breaking news
Pakistan
-
పాక్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్‌కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.వజీర్ తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడారు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్‌ల్లో వినూ మన్కడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. వజీర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.వజీర్ పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్‌మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్‌గా ఉన్నారు. -
జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై యుద్ధం
-
ట్రంప్ లూప్ ఆగట్లే.. నెక్స్ట్ ఆపేది ఆ యుద్ధమేనంట!
ప్రపంచ శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ ఫలితం తనను కుంగదీయబోదని, శాంతిని నెలకొల్పాలన్న తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపబోదని అంటున్నారాయన. తాజాగా ఆయన మరో యుద్ధంపై కన్నేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, ఈజిప్ట్‌లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. , యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై(Pak Afghan Clashes) ఉందని అన్నారు.ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు. అయితే తన శాంతి ప్రయత్నాలు అవార్డులను తేలేకపోయినా(నోబెల్‌ను ఉద్దేశించి..) ప్రాణాలను నిలబెడుతోందని, అది తనకెంతో గౌరవాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారాయన.ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా పర్యటనకు బయల్దేరే ముందు కూడా ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు(Trump On India Pak Tensions). భారత్-పాక్ మధ్య యుద్ధం టారిఫ్‌ల బెదిరింపులతోనే ఆగిందని పునరుద్ఘాటించారు. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఓసారి ఆలోచించండి. కొన్ని యుద్ధాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది మరణించారు. నేను వాటిని ఒక్క రోజులోనే ముగించాను. అది గొప్ప విషయం’’ అని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. దౌత్యంతో ప్రయత్నిద్దామనుకుంటే మాట వింటారా?. అందుకే సుంకాలు విధిస్తా అని బెదిరించా. 24 గంటలు గడవకముందే దెబ్బకు దిగొచ్చారు. లేకుంటే యుద్ధం ఆగి ఉండేదా? అని మే నెలలో జరిగిన భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్.. ఈ కాల్పుల విమరణలో మూడో దేశం, వ్యక్తి.. ప్రేమయం లేదని, పాక్ కోరితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది. ఇదీ చదవండి: తాలిబన్ల దెబ్బ.. పాక్‌కు భారీ నష్టం -
శాంతియుత పరిష్కారం కావాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం. అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్‌లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు. -
ఉద్రిక్తంగా పాక్–అఫ్గాన్ పోరు
ఇస్లామాబాద్/పెషావర్: తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. 200 మందికిపైగా తాలిబాన్ ఫైటర్లను అంతంచేశామని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం ప్రకటించగా తాము 58 మంది పాక్ సైనికులను చంపేశామని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను సైతం దాడులను ధ్వంసంచేశామని అఫ్గాన్ సర్కార్ వెల్లడించింది. తమ దాడుల ధాటికి 30 మంది పాక్ సైనికులు రక్తమోడారని వెల్లడించింది. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ మాట్లాడారు. ‘‘ మా అఫ్గాన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌లో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ముఖ్యులను మాకు అప్పగించాలి. ఐఎస్గ్రూప్ ఒక్క అఫ్గానిస్తాన్‌కే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పు’’ అని ముజాహిద్ అన్నారు. సరిహద్దు వెంట కాల్పుల మోత‘ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ పరిధిలోని బరా మ్చాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, డిర్, చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్ట్ లపై మా బలగాలు దాడులుచేశాయి. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ పోస్ట్‌లపై తెగబడి పలువురు పాక్ సైనికులను చంపేశాం’ అని ముజాహిద్ వివరించారు. -
మాటల్లో తెంపరితనం వద్దు!
‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్‌గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తే, భారత్ ఆపరేషన్ సిందూర్–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్ ఎ.పి.సింగ్ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్ పర్యటనలో హెచ్చరించారు.తానేం తక్కువ తినలేదు!వీటిపై పాక్ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్‌ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం. అంత తేలికేం కాలేదు!పాక్ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్‌తో భారత్ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది. మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.ఇక కార్గిల్ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్‌కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్‌లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్ సేనలు తోక ముడవవలసి వచ్చింది. 2002లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరాక్రమ్’ భారత్–పాక్ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్‌పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆపరేషన్ పరాక్రమ్’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్ ముషారఫ్ బాగా వివరించారు. ‘‘వారు (భారత్) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.ఇప్పుడేం మారిందని?పాక్‌పై భారత్ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్‌ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. మనోజ్ జోషీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. రాణించిన పాక్ బ్యాటర్లు
రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) తొలి టెస్ట్ మొదలైంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs South Africa) పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పాక్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో పాక్ మంచి స్కోర్ సాధించింది. ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్‌లో ఉన్నారు.పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
58 మంది పాక్ సైనికుల మృతి
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గంటగంటకూ ముదురుతున్నాయి. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. కాబూల్‌పై పాక్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తాము కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతుండగా.. అకారణంగా ఆఫ్ఘన్ తమపై కాల్పులకు దిగిందని పాక్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రెండు సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయితే.. తమ సేనలు జరిపిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. 30 మంది సైనికులు గాయపడ్డట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వైపు తొమ్మిది మంది సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డట్లు ఆదివారం మధ్యాహ్నం కాబూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఈ గణాంకాలను నిర్ధారించలేదు. తమవైపు ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు మృతిచెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ప్రకటించింది. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముక్తకంఠంతో ఆఫ్ఘన్ చర్యలను ఖండించినట్లు పాక్ మీడియా తెలిపింది. తాలిబన్ సర్కారుకు గట్టి బదులిచ్చేందుకు పాక్ సైన్యం సిద్ధమైనట్లు వెల్లడించింది.టీటీపీ లక్ష్యంగా డ్రోన్ దాడులుతెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వలీ మహ్సూద్ టార్గెట్‌గా పాక్ సైన్యం దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు టీటీపీ సీనియర్ నేతలు మరణించగా.. వారిలో మహ్సూద్ ఉన్నారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రోన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం పాక్ సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది. హెల్మాండ్ ప్రావిన్స్ లో రెండు పాకిస్థాన్ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కునార్, నంగర్హార్, హెల్మాండ్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.రంగంలోకి ఇరాన్పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలను నిలువరించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చింది. ఘర్షణలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియా, ఖతార్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది. కేవలం రష్యా మాత్రమే తాలిబన్ల అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించింది. తాజాగా భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన తర్వాత.. ఉపఖండంతో తాలిబన్ల మైత్రికి అడుగులు పడ్డాయి.👉ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ లో టెన్షన్
-
పాక్, ఆప్ఘన్ బోర్డర్లో టెన్షన్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్
కాబూల్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్, పాక్ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది.పాక్, ఆప్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ప్రకటించింది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీ జాని, సలేహాన్ ప్రాంతాలలో, అలాగే పక్తియాలోని ఆర్యుబ్ జాజీ జిల్లా అంతటా తీవ్ర పోరాటం జరిగినట్లు నివేదించింది.#𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆:🚨Afghanistan has initiated an offensive against Pakistan from seven distinct border points, according to the Afghan Ministry of Defence; Huge battles underway. Pakistani jets have gone airborne in the east of the country.#Afghanistan #Pakistan pic.twitter.com/n5gwjaicYs— Jahangir (@jahangir_sid) October 11, 2025అయితే, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపినట్టు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి ఈ ఆపరేషన్‌ను అభివర్ణించారు. శనివారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని ఆయన అన్నారు. మరోసారి పాక్.. ఇలా గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్ గగనతలాన్ని తాము ఆక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.Afghan Taliban After capture pakistani post...🇦🇫🇵🇰The Afghan Taliban announce that they have launched attacks against Pakistan at 7 points along the border.Source: Afghan Defense MinistryFuck Pakistan 🖕🖕 pic.twitter.com/9BatiJtBFU— Sumit (@SumitHansd) October 11, 2025ఇక, పాకిస్తాన్ భద్రతా అధికారులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ దాడులను తమ దళాలు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా వారి విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. -
పాకిస్తాన్ x దక్షిణాఫ్రికా
లాహోర్: ప్రధాన ప్లేయర్లు లేకుండానే దక్షిణాఫ్రికా జట్టు... పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సఫారీ జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహిస్తున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సర్కిల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాకు ఇదే తొలి మ్యాచ్ కాగా... ఈ సారి కూడా మెరుగైన ఆరంభం దక్కించుకోవాలని చూస్తోంది. ఇరు జట్లు పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరు కాగా... ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. గత డబ్ల్యూటీసీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలవగా... పాకిస్తాన్ జట్టు ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. మార్క్రమ్ సారథ్యంలోని సఫారీ జట్టు... వరుసగా 11 విజయాలు సాధించి ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండగా... గత 12 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ మూడింట మాత్రమే నెగ్గింది. మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, బ్రేవిస్, వెరినె, యాన్సన్తో సఫారీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా... పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్, బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్‌లను నమ్ముకుంది. పరిమిత ఓవర్లలో జట్టుకు దాదాపు దూరమైన బాబర్ ఆజమ్, రిజ్వాన్ సుదీర్ఘ ఫార్మాట్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది కీలకం. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మొదట టెస్టులు, ఆతర్వాత టి20లు, అనంతరం వన్డేలు ఆడనుంది. -
Rajasthan: పాక్‌కు రహస్యాల చేరవేత.. యువకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అల్వార్‌లోని గోవింద్గఢ్ నివాసి మంగత్ సింగ్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం మంగత్ సింగ్‌ను అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు.సీఐడీ అధికారులు అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సారించినప్పుడు మంగత్ సింగ్ కార్యకలాపాలను గుర్తించారు. సింగ్ కొంతకాలంగా అనుమానాస్పద చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు గమనించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్ పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఇషా శర్మ అనే మారుపేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్ సింగ్‌ను హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూఢచర్య కార్యకలాపాలలో సహకరించినందుకు ప్రతిగా ఆ హ్యాండ్లర్.. సింగ్‌కు ఆర్థికసాయం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సింగ్ భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.సింగ్ గత రెండేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, గూఢచర్య కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. మంగత్ సింగ్ అరెస్టు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాంతంలో నిఘా సారించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గూఢచర్యాన్ని అరికట్టేందుకు, భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నవారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అక్టోబర్ 10న జైసల్మేర్‌లో అనుమానిత గూఢచారి మహేంద్ర ప్రసాద్(32)ను అరెస్టు చేశారు. అతను డీఆర్డీఓ గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా పనిచేస్తూ, సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్‌కు లీక్ చేశాడని తేలింది. 32 ఏళ్ల ప్రసాద్ పాకిస్తాన్ నిఘా నిర్వాహకునితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిధంగా జైసల్మేర్‌కు చెందిన హనీఫ్ ఖాన్‌ను ఐఎస్ఐ కార్యకర్తలకు రహస్య సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేశారు. -
హిందూ బాలికపై అత్యాచారం, పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువులు సహా మైనారిటీ వర్గాలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ 15 ఏళ్ల హిందూ బాలికను తనను ఓ వృద్ధుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని కోర్టుకు పేర్కొంది. తన కుటుంబాన్ని చేరుకునే అవకాశం కల్పించాలని వేడుకుంది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై మిర్పూర్ఖాస్ జిల్లాలోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. తుది తీర్పు వెలువడే వరకు ఆమెను సురక్షితంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. గత నెలలోతన కుమార్తెను తమ నివాసానికి సమీపంలో ఉండగా షార్ వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి నిర్మల్ మెఘ్వార్ పేర్కొంది. ‘అప్పటి నుంచి ఆ వర్గం వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు నా కుమార్తె బర్త్ సర్టిఫికెట్ అందివ్వకుండా అడ్డుకున్నారు. మొదటి వాయిదా విచారణకు వచి్చన సమయంలో కోర్టు వద్దే మాపై దాడి చేశారు. నా కుమార్తె గురువారం ధైర్యంతో కోర్టులో వాంగ్మూలం ఇచి్చంది’అని ఆమె పేర్కొంది. దీంతో, పెళ్లి జరిపించిన కాజీని, ఇద్దరు సాకు‡్ష్యలను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందువులు, క్రైస్తవులు సహా మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం వెయ్యి మంది బాలికలకు ఇలా బలవంతంగా పెళ్లిళ్లవుతున్నాయని అంచనా. -
అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి మవ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీ.. పాకిస్తాన్‌కు సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ముత్తాకీ. తాము అధికారం చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఒక ఉగ్రవాది పురుగు కూడా చొరబడలేదన్నారు ముత్తాకీ. తమ దేశం తరహాలోనే ప్రతీ దేశం కూడా ఉగ్రవాదంపై పోరును సాగించాలనే సూచించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు భారత్ గడ్డపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా అఫ్గాన్‌లో ఉగ్రవాదం అనే ఛాయలే లేవని, అందుకు తాము అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. అంతకుముంద లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించినా తాము అధికారం చేపట్టిన తర్వాత ఆ పప్పులు ఉడకలేదన్నారు. ఏ దేశంలోనైనా శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు సూచించారు. ఇది పాకిస్తాన్ ఆచరిస్త వారికి మంచిదంటూ తన సందేశంలో పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్‌కు రావడం ఇదే తొలిసారి. నిన్న(అక్టోబర్9వ తేదీ) భారత్‌లో అడుగుపెట్టారు ముత్తాకీ. తన భారత పర్యటనలో జై శంకర్, అజిత్ ధోవల్‌తో సమావేశం కానున్నారు ముత్తాకీ. ఇది చదవండినోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
జైషే మహ్మద్ ‘మహిళా గ్రూప్’
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రకటించింది. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో.. జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ విభాగంలోకి ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విభాగానికి మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత మే నెల 7న ఆపరేషన సిందూర్‌లో భాగంగా పాక్‌లోని బహావల్పూర్లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయంపై భారత్ వైమానికదళం క్షిపణుల వర్షం కురిపించటంతో సాదియా భర్త యూసుఫ్ అజహర్‌తోపాటు మసూద్ కుటుంబసభ్యులు పలువురు మరణించారు. ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే సభ్యులు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను ఈ మహిళా విభాగంలోకి చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహావల్పూర్, కరాచి, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్సేహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతులను కూడా ఈ గ్రూపులో చేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్‌కు వ్యతిరేకంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే జమాత్ ఉల్ మోమినాత్ ప్రధాన లక్ష్యమని తెలిసింది. సోషల్‌మీడియా ద్వారా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని జమ్ముకశీ్మర్, ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రాంతాల్లో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాద సంస్థలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు ఈ మహిళా గ్రూప్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు మహిళలకు తమ సంస్థల్లో స్థానం కల్పించలేదు. జిహాద్ పేరుతో చేసే సాయుధ పోరాటాల్లో మహిళలకు స్థానం లేదని చెబుతూ వచ్చారు. కానీ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చావుదెబ్బ కొట్టడంతో జైషే మహ్మద్ తన విధానాన్ని మార్చుకుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజహర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ ఇద్దరూ ఈ మహిళా విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. బహావల్పూర్లో భారత్ ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునరి్నరి్మంచేందుకు ఆర్థికసాయం చేయనున్నట్లు ఇటీవలే పాక్ ప్రభుత్వం తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా పేరుపడ్డ ఐఎస్ఐఎస్, బోకోహరాం, హమాస్ల్లో మహిళా విభాగాలు ఉన్నాయి. ఈ మహిళలతో ఆయా సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది. -
కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం
నవీ ముంబై: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చిందని మండిపడ్డారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఈ పార్టీ నిర్వాకాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైలు నెట్‌వర్క్‌లో ఆక్వా లైన్‌తోపాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా, గొప్ప మెట్రోనగరంగా ప్రఖ్యాతి గాంచిన ముంబైని ఉగ్రవాదులు ఎప్పటినుంచో టార్గెట్ చేశారని చెప్పారు. 2008లో భీకర దాడులు జరిగాయని అన్నారు. అప్పట్లో పాక్ ఉగ్రవాదుల భరతంపట్టాలని ప్రజలంతా కోరుకున్నారని, మన సైనిక దళాలు సైతం అందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. కానీ, మరో దేశం అడ్డుకోవడంతో సైనిక చర్య ఆగినట్లు కేంద్ర హోంమంత్రే చెప్పారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయొద్దంటూ అప్పట్లో అమెరికా కోరుకుందని చిదంబరం పేర్కొన్నారు. పౌరుల భద్రతే ముఖ్యం ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను బలోపేతం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భద్రతపై రాజీపడిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో బదులిస్తున్నామని, ముష్కరుల భూభాగంలోకి చొరబడి మరీ బుద్ధి చెప్తున్నామని వివరించారు. దేశంతోపాటు పౌరుల భద్రత కంటే తమకు ఇంకేదీ ముఖ్యం కాదన్నారు. వికసిత్ భారత్‌కు ప్రతీక పద్మం ఆకారంలో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వికసిత్ భారత్‌కు ఒక ప్రతీక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రూ.19,650 కోట్లతో 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్పోర్ట్ మొదటి దశను నిర్మించారు. దేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా ఇది రికార్డుకెక్కింది. డిసెంబర్లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయ ప్రారం¿ోత్సవంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబై మెట్రో లైన్–3 తుది దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశమంతటా అభివృద్ధి జాడలు వికసిత్ భారత్‌కు గతి(వేగం), ప్రగతి(అభివృద్ధి) అత్యంత కీలకమని ప్రధాఉద్ఘాటించారు. గత 11 ఏళ్లుగా మన దేశం వికసిత్ని భారత్ దిశగా ప్రయాణం సాగిస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టామని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. జాతీయ రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించామని, నగరాలను అనుసంధానించామని వివరించారు. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ‘ఉడాన్’ పథకంతో గత పదేళ్లలో లక్షలాది మంది తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని, కలలు నెరవేర్చుకున్నారని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ మనదేనని స్పష్టం చేశారు. మరికొన్నేళ్లలో మనదేశం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్ఓ) హబ్‌గా మారబోతోందని తేల్చిచెప్పారు. ముంబైలో చారిత్రక భవనాలు దెబ్బతినకుండా 33.5 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో మార్గం నిర్మించిన ఇంజనీర్లు, కార్మికులను ప్రధాని అభినందించారు. -
భారత్‌తో యుద్ధం తప్పదు!
ఇస్లామాబాద్: భారత్‌తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. మంగళవారం సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయి. పరిస్థితిని ఉద్రిక్తం చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదం ఉన్నమాట నిజం. నేను దానిని తోసిపుచ్చలేను. ఒకవేళ యుద్ధమే వస్తే.. దేవుడి దయవల్ల మనం గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. గత ఆరు నెలల క్రితంకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎక్కువమంది మద్దతుదారులు, మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది’అని పేర్కొన్నారు. భారత్ ఒకేదేశం కాదు మధ్యయుగంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఒకేదేశంగా లేదని ఖవాజా చెప్పుకొచ్చారు. కానీ, అల్లా దయతో ఏర్పడిన పాకిస్తాన్ ఒకే ఐక్య రాజ్యంగా ఉంటూ అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలి సైనిక ఘర్షణ సమయంలో ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను మానుకోవాలని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్ వాయుసేన అధిపతి కూడా గత శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఇచ్చిన ఎఫ్–16 సహా పాకిస్తాన్‌కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపారు. అదేరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ తన పౌరులను రక్షించుకునేందుకు ఏ దేశ సరిహద్దునైనా దాటి వెళ్లగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా యుద్ధం వస్తుందని ఊహించినట్టు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అండతోనే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను బెదిరించటంవల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పదేపదే ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు లంచ్‌కు కూడా పిలిచాడు. ఆ తర్వాత కూడా పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. దీంతో మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగితే ట్రంప్ తమకు సాయం చేస్తారని ఖవాజా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ అరేబియాతో పాక్ సైన్య సహకార ఒప్పందం చేసుకుంది. అందువల్లే యుద్ధం జరిగితే మంచి ఫలితాలు సాధిస్తామని ఖవాజా ప్రగల్భాలు పలికారని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్‌ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్‌కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్‌గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్‌కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్‌ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్‌లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్‌కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్‌లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్‌చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్‌పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్‌చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్‌సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్‌కు (1995లో), కార్గిల్‌కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Pakistan: టీటీపీ ఉగ్రవాదులతో ఘర్షణ.. 11 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి. -
పాక్ సైన్యమే లక్ష్యంగా బాంబు దాడి
-
పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్(Asim Khwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్India vs Pakistan) మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.పాక్ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా పాకిస్తాన్‌కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదు. మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం విషయానికి పాకిస్తాన్ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం. భారత్ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చూపిస్తుంది. ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది. ముందు నుంచి పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ, భారత్‌తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అంటూ బీరాలు పలికారు. దీంతో, వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? అని సోషల్ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Pakistan Defence Minister Khwaja Asif speaks of the possibility of another Indo-Pak war-“History shows that India was never truly united, except briefly under Aurangzeb. Pakistan was created in the name of Allah. At home, we argue and compete, but in a fight with India we come… pic.twitter.com/bTrDxqhQel— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 8, 2025ఇక, అంతకుముందు కూడా భారత్‌పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని కామెంట్స్ చేశారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్‌కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi)హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. -
ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్
అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది.ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ బ్యాటింగ్ యువ కెరటం లూసీ లైల్స్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్‌గా కనిపించారు. లూసీతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బ్రూక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్ 18 నుంచి ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.అబ్రార్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్ స్పిన్నర్ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహిసిన్ నఖ్వీ సహా పలువురు పాక్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్-2025లో నఖ్వీకి, పాక్ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్ రిసెప్షన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ పాక్‌ను ఫైనల్ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. చదవండి: స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! -
సొంత పౌరులనే చంపుతున్న పాక్
యునైటెడ్ నేషన్స్: పాకిస్తాన్ సొంత పౌరులపైనే బాంబులు వేసి చంపుతోందని, ఆ దేశంలో మారణహోమాలు, మహిళలపై సామూహిక లైంగికదాడులు నిత్యకృత్యమని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఈ చర్చలో పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంతో ఆయన దాయాది దేశానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ నుంచి కశ్మీరీ మహిళలను తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు.‘సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్న ఒక దేశం, ఒక క్రమపద్ధతిలో మారణహోమానికి పాల్పడుతూ, లక్షలమంది మహిళలపై లైంగికదాడులు చేయించిన దేశం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఏటా పాకిస్తాన్ దుష్ట చర్యలకు మేం బాధితులం అవుతున్నాం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో.. అయినా ప్రపంచం పాకిస్తాన్ దృష్టకోణం నుంచే చూస్తోంది’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971 మార్చి 25న తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరుతో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడిందని, 4 లక్షల మంది మహిళలపై పాక్ సైన్యం అత్యాచారాలకు పాల్పడిందని గుర్తుచేశారు.మహిళల భద్రత విషయంలో భారత్‌ను ఎవరూ వేలెత్తి చూపలేరని స్పష్టంచేశారు. మహిళల భద్రత, శాంతి సాధన విషయంలో ప్రపంచంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమతి శాంతి పరిరక్షణ మిషన్లలో భారత్ తరఫున పాల్గొన్న మహిళా అధికారులనే ఈ అంశంలో తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. 1960వ దశకంతో కల్లోల కాంగోలో ఐరాస పీస్ కీపింగ్ మిషన్‌లో భారత్ మహిళా మెడికల్ అధికారుల దళాన్ని పంపిందని గుర్తుచేశారు. -
భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు పదే పదే వద్దు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో ఆర్థిక అవసరాల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు పెట్టే సంస్కృతిని ఇప్పటికైనా వీడాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరగగా... మూడింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయానంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచే ఇరు జట్ల కెపె్టన్లు, ఆటగాళ్ల మధ్య ‘షేక్ హ్యాండ్’ కూడా జరగలేదు. తొలి మ్యాచ్ అనంతరం భారత జట్టు చేయి కలపలేదనే అంశాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాల ను బలిగొంటున్న వారికి అండగా నిలుస్తున్నంత కాలం... తమ తీరు మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తేల్చిచెప్పింది. ఈ పూర్తి విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడు... విన్నర్స్ ట్రోఫీ తానే అందించాలని మంకుపట్టు పట్టాడు. దీంతో టీమిండియా ట్రోఫీ అందుకోకుండానే... స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్... భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు... వాటిని ఐసీసీ వినియోగించుకుంటున్న తీరును ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో వివరించాడు. వారానికో మ్యాచా? ఇలాంటి చేదు అనుభవాలకంటే... ఇరు దేశాల మధ్య క్రికెట్‌ను పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించాడు. ‘మూడు వారాల పాటు సాగిన ఆసియా కప్‌లో... ప్రతి ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కేవలం ఇదొక్కటే కాదు... ఆ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయినప్పటి నుంచి గమనిస్తే... అన్నీ ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలోనే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేస్తున్నారు. 2013 నుంచి చూసుకుంటే 3 వన్డే ప్రపంచకప్‌లు, 5 టి20 ప్రపంచకప్‌లు, 3 చాంపియన్స్ ట్రోఫీలు జరగగా... వాటన్నింటిలో గ్రూప్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ పద్ధతైనా... లేక గ్రూప్‌ల విధానమైనా... ఆరంభ దశలోనే ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ పరిపాటిగా మారింది’ అని అథర్టన్ రాసుకొచ్చాడు. 2008 ముంబై దాడుల సమయం నుంచే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా... ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ ఘటనలో 26 మంది అమాయకులు మృతిచెందగా... దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి తుదముట్టించింది. ఆర్థిక అంశాలే ముఖ్యమా! ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడింది. ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉండటానికి ఈ మ్యాచ్ ప్రధాన కారణం. ద్వైపాక్షిక సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో... ఐసీసీ ఈవెంట్ల ప్రాముఖ్యత పెరిగింది. దీంట్లో తరచూ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. దీన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దౌత్యానికి ఆట దోహదం చేస్తే... ఇప్పుడదే ఉద్రిక్తతలు, ప్రచారానికి ప్రతినిధిగా మారింది. కేవలం ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆ రెండు జట్ల మధ్య పదే పదే మ్యాచ్‌లు నిర్వహించడం ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది’ అని అథర్టన్ పేర్కొన్నాడు. విస్తృత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ సారథి సూచించాడు. కావాలనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండే విధంగా చూసుకోవడానికి బదులు... ‘డ్రా’ పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని సైతం అథర్టన్ లేవనెత్తాడు. పాకిస్తాన్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో... భారత ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించగా... ఆతిథ్య హోదా ఉన్న పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడేందుకు పదేపదే దుబాయ్‌కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోతుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఐసీసీ టోర్నీల్లో పదే పదే ఇలాంటి ఏర్పాట్లు చేయడం తగదని అథర్టన్ సూచించాడు. -
Pakistan: జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు.. పలువురు సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. సింధ్-బలూచిస్థాన్ సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి.. పట్టాలను పేల్చివేసింది. ఆ సమయంలో క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.బాధ్యత వహించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీపాక్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్ల బృందమైన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాద సమయంలో పాక్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నారని సమాచారం. పేలుడు దాటికి పలువురు సైనికులు మృతిచెందినట్లు, చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇచ్చేంత వరకూ ఇలాంటి దాడులను కొనసాగిస్తామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. #BREAKING: Pakistan’s Jaffar Express train attacked yet again by Baloch rebels. Several people injured in an explosion on railway track near Sultankot (Sindh) when Jaffar Express was on way from Peshawar (KPK) to Quetta (Balochistan). Rescue ops underway. Five bogies derailed. pic.twitter.com/piJw0IiD25— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 7, 2025కొనసాగుతున్న సహాయక చర్యలుఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనలో ఎందరు ప్రాణాలు కోల్పోయారన్న దానిపై వివరాలు ఇంకా వెల్లడికాలేదు.తరచూ ఇదే ఎక్స్‌ప్రెస్‌పై దాడిజాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి. గత మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ సైనికులను హతమార్చారు. ఆ తరువాత పాక్ ఆర్మీ రంగంలోకి దిగి, బందీలను విడిపించింది. ఇదేవిధంగా జూన్‌లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని, బలోచ్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్ గ్రూప్ తరచూ దాడులకు పాల్పడుతుండటం గమనార్హం. -
పాక్‌తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్‌లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్ఎస్ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి. యూఎస్ఎస్ఎం ఒక ప్రకటనలో ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్ మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎస్ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్ఎస్ఎం, పాకిస్తాన్ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్‌పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్ ప్రభుత్వం వాషింగ్టన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు. -
కశ్మీర్ మహిళల ప్రస్తావన.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూయార్క్: దాయాది పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృష్టిస్తూ ప్రపంచాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశాల్లో పాక్ అధికారిణి సౌమా సలీమ్ మాట్లాడుతూ.. భారత్, కశ్మీర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరించారు, ఆక్రమణలో ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాక్ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను హరీష్ తీవ్రంగా ఖండించారు.అనంతరం, హరీష్ మాట్లాడుతూ.. కశ్మీర్ మహిళల గురించి పాకిస్తాన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది. తన సొంత ప్రజలపై బాంబులు వేసుకునే దేశం పాకిస్తాన్. ప్రతిసారి భారత్‌పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రత అజెండాల్లో మా మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ, సొంత ప్రజలపై బాంబులు వేసి పాక్ మారణహోమానికి పాల్పడుతుందన్నారు. అలాంటి దేశం ప్రపంచదృష్టిని మరల్చేందుకు మాపై నిందలు మోపుతుందన్నారు. పాక్ తప్పుడు వాదనలను ప్రపంచం చూస్తోందన్నారు.భారత్, జమ్ముకశ్మీర్‌పై ప్రతీసారి పాకిస్తాన్ విమర్శలు చేస్తూనే ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. భారత్‌పై విషం చిమ్మడం పాకిస్తాన్‌కు అలవాటే. 1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ నిర్వహించిన దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో ఆ దేశ సొంత సైన్యం ద్వారా 4,00,000 మంది మహిళా పౌరులపై జాతి విధ్వంసం, సామూహిక అత్యాచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. తమ దేశ చర్యలకు మరిచిపోయి.. భారత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the UNSC Open Debate on Women Peace and Security marking 25 years of Resolution 1325. Quoting EAM @DrSJaishankar, he described women peacekeepers as “messengers of peace” and outlined India’s rich and pioneering… pic.twitter.com/SesXRFRJbU— India at UN, NY (@IndiaUNNewYork) October 6, 2025 -
వదిలేసిన ఆహారం విషమవుతోంది!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం. ప్రపంచ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!చైనా.. భారత్.. పాకిస్తాన్..ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్‌కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే. నిల్వ వసతులు లేమిఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్. సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.మనం ఏమి చేయగలం? అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..! -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్‌ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్‌ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్‌లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్‌ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్‌లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్‌ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్‌ను మ్యాచ్‌కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్‌కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
అష్టకష్టాలు పడుతున్న బాబర్ ఆజమ్
రెండు మూడేళ్ల కిందట ఓ వెలుగు వెలిగిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam), ప్రస్తుతం ఫామ్ కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. టీ20 జట్టును శాశ్వతంగా తప్పించబడిన అతను.. వన్డే, టెస్ట్ జట్లలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన బాబర్.. పూర్వవైభవం సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా ఆడని దేశవాలీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ 'క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ'లో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో అతను లాహోర్ వైట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడని బాబర్ క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీ ద్వారా టచ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. బాబర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆరంభంలో ఆడాడు. అప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ ఆడతున్నా పెద్దగా రాణించింది లేదు. సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ బాబర్‌కు డు ఆర్ డై అన్న పరిస్థితిని తెచ్చిపెట్టింది.ఈ సిరీస్‌లో రాణిస్తేనే అతని టెస్ట్ కెరీర్ నిలబడుతుంది. లేదంటే టీ20 ఫార్మాట్ తరహాలోనే టెస్ట్‌లకు కూడా దూరం కావాల్సి ఉంటుంది.క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో బాబర్‌తో పాటు మరింత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది. బాబర్‌తో పాటు ఆసియా కప్ జట్టు నుంచి తప్పించబడ్డ మొహమ్మద్ రిజ్వాన్, టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా, హసన్ అలీ, సాజిద్ ఖాన్ తదితరులు క్వైద్ ఎ ఆజమ్ ట్రోఫీలో ఆడేందుకు సిద్దంగా ఉన్నారు.ఈ టోర్నీలో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుండగా.. సౌతాఫ్రికాతో సిరీస్ అక్టోబర్ 12 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ అక్టోబర్ 12 నుంచి లాహోర్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో ప్రారంభమవుతాయి.పాక్ పర్యటనలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు కూడా ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్లను ఇదివరకే ప్రకటించగా.. పాక్ జట్లకు ప్రకటించాల్సి ఉంది.సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మహ్మద్ రిజ్వాన్ (wk), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (wk), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిదిపాకిస్తాన్తో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తాస్వామి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో జన్సెన్, ప్రెనెలన్ సుబ్రాయన్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, సైమన్ హార్మర్, కగిసో రబాడచదవండి: భారత యువ ప్లేయర్ల మధ్య ఘర్షణ.. కొట్టుకున్నంత పని చేశారు..! -
భారత్ సమాధి అవుతుంది.. రెచ్చిపోయిన పాక్ మంత్రి
ఇస్లామాబాద్: భారత్‌పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా(Asim Khwaja) నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని ఓవర్‌గా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) రెండు రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని, భారత్‌ను రెచ్చగొట్టవద్దని ఆయన తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనాన్ని ఆపరేషన్ సిందూర్ 2.0లో చూపించబోమని స్పష్టంచేశారు.దీనిపై అసిమ్ ఖవాజా ఆదివారం సోషల్ మీడియాలో స్పందించారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్‌కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని అన్నారు. అయితే, 0–6 స్కోర్‌కు అర్థం ఏమిటన్నది అసిమ్ ఖవాజా వెల్లడించారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో సంబంధం -
పాక్ ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు
-
IND Vs PAK: పాక్‌పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు
పాక్ టాస్ నెగ్గిన తీరు... బౌలింగ్ జోరు... భారత శిబిరాన్ని కాస్త కలవరపెట్టింది. కానీ చివరకు నిర్ణీత ఓవర్ల తర్వాత భారత స్కోరు హర్మన్‌ప్రీత్ బృందం ఆందోళనను దూరం చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలోనే చిక్కుల్లో పడేసింది. బౌలర్లు ఏమాత్రం పట్టుసడలించకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించారు. పాకిస్తాన్‌పై తమ అజేయ రికార్డును పొడిగించారు. కొలంబో: సొంతగడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు ఇప్పుడు శ్రీలంకలో పాకిస్తాన్ పనిపట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తడబడిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం బౌలింగ్ బలగంతో పాక్‌ను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ కూడా పురుషుల ఈవెంట్లాగే ఏకపక్షంగా ముగిసింది. మొత్తమ్మీద వరుసగా నాలుగు ఆదివారాలు పాక్ జట్లకు, వారి అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిరీ్ణత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లలో డయానా బేగ్ 4, సాదియా, ఫాతిమా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత జట్టు నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 9న విశాఖపట్నంలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. నేడు ఇండోర్‌లో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. మెరుగ్గానే మొదలైనా... ప్రతీక (37 బంతుల్లో 31; 5 ఫోర్లు), స్మృతి మంధాన (23; 4 ఫోర్లు) ఓపెనింగ్ వికెట్‌కు 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ 19 పరుగుల వ్యవధిలో ఇద్దరు ని్రష్కమించారు. తర్వాత హర్లీన్, కెప్టెన్ హర్మన్ జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. కాసేపటికే కెపె్టన్ వికెట్‌ను పారేసుకుంది. జెమీమా (37 బంతుల్లో 32; 5 ఫోర్లు), హర్లీన్ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను నడిపించారు. కానీ జట్టు స్కోరు 151 వద్ద హర్లీన్, 159 వద్ద జెమీమా అవుట్‌కావడంతో భారత్ ఇబ్బందిపడింది. స్నేహ్ రాణా (20; 2 ఫోర్లు), ఆఖర్లో రిచా మెరుపులతో చివరకు గట్టిస్కోరే ప్రత్యర్థి ముందుంచింది. సిద్రా ఒంటరి పోరాటం లక్ష్యం ఏమంత కష్టమైంది కాకపోయినా... పాక్ మాత్రం ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకు పోయింది. తర్వాత ఏటికి ఎదురీదలేక, పూర్తి కోటా ఓవర్లనైనా ఆడలేక ఆలౌటైంది. భారత బౌలింగ్ దెబ్బకు ఓపెనర్లు మునీబా (2), సదాప్ షమా (6) సహా, మిడిలార్డర్లో అలియా (2), కెప్టెన్ ఫాతిమా సనా (2) సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు. సిద్రా అమిన్, నటాలియా (33; 4 ఫోర్లు)తో కలిసి ఒంటరి పోరాటం చేసింది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ రిఫరీ చేసిన పొరపాటుతో... దక్షిణాఫ్రికాకు చెందిన రిఫరీ శాండ్రె ఫ్రిజ్ గందరగోళంతో ‘టాస్’ నిర్ణయమే బోల్తా పడింది. పాక్ సారథి ఫాతిమా ‘బొరుసు’ చెప్పగా... హర్మన్ ఎగరేసిన నాణెం ‘బొమ్మ’గా తేలింది. మ్యాచ్ రిఫరీ మాత్రం పాక్ కెపె్టన్ టాస్ గెలిచినట్లు ప్రకటించింది. అంతా తెలిసినా హర్మన్ కూడా అభ్యంతరం చెప్పక పోవడమే ఇక్కడ కొసమెరుపు! ఇక మహిళా సారథులు సైతం కరచాలనం చేసుకోకుండానే సమరానికి సై అన్నారు.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (బి) సాదియా 31; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫాతిమా 23; హర్లీన్ (సి) నష్రా (బి) రమీన్ 46; హర్మన్‌ప్రీత్ (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 19; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) నష్రా 32; దీప్తి శర్మ (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 25; స్నేహ్ రాణా (సి) ఆలియా (బి) ఫాతిమా 20; రిచా ఘోష్ (నాటౌట్) 35; శ్రీచరణి (సి) నటాలియా (బి) సాదియా 1; క్రాంతి (సి) ఆలియా (బి) డయానా 8; రేణుక (సి) సిద్రా నవాజ్ (బి) డయానా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–48, 2–67, 3–106, 4–151, 5–159, 6–201, 7–203, 8–226, 9–247, 10–247. బౌలింగ్: సాదియా 10–0–47–2, డయానా బేగ్ 10–1–69–4, ఫాతిమా 10–2–38–2, రమీన్ 10–0–39–1, నష్రా 10–0–52–1. పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా అలీ (రనౌట్) 2; షమా (సి అండ్ బి) క్రాంతి 6; సిద్రా అమిన్ (సి) హర్మన్ (బి) స్నేహ్ రాణా 81; ఆలియా (సి) దీప్తి (బి) క్రాంతి 2; నటాలియా (సి) సబ్–రాధ (బి) క్రాంతి 33; ఫాతిమా (సి) స్మృతి (బి) దీప్తి 2; సిద్రా నవాజ్ (సి అండ్ బి) స్నేహ్ 14; రమీన్ (బి) దీప్తి 0; డయానా బేగ్ (రనౌట్) 9; నష్రా (నాటౌట్) 2; సాదియా (సి) స్మృతి (బి) దీప్తి 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (43 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–6, 2–20, 3–26, 4–95, 5–102, 6–143, 7–146, 8–150, 9–158, 10–159. బౌలింగ్: రేణుక 10–1–29–0, క్రాంతి 10–3–20–3, స్నేహ్ రాణా 8–0–38–2, శ్రీచరణి 6–1–26–0, దీప్తి శర్మ 9–0–45–3. -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు టాస్ గందరగోళం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భారత్, పాకిస్తాన్ (India VS Pakistan) మ్యాచ్ టాస్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. కొలొంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల పురుషుల ఆసియా కప్‌లో జరిగిన విధంగానే టాస్ అనంతరం భారత కెప్టెన్ పాక్ కెప్టెన్‌కు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ ఫలితం వెలువడగానే ఇరువురు కెప్టెన్లు చెరో దిక్కు అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున అమన్‌జోత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేణుకా సింగ్‌కి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ తరఫున ఒమైమా సోహాలీ స్థానంలో సదాఫ్ షమాస్ జట్టులోకి వచ్చింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సగం ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (23), ప్రతీక రావల్ (31), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. హర్లీన్ డియోల్ (31), జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్‌కు నిరాకరించారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును (PCB) ఎండగడుతూ, భారత్‌పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని కొందరు పాకిస్తానీలు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో డానిష్ ఇలా స్పందించాడు.ఇటీవలికాలంలో కొందరు పాకిస్తానీలు నన్ను ప్రశ్నిస్తున్నారు. భారత మూలాలున్నా, క్రికెటర్‌గా ఎదిగేందుకు పాకిస్తాన్ ఇన్ని అవకాశాలు ఇస్తే.. భారత్‌కు సానుకూలంగా ఎందుకు మాట్లాడతావని నిలదీస్తున్నారు. భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాని కామెంట్లు చేస్తున్నారు.నాపై సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ మాటల దాడిపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ముందుగా పాకిస్తాన్ ప్రజలకు నేను కృతజ్ఞుడిని. వారి నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. అయితే కొందరు మాత్రం నా పట్ల చాలా వ్యతిరేక భావంతో వ్యవహరించారు.ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీలోని కొందరు అధికారుల నుంచి నేను తీవ్ర వివక్షను ఎదుర్కొన్నాను. ఓ దశలో బలవంతంగా మతం మార్చించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నేను భారత పౌరసత్వం ఆశిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉన్నా, CAA లాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి.పౌరసత్వం కోసం నేను భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నానడం చాలా తప్పు. భారత్ నా పూర్వీకుల భూమి. అది నాకు దేవాలయం లాంటిది. పాకిస్తాన్ నా జన్మభూమే. కానీ భారత్ నా మాతృభూమి అంటూ తన ‘X’ ఖాతాలో రాసుకొచ్చాడు.కాగా, డానిష్ కనేరియా పాకిస్తాన్లో పుట్టి పెరిగనప్పటికీ.. అతని పూర్వీకుల మూలాలు భారత్‌లోని గుజరాత్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1980 డిసెంబర్ 16న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించిన డానిష్.. 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు తీసి పాక్ తరఫున గొప్ప స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కోవడంతో అతని కెరీర్ అర్దంతరంగా ముగిసింది. దీని కారణంగా అతను జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను కుటుంబంతో పాటు అమెరికాలో ఉంటున్నాడు. చదవండి: వన్డే కెప్టెన్‌గా ఎంపిక.. శుబ్‌మన్ గిల్ ‘బోల్డ్’ రియాక్షన్ -
'రుక్మిణీ వసంత్' తండ్రి వీరమరణం పొందారని తెలుసా?
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కూతురు అని కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్‌కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రదేశాల్లో ఆయన సేవలు అందించారు. అయితే, రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రుక్మిణీ జీవితంలో ఒక మలుపు. అందుకే ఆమె తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండేలా రుక్మిణీ వసంత్‌గా మార్చుకుంది.రుక్మిణీ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకుంటూ ఆయన వీరమరణం పొందారు. భారీ ఆయుధాలతో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ట్రక్ సాయంతో భారత్‌లోకి ప్రవేశించారు. దానిని గమనించిన వసంత్ టీమ్ వారిని అడ్డుకుంది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఎదుర్కొన్నారు. చొరబడిన ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చే వరకు ఆయన పోరాడారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా తూటాలు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చి అశోక చక్ర పతకంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రుక్మిణీ తండ్రి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో కఠణమైన శిక్షణ పొందారు. అందుకే 9 మరాఠా లైట్ త్రిదళంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. ఇలా ఆయన ఇండియన్ ఆర్మీలో చాలా కీలకంగా పనిచేశారు. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ "వీర్ రత్న ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించి యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన వంతుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు. -
ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో ఒప్పందం
ఇస్లామాబాద్: గత వారం రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చెలరేగుతున్న నిరసనోద్యమాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మొదటి మిలిటరీని పంపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించి విఫలమైన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. చివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ)తో ఒప్పందం చేసుకుంది.ఈ క్రమంలో 25 అంశాలతో కూడిన ఒప్పందం ప్రతిని పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 29 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో 10 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముజఫరాబాద్‌కు షహబాజ్ షరీఫ్ గత బుధవారం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపారు. వారు జేకేజేఏఏసీ నేతలతో రెండు రోజుల పాటు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం పాక్ ప్రభుత్వం పీవోకేలోని ముజఫరాబాద్, పూంచ్‌లలో అదనంగా ఇంటర్మీడియట్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటుచేస్తుంది. అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం 15 రోజుల్లోగా హెల్త్ కార్డు అమలుకు నిధులు మంజూరు చేయాలి. పీఓకేలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అందించాలి. పీఓకే అసెంబ్లీ సభ్యుల అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ చర్చించాలి. ఆస్తి బదిలీలపై పన్నును 3 నెలల్లోగా పంజాబ్ లేదా పంఖ్తుఖ్వాలతో సమానంగా తీసుకురావాలి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించి అమలుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటుచేస్తారు. -
అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు!
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. పాకిస్తాన్లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్‌కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్‌తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది. పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్‌ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్‌కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది. అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్‌లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్‌కు కీలకం. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) రాయని డైరీ
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్‌కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్‌లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్‌లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్‌లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్‌లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని! మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?కొద్దిసేపట్లో భారత్–పాక్‌ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!నిజంగానే భారత్–పాక్ ఫైనల్‌కి చేరుకుంటే, ఫైనల్లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్‌గా ఉంటాననుకుంటా!ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్‌గా ఉండి ఈ వరల్డ్ కప్‌లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని. 2022 వరల్డ్ కప్‌లో – న్యూజిలాండ్‌లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్‌లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్‌లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది. -
తగ్గే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన భారత్
-
‘జాక్’ 38 డిమాండ్లకు పాక్ అంగీకారం
Pakistan: జమ్ముకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ-జాక్)ప్రతిపాదించిన 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఆమోదించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల చోటుచేసుకున్న నిరసనకారుల మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన ప్రదర్శనకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే జమ్ముకశ్మీర్ శరణార్థుల కోసం రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయడంపై ఉన్న చట్టపరమైన సాధ్యాసాధ్యాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలియజేసింది.పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 10 మంది మరణించగా, 50 మందికి పైగా జనం గాయపడ్డారు.ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న‘జాక్’, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య రెండు రౌండ్ల ఉన్నత స్థాయి చర్చల దరిమిలా పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది. సెప్టెంబర్ 29న సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో హింస చెలరేగింది. కాగా పీఓకేలో కొనసాగుతున్న హింస విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు గతంలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మరోవైపు నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత ధోరణిని భారతదేశం తీవ్రంగా విమర్శించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించింది. -
13 పాక్ జెట్లు కూల్చేశాం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో ప్రత్యర్థి దేశం పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలిందని, భారీగా నష్టపోయిందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన 12 నుంచి 13 ఫైటర్ జెట్లు కూల్చివేశామని, ఇందులో అమెరికాలో తయారైన ఎఫ్–16 యుద్ధ విమానాలు, చైనాలో తయారైన జేఎఫ్–17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారత యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చివేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ ‘మనోహరమైన కథలు’ అంటూ కొట్టిపారేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అమర్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్లకుపైగా చొచ్చుకెళ్లి మరీ దాడి చేశామని, మన వైమానిక దళం ఇప్పటిదాకా సాధించిన వాటిలో ఇది ‘లాంగెస్ట్ కిల్’ అని పేర్కొన్నారు. దూరంగా ఉన్న శత్రువును దెబ్బకొట్టామని, ఇది ఈ సంవత్సరానికే ‘హైలైట్’ అని అభివరి్ణంచారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు వాటిల్లిన నష్టంపై భారత వైమానిక దళం అధినేత స్పష్టమైన వివరాలు బయటపెట్టడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలంలో కొన్ని, భూభాగంపై మరికొన్ని ఫైటర్జెట్లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. వీటిలో ఎఫ్–16లు, జేఎఫ్–17లతోపాటు ఒక నిఘా విమానం కూడా ఉందని వెల్లడించారు. పాక్ రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లపై అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు చేశామన్నారు. నాలుగు ప్రాంతాల్లో పాక్ రాడార్లు, రెండుచోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, మూడు హ్యాంగర్లు, రెండు రన్వేలు, ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ధ్యంసమయ్యాయని వివరించారు. మే 10వ తేదీన పాకిస్తాన్‌కు ఊహించని నష్టం జరిగిందన్నారు. దాంతో దిక్కుతోచని పాక్ సైన్యం కాల్పుల విరమణ కోసం భారత్‌ను వేడుకుందని పేర్కొన్నారు. కాల్పులు తక్షణమే ఆపాలంటూ మనల్ని అభ్యరి్థంచే స్థాయికి పాకిస్తాన్‌ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెషబాజ్ షరీఫ్ కొన్నిరోజుల క్రితం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలు కూల్చివేశామని చెప్పుకొచ్చారు. కానీ, దానిపై ఎలాంటి సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేకపోయారు. దీనిపై అమర్‌ప్రీత్ సింగ్ స్పందించారు. 15 భారత యుద్ధ విమానాలు కూల్చామని కూడా పాక్ చెప్పుకోవచ్చని.. వారు అలాగే భావిస్తూ సంతోషపడనివ్వండి అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘సుదర్శన్ చక్ర’తో పటిష్ట రక్షణ ఆపరేషన్ సిందూర్‌తో మన వైమానిక దళం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచి్చందని అమర్‌ప్రీత్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ‘సుదర్శన్ చక్ర’ పేరిట శత్రుదుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 2035 నాటికి ఈ నూతన భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ‘సుదర్శన్ చక్ర’ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని వివరించారు. దీనితో మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు పటిష్టమైన రక్షణ లభిస్తుందన్నారు. మరోసారి భారత్‌వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌ను హెచ్చరించారు. -
అమెరికా-పాక్‌లు! నాకు నువ్వు.. నీకు నేను!
ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్ల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీరి స్నేహ బంధం బలపడుతూ వచ్చింది. ప్రపంచ దేశాలపై విపరీతమైన సుంకాలు విధిస్తూ అమితానందాన్ని పొందుతున్న ట్రంప్.. పాకిస్తాన్ విషయంలో ఆచితూచి అడుగలు వేస్తున్నారు. భారత్‌తో ఉన్న బంధాన్ని కాలరాసుకున్న ట్రంప్.. ఇక చేసేది లేక పాక్‌తో మాత్రం జబ్బలు రాసుకుంటూ తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను అమెరికా పర్యటనలకు పలుమార్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం.. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు భేటీలో ఏం జరిగిందనేది బయటకు చెప్పకపోయినా.. భారత్ గురించి కచ్చితంగా వీరి మధ్య ప్రస్తావన వచ్చే ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశ నాయకులు చేస్తున్న కృషి అమోఘం అంటూ కొనియాడారు. అయితే దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది. ఇందులో తాము చేసేంది కాస్తే అయినా ట్రంప్ గాజాలో శాంతి కోసం చేస్తున్న కృషి వెలకట్టలేదని అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రశంసించారు. గాజాలో శాంతి కోసం తమకు 20 పాయింట్లతో కూడిన ముసాయిదాను తమకు ట్రంప్ పంపారని, ఇందులో కొన్ని సరిచేసి పంపామన్నారు దార్.‘ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు మావి కావని నేను స్పష్టం చేశాను. ఇవి మావి కావు. మాకు సంబంధమున్న ముసాయిదాలో, కొన్ని మార్పులు చేసామని మాత్రమే నేను చెబుతున్నాను. ఈ క్రెడిట్ అంతా ట్రంప్‌దే’ అంటూ కొనియాడారు దార్.అయితే ఇరు దేశాల మైత్రి నెటిజన్లు కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘నాక నువ్వు-నీకు నేను అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి.అంటూ పలువురు స్పందించగా, ‘తాను మునిగి, మిగతా వారిని కూడా ముంచుతున్న ట్రంప్‌తో పాక్ మైత్రి బాగుంది బ్రదర్’ అంటూ మరొకరు కౌంటరిచ్చారు. -
ఆపరేషన్ సిందూర్‌పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్
ఢిల్లీ: చర్రితలో నిలిచిపోయేలా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. 300 కి.మీ దూరంలోని లక్ష్యాలు ఛేదించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆసక్తికర విషయాలు బయపెట్టిన ఐఏఎఫ్ చీఫ్.. భారత యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్న పాకిస్తాన్ ఆర్మీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చరిత్రాత్మకమని.. ఆపరేషన్ సిందూర్ భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.‘‘ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌ను చావు దెబ్బ తీశాం. పాకిస్తాన్‌కు చెందిన 5 పైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం. దెబ్బతిన్న పాక్ ఫైటర్ జెట్స్‌లో ఎఫ్-16 ఉన్నాయి. మన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ గేమ్ ఛేంజర్లే. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాక్‌కు చెందిన అవాక్ విమానాన్ని ధ్వంసం చేశాం...మే 10న యుద్ధ విరామానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కాదు.. పాకిస్తానే భారత్‌ను శాంతికి అభ్యర్థించిందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్, ఆ దేశ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది’ అని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. -
World Cup 2025: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.పాక్ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్‌ను గెలిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్) రుబ్యాకు సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్, రమీన్ షమీమ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.చదవండి: IND VS WI 1st Test: ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. 129 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 2) పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో పాక్ 38.3 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు. కాగా, ప్రస్తుత ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. టోర్నీ ఓపెనర్‌లో ఆతిథ్య దేశాలు గౌహతిలో తలపడ్డాయి. ఇందులో భారత్ శ్రీలంకపై 59 పరుగుల తేడతో గెలుపొంది బోణీ కొట్టింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రేపు (అక్టోబర్ 3) ఇంగ్లండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అక్టోబర్ 4న శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ పాక్‌పై మూడుసార్లు గెలుపొందింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. టోర్నీ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. దీంతో చిర్రెత్తిపోయని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ సహా భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. చదవండి: చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా -
‘సర్ క్రీక్‌ను టచ్ చేస్తే చుక్కలే’.. పాక్‌కు రాజ్‌నాథ్ తీవ్ర హెచ్చరిక
భుజ్: నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకస్తాన్కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్‌లోని సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్‌లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే, తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు.‘పాక్‌తో యుద్ధం భారత్ లక్క్ష్యం కాదు’గుజరాత్‌లోని భుజ్ సమీపంలోగల సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటంపాకిస్తాన్లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, భారత సరిహద్దులను కాపాడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.సర్ క్రీక్ వివాదం ఏమిటి?ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు విఫల ప్రయత్నం చేసిందని, అయితే ప్రతీకార చర్యలో భాగంగా భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలని రక్షణ మంత్రి అభివర్ణించారు. కాగా సర్ క్రీక్ అనేది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్- పాకిస్తాన్ మధ్య 96 కి.మీ పొడవైన టైడల్ నదీముఖద్వారం. సముద్ర సరిహద్దు రేఖలపై ఇరు దేశాలు వేర్వేరు వివరణలు ఇవ్వడం కారణంగా దీనిని వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తున్నారు. -
పాలక్ బ్రిడ్జ్ పై పాక్ ఆర్మీ VS నిరసనకారులు
-
ఐరాస వేదికగా మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్..!
జెనీవా: ఐక్యరాజ్యసమితి (United Nations)లో పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. మానవ హక్కుల మండలిలో పాక్ వక్ర బుద్ధిని భారత్ దుయ్యబట్టింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మైనారిటీలపై దాడులు జరిపే ఆ దేశం మానవహక్కులపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ భారతీయ దౌత్యవేత్త మొహమ్మద్ హుస్సేన్ చురకలు అంటించారు. పాక్ తప్పుడు ప్రచారాలు చేసే బదులు తన దేశంలోని మైనారిటీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలంటూ హితవు పలికారు.ఇటీవల పాకిస్తాన్లో ఆ దేశ సైన్యం చేసిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా కూడా పాక్ సర్కార్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లు సుదీర్ఘకాలంగా సైనిక ఆపరేషన్లకు కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇతరుల ముందు మానవ హక్కుల పాఠాలు చెబుతోంది కానీ.. అక్కడి పరిస్థితులు చూస్తే వాటికి పూర్తిగా విరుద్ధం.. తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తోందంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం తమ కనీస ప్రాథమిక హక్కుల్ని సైతం కాలరాస్తోందంటూ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాఘ్ జిల్లా దిర్కోట్లో నలుగురు, ముజఫ రాబాద్, మిర్పూర్లలో ఇద్దరు చొప్పున చనిపో యారు. ముజఫరాబాద్‌లో మంగళవారం జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడం తెల్సిందే. దీంతో, బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు(Asim Munir) ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మునీర్‌కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మునీర్ బ్రాండెడ్ సేల్స్ పర్సన్‌గా వ్యవహరించారని పాకిస్తాన్ సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.పాకిస్తాన్ పార్లమెంట్లో తాజాగా సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మన దేశానికి చెందిన అరుదైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు. పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్‌కు చూపించారు. మునీర్ ఒక సేల్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇక, పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా?. మునీర్ ఏ హోదాలో.. ఏ చట్టం కింద ఇలా చేశారు. ఇది నియంతృత్వం కాదా?. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది పార్లమెంటును ధిక్కరించడం కాదా? అని ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఎదురుదెబ్బ తగిలింది.⚡ Huge Embarrassment For Pakistan’s 'Failed' Marshal Asim MunirPakistani senator Aimal Wali Khan has criticised Pakistan COAS Asim Munir inside the Pakistani Parliament over selling rare earth minerals in a briefcase to US President Donald Trump. "What a Joke" he says.He… pic.twitter.com/YbiXZoN1Da— OSINT Updates (@OsintUpdates) October 1, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను బుట్టలో వేసుకోవడానికి పాక్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pak Army Chief Asim Munir), ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ఓ చెక్కపెట్టెను బహూకరించారు. దానిలో పాక్‌లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టెలోని రంగురాళ్లను చూపుతూ ఏదో చెబుతుండగా.. ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్లు అందులో ఉంది. అనంతరం మునీర్ మాట్లాడుతూ..‘పాకిస్తాన్ (Pakistan) వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది. దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది. అతి త్వరలోనే పాక్ సుసంపన్న సమాజాల్లో ఒకటిగా మారుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
పాక్ బలగాల కాల్పులు.. 8 మంది మృతి
-
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
పాక్‌పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్‌తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్‌ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్‌ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్‌కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్‌కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్‌కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్‌లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్‌కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్‌కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
ప్రపంచ ఛాంపియన్లతో పోటీకి జట్టును ప్రకటించిన పాకిస్తాన్
అక్టోబర్ 12 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరుగబోయే (Pakistan vs South Africa) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును (Pakistan) ఇవాళ (సెప్టెంబర్ 30) ప్రకటించారు. కెప్టెన్‌గా షాన్ మసూద్ (Shan Masood) కొనసాగనుండగా.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు (ఆసిఫ్ అఫ్రిది (ఎడమ చేతి ఆర్తోడాక్స్ స్పిన్నర్), ఫైసల్ అక్రమ్ (ఎడమచేతి చైనామాన్ బౌలర్), రోహైల్ నజీర్ (వికెట్ కీపర్-బ్యాటర్)) జట్టులో చోటు దక్కించుకున్నారు. చెత్త రికార్డు (12 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు) ఉన్నప్పటికీ.. షాన్ మసూద్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం విశేషం.మసూద్‌తో పాటు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్ ఆర్డర్లో టాప్-3లో ఉండగా... బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, కమ్రాన్ గులామ్, టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా, సౌద్ షకీల్, రోహైల్ నజీర్ మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నారు.బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను (నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ అఫ్రిది, ఫైసల్ అక్రమ్) ఎంపిక చేశారు. పేస్ బౌలింగ్ విభాగానికి షాహీన్ అఫ్రిది నాయకత్వం వహిస్తుండగా.. ఆమిర్ జమాల్, హసల్ అలీ, ఖుర్రమ్ షెహజాద్ ఇతర సభ్యులుగా ఉన్నారు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌ను సౌతాఫ్రికా ఈ సిరీస్‌తోనే ప్రారంభించనుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో పాక్‌కు కూడా ఇదే తొలి పరీక్ష. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 12 నుంచి లాహోర్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో ప్రారంభమవుతాయి. గత డబ్ల్యూటీసీలో పాకిస్తాన్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.పాక్ పర్యటనలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు కూడా ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్లను ఇదివరకే ప్రకటించగా.. పాక్ జట్లకు ప్రకటించాల్సి ఉంది.సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మహ్మద్ రిజ్వాన్ (wk), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (wk), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిదిపాకిస్తాన్తో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తాస్వామి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో జన్సెన్, ప్రెనెలన్ సుబ్రాయన్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, సైమన్ హార్మర్, కగిసో రబాడచదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా -
కాంట్రాక్టు చింపేయండి! రెచ్చిపోయిన మాజీ పాక్ ప్లేయర్
-
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. పెరుగుతున్న మృతుల సంఖ్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ పారామిలటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజీల్లో రోడ్డుపై ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.భారీ పేలుడు ధాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్లు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.పాక్ మీడియా కథనం ప్రకారం..పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం క్వెట్టా జర్ఘున్ రోడ్లో పాకిస్థాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడి అనంతరం కాల్పులు సైతం వినిపించాయి.ఈ ఘటనపై బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలో పదిమందికిపైగా మరణించారని ధృవీకరించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ⚡️🇵🇰 Suicide Bomb Blast in Balochistan's Capital Reportedly Targets Paramilitary Security Force - CCTV 📹 The powerful blast was followed by gunfire in Quetta, near the HQ of the Frontier Corps.The explosion, which appeared to target a vehicle, shattered windows and damaged… pic.twitter.com/GUueo7NXBb— RT_India (@RT_India_news) September 30, 2025 -
పీఓకేలో తిరుగుబాటు
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, అణచివేత చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘ ర్షణ జరిగింది.హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న సాధారణ ప్రజలపై పాక్ సైన్యంతోపాటు ఐఎస్ఎస్ అండదండలున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ ముష్కరులు కిరాతకంగా కాల్పులు జరిపారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిని పొట్టనపెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 22 మందికిపైగా గాయపడ్డారు. ముజఫరాబాద్ వీధులు రణరంగాన్ని తలపించాయి. హింసాకాండ దృశ్యాలు పాకిస్తాన్ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి. తెరపైకి 38 డిమాండ్లు ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ పాటించారు. సోమవారం మార్కెట్లు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాక్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది.ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం–జీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 60 శాతానికి పాకిస్తాన్‌కే సరఫరా అవుతోంది. స్థానికులకు దక్కుతున్న ప్రయోజనం స్వల్పమే. ఇదే అంశం వారిలో అసంతృప్తి కలిగిస్తోంది. పీఓకేలోని వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడం జనంలో అసహనం కలిగిస్తోంది. ఇవన్నీ ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించాయి.గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లను ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు తేల్చిచెప్పారు. అణచివేత చర్యలు ప్రారంభం పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుకున్నారు. పలు పట్ణణాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాక్ వైమానిక దళం గతవారం ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామంపై భారీస్థాయిలో విరుచుకుపడింది. చైనా ఇచ్చిన జే–17 ఫైటర్ జెట్లతో ప్రజలపై నిప్పుల వర్షం కురిపించింది. చైనాలో తయారైన ఎల్ఎస్–6 లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. అది జరిగిన వారం రోజులకే పీఓకేలో ఆందోళనలు ప్రారంభం కావడం గమనార్హం. -
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్..
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం చైనా కంపెనీ జింగ్యింగ్ పెట్టుబడులతో పెషావర్‌లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, మాంసం ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందట.చైనాకు గాడిద మాంసాన్ని ఎగుమతి చేసేందుకు పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
భారత్‌కు విజయ 'తిలకం'
దాదాపు 18 ఏళ్ల క్రితం... టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి చిరకాల ప్రత్యర్థితో ఆఖరి సమరంలో గెలిచే అవకాశం వచ్చింది... వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయికి తగిన అంచనాలతో భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే టీమిండియాకు విజయం అతి సులువు అనిపించింది. పాక్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత లక్ష్యం మరీ చిన్నదిగా కనిపించింది. కానీ అనూహ్యంగా మ్యాచ్‌లో మలుపులు, ఉత్కంఠ, ఉద్వేగాలు... అన్నీ కలగలిసి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. సంజు సామ్సన్, శివమ్ దూబేలు తలా ఓ చేయి వేయగా... హైదరాబాద్ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ అసలైన హీరోగా అవతరించాడు.ఒత్తిడిని అధిగమించి అద్భుత షాట్లతో చివరి వరకు నిలిచిన తిలక్ చిరస్మరణీయ ఆటతో భారత జట్టును ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఎన్ని టైటిల్స్ గెలిచినా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి సాధించే ట్రోఫీలో కిక్కే వేరు అని మరోసారి రుజువైంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 బంతుల్లో 84 పరుగులు జోడించారు. పాక్ కేవలం 33 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/30) ఆకట్టుకోగా... బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... శివమ్ దూబే (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు సామ్సన్ (21 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాణించిన ఓపెనర్లు... భారత్‌తో ఆడిన సూపర్–4 మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పాక్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ పదునైన షాట్లతో సరైన పునాది వేశారు. ముఖ్యంగా ఫర్హాన్ దూకుడు ప్రదర్శిస్తూ బుమ్రా ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. పవర్‌ప్లేలో 45 పరుగులు చేసిన జట్టు... తర్వాతి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 87 పరుగులకు చేరింది. గత మ్యాచ్‌లో భారత్‌పై పాక్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు సాధించింది. 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఫర్హాన్‌ను వరుణ్‌ను అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన సయీమ్ అయూబ్ (14) ఈసారి రెండంకెల స్కోరు చేయగలిగాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు 113/1 వద్ద నిలిచింది. ఈ దశలో మరో 44 బంతులు మిగిలి ఉండగా పాక్ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాక్ బ్యాటర్లు ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలవలేక చెత్త షాట్లతో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున అయూబ్, హారిస్ (0), ఫఖర్, తలత్ (1) వెనుదిరిగారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో మూడు వికెట్లతో కుల్దీప్ పాక్ పని పట్టాడు. అతడిని ఎదుర్కోలేక సల్మాన్ (8), అఫ్రిది (0), ఫహీమ్ (0) అవుటయ్యారు. మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 39 బంతుల వ్యవధిలో పాక్ చివరి 9 వికెట్లు చేజార్చుకుంది! కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడింది. అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5)ను నిలువరిచడంలో పాక్ సఫలం కాగా... కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), శుబ్‌మన్ గిల్ (12) కూడా విఫలమయ్యారు. దాంతో స్కోరు 20/3కి చేరింది. ఈ దశలో తిలక్, సామ్సన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 57 పరుగులు జత చేసిన అనంతరం సామ్సన్ వెనుదిరిగాడు. అయితే తిలక్, దూబే భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా పయనించింది. వీరిద్దరు 40 బంతుల్లోనే 60 పరుగులు జోడించడంతో జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. విజయానికి 10 పరుగుల దూరంలో దూబే అవుటైనా... తిలక్, రింకూ సింగ్ (4 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. తిలక్ వర్మపరుగులు 69 బంతులు 53 1x 27 2 x 3 4 x 3 6 x 4 స్ట్రయిక్‌రేట్ 130.18 బుమ్రా అలా... భారత్‌తో గత మ్యాచ్‌లో పాక్ బౌలర్ రవూఫ్ యుద్ధంలో భారత విమానాలు నేలకూలినట్లుగా సైగలు చేస్తూ తమ దుర్బుద్ధిని ప్రదర్శించాడు. దీనిపై అతనికి ఐసీసీ జరిమానా కూడా విధించింది. ఫైనల్లో చక్కటి బంతితో రవూఫ్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. వెంటనే బుమ్రా కూడా అదే తరహాలో విమానం నేలను ఢీకొట్టినట్లుగా సైగ చేస్తూ రవూఫ్‌ను సాగనంపడంతో స్టేడియం హోరెత్తిపోయింది. ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్... ఫలితం మాత్రం ఒక్కటే... భారత్ విజయమే... మన క్రికెటర్లకుఅభినందనలు’. –నరేంద్ర మోదీ, భారత ప్రధాని స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) తిలక్ వర్మ (బి) వరుణ్ 57; ఫఖర్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 46; అయూబ్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 14; హారిస్ (సి) రింకూ (బి) అక్షర్ 0; సల్మాన్ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 8; తలత్ (సి) సామ్సన్ (బి) అక్షర్ 1; నవాజ్ (సి) రింకూ (బి) బుమ్రా 6; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫహీమ్ (సి) తిలక్ వర్మ (బి) కుల్దీప్ 0; రవూఫ్ (బి) బుమ్రా 6; అబ్రార్ అహ్మద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–84, 2–113, 3–114, 4–126, 5–131, 6–133, 7–134, 8–134, 9–141, 10–146. బౌలింగ్: శివమ్ దూబే 3–0–23–0, బుమ్రా 3.1–0–25–2, వరుణ్ చక్రవర్తి 4–0–30–2, అక్షర్ పటేల్ 4–0–26–2, కుల్దీప్ యాదవ్ 4–0–30–4, తిలక్ వర్మ 1–0–9–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రవూఫ్ (బి) ఫహీమ్ 5; గిల్ (సి) రవూఫ్ (బి) ఫహీమ్ 12; సూర్యకుమార్ (సి) సల్మాన్ (బి) అఫ్రిది 1; తిలక్ వర్మ (నాటౌట్) 69; సామ్సన్ (సి) ఫర్హాన్ (బి) అబ్రార్ 24; శివమ్ దూబే (సి) అఫ్రిది (బి) ఫహీమ్ 33; రింకూ సింగ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–20, 4–77, 5–137. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–20–1, ఫహీమ్ 4–0–29–3, నవాజ్ 1–0–6–0, రవూఫ్ 3.4–0–50–0, అబ్రార్ 4–0–29–1, అయూబ్ 3–0–16–0. -
మనసులను వేరు చేసి చూడలేం!
నిజాయతీపరుడైన, ఉన్నతమైన భారతీయుడు ఎవరూ పాకిస్తాన్‌ను సొంత ఇంటిగా భావించడం ఇక ఎంత మాత్రం అంగీకార యోగ్యమైన విషయం కాదా? మనలో కోట్లాది మంది నేడు పాకిస్తాన్‌గా భావిస్తున్న రాష్ట్రాలలో పుట్టినవాళ్లమే. ఆ రోజుల్లో, మాకు తెలిసిన సొంత ప్రాంతం అదే. నా తల్లితండ్రులు, సోదరీమణులు, నా దగ్గరి బంధువులలో చాలా మంది అక్కడే జన్మించారు. మా అమ్మ తొంభై ఏళ్ల వయసులో సొంతూరు వెళ్లాలని కోరుకున్నప్పుడు లాహోర్ పేరు చెప్పింది కానీ, జీవించిన ఛతర్‌పుర్ కాదు. ఛతర్‌పుర్‌లో పొలాలు గట్రా ఉన్నా ఆమెకు ఠక్కున లాహోర్ గుర్తుకొచ్చింది. పిట్రోడా మాటలపై వివాదంపాకిస్తాన్లో ఉండగా తనకు సొంత ఇంటిలోనే ఉన్నట్లు అని పించిందని శామ్ పిట్రోడా ఇటీవల మనసులో మాట చెప్పేసి నప్పుడు, పిట్రోడాకు దేశభక్తి లేదంటూ ఎన్డీటీవీ ఆయనపై విమర్శ లతో ఊదరగొట్టేసింది. ‘‘నేను ఈమధ్య పాకిస్తాన్ వెళ్లొచ్చాను. నాకు అక్కడ నా సొంత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని నేను మీకు చెప్పి తీరాలి’’ అని ఆయన అన్నారు. ‘‘నేను బంగ్లాదేశ్ వెళ్లాను. నేపాల్ కూడా వెళ్లొచ్చాను. రెండు చోట్లా సొంత ప్రదేశంలో ఉన్నట్లే అనిపించింది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ టీవీ ఛానల్లో ప్రసారమైన ఇరవై ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌లో పదిహేను నిమిషాలకు పైగా సమయాన్ని హానికరం కాని, భంగ కరంకాని ఆ వ్యాఖ్యను తూర్పారబట్టడానికే కేటాయించారు. బి.జె.పి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను పరుషమైన పదజాలంతో నిందించారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలో కూడా సొంతూ రులో ఉన్నట్లుగానే ఉందన్న శామ్ పిట్రోడా మాటలను పూనావాలా సమయానుకూలంగా విస్మరించారు. మనసులను తాకిన అద్వానీ వాస్తవం ఏమిటంటే, ఎల్.కె. అద్వానీ సొంత ప్రాంతం కూడా పాకిస్తానే! ఆయన పుట్టింది, చదువుకుంది కరాచీలోనే! పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా 2005లో ఖుర్షీద్ కసూరీ ఉన్నపుడు పాకిస్తాన్ సందర్శనకు రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు. అద్వానీకిఆ ఆహ్వానం సంగతి చెప్పి, ఆయన స్పందన ఏమిటో తెలుసుకుని చెప్పవలసిందిగా నన్ను కోరారు. ‘‘దానిదేముంది? సంతోషంగా వెళ్లి రావచ్చు. నాకు నా కుటుంబ సభ్యులను కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని ఉంది’’ అని అద్వానీ అన్నారు. అలాగే, అద్వానీ వెంట ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. పాకిస్తాన్‌కు బయలు దేరేటపుడు అద్వానీ చేసిన ప్రకటన, తాను జరపబోయే ఆ పర్యటన తనకు ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వెల్లడించింది. ‘‘వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యటన నాకు ప్రగాఢమైన ప్రాధాన్యం కలిగినది. కరాచీలో పుట్టి పెరిగినవాడిని కనుక, ఈ సందర్శన, నాకు మూలా లకు తిరిగి వెళ్లటం లాంటిది. ఈ రెండు దేశాలు సుస్థిరమైన శాంతితో సాగే మార్గాన్ని ఆ పరమాత్మ చూపాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. అయితే, లాహోర్‌లో అద్వానీ అన్న మాటలను నేను ఎన్నటికీ మరచిపోను. ‘‘ప్రతి భారతీ యుడి మనసులో కొద్దిపాటి పాకిస్తాన్, ప్రతి పాకిస్తానీ హృదయంలో కొద్దిపాటి ఇండియా ఉంటాయని నేను ఎప్పుడూ విశ్వసి స్తాను’’ అని ఆయన అన్నారు. అది మనసును తాకే వాస్తవం. ముఖ్యంగా పంజాబీలు, బెంగాలీలకు సంబంధించినంత వరకు కాదనలేనిది. ఈరోజుల్లో అయితే, ఎన్డీటీవీ, అద్వానీని కూడా ఏకి పారేసి ఉండేది. దాని జాతీయతావాద చెవులకు ఆ మాటలు దేశ ద్రోహంతో సమానంలా అనిపించేవి. అదృష్టవశాత్తూ, ప్రణయ్ రాయ్ ఆధ్వర్యంలో 2006లో అది చాలా భిన్నమైన ఛానల్‌లా ఉండేది. ఒకేలా అనిపించటం సహజమే!నా సంగతి కూడా చెప్పనివ్వండి. నేను 1980లో మొదటిసారి పాకిస్తాన్ సందర్శించాను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లివచ్చాను. వెళ్లిన ప్రతిసారీ నాకు పూర్తిగా సొంత ఇంటిలోనే ఉన్నట్లే అని పించింది. వారి పంజాబ్‌లో భాష, ఆహారం, సంప్రదాయాలు, ఆచారాలు, ఇళ్లు, ప్రజా జీవనవిధానానికి మనకు తేడా ఏమీ లేదు. రెండింటినీ వేరు చేసి చూడలేం. అవే రకమైన మాటలతో శపిస్తాం లేదా అక్కున చేర్చుకుంటాం. అదే వైచిత్రి. తమిళులు, మలయాళీలు లేదా కన్నడిగులు సగటు పాకిస్తానీయులకు అపరిచితులుగా కనిపించవచ్చు. ఢిల్లీ, శ్రీనగర్‌లలో ఉన్నవారు కూడా అలానే అనిపించ వచ్చు. కానీ, అమృత్సర్, లూధియానాలలో ఉన్నవారు మాత్రం కాదు. పాకిస్తాన్ గురించి భారతీయుల తలపులు కూడా కొంత వరకు అదే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. వారు మన దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఇటానగర్‌లో ఉండేవారికి కనిపించే సారూప్యం చాలా తక్కువ. అలీగఢ్‌లో ఉండేవారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకోవచ్చు... కానీ!ఇటీవల దుబాయ్‌లో భారతీయ క్రికెట్ జట్టు ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా, క్రీడా స్ఫూర్తి కొరవడినదిగా కనిపించింది. ముఖ్యంగా నన్ను వేదనకు గురి చేసింది. పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు వారు తిరస్కరించడం క్రికెట్ అనిపించుకోదు. కరచాలనం అనే బ్రిటిష్ పదబంధానికి అర్థం ఏమైనా ఉందీ అంటే, తప్పకుండా దానిలోకి, రీతి రివాజులకు సంబంధించిన తేలికపాటి మర్యాదలు, సత్ప్రవర్తన కూడా రాకుండా ఉంటాయా? తప్పక పాటించవలసిన చక్కని నడవడికను పక్కన పెట్టాలని భారత జట్టు తీసుకున్న నిర్ణయంతో మన విజేతలు చిన్నవాళ్లుగా కనిపించారు. పహల్గావ్‌ు ఉగ్రదాడి అనంతరం పాకి స్తాన్‌తో ఆడకూడదని కోరుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మైదానంలో అవతలి జట్టు ఎదురుగా నిలవడం ఇష్టం లేక ఒక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించడం ఇది మొదటిసారేమీ కాదు. దక్షిణాఫ్రికాతో ఆడడం ఇష్టం లేక 1974లో డేవిస్ కప్‌లో ఏకంగా ఫైనల్స్‌నే త్యజించడం ఇందుకు కలకాలం గుర్తుండే ఉదాహరణ. కానీ, ఒకసారి ఆడడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యర్థులతో కరచాలనం చేయడం ఆచారమే కాదు, నాగరికత అని కూడా అనిపించుకుంటుంది. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెబుతున్నా, ఆ అంశంపై ఎవరూ దృష్టి సారించకపోవడం నన్ను ఆశ్చర్యపరచింది. అలాగే, పాక్‌లో ఉన్నపుడు సొంత ఇంటిలోనే ఉన్నట్లుగా అనిపించిందని శామ్ పిట్రోడా అన్నందుకు, ఆయనని ఏకిపారేయడం కూడా నన్ను అంతే ఆశ్చర్యపరచింది. నిజం చెప్పాలంటే, నా దేశస్థుల గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ నాలో ఆశ్చర్యం పాలు ఎక్కువ అవుతోంది!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Ind vs Pak: అప్పుడు బాయ్‌కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్‌కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్‌కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్‌గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు. PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం -
ఆసియా కప్ లో ఆఖరి పోరాటం
-
QRSAM: ‘అనంత’ గర్జన!
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన ‘అనంత శస్త్ర’క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను సైన్యం జారీ చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను గతంలో ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్’(క్యూఆర్ఎస్ఏఎం)గా పిలిచేవారు. మొత్తం ఐదు నుంచి ఆరు రెజిమెంట్లకు సరిపడా ‘అనంత శస్త్ర’వ్యవస్థను సమకూర్చుకోనున్నారు. మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’పేరిట పాకిస్తాన్ డ్రోన్ల కుట్రను భగ్నం చేయడంలో ఈ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ‘అనంత శస్త్ర’అత్యంత అధునాతన, హై–మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని ప్రత్యేకతలు ఇవే.. → కదులుతూనే శత్రు లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేయగలదు. → చాలా తక్కువ సమయంలో ఆగి, వెంటనే క్షిపణులను ప్రయోగించగలదు. → దీని పరిధి సుమారు 30 కిలోమీటర్లు. రేయింబవళ్లూ పనిచేస్తుంది. → ఎంఆర్–ఎస్ఏఎం ఆకాశ్ వంటి వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ వాయు రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాతే ఆమోదం ‘ఆపరేషన్ సిందూర్’సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక డ్రోన్లను భారత సైన్యం ఎల్–70, జేయూ–23 ఎయిర్ డిఫెన్స్ గన్లతో కూల్చివేసింది. అదే సమయంలో ఆకాశ్, ఎంఆర్–ఎస్ఏఎం వాయుసేనకు చెందిన స్పైడర్, సుదర్శన్ ఎస్–400 వ్యవస్థలు కూడా కీలక భూమిక పోషించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాతే ‘అనంత శస్త్ర’కొనుగోలుకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) పచ్చజెండా ఊపింది. ఈ కొత్త వ్యవస్థతో పాటు సైన్యానికి అత్యాధునిక రాడార్లు, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, జామర్లు, లేజర్ ఆధారిత ఆయుధాలు కూడా అందనున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యం వాడే తుర్కియే, చైనా డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేతృత్వంలో రక్షణ రంగంలో స్వదేశీకరణ శరవేగంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ‘జోరావర్’తేలికపాటి ట్యాంకులు, మరిన్ని స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు సైన్యంలో చేరనున్నాయి. -
ఉగ్రవాదమే తమ విధానమని పొరుగుదేశం ప్రకటించుకుంది
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా, ప్రపంచ దేశాల నేతల సాక్షిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పొరుగు దేశం నైచ్యాన్ని మరోసారి తేటతెల్లం చేశారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని తన విధానంగా ప్రకటించుకుందంటూ కడిగిపారేశారు. ఇలాంటి దేశాలను దగ్గరకు తీసుకునే దేశాలు సైతం ఉగ్ర కాటుకు గురికాక తప్పదని జై శంకర్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మనం హక్కుల గురించి చెప్పేటప్పుడు ఉగ్రవాదం వంటి తీవ్రమైన సమస్యల్ని కూడా దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో అమాయక పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉదంతమే సీమాంతర ఆటవిక ఉగ్రవాదానికి తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా బిందువుగా తయారైన పొరుగు దేశం నుంచి ఈ సవాల్‌ను భారత్ స్వాతంత్య్రం వచి్చననాటి నుంచి ఎదుర్కొంటూనే ఉంది. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల్లో ప్రధానంగా ఉండేవన్నీ ఆ ఒక్క దేశం నుంచే పనిచేస్తున్నాయి. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారంతా ఆ దేశస్తులే’అని జై శంకర్ అన్నారు. పహల్గాం దారుణం నేపథ్యంలో ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుందని, ఉగ్రవాద సంస్థలను, దోషులను న్యాయం ముందు నిలబెట్టిందని చెప్పారు. ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు కాబట్టే దీనిపై జరిగే పోరులో ప్రపంచ దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమన్నారు. దేశాలు ఉగ్రవాదాన్ని బహిరంగంగా తమ విధానంగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాద కేంద్రాలు ఒక పరిశ్రమ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడు ప్రపంచ దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని అడ్డుకోవాలి’అని కోరారు. అదే సమయంలో, ఐరాస పనితీరును సైతం ఆయన ప్రశ్నించారు. నేటి అవసరాలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ వేదిక పనిచేస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత, శాశ్వతేతర సభ్యదేశాల సంఖ్య మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ తన ప్రజలను, వారి ప్రయోజనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. భారత్ గ్లోబల్ సౌత్‌కు గొంతుకగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. -
Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం
ఆసియా కప్ మొదలై 41 సంవత్సరాలు...వన్డే ఫార్మాట్లో 14 సార్లు, టి20 ఫార్మాట్లో 2 సార్లు టోర్నీ జరిగింది. ఓవరాల్‌గా భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్క సారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు. తాజా టోర్నీలో పాక్ జట్టు ప్రదర్శన, తడబాటును చూస్తే ఈ సారి కూడా అది సాధ్యం కాదని అనిపించింది. కానీ పడుతూ లేస్తూ పాక్ ఎట్టకేలకు తుది పోరుకు అర్హత సాధించగా...మరో వైపు చక్కటి ఫామ్, అజేయమైన రికార్డుతో ఎదురుగా భారత్ నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల ఫలితం, ఆపై సూర్యకుమార్ వ్యాఖ్యలు చూస్తే ఇరు జట్ల మధ్య ‘వైరం’ అనే మాటలో అర్థం లేదు! అయితే టి20 ఫార్మాట్లో అనూహ్య ఫలితాలు కొత్త కాదు. టీమిండియా తమ జోరును కొనసాగిస్తూ ఏకపక్ష ఆటతో 9వ సారి చాంపియన్‌గా నిలుస్తుందా... లేక పాకిస్తాన్ పాఠాలు నేర్చుకొని కొత్త తరహా ఆటతో పోటీనిస్తుందా అనేది ఆసక్తికరం. ఫలితం ఎలా ఉన్నా అభిమానులకు వరుసగా మూడో ఆదివారం క్రికెట్ పండగ ఖాయం. దుబాయ్: ఆసియా కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సన్నద్ధమైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్...ఇప్పుడు టి20 ఫార్మాట్లో టైటిల్‌కు గురి పెట్టింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటిన సూర్యకుమార్ సేన సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇదే జోరు మరో మ్యాచ్‌లో కొనసాగిస్తే ట్రోఫీ మన జట్టు ఖాతాలో పడుతుంది. మరో వైపు పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో బలహీనంగా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్లపైనే చివరి వరకు శ్రమించి గట్టెక్కిన ఆ జట్టు భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు. దాయాది జట్టు చేతిలో లీగ్, సూపర్–4 దశలో ఎదురైన ఓటములు వారికి వాస్తవాన్ని చూపించాయి కూడా. అయితే ఆ జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆసియా’లో ఎవరిది పైచేయి కానుందో చూడాలి. సూర్య ఫామ్‌పై ఆందోళన... శ్రీలంకపై చివరి లీగ్ మ్యాచ్‌లో బుమ్రా, దూబేలకు విశ్రాంతినిచ్చినా...ఫైనల్ పోరుకు వారిద్దరు తిరిగి రావడం ఖాయం. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. వరుస విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లనే మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే సూపర్–4 దశలో జట్టులో పలు లోపాలు కనిపించాయి. భారత్ విజయావకాశాలు అభిషేక్ శర్మ ఇచ్చే అసాధారణ ఆరంభంపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. టోర్నీ టాపర్‌గా 309 పరుగులు చేసిన అతడు 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అదరగొడుతున్నాడు. మరో ఎండ్‌లో గిల్ (115 పరుగులు)నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. అభిషేక్ దూకుడు ఈ లోటును తెలియనివ్వలేదు. ఈ సారైనా వైస్ కెప్టెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని భారత్ కోరుకుంటోంది. మిడిలార్డర్లో పాండ్యా తన స్థాయికి తగినట్లు చెలరేగలేదు. అయితే తిలక్, సామ్సన్‌లు రాణించడం సానుకూలాంశం. గత మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన నమ్మకాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్న దూబే బ్యాటింగ్‌లోనూ ధాటిని ప్రదర్శించాల్సి ఉంది. అన్నింటికి మించి కెపె్టన్ సూర్యకుమార్ ఫామ్ జట్టులో ఆందోళన పెంచుతోంది. ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 71 పరుగులే చేశాడు. అదీ తన సహజశైలికి భిన్నంగా 108 స్ట్రైక్‌రేట్ మాత్రమే ఉండటం అనూహ్యం. వచ్చే వరల్డ్ కప్ జట్టును నడిపించడం ఖాయమని భావిస్తున్న ప్లేయర్ ఇలా విఫలం కావడం ఇబ్బంది పెడుతోంది. ఫైనల్లోనైనా అతను చెలరేగాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, పాండ్యా కూడా రాణించడం అవసరం. అయితే మరోసారి మన స్పిన్ బలగంపై జట్టు ఆధారపడుతోంది. ఆరుకంటే తక్కువ ఎకానమీతో అత్యధికంగా 11 వికెట్లు తీసిన కుల్దీప్ను ఎదుర్కోవడం పాక్ బ్యాటర్లకు మళ్లీ కష్టమే. అక్షర్, వరుణ్ కూడా ప్రత్యర్థిని కట్టిపడేయగలరు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా. పాకిస్తాన్: సల్మాన్ (కెప్టెన్ ), ఫర్హాన్, ఫఖర్, అయూబ్, తలత్, హారిస్, అఫ్రిది, నవాజ్, ఫహీమ్, రవూఫ్, అబ్రార్. -
వాంగ్చుక్కు పాక్‌తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్చుక్కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్‌చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.కాగా, లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. -
హార్దిక్ అవుట్? బుమ్రా డౌట్? అతడే దిక్కు!
-
ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన పేటల్ గహ్లోత్ ఎవరు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సింధూజలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆరోపణలకు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టిగా బదులిచ్చారు. అవాస్తవిక నాటకాలతో వాస్తవాలను ఎంతమాత్రం మార్చలేరంటూ ఆమె పాక్ తీరును కడిగిపారేశారు.2015లో ఐఎఫ్ఎస్లో చేరి..పేటల్ గహ్లోత్ మహారాష్ట్రలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబయిలోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)లో చేరి దౌత్యవేత్తగా చేరారు. గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నెరవేర్చారు. యూరోపియన్ వెస్ట్ డివిజన్లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. The feeling of confusion, of being torn and of wanting everything and just one thing at the same time, encapsulated in this song from 12 years ago. A cover of ‘Kabira’ from Yeh Jawaani Hai Deewani pic.twitter.com/ASs7usWki2— Petal Gahlot (@petal_gahlot) May 5, 2025ఐరాసాలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా..పారిస్, శాన్ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో విధులు నిర్వహించారు.తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్ తరఫున మాట్లాడుతూ, సమర్థురాలైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ ఆమె పాకిస్తాన్ ఆరోపణలను ఐరాసలో బలంగా తిప్పికొట్టారు. ఇప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో కనిపిస్తోంది. వృత్తి పరంగా దౌత్య వ్యవహారాల్లో మునిగితేలే పేటల్ గహ్లోత్‌కు సంగీతమంటే ఎంతో ఆసక్తి. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతుంటారు. వాటిని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు. -
పాక్‌లో మిన్నంటిన నవరాత్రి సంబరాలు, గార్బా, దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.పాకిస్తాన్లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్‌లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్‌లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు. View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) -
భారత్-పాక్ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్, సింధూ నదీ జలాలపై పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని షరీఫ్ ఐక్యరాజ్య సమితి(UN) వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని.. ఇది యుద్ధ చర్యకు సమానం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చొరవ ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ నిజాయతీగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ట్రంప్ దూరదృష్టి గల నాయకత్వంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాక్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది’ అని చెప్పుకొచ్చారు. Pakistani Prime Minister Shehbaz Sharif about Trump: 🇵🇰❤️🇺🇸“Pakistan has nominated Trump for the Nobel Peace Prize, and this is the least we can do for his love of peace. He is truly a man of peace.”pic.twitter.com/xYPcXvmX6O— S.Haidar Hashmi (@HaidarHashmi0) September 27, 2025అనంతరం, సింధూ జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ స్పందిస్తూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలి. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం’ అని తెలిపారు.షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.. మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ..‘పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. Breaking:Pakistan must shut down terror camps, hand over terrorists to India, Indian Diplomat @petal_gahlot's right of reply to Pakistan PM Shehbaz Sharif at UNGAFull address pic.twitter.com/WoxZM93cBl— Sidhant Sibal (@sidhant) September 27, 2025 -
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్‌పై విజయాన్ని భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లుగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అతనిపై చర్య తీసుకుంది. సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. సెప్టెంబర్ 14న లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు మేం అండగా ఉంటాం. మా విజయం భారత సైనికులకు అంకితం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో ఆర్మీ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలోనూ రాజకీయపరమైన, గాజాపై ఇజ్రాయిల్ దాడివంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకుండా ఐసీసీ ఆంక్షలు పెట్టిన విషయాన్ని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విచారణ జరిపారు. రిఫరీ ముందు హాజరైన సూర్యకుమార్ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమాధానమిచ్చాడు. సూర్య వివరణపై విభేదించిన రిఫరీ ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ 30 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షపై బీసీసీఐ అప్పీల్ చేసినట్లు సమాచారం. అయితే మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడా కూడా సూర్యదే తప్పని నిర్ధారణ అయితే శిక్ష మరింత పెరుగుతుంది. ఫర్హాన్‌కు హెచ్చరికతో సరి! సూపర్–4 దశలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ ప్రవర్తన గురించి బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై కూడా రిచర్డ్సన్ విచారణ జరిపారు. ప్రేక్షకుల వైపు చూస్తూ యుద్ధంలో భారత విమానాలు కూలినట్లుగా, వాటి సంఖ్య ఆరు అన్నట్లుగా రవూఫ్ పదే పదే సైగలు చేశాడు. తాను కూడా తప్పేమీ చేయలేదని, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే అలా చేశానని రవూఫ్ ఇచ్చిన వివరణతో కూడా సంతృప్తి చెందని రిఫరీ అతనికి కూడా 30 శాతం జరిమానా విధించారు. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకే–47 తరహాలో బ్యాట్‌ను ఎక్కు పెట్టి సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను అలా చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఉండే ప్రాంతంలో ఏదైనా సంబరాల సమయంలో ఇలా గన్ను సరదాగా ఎక్కు పెడతారని అతను చెప్పాడు. గతంలో ధోని, కోహ్లి కూడా మైదానంలో ఇలాంటిదే చేసిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. దాంతో ఫర్హాన్‌ను రిఫరీ కేవలం హెచ్చరికతో వదిలి పెట్టారు. -
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్‌కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
టీమిండియా తస్మాత్ జాగ్రత్త!
-
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్‌పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్‌ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్‌హౌస్‌కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్‌కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025 -
ఒప్పందమా? వ్యూహాత్మకమా!
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం! ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్‌తో సౌదీ రక్షణ ఒప్పందం.అక్కరకు రాని అగ్రరాజ్యంఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్‌పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది. మిగతా దేశాలూ చేరుతాయా?!ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’. ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్‌కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్‌లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్‌ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్‌కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన. ఊహకందని పర్యవసానాలుభారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్‌తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్‌పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే. మున్ముందు అనేక మలుపులుఏమైనా... ఖతార్‌పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
Asia Cup 2025: భారత్ ప్రత్యర్థి పాక్
దుబాయ్: ‘చేతులు’ కలుపుకోలేని దాయాదులే టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్‌తో అమీతుమీకి పాకిస్తాన్ అర్హత సంపాదించింది. ఆదివారం ఈ తుది సమరం జరుగుతుంది. ఓవరాల్ ‘ఆసియా’ కప్ చరిత్రలో ఇరుజట్లు తొలిసారి ఫైనల్లో పోటీపడనున్నాయి. సెమీస్ కానీ సెమీస్‌ను తలపించిన సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. సాధారణంగా విధ్వంసరచన చేసే టి20 ఫార్మాట్‌ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి. ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హరిస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. షాహిన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా, సయీమ్ అయూబ్‌కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో తడబడి... బౌలింగ్‌తో గట్టెక్కి పాకిస్తాన్ బ్యాటింగ్‌లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు ఫర్హాన్ (4), ఫఖర్ జమన్ (13), సయీమ్ అయూబ్ (0) చేతులెత్తేశారు. తర్వాత తలత్ (3) కూడా వారిని అనుసరించగా, కెపె్టన్ సల్మాన్ ఆగా (23 బంతుల్లో 19; 2 ఫోర్లు), మొహమ్మద్ హరిస్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. నవాజ్ (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), షాహిన్ అఫ్రిది (13 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) 20 ఓవర్ల కోటా ఆడేందుకు దోహదపడ్డారు. బంగ్లా బౌలర్లు పాక్‌ను ఎలా దెబ్బకొట్టారో అదే బౌలింగ్ ఆయుధంతో పాకిస్తాన్ కూడా బంగ్లాను వణికించింది. షాహిన్ అఫ్రిది ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ (0)ను... కాసేపటికి వన్‌డౌన్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (5)ని అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ సైఫ్ హసన్ (18)ను రవూఫ్, మెహదీ హసన్ (11)ను నవాజ్ అవుట్ పెవిలియన్ చేర్చడంతో 44 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్‌లు) ఆశలు రేపినా... షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తుంచేశాడు. కెపె్టన్ జాకిర్ అలీ (5), తంజిమ్ హసన్ (10), తస్కిన్ అహ్మద్ (4)లు కూడా పాక్ బౌలర్లకు తలవంచడంతో వందలోపే (97/8) ఎనిమిది వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. -
సోనమ్ వాంగ్చుక్పై సీబీఐ ఉచ్చు.. విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు
లేహ్: లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అనంతరం..కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్‌చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలుసీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
గన్ సెలబ్రేషన్‌పై సిగ్గులేకుండా ఫర్హాన్ బలుపు కామెంట్స్..
-
పాక్ స్పిన్నర్ చిల్లర వేషాలు.. చావుదెబ్బ కొట్టిన హసరంగా
-
కర్ణుని మాదిరి జననం..! కట్‌చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్‌ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్‌లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్‌నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్‌లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్‌కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్లైన్లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్‌ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్‌కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్. (చదవండి: Sandeep Jangala: క్రికెట్ టు క్లౌడ్ కిచెన్ కమ్ కేఫ్..! చివరికి దేశంలోనే తొలి మిల్లెట్ కేఫ్‌గా..) -
పాకిస్తాన్ టీనేజర్‌కు 100 ఏళ్ల జైలుశిక్ష
లాహోర్: పాకిస్తాన్లో 17 ఏళ్ల జైన్ అలీకి న్యాయస్థానం 100 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ.12.61 లక్షల జరిమానా కూడా విధించింది. జైన్ అలీ తన సొంత తల్లి(45), సోదరుడు తైమూర్(20), ఇద్దరు సోదరీమణులు మహ్నూర్(15), జన్నత్(10)ను దారుణంగా హత్య చేశాడు. 2022లో లాహోర్‌లో ఈ ఘటన జరిగింది. ఆన్లైన్ పబ్జీ గేమ్ ఆడొద్దంటూ కుటుంబ సభ్యులు వారించడంతో జైన్ అలీ ఆగ్రహం పట్టలేక వారిని పొట్టనపెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న పిస్తోల్‌తో నలుగురిని కాల్చి చంపాడు. అప్పట్లో అతడి వయసు 14 ఏళ్లు మాత్రమే. హత్య తర్వాత పిస్తోల్ మురికికాలువలో పడేశాడు. ఈ హత్యాకాండ పాకిస్తాన్లో సంచలనం సృష్టించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జైన్ అలీ ఈ హత్య చేసినట్లు నిరూపణ అయ్యింది. అతడు నేరం అంగీకరించాడు. దాంతో లాహోర్ అదనపు సెషన్స్ జడ్జి రియాజ్ అహ్మద్ శిక్ష ఖరారుచేశారు. నాలుగు హత్యలకు గాను ఒక్కో హత్యకు 25 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నాలుగు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయన్నారు. అతడి వయసును దృష్టిలో పెట్టుకొని మరణ శిక్ష విధించడం లేదని వివరించారు. -
మళ్లీ పాక్ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్‌పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
Asia Cup 2025: గట్టెక్కిన పాకిస్తాన్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో పాకిస్తాన్‌కు కీలక విజయం దక్కింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు ఫైనల్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పోరులో పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. మొహమ్మద్ నవాజ్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హుస్సేన్ తలత్ (30 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో పాక్‌ను గెలిపించారు. సూపర్–4 దశలో వరుసగా రెండో ఓటమితో లంక ఫైనల్ అవకాశాలకు తెర పడినట్లే! ఇన్నింగ్స్ రెండో బంతికి కుశాల్ మెండిస్ (0)ను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది తన తర్వాతి ఓవర్లో నిసాంక (8)ను కూడా వెనక్కి పంపాడు. కుశాల్ పెరీరా (15)ను రవూఫ్ అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53/3కి చేరింది. ఎనిమిదో ఓవర్లో తలత్ వరుస బంతుల్లో అసలంక (20), షనక (0)లను డగౌట్ చేర్చగా, కొద్ది సేపటికే హసరంగ (15) కూడా అవుట్ కావడంతో లంక 80/6 వద్ద నిలిచింది. ఈ దశలో కమిందు, చమిక కరుణరత్నే (17 నాటౌట్) కలిసి ఏడో వికెట్‌కు 39 బంతుల్లో 43 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తలత్, రవూఫ్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పాక్‌కు సరైన ఆరంభం లభించింది. ఫర్హాన్ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఫఖర్ జమాన్ (17) తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. 12 పరుగుల వ్యవధిలో పాక్ 4 వికెట్లు కోల్పోయింది. తీక్షణ ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను వెనక్కి పంపించగా...హసరంగ తన వరుస ఓవర్లలో అయూబ్ (2), సల్మాన్ (5)లను అవుట్ చేశాడు. హారిస్ (13) కూడా నిలవలేకపోయాడు. ఈ దశలో పాక్ ఓటమి దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే తలత్, నవాజ్ కలిసి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరు 41 బంతుల్లో అభేద్యంగా 58 పరుగులు జోడించారు. -
వక్ర బుద్ధి మారదా..? మరో వివాదంలో ఆసియా కప్
-
టీమిండియాపై పాక్ ఇక మీదైనా గెలవాలంటే.. ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా చేతిలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి.. చావో రేవో అనే పరిస్థితికి చేరింది. ఈ ఓటములను పాక్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ఈ తరుణంలో పాక్ క్రికెట్ మాజీ దిగ్గజం, పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) అధినేత ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లో ఇకనైనా గెలవాలంటే.. ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని, అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఫయాజ్ ఈసా, ఎలక్షన్ కమిషనర్ రాజా ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలాగే.. థర్డ్ ఎంపైర్‌గా ఇస్లామాబాద్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని సూచించారు. పీసీబీ రాజకీయాల వల్లే పాక్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వెటకారంగా పై వ్యాఖ్యలు చేశారాయన. ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాక్ జట్టు ఓటమిపై(Pak Lost To India) ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాగైతే భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు. క్రికెట్లో ప్రణాళిక, నిబద్ధత లేకుండా గెలుపు ఊహించలేం అని అన్నారాయన. ఇష్టుల్ని సెలక్టర్లుగా పెట్టడం, గ్రూప్‌ల రాజకీయాలు, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడం.. కీలక స్థానాల్లో అర్హతలేని వారిని పెట్టడం వల్లే పతనం అయ్యిందనన్నారు. నఖ్వీ అసమర్థత, బంధుప్రీతి(నెపోటిజం) వల్లే పీసీబీకి ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పీసీబీ రాజకీయాలకు పుల్‌స్టాప్ పడాలని, ఆటగాళ్లు తమ తలపొగరు తగ్గించుకోవాలని.. టాలెంట్ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్(Ex PM Imran Khan) పలు కేసుల్లో అరెస్టై రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. దీంతో ఇమ్రాన్ తరఫున ఆయన సోదరి అలీమా ఖాన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. పీసీబీతో పాటు పాక్‌లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు అన్యాయంగా, పక్షపాతంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారాయన. పాక్ ఎన్నికల్లో పీటీఐ ఓడిపోలేదని.. ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయ నేతలతో చేతులు కలిపి మోసం చేశారని నిందిస్తున్నారాయన. పాక్ క్రికెట్‌ను మలుపు తిప్పిన ఆటగాడిగా ఇమ్రాన్ ఖాన్‌కు ఓ పేరుంది. ఆల్ రౌండర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే 1992లో పాకిస్తాన్ ప్రపంచ కప్ నెగ్గింది. 88 టెస్ట్ మ్యాచ్‌లు, 175 వన్డేలు ఆడిన ఆయన ఎన్నో విజయాలను అందించారు. తన సారథ్యంలోనే పాక్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, కొత్త తరం క్రికెటర్లను పరిచయం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగానే 2010లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం ఆయనకు దక్కింది. 1996లో పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2018 సాధారణ ఎన్నికల్లో విజయంతో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే.. 2022లో విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయి.. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీటీఐని పోటీ చేయకుండా అప్పటి కోర్టులు, ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అయినప్పటికీ వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే కౌంటింగ్‌లో తొలి రౌండ్లలో వాళ్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆపై ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను ఆపేసి గందరగోళం సృష్టించి మరీ ఫలితాలు తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఆ సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.ఇదీ చదవండి: పాక్‌కు డెడ్‌చీప్‌గా అప్పులు ఇస్తున్న దేశం ఏదో తెలుసా? -
ఫుట్‌బాల్‌లోనూ పాక్‌పై భారత్‌దే పైచేయి
కొలంబో: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత జట్టు చితక్కొట్టగా... మరోవైపు ఫుట్‌బాల్‌లోనూ పాకిస్తాన్ జట్టుపై భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్‌తో సోమవార జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దలాల్‌మువాన్ గాంగ్టే (31వ నిమిషంలో), గున్లేబా వాంగ్‌ఖెరాక్‌పమ్ (64వ నిమిషంలో), రహాన్ అహ్మద్ (74వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ జట్టుకు హంజా యాసిర్ (71వ నిమిషంలో), మొహమ్మద్ అబ్దుల్లా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి బంగ్లాదేశ్, నేపాల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్; నేపాల్‌తో భారత్ తలపడతాయి. -
Asia Cup 2025: చావో రేవో మ్యాచ్
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 దశలో తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిన రెండు జట్లు కీలక సమరానికి సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే పోరులో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన శ్రీలంక గత పోరులో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడగా... భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయింది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. సూపర్–4లో రెండో పరాజయం ఎదురైతే ముందంజ వేసే అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. ఈ నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. భారత్ చేతిలో ఓడిన మ్యాచ్‌లో ఆరంభంలో పాక్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపించింది. టాప్–3 బ్యాటర్లు ఫఖర్, ఫర్హాన్, అయూబ్ రాణించారు. అయితే జట్టు మిడిలార్డర్ మరీ పేలవంగా కనిపిస్తోంది. తలత్, నవాజ్, కెపె్టన్ సల్మాన్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. పాక్ బౌలింగ్ కూడా గొప్పగా లేదు. మరోవైపు శ్రీలంక కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లే బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. అయితే లీగ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఆ జట్టు కోలుకునే అవకాశం ఉంది. ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిసాంకపై అంచనాలు ఉండగా... బౌలింగ్‌లో చమీరా, హసలంక రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా షనక ప్రభావం చూపించాడు. ఇప్పటి వరకు ఆకట్టుకోని కెపె్టన్ అసలంక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటోంది. -
‘సమఉజ్జీల సమరం’ ఏమాత్రం కాదు!
దుబాయ్: ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం...అదే ఒకడు మీద పడిపోతే దండయాత్ర’... తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఇది. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా పాకిస్తాన్ గురించి చెప్పాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు పూర్తిగా ఏకపక్షమని అతను గుర్తు చేశాడు. అసలు ఇరు జట్ల మధ్య ఆటను ‘వైరం’తో పోల్చాల్సిన అవసరమే లేదని అతను స్పష్టం చేశాడు. భారత్, పాక్ మధ్య 2018 నుంచి జరిగిన గత 7 వన్డేల్లో భారత్ 6 గెలవగా, 1 మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇరు జట్ల మధ్య మొత్తం 15 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. వరుసగా గత 4 మ్యాచ్‌లలో మనదే పైచేయి. 2022లో ఓటమి తర్వాత రెండు ఫార్మాట్లు కలిపి మన జట్టు వరుసగా 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆధిపత్యంపై సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లకు ‘వైరం’ అనే మాటను ఇకపై వాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఇరు జట్ల మధ్య వైరం అనాల్సినంతగా పోటీ ఎక్కడ ఉంది. నా అభిప్రాయం ప్రకారం రెండు జట్ల మధ్య 15–20 మ్యాచ్‌లు జరిగి ఇద్దరూ 7–7తో సమంగా ఉండి లేదా 8–7తో కాస్త ఆధిక్యంలో ఉంటే సమ ఉజ్జీల సమరం అని చెప్పవచ్చు. కానీ సరిగ్గా అంకెలు గుర్తు లేవు కానీ ప్రస్తుతం ఇది 13–0 లేదా 10–1గా ఉంది. కాబట్టి ఇకపై ఇది అసలు పోటీనే కాదు’ అని సూర్య ఘాటుగా వ్యాఖ్యానించాడు. దూబే స్పెల్ కీలక మలుపు... పాక్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామ సమయంలో ఆట మలుపు తిరిగిందని సూర్యకుమార్ అన్నాడు. సాధారణంగా పవర్‌ప్లే తర్వాత ఆట మారుతుందని, కానీ 10–17 ఓవర్ల మధ్య తాము పాక్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యామని కెపె్టన్ చెప్పాడు. ఈ 8 ఓవర్లలో పాక్ 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా నా దృష్టిలో శివమ్ దూబే స్పెల్ ఆటను మలుపు తిప్పింది. ఈసారి అతను తనకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో దూబే బౌలింగ్‌లో బాగా శ్రమించాడు. కొత్త బంతితో కూడా సాధన చేశాడు. ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో అతను వచ్చాడు’ అని సూర్య చెప్పాడు. మరోవైపు నీరు–నిప్పులాంటి గిల్, అభిషేక్ భాగస్వామ్యంపై కూడా సారథి ప్రశంసలు కురిపించాడు. ‘అభిషేక్ బ్యాటింగ్ శైలి అలాగే ఉంటుంది. పవర్‌ప్లే తర్వాత కూడా అతను తగ్గడు. గిల్ ఎలా ఆడతాడో కూడా అందరికీ తెలుసు. ఏ రకంగానైనా అతను పరుగులు రాబట్టగలడు. మైదానం బయట కూడా మంచి స్నేహం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో వీరిద్దరు చూపించారు. నీరు–నిప్పులాంటి వీరిద్దరు కలిసి ఆడుతుంటే సమన్వయానికి ఒక కనుసైగ చాలు’ అని కెపె్టన్ వ్యాఖ్యానించాడు. ‘వాళ్లు అలా చేయడం నచ్చలేదు’ భారత్, పాక్ మ్యాచ్‌లలో సహజంగా కనిపించే కవ్వింపులు, మాటల యుద్ధం ఆదివారం మ్యాచ్‌లో కూడా కనిపించింది. వేర్వరు సందర్భాల్లో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్‌లకు హారిస్ రవూఫ్, షాహిన్ అఫ్రిదిలతో వివాదం రేగింది. దీనిపై మ్యాచ్ తర్వాత అభిషేక్ స్పష్టతనిచ్చాడు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తన వల్లే తాను స్పందించాల్సి వచి్చందని అతను చెప్పాడు. ‘ఎలాంటి కారణం లేకుండా వారు మాపైకి దూసుకొచ్చి కవి్వంచే ప్రయత్నం చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. నేను దూకుడుగా ఆడి చెలరేగడమే దానికి సరైన మందు అని భావించాను’ అని అభిషేక్ వెల్లడించాడు. తన బాల్య మిత్రుడు గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, అది జట్టు విజయానికి కారణం కావడం పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేశాక తాను గన్ షూటింగ్ తరహాలో చేసిన సంబరంలో ఎలాంటి తప్పూ లేదని పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ అన్నాడు. ‘ఆ క్షణంలో వచి్చన ఆలోచనతోనే నేను గన్ తరహాలో బ్యాట్‌తో అలా చేశాను. నేను సాధారణంగా 50 దాటినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోను. అప్పటికప్పుడు నాకు అలా చేయాలనిపించింది. జనం దాని గురించి ఎలా ఆలోచిస్తారనేది నాకు అనవసరం. దానిని నేను పట్టించుకోను’ అని ఫర్హాన్ స్పష్టం చేశాడు. -
పాకిస్తాన్‌కు చీప్‌గా అప్పు ఇస్తున్నది ఈ దేశమే..
నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహాయంపై తీవ్రంగా ఆధారపడుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, చైనా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కీలక భూమిక వహిస్తున్నా, మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌కు స్థిరమైన ఆర్థిక మద్దతును అందిస్తోంది.తక్కువ వడ్డీకే రుణాలుసౌదీ అరేబియా (Saudi Arabia) పాకిస్తాన్‌కు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇది చైనా, ఇతర అంతర్జాతీయ రుణదాతలతో పోల్చితే చాలా తక్కువ. సౌదీ రుణాల వడ్డీ రేటు చైనాకు చెల్లించే నగదు డిపాజిట్ వడ్డీ కంటే మూడింట ఒక వంతు మాత్రమే. విదేశీ వాణిజ్య రుణాల ఖర్చుతో పోలిస్తే కూడా సౌదీ రుణ ఖర్చు సగం కంటే తక్కువ.పాకిస్తాన్ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోయినా, సౌదీ అరేబియా అదనపు రుసుములు లేకుండా ప్రతి సంవత్సరం రుణ గడువును పొడిగిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణం గడువు డిసెంబర్లో ముగియనుంది. అయితే సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని మళ్లీ పొడిగించాలనే యోచనలో ఉంది.ఐఎంఎఫ్ ప్రోగ్రాం కింద పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ఇచ్చిన మరో 3 బిలియన్ డాలర్ల రుణానికి వచ్చే ఏడాది జూన్‌లో గడువు ముగుస్తుంది. పాకిస్తాన్ తన బాహ్య ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఈ రుణాన్ని తీసుకుంది.ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..! -
సొంత ప్రజలపైనే పాక్ బాంబులతో దాడి
-
pakistan: జనావాసాలపై వైమానిక దాడులు.. 24 మంది మృతి
ఖైబర్ పఖ్తుంఖ్వా: పాకిస్తాన్లో చోటుచేసుకున్న వైమానిక దాడులు అలజడులను సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన విధ్వంసకర వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వర్గాలు ధృవీకరించాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.ఖైబర్ జిల్లాలోని తిరాను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు నివాస ప్రాంతంలో బాంబులు వేసి, నిద్రపోతున్న వారిని పొట్టనపెట్టుకున్నాయి. దాడులలో గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు అధికసంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఈ బాంబు దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
ఆపరేషన్ సిందూర్ పార్ట్-2.. పార్ట్-3 కూడా ఉంటది!
ఆపరేషన్ సిందూర్ అనేది ఒక సైనిక చర్య కాదని.. అది మన దేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పశక్తికి ప్రతీక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాగని ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని.. కేవలం తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టత ఇచ్చారు. ఆఫ్రికా దేశం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశాం. ఆపరేషన్ సిందూర్ పార్ట్-2, 3 ఉంటుందా? అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. తగిన విధంగా బదులిస్తాం. ఇందుకోసం భారత సైన్యం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే రంగంలోకి దిగుతుంది’’ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనా ఆయన స్పందించారు. పీవోకేపై దాడి అవసరం లేదని.. అది స్వయంగా భారత్‌లో కలిసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.2025 ఏప్రిల్ 22న.. జమ్ము కశ్మీర్ బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ప్రకటించుకుంది(తర్వాత తాము కాదంటూ ఫ్లేట్ ఫిరాయించింది కూడా). ఈలోపు.. మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట మెరుపు దాడులతో భారత సైన్యం పాక్‌లోకి దూసుకెళ్లి.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే.. పాక్ బతిమాలి కాల్పుల విరమణకు అంగీకరించడంతో భారత్ ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. జూలై 28వ తేదీన శ్రీనగర్ దాచిగాం ప్రాంతంలో భారత సైన్యం, జమ్ము పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం సూత్రధారులు సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ(పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి), టీఆర్ఎఫ్ సభ్యులు హమ్జా అఫ్గానీ, జిబ్రాన్ మరణించారు. -
Asia Cup 2025: పాక్ ను చిత్తు చేసిన భారత్
-
మళ్లీ చితక్కొట్టి...
వారం రోజుల వ్యవధిలో వేదిక కూడా మారలేదు... భారత జట్టు మళ్లీ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది... పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది... ముందుగా చక్కటి బౌలింగ్‌తో సాధారణ స్కోరుకే పాక్‌ను పరిమితం చేసిన టీమిండియా... ఆ తర్వాత అలవోకగా గెలుపు తీరాన్ని చేరింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ భారత్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈసారి ‘షేక్‌హ్యాండ్’పై చర్చ జరగాల్సిన అవసరమే రాకుండా తమ ఆటతోనే ప్రత్యర్థికి పదునుగా జవాబిచ్చింది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) చెలరేగి భారత్ విజయాన్ని సులువు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. సూపర్–4 దశలో తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఫర్హాన్ అర్ధ సెంచరీ... భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి పాక్‌కు ఎంతో మెరుగైన ఆరంభం లభించింది. కానీ దానిని సది్వనియోగం చేసుకొని భారీ స్కోరు సాధించడంలో జట్టు విఫలమైంది. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఫఖర్ జమాన్ (15) ఎక్కువ సేపు నిలవకపోయినా, మరో ఓపెనర్ ఫర్హాన్ చక్కటి షాట్లు ఆడాడు. బుమ్రా వరుస రెండు ఓవర్లలో ఫర్హాన్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ధాటిని కొనసాగిస్తూ పాక్ బ్యాటర్లు ఒకదశలో 13 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు బాదారు. 10.2 ఓవర్లలో 93/1 స్కోరుతో పాక్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే సయీమ్ అయూబ్ (21) అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత బౌలర్లు పట్టు బిగించడంతో పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. వరుసగా 33 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! ఐదు పరుగుల వ్యవధిలో హుస్సేన్ తలత్ (10), ఫర్హాన్ అవుట్ కాగా, మొహమ్మద్ నవాజ్ (19 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)లో దూకుడు లోపించింది. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్ 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. అయితే చివరి 4 ఓవర్లలో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు సాధించి గౌరవప్రదంగా ముగించింది. ఫహీమ్ అష్రఫ్ (8 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. మెరుపు బ్యాటింగ్... ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ చెలరేగిపోయారు. తొలి బంతికే సిక్సర్‌తో అభిషేక్ జోరు మొదలు పెట్టగా, తర్వాతి రెండు ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి గిల్ తానేంటో చూపించాడు. అయూబ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో భారత్ పవర్‌ప్లేలో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు రాబట్టింది. అబ్రార్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అభిషేక్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఎట్టకేలకు భారీ భాగస్వామ్యం తర్వాత 18 పరుగుల వ్యవధిలో గిల్, సూర్యకుమార్ (0), అభిషేక్ వెనుదిరిగారు. సామ్సన్ (13) కూడా తొందరగానే అవుటైనా... తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.గత మ్యాచ్ తరహాలోనే ఈ సారి కూడా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ సమయంలో కరచాలనం చేసుకోలేదు. తమ టీమ్ షీట్లను కూడా ఇద్దరూ రిఫరీ పైక్రాఫ్ట్కే అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ‘షేక్ హ్యాండ్’లు లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నాలుగు క్యాచ్‌లు నేలపాలు... భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా పాక్ ఈ స్కోరు చేయడానికి కారణమైంది. అనూహ్యంగా మన ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. వీటిలో మూడు అతి సులువైనవి కాగా, ఒకటి కాస్త కష్టసాధ్యమైంది. అభిషేక్ శర్మ రెండు క్యాచ్‌లు (ఫర్హాన్ 0, 32 వద్ద), కుల్దీప్ (అయూబ్ 4 వద్ద), గిల్ (ఫహీమ్ 6 వద్ద) వదిలేయడం చూసి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తలపట్టుకున్నాడు! పాకిస్తాన్ మారదు! గత మ్యాచ్‌లో భారత జట్టు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాక్ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ బ్యాట్‌ను ఏకే–47 గన్ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది. స్కోరు వివరాలుపాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 58; ఫఖర్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 15; అయూబ్ (సి) అభిషేక్ (బి) దూబే 21; హుస్సేన్ (సి) వరుణ్ (బి) కుల్దీప్ 10; నవాజ్ (రనౌట్) 21; సల్మాన్ (నాటౌట్) 17; ఫహీమ్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–21, 2–93, 3–110, 4–115, 5–149. బౌలింగ్: పాండ్యా 3–0–29–1, బుమ్రా 4–0–45–0, వరుణ్ చక్రవర్తి 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–31–1, అక్షర్ 1–0–8–0, శివమ్ దూబే 4–0–33–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రవూఫ్ (బి) అబ్రార్ 74; గిల్ (బి) ఫహీమ్ 47; సూర్యకుమార్ (సి) అబ్రార్ (బి) రవూఫ్ 0; తిలక్ (నాటౌట్) 30; సామ్సన్ (బి) రవూఫ్ 13; పాండ్యా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–123, 4–148. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 3.5–0–40–0, అయూబ్ 3–0–35–0, అబ్రార్ 4–0–42–1, రవూఫ్ 4–0–26–2, ఫహీమ్ 4–0–31–1. -
Ind VS Pak Super 4 Match: పాక్‌ను చిత్తు చేసిన భారత్
పాక్‌ను మరోసారి చిత్తు చేసిన భారత్ఆసియా కప్-2025లో టీమిండియా పాక్‌ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), తిలక్ వర్మ (30 నాటౌట్) కూడా రాణించారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్16.4వ ఓవర్- 148 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్12.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యాడు. అభిషేక్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో హరీస్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తిలక్ వర్మకు (1) జతగా సంజూ శాంసన్ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్10.3వ ఓవర్- హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో అబ్రార్ అహ్మద్ క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా అబ్రార్ చేతుల్లోకి వెళ్లింది. భారత్ స్కోర్ ప్రస్తుతం 106/2గా ఉంది. అభిషేక్‌కు (58) జతగా తిలక్ వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్9.5వ ఓవర్- 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు (57) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గిల్ 35, అభిషేక్ 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు ఇంకా 84 బంతుల్లో 103 పరుగులు మాత్రమే చేయాలి. విధ్వంసం సృష్టిస్తున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. గిల్ 22, అభిషేక్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 9/0గా ఉంది. అభిషేక్ 8, గిల్ 1 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే ఇచ్చింది. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కాస్త పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్‌ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు అక్షర్ పటేల్‌తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్న భారత బౌలర్లు11.2 ఓవర్లలోనే 100 పురుగులు పూర్తి చేసి భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాక్‌కు భారత బౌలర్లు పగ్గాలు వేశారు. 19 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 159/5గా మాత్రమే ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్14.1వ ఓవర్- 115 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్‌లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ (58) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పాక్13.1వ ఓవర్-110 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ తలాత్ (10) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఎట్టకేలకు క్యాచ్ పట్టిన అభిషేక్ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు వదిలేసిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఓ క్యాచ్ పట్టుకున్నాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో సైమ్ అయూబ్ (21) ఆడిన షాట్‌ను అభిషేక్ కష్టమైనా క్యాచ్‌గా మలిచాడు. 10.3 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 93/2గా ఉంది. ఫర్హాన్‌కు (53) జతగా హుస్సేన్ తలాత్ క్రీజ్‌లోకి వచ్చాడు. పాక్ ఓపెనర్ మెరుపు హాఫ్ సెంచరీపాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/1గా ఉంది. ఫర్హాన్‌తో (52) పాటు సైమ్ అయూబ్ (21) క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. మరో క్యాచ్ జారవిడిచిన అభిషేక్తొలి ఓవర్లో ఈజీ క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో మరో క్యాచ్ జారవిడిచాడు. క్యాచ్ పట్టకపోగా బంతి బౌండరీ ఆవల పడింది (సిక్సర్). 8 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 70/1గా ఉంది. ఫర్హాన్ 39, సైమ్ అయూబ్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు డ్రాప్ క్యాచ్‌లు.. పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసిన పాకిస్తాన్భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్‌లు డ్రా చేయగా, పాకిస్తాన్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసింది. 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఈజీ క్యాచ్ జారవిడిచిన కుల్దీప్4.4వ ఓవర్- వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సైమ్ అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కుల్దీప్ యాదవ్ జారవిడిచాడు. 5 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/1గా ఉంది. ఫర్హాన్ 20, సైమ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అభిషేక్ శర్మ కూడా ఓ ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. హార్దిక్ బౌలింగ్‌లో ఫకర్ ఔట్పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (15) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్దిక్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఫకర్ ఆడదామా.. వ ద్దా అనే అనుమానంతో బ్యాట్ ను పెట్టాడు. ఆ బంతి ఫకర్ బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ సంజూ చేతుల్లో పడింది. అయితే దీనిపై కాస్త అనుమానం వచ్చింది. అది సంజూ శాంసన్ గ్లౌజ్‌లో పడే ముందు నేలను తాకినట్లు అనిపించింది. కానీ అది నేలను తాకకుండా సంజూ ఫింగర్స్‌ను తాకుతూగ్లౌజ్లో పడటంతో ఫకర్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై ఫకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.తొలి ఓవర్లోనే పాక్ ఓపెనర్‌కు లైఫ్పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఫకర్ జమాన్ రెండు బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/0గా ఉంది. ఫకర్ 11, ఫర్హాన్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఫమీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ -
అదో గల్లీ జట్టు.. భారత్-పాక్ హోరాహోరీ సమరాలు ఇక చరిత్రే..!
ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగబోయే సూపర్ 4 మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుపై భారత మాజీ సెలెక్టర్, వరల్డ్‌కప్ విన్నిర్ (1983) కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టు చెన్నై లోకల్ లీగ్‌లో 7వ డివిజన్ జట్టులా ఉందని అన్నారు.ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాక్ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు.ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఇకపై జనాన్ని ఆకర్షించవని అన్నారు. భారత్-పాక్ హోరీహోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయపడ్డారు. హెస్సన్ లాంటి కోచ్ వల్ల కూడా పాక్‌కు ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించారు.శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజంగానే తమ జట్టు గల్లీ జట్ల కంటే హీనంగా ఉందని అంటున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇంత దారుణమైన జట్టును చూడలేదని చర్చించుకుంటున్నారు.కాగా, ప్రస్తుత ఆసియా కప్‌లో పాకిస్తాన్ చచ్చి చెడి సూపర్ 4కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఒమన్‌పై ఘనంగా గెలిచినా.. టీమిండియా చేతిలో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూఏఈ చేతిలో భంగపాటును తృటిలో తప్పించుకుంది. -
సండే గ్రేట్ వార్.. మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్
-
భారత్ దాడి చేస్తే.. సౌదీ మాకు అండగా వస్తుంది
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ చెబుతున్నారు. -
‘నో షేక్ హ్యాండ్’ తర్వాత మరో సమరం
దుబాయ్: ఆసియా కప్‌లో సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ సూపర్–4 దశలో భాగంగా జరిగే పోరులో ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. ఏకపక్షంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ అలవోక విజయం సాధించి తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఓటమి అనంతరం పాక్ క్రికెటర్లతో మన ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చేందుకు నిరాకరించడం, తదనంతర పరిణామాల్లో పాక్ తీవ్ర అసంతృప్తి ప్రదర్శించి వివాదానికి దారి తీయడం జరిగాయి. ఈ నేపథ్యంలో దాయాది జట్ల పోరు సహజంగానే ఆసక్తిని రేపుతోంది. లీగ్ దశలో పాక్ ఆటతీరు చూస్తే టీమిండియాకు మళ్లీ ఎదురు ఉండకపోవచ్చు. దుబాయ్‌లో రికార్డు, పరిస్థితి బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మరో వైపు పాక్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఐసీసీ ఈ మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేయడం విశేషం. అక్షర్ దూరం! ఒమన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇద్దరు కీలక ఆటగాళ్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతినిచ్చింది. వీరిద్దరు పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం ఖాయం. అయితే ఫీల్డింగ్ చేస్తూ తలకు దెబ్బ తగిలిన అక్షర్ పటేల్ ఆడటం సందేహంగానే ఉంది. కాబట్టి అర్ష్ దీప్, హర్షిత్ రాణాలలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. మిగతా తుది జట్టు కూర్పులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అభిషేక్ శర్మ దూకుడును నిలువరించడం పాక్‌కు కష్టం కావచ్చు. అయితే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ వరుస వైఫల్యం ఒక్కటే జట్టులో ఆందోళన కలిగించే అంశం. మూడు మ్యాచుల్లోనూ అతను విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి నెమ్మదిగా ఆడినా...సత్తా చాటే స్థాయి సామ్సన్‌కు ఉంది. సూర్యకుమార్, పాండ్యా, దూబే, తిలక్ వర్మ బ్యాటింగ్ పదును కలిసొస్తే టీమిండియాకు ఎదురుండదు. బుమ్రా, కుల్దీప్, వరుణ్‌లు ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థులు. గెలిపించేదెవరు! బలహీన జట్లపై కూడా వంద పరుగులు దాటేందుకు పాకిస్తాన్ తిప్పలు పడుతోంది. ఇలాంటి స్థితిలో భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నా... అది అంత సులువు కాదు. ప్రధాన బ్యాటర్ అయిన అయూబ్ మూడు మ్యాచ్‌లలో డకౌట్ కాగా, ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోతున్నారు. అసలు ఏ బ్యాటర్ నుంచి కూడా టి20 తరహా మెరుపులు రావడం లేదు. ఫర్హాన్, హసన్, హారిస్ ప్రభావం చూపకపోగా, కెప్టెన్ సల్మాన్ ఆగాలో కూడా అలాంటి ధాటి లేదు. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తుండగా... మిగతా బౌలర్లలో ఎలాంటి పదును లేదు. రవూఫ్, అబ్రార్‌లను భారత్ సునాయాసంగా ఎదుర్కోగలదు. ఈ స్థితిలో పాక్ ఎలా కోలుకుంటుందో చూడాలి. -
Asia Cup 2025: భారత్‌తో సూపర్-4 మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ పంచ్..!
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ పంచ్ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదంలో పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వలేదు (టాస్ సందర్భంగా, మ్యాచ్ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై పడింది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరన్న భారత మేనేజ్మెంట్ సందేశాన్ని పాక్ కెప్టెన్‌కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్‌కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్‌కాట్ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్‌లకైనా పైక్రాఫ్ట్‌ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్‌కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్‌కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్ జట్టు ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్ ఇచ్చింది.గత మ్యాచ్ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్‌తో జరుగబోయే సూపర్-4 మ్యాచ్‌కు మరోసారి పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్-4 మ్యాచ్‌కు ముందే పాక్ ఢీలా పడిపోయింది. కాగా, రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్తాన్‌ను దాటేసి సోలోగా ప్రపంచ రికార్డు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ పసికూన ఒమన్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక దేశాలపై (19) విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు భారత్, పాకిస్తాన్ (18) పేరిట సంయుక్తంగా ఉండేది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక దేశాలపై విజయాలు సాధించిన జట్లుభారత్- 19 దేశాలు (166 విజయాలు)పాకిస్తాన్- 18 దేశాలు (156 విజయాలు)న్యూజిలాండ్- 17 దేశాలు (123 విజయాలు)ఆస్ట్రేలియా- 16 దేశాలు (119 విజయాలు)సౌతాఫ్రికా- 15 దేశాలు (112 విజయాలు)ఇంగ్లండ్- 15 దేశాలు (110 విజయాలు)అంతర్జాతీయ టీ20ల్లో భారత్ టెస్ట్ హోదా కలిగిన దేశాలతో పాటు చాలా అసోసియేట్ సభ్య దేశాలను మట్టికరిపించింది.టీ20ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసిన దేశాలుఆస్ట్రేలియా- 32 మ్యాచ్‌ల్లో 20 విజయాలుశ్రీలంక- 32 మ్యాచ్‌ల్లో 21 విజయాలుసౌతాఫ్రికా- 31 మ్యాచ్‌ల్లో 18 విజయాలువెస్టిండీస్- 30 మ్యాచ్‌ల్లో 19 విజయాలుఇంగ్లండ్- 29 మ్యాచ్‌ల్లో 17 విజయాలున్యూజిలాండ్- 25 మ్యాచ్‌ల్లో 12 విజయాలుపాకిస్తాన్- 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలుజింబాబ్వే- 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలుబంగ్లాదేశ్- 17 మ్యాచ్‌ల్లో 16 విజయాలుఆఫ్ఘనిస్తాన్- 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలుఐర్లాండ్- 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలుహాంగ్కాంగ్- 1 మ్యాచ్‌లో 1 విజయంనమీబియా- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుయూఏఈ- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుస్కాట్లాండ్- 1 మ్యాచ్‌లో 1 విజయంనెదర్లాండ్స్- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుఒమన్- 1 మ్యాచ్‌లో 1 విజయంనేపాల్- 1 మ్యాచ్‌లో 1 విజయంకెన్యా- 1 మ్యాచ్‌లో 1 విజయంమొత్తంగా 19 దేశాలపై 250 మ్యాచ్‌లు ఆడి 166 విజయాలు సాధించిన భారత్, పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా, అత్యధిక విజయాల శాతం (66) కలిగిన జట్టుగా చలామణి అవుతుంది.పొట్టి ఫార్మాట్లో రెండు ప్రపంచకప్‌లు (2007, 2024) గెలిచిన భారత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నంబర్ వన్ జట్టుగా (ర్యాంకింగ్స్‌లో) కొనసాగుతుంది. అలాగే ఈ ఫార్మాట్లో అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లే టాప్ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నంబర్ వన్‌గా ఉన్నారు. -
భారత్ టార్గెట్‌గా పాక్ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం
ఇస్లామాబాద్: భారత్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్‌తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్‌కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.Pakistan Defence Minister Khawaja Asif claims that Saudi Arabian troops will get involved if there is a military confrontation between India and Pakistan as part of new Pakistan-Saudi Military pact even though no countries have been named in the pact as aggressors. pic.twitter.com/AxPwHTNOef— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 19, 2025చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్‌ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్ దేశాలు కూడా ఈ డీల్ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్‌కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.🇵🇰🇸🇦 Saudis are under defense by nuclear missiles now!Pakistani Defense Minister Khawaja Asif said Pakistan’s nuclear capabilities would be available under the new Pakistan-Saudi mutual defence pact“What we have, our capabilities, will absolutely be available under this pact” pic.twitter.com/V5MJrnKtDw— Unbiased, Unreported News (@Kiraguri254) September 20, 2025ఇక, కొన్ని నెలల క్రితం భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్‌లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్‌తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. -
‘లష్కరే’ కేంద్రం ధ్వంసం నిజమే!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీ కారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థలు కకావికలమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై నోరువిప్పుతున్నాయి. భారత సైన్యం దాడులతో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ఇప్పటికే అంగీకరించాడు. వైమానిక దాడుల్లో బహవల్పూర్ స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని మరో ముష్కర ముఠా లష్కరే తోయిబా కమాండర్ ఖాసిం కూడా తాజాగా స్పందించాడు. ఆపరేషన్ సిందూర్ కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమ ప్రధాన కేంద్రం ‘మర్కజ్ తయిబా’ ధ్వంసమైందని వెల్లడించాడు. మే 7న జరిగిన దాడుల్లో మురిద్కే పట్టణంలోని ఈ కేంద్రం నామరూపాల్లేకుండా పోవడంతో మళ్లీ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ధ్వంసమైన భవనం కంటే.. ఈసారి భగవంతుడి దయతో పెద్ద భవనం నిర్మిస్తున్నామని తెలియజేశాడు. మర్కజ్ తయిబా శిథిలాలపై నిలబడి ఖాసిం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. పాక్ భూభాగంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జిల్లాలో మురిద్కే పట్టణం ఉంది. మర్కజ్ తయిబాలో ముజాహిదీన్లు(ఉగ్రవాదులు), తలాబాలకు(విద్యార్థులు) శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. దౌరా–ఇ–సుఫాలో చేరండి మర్కజ్ తయిబాలో దౌరా–ఇ–సుఫాలో చేరాలంటూ పాకిస్తాన్ యువతకు లష్కరే తోయిబా ఖాసిం పిలుపునిస్తున్న మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దౌరా–ఇ–సుఫా అనేది ఉగ్రవాద శిక్షణ కార్యక్రమం. ఇక్కడ జిహాదీ శిక్షణలో భాగంగా మత విద్య కూడా బోధిస్తారు. తమ స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సహకరిస్తున్నాయని, నిధులు అందజేస్తున్నాయని లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ వెల్లడించడం గమనార్హం. లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని మళ్లీ నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు సైతం ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న జరిగే ‘కశ్మీర్ సంఘీభావ దినం’ నాటికి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, లాంఛనంగా ప్రారంభించాలని లష్కరే తోయిబా ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వాకు పాక్ ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో కనీసం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంపై పాక్ ఉగ్రవాద సంస్థలు దృష్టిపెట్టాయి. తమ ప్రధాన కేంద్రాలను ఖైబర్ పఖ్తూంక్వా(పీకేపీ) ప్రావిన్స్‌కు తరలిస్తున్నారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వా అనేది ఎత్తయిన కొండలతో నిండిన శత్రుదుర్భేద్య ప్రాంతం. అఫ్గానిస్తాన్‌కు సమీపంలో ఉండడం ఉగ్రవాదులకు అనుకూలించే అంశం. జిహాదీ శక్తులకు ఇది ప్రధాన అడ్డా. భారత సైన్యం వైమానిక, క్షిపణి దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఖైబర్ పఖ్తూంక్వాకు తరలి వెళ్లడమే సరైన వ్యూహమని పాక్ ఉగ్రవాద సంస్థలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. -
సౌతాఫ్రికా ఓపెనర్ల సరికొత్త చరిత్ర.. పాక్ గడ్డపై రికార్డుల మోత
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, తంజిమ్ బ్రిట్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డుల్లోకెక్కారు. అలాగే పాకిస్తాన్ గడ్డపై వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు.లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 19) పాకిస్తాన్, సౌతాఫ్రికా మహిళా జట్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్, లారా తొలి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఏ వికెట్‌కైనా ఆరో అత్యధిక భాగస్వామ్యం.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు భారత జోడీ పేరిట ఉంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు (టాప్-6)దీప్తి శర్మ-పూనమ్ రౌత్ (భారత్, 320, తొలి వికెట్‌కు)కెర్-క్యాస్పరెక్ (న్యూజిలాండ్, 295, రెండో వికెట్‌కు)టేలర్-బేమౌంట్ (ఇంగ్లండ్, 275, రెండో వికెట్‌కు)టేలర్-అట్కిన్స్ (ఇంగ్లండ్, 268, తొలి వికెట్‌కు)టిఫెన్-బేట్స్ (న్యూజిలాండ్, 262, రెండో వికెట్‌కు)వోల్వార్డ్ట్-బ్రిట్స్ (సౌతాఫ్రికా, 260, రెండో వికెట్‌కు)మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. తంజిమ్ బ్రిట్స్ 171 పరుగులతో (141 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా ఉండగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 100 పరుగులు (129 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔటైంది. పాక్ బౌలర్లలో డయానా బేగ్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, సౌతాఫ్రికా మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చితు చేసింది. మూడో వన్డే లాహోర్‌లోనే సెప్టెంబర్ 22న జరుగనుంది. -
‘పాకిస్థాన్‌లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది’
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సన్నిహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా (Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఉంటే తనకు తన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ఫారిన్ పాలసీపై జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా మాట్లాడారు. భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్‌తో సహా ఇతర దేశాలతో తన సంబంధాలను మెరుపరుచుకోవాలని తెలిపారు. భారత్ విదేశాంగ విధానంపై నా అభిప్రాయం ప్రకారం.. భారత్ తొలుత పొరుగు దేశాలతో సంబంధాలపై దృష్టి పెట్టాలి. నేను పాకిస్థాన్‌కు వెళ్లాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను. పాక్‌తో పాటు బంగ్లాదేశ్,నేపాల్‌కు వెళ్లాను. అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతే కలిగింది’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నానన్న ఫిలింగ్ లేదు. నాకు నా ఇంట్లో ఉన్నట్లు అనిపించిందని అన్నారు. పిట్రోడా చేసిన పైవ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. పహల్గాం ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోవడం, ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టడం వంటి సున్నిత పరిణామాల తర్వాత పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. “I've been to Pak, and I must tell you, I felt at home,” says Sam Pitroda.Frankly hate such stories. But why does Pitroda always offer such moronic full-tosses to BJP, even if his point is nuanced? Damages his party every time he opens his mouth. pic.twitter.com/ZDbEdu8sIu— Shiv Aroor (@ShivAroor) September 19, 2025 -
ముసుగు పూర్తిగా తొలగింది.. ఇరకాటంలో పాక్!
అబ్బే.. ఆపరేషన్ సిందూర్‌తో మా భూభాగంలో వేటికి డ్యామేజ్ కాలేదు. పైగా ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్తో కౌంటర్ ఆపరేషన్ చేసి భారత యుద్ధ విమానాలను నేలకూల్చాం.. ఇదీ ఇప్పటికీ పాకిస్థాన్ చెబుతున్న మాట. కళ్లెదుట ఉగ్రస్థావరాలు, సైనిక శిబిరాలు నేలమట్టం అయిన ఆధారాలు కనిపిస్తున్నా కూడా పాక్ ఈ వాదన నుంచి పక్కకు పోవడం లేదు. ఈ క్రమంలో పాక్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో తమ స్థావరం ధ్వంసమైందంటూ ఇటీవల జేషే కమాండర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది చర్చలో ఉండగానే.. తాజాగా లష్కరే తాయిబా అలాంటి ప్రకటనే చేసింది. ముర్దిక్‌లో తమ స్థావరం భారత దాడుల్లో నాశనమైందంటూ ఎల్ఈటీ కమాండర్ ఖాసిమ్ అంగీకరించాడు. ఈ మేరకు ఓ వీడియో సైతం అతను పోస్ట్ చేశాడు.ఇది మళ్లీ నిర్మాణంలో ఉంది. అల్లా కృపతో ఇది ముందుకన్నా పెద్దదిగా నిర్మించబడుతుంది. ఈ శిబిరంలో ముజాహిదీన్, తాలిబులు (students) శిక్షణ పొందారని కూడా వెల్లడించాడు. అయితే.. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భవనం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడంలేదని చెబుతున్నప్పటికీ.. LeT డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో పాక్ ప్రభుత్వం, ఆర్మీ ఈ కేంద్రాన్ని పునర్నిర్మించేందుకు నిధులు అందించాయని చెప్పడం కొసమెరుపు. దీంతో.. తమ భూభాగంలో ఉగ్ర స్థావరాలే లేవంటూ అసత్యాలు వల్లెవేస్తోన్న పాక్ ముసుగు తొలగిందని, ఉగ్ర సంస్థల బహిరంగ ప్రకటన చెంపపెట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ 2025 మే 7న భారత సాయుధ దళాలు చేపట్టిన మెరుపు దాడి. ఇది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నాయి. ఈ దాడితో లష్కరే తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి సంస్థల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.🇵🇰 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 | LeT deputy chief and Pehelgam attack mastermind Saifullah Kasuri has issued a another threat from Pakistan, vowing 'revenge' against India. Likely a per-recorded video from a safe location. He won't survive for long if he keep talking. https://t.co/QYp9V5rDJ7 pic.twitter.com/bCrCsslUvj— Conflict Monitor (@ConflictMoniter) September 17, 2025🚨 🇵🇰👺 After Jaish commander ilyas kashmiri now Lashkar-e-Taiba Commander Qaasim has torn apart Pakistan’s lies on Muridke terror camps.👉 Standing in front of the demolished Markaz E Taiba camp, which destroyed in #OperationSindoor, he admits that many terrorists… pic.twitter.com/S80p9wLSFy— OsintTV 📺 (@OsintTV) September 19, 2025🇵🇰 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 | Jaish-e-Mohammed (JeM) commander Masood Ilyas Kashmiri admits that Masood Azhar’s family was 'torn to shreds' in the 7 May Bahawalpur airstrike by IAF. pic.twitter.com/WKc9QRYXpZ— Conflict Monitor (@ConflictMoniter) September 16, 2025 -
మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి
-
పాక్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం...
దుబాయ్/ఇస్లామాబాద్: పాకిస్తాన్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందం వల్ల భారత్‌పై ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ భారత్‌పై తమపై దాడికి దిగితే ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సైన్యం తమకు మద్దతుగా నిలస్తుందని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే పాక్ ఆశలు నెరవేరే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్, సౌదీ అరేబియాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయి. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. ఏ దేశమైనా తమపై దాడికి దిగితే ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, ఫలానా దేశం అంటూ పేర్లు ప్రస్తావించలేదు. ఇండియాకు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా. 2024–25లో ఇరుదేశాల మధ్య 41.88 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. పాక్–సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం దాదాపు 4 బిలియన్ డాలర్లే. పాకిస్తాన్ కోసం భారత్‌పై సౌదీ అరేబియా యుద్ధం చేసే అవకాశం లేదన్నది నిపుణుల అంచనా. పాక్, సౌదీ అరేబియా తాజా ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోణంలో చూడాలని చెబుతున్నారు. ఇజ్రాయెల్ గనుక పాక్‌పై దాడికి పాల్పడితే ఒప్పందం ప్రకారం పాక్‌కు మద్దతుగా సౌదీ అరేబియా సైన్యం రంగంలోకి దిగుతుందని పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అరబ్ దేశాలు–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఇప్పటిదాకా నాలుగు యుద్ధాలు జరిగాయి. మూడుసార్లు భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాక్‌కు అండగా సౌదీ అరేబియా ఏనాడూ జోక్యం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇదీ ఒప్పందంఅణ్వాయుధ దేశం పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’పై రెండు దేశాలు బుధవారం సంతకాలు చేశాయి. దీనివల్ల ఇరుదేశాల మధ్య రక్షణ బంధం మరింత బలపడనుంది. ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం అండగా నిలుస్తుంది. పాక్, సౌదీ అరేబియాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్లేనని పరిగణిస్తాయి. రక్షణ రంగంలో పాక్, సౌదీ అరేబియా దశాబ్దాలుగా సహకరించుకుంటున్నాయి. ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ఎవరైనా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉమ్మడి పోరాటం సాగించడం ఒప్పందం అసలు ఉద్దేశమని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని గల్ఫ్ అరబ్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ గతవారం ఖతార్‌లోని దోహా నగరంలో వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చల్లో పాల్గొన్న హమాస్ నేతలను అంతం చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఉన్నట్లు అరబ్ దేశాలు భావిస్తున్నాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతోపాటు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా నుంచి సెక్యూరిటీ గ్యారంటీ ఇకపై ఆశించినంతగా ఉండకపోవచ్చని అంచనాకొచ్చాయి. అందుకే పొరుగు దేశాలతో రక్షణ ఒప్పందాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం: సౌదీ అధికారి ఎన్నో ఏళ్ల చర్చల తర్వాతే పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదిరినట్లు సౌదీ అరేబియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏవో కొన్ని దేశాలు లేదా కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని జరిగిన ఒప్పందం కాదని స్పష్టంచేశారు. తమ రెండు దేశాల మధ్యనున్న దీర్ఘకాల, లోతైన సహకారాన్ని వ్యవస్థీకృతంగా మార్చుకోవాలన్నదే అసలు లక్ష్యమని వివరించారు. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–సౌదీ అరేబియాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన సంబంధాలు ఇప్పుడున్నాయని వెల్లడించారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పని చేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్లతో సంబంధాల విషయంలో సమతూకం పాటించాలన్నదే తమ విధానమని తెలిపారు. పాక్ ప్రభుత్వం అణు శక్తిని సౌదీ అరేబియాకు అందజేయడానికి అంగీకరించిందా? అని ప్రశ్నించగా.. ఇది సమగ్ర రక్షణ ఒప్పందమని, సైనికపరంగా అన్ని అంశాలూ దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేశారు. అధ్యయనం చేస్తాం: రణదీర్ జైస్వాల్ పాక్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ స్పందించారు. ఈ పరిణామంపై తమకు అవగాహన ఉందని వెల్లడించారు. భారతదేశ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఈ ఒప్పందం చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్’లో పోస్టు చేశారు. -
అద్దెకు అణుబాంబు! సౌదీకి పాక్ అణ్వాయుధాలు?
రక్షణ ఒప్పందంపై షరీఫ్, సల్మాన్ సంతకాలు. ‘ఇస్లామిక్ నాటో’ దిశగా ముందడుగు? భావి విపరిణామాలపై భారత్ అధ్యయనం. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాల్లో మారనున్న సమీకరణాలు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తమ ఇరు దేశాల మధ్య ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ (ఎస్ఎండీఏ) కుదుర్చుకున్నారు. ఇది ‘నాటో’ కూటమి నిబంధనల్లోని ఆర్టికల్ 5 లాంటిదే. పాక్, సౌదీ... ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడికి దిగినా ఆ రెండు దేశాలపై దాడికి పాల్పడినట్టే. సౌదీపై ఏ దేశమైనా దాడికి తెగబడితే పాకిస్థాన్ మీదా దండెత్తినట్టే. పాక్ మీద ఏ దేశమైనా దాడికి దిగితే సౌదీపైనా యుద్ధం ప్రకటించినట్టే. సౌదీ అరేబియాతో పాక్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం సారాంశమిదే. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారుచేస్తే, తాము కూడా సాధ్యమైనత త్వరలో అణుబాంబు రూపొందిస్తామని 2018లో ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన ప్రకటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఇరాన్-సౌదీ అరేబియా నడుమ శతృత్వం ఉంది. అటు ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే సమయంలో ఇరుగుపొరుగు దేశాలైన భారత్-పాక్ దాయాదులనే అంశాన్ని విస్మరించకూడదు. పాక్-సౌదీ తాజా ఒప్పందాన్ని పరిశీలిస్తే... ‘భవిష్యత్తులో ఆపరేషన్ సిందూర్’ లాంటి సందర్భాల్లో పాక్ కు సౌదీ సాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాక్-సౌదీ తాజా ఒప్పందం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అధ్యయనం చేసే పనిలో భారత్ పడింది. మొత్తంమీద ఈ పరిణామం అటు మధ్యప్రాచ్యంలో, ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. పాక్-సౌదీ ‘అణు’బంధం ఏనాటిదో! సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను గానీ, అణు పరిజ్ఞానాన్ని గానీ పాక్ బదిలీ చేసినట్టు ఆధారాలు లేకపోయినప్పటికీ ... అందుకు గల అవకాశాలపై మాత్రం రక్షణ వర్గాల్లో దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. సౌదీ-ఇరాన్ వైరం, మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భౌగోళికంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, ఇరాక్ వంటి శత్రుదేశాలు సౌదీ చుట్టూ మోహరించాయి. మరోవైపు సౌదీ కూడా ఏదైనా సున్నీ ముస్లిం దేశపు గట్టి భాగస్వామ్యం కోసం నిరీక్షిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో శాంతి, సామరస్యాల కోసం ఇటీవల మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ 2023 అక్టోబరు నుంచి గాజాలో మొదలైన యుద్ధం, అమెరికా మళ్లీ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం వంటివి మధ్యప్రాచ్యంలో పెను మార్పులకు దోహదం చేశాయి. నిఘా సమాచారం పంచుకోవడం, సైబర్ సెక్యూరిటీ పరంగా సహకారం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ వంటి అంశాలు పాక్-సౌదీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. అణ్వాయుధాల ప్రస్తావన ఒప్పందంలో లేకున్నప్పటికీ భవిష్యత్తులో ప్రాంతీయంగా ముప్పు తలెత్తితే అది అణు సహకారానికి కూడా దారితీయవచ్చనేది విశ్లేషకుల భావన. అంటే తమకు ముప్పు వాటిల్లే పక్షంలో రక్షణార్థం అమెరికా యుద్ధనౌకల కోసం సౌదీ ఎదురుచూడాల్సిన అగత్యం ఉండబోదు. తనకంటూ తన చేతిలో ఓ ఆయుధాన్ని సౌదీ సిద్ధం చేసుకునే ప్రయత్నమే ఇది. ట్రంప్ పాలనా యంత్రాంగానికి ఇది ఎదురుదెబ్బ మాత్రమే కాదు... చెంపపెట్టు కూడా! చారిత్రకంగా చూస్తే పాక్-సౌదీ నడుమ 1970ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయి. పాక్ కు ఆర్థిక సాయం, చౌకగా చమురు, సైనిక తోడ్పాటును సౌదీ అరేబియా అందించింది. ప్రతిగా పాక్ వేలాదిగా తమ సైనిక బలగాలను సౌదీలో మోహరించి ఆ దేశ సైనికులకు శిక్షణ ఇచ్చింది. మక్కా, మదీనా పరిరక్షణ కోసం తమ జవాన్లను తరలించింది. పాక్ రక్షణ రంగంలో సౌదీ భారీగా పెట్టుబడులు పెట్టింది. పాక్ అణు కార్యక్రమానికి వంద కోట్ల డాలర్ల పైగా నిధులను సౌదీ సమకూర్చినట్టు సీఐఏ అధికారి ఒకరు 1980లలో పేర్కొన్నారు. 1980ల నుంచి పాకిస్థాన్ ఆర్థిక, సైనిక రంగాలకు 30 బిలియన్ డాలర్లకు పైగా సౌదీ సాయం చేసినట్టు ‘ది యూరేషియన్ టైమ్స్’ వెల్లడించింది. ఆయుధాలు, ప్రాజెక్టుల రూపేణా 5-10 బిలియన్ డాలర్ల మేర సౌదీ అరేబియా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని, 100 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన పాక్ కు ఇది ఉపశమనం కలిగించవచ్చని అంచనా. అలాగని ఇది సౌదీ సాయం చేసినట్టేమీ కాదు! పాక్ నియంత్రణ సౌదీ చేతిలోనే ఉంటుంది. కారుకు ఇంధనం నింపి తాళంచెవిని సౌదీ తన చేతిలో పెట్టుకోవడం లాంటిది ఇది! ఇటు పాక్ వైపు నుంచి కూడా పోయేదేమీ లేదు. దాని వైమానిక దళానికి సౌదీ సాంకేతికత అందుతుంది. ప్రమాదాలను గుర్తించేలా రాడార్స్ అమర్చిన విమానాలు, సరిహద్దుల్లో తాలిబాన్ గ్రూపులకు సంబంధించిన నిఘా సమాచారం లభిస్తాయి. పాక్ వైమానిక బలహీనతలను భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో సౌదీతో సరికొత్త చెలిమి దానికి బలం కల్పించేదే. ఇక్కడ కేవలం విశ్వసనీయతే కాదు... డబ్బు అంశమూ ముడిపడివుంది. ఒకవేళ సౌదీ అరేబియాపై ఇజ్రాయెల్ దాడి చేసిందనుకుందాం. అప్పుడు సౌదీకి మద్దతుగా పాక్ ఎంత దీటుగా పోరాడుతుందనేది సౌదీ నుంచి ఆ దేశానికి పారే ‘నిధుల ప్రవాహం’పై ఆధారపడి ఉంటుంది! సౌదీకి పాక్ అణు కవచం!భవిష్యత్తులో తనకు అవసరమైతే పాక్ నుంచి అణ్వాయుధాలను పొందేలా సౌదీకి రహస్య ఒప్పందం ఉందన్న ఊహాగానాలు ఈనాటివి కావు. 2003లో అప్పటి సౌదీ యువరాజు అబ్దుల్లా పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రహస్య అణు ఒప్పందంపై చర్చలు సాగినట్టు పాక్ వర్గాలు 2003లో వెల్లడించాయి. ‘సౌదీకి పాక్ అణ్వాయుధాలు- బదులుగా పాక్ కు సౌదీ చమురు’… ఆ చర్చల ప్రధానాంశమని నాడు వార్తలు వెలువడ్డాయి. అయితే తమ మధ్య అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని రెండు దేశాలు స్పష్టీకరించాయి. శాంతియుత ప్రయోజనాల కోసమే తమకు అణుశక్తి అవసరమని సౌదీ చెబుతూ వస్తోంది. 16 అణు రియాక్టర్లు నిర్మించాలన్న తన ప్రణాళికలను అది 2010లో ప్రకటించింది. అయితే ఈ అంశంలో పెద్ద పురోగతి లేదు. విశేషమేమిటంటే... ‘అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్-ప్రాలిఫరేషన్ ట్రీటీ- ఎన్పీటీ) అడిషనల్ ప్రొటోకాల్ మీద సౌదీ అరేబియా నేటి వరకు సంతకాలు చేయలేదు. దీని ప్రకారం కట్టుదిట్టమైన అంతర్జాతీయ తనిఖీలు ఎదుర్కోవాల్సివుంటుంది. చైనా సహకారంతో యురేనియం వెలికితీత కేంద్రాన్ని సౌదీ అరేబియా నిర్మించినట్టు 2020లో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ వార్తాకథనం ప్రచురించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ చర్య అనుమతించదగ్గదే అయినప్పటికీ ఇది ‘రెండు రకాల ప్రయోజనాల’ (అణు విద్యుదుత్పత్తి, అణ్వాయుధాల తయారీ) కోసం ఉద్దేశించినదన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అవసరమైతే పాక్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లే విధంగానే తమ క్షిపణులను సౌదీ సిద్ధం చేస్తున్నట్టు 1988 నాటి పత్రాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన అతి కొద్ది ముస్లిం దేశాల్లో పాక్ ఒకటి. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియాలతో పాక్ కు చెందిన ‘అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్’ అణు సంబంధాలు నెరపినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాలను తయారుచేసే పక్షంలో సౌదీ అరేబియా కూడా పాక్ నుంచి ‘అణు వార్ హెడ్స్’ను కొనుగోలు చేయడమో, వాటిని ‘అప్పు/అద్దె ప్రాతిపదికన తీసుకోవడమో’ చేస్తుందని నిపుణుల అంచనా. ‘ముస్లిం దేశాల రక్షణకర్త’ పాత్రను పాక్ రక్తి కట్టిస్తోందా? పాక్ నేతృత్వంలోని ‘ఇస్లామిక్ నాటో’ కూటమిలో చేరిన తొలి సభ్యదేశంగా సౌదీ అరేబియాను చూడవచ్చా?! - జమ్ముల శ్రీకాంత్ (Source: The EurAsian Times, WION). -
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ స్పందన ఇదే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది. ‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్‌ను సందర్శించారు అక్కడి అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ యువరాజు షరీఫ్‌ను కలిశారు. సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు. -
భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా
-
Pak-Saudi Deal: ‘ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం’
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయి.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాక, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రదాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’ అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. ఇది జరిగిన తరువాత సౌదీ-పాక్‌ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం గమనార్హం. మరోవైపు ఖతార్- యునైటెడ్ స్టేట్స్ మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. -
పాక్ నకిలీ ఫుట్‌బాల్ జట్టు వెనక్కి
లాహోర్: చిట్టడవులు, కొండ ప్రాంతాలు, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాకిస్తాన్ అక్రమంగా భారత్‌లోకి పంపిస్తుంటే.. ఇదే స్ఫూర్తితో ఒక పాకిస్తానీయుడు తోటి పాకిస్తానీయులను మోసం చేసి జపాన్‌కు పంపించాడు. ‘గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్’ పేరిట ఫుట్‌బాల్ క్లబ్ బృంద సభ్యులుగా జపాన్లోకి అడుగుపెట్టిన ఈ నకిలీ ఆటగాళ్లను జపాన్ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అనుమానంతో ఆపేశారు. అట్నుంచి అటే మళ్లీ పాకిస్తాన్‌కు తిరుగుటపా చేశారు. 15 రోజుల తాత్కాలిక పాక్ వీసాతో జపాన్‌కు వచి్చన 22 మందిని వెనువెంటనే తిరిగి పంపించిన ఘటన జూన్‌లో జరగ్గా చాలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫుట్‌బాల్ టీమ్ అంశాన్ని పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్‌గా తీసుకుంది. 22 మందిని జపాన్‌కు పంపిన మానవ అక్రమ రవాణా కేసులో మాలిక్ వకాస్‌ను ఎఫ్ఐఏ అధికారులు అరెస్ట్‌చేశారు. ఫుట్‌బాల్ ఆటగాళ్లలాగే ఫుట్‌బాల్ ఆటగాళ్లమాదిరే నిజమైన టీమ్ జెర్సీ దుస్తుల్లో జపాన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే తర్వాత వీళ్ల ధోరణి చూసి జపాన్ ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానమొచ్చి వీళ్లను లోతుగా ప్రశ్నించి అసలు విషయంరాబట్టారు. పాక్ ఎయిర్పోర్ట్ అధికారుల కళ్లుగప్పి ఇక్కడిదాకా ఎలా రాగలిగారనే ప్రశ్న జపాన్ అధికారులను తొలచేస్తోంది. పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారులతో మాలిక్ వక్రాస్కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జపాన్‌కు పంపేందుకు ఈ ఒక్కో అక్రమ వలసదారుడి నుంచి కనీసం 45 లక్షల పాక్ రూపాయలను వసూలుచేసినట్లు తెలుస్తోంది. మాలిక్ జపాన్‌కు ఇలా గతంలోనూ కొందరిని తరలించాడని సమాచారం. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 17 మందిని జపాన్‌కు తరలించాడు. ఈ విషయంలో గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచి్చంది. అప్పుడు వెళ్లిన వాళ్లెవరూ తిరిగి పాక్‌కు రాలేదు. -
భారత్ ఎవరికీ తల వంచదు... పాకిస్తాన్ కోరితేనే కాల్పులు ఆపేశాం... హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ
-
మసూదే సూత్రధారి
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని స్వయంగా వెల్లడించిన ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ మరో సంచలన విషయం బయటపెట్టాడు. భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్‌దే కీలక పాత్ర అని స్పష్టంచేశాడు. ఆయా దాడులకు ప్రణాళిక రూపొందించి, అమలు చేసింది అతడేనని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై ఉగ్రవాద దాడుల వెనుక తమ పౌరుల హస్తం లేదంటూ నమ్మబలుకుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు రంగు దీనితో తేలిపోయింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలే భారత్‌లో మారణహోమం సృష్టించినట్లు స్పష్టంగా బహిర్గతమయ్యింది. బాలాకోట్ నుంచే కుట్ర భారత నిఘా వర్గాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అమీర్–ఉల్–ముజాహిదీన్ మౌలానా మసూద్ అజార్‌కు మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. అతడు ఇటీవల మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 1999లో విమానం హైజాక్ ఉదంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల డిమాండ్ మేరకు భారత ప్రభుత్వం మసూద్ అజార్‌ను విడుదల చేసింది. అలా పాకిస్తాన్‌కు చేరుకున్న మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్‌లో ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడని మసూద్ ఇల్యాస్ కశ్మీరీ చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌ను అడ్డాగా మార్చుకొని, అనుచరుల సంఖ్యను పెంచుకొని, వారికి శిక్షణ ఇచ్చి, భారత్‌పైకి ఉసిగొల్పాడని వెల్లడించాడు. బాలాకోట్ అతడికి సురక్షిత ప్రాంతంగా మారిందని అన్నాడు. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని భారత పార్లమెంట్‌పై ఆత్మాహుతి దాడి, 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు బాలాకోట్ నుంచే కుట్ర సాగించాడని తేల్చిచెప్పాడు. రెండు భీకర దాడులు జైషే మొహమ్మద్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే గుర్తించింది. భారత పార్లమెంట్‌పై 2001లో ఐదుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి దిగారు. హోంశాఖ స్టిక్కర్ ఉన్న కారులో లోపలికి దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 12 ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 166 మందిని బలి తీసుకున్నారు. -
నవ భారత్ బెదరదు!
ధార్: అణ్వాయుధాలను బూచిగా చూపించి భారత్‌ను బెదిరిస్తామంటే ఎంతమాత్రం కుదరదని పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. అణ్వ్రస్తాలకు నవ భారతదేశం(న్యూ ఇండియా) భయపడదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరిగినట్లు జైషే మొహమ్మద్ కమాండర్ స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అక్కచెల్లెమ్మలు, కుమార్తెల సిందూరం తుడిచేశారు. ముష్కరులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. అపూర్వమైన ధైర్య సాహసాలు కలిగిన మన సైనిక దళాలు కేవలం రెప్పపాటు కాలంలో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిల్చోబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా నాయకులకు జరిగిన నష్టాన్ని నిన్ననే ఓ ముష్కరుడు రోదిస్తూ బయటపెట్టడం ప్రపంచమంతా చూసింది. ఇది నవ భారత్. అణు బాంబులతో మనల్ని ఎవరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ వారిని మట్టుబెట్టగలం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన మంత్రం స్వదేశీ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా. పండుగల సీజన్ రాబోతోంది. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచుకోవాలి. మీరు కొనేది, విక్రయించేది ఏదైనా సరే అది ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి కావాలి. స్వాతంత్య్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు స్వదేశీ ఉత్పత్తుల వాడకమే పునాది అని మర్చిపోవద్దు. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులు ఉపయోగిస్తేనే దేశానికి లబ్ధి చేకూరుతుంది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. మన ఉత్పత్తుల పట్ల మనం గరి్వంచాలి. అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా మన దేశంలో తయారైన వస్తువునే కొనండి. పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంట్లో అలంకరణ సామగ్రి, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు మన దగ్గర తయారవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు అది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవునో కాదో తనిఖీ చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులు కొంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. అది నేరుగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ సొమ్ముతో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవచ్చు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. స్వదేశీ వస్తువుల విక్రయాలు పెరిగితే కంపెనీల్లో వాటి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. తద్వారా మన దగ్గర ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. స్వదేశీ వస్తువులు కొని ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందండి. విక్రయదారులు తమ దుకాణాల వల్ల ‘స్వదేశీ’ బోర్డులు గర్వంగా ఏర్పాటు చేసుకోండి. కోటికి చేరిన సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డులు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. దీనివల్ల దేశంలో వస్త్ర పరిశ్రమకు నూతన బలం చేకూరుతుంది. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఔషధాలు సైతం ఉచితంగా అందజేస్తారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన, వనరులు లేవన్న కారణంతో మహిళలు నష్టపోవడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడానికి 2023లో నేషనల్ మిషన్‌ను మధ్యప్రదేశ్‌లోనే ప్రారంభించాం. అప్పట్లో మొట్టమొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డు అందజేశాం. ఈరోజు కార్డుల సంఖ్య కోటికి చేరింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పీఎం మిత్రా పార్కు దేశంలో మొట్టమొదటి ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైట్ రీజియన్, అప్పారెల్(పీఎం మిత్రా)’ పార్కు నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్‌ను, రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం మిత్రా పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్ తయారీ కేంద్రాలను స్థాపించబోతున్నారు. రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ, విద్యతోపాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. చక్కెర, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సుమన్ సఖి చాట్‌బాట్‌ను సైతం మోదీ ప్రారంభించారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఒక మొక్కను బహూకరించారు. -
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్‌జీత్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్‌లోని మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB— BJP (@BJP4India) September 17, 2025ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు. -
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్‌లో భారత్-పాక్‌లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్‌పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్‌ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్‌బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025 -
పాక్ మొసలి కన్నీరు.. చుక్కలు చూపించిన భారత్!
-
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025 -
షేక్ హ్యాండ్ వివాదంపై పాక్‌కు ఇచ్చిపడేసిన బీసీసీఐ
-
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
తగిన శాస్త్రి జరిగింది! పాక్ సీట్ చింపిన భారత్
-
పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జట్టుతో డేంజర్?
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మ్రోగించింది.వరుసగా రెండు విజయాలతో గ్రూపు-ఎ నుంచి టేబుల్ టాపర్‌గా భారత్ నిలిచింది. భారత్‌కు ఇంకా ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. సెప్టెంబర్ 19న పసికూన ఒమన్‌తో సూర్య కుమార్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి.ఇప్పటికే పాక్‌పై విజయంతో మెన్ ఇన్ బ్లూ సూపర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. గ్రూపు-ఎ టేబుల్ టాపర్‌గా ఉన్న భారత్ సూపర్-4 రౌండ్ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 21న ఏ2తో తలపడనుంది. అంటే దాదాపు మళ్లీ పాక్-భారత్ జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడే అవకాశముంది. శ్రీలంకతో జాగ్రత్త.. అయితే ఈ టోర్నీలో భారత్ అద్బుతమైన విజయాలతో దూసుకెళ్లుతున్నప్పటికి డిఫిండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ ఎంతో కొంత పోటీ ఎదురయ్యే అవకాశముంది. పాక్, బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్లు పోటీపడుతున్నప్పటికి.. ఆ టీమ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి.ముఖ్యంగా శ్రీలంకను టీమిండయిఆ ఏ మాత్రం తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌లో సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో అన్ని జట్లకు భిన్నంగా శ్రీలంక ముగ్గురు పేస్ బౌలర్లతో తమ తొలి మ్యాచ్‌లో ఆడింది. దుష్మాంత చమీరా, మతీషా పతిరానా, నువాన్ తుషారా వంటి పేస్ త్రయం శ్రీలంక వద్ద ఉంది. పవర్‌ప్లేలో తుషారా తన సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయగలడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ వనిందు హసరంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఆడిన అనుభవం హసరంగా ఉండడంతో భారత బ్యాటర్ల వీక్నెస్ అతడికి బాగా తెలుసు. అంతేకాకుండా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కు ఆడిన కమిందు మెండిస్ సైతం లంక జట్టులో భాగంగా ఉన్నాడు. అతడి కూడా బంతిని గింగరాలు తిప్పగలడు.బ్యాటింగ్ విషయానికి వస్తే కుశాల్ మెండిస్, నిస్సాంక, కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక వంటి హిట్టర్లతో శ్రీలంక పటిష్టంగా ఉంది. యువ ఆటగాడు కమిల్ మిశ్రా సైతం మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మిశ్రా 46 పరగులతో సత్తాచాటగా.. నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు.శ్రీలంక కూడా టీమిండియా మాదిరిగానే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఒకవేళ శ్రీలంక గ్రూపు-బి టేబుల్ టాపర్‌గా కొనసాగితే.. సూపర్-4 రౌండ్లో భారత్‌తో సెప్టెంబర్ 26న తలపడనుంది. కాగా చివరసారిగా టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్(2022)ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.అత్యధిక ఆసియాకప్ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా భారత్ తర్వాత శ్రీలంకనే కొనసాగుతోంది. టీమిండియా అత్యధికంగా 8 సార్లు ఈ మెగా టోర్నీ విజేతగా నిలవగా.. లంక 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. -
భారత్-పాక్ మ్యాచ్ లో హ్యాండ్ షేక్ వివాదం
-
చీల్చిచెండాడిన భారత్.. పాక్ చిత్తుచిత్తు.. హైలైట్స్ ఇవే
-
చొరబాటుదారులకు మద్దతా?
గౌహతి: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి, నుమాలీగఢ్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు ‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్‌ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్‌కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి. ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం. ‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే. దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.ఆ గరళం గొంతులో దాచుకుంటా నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి. మోదీకి బహుమతిగా పెయింటింగ్లుఅస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్‌లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్‌లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
అలవోకగా... అలవాటుగా...
భారత జట్టు పాకిస్తాన్‌పై మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. ఏమాత్రం పోటీ లేని మ్యాచ్‌లో ఏకపక్షంగాదాయాది జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి అతి సునాయాస విజయాన్ని అందుకుంది. ఇటీవల పాక్‌తో మ్యాచ్‌తో ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేని విధంగా, అలవాటుగా మారిపోయినట్లుగా, అలవోకగా మరో గెలుపు మన ఖాతాలో చేరింది. ముందుగా భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో తేలిపోయిన పాక్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కాగా... ఆ తర్వాత మన ప్రధాన బ్యాటర్లంతా పని పూర్తి చేశారు. దాంతో 25 బంతులæ ముందే టీమిండియా ఛేదన ముగిసింది. భారత్‌లో అక్కడక్కడా ఈ మ్యాచ్ ఆడటంపై నిరసనలు, విమర్శలు వినిపించినా... మైదానంలో మాత్రం ప్రేక్షకుల సంఖ్య సంతృప్తికర స్థాయిలో కనిపించింది. టోర్నీ తర్వాతి దశలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఆసక్తిని రేపిన పోరులో భారత్ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్; 4 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడుతుంది. ఆదుకున్న ఫర్హాన్, అఫ్రిది... ఇన్నింగ్స్ తొలి బంతిని ‘వైడ్’గా వేసిన పాండ్యా... అదనపు బంతికి సయీమ్ అయూబ్ (0)ను అవుట్ చేశాడు. దాంతో తొలి బంతికే భారత్‌కు వికెట్ దక్కినట్లయింది. అయూబ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో బుమ్రా రెండో బంతికే మొహమ్మద్ హారిస్ (3)ని వెనక్కి పంపాడు. ఈ దశలో ఫర్హాన్, ఫఖర్ (17) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. బుమ్రా వరుస ఓవర్లలో ఫర్హాన్ ఒక్కో సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి పాక్ స్కోరు 42 పరుగులకు చేరింది. పాకిస్తాన్‌పై అటు వన్డేలు, ఇటు టి20ల్లో కలిపి బుమ్రా బౌలింగ్‌లో ఒక పాక్ బ్యాటర్ సిక్స్ కొట్టడం ఇది మొదటిసారి మాత్రమే. అతను వేసిన 400వ బంతికిగానీ ఇది సాధ్యం కాకపోవడం విశేషం! అయితే పవర్‌ప్లే తర్వాత భారత బౌలర్లు ప్రత్యరి్థని పూర్తిగా కట్టి పడేశారు. పరుగులు తీయడంలో పాక్ తీవ్రంగా ఇబ్బంది పడగా, మరో వైపు వరుసగా వికెట్లూ పడ్డాయి. ముగ్గురు భారత స్పిన్నర్లను ఏమాత్రం ఆడలేక పాక్ 19 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్, సల్మాన్ ఆగా (3)లను వరుస ఓవర్లలో అక్షర్ వెనక్కి పంపగా... కుల్దీప్ వరుస బంతుల్లో హసన్ (5), నవాజ్ (0) పని పట్టాడు. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్ 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో కేవలం 41 పరుగులే చేయగలిగింది. ఒకదశలో వరుసగా 33 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే చివర్లో షాహిన్ అఫ్రిది దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్లో అతను 2 సిక్స్‌లు బాదాడు. అర్ధ సెంచరీ భాగస్వామ్యం... ఛేదనను భారత్ జోరుగా మొదలు పెట్టింది. అఫ్రిది వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతుల్లో 4, 6 బాదిన అభిషేక్... అతని తర్వాతి ఓవర్లో కూడా ఇలాగే 4, 6 కొట్టాడు. అయితే ఈ రెండు ఓవర్ల మధ్య అయూబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన శుబ్‌మన్ గిల్ (7 బంతుల్లో 10) మరుసటి బంతికి వెనుదిరిగాడు. అయూబ్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్... అదే ఓవర్లో అవుటయ్యాడు. ఈ దశలో సూర్య, తిలక్ ఎక్కడా తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 6 ఓవర్లలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత చకచకా పరుగులు రాబట్టిన సూర్య, తిలక్ మూడో వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న దశలో తిలక్ అవుటైనా...శివమ్ దూబే (10 నాటౌట్)తో కలిసి సూర్య గెలిపించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 21 బంతుల్లో అభేద్యంగా 34 పరుగులు జత చేశారు. సూఫియాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా సూర్య కొట్టిన భారీ సిక్స్‌తో మ్యాచ్ ముగిసింది. 10 అంతర్జాతీయ టి20ల్లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. నాలుగింటిలో మాత్రమే పాక్ గెలిచింది. ఆసియా కప్‌లో నేడు యూఏఈ X ఒమన్ వేదిక: అబుదాబి సాయంత్రం గం. 5:30 నుంచి శ్రీలంక X హాంకాంగ్ వేదిక: దుబాయ్ రాత్రి గం. 8:00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అయూబ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 0; ఫర్హాన్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 40; హారిస్ (సి) పాండ్యా (బి) బుమ్రా 3; ఫఖర్ (సి) తిలక్ (బి) అక్షర్ 17; సల్మాన్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 3; హసన్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 5; నవాజ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫహీమ్ (ఎల్బీ) (బి) వరుణ్ 11; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 33; సూఫియాన్ (బి) బుమ్రా 10; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–1, 2–6, 3–45, 4–49, 5–64, 6–64, 7–83, 8–97, 9–111. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–34–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–28–2, వరుణ్ చక్రవర్తి 4–0–24–1, కుల్దీప్ యాదవ్ 4–0–18–3, అక్షర్ పటేల్ 4–0–18–2, అభిషేక్ శర్మ 1–0–5–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫహీమ్ (బి) అయూబ్ 31; గిల్ (స్టంప్డ్) హారిస్ (బి) అయూబ్ 10; సూర్యకుమార్ (నాటౌట్) 47; తిలక్ వర్మ (బి) అయూబ్ 31; దూబే (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–22, 2–41, 3–97. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 2–0–23–0, అయూబ్ 4–0–35–3, అబ్రార్ 4–0–16–0, నవాజ్ 3–0–27–0, సూఫియాన్ 2.5–0–29–0. -
అడకత్తెరలో ఇండియా
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా? ‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?వాషింగ్టన్‌తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్‌పింగ్‌తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్‌కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్‌తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.అందుకే, తియాన్జిన్లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్‌తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్‌తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి. అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్‌కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్‌మీడియా #BoycottIndvsPak హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.ఈ మ్యాచ్‌లో దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు. కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్‌తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్‌లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది. -
‘లాడెన్‌ను మట్టుబెట్టాక..’ రహస్యాలు వెల్లడించిన పాక్ మాజీ అధికారి
న్యూఢిల్లీ: 2011, మే 2.. తెల్లవారుజామున యునైటెడ్ స్టేట్స్ అత్యంత సాహసోపేతమైన సైనిక కార్యకలాపాలను అమలు చేసింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో 40 నిమిషాల పాటు జరిపిన దాడిలో యూఎస్ నేవీ సీల్స్(US Navy SEALs) 9/11 దాడుల సూత్రధారి, అల్-ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ ప్రపంచాన్ని షాక్‌నకు గురిచేయడమే కాకుండా, పాకిస్తాన్ విశ్వసనీయత అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింది. అయితే ఈ సమయంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను పాక్ దాస్తూ వచ్చింది. లాడెన్ భార్యలను అమెరికా విచారించిన సంగతిని కూడా ఏనాడూ బహిర్గతం చేయలేదు.తాజాగా పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాజీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ రచించిన ‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’ అనే పుస్తకం.. పాక్ ఇంతకాలం దాచుతూ వచ్చిన రహస్యాలను బహిరంగపరచింది. బిన్ లాడెన్ హత్య తర్వాత అతని భార్యలను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ (సీఐఎ) బృందం అబోటాబాద్ కంటోన్మెంట్లో ప్రత్యక్షమై లాడెన్ భార్యలను విచారించింది. అయితే ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఎపిసోడ్ దేశానికి జాతీయ అవమానంగా బాబర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ గడ్డపై అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో పాక్ ప్రభుత్వం, సైన్యం ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపించిందని ఆయన రాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌కు తీవ్ర ఇబ్బందిని కలిగించిందని బాబర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, సెనేటర్ జాన్ కెర్రీతో సహా సీనియర్ అమెరికన్ అధికారులు పాకిస్తాన్‌కు ఎలా వచ్చారో ఈ పుస్తకంలో వివరించారు. ఆ సమయంలో ఇస్లామాబాద్.. భవిష్యత్తులో అమెరికా ఏకపక్ష దాడులకు దూరంగా ఉంటుందని హామీ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఎటువంటి హామీలు ఇవ్వలేదని బాబర్ వివరించారు. ఈ దాడికి చాలా కాలం ముందు నుంచే బిన్ లాడెన్.. అబోటాబాద్ రహస్య స్థావరంపై సీఐఎ నిఘాను సారించడం పాకిస్తాన్‌కు అత్యంత బాధాకరమైన విషయగా మారిందని బాబార్ పేర్కొన్నారు. -
పాక్ సైన్యం, టీటీపీ మధ్య భీకరపోరు.. 19 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో సైన్యానికి, నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న పోరాటంలో కనీసం 19 మంది సైనికులు, 45 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ తెలిపింది. బజౌర్ జిల్లాలో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ వజీరిస్తాన్‌లో జరిగిన మరో ఎన్కౌంటర్లో 13 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం లాల్ ఖిల్లా మైదాన్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సైనికులు, 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్ల అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు. ఆటగాళ్లు మారినా, వేదికలు మారినా అభిమానుల్లో ఈ పోరు కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్‌లో జరిగే మ్యాచ్‌లో నేడు తలపడనున్నాయి. పహల్గావ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఎన్నో వైపులనుంచి పిలుపులు వచ్చినా క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్‌కు బహుళ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. దుబాయ్: ఆసియా కప్ లీగ్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్‌లపై ఆసక్తి, ప్రేక్షకుల స్పందన చూస్తే అతి పేలవం. టోర్నీని నిలబెట్టగలిగే, భాగస్వాములకు కాస్త ఆర్థిక పుష్టి అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పోరు మాత్రమే. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు టీమ్‌లు ఈ ఫార్మాట్లో తలపడటం ఇదే మొదటిసారి. భారత్ తరఫున సీనియర్లు రోహిత్, కోహ్లి నిష్క్రమించగా...పాక్ జట్టుకు బాబర్, రిజ్వాన్ దూరమయ్యారు. దాంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆసియా కప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో యూఏఈని భారత్ చిత్తు చేయగా...ఇదే తరహాలో ఒమన్‌పై పాక్ విజయం సాధించింది. అదే జట్టుతో... టోర్నీ తొలి పోరులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిన భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో బౌలర్లంతా ఆకట్టుకోగా, ఓపెనర్లకు మినహా మిగతావారికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌కు సై అంటుండగా, మరో ఓపెనర్ గిల్ కూడా పాక్‌పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గిల్ ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. పాక్‌పై ఇప్పటి వరకు 20 పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా లెక్క సరి చేసేందుకు సిద్ధమయ్యాడు. సంజు, తిలక్, దూబే, హార్దిక్‌లతో విధ్వంసకర లైనప్ టీమిండియాకు భారీ స్కోరును అందించగలదు. ఆల్‌రౌండర్‌గా అక్షర్ తన విలువ చూపిస్తే పాక్‌కు ఇబ్బంది తప్పదు. బుమ్రా ప్రమాదకర బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది సందేహమే. పాండ్యా, దూబేల రూపంలో ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో రెండో పేసర్ అవసరం జట్టుకు లేదు. కుల్దీప్, వరుణ్‌లను ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేయగల సమర్థులు. పిచ్, వాతావరణం దుబాయ్‌లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కావు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు కానీ క్రికెటర్లు తీవ్రమైన ఎండలను తట్టుకోవాల్సి ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ -
నాలుగు సెకన్లు.. ఒక్కటే వాక్యం..!
ఐరాస: ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర పరాభయం ఎదురైంది. హమాస్ రాజకీయ నాయకత్వమే లక్ష్యంగా ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన దాడిపై ఐరాసలో చర్చ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మానవ హక్కుల న్యాయవాది, యూఎన్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హిల్లెల్ నోయర్ మాట్లాడుతూ..ఖతార్ ఉగ్రవాదులకు ఆశ్రయం కలి్పస్తోందని ఆరోపించారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన హమాస్ రాజకీయ కార్యాలయం ఖతార్‌లో 2012 నుంచి కొనసాగుతుండటంపై హిల్లెల్ నోయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించడాన్ని సైతం ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 2011లో పాకిస్తాన్‌లోని రహస్య స్థావరంలో ఉంటున్న అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతమొందించినప్పుడు ఐరాస అప్పటి చీఫ్ చివరికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారన్న విషయాన్ని హిల్లెల్ గుర్తు చేశారు. పాకిస్తాన్, లాడెన్ ప్రస్తావన తేవడంతో ఆ దేశ ప్రతినిధి వెంటనే హిల్లెల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ్య దేశాల సార్వ¿ౌమత్వానికి భంగం కలిగించడం ఐరాస సూత్రాలకు విరుద్ధమని వాదించారు. హిల్లెల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. స్పందించిన ఐరాస మానవ హక్కుల కమిటీ చైర్మన్..హిల్లెల్ నోయర్‌కు మైక్‌ను పునరుద్ధరించారు. ప్రసంగం ముగించేందుకు కేవలం నాలుగే సెకన్ల సమయముందని తెల్చి చెప్పారు. దీంతో, ఆ లాయర్ ఆ సమయాన్నే సరిగ్గా వినియోగించుకుంటూ.. మిస్టర్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మరో దేశం’అంటూ ప్రసంగాన్ని ముగించారు. దీంతో, పాకిస్తాన్ ప్రతినిధి తెల్లబోయి చూస్తుండిపోయారు. ఇలాంటి అనుభవమే పాక్‌కు 2020లోనూ ఎదురైంది. ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడొకరిని ఇస్లామిక్ ఉగ్రవాది తలనరికి చంపిన ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం..‘స్వేచ్ఛ పేరుతో దైవ దూషణకు పాల్పడటం సహించరానిది’అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. దీనిపై జెనీవాకు చెందిన మానవ హక్కుల సంస్థ యూఎన్ వాచ్ దీటుగా ఇలా స్పందించింది... ‘ఐరాస మానవ హక్కుల కౌన్సిల్లో మీకు సభ్యత్వం ఇవ్వడం సహించదగిందే’అంటూ బదులిచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఐరాస మానవ హక్కుల కౌన్సిల్లో సభ్యురాలిగా ఉండటం గమనార్హం. -
పాకిస్తాన్ జోరు
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీని పాకిస్తాన్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0) డకౌట్ కాగా... మొహమ్మద్ హరీస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిబ్జాదా ఫర్హాన్ (29 బంతుల్లో 29; 1 ఫోర్) కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది. హరీస్, ఫర్హాన్ రెండో వికెట్‌కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్ జమాన్ (23 నాటౌట్; 2 ఫోర్లు), మొహమ్మద్ నవాజ్ (19 నాటౌట్) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్ పూర్తిగా చేతులెత్తేసింది. హమ్మద్ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్ తరఫున ఫహీమ్ అష్రఫ్, ముఖీమ్, అయూబ్ తలా 2 వికెట్లు తీశారు. పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో రేపు భారత్‌ను ఎదుర్కొంటుంది. -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన పసి కూన..
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
తోపు, తురుము అన్నారు.. కట్ చేస్తే? తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్‌కు ఫేవర్‌గానే వచ్చింది. బంతి క్లియర్‌గా మిడిల్ స్టంప్‌కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ ఆరు సిక్స్‌లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్‌పై ఆడలేకపోయాడు.💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025 -
చిక్కుల్లో ఆసియా కప్
-
ఖిలాఫత్ ఉగ్ర మాడ్యూల్ బట్టబయలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో లింకులున్న ఉగ్ర మాడ్యూల్ ఒక దానిని ఢిల్లీ పోలీసులు బట్టబ యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఇందుకు సంబంధించి ఐదుగురిని అరె స్ట్ చేశారు. పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా వీరు ఆన్లైన్లో యువతను ఉగ్ర ఊబిలోకి లాగు తున్నారు. కొంత భూభాగాన్ని స్వాధీనం చేసు కుని ఖిలాఫత్ జోన్‌గా ప్రకటించడం ద్వారా భారత్‌లో జిహాద్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్రణాళిక అని అదనపు పోలీస్ కమిషనర్ (స్పె షల్ సెల్) ప్రమోద్ కుష్వాహా మీడియాకు తెలి పారు. ఘజ్వా–ఇ–హింద్ (భారత్‌పై దాడి) నినాదంతో దేశవ్యాప్తంగా హింసాత్మక కార్యక లాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తు న్నారన్నారు. పట్టుబడిన వారిలో రాంచీకి చెందిన అషర్ దానిష్ అలియాస్ అష్రార్ ఖురే షి(23), ముంబైకి చెందిన అఫ్తాబ్ ఖురేషి, సుఫియాన్ అబూబకర్లు, తెలంగాణకు చెందిన మహ్మద్ హుజైఫా, మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రాన్ ఖురేషి ఉన్నారు. వీరితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తు న్నట్లు వివరించారు. ఈ మాడ్యూల్‌కు డానిష్ సారథ్యం వహిస్తూ పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ హ్యాండ్లకు సీఈవో, గజ్బా, ప్రొఫెసర్ అనే సంకేత నామం ఉందని ఏసీపీ కుష్వాహా చెప్పారు. సోషల్ మీడియా చాట్ల ద్వారా పాక్ హ్యాండ్లర్ వీరికి మందు పాతరల డిజైన్లు, తయారీలో సలహాలిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వీరి కార్యకలాపాలపై కన్నేసి ఉంచామని, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అఫ్తాబ్, సుఫియాన్‌లను మొదటగా అరెస్ట్ చేశామన్నారు. మేవాడ్‌కు చెందిన వ్యక్తి నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వచ్చి వీరు పట్టుబడ్డారని తెలిపారు. వీరి మరికొంత మందిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఐఈడీలను తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల సామగ్రి, రసాయనాలను స్వాధీనం చేసుకుని, విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఖిలాఫత్ గతంలో పట్టుబడిన ఉగ్ర మాడ్యూల్‌లతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటైన గ్రూపుగా పేర్కొన్నారు. ఖిలాఫత్ జోన్‌కు అవసరమైన భూమి కొనుగోలు కోసం వీరు నిధుల సేకరణలో బిజీగా ఉన్నారన్నారు. -
6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?
బాబర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాకుండా ప్రపంచంలోనే అత్యత్తుమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే మూడు ఫార్మాట్లలోనూ పాక్ క్రికెట్ ముఖ చిత్రంగా మారాడు. తన కెప్టెన్సీతో పాటు అద్బుత బ్యాటింగ్‌తో పాటు జట్టును విజయ పథంలో నడిపించిన ఘనత అతడిది. క్లాసిక్ కవర్ డ్రైవ్ షాట్లకు పెట్టింది పేరు. అతడి క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగేత్తేవి. అయితే ఇదంతా ఒకప్పుడు. గత కొన్నేళ్లగా అతడు బ్యాట్ ముగబోయింది. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లపైనే అయిపోయింది.ఒకనొక దశలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోటిపోడిన బాబర్ ఆజం.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన పాక్ జట్టులో బాబర్‌కు చోటు దక్కలేదు. అతడి పేలవ ఫామ్ కారణంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే బాబర్‌ను జట్టు నుంచి తప్పించినప్పటికి అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఆజం తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. అభిమానులు బాబర్ ఆజం నెట్‌వర్త్ ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాబర్‌కు ఏడాదికి ఎంతో సంపాదిస్తున్నాడో ఓ లుక్కేద్దాం.బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?పాకిస్తాన్లో అత్యంత రిచెస్ట్ క్రికెటర్‌గా బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. పలు రిపోర్ట్లు ప్రకారం.. 2024-25కు గానూ బాబర్ ఆజం నెట్ వర్త్ రూ. 41 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబర్ మొన్నటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. దీంతో అతడికి పీసీబీ నుంచి నెలకు పీకేఆర్ 4.5 మిలియన్లు(భారత కరెన్సీలో దాదాపు 13.95 లక్షలు) లభించేవి. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి పీకేర్ 2.07 మిలియన్లు బోనస్ రూపంలో బాబర్‌కు వచ్చేవి. అంటే మొత్తంగా ఏడాదికి జీతం రూపంలో ఆజంకు భారత కరెన్సీ ప్రకారం రూ.2 కోట్ల పైగా అందేది. అదే విధంగా అతడి మ్యాచ్ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు రూ. సుమారు 4 లక్షలు, వన్డేకు రూ. 2 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.1.5 లక్షలు తీసుకుంటాడు.పీఎస్ఎల్ శాలరీ ఎంతంటే?పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు పెషావర్ నుంచి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ. 1.88 కోట్లు అందుకుంటాడు.ఒక్కో యాడ్‌కు రూ.50 లక్షలు?బాబర్ ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యహహరిస్తున్నాడు. ఒక్కో యాడ్‌లో నటించినందుకు ఆజం రూ.50 లక్షలు అందుకున్నట్లు సమాచారం. పెప్సి, హెడ్ అండ్ షోల్డర్స్, హెబీఎల్ బ్యాండ్లను బాబర్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆడి ఎ-5, బీఎమ్‌డబ్ల్యూ, ఆడి ఇ-ట్రోన్, బ్లాక్ హ్యుందాయ్ సొనాటా,లంబోర్గిని అవెంటడోర్, BJ40 ప్లస్ జీప్ వంటి ఖరీదైన కార్లు బాబర్ వద్ద ఉన్నాయి. అదే విధంగా బాబర్‌కు లాహోర్‌లో విలాసవంతమైన ఓ ఫామ్‌హౌస్ కూడా ఉంది. బాబర్‌కు డిమోషన్..అయితే ఇటీవల 2025-26 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన పీసీబీ.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు భారీ షాకిచ్చింది. ఈ స్టార్ క్రికెటర్లకు డిమోషన్ లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కేటగిరీ ఎలో ఉన్న బాబర్, రిజ్వాన్‌లు ఇప్పుడు కేటగిరీ బికి పడిపోయారు. దీంతో వీరికి నెలకు పీకేఆర్ 3 మిలియన్లు( భారత కరెన్సీ 9.28 లక్షలు) అందుకోనున్నారు. గతేడాదితో పోలిస్తే వారి జీతంలో దాదాపు నాలుగు లక్షలపైగా కోత పడింది.చదవండి: Asia Cup 2025: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్!? -
దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్ చేశారు. పాక్ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నాడు. భారీ టెర్రర్ మాడ్యుల్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్‌లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్‌ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో, హుజైఫ్ యెమెన్‌ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. #WATCH | Delhi Police Special Cell busted a Pan-India terror module and arrested five terrorists identified as Ashhar Danish, Sufiyan Abubakar Khan, Aaftab Ansari, Huzaifa Yaman and Kamran Qureshi A large quantity of materials and precursors for making IED have been seized from… https://t.co/uAcHkQ8r58 pic.twitter.com/zoCOqCkCJK— ANI (@ANI) September 11, 2025 -
వారిద్దరిని మిస్ అవ్వడం లేదు..అన్నింటికీ మేము రెడీ: పాక్ కెప్టెన్
ఆసియాకప్-2025కు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా మరి కొన్ని గంటల్లో అఫ్గానిస్తాన్-యూఏఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నమెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎటువంటి నష్టం కలిగించదు సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంత కాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసియాకప్‌కు సెలక్టర్లు చేయలేదు. సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పు బట్టారు. కాగా ఇటీవల కాలంలో పాక్ ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి"ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. గత నాలుగు సిరీస్‌లలో మేము మూడింట మేము విజయం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైనప్పటికి ఆసియాకప్ మాకు ఒక కఠిన సవాల్ వంటిది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఒక ప్రధాన టోర్నమెంట్లో ఆడనున్నారు.ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. తమదైన రోజున ప్రతీ జట్టు అద్బుతాలు చేస్తోంది. ఒకట్రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్‌ను మేము సన్నాహకంగా ఉపయోగించుకున్నాము.సిరీస్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేషన్ టోర్నమెంట్‌కు ముందు పాక్ జట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో ట్రైసిరీస్‌లో తలపడింది. ఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే జోరును ఆసియాకప్‌లోనూ కనబరిచాలని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 12న ఒమన్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్ -
ఆసియా కప్‌కు ముందు పాక్ క్రికెటర్ రిటైర్మెంట్
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు ఓ పాకిస్తానీ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్, 17 వన్డేలు, 16 టీ20లు ఆడిన 31 ఏళ్ల ఉస్మాన్ షిన్వారీ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షిన్వారీ టెస్ట్‌ల్లో ఒకటి, వన్డేల్లో 34, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.2013లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షిన్వారీ, 2019లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత పాక్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఈ మధ్యలో ఆరేళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతను, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. షిన్వారీకి స్వల్ప కెరీర్లోనే ఓ ప్రత్యేకత ఉంది. అతనాడిన 17 వన్డేల్లోనే రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. షిన్వారీ 2018 ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ ఎడిషన్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హాంగ్‌కాంగ్‌పై మాత్రం మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఏడాది మధ్య వరకు దేశవాలీ క్రికెట్లో కొనసాగిన షిన్వారీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. -
అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందం
పాకిస్తాన్‌లోని కీలకమైన ఖనిజాలకు సంబంధించి.. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది."ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయడానికి యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్రైడర్ వచ్చారు" అని ప్రకటన పేర్కొంది."అమెరికా భద్రత, శ్రేయస్సుకు కీలకమైన ఖనిజ వనరుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పరిపాలనలో ఇటువంటి ఒప్పందాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్‌లోని కీలకమైన ఖనిజాలు.. మైనింగ్ రంగంలో యూఎస్ కంపెనీలు, వాటి సహచరుల మధ్య భవిష్యత్తులో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము" అని ఛార్జ్ డీ అఫైర్స్ నటాలీ బేకర్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ఎస్ఎమ్ అనేది మిస్సోరిలో ఉన్న ఒక సంస్థ. ఇది కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ఖనిజాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ.. వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో తమకు అవసరమైనవిగా లేబుల్ చేసుకుంటుంది.Excited to see U.S. companies like USSM deepening economic ties with Pakistan! USSM’s visit to Islamabad marks an important milestone as they sign an MOU to collaborate on critical minerals production. A forward-looking partnership with great potential for both nations. -NB…— U.S. Embassy Islamabad (@usembislamabad) September 8, 2025 -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ న్యాయనిర్ణేతలు వీరే..!
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్‌కప్, 2022 మహిళల వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్‌గా వ్యవహరించాడు.భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్‌గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు. -
సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్
ఆసియా కప్ జట్టుకు తనను ఎంపిక చేయలేదన్న కసితో రగిలిపోతున్న పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, తాజాగా ఆ దేశ సెలెక్టర్లకు బ్యాట్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఫార్మాట్ ఏదైనా తాను విలువైన ఆటగాడిగేనని బ్యాట్‌తో సందేశం పంపాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ఆడుతున్న రిజ్వాన్.. ఇవాళ (సెప్టెంబర్ 8) గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసినంత పని చేసి (62 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆసియా కప్‌కు తనను ఎంపిక చేయని వారు పశ్చాత్తాపపడేలా చేశాడు.ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఇన్నింగ్స్ కారణంగానే పేట్రియాట్స్ మ్యాచ్ గెలిచింది. రిజ్వాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్ మొత్తంలో రిజ్వాన్ మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కష్టమైన పిచ్‌పై రిజ్వాన్ అద్భుతంగా ఆడి ప్రశంసలందుకున్నాడు.రిజ్వాన్ వన్డే జట్టు కెప్టెన్ అయినా ఫామ్ లేని కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. టీ20 ఫార్మాట్‌కు రిజ్వాన్ సరిపొడపడన్నది వారి వాదన. ఆసియా కప్‌కు పాక్ సెలెక్టర్లు రిజ్వాన్‌తో పాటు మరో స్టార్ బ్యాటర్ అయిన బాబర్ ఆజమ్‌ను కూడా ఎంపిక చేయలేదు.బాబర్‌ను అయితే పాక్ సెలెక్టర్లు చాలాకాలం నుంచే పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరం పెట్టారు. అన్ని ఫార్మాట్లలో అతని దారుణమైన ఫామే ఇందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్లో అతను సెంచరీ చేసి రెండేళ్లు పూర్తైంది. సీనియర్లైన రిజ్వాన్, బాబర్‌పై వేటు వేసిన పాక్ సెలెక్టర్లు.. సల్మాన్ అఘా నేతృత్వంలోని యువ జట్టును ఆసియా కప్‌కు ఎంపిక చేశారు.కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. రిజ్వాన్ (85) చెలరేగినా, తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో వారియర్స్ కూడా తడబడి లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 31 పరుగులు చేసిన షాయ్ హోప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. అతని దేశం తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి స్పిన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. యూఏఈ ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి పాక్‌కు టైటిల్‌ను అందించాడు.అంతర్జాతీయ టీ20ల్లో నవాజ్‌కి ముందు 73 మంది హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. పాక్ తరఫున నవాజ్ది మూడో హ్యాట్రిక్. నవాజ్‌కు ముందు పాక్ తరఫున హ్యాట్రిక్‌లు సాధించిన వారిద్దరు (ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ హస్నైన్) పేస్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. నవాజ్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో పాక్ ఆఫ్ఘనిస్తాన్పై 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్‌ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆదిలోనే ఓటమి ఖాయం చేసుకుంది. పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నవాజ్ 6వ ఓవర్ చివరి రెండు బంతులకు, 8వ ఓవర్ తొలి బంతికి వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. 8వ ఓవర్లో నవాజ్ మరో వికెట్ కూడా తీశాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది.