకు సానుకూల దృష్టిని తెచ్చినప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. -
బిహార్ సీఎం అభ్యర్థిని నేనే
ఆరా(బిహార్): బిహార్‌లో మహాఘఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించుకున్నారు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆరా ర్యాలీలో తేజస్వీ మాట్లాడుతూ..తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్నే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోంది. కాపీ కొట్టే సీఎం కావాలా? ఒరిజినల్ సీఎం కావాలా?’అంటూ ప్రజలను ప్రశ్నించారు. మహాఘఠ్ బంధన్ తరఫున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో తేజస్వి...కాంగ్రెస్ జాతీయ పారీ్టయే అయినప్పటికీ బిహార్‌లో ఆర్జేడీ పెద్దన్న అని, తమదే పైచేయి అన్న అర్థంలో మాట్లాడారు. -
‘నేనే ఒరిజినల్ సీఎం..’ బీహార్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం
బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర పాట్నా సభతో పూర్తి కానుంది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘కాపీక్యాట్ సీఎంగా’ అభివర్ణిస్తూ ఆరాలో నిర్వహించిన ర్యాలీలో తేజస్వి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నితీశ్ నా విధానాలను కాపీ కొడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తేజస్వి ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం వెనుకబడిపోయింది. మీకు సిసలైన సీఎం కావాలా? లేదంటే నకిలీ సీఎం కావాలా? అంటూ తేజస్వి మాట్లాడారు. తద్వారా తనను తాను సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నట్లైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు తేజస్విని చూస్తూ ఉండిపోయారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ.. బీహార్‌కు ఆర్జేడీనే పెద్దన్నగా తేజస్వి గతంలో వ్యాఖ్యానించారు. ఓటర్ అధికార్ యాత్రలో ఈ ఇద్దరు నేతలూ కలిసే ముందుకు సాగారు. కానీ ఎక్కడా కాంగ్రెస్‌గానీ, రాహుల్ గాంధీగానీ అధికారికంగా బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే..కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనం ఇచ్చింది. తాము ఆశించినన్ని సీట్లు ఆర్జేడీ ఇవ్వకపోవచ్చనే యోచనలో ఉన్న కాంగ్రెస్.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసేందుకు ముందుకు రావడం లేదన్నది ఆ కథనం సారాంశం.2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక మహాఘట్బంధన్ కూటమి తరఫున కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 19 స్థానాల్లో ెగ్గింది. అయితే ఈసారి కూడా అన్నే స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదంటే నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 ఏళ్ల తేజస్వి యాదవ్ గతంలో రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు.ఓటర్ అధికార్ యాత్ర బీహార్‌లో ఆరా (Ara) పట్టణంలో 2025 ఆగస్టు 30న జరిగింది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్‌ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్‌లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
‘ఆ దమ్ముందా స్టాలిన్?’
బీహార్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్‌ను సవాల్ విసిరింది.బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్‌కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్‌పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే.. డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్‌లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్‌కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. -
చిరాగ్, పెళ్లి చేసుకో!
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. ‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్‌ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్‌లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. బుల్లెట్ ర్యాలీలో... రాహుల్‌కు ముద్దు అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్‌ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు. -
బీజేపీ, ఈసీ మిలాఖత్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో బిహార్‌లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్‌లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్‌లో ఎస్ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘ఇండియా’దే గెలుపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు. -
పేదలకు అవకాశాలను దూరం చేసి.. ఇప్పుడు ఓట్లను చోరీ చేయాలనుకుంటున్నాయి
కటిహార్: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి పేదలకు అవకాశాలను దొర క్కుండా చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఇప్పుడు వారి ఓట్లను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నా యన్నారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా శనివారం రాహుల్ బిహార్‌లోని కటిహార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శిస్తూ ఆయన.. బీఆర్ అంబేడ్కర్ రచించిన ఈ పుస్తకంలోని ఆదర్శాలకు మరో వెయ్యేళ్ల యినా విలువ తగ్గదన్నారు. దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలను ముందుకు సాగకుండా అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులు, ఈబీసీలు, మైనారిటీలకు మంచి ఉద్యోగాలు దొరికేవనీ, బీజేపీ సర్కారు ప్రైవేటీకరణతో ఇప్పుడా అవకాశం లేకుండా చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రతి వ్యక్తికీ ఓటు హక్కుంది. అందరి ఓట్లూ సమానమే. ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి అమూల్యమైన ఆ ఓటును దొంగిలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల్లో వేలాది మంది ఓట్లను గల్లంతు చేశారని ఈసీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. వేలాదిగా చేర్చిన కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని చెప్పారు. ఇప్పుడు బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఈ విషయం తెలిపేందుకే ఓటర్ అధికార్ యాత్ర చేపట్టామని వివరించారు. అయితే, మీడియా తమ ప్రయత్నాన్ని చాలా తక్కువ చేస్తోందని, లక్షలాది మంది ప్రజలు తమ యాత్రకు తరలివస్తున్నా చూపించడం లేదని ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన సాసారంలో యాత్ర మొదలయ్యాక మొదటిసారిగా తాత్కాలిక వేదిక నుంచి రాహుల్ ప్రసంగించడం విశేషం. కార్యక్రమంలో బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ పాలుపంచుకున్నారు. -
యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు.. కానీ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఓట్ చోరీ అంశంపై అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్‌లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌లో యువత టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్ నాయకుల్లో మంచి టాలెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్‌లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.నేడు లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు. -
ఓట్ అధికార్ యాత్ర.. రాహుల్ కారు ఢీకొని గాయపడ్డ కానిస్టేబుల్
పాట్నా: కేంద్రంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడిందంటూ గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ.. బిహార్‌లో ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగింపును వ్యతిరేకిస్తూ రాహుల్.. ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర ప్రస్తుతం బీహార్‌లోని నవాడా జిల్లాలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. ర్యాలీలో జనాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కాలు కారు కింద చిక్కుకుపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైతే రాహుల్ కనీసం అతన్ని కారు కిందకు దిగి పలకరించలేదని విమర్శలు గుప్పించింది. ఈ ప్రమాద వీడియోను షేర్ చేస్తూ రాహుల్‌పై విరుచుకు పడింది.Voter Adhikar Yatra ❎Crush Janta Yatra ✅✅Rahul Gandhi’s car crushed a police constable who was critically injured.Dynast did not even get down to check on him pic.twitter.com/cTx7ynXmCC— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) August 19, 2025 గత 40 గంటలుగా రాహుల్ బీహార్‌లో చేస్తున్న యాత్రలో ఒక్క నిజంగా మాట్లాడటం లేదని బీజేపీ ధ్వజమెత్తింది. ఎలక్షన్ కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్.. ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేసింది. ప్రజల విశ్వాసాన్ని రాహుల్ గాయపరుస్తున్నాని మండిపడింది. ఒక విషయాన్ని నిజమని నమ్మాలంటే ఆధారాలు ఉండాలి కదా అని బీహార్ బీజేపీ ప్రశ్నించింది. -
మేం అధికారంలోకి వస్తే ఈసీ పనిపడతాం
గయాజీ: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల వాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్(ఈసీ)లో ఇద్దరు కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ల భరతం పడతామంటూ హెచ్చరికలు చేశారు. ఆదివారం సాసారం నుంచి రాహుల్ ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించడం తెల్సిందే. యాత్ర సోమవారం గయాజీకి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఓట్ల చోరీ వాస్తవమని తేలిన తర్వాత కూడా తనను అఫిడవిట్ వేయాలని ఈసీ హెచ్చరించడాన్ని రాహుల్ గాంధీ పస్త్రావించారు. ‘మాకు కొంత సమయం ఇవ్వండి. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మీరు చేసే దొంగతనాన్ని బయటపెడతాం. అప్పుడు దేశం ప్రజలే మిమ్మల్ని అఫిడవిట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరచూ చెప్పే స్పెషల్ ప్యాకేజీ మాదిరిగానే ఈసీ సైతం బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’పేరుతో ఓటరు సవరణ తీసుకువచ్చింది. ఇదో కొత్త రకం ఓట్ల చోరీ’అని రాహుల్ ధ్వజమెత్తారు. ‘ముగ్గురు ఎన్నికల కమిషనర్లు బీజేపీ సభ్యత్వం తీసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.. ఏదో ఒక రోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అప్పుడిక మీ ముగ్గురిపైనా చర్యలు తప్పవు’అని హెచ్చరించారు. రాహుల్ వెంట ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేశ్ సహానీ, సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు. యాత్ర సోమవారం సాయంత్రం కుటుంబ నుంచి గయాజీకి చేరుకుంది. ఓట్ల చోరీకి కొత్త ఆయుధం ఎస్ఐఆర్ బిహార్‌లో ఓట్ల చోరీకి ఈసీ అమలు చేస్తున్న కొత్త ఆయుధం ఎస్ఐఆర్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన వాట్సాప్ చానెల్లో గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసి, తాజాగా బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్లో పేరులేని కొందరితో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వీరు ఆదివారం సాసారంలో మొదలైన ఓటర్ అధికార్ యాత్రలో పాలుపంచుకున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం వీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచే వీరి గుర్తింపు రద్దయిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిని తాము పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లోనూ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారితో మాట్లాడి, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. -
కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి విమర్శలు
ఢిల్లీ బీహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)పై ఇండియా కూటమి విమర్శలు గుప్పించింది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి తొలగించిన 65 లక్షల ఓటర్లపై సీఈసీ స్పష్టత ఇవ్వలేదని మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా సీఈసీ వివరణ ఇవ్వలేకపోయిందని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. మహాదేవపుర ఓటరు మోసంపై సీఈసీ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సైతం సీఈసీ తప్పించుకుందని ఇండియా కూటమి విమర్శించింది. ఓటరు మోసాలపై దర్యాప్తు చేయలేదని, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఈసీ విఫలమైందని, అధికార పార్టీని ప్రశ్నించే వాళ్లను ఈసీ బెదిరిస్తోందని ఇండియా కూటమి ఆరోపించింది. కాగా, దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను సీఈసీ ఖండించింది. ఈ మేరకు ఆదివారం(ఆగస్టు 17వ తేదీ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ చేసిన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలన్నారు.లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు. అదే సమయంలో కేంద్రం ఎన్నికల సంఘం బాగోతం దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అధికార బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరిట గోల్‌మాల్‌కు తెరతీశారన్నారు.అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఈసీ–బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోం. ఎన్నికల చోరీని బిహార్ ప్రజలు సహించబోరు. పేదల ఓటు హక్కును కాపాడి తీరతాం’’ అన్నారు. బిహార్‌లోని సాసారాంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. -
బాబు, రాహుల్ హాట్‌లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్‌పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్‌కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్‌ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్‌ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్‌పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ECకి ఎందుకు సారీ చెప్పాలి మీరేమైనా..
-
రాహుల్ గాంధీపై సాత్యకి సావర్కర్ కేసు
ముంబై: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ న్యాయస్థానాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ స్వాతంత్య్రయోధుడు వీర్ సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్ కేసు వేశారు. వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియో తనకు అందలేదంటూ జూలై 29వ తేదీన రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్ అబద్ధమని సాత్యకి పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం ఉన్న సీడీ సహా పిటిషనర్ అందజేసిన అన్ని పత్రాలు తమకు అందాయంటూ ఆయన లాయర్ కోర్టు ఎదుట అంగీకరించారని సావర్కర్ లాయర్ సంగ్రామ్ కొల్హాట్కర్ పేర్కొన్నారు. వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్ తమకు అందిందని, అయితే అది పనిచేయడం లేదని అంతకుముందు మే 28న రాహుల్ తెలిపారన్నారు. తాము అందజేసిన మరో పెన్‌డ్రైవ్ సరిగ్గానే పనిచేస్తోందని, కోర్టులో గాంధీ లాయర్ సమక్షంలో అందులోని వీడియోను ప్రదర్శించామని కొల్హాట్కర్ వివరించారు. ఆ వీడియో ఇప్పుడు కోర్టు కస్టడీలోనే ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ తప్పుడు పత్రాలు చూపుతూ వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నుంచి తప్పించుకోజూస్తున్నట్లు కనిపిస్తోందని కొల్హాట్కర్ తెలిపారు. -
రాహుల్ గాంధీ ఓట్ చోరీ కామెంట్ పై ఈసీ ఆగ్రహం
-
ఓట్ల చోరీ బట్టబయలై... ఈసీ బెంబేలు
సాసారాం: కేంద్రం ఎన్నికల సంఘం బాగోతం దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అధికార బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరిట గోల్‌మాల్‌కు తెరతీశారన్నారు. అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఈసీ–బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోం. ఎన్నికల చోరీని బిహార్ ప్రజలు సహించబోరు. పేదల ఓటు హక్కును కాపాడి తీరతాం’’ అన్నారు. బిహార్‌లోని సాసారాంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఓట్ల చోరీని బయటపెట్టాక ఈసీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే అఫిడవిట్ దాఖలు చేయాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోందని అన్నారు. ‘‘ఈసీ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటాతోనే ఓట్ల చోరీని బయటపెట్టా. అలాంటప్పుడు మళ్లీ అఫిడవిట్ ఎందుకు? ఓట్ల చోరీపై బీజేపీ నేతలు కూడా ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని వారినెందుకు అడగలేదు? ఎన్నికల వీడియో పుటేజీ కోరితే ఈసీ స్పందించకపోవడం వెనక మతలబేమిటి?’’ అని నిలదీశారు. ఓట్ల చోరీతోనే విజయం ‘‘ఇటీవల లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను చేర్చి అధికారంలోకి వచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదే కుతంత్రం మొదలైంది. అడ్డదారిలో నెగ్గజూస్తున్నారు. వారి కుట్రలు సాగనివ్వం. బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ సహా ఎక్కడ ఓట్ల చోరీకి పాల్పడినా వారి బండారాన్ని ప్రజల ముందు పెడతాం’’ అన్నారు.మోదీ ప్రమాదకారి: ఖర్గే ప్రధాని మోదీని ప్రమాదకరమైన వ్యక్తిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివరి్ణంచారు. పౌరుల ఓటు భద్రంగా ఉండాలంటే మోదీని ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన ఆరెస్సెస్, సంఘ్‌ను మోదీ పొగడటం ఏమిటని మండిపడ్డారు. మోదీ పాలనలో యథేచ్ఛగా ఓట్ల చోరీ జరుగుతోందన్నారు. 16 రోజులు.. 1,300 కి.మీ. ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో 20 జిల్లాల గుండా 16 రోజులు.. 1,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. ఆదివారం సభలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్, తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నేతలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 'దేశ'మంత మందికి ఓటుండదా? -
2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ?!
రాహుల్ గాంధీ ఆరోపణలు.. వాటిని తోసిపుచ్చుతూ ఎన్నికల సంఘం.. పరస్పర సవాళ్లతో దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం అంశం తీవ్ర చర్చనీయాంగా మారింది. లోక్‌సభలో విపక్ష నేత మరింత స్వరం పెంచి ‘ఈ చోరీ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదని.. చాలా చోట్ల జరిగింది’’ అని అంటున్నారు. ఈ తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పలు నియోజకవర్గాల్లో ‘ఓట్ చోరీ’ జరిగిందంటూ ఓ ప్రొఫెసర్ చేసిన పరిశోధన మళ్లీ తెరపైకి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనుమానాస్పద రీతిలో అధికార పార్టీ కొన్ని సీట్లు గెల్చుకుందనేది ఆ ప్రొఫెసర్ వాదన. ఆయన పేరు సవ్యసాచి దాస్. హర్యానా అశోకా యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’(Democratic Backsliding in the World’s Largest Democracy) పేరిట తన పరిశోధన పత్రాలను 2023లోనే ఆయన బయటపెట్టారు. ఆ సంచలన పరిశోధన సారాంశం ఏంటంటే.. ఆ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు చాలానే సాధించింది. పోటీ తీవ్రంగా ఉన్న 59 స్థానాల్లో.. 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికలల్లో బీజేపీ తక్కువ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో ఓటర్ల వృద్ధి రేటు.. ఓడిన నియోజకవర్గాలతో పోల్చితే సగటున 5% తక్కువగా ఉంది. అందుకే దీనిని వ్యూహాత్మక డాటా మేనిప్యులేషన్‌కి సంకేతంగా సవ్యసాచి తన పరిశోధనల్లో పేర్కొన్నారు. అయితే.. అప్పటి ఓటర్ డాటా, పోలింగ్ సరళి ఆధారంగా జరిగిన పరిశోధన లెక్క ప్రకారం.. బీజేపీకి ఆ 30 స్థానాలు మాత్రమే రావాల్సి ఉంది. అంటే ఆ అదనపు 11 స్థానాలు ఓట్ చోరీతోనే గెలిచిందని "back-of-the-envelope" అనే గణాంకాలతో ఆయన ప్రస్తావించారు. ఓట్ చోరీ- ఇలా జరిగి ఉండొచ్చు.. ఓటర్ డాటాను ఓ పద్దతి ప్రకారం మేనిపులేషన్ చేయడం అంటే.. ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగించడం, అందునా ప్రత్యేకించి ముస్లిం ఓట్లను తొలగించడం, అలాగే.. పోలింగ్‌బూత్‌ల వద్ద ఓటింగ్ శాతం తగ్గించే చర్యలు తీసుకోవడం లాంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ప్రత్యేకించి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది జరిగిందనే విషయాన్ని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో అసమానతలు గణనీయంగా ఎక్కువగా కనిపించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారాయన. ఆ రాష్ట్రాల సివిల్ సర్వీస్ అధికారుల బలహీనమైన పర్యవేక్షణ వల్ల ఇది జరిగిందని ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’ పరిశోధన పత్రం పేర్కొంది. ఈ మానిప్యులేషన్ ప్రభుత్వ ఏర్పాటును మార్చకపోయినా..(బీజేపీకి మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువే సీట్లే వచ్చాయి..) ప్రజాస్వామ్య నైతికతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని ప్రొఫెసర్ సవ్యసాచి ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 303 లోక్‌సభ సీట్లు గెలిచి సింగిల్ డిజిట్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాల సీట్లతో కలిపి 353 కాగా.. రెండోసారి వరుసగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్‌ను బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేల్చిన ఆటంబాంబ్‌తో ఓట్ల దొంగతనం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(ప్రత్యేకించి కర్ణాటక మహదేవ్‌పురలో లక్ష నకిలీ ఓట్లు), మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మోసం చేయడానికి బీజేపీతో ఎన్నికల కమిషన్ (EC)తో కుమ్మక్కైందని..ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే.. ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పుపట్టిన ఈసీ.. ఆధారాలు చూపించాలని రాహుల్‌ను కోరుతోంది.Revealing Voter Manipulation 🔥𝐇𝐨𝐰 𝐁𝐉𝐏 𝐒𝐞𝐜𝐮𝐫𝐞𝐝 𝐄𝐱𝐭𝐫𝐚 𝐒𝐞𝐚𝐭𝐬 𝐢𝐧 𝟐𝟎𝟏𝟗 𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧𝐬 𝐓𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐃𝐚𝐭𝐚 𝐒𝐡𝐞𝐧𝐚𝐧𝐢𝐠𝐚𝐧𝐬A 2023 Research Paper by Sabyasachi Das, Assistant Professor of Economics at Ashoka University, uncovers evidence… pic.twitter.com/NU3MKSSQCP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) August 13, 2025 -
ఓట్ల చోరీపై ఇక ప్రత్యక్ష యుద్ధం: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీపై తమ ఆందోళన అనేది కేవలం రాజకీయ అంశం కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తే ల్చిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ‘ఒక్కరికి ఒక ఓటు’అనే విధానాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటం అని స్పష్టంచేశారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ద్వారా ఓట్ల చోరీపై బిహార్ గడ్డపైనుంచే ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం తమ పార్టీ పోరాడుతోందని ఉద్ఘాటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభమవుతుందని, యువత, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇదొ క ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు. ఓట్ల దొంగల ను ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల చోరు లు ఓడిపోతేనే ప్రజలకు, రాజ్యాంగానికి విజయం లభిస్తుందన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాను షేర్ చేశారు. -
‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’
న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్‌లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. వీడియోలో ఏముంది?కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్‌బోర్డు ప్రత్యక్షం అవుతుంది. నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
నా ప్రాణాలకు ముప్పు
న్యూఢిల్లీ: హిందూ జాతీయవాది వినాయక్ దామోదర్ సావర్కార్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. సావర్కర్ పరువుకు నష్టం వాటిల్లిందంటూ తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే కుటుంబ సభ్యుడేనని తెలియజేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే బంధువు తనపై ఫిర్యాదు చేయడం చూస్తే తనకు ప్రాణాపాయం ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ బుధవారం పుణే కోర్టుకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల తాను లేవనెత్తిన రాజకీయ అంశాల దృష్ట్యా తన భద్రత ప్రమాదంలో పడినట్లు భావిస్తున్నానని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కుటుంబం గతంలో హింసాకాండకు పాల్పడినట్లు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. మహత్మా గాంధీ హత్య లాంటిది మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఓట్ల చోరీ బాగోతాన్ని బయటపెట్టినందుకు ఇద్దరు బీజేపీ నాయకుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని రాహల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ, తర్వీందర్‌సింగ్ మార్వా తనను బహిరంగంగా బెదిరించారని చెప్పారు. ‘దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ’ అంటూ వారు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని రాహుల్ గాంధీ కోరారు. ఉపసంహరించుకుంటాంపుణే కోర్టులో రాహుల్ గాంధీ తరఫున ఆయన లాయర్ మిలింద్ పవార్ పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్టు చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఆమోదం లేకుండానే ఈ పిటిషన్ దాఖలు చేశానని సదరు లాయర్ పేర్కొన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకోసం గురువారం విజ్ఞాపన పత్రం సమర్పిస్తానన్నారు. -
చీకట్లో బాబు, రేవంత్ రాహుల్ తో హాట్ లైన్..! బండారం బయటపెట్టిన జగన్
-
ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన. -
‘నాపై పెద్ద కుట్ర జరిగింది.. రాహుల్ గాంధీని కలుస్తా’
ఓట్ల చోరీ వ్యవహారంపై నోరుజారి పదవి కోల్పోయిన కర్ణాటక మాజీ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, తెర వెనుక ఉన్నవారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారాయన. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తానని పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా కేఎన్ రాజన్నకు పేరుంది. అదే సమయంలో డీకే శివకుమార్‌తో పొసగదనే ప్రచారం ఉంది. అయితే ఓట్ల చోరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కాంగ్రెస్‌కే దెబ్బ వేసేలా ఉన్న ఆ వ్యాఖ్యలను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయన్ని పదవి నుంచి తొలగించింది. అయితే.. ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిందని.. తాను బాధితుడిని మాత్రమేనని అంటున్నారాయన. ‘‘ఈ వ్యవహారంలో ఇప్పుడే వివరాలేం చెప్పలేను. రాజీనామా అనుకోండి.. నన్ను తప్పించారనుకోండి.. ఇంకా మీరు ఏమైనా రాసుకోండి. కానీ, ఈ తతంగం వెనుక పెద్ద కుట్రే జరిగింది. ఎవరు.. ఎందుకు చేశారనేది సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా. త్వరలో ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్‌ను, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలను కలిసి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి అపార్థాలను తొలగించే ప్రయత్నం చేస్తాను. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. రాజన్న ఏమన్నారంటే.. ‘‘మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ కళ్లు మూసుకుంది’’ అని రాజన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఉండటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గీయులు సైతం ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం కోరగా.. రాజన్న స్పందించలేదు. ఈ తరుణంలోనే సిద్ధరామయ్య సిఫారసుతో గవర్నర్ ఆయనను కేబినెట్ నుంచి తొలగించారు.కర్ణాటక తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజన్న తొలగించే ఉద్దేశంలో సిద్ధరామయ్య లేరని, అయితే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా వచ్చేవారితో కలిసి సిద్ధరామయ్యను కలిశాకే తన తదుపరి కార్యాచరణను రాజన్న ప్రకటిస్తారని సమాచారం. అదే సమయంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనుక మరోసారి నోరు జారితే తీవ్ర చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు బోగట్టా.కర్ణాటక తుమకూరు జిల్లాకి చెందిన రాజన్న(74)కు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఎమ్మెల్యే టికెట్ నిరాకరణతో 2004 ఎన్నికల్లో జేడీఎస్‌లో చేరి.. ఆ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై కాంగ్రెస్ గూటికి చేరి 2013, 2023 ఎన్నికల్లో మధుగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. డీకే శివకుమార్ వర్గంతో విభేదాలు ఉన్నప్పటికీ.. తనకు సన్నిహితుడైన రాజన్నకు సిద్ధరామయ్య సహకార సంఘ శాఖను కట్టబెట్టారు. -
ఓట్ల చోరీపై పోరుబాట
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు. మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. రాజకీయ పోరాటం కాదు: రాహుల్ ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్‌పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్ దాటేసిన అఖిలేశ్ నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. -
అసలు నిజాలు బయటపడతాయని ఈసీ భయపడుతోంది: రాహుల్ గాంధీ
-
మంత్రి పదవికి రాజీనామా చేసిన KN. రాజన్న
-
ఇండియా కూటమి ర్యాలీ.. ఎంపీలు అరెస్ట్!
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకూ ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ ర్యాలీకి పిలుపునిచ్చిన తరుణంలో ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఆ క్రమంలోనే ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లి మెమోరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఆ ఎంపీలంతా పార్లమెంట్ భవనం నుంచి సుమారు కిలోమీటర్ దూరం మాత్రమే ఉన్న ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా వెళ్లే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిలో భాగంగా ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేశారు. అనంతరం విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, శివసేన(ఎల్బీటీ) నేత ప్రియాంకా చతుర్వేది తదితరులు ఉన్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ మీడియా మాట్లాడుతూ.. ‘ ఇది రాజకీయంగా చూడాల్సిన అంశం కాదు. మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన సమయం. ఈ పోరాటం ఏదో రాజకీయ దురుద్దేశంతో చేసేది ఎంతమాత్రం కాదు. ఇది కేవలం వన్ పర్సన్.. వన్ ఓట్ అనే దానిపైనే మా ఉద్యమం’ అని స్పష్టం చేశారు. తాము 300 ఎంపీలం కలిసి ఈసీ కార్యాలయానికి వెళ్లాలని అనుకుంటే తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. కొంతమందిని మాత్రమే రమ్మంటున్నారని ఆయన మండిపడ్డారు. తమ పోరాటం బోగస్ ఓట్లపైనేనని, తమ వద్ధ డేటా ఉందని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు.ఈసీని 30 మంది ఎంపీలు కలవొచ్చు..ఇండియా కూటమి ర్యాలీపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహ్లా స్పందించార. ఎలక్షన్ కమిషన్‌ను 30 మంది ఎంపీలు కలవొచ్చు అదే విషయాన్ని ఈసీ కూడా చెప్పింది. అంతే గానీ ర్యాలీగా 300 మంది ఎంపీలు ర్యాలీగా వెళితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందంది. ఆ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్నాం’అని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. -
ఈసీ విశ్వసనీయతకు పరీక్ష
ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన విషయాలే వెల్లడించారు. ఎన్నికల సంఘం తీరుతెన్నులను ఎండగట్టారు. అనేక లోపాలను, ఎన్నికలలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. కానీ... ఎన్నికల సంఘం స్పందించిన తీరు వాటిపై అంత సంతృప్తిగా ఉన్నట్లు అనిపించదు. కాగా రాహుల్ వాదనను ఖండిస్తూ దేశ ప్రజలను ఆయన అవమానించారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన, ఆధారాలు చూపిన అంశాలపై ఎన్నికల సంఘం నేరుగా స్పందించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ప్రమాణం చేయాలంటూ ప్రకటన చేయడం అర్థవంతమనిపించదు.గత సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇవే తరహా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా 49 లక్షల ఓట్లు అదనంగా పోల్ అయ్యాయన్న ఆరోపణపై ఇంతవరకు సరైన జవాబు రాలేదు. అసాధారణ రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి విజయం సాధించడంపై చాలామంది ఆశ్చర్యం చెందారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో పరిశోధన చేసి రాహుల్ తన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఏపీలో జరిగిన తంతుపై కూడా మాట్లాడి ఉంటే క్రెడిబిలిటి పెరిగి ఉండేదేమో. అలా కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా ఆ ప్రస్తావన చేయలేదేమో అన్న అనుమానం వస్తుంది. లేదా కాంగ్రెస్‌కు ఏపీలో ఎలాంటి పట్టు లేనందున దాని జోలికి వెళ్లలేదేమో తెలియదు.ఐదు రకాలుగా ఓట్ల చోరి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్‌లు, ఒకే చిరునామాలో భారీగా ఓట్లు, ఇన్ వాలిడ్ ఫొటోలు, ఫారం నెంబర్ 6 దుర్వినియోగం, సాయంత్రం పోలింగ్ ముగిసే టైమ్‌కు ఉన్న పోలింగ్ శాతానికి, ఆ తర్వాత రాత్రివరకు నమోదైన పోలింగ్ శాతాలపై అనుమానాలు ఉండడం, సీసీటీవీ ఫుటేజి ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్దం కాకపోవడం వంటి కారణాలను ఆయన వివరించారు. ఇక్కడ ఒక మాట అంగీకరించాలి. ఇలాంటి అవకతవకలలో కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి.డూప్లికేట్ ఓట్లు సర్వసాధారణం అన్న భావన ఏర్పడింది. ఏపీలో నమోదైన ఓటర్లు పలువురు తెలంగాణలో నివసిస్తుంటారు. ఎన్నికల రోజున పెద్ద ఎత్తున వాహనాలలో ఏపీకి తరలి వెళుతుంటారు. వారిలో అనేక మందికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. వీటిని ఏరివేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి పూర్తిగా జరిగినట్లు అనిపించదు.బీజేపీ కోసం ఎన్నికల సంఘం అక్రమాలకు అవకాశం ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈసీ నేరుగా అవకతవకలకు పాల్పడకపోవచ్చు కాని జరుగుతున్న వాటిని అరికట్టకపోవడం వల్ల అభియోగాలకు గురవుతోందని చెప్పాలి. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉపయోగపడుతోందని చెప్పాలి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని ఆశిస్తున్నప్పటికీ, ఆచరణలో అలా జరగడం లేదన్నది వాస్తవమే.ఉదాహరణకు ఏపీలో ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని అంటూ ఒక జాబితా ఇచ్చారు. ఈసి అంగీకరించడమే కాకుండా, బీజేపీ వారు సూచించిన అధికారులనే నియమించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ క్రమంలో నిష్పక్షపాతంగా ఉండే పోలీసు అధికారులను తప్పించారన్న సందేహాలు వచ్చాయి. దానికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడమే అని అంతా భావించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఈసీ ద్వారా తమకు కావల్సిన పనులు చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏకంగా 1,00,250 దొంగ ఓట్లు ఉన్నట్లు రాహుల్ సాధికారికంగా వెల్లడించారు. అవి ఏఏ రకాలుగా ఉన్నాయో కూడా తెలియచేశారు. వాటిలో నలభై వేల మంది ఓటర్లవి నకిలీ అడ్రస్‌లు అని ఆయన తేల్చారు. ఓటర్ల నమోదు అంశంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అచ్చంగా నకిలీ ఓట్లను చేర్పిస్తున్నాయి. వాటిని ఏరివేసే టైమ్ కూడా అధికారులకు ఉండడం లేదు.గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనే టీడీపీ ఇలా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను చేర్చిందంటూ ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ చేసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల సంఘం అరికట్టలేకపోతోంది. ఇక ఎన్నికల రోజున సాయంత్రం వరకు జరిగే పోలింగ్ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పోలింగ్ మరో ఎత్తుగా ఉంటోంది. కొన్ని ఎంపిక చేసుకున్న బూత్ లలో సిబ్బందిని, పోలీసులను ఆకట్టుకుని ఈవీఎంల ద్వారా భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారన్నది మరో అభియోగం. నిజంగానే ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉంటే ఎవరూ కాదనరు. అలా కాకుండా క్యూ లైన్లలో పెద్దగా లేకపోయినా, ఓటింగ్ శాతం పెరిగిందని చెబితేనే సమస్య వస్తుంది.అందువల్లే పోలింగ్ నాటి ఓట్ల శాతం, కౌంటింగ్ నాటి ఓట్ల శాతానికి పెద్ద తేడా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు ఇలాంటి వాటిపై అధ్యయనం చేసి, నివేదికలను సమర్పిస్తున్నాయి. ఏపీలో 12.5 శాతం ఓట్లు అంటే సుమారు 49 లక్షల ఓట్లు తేడా వచ్చాయని అవి తేల్చాయి. రాహుల్ గాంధీ కోరినట్లు సాయంత్రం ఆరుగంటల తర్వాత జరిగినట్లు చెబుతున్న పోలింగ్ కు సంబంధించి క్యూలైన్ల సీసీటీవీ ఫుటేజీని అడిగిన వారికి ఈసీ అందించి ఉంటే అనుమానం కలిగేది కాదు. అలా ఇవ్వకపోగా, దానిని ధ్వంసం చేసేసినట్లు చెబుతున్నారు.ఏపీ అనుభవాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించుకుని ఉంటే ఆయన ప్రజెంటేషన్‌కు మరింత విశ్వసనీయత వచ్చేది. కొన్ని చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లకు తేడా ఉన్నట్లు కొందరు అభ్యర్థులు గమనించారు. అలాగే వీవీప్యాట్ స్లిప్‌లను, ఈవీఎంలలో నమోదైన అంకెలతో పోల్చి చూపాలని ఇంకొందరు కోరారు. వీవీప్యాట్ స్లిప్‌లను నిర్ణీత రోజులు స్టోర్ చేయకుండా పది రోజుల్లోనే దగ్దం చేయించడం కూడా సంశయాలకు దారితీసింది. ఒంగోలు నుంచి వైసీపీ పక్షాన పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై దరఖాస్తు పెట్టుకున్నా, ఎన్నికల అధికారులు అంగీకరించకుండా డ్రామా నడిపారు. ఆయన కోర్టుకు వెళ్లినా పలితం దక్కలేదు.బాలినేని తదుపరి జనసేన పార్టీలో చేరి ఆ విషయాన్ని వదలివేశారు. కాగా బాలినేని పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా ఉందని ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వంటివారు ఈవీఎంలను ఎలా మానిప్యులేట్ చేయవచ్చో తమ వద్ద ఉన్న టెక్నికల్ వ్యక్తుల ద్వారా చూపించారు.ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆ సందర్భంలో వీవీప్యాట్ స్లిప్‌లను అభ్యర్ధులు కోరితే ఐదు శాతం బూత్‌లలో లెక్కించాలని ఆదేశించినా, అధికారులు అనుసరించడం లేదని మస్తాన్ చెప్పారు. దీనితో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని అమెరికా మంత్రి తులసి గబర్డ్ , టెస్లా అధినేత ఈలాన్ మస్క్లతోపాటు భారత్‌కు చెందిన పలువురు చెబుతున్నారు. పోలీసులు ఆయా కేసులలో నిందితుల నుంచి సెల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ వంటివాటిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వాటిని రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటికన్నా, కౌంటింగ్ నాటికి పెరగడంపై విజయనగరం నుంచి లోక్‌సభకు పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్ కోర్టుకు వెళ్లినా ఇంకా నిర్ణయం రాలేదు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.పీవీఎస్ శర్మ అనే ప్రముఖుడు ఏపీలో 48 లక్షల ఓట్లు పెరిగిన తీరు చూస్తే ఎన్నికలలో మానిప్యులేషన్ వల్లే జగన్ ప్రభుత్వం ఓడిపోయిందని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రేషన్ షాపులో ఐదు కిలోల బియ్యం ఇవ్వడానికి రేషన్ కార్డుతోపాటు వేలిముద్రను కూడా తీసుకుంటారని, అలాంటిది ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికలలో మాత్రం దొంగ ఓట్లు పడకుండా అలాంటి వ్యవస్థలను తీసుకు రాలేరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్యాంకులలో లావాదేవీలను చాలావరకు పకడ్బందిగా అమలు చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఎందుకు మార్పులు తీసుకురాలేకపోతున్నారన్న ప్రశ్నకు జవాబు దొరకదు.రాహుల్ గాంధీ ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు. దీనిపై ఎన్నికల సంఘం ఆయన ప్రమాణం చేయాలని, అఫిడవిట్ వేయాలని చెబుతోంది. రాహుల్ గాంధీ నిజంగానే బాద్యత లేకుండా ఆరోపణలు చేసి ఉంటే, ఈసీ కూడా అదే తరహాలో బాద్యతారాహిత్యంగా బదులు ఇస్తోందనిపిస్తుంది. ఈసీ ఒక రాజకీయ పార్టీ కాదు అన్న అంశాన్ని గుర్తుంచుకుని ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయవలసి ఉంటుంది. ఇప్పటికే మన ప్రభుత్వాల తీరుతెన్నుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం వంటి కీలక సంస్థ కూడా అభియోగాలకు గురయ్యే పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఢిల్లీలో ఇండియా కూటమి MPల ర్యాలీలో ఉద్రిక్తత
-
ఢిల్లీలో హై టెన్షన్.. MPలతో రాహుల్ ర్యాలీ
-
EC Office: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ సహా ఎంపీలు అరెస్ట్
INDIA bloc leaders March Updates..ఎంపీలు అరెస్ట్.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులుకూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Dare hue hai. Sarkaar kaayar hai."Delhi Police detained INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march… https://t.co/GPvb7VcoH4 pic.twitter.com/nnA2tpXC8T— ANI (@ANI) August 11, 2025రాహుల్ కామెంట్స్..అరెస్ట్ తర్వాత రాహుల్ మాట్లాడుతూ..నిజం దేశం ముందు ఉంది.కానీ, వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరు.ఈ పోరాటం రాజకీయమైనది కాదు.ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్నాం.ఈ పోరాటం ఓటు కోసం.మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి#WATCH | Delhi: Police detains INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march from Parliament to the Election Commission of India. pic.twitter.com/9pfRxTNS49— ANI (@ANI) August 11, 2025కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్‌కు నేను రాసిన లేఖ ప్రత్యక్షంగా ఉంది.అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీసుకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తారని నేను స్పష్టంగా రాశాను.ఎంపీలందరూ SIR గురించి ఎన్నికల కమిషన్‌కు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఇది మా డిమాండ్.నేను నిన్న సాయంత్రం ఈ లేఖ రాశాను.ఇప్పుడు వారు 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని అంటున్నారు.ప్రతిపక్ష ఎంపీలందరూ సమిష్టిగా ఈసీకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం.మమ్మల్ని ఇక్కడే ఆపారు.ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు. శశి థరూర్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..ఈ విషయం చాలా సులభం.రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాదు. మన ఎన్నికల విశ్వసనీయత గురించి ప్రజల మనస్సులలో సందేహాలను నివృత్తి చేయాలి.ఈసీకి ఆ బాధ్యత ఉంది.ఎన్నికలు మొత్తం దేశానికి ముఖ్యమైనవి.నకిలీ ఓటింగ్ ఉందా, బహుళ చిరునామాలు ఉన్నాయా లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా?.పలు సందేహాలతో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.ప్రజల మనస్సులలో సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలి.ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉండవచ్చు, కానీ ఆ సమాధానాలను విశ్వసనీయంగా అందించాలి.ఎన్నికల కమిషన్ ప్రశ్నలను తీసుకొని వాటిని పరిష్కరించాలి. #WATCH | Congress MP Shashi Tharoor says, "For me, the issue is very simple. Rahul Gandhi has raised some serious questions; they deserve serious answers. The Election Commission not only has a responsibility to the nation, but it has a responsibility to itself that there should… https://t.co/BaEU00fr0Y pic.twitter.com/c39DQ5fSTu— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేసిన పోలీసులు.ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా విపక్ష ఎంపీలను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.బారికేడ్డు పెట్టి విపక్ష ఎంపీలను నిలువరిస్తున్న ఢిల్లీ పోలీసులు.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ చేసిన రాహుల్ గాంధీ. రోడ్డుపై బైఠాయించి ఎంపీల నిరసనలు.. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఢిల్లీలో హైటెన్షన్.. అఖిలేష్ యాదవ్ నిరసన..ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.బారికేడ్ల దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిలేష్.అఖిలేష్‌ను అడ్డుకున్న పోలీసులు..పార్లమెంట్ వద్ద రోడ్డుపై కూర్చుని అఖిలేష్, తృణముల్ ఎంపీలు నిరసనలు.నిరసనల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, శశి థరూర్ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల నినాదాలు #WATCH | Delhi: "... They are using the police to stop us...," says Samajwadi Party Chief and MP Akhilesh Yadav as he sits down to protest as police stop the opposition MPs from marching towards the Election Commission of India. pic.twitter.com/u3ScvbxWiX— ANI (@ANI) August 11, 2025 #WATCH | Congress MP Priyanka Gandhi Vadra raises slogans as the INDIA bloc leaders march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during… pic.twitter.com/X9xgcPRVCV— ANI (@ANI) August 11, 2025 #WATCH | Delhi: Senior INDIA bloc leaders- Congress President Mallikarjun Kharge, NCP SCP chief Sharad Pawar join INDIA bloc leaders as they march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in… pic.twitter.com/d0ExdSGTHH— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రికత్త.. పార్లమెంట్ బయటే బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లపైకి ఎక్కిన మహిళా ఎంపీలు.ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఈసీ అపాయింట్మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలుపార్లమెంట్ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీబీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీగత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలుఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్. 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం #WATCH | Delhi: INDIA bloc leaders gathered at the Makar Dwar of the Parliament. INDIA bloc leaders are set to stage a march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar… pic.twitter.com/gc9hDgtqNB— ANI (@ANI) August 11, 2025👉విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఇండియా బ్లాక్ నేతలు, తదితరులు పాల్గొన్నారు. -
EVMల గోల్ మాల్.. రాహుల్ నోట.. జగన్ మాట
-
బదులివ్వకుండా బెదిరింపులా?
బెంగళూరు: దేశంలో ముమ్మాటికీ ఓట్ల చౌర్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలపై తాను గణాంకాలు విడుదల చేసిన తర్వాత ప్రజలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దాంతో దిక్కుతోచని ఎన్నికల సంఘం సంబంధిత వెబ్‌సైట్‌ను మూసివేసిందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్‌లో ఈసీ వెబ్సైట్లు మూతపడ్డాయని తెలిపారు. ఎన్నికల బాగోతాలపై ప్రజలంతా నిలదీయడం ప్రారంభిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఈసీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’లో రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చేతబూని ప్రసంగించారు. తాను చేసిన ఆరోపణలు నిజమని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ప్రమాణం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈసీ ఎదుట ప్రమాణం చేయాలా? అని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి రాహుల్ ఐదు ప్రశ్నలు సంధించారు. తనను బెదిరించడం పక్కనపెట్టి, వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... కొత్త ఓట్లన్నీ బీజేపీకే... ‘‘మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో రిగ్గింగ్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా ఎల్రక్టానిక్ ఓటర్ డేటా మాకు అందజేస్తే.. ప్రధానమంత్రి పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంది. కేవలం నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకలా జరిగిందో ఆరా తీస్తే కోటి మంది కొత్త ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తేలింది. 4 నెలల్లోనే కోటి మంది ఎలా ఓటర్లయ్యారు? ఆ కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడ్డా యి. భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైన చోట బీజేపీ గెలుస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటి? రాజ్యాంగంపై మోదీ దాడి కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాం. సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. కానీ, 9 సీట్లే వచ్చాయి. అక్కడ ఏదో మాయ జరిగినట్లు తేలిపోయింది. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్‌లు ఇవ్వాలని అడిగితే తిరస్కరించారు. తర్వాత చట్టాన్ని మార్చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 రోజుల్లో వీడియో ఆధారాలను తొలగిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలి. లేనిపక్షంలో మహాదేవపుర స్థానంలో నిర్వహించినట్లుగానే ఇతర నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశోధన చేస్తాం.ఎప్పటికైనా చర్యలు తథ్యం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు అంగీకరించాలి. అసలేం జరిగిందో చెప్పాలి. వాస్తవాలకు ముసుగేయాలనుకోవడం సరైంది కాదు. ఏదో ఒకరోజు మీరు మమ్మల్ని(ప్రతిపక్షం) ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషనర్ సహా ప్రతి అధికారీ ఈ విషయం గుర్తించుకోవాలి. రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకుంటామంటే కుదరదు. మీపై చర్యలు తీసుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఎప్పటికైనా చర్యలు మాత్రం తథ్యం. అక్రమార్కులు ఒకరి తర్వాత ఒకరు దొరికిపోవడం ఖాయం. నేను చెప్పేది రాసి పెట్టుకోండి. రాజ్యాంగంపై దాడికి దిగితే మేము మీపై దాడి చేస్తాం’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈసీకి రాహుల్ 5 ప్రశ్నలు1. ఓటర్ల జాబితాలను డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వడం లేదు? 2.ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? 3.ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఎందుకు జరిగింది? 4.మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తోంది? 5.ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్‌గా ఎందుకు పనిచేస్తోంది? -
Rahul Vs EC: ఈసీకి రాహుల్ ఐదు ప్రశ్నలు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. -
రాహుల్‌కు జై కొట్టిన శశిథరూర్..!
న్యూఢిల్లీ: తరుచు కాంగ్రెస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి అండగా నిలుస్తూ వస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. ఎట్టకేలకు రాహుల్ గాంధీకి జై కొట్టారు. ఆపరేషన్ సింధూర్ అంశం దగ్గర్నుంచి కాంగ్రెస్ ఒకటి చెబితే, శశిథరూర్ వ్యాఖ్య మరొకటిగా ఉండేది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో జరిగిన చర్చలో సీనియర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విపక్ష కాంగ్రెస్. అదే సమయంలో కేంద్రానికి పదే పదే వత్తాసు పలుకుతున్న శిథరూర్ వరుస స్టేట్మెంట్లతో కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేశారు కూడా. అయితే తాజాగా విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అండగా నిలిచారు శశిథరూర్. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ చెబుతున క్రమంలో శశిథరూర్ మాత్రం రాహల్కే జై కొట్టడం కాస్త ఆసక్తిని పెంచింది. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం(ఆగస్టు 8వ తేదీ) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. దీనికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ లభించింది. ఈ అంశాన్ని ప్రతీ రాజకీయ పార్టీ తీవ్రమైన అంశంగా పరిగణించాలి. మన ప్రజాస్వామ్యం చాలా విలువైనది,. ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా పరిగణించల్సిన అంశం. అసమర్థత కావొచ్చు.. అజాగ్రత్త కావొచ్చు.. ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేసే ప్రక్రియ కావొచ్చు. ఇది మన విశ్వసనీయతను నాశనం చేసే ఒక ప్రక్రియ. దీనిపై ఈసీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు శశిథరూర్. ఈ మేరకు రాహుల్ స్పీచ్‌ను సైతం పో స్ట్ చేశారు.These are serious questions which must be seriously addressed in the interests of all parties & all voters. Our democracy is too precious to allow its credibility to be destroyed by incompetence, carelessness or worse, deliberate tampering. @ECISVEEP must urgently act &… https://t.co/RvKd4mSkae— Shashi Tharoor (@ShashiTharoor) August 8, 2025 కింది లింక్‌లో రాహుల్ వ్యాఖ్యలు చదివేయండి.. ‘ఓట్ల దొంగతనానికి ఆధారాలు ఇదిగో’ -
ఓట్ల దొంగతనానికి ఆధారాలు ఇదిగో..: రాహుల్ గాంధీ
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది అని రాహుల్ అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. లోక్‌సభ ఎన్నికల తరవాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అక్కడ మా మహఘట్‌బంధన్ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని గుర్తించాం. వీళ్లెవరూ లోక్‌సభ ఎన్నికలకు ఓటేయలేదు. ఇండియా కూటమికి ఓటు షేర్ ఎక్కడా తగ్గలేదు. కానీ, కొత్తగా చేరిన ఓటర్లు బీజేపీకి ఓటేశారు. అలా బీజేపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నెగ్గింది. అక్కడే ఏదో తప్పు జరిగిందని గుర్తించాం. नरेंद्र मोदी वोट चोरी करके प्रधानमंत्री बने हैं चुनाव आयोग हमें डेटा दे, हम साबित कर देंगे pic.twitter.com/WUBm97WR4g— Congress (@INCIndia) August 8, 2025బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పార్లమెంట్ ఫలితం.. అందునా మహదేవపుర సెగ్మెంట్ నుంచే మేం మా పరిశోధన మొదలుపెట్టాం. మహదేవపురలో 6.5 లక్షల ఓట్లు ఉంటే.. 1,00,250 ఓట్లు చోరీకి గురయ్యాయి. అంటే.. సగటున ఆరు ఓట్లలో ఒకటి చోరీకి గురైందన్నమాట. అలా లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ బీజేపీ కలిసి మోసం చేశాయని నిరూపించగలిగాం. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 ఫేక్ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన లెక్క ప్రకారం ఫేక్ ఓట్లు ఇలా ఉన్నాయి• 11,965 డూప్లికేట్ ఓటర్లు• 40,009 ఫేక్/చెల్లని చిరునామాలు• 10,452 ఓటర్లు ఒకే చిరునామాలో నమోదు• 4,132 చెల్లని ఫోటోలు• 33,692 మంది Form 6 ద్వారా అనుమానాస్పదంగా ఓటర్లుగా నమోదుమహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. కర్ణాటకలోనూ ఫేక్ ఓట్లు నమోదయ్యాయి. ఒకే ఇంటిపై 40కిపైగా ఓట్లు నమోదు అయ్యాయి. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్సైట్ మూసేసింది. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఎన్నికల మోసానికి పాల్పడింది. ఓట్ల దొంగతనం తీవ్రమైన నేరం. ఆ నేరం జరిగింది అనడానికి కర్ణాటక డేటానే ఆధారం. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు ఇవ్వకుండా ఈసీ నేరాన్ని దాచిపెడుతోంది. ఈ ఓట్ల దొంగతనంను దేశవ్యాప్తంగా బయటపెట్టేందుకు కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించబోతోంది.నన్ను అఫిడవిట్ ఇవ్వమని, ప్రమాణం చేయమని ఈసీ అడుగుతోంది. కానీ నేను పార్లమెంట్లో రాజ్యాంగం మీద ఇప్పటికే ప్రమాణం చేశాను. ఎన్నికల సంఘం బీజేపీకి గనుక పని చేయకపోతే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు మాకు అందించాలి’’ అని రాహుల్‌గాంధీ ఈసీకి సవాల్ విసిరారు. -
తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్‌ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్‌లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్‌డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్‌కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025 -
నేను ఛాలెంజ్ కు రెడీ..! దొంగ ఓట్లు లేని ఒక్క పోలింగ్ బూత్ చూపించండి
-
ఇలా 'ట్రై' చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు. మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి. అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. జీవో ఇస్తే..కోర్టులకెళితే.. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం. కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం. రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది. ఖర్గేతో మంతనాలు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం! – తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు పీఆర్‌శాఖ స్పష్టం చేసింది. -
KTR: రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక డ్రామా
-
‘ఓట్ చోరీ’ కామెంట్స్‌లో ట్విస్ట్.. తప్పని తేలితే రాహుల్ గాంధీకి శిక్ష
సాక్షి,బెంగళూరు: బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓట్ చోర్ పేరుతో గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్ఘతం చేశారు. అయితే రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవి తెలిపింది. ఎన్నికల సంబంధించిన అంశాలను న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరింది. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించింది. The Chief Electoral Officer of Karnataka confirmed a meeting with the INC delegation on August 8. In response to Rahul Gandhi’s remarks on alleged irregularities in the voter rolls, the CEO stated that electoral rolls were transparently shared in Nov 2024 and Jan 2025. No… pic.twitter.com/gRfO8Eq3Nd— IANS (@ians_india) August 7, 2025 ఆ నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు.. ఆధారాలివే ‘సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఫలితాలు తారుమారువడంపై మాకు అనుమానం వచ్చింది. గతేడాది 48 మహారాష్ట్ర లోక్‌సభ స్థానాల్లో సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును ఎందుకు దాటలేకపోయింది.మహరాష్ట్ర,కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసమే ఈసీ పనిచేసింది. అందుకు మా వద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయి. మేం అంతర్గతం చేపట్టిన సర్వేలో కర్ణాటకలో ఇండియా కూటమి 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది. కానీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఓడిపోయిన ఏడు స్థానాలపై దృష్టి సారించాం. అలా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానమైన మహదేవపురలో ఓటమికి గల కారణాల్ని అన్వేషించాం. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి 6,58,915 ఓట్లు పోలవ్వగా.. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. ఇదే బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలో మహదేవపుర అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే.. ఓట్ల చోరీ జరిగినట్లు గుర్తించాం. మహదేవపురలో కాంగ్రెస్‌కు 1,15,586 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ 2,29,632 ఓట్లు పోలయ్యాయి. బెంగళూరు సెంట్రల్లో సర్వజ్ఞనగర్,సీవీ రామ్ నగర్,శివాజీ నగర్,శాంతీ నగర్,గాంధీ నగర్,రాజాజి నగర్,చామ్‌రాజ్‌పేట అన్నీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక్క మహదేవపురలో ఓడిపోయాం.ఈ మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు రకాలుగా 1,00,250 నకిలీ ఓట్లు గుర్తించాం. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే ఇంటి అడ్రస్‌తో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇది నిజమా? కాదా? అని నిర్దారించేందుకు ఆ ఇంటి చిరునామాలకు వెళ్లాం. ఆ ఇంటి అడ్రస్‌లో ఉన్న ఓట్లను పరిశీలిస్తే.. అన్నీ నకిలీవేనని తేలింది’ అని ఆరోపించారు. -
పోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. కానీ ఓటింగ్ శాతం భారీగా పెరిగింది
-
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్‌లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్‌లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది. -
మా ఆఖరి పోరాటం పూర్తి చేశాం.. ఇక నిర్ణయం కేంద్రానిదే: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన(కిషన్ రెడ్డి) చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదు. బీసీ మొత్తానికి కలిపి 42 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్ఎస్ నైజం. లోకల్‌బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో 24 గంటల్లో మరోమారు భారత్‌పై దిగుమతి టారిఫ్‌లను పెంచుతానని మంగళవారం ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ భారత్‌పై అదనపు టారిఫ్‌లు మోపుతానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఇప్పటికే ఒకసారి 25 శాతం పెంచినా ప్రధాని మోదీ ఏమాత్రం ట్రంప్‌ను నిలువరించలేకపోయారు. దీని వెనుక అసలు కారణం ఇప్పటికైనా భారతీయు లకు తెలియాల్సి ఉంది. అదేంటంటే అమెరికాలో గౌతమ్ అదానీపై అక్కడి విచారణ సంస్థలు దర్యాప్తు కొన సాగిస్తున్నాయి. మోదీ, ఏఏ(అంబానీ, అదానీ), రష్యా ముడి చమురు కొను గోళ్ల వ్యవహారంలో అక్రమ ఆర్థిక సంబంధాలు బట్టబయలు చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అందుకే భారత్‌పై ఎంతటి టారిఫ్‌ల భారం పడుతున్నా ప్రధాని మోదీ చీమకుట్టినట్లయినా లేకుండా మౌనంగా ఉండిపోయారు. అదానీ దర్యాప్తు పేరు చెప్పి మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సంస్థనుంచిగానీ కేంద్రప్రభుత్వం నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి స్పందన, వివరణ రాలేదు. రష్యాతో ముడి చమురు వాణిజ్యాన్ని భారత్ మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. ఈ అక్కసుతోనే ఆయన భారత్‌పై అదనపు దిగుమతి టారిఫ్‌లను విధిస్తు న్నారు. ఇప్పటికే ఒక దఫా పెంచగా మరోదఫా మరికొన్ని గంటల్లో పెంచుతానని ప్రకటించడం, భారత్ ఘాటుగా బదులివ్వడం తెల్సిందే. -
‘సబ్ కా సాత్’ అంతా డొల్ల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడమంటే, దాన్ని నిరాకరించడమేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా పురస్కరించుకుని వారు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ సర్కారు కృషి: ఖర్గే ‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్ హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆమోదించింది. కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో.. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల. ఎందుకంటే ఈ బిల్లులకు, అణగారిన వర్గాల హక్కులకు మోదీయే అడ్డుగోడగా ఉన్నారు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల కోసమే ఈ పోరాటం: రాహుల్ గాంధీ ‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేశా యి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా ఈ బిల్లు ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’నేతలకు నా కృతజ్ఞతలు. రాష్ట్రపతి దీనిని గుర్తించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, హక్కుల కోసం జరుపుతున్న సమిష్టి పోరాటం.’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చరిత్రాత్మక బిల్లు ‘తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడే ఆగిపోయింది. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం తెలంగాణ పోరాటమే కాదు. అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం జాతి యావత్తు చేస్తున్న ఆందోళన. న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, దాన్ని తిరస్కరించడమే..’అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. -
మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాందీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని అన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో టీపీసీసీ బుధవారం నిర్వహించిన మహాధర్నాలో సీఎం ప్రసంగించారు. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తే అదే మరణ శాసనం ‘గోధ్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి నాడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని కోరితే చేయలేదు. 75 ఏళ్లు నిండినందున ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించడం ఖాయం. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాము.. గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్‌గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక న్యాయంపై రాహుల్‌గాంధీ శిలాశాసనానికి వ్యతిరేకంగా వస్తే అదే మరణ శాసనం అవుతుంది..’అని రేవంత్ హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణ బీసీల అవసరం లేదా? ‘బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేశారు. నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్ల పెంపునకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపినా ఆమోదించడం లేదు. కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా? ఆ అదృష్టం నాకు దక్కింది ‘దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయలేదు. ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం నాకు దక్కింది. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరతాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్ బుద్ధి మారలేదు.. అహంకారం తగ్గలేదుబీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు. కానీ కేటీఆర్ పేరే డ్రామారావు. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోంది. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు..అహంకారం తగ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు ప్రతికూలం.. మరొకరు అటూఇటూ కాకుండా మాట్లాడుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!
అన్యాయాలను నిలదీసిన తండ్రిని తన చిన్నతనంలోనే వడ్డీవ్యాపారులు గుండాల సాయంతో హత్య చేయించడం కళ్లారా చూశారాయన. అయితే ఆ ఘటనే శిబుసోరెన్ జీవితాన్ని మార్చేసింది. గిరిజనుల తరఫున పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. స్వరాష్ట్ర సాధన, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సగానికిపైనే గడిచిపోయింది.జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం(ఆగస్టు 4, 2025) తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిపై తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.గౌరవనీయులైన డిషోమ్ గురు(Dishoom Guru) మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు హేమంత్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆదివాసీల, పేదల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అంటూ వ్యాఖ్య చేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం మరువలేనిది’ అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం శిబు సోరెన్ మృతికి నివాళులర్పిస్తున్నారు.డిషోమ్ గురుగా..శిబు సోరెన్‌ను ఆయన మద్దతుదారులు డిషోమ్ గురూ అని సంబోధిస్తుంటారు. డిషోమ్ గురూ.. అంటే పోరాటాలకు సిద్ధంగా ఉండే గురువు.. భూమి పుత్రుడు, దేశ నాయకుడు అనే అర్థాలు వస్తాయి. ఆదివాసీల హక్కుల కోసం, భూదోపిడీ.. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టాయి.1973లో జేఎంఎం ఆవిర్భవిస్తే.. 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా, స్వరాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అయితే ఆ మూడు పర్యాయాల్లోనూ రాజకీయ ఒడిదుడుకులతో ఆయన ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్హం. 2005లో కేవలం 9 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. రెండోసారి.. అగష్టు 2008లో సీఎంగా బాధ్యతలు చేపట్టి జనవరి 2009లో ఆ పదవి నుంచి దిగిపోయారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్లో సీఎంగా బాధ్యత చేపట్టినా.. ఐదు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే..1980 నుంచి 2005 మధ్య ఆయన లోక్‌సభ ఎంపీగా.. అటుపై మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఆయన పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పని చేశారు.తండ్రి హత్య చూసి..1944 జనవరి 11న నెమ్రా జిల్లా(ప్రస్తుత జార్ఖండ్)లోని సంతల్ గిరిజన కుటుంబంలో జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీవ్యాపారుల గుండాల చేతుల్లో తండ్రి దారుణ హత్యకు గురికావడం కళ్లారా చూశారాయన. బడీ ఈడు పిల్లాడిగా ఉన్న ఆయన్ని ఆ ఘటనే రాజకీయ పోరాటాల వైపు అడుగులేయించింది. ఆదివాసీల హక్కుల కోసం ఉదృత పోరాటాన్ని చేయించింది.18 ఏళ్ల వయసులో సంతల్ నవయువక్ సంఘ్‌ను స్థాపించి.. 1972లో బెంగాల్ మార్కిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట ఏకే రాయ్, బినోద్ బీహారీ మహాటో నేత కుర్మి మహాటోతో శిబుసోరెన్ చేతులు కలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన స్వరాష్ట్ర ఉద్యమం చేపడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. అలా మొదలైన పోరాటం.. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పాటుతో(బీహార్ నుంచి విడిపోయి) నెరవేరింది. ప్రజల కోసం నిర్భయంగా, నిబద్ధతతో నిలబడిన నాయకుడిగా గుర్తింపు పొందారాయన.కుటుంబమంతా రాజకీయాల్లోనే..రూపీ సోరెన్‌ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జేఎంఎం ఒడిషా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.శిబుసోరెన్ మీడియా ముఖంగా నవ్వే సందర్భాలు చాలా అరుదు. అందకు ఆయన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉండేది. 15వ ఏట తండ్రి మరణం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు వల్ల తాను నవ్వడం మానేశాని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుండేవారాయన. రాజకీయాల్లో సాదాసీదా నేతగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. శిబు సోరెన్.. జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే అదే సమయంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. గతంలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. అలాగే చిరుదిహ్ ఊచకోత, మాజీ కార్యదర్శి శశినాథ్ జా హత్య కేసులతో పాటు అక్రమాస్తుల ఆరోపణలు ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కించాయి.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీరు (రాహుల్)ఎలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరువు నష్టం దావా కింద క్రిమినల్ కేసు వేశారు. అయితే ఈ ఫిర్యాదులో విచారణ పై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని ప్రశ్నించింది. ప్రతిపక్షనేత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది.కాగా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా..2,000 కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 జూన్‌లో లబ్దఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ ప్రభు త్వం చైనాకు లొంగిపోయిందని, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు. అయితే రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని మండిపడింది. ఈ కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ.. రాహుల్‌కు మాత్రం నోటీసులు జారీచేసింది. -
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
సాక్షి, న్యూఢిలీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) విషయంలో విపక్ష ‘ఇండియా’కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం కావాలని విపక్ష కూటమి నేతలు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈ విందు భేటీ జరుగనుంది. ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేస్తారని సమాచారం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 70–80 సీట్లు రిగ్గింగ్‌కు గురయ్యాయని రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. నరేంద్ర మోదీ అత్యంత తక్కువ మెజారీ్టతో ఈసారి ప్రధానమంత్రి అయ్యారని, రిగ్గింగ్ జరగకపోయి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్, భారత్‌పై అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం తదితర అంశాలు విందు భేటీ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నారు. ‘ఇండియా’కూటమి నేతలు చివరి సమావేశం జూలై 19న వర్చువల్‌గా జరిగింది. -
శశిథరూర్ కొత్త ట్విస్ట్.. రాహుల్ వ్యాఖ్యలపై వింత సమాధానం!
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై హస్తం పార్టీ ఎంపీ శశిథరూర్ వింత సమాధానంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడంపై శశిథరూర్ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్‌కు ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా మీడియా ప్రశ్నలపై స్పందిస్తూ.. భారత్‌కు వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా అమెరికా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య సముచిత వాణిజ్య ఒప్పందం కుదిరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక, ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్‌కు మరేమైనా కారణాలు ఉండొచ్చు. అయితే, రాహుల్ అభిప్రాయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య అభిప్రాయభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌పై థరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో, థరూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.‘He Has His Reasons.….’ 😂😂😂Shashi Tharoor Reacts To Rahul Gandhi's Remark On Trump TariffsShashi Tharoor responded cautiously after Rahul Gandhi agreed with U.S. President Donald Trump’s “dead economy” remark on India. Tharoor said he wouldn’t comment on his party leader’s… pic.twitter.com/OXHodiXvdy— Augadh (@AugadhBhudeva) August 2, 2025మరోవైపు.. భారత్ టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు భారత్‌ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్.. వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకోనీయండంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందనే కారణం చూపుతూ.. భారత నుంచి దిగుమతులపై 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధించారు. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్యం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఇరు దేశాలు ఆర్థికవ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ఈ క్రమంలో వివాదం నెలకొంది. -
దమ్ముంటే బాంబు పేల్చు
పట్నా: ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘంపై అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దమ్ముంటే ఒక్కసారి అణు బాంబు పేల్చి చూపించాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. అది పేలేటప్పుడు హాని జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్లో భూకంపం సృష్టిస్తానని రాహుల్ గతంలో హెచ్చరించారని, చివరకు తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్ రాజధాని పాటా్నలో ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని రాహుల్ కించపరుస్తున్నారని ఆరోపించారు. నిజానికి రాహుల్ పార్టీ చేతులే రక్తంతో తడిశాయని విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయతి్నంచిందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు. -
ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని అన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తన వద్దనున్న అణు బాంబును అతిత్వరలో ప్రయోగిస్తానని, అది మన ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని తేల్చిచెప్పారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోదీ ఈసారి అతి తక్కువ మెజారీ్టతో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఎన్డీయేకు మరో 15 సీట్లు తక్కువ వచ్చి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్ చేయొచ్చని, గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని త్వరలో నిరూపిస్తామని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఆ కొత్త ఓటర్లు ఎవరు? ఎన్నికల సంఘం స్వతంత్రను కాపాడుతున్నది రాజ్యాంగమే. కానీ, రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘం అతిక్రమిస్తోంది. లెక్కలేకుండా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై గతంలో నా దగ్గర ఆధారాల్లేవు. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయలేదు. కానీ, ఇప్పుడు 100 శాతం సాక్ష్యం ఉంది కాబట్టే పూర్తివిశ్వాసంతో మాట్లాడుతున్నా. ఎన్నికల్లో అవకతవకలు ఎలా సాధ్యమని కురీ్చలో కూర్చున్నవారు అడుగుతున్నారు. కానీ, అది ముమ్మాటికీ సాధ్యమే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎన్నికల వ్యవస్థపై నాకు ఎప్పటి నుంచో అనుమానాలున్నాయి. 2014 నుంచే జగరానిది ఏదో జరుగుతున్నట్లు సందేహాలు తలెత్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో అనుమానాలు బలపడ్డాయి. అక్కడ బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనూ సీట్లు రాలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి స్కోర్ సాధించిన మూడు పారీ్టలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీట్లు గెల్చుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలపై అప్పటి నుంచే సీరియస్‌గా దృష్టి పెట్టాం. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా కోటి మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. ఆ కొత్త ఓటర్లు ఎవరన్నదానిపై నావద్ద స్పష్టమైన ఆధారం లేదు. ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని మా మిత్రపక్షాలతోనూ చెప్పా. ఇప్పుడు ఆధారం దొరికింది. దేశంలో ఎన్నికల సంఘం అనేదే లేదు, అది అదృశ్యమైపోయిందని నిరూపించే సాక్ష్యాధారాన్ని దేశానికి చూపిస్తాం. ఓటర్ల జాబితాల సంగతేంటి? లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన మోసంపై ఆధారాలు సేకరించడానికి ఆరు నెలలపాటు శ్రమించాం. ఎల్రక్టానిక్ రూపంలోని ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం మాకు ఇవ్వలేదు. బూత్‌ల వారీగా కాగితాల రూపంలోని జాబితాలు ఇచ్చారు. ఎన్నికల సంఘం వాటిని స్కాన్ చేయలేదు. ఓటర్ల జాబితాలను స్కాన్ చేసి ఎందుకు భద్రపర్చడం లేదు? వాటి ఎల్రక్టానిక్ కాపీలను భద్రపర్చాల్సిన అవసరం లేదా? ఒక లోక్‌సభ నియోజకవర్గంలో భౌతిక రూపంలోని ఓటర్ల జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తే 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షల ఓట్లు తప్పుడు వని తేలిపోయింది’ అని రాహుల్ స్పష్టం చేశారు. జైట్లీ బెదిరించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నేను తీవ్రంగా వ్యతిరేకించా. కానీ, వ్యతిరేకించవద్దని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే నాపై చర్యలు తీసుకుంటామని బెదిరించాలని చూశారు. ఆయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ గట్టిగా బదులిచ్చా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదనుకుంటా... మేము కాంగ్రెస్ మనుషులం. పిరికిపందలం కాదు. మేము ఎవరికీ తలవంచం. బ్రిటిష్ పాలకులే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మాకు చెప్పడానికి మీరెవరు? అని నిలదీశా’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. 2019లో చనిపోతే 2020లో బెదిరించారా?: రోహన్ జైట్లీ ఆరుణ్ జైట్లీ బెదిరించడానికి ప్రయతి్నంచారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఖండించారు. తన తండ్రి 2019లో మరణించారని, వ్యవసాయ చట్టాలు 2020లో వచ్చాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాహుల్ గాం«దీని బెదిరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు రోహన్ జైట్లీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినవారిని బెదిరింపులకు గురి చేయడం తన తండ్రికి అలవాటు లేదని, అది ఆయన వ్యక్తిత్వం కాదని పేర్కొన్నారు. -
రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న.. ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. నేను దేనికి భయపడను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. కాంగ్రెస్ తప్పును తప్పు అని చెబుతుంది. నిజం ఉన్న చోట దైర్యం ఉంటుంది. బీజేపీకి ధైర్యం లేదు.. నిజం చెప్పలేదు’’ అని రాహుల్ మండిపడ్డారు. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు.. మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు. లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయొచ్చా...? రిగ్గింగ్ జరిగిందా అనేది నిరూపిస్తాం. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ లో తప్పిదాలున్నాయి.. దాన్ని నిరూపించాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది.. దానికి సంబంధించి ఆధారాలున్నాయి. ఈసీ స్కాన్ ప్రొటెక్ట్ ఓటర్ లిస్ట్ ఎందుకు కలిగి ఉంది?. ఆరున్నర లక్షల ఓటర్లలో లక్షన్నర ఓట్లు ఫేక్ ఓట్లు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం.ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు?. మేము రాజకీయంగా పోరాడుతున్నాం.. రాజ్యంగం కోసం న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతోంది న్యాయవాదులే అని రాహుల్ అన్నారు. #WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025 -
అణు బాంబు లాంటి సాక్ష్యం ఉంది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఓట్ల చోరీని నిరూపించడానికి తమ వద్ద అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందని స్పష్టంచేశారు. ఈ అణు బాంబు పేలితే దాక్కోవడానికి ఈసీకి దేశంలో ఎక్కడా చోటు దొరకదని అన్నారు. ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న అధికారులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల చౌర్యంపై తమ వద్ద 100 శాతం సాక్ష్యం ఉందన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐర్) పూర్తయ్యి ముసాయిదా జాబితాను విడుదల చేసిన రోజే ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. కొందరి ఓట్లు తొలగించడం, కొత్తగా ఓటర్లను చేరి్పంచడం సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసమే ఈ తతంగం సాగుతోందన్నారు. 2023లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, గత ఏడాది జరిగిన లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఓట్ల చౌర్యం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఎన్నికల ముందు కొత్తగా కోట్లాది మంది ఓటర్లను జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం స్పందించలేదని విమర్శించారు. అందుకే తామే సొంతంగా ఆరు నెలలపాటు పరిశోధన చేశామని, అణు బాంబు లాంటి సాక్ష్యం లభించిందని వ్యాఖ్యానించారు. ఓట్లను దొంగతనం చేయడం దేశ ద్రోహం కంటే తక్కువేమీ కాదన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు పదవీ విరమణ చేసి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటామని తేల్చిచెప్పారు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదన్నారు. రాహుల్ ఆరోపణలు పట్టించుకోవద్దుఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని.. పారదర్శకంగా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని తమ అధికారులకు సూచించింది. ఓట్ల చౌర్యం అంటూ ప్రతిరోజూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలి్చచెప్పింది. ఆరోపణల గురించి పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ఈసీ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టంచేసింది. -
ఇండియన్ ఎకానమీ ‘డెడ్ ఎకానమీ’నా?
‘ఇండియన్ ఎకానమీ... డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం, వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం; శశిథరూర్, రాజీవ్ శుక్లా లాంటి కాంగ్రెస్ నేతలే రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టడం... తాజా పరిణామాలు.నిజానికి ఏ ప్రభుత్వం పనితీరును అయినా అంచనా వేయడా నికి కీలక అంశం ద్రవ్యోల్బణం. అది ముఖ్యంగా... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. యూపీఏ రెండో హయాంలో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహానికి ఒక కారణం... దేశంలోని ద్రవ్యోల్బణం. ఇది అప్పట్లో గరిష్ఠంగా 12 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ప్రతిపక్ష నేతలు... ఆర్థిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా మలచుకుని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని పదేపదే ప్రయత్నించారు. కానీ... వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ ఎన్నికల నినాదంగా మారలేదు. ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో... 2012 వరకు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ని అనుసరించారు. ఆ తర్వాత నుంచి కంజ్యూ మర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ని అనుసరిస్తున్నారు. ఎన్డీయే హయాంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం నుండి 6 శాతానికి మధ్యలో ఉంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా... 3.1 శాతమే ఉంది. కాబట్టి ఇది ఆల్ టైవ్‌ు రికార్డ్ అన్నమాట! మోదీకి ముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోల్చినా కూడా ఇది ఎంతో మెరుగైన స్థితి. తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం అంతగా నియంత్రణ అయిందంటే, దాని పైన ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా! దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి.అంతకుముందు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల రవాణాలో... పర్మిట్లు, పన్నుల పరంగా ఆలస్యం చోటు చేసుకునేది. జీఎస్టీ రావడంతో పరిస్థితి మారిపోయింది. దీనివల్ల రవాణా వేగంగా జరిగి ఇంధన ఆదా పెరిగింది.క్రూడాయిల్ ధరలలో తగ్గుదల, డిజిటల్ సంస్కరణలు, పాల నలో అవినీతి తగ్గడం... ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చెయ్యడం కూడా ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్ప డ్డాయి. ప్రజలకి డబ్బులివ్వడం కంటే... వాళ్లకి పనికొచ్చే నాణ్యమైన ఇళ్ళను ‘పీఎమ్ ఆవాస్ యోజన’ ద్వారా ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం, టాయిలెట్లు కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయ పడ్డాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పీఎల్ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సఫలమైంది. ఇవన్నీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో 4వ స్థానానికి మనం ఎగబాకాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత పరిస్థితులపై ఎవరైనా ఒక అంచనాకు రావాలి.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి ‘ సామాజిక విశ్లేషకుడు -
Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్న ట్రంప్
-
ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం
న్యూఢిల్లీ: తాము విధించిన టారిఫ్‌ల దెబ్బకు భారత్ ఆర్థిక వ్యవస్థ ఖతమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన నిజమే చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, మీకు తెలియదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. రాహుల్ గురువారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చెప్పినట్లుగానే మన దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అదే ప్రధాని మోదీ అదే చేస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా, రక్షణపరంగా, విదేశాంగ విధానాల విషయంలోనూ దేశాన్ని నాశనం చేసి, ఒక్క అదానీకి మాత్రమే సాయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు నాశనమై పోయాయని దుయ్యబట్టారు. ‘మనది అద్భుతమైన విదేశాంగ విధానం అంటూ విదేశాంగ మంత్రి అంటున్నారు. కానీ, ఒక వైపు అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా మన వెంటబడుతోంది. Yes, he is right. Everybody knows this except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I am glad that President Trump has stated a fact.पूरी दुनिया जानती है- भारत की इकॉनमी 'Dead economy' है और BJP ने इकॉनमी को… pic.twitter.com/8VdjFN4uoV— Congress (@INCIndia) July 31, 2025 మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు దౌత్య ప్రతినిధులను పంపినా ఏ ఒక్క దేశం కూడా పాక్ చర్యలను ఖండించలేదు. వీరికి దేశాన్ని ఎలా నడపాలో తెలియదు. అంతటా గందరగోళమే’అని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి తన ప్రసంగంలో ట్రంప్ పేరును గానీ, చైనాను గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. ‘పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఏ దేశమూ ఖండించలేదన్న విషయాన్ని మోదీ చెప్పలేదు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఘన విజయం సాధించామంటూ వారిద్దరూ ప్రకటించారు. ఏమిటా విజయం?’అని రాహుల్ ప్రశ్నించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తన వల్లేనంటూ ట్రంప్ 30 సార్లు ప్రకటించుకున్నారు. #WATCH | Delhi | Congress MP Rajeev Shukla says, "... Trump saying that the economies of India and Russia are dead, is wrong. The Indian economy is not dead. Economic reforms were made when PV Narasimha Rao and Manmohan Singh were there. Atal Bihari Vajpayee took those reforms… pic.twitter.com/UZ0lLvRzZY— ANI (@ANI) July 31, 2025భారత్ ఐదు విమానాలు నష్టపోయిందని చెప్పిన ట్రంప్..భారత్‌పై ఇప్పుడు 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకని మీరు అడిగారా? ఇందుకు కారణం ఏమిటి? మోదీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు?’అని రాహుల్ వాగ్బాణాలు సంధించారు. ‘భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో అంతా ట్రంప్ చెప్పినట్లుగా జరుగుతుంది’అని రాహుల్ పేర్కొన్నారు. అనంతరం రాహుల్ ‘ఎక్స్’లో..‘భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మోదీయే చంపేశారు. 1. అదానీ–మోదీ భాగస్వామ్యం. 2. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ. 3. విఫలమైన తయారీరంగం 4. నాశనమైన చిన్న పరిశ్రమలు 5. దోపీడీకి గురైన రైతులు. వీటన్నిటితోపాటు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోదీ దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు’అని రాహుల్ ఆరోపించారు. -
'ఆపరేషన్ సిందూర్'పై మోదీ క్లారిటీ
-
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చలో ఎవరేమన్నారంటే..
మోదీకి ఆ ధైర్యం ఉందా? ‘‘పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సైనిక దళాలను వాడుకుంటున్నారు. భారత్–పాక్‌ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరా గాందీకి ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50 శాతం ఉన్నా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్లో చెప్పాలి. చైనా, పాకిస్తాన్ల కుట్రల గురించి కొన్ని నెలల క్రితమే లోక్‌సభలో హెచ్చరించా. ప్రభుత్వం నా మాట విని ఉంటే ఐదు యుద్ధ విమానాలను కోల్పోయేవాళ్లం కాదు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించగానే కొన్ని సున్నితమైన విషయాలను మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు చేరవేసింది. సైనిక స్థావరాలపై దాడులు చేయడం లేదని, ఘర్షణ ఇష్టం లేదని చెప్పేసింది. అలా చేయడం లొంగిపోయినట్లు కాదా? కేవలం 30 నిమిషాల్లో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు లొంగిపోయింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేయకుండా భారత వైమానిక దళం చేతులు కట్టేసింది ఎవరు? మోదీ ప్రతిష్టను కాపాడే ప్రయత్నం జరిగింది. పహల్గాం బాధితుల రక్తంతో మోదీ చేతులు తడిశాయి. చైనా, పాకిస్తాన్ ఒక్కటి కాకుండా చూడాలని నాలుగు నెలల క్రితం నేను చెబితే చాలామంది ఎగతాళి చేశారు. మన విదేశాంగ విధాన వైఫల్యం వల్ల ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు చైనాతోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు చైనా అన్ని విధాలుగా సహకరించింది. యు ద్ధంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పులిని వదిలిపెట్టాలి అనుకుంటే దానికి బంధనాలు విధించడం తగదు. శత్రువును ఓడించాలనుకుంటే పూర్తిగా ఓడించాలి. భారత్–పాక్ యుద్ధం తానే ఆపేశానని ట్రంప్ 29 సార్లు చెప్పారు. ‘మమ్మల్ని మీరు ఆపలేరు, కచి్చతంగా యుద్ధం కొనసాగిస్తాం’ అని ట్రంప్‌తో మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పలేకపోయారు. మనం ఇప్పుడు ప్రమాదకరమైన దశలో ఉన్నాం. చైనా–పాకిస్తాన్ల కూటమిని ఎదుర్కొంటున్నాం. సైనిక శక్తిని సక్రమంగా వాడుకోలేని ప్రధానమంత్రిని మనం ఇక భరించలేం. డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు అని ధైర్యంగా చెప్పలేని ప్రధానిమంత్రిని భరించలేం. ఇందిరాగాంధీ చేసినట్లుగానే.. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ‘పని పూర్తి చేసుకొని రండి’ అని చెప్పే ప్రధానమంత్రి ప్రస్తుతం మనకు కావాలి. పహల్గాం దాడికి సృష్టికర్త అయిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు ఇస్తే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం’’ – లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా రాజీనామా చేస్తారా? ‘‘నాయకత్వం అంటే ఏదైనా మంచి జరిగితే పేరు ప్రఖ్యాతలు కొట్టేయడం కాదు, తప్పు జరిగితే అందుకు బాధ్యత వహించాలి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీలతోపాటు నా తల్లి సోనియా గాంధీ పెట్టుకున్న కన్నీళ్ల గురించి మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్‌పై యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపారో మాత్రం చెప్పడం లేదు. భద్రతాపరమైన లోపాలే పహల్గాంలో ఉగ్రవాద దాడికి కారణం. పాకిస్తాన్ దాడిలో మనం యుద్ధ విమానాలకు నష్టం జరగకపోతే ఆ విషయం పార్లమెంట్లో చెప్పడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? పహల్గాంలో నిఘా వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పాలి. అమిత్ షా రాజీనామా చేస్తారా? లేక బాధ్యత వహిస్తారా? గతంలో జరిగిపోయిన విషయాలు పక్కనపెట్టి, ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం స్పందించాలి’’. – కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు ‘‘ఆపరేషన్ సిందూర్ మోదీ ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఎవరి ఒత్తిడితో కాల్పుల విరమణ పాటించారో చెప్పాలి. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దేశం ఒంటరిగా మిగిలిపోయింది, ఎవరూ మనకు మద్దతుగా రాలేదు. భారతదేశ దౌత్య విధానంలో ఇదొక చీకటి దశ. పుల్వామా, పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలి’’. – సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ప్రజలను పరాజితులను చేశారు ‘‘విశ్వగురు(నరేంద్ర మోదీ) దేశ ప్రజలను పరాజితులను చేశారు. ఆపరేషన్ సిందూర్ ఘోరంగా విఫలమైంది. శత్రువులను పూర్తిగా ఒడించకుండానే యుద్ధం విరమించడం ఏమిటి? విశ్వగురు ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో ఉగ్రవాద దాడులు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల నుంచి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు’’. –డీఎంకే ఎంపీ కనిమొళి పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. సాయం చేస్తాం ‘‘పాకిస్తాన్ సహా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతం కావాలని భారత్ కోరుకుంటోంది. పాక్ ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలి. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. మీకు(పాక్) చేతకాకపోతే చెప్పండి మేము రంగంలోకి దిగుతాం. పాక్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే)ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్వా«దీనం చేసుకోలేదో చెప్పాలి. పీఓకే ప్రజలు భారత పరిపాలనా వ్యవస్థలో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు’’. – రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్సమగ్ర నివేదిక విడుదల చేయాలి ‘‘పహల్గాం ఉగ్రవాద దాడికి భద్రతాపరమైన లోపాలే కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యత వహించాలి, పదవికి రాజీనామా చేయాలి. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేశానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ నోరుమెదపడం లేదు. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం అంగీకరించిందా? హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కా>ర్యక్రమాలతో మనకు ఒరిగిందేమీ లేదు. వాటితో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు ఏమాత్రం లాభం లేదు. ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీకి గొప్ప స్నేహ సంబంధాలున్నప్పటికీ పాక్‌తో యుద్ధం సమయంలో ఇండియాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పాక్ దురాగతాలను కనీసం అమెరికా కూడా బహిరంగంగా ఖండించలేదు. పాక్ ఓడిపోయే దశలో ఉన్నప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు. అమెరికా జోక్యం నిజమేనా? దీనిపై ప్రభుత్వం కచి్చతంగా సమాధానం చెప్పాలి? కార్గిల్ యుద్ధంపై అప్పటి ప్రభుత్వం సమగ్ర నివేదిక విడుదల చేసింది. అదే తరహాలో పహల్గాం దాడిపై మోదీ సర్కార్ నివేదిక ఇవ్వాలి’’. – రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మోదీ నరాల్లో రాజకీయాల ప్రవాహం ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నరాల్లో సిందూరం ప్రవహించడం లేదు. కేవలం రాజకీయాలే ప్రవహిస్తున్నాయి. నిజంగా సిందూరమే ప్రవహిస్తే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగేదే కాదు. మన ప్రజలను బలి తీసుకుంటున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం ఏమిటి? ఇదేనా మన విదేశాంగ విధానం?’’ – రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ -
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి56 ఇంచ్‌ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్‌తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్‌తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్‌పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్‌ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్‌కు అప్పగించారు. -
మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది? -
‘అంతా నా ఇష్టం’.. రాహుల్‌తో శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోక్‌సభలో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ తీసుకున్న లైన్‌కు అనుగుణంగా మాట్లాడలేనని.. తాను మొదటి నుంచి ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందనే మాటకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీకి శశిథరూర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసింది. ఎంపీ శశి థరూర్‌ను సైతం పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.అయితే, శశి థరూర్ మాత్రం ఒప్పుకోలేదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే తన అభిప్రాయాన్ని మార్చలేనని శశిథరూర్ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వంపై విమర్శలు చేయమని కోరినప్పుడు.. ఆయన మౌనం (మౌనవ్రత్)వహించారు. ఈ క్రమంలో పార్లమెంటులోకి వచ్చే సమయంలో ఆపరేషన్ సిందూర్‌పై మీడియా ప్రశ్నలకు శశిథరూర్ మౌనవ్రత్, మౌనవ్రత్ అని అంటూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ శశిథరూర్.. పార్టీ కార్యాలయంలో రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ వద్ద పార్టీ తీసుకున్న నిర్ణయంపై శశిథరూర్ విభేదించినట్లు సమాచారం. కాబట్టే పార్టీ పెద్దలు లోక్ సభలో శశిథరూర్‌కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.తాజా పరిణామంతో శశి థరూర్ తన స్వతంత్ర అభిప్రాయాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ హస్తిన పెద్దలు గుసగుసలాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. "Maunvrat, maunvrat..."😂😂😂.@ShashiTharoor destroys CONgress without saying anything. 🔥 pic.twitter.com/qi1wbLTgWi— BhikuMhatre (@MumbaichaDon) July 28, 2025 -
జగన్ ముందే చెప్పాడు..! ఇప్పుడు దేశమంతటా వైరల్
-
KSR Comment: జగన్ ముందే చెప్పాడు..! ఇప్పుడు దేశమంతటా వైరల్
-
జగన్ ముందే చెప్పాడు!
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్‌పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది. 'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్‌లో అన్నారు. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. కాగా మూడు టర్మ్‌లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్‌పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్‌లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈసీ పక్షపాత అంపైరింగ్: రాహుల్
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్‌గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్‌కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్‌మ్యాప్‌పై ఈ కార్యక్రమంలో చర్చించారు. -
బీజేపీ నేతలు ఇంగ్లీష్ భాషను వ్యతిరేకిస్తున్నారు: రాహుల్
-
అది నా తప్పే.. ఇప్పుడు సరిదిద్దుతున్నాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పిదమేనని అన్నారాయన. శుక్రవారం ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను... ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఓ తప్పు చేశానని అర్థమవుతోంది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ(ఓబీసీలనుద్దేశించి..) సమస్యలు లోతుగా అర్థం చేసుకోలేకపోయాను.... మీ చరిత్రను, మీ సమస్యలను కొంచెం అయినా ముందే తెలుసుకుని ఉండినట్లైతే, అప్పటికే కుల గణాంకాలు (Caste Census) నిర్వహించేవాడిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయాం. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ముమ్మాటికీ నా తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారాయన. ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా?. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా?. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించేవారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అని ప్రశ్నించారాయన. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్న రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని ఉద్ఘాటించారు.#WATCH | Delhi: At Congress' 'Bhagidari Nyay Sammelan', Lok Sabha LoP Rahul Gandhi says, "I have been in politics since 2004...When I look back, I can see that I made a mistake. I didn't protect the OBCs like I should have...It was because I could not understand your issues in… pic.twitter.com/uink9xyKFJ— ANI (@ANI) July 25, 2025మోదీపై రాహుల్ విసుర్లుఇదే వేదికగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు గుప్పించారు. ‘‘మోదీకి అంత సీన్ లేదు. ఆయనదంతా బిల్డప్పు మాత్రమే. అంత శక్తేం ఆయనకు లేదు. అవసరంగా అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీతో రెండు,మూడుసార్లు భేటీ అయ్యాక.. ఆయనేం పెద్ద సమస్య కాదని అర్ధమైందని రాహుల్ అన్నారు. దేశంలో దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు 90 శాతం ఉన్నారు. కానీ,బడ్జెట్ హల్వా తయారీలో ఈ వర్గాలకు చెందిన ఎవరికీ ప్రాధాన్యం ఉండదు. ఆ హల్వా తయారీకి ఈ వర్గాలే కారణం. కానీ, తినడానికి మాత్రం వీళ్లు అర్హులు కారా?’’ అని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. -
కేంద్రానిదే బాధ్యత: రాహుల్‌గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్‌రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్‌రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్‌రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్‌గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్‌రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్‌కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్‌రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలపై మౌనమెందుకు?
న్యూఢిల్లీ: భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఎందుకు నోరు విప్పడం లేదని లోక్‌సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.‘‘కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ ఇప్పటికో 25 సార్లు చెప్పారు. అసలు మనదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. అయినా.. ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు’’అని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పట్ల పరస్పర వైరుధ్య వ్యాఖ్యలు చేయడాన్ని రాహుల్ ఎత్తి చూపారు. ‘ఒకవైపు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది అంటున్నారు, మరోవైపు, విజయం సాధించామంటున్నారు. అది కొనసాగుతోందా? లేదా ముగిసిందా? మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని ట్రంప్ చెబుతున్నారు. కాబట్టి ‘కుచ్ తో దాల్ మే కాలా హై నా’(ఏదో తేడాగా ఉంది)’అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాక్‌ల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే నిరోధించానని పునరుద్ఘాటించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను ఒంటరి చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ వాదన కారణంగానే ప్రధాని మోదీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం.. బీహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా సవరణను కూడా రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రక్రియను బీజేపీ ఎన్నికల మోసంగా ఆయన అభివరి్ణంచారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని గుర్తు చేశారు. ‘బిహార్‌లో 52 లక్షల మంది మాత్రమే కాదు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసం చేశారు. ఓటర్ల జాబితాను చూపించమని ఈసీని అడిగితే నిరాకరించింది. వీడియోగ్రఫీ గురించి అడిగితే నియమాలను మార్చేసింది. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలో భారీ మోసాన్ని బయటపెట్టి.. ఎన్నికల కమిషన్ ముందుంచాం. తమ ఆటలు ఇక చెల్లవని తెలిసి ఓటర్లను తొలగించారు’అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సమరి్థంచారు. కీలకమైన విషయాలపై చర్చించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనతో రజతోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రధానమంత్రి పూర్తిగా మౌనంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లడానికి, స్వదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం వెతుక్కుంటున్నారు’అని ఆయన ఎక్స్‌లో ఎద్దేవా చేశారు.


