breaking news
Family
-
'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..
ఉద్యోగ జీవితం ఎలా ఉంది? ఆనందంగా ఉందా? ‘అవసరం కాబట్టి తప్పదు’ అన్నట్లుగా ఉందా? ఉద్యోగ జీవితంలో ఆనందపరిచేవి ఏమిటి? వర్క్–లైఫ్లలో ఏది ముఖ్యం?... ఇలా ఎన్నో ప్రశ్నలను యువతరం ముందు పెట్టింది డెలాయిట్ గ్లోబల్ సర్వే 2025. ఆ సర్వే ప్రకారం.. చాలా స్పీడ్‌గా తమ కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలనుకోవడం కంటే, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై మన జెన్–జడ్ యువతరం అధికంగా దృష్టి సారిస్తోంది. ‘జాబ్ లెర్నింగ్’ అనేది ‘కెరీర్ గ్రోత్’కు ఉపయోగపడుతుంది అని మన దేశ జెన్–జడ్లో 94 శాతం మంది చెబుతున్నారు. లెర్నింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు, సబ్స్క్రిప్షన్లకు యాక్సెస్ ద్వారా తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నట్లు చెబుతున్నారు.జెన్ ఏఐమన దేశంలో 85 శాతం జెన్–జడ్‌లు, 85 శాతం మిలీనియల్స్ తమ రోజువారి పనిలో ‘జెన్ ఏఐ’ని ఉపయోగిస్తున్నారు. జెన్–జడ్‌లు ఎక్కువగా డిజైన్, కంటెంట్ క్రియేషన్, డేటా విశ్లేషణ, ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ కోసం జెన్ ఏఐని ఉపయోగిస్తున్నారు. తమ వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవడానికి ‘జెన్ ఏఐ’ ఉపయోగపడిందని చెబుతున్నారు.ఆర్థిక అభద్రతఆర్థిక భద్రత లేని పనిని అర్థవంతమైన పనిగా భావించే అవకాశం తక్కువగా ఉంటుందని, ఆర్థికభద్రత లేకుండా మానసిక ప్రశాంతత సాధ్యం కాదని జెన్–జడ్‌లు, మిలీనియల్స్ చెబుతున్నారు.గత సంవత్సరం నుంచి యువతరంలో ఆర్థిక అభద్రత(ఫైనాల్సియల్ ఇన్సెక్యూరిటీ) పెరుగుతోంది. జెన్–జడ్లో 28 శాతం మంది, మిలీనియల్స్‌లో 31 శాతం మంది తాము ఆర్థికంగా సురక్షితంగా లేమని చెబుతున్నారు.పాజిటివ్ వెల్బీయింగ్పాజిటివ్ వెల్బీయింగ్ పనిలో ఉత్సాహాన్ని పెంచుతుంది. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం చేస్తున్నామని జెన్–జడ్లో 52 శాతం మంది, మిలీనియల్స్‌లో 60 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ‘పూర్ మెంటల్ వెల్–బీయింగ్’ విభాగంలో జెన్–జడ్‌లు 32 శాతం, మిలీనియల్స్ 33 శాతం ఉన్నారు.మరి కొన్ని...టైమ్ మేనేజ్మెంట్ అనేది కెరీర్లో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని జెన్–జడ్, మిలీనియల్ ఇండియన్లు విశ్వసిస్తున్నారు ఉన్నత విద్యను అభ్యసించకపోవడానికి ఆర్థిక పరిమితులు ప్రధాన కారణం అంటున్నారు.జెన్–జడ్లో 32 శాతం, మిలీనియల్స్‌లో 44 శాతం తాము ఇప్పటికే ‘జెన్ ఏఐ’ ట్రైనింగ్ పూర్తిచేశామని చెబుతున్నారు. జెన్–జడ్లో 51 శాతం, మిలీనియల్స్‌లో 43 శాతం రాబోయే పన్నెండు నెలల కాలంలో ‘జెన్ ఏఐ’ శిక్షణ పూర్తిచేస్తామని చెబుతున్నారు. ∙ -
ట్రెండ్‌గా డ్రోన్ స్టైల్ వీడియో..!
డ్రోన్–స్టైల్ వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మరి మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో కావాలనుకుంటున్నారా?మీరు ఒకే అంటే ఇలా...గూగుల్ జెమిని ఓపెన్ చేయాలి ∙సెలెక్ట్ చేసుకున్న ఫొటోను అప్లోడ్ చేయాలి ∙ పొడి పొడిగా కాకుండా ప్రాంప్ట్ అనేది స్పష్టంగా, వివరంగా, సాధారణ భాషలో ఉండాలి. మన ప్రాంప్ట్‌ను అర్థం చేసుకొని షార్ట్ వీడియోను క్రియేట్ చేస్తుంది జెమిని. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయవచ్చు. ‘రీల్’గా అప్లోడ్ చేయవచ్చు. ట్రెండింగ్ మ్యూజిక్, కాప్షన్స్, హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించవచ్చు.డ్రోన్ షాట్స్ శాంపిల్ ప్రాంప్ట్స్:‘క్రియేట్ ఏ 360 డిగ్రీ డ్రోన్ షాట్ వీడియో’ ∙క్రియేట్ ఏ 360–డిగ్రీ డ్రోన్ షాట్’ ∙‘జనరేట్ ఏ రియలిస్టిక్ ఏరియల్ డ్రోన్ వీడియో’.(చదవండి: Dhurandhars Dhoodh Soda: ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?) -
ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకారణంగా నెట్టింట దూద్ సోడా అనే పానీయం తెగ వైరల్‌గా మారింది. అసలేంటి పానీయం తాగొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా అంటే..ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గేరా ఒక భారతీయ గూఢచారిగా, మొహమ్మద్ ఆలం అనే సోడా విక్రేత వేషంలో కనిపిస్తారు. "డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ కావడంతో పాటు, ఈ దూద్ పానీయం పై అందరి దృష్టి పడేలా చేసింది. ఒకరకంగా మరుగున పడిపోతున్నకొన్ని రుచులు మళ్లీ గుర్తుకుతెచ్చేలా ముందుకు తీసుకు వస్తాయి ఈ సినిమాలు. దూద్ సోడా అంటే..దూద్ సోడా అనేది పాకిస్తానీకి చెందిన ప్రసిద్ధ పానీయం . లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రోజువారీ ఇష్టమైన పానీయం ఇది. చల్లటి పాలు, సోడా, తగినంత చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా జాజికాయ పొడిని కూడా జోడిస్తుంటారు. పాకిస్తానీ ఆహార సంస్కృతిలో ఒక జ్ఞాపకశక్తినిచ్చే, రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పరిగణిస్తారు.తయారీ..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 'సాహిలోజీ' ఇటీవల లాహోర్‌లో ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. "ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి, ఆపై వేడి వేడి పాలను పోస్తారు. పాకిస్థాన్‌లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాలను చల్లబరుస్తారు. ఆ తర్వాత, ఎరుపు రంగులో ఉండే కోకాకోలాను ఆ పాల మిశ్రమంలో కలుపుతారు. చివరగా సాంప్రదాయ పద్ధతిలో సోడాను బాగా మిక్స్ చేస్తే నోరూరించే దూద్ సోడా సిద్ధమవుతుంది" అని వీడియోలో ఆయన వివరించారు .చాలా మంది 1:1 లేదా 1.5:1 పాలు-సోడా నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఇది పానీయాన్ని క్రీమీగా ఉంచుతుంది. అయితే ఎక్కువమంది ఈ పానీయాన్ని రూహ్ అఫ్జా, రోజ్ సిరప్, తులసి గింజలు లేదా ఏలకులు వంటి రుచులను కూడా జోడించి సేవిస్తారు.బ్రిటిష్ కాలం నాటిది..బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందే, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో దూద్ సోడాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇది బ్రిటీష్ కాలం నాటిది. ఉత్తర భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు కూడా. అప్పట్లో స్థానిక హకీంలు నిర్వహించే సోడా ఫౌంటైన్లలో రోజ్, ఖుస్, నిమ్మకాయతో పాటు ఈ పాల సోడాను కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసేవారు.వాస్తవానికి ఈ పానీయం విక్టోరియన్ ఇంగ్లాండ్‌లో పుట్టి, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి చేరుకుంది. 1947 దేశ విభజన తర్వాత, పాకిస్థాన్‌లో ఇఫ్తార్ సమయంలో తాగే ప్రధాన పానీయంగా ఇది మారిపోయింది. అక్కడ దీనిని 'రూహ్ అఫ్జా'తో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. అటు భారతదేశంలో పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో ఈ పానీయం నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఎవరికి మంచిదకాదంటే..ఈ పానీయం కడుపులోకి వెళ్లగానే చాలామందికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాల ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి. ఇందులో సోడా ఉపయోగించడం వల్ల ప్రేగులపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు తేలికపాటి ఆమ్లతను ఉపశమనం చేసినా..ఇందులో ఉపయోగించే సోడా వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.లాక్టోస్ పడనివారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నావారునివారించడమే ఉత్తమం అని చెబుతున్నారు. అతిగా తాగితే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera)(చదవండి: హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!) -
మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైం జాబ్ నుంచి..ఫ్లయింగ్ ఆఫీసర్ రేంజ్‌కి..!
సక్సెస్ అనేది ఎంతో కష్టపడి సాధించుకోవాల్సిందే. అలుపెరగని పోరాటం, కఠిన శ్రమ తోడు అయితే గానీ గెలుపుని పాదాక్రాంతం చేసుకోలేం. అంత కష్టపడ్డా ఒక్కోసారి దోబుచులాడి బాధపెడుతుంటుంది. ఓర్పుతో పోరాడితే ఓటమిని ఓడించి విజయాన్ని వశం చేసుకోగలం. అలా కష్టపడి శదేశానికి సేవ చేసే అత్యుతన్న హోదాని కైవసం చేసుకున్నాడు భవ్య షా. భవ్యమైన అతడి సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భవ్య షా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే భాద్యతలు తీసుకుంది. పూణేలోని కళాశాలలో చదువుతున్నప్పుడే మెక్‌డొనాల్డ్స్ కౌంటర్లో పార్ట్‌టైమ్ పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతడికి తనను తాను పోషించుకోవడం తోపాటు, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, స్వతంత్రంగా వ్యవహరించడం వంటి విలువైన జీవిత పాఠాలను నేర్పింది. ఒకపక్క పార్ట్‌టైం ఉద్యోగం, మరోవైపు చదువు సాగిస్తున్నప్పుడే ఎదురయ్యే నిరుత్సాహాన్ని ఎలా బలంగా మార్చుకోవాలో నేర్చుకున్నాడు. చదువు, పనిని అంకితభావంతో చేస్తూనే..దేశానికి సేవ చేయాలనే తన డ్రీమ్‌ని అస్సలు మర్చిపోయేవాడు కాదు. ఆ తర్వాత నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), ఎయిర్ వింగ్‌లో చేరినప్పుడు భవ్య జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. NCC శిబిరాలు, శిక్షణ ద్వారా, అతను క్రమశిక్షణా జీవితాన్ని అనుభవించాడు.ఆ తర్వాత మైక్రోలైట్ ఫ్లయింగ్లో అనుభవం గడించాడు. ఆ అనుభవం భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరాలనే లక్ష్యానికి నాంది పలికింది. అలా భవ్య షా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB)కి ప్రిపరయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ క్రమంలో ఎన్నో తిరస్కరణలు, వైఫల్యాలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే సాధించేంత వరకు ఆపేదే లే అన్నట్టు మరింత దృఢనిశ్చయంతో ఆ ఎగ్జామ్‌కి ప్రపేరయ్యాడు.చివరికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో చేరినప్పుడు తన కల సఫలమైంది. శిక్షణ పొందిన కేవలం మూడు నెలలలోనే, భవ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ జాబితాలో స్థానం సంపాదించి IAF పైలట్ కావాలనే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కృషి, సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసంతో తన కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలిచాడు భవ్యషా. అతడు సదా "తగ్డా రహో"(ఎల్లప్పుడూ బలంగా, ఆరోగ్యంగా ఉండటం)ని విశ్వసిస్తుంటాడు. కష్టాల్లో బలంగా, ప్రయత్నంలో స్థిరత్వం, శక్తివంతమైన ఆత్మవిశ్వాసమే గెలుపుని పాదాక్రాంతం చేసుకునే ఆయుధాలని తన విజయంతో చెప్పకనే చెప్పాడు భవ్యషా.(చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..) -
అమ్మ కెనడియన్, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..!
కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్‌కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్‌లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్‌లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్ తల్లి, ఇటాలియన్ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్‌కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్‌లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్‌హుడ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్ భవన్లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్‌కి తాను తల్లిదండ్రులతో భారత్‌లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.జీవితమే మారిపోయింది.. కాగా, బియాంకా నీడు తాను భారత్‌లో పెరగడం వల్ల తన లైఫ్ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్‌లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్‌లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా. View this post on Instagram A post shared by Bianca Nieddu (@biancanieddu) (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
ఈ మొక్కలు వేటాడతాయి!
మనుషుల్లో మాదిరిగా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నట్లుగానే మొక్కలలో కూడా ఉంటాయి. కొన్ని మొక్కలు సూర్యకాంతిని, నేలనుంచి పోషకాలను తీసుకుని జీవిస్తాయి. మరికొన్ని మొక్కలు మాత్రం అలా కాదు ఆహారం కోసం ఇతర వనరులపై ఆధారపడతాయి. అవే మాంసాహార మొక్కలు.. ప్రకృతిలో ఈ మొక్కలు భిన్నంగా ఉంటాయనేది మీకు తెలుసా..?నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ఈ నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ పోషకాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నా... కొన్ని రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అటువంటి మొక్కలను ‘కార్నివోరస్ ప్లాంట్స్’ లేదా మాంసాహార మొక్కలు అంటారు. వీటికి పత్రహరితం ఉన్నప్పటికీ, కొందరు పూర్తిగా, మరికొందరు పాక్షికంగా వేరే జీవులపైన ఆధారపడతాయి. మరెందుకని ఆ మొక్కలు మాంసాహారంగా మారాయి? మామూలుగా మొక్కలకు ఎదుగుదలకు, ఇతర జీవక్రియలకు అవసరమయ్యే ముఖ్య పోషకాల్లో ఒకటి నైట్రోజన్. ఇది నేలలో లభిస్తుంది. అయితే, కొన్ని ప్రాంతాల నేలల్లో నైట్రోజన్ సరిపడా ఉండదు. అటువంటి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు... కీటకాలు లేదా ఇతర చిన్న జీవులను పట్టుకుని, వాటి నుంచి నైట్రోజన్‌ను తీసుకుంటాయి. ఈ మాంసాహార మొక్కలు (Carnivorous Plants) నీటిలో, ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే చిత్తడి నేలల్లో పెరుగుతాయి.మాంసాహార మొక్కల్లో రకాలు.. మాంసాహార మొక్కల్లో రకాలు ఈ మొక్కలన్నిటికీ వేటాడుకునే, ఆహారం పట్టుకునే పద్ధతులు వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలు కీటకాలను ఆకర్షించడానికి తీయని మకరందాన్ని స్రవిస్తాయి. మరికొన్ని ఆకులను ఉపయోగించి వేటాడతాయి. కొన్ని మొక్కలు కీటకాలు దానిపై వాలగానే మూసుకుపోతాయి. మరికొన్ని జిగురు వంటి ద్రవాన్ని స్రవించి, కీటకాలను అంటి పెట్టుకునేలా చేస్తాయి. మరికొన్ని మొక్కలు ప్రత్యేక ఆకారం ఉన్న గదులను కలిగి, అందులో కీటకాలు పడగానే బయటకు రానివ్వవు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ మొక్కలు వేటాడతాయి. ఈ మాంసాహార మొక్కలు భూమిపై దాదాపు 630 జాతుల్లో ఉన్నట్లుగా చెబుతారు. ఈ మాంసాహార మొక్కల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?వీనస్ ఫ్లైట్రాప్వీనస్ ఫ్లైట్రాప్ దీనిని ఫ్లైట్రాప్ అని కూడా అంటారు. ఇది నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో ఉంటుంది. చిత్తడి నేలల్లో పెరిగే అరుదైన మొక్క. దీని ఆకులు రెండు వైపులా ముడుచుకుని పోయే విధంగా ఉంటాయి. లోపలి భాగంలో కీటకాలు వాలగానే దవడల్లా మూసుకుపోతాయి. ఈ ఆకుల అంచులలో వెంట్రుకల వంటి కొసలు ఉంటాయి. కీటకం పడగానే, వెంట్రుకల వంటి భాగాలు అడ్డుగా మారి, కీటకం బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఆ తర్వాత మొక్క జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, కీటకంలోని పోషకాలను సంగ్రహిస్తుంది. జీర్ణక్రియ పూర్తవడానికి సుమారు 10 రోజులు పడుతుంది.జీర్ణక్రియ అయిపోయిన తర్వాత, ఆకు మళ్లీ తెరుచుకుంటుంది. సన్‌డ్యూ ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 జాతుల్లో లభిస్తుంది. దీని ఆకులు సన్నని వెంట్రుకల మాదిరిగా, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. దీని కొనభాగం తీయని జిగురువంటి ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షించి, వాటిని బంధిస్తుంది. పట్టుకున్న తర్వాత, మొక్క కీటకాలను చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవిస్తుంది.నెపెంథస్.. ఇది ఒక రకమైన క్లైంబింగ్ మొక్క. దీని ఆకులు కిందకు వేలాడుతూ కుండ లేదా పిచర్ ఆకారంలో ఉంటాయి. దీని లోపలి భాగం తేనెవంటి మకరందాన్ని స్రవిస్తుంది. తీయని వాసనతో ఆకర్షించబడిన కీటకాలు అందులోకి జారుతాయి. లోపలి భాగం జిగురుగా, జారుడుగా ఉండడం వల్ల కీటకాలు బయటకు రాలేవు. కింది భాగంలో జీర్ణక్రియ ఎంజైములు ఉంటాయి. అందులో పడిన కీటకాలను జీర్ణం చేసుకుని పోషకాలను తీసుకుంటుంది. ఈ పిచర్ ప్లాంట్ జాతులలో కొన్ని.. చిన్న ఎలుకలను, ఇతర చిన్న జీవులను కూడా తినేంత పెద్దవిగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో ఈ మొక్కలు పెరుగుతాయి. కాటిల్ పర్పుల్ పిచర్ ఇవి కీటకాలను పట్టుకోవడానికి ప్రత్యేక ఆకారం ఉన్న ఆకులను కలిగి ఉంటాయి. పిచర్ ఆకారంలో ఉండే ఆకుల్లో వర్షపు నీరు నిల్వ అవుతుంది. కీటకాలు అందులో పడగానే బయటకు రాలేవంత బలంగా ఉండే వెంట్రుకల వంటి నిర్మాణాలు లోపలి వైపు ఉంటాయి. సాలీడులు, ఈగలు, చీమలు వంటి వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా చిత్తడి నేలల్లో పెరుగుతాయి.చదవండి: కావేరి వామన్.. ఐదడుగుల అరటి!వాటర్వీల్ ప్లాంట్.. ఇది నీటి అడుగున పెరుగుతుంది. ఈ మొక్క కీటకాలను పట్టుకోవడానికి వీనస్ ఫ్లైట్రాప్ని పోలిన యాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తుంది. నీటిలోని చిన్న చిన్న కీటకాలు ఆకులపై వాలగానే, అవి చాలా వేగంగా మూసుకుపోతాయి. ఇది ప్రధానంగా ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని మురికి నీటిలో పెరుగుతుంది. బటర్వార్ట్ ఈ మొక్కలు ఆకుపచ్చ, పసుపు లేదా గులాబీ రంగుల్లో కనిపిస్తాయి. దీని ఆకుల పైభాగం జిగురుతో కప్పబడి ఉంటుంది. ఇది కీటకాలను పట్టుకోవడానికి సన్‌డ్యూ మొక్కను పోలిన విధానాన్ని అనుసరిస్తుంది. చిన్న చిన్న కీటకాలు ఆ జిగురుకు అతుక్కుపోతాయి. పట్టుకున్న తర్వాత, ఈ మొక్క ఆకును నెమ్మదిగా కీటకం చుట్టూ చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, పోషకాలను గ్రహిస్తుంది. ఈ మొక్కలు ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియాలోని చిత్తడి నేలల్లో పెరుగుతాయి.కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్.. కోబ్రా లిల్లీ దీనిని కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా కాలిఫోర్నియా, ఒరెగాన్ ప్రాంతాల చిత్తడి నేలల్లో పెరుగుతుంది. దీని ఆకు, కోబ్రా పాము తల మాదిరిగా ఉంటుంది. లోపలికి జారుడుగా ఉండే ఆకుల్లోకి కీటకాలు వెళ్ళగానే, వెనుకకు రాలేక లోపల చిక్కుకుంటాయి. ఇవి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. డయోనియా మస్సిపుల లేదా వీనస్ ఫ్లైట్రాప్, ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అందమైన మాంసాహార మొక్కల్లో ఒకటి. ఇది కీటకాలను పట్టుకోవడానికి దాని ఆకులను ఉపయోగించి వేగంగా మూసుకుపోతుంది. డ్రోసెరా లేదా సన్‌డ్యూ మొక్క, జిగురు లాంటి ద్రవాన్ని స్రవించి కీటకాలను బంధిస్తుంది. - పసుపులేటి వెంకటేశ్వరరావు -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
పర్సనల్ లోన్ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్‌టెక్ ఇన్నోవేషన్‌తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్పీఎల్) స్కీమ్‌లు యువతరానికి స్పీడ్‌గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్‌గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా? -
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్‌టాపిక్‌గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడమే గాకా ఆ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్‌కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్‌తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్‌లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్నారై పోస్ట్) -
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్‌హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్‌లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్‌జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్‌జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్‌లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్‌తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్‌ని సోషల్‌మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్‌లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్‌లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్‌గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్‌లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్‌గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్‌లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్‌లైన్‌లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్‌గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా, మరింత క్రియేటివ్‌గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్‌గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్‌కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్‌గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి -
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్‌లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్‌ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్‌లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్‌లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్‌ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్‌లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్‌లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్‌రోల్‌మెంట్స్‌లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్‌నెస్‌కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్‌లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్‌సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్‌లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఫండింగ్‌కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్‌బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్‌సైట్.ఏఐ. -
సెలవులు పెట్టి.. చెక్కేస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ నెల అంటే హైదరాబాద్ నగర వాసులకు ప్రత్యేకమైన క్రేజ్.. ఏడాది చివరి నెలగా మాత్రమే కాకుండా లాంగ్ లీవ్స్ ఫెస్టివల్‌గా మారింది. ఏడాదిగా దాచుకున్న లీవ్స్‌ను ఐటీ ఉద్యోగులు ఈ ఒక్క నెలలోనే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థల్లో ఈ కల్చర్ స్పష్టంగా కనిపిస్తోంది.హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్వంటి ప్రాంతాల్లోని ఐటీ ఆఫీసుల్లో డిసెంబర్ మొదలవుతూనే లీవ్ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా కంపెనీల్లో ఈ సమయంలో లీవ్స్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉండవు. దీనికి ప్రధాన కారణం.. క్రిస్మస్ పండుగ. నగరంలో పనిచేస్తున్న అనేక విదేశీ ఎమ్ఎన్సీ కంపెనీలు క్రిస్మస్ను (Christmas) ప్రధాన పండుగగా భావిస్తాయి. అందువల్ల ఈనెల చివరి రెండు వారాలు ఆఫీసుల్లో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది.ట్రావెల్ ట్రిప్స్.. డేట్స్ ఫిక్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐటీ ఉద్యోగులు లాంగ్ లీవ్స్ (Long Leaves) ప్లానింగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొందరు వారం నుంచి పది రోజులు లీవ్స్ కలిసొచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుని, దేశవ్యాప్తంగా ట్రావెల్ ట్రిప్స్‌కు బయలుదేరుతున్నారు. గోవా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్స్‌కు నగరం నుంచి భారీగా బుకింగ్స్ పెరిగాయి. ఫ్లైట్స్, ట్రైన్స్, హోటల్స్ ఫుల్ అవుతున్నాయి.ఇంకొందరు ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి స్వగ్రామాలకు వెళ్లి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏడాదంతా నగర జీవనశైలిలో బిజీగా ఉండే వారికి, ఈ లాంగ్ లీవ్స్ కుటుంబంతో గడిపే అమూల్యమైన సమయంగా మారుతోంది. మరోవైపు యువత మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్, బీచ్ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు (New Year Celebrations) ప్రాధాన్యత ఇస్తున్నారు.సిటీ లైఫ్ ఆస్వాదించొచ్చు.. లాంగ్ లీవ్ కల్చర్‌లో (Long Leave Culture) అందరూ నగరం విడిచి వెళ్లిపోతున్నారు అనుకోవడం కూడా తప్పే. భాగ్యనగరంలోనే ఉండి సెలబ్రేషన్స్ చేసుకునే బ్యాచ్ కూడా ఉంది. ఈనెలలో నగరమంతా ఈవెంట్స్‌తో కళకళలాడుతుంది. మాల్స్, పబ్బులు, క్యాఫేలు, క్లబ్బులు ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నాయి. లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, ఫుడ్ ఫెస్టివల్స్ నగర యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ వల్ల నగర లైఫ్ స్టైల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ట్రాఫిక్ కొంతమేర తగ్గడం, ఐటీ ఏరియాల్లో ఆఫీసుల హడావుడి తగ్గిపోవడం సాధారణంగా మారింది. చాలా మంది ఉద్యోగులు ఈ నెలను వర్క్ ఫ్రీ మంత్‌గా అభివర్ణిస్తున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు డిసెంబర్ ఒక బ్రేక్‌లా ఉపయోగపడుతోందని ఉద్యోగులు భావిస్తున్నారు.నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం.. డిసెంబర్ నెల (December Month) ఇప్పుడు కేవలం క్యాలెండర్ చివరి నెల మాత్రమే కాదు. ఐటీ ఉద్యోగుల జీవితాల్లో ఇది రిలాక్సేషన్, ట్రావెల్, సెలబ్రేషన్స్‌కు సంకేతంగా మారింది. కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు టెకీలు సిద్ధమవుతున్నారు. లాంగ్ లీవ్స్ ట్రెండ్ సిటీ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫాంలకు ఈ నెల పీక్ సీజన్‌గా మారింది.చదవండి: ఆహా అనిపించే సినిమా లొకేషన్లుఅలాగే నగరంలోని కెఫేలు, పబ్బులు, ఎంటర్టైన్మెంట్ జోన్లలో ఫుట్‌ఫాల్ గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు కంపెనీలు కూడా టీమ్ అవుటింగ్స్, ఇయర్ ఎండ్ పార్టీలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో మోరల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ నెల సిటీలో కేవలం సెలవుల సీజన్ మాత్రమే కాదు, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రతీకగా మారుతోంది. -
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్) -
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..) -
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?) -
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్‌ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్‌తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?) -
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్‌లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్‌లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. లీప్ ఇయర్‌ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్‌నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్‌ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్‌ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్‌ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?) -
క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు, చాలా దేశాల్లో ఆ రోజున సెలవుదినoగా పరిగణిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క రోజో నాలుగైదు రోజులో కాదు... నెలల తరబడి క్రిస్మస్ వేడుకలు జరిగే దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఫిలిప్పీన్స్, అక్కడ క్రిస్మస్ అంటే ఒక సెలవుదినం కంటే కూడా చాలా ఎక్కువ. దాదాపు సగం సంవత్సరం పాటు విస్తరించింది. తద్వారా ఫిలిప్పీన్స్ సుదీర్ఘ పండుగ అసాధారణమైన వేడుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.స్థానికంగా కపాస్కుహాన్ అని పిలువబడే పండుగ సీజన్ సెప్టెంబర్ ప్రారంభంలోనే రేడియో పెరోల్స్లో క్రిస్మస్ సంగీతం ప్లే చేయడంతో ప్రారంభమవుతుంది అప్పటి నుంచే అక్కడ ఇళ్లను ప్రకాశవంతమైన రంగుల నక్షత్ర ఆకారపు లాంతర్లతో అలంకరిస్తారు. ‘బెర్ నెలలు‘ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు)గా పేర్కొనే ఇవి సెలవుదినం వరకూ కొనసాగుతాయి. నిదానంగా ప్రారంభమై డిసెంబర్ నాటికి, మతపరమైన సేవలు, కుటుంబ సమావేశాలు అర్ధరాత్రి విందులు జరిగినప్పుడు ఉత్సవాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.అయితే ఈ వేడుకలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబరు 25న కూడా ముగియకపోవడం గమనార్హం. నూతన సంవత్సరం తర్వాత కూడా, తరచుగా జనవరి మూడవ ఆదివారం శాంటో నినో విందులతో వేడుకలు కొనసాగుతాయి. ఇంకా, కొంతమంది కాథలిక్కులకు, ఈ సీజన్ ఫిబ్రవరి 2, కాండెలేరియా విందు వరకు కొనసాగుతుంది, చివరకు ఆ సమయంలో అలంకరణలు తొలగించడం మొదలవుతుంది.ఫిలిప్పీనో క్రిస్మస్ మూలాలు శతాబ్దాల క్రితం ఉన్నాయి. 16వ శతాబ్దంలో క్రై స్తవ మతం రాకముందు, స్థానిక కమ్యూనిటీలు మొక్కలు నాటడం, అలాగే వ్యవసాయ పంటలతో ముడిపడి ఉన్న ఆచారాలను నిర్వహించేవారు, విందులు, సంగీతం, ఆత్మలు, దేవతలకు అర్పణలు వీటిలో భాగంగా ఉండేవి. స్పానిష్ వలసరాజ్యం ఈ పద్ధతులను క్రమంగా ఆవాహన చేసుకుంటూ కాథలిక్ సంప్రదాయాలను తీసుకువచ్చింది విశ్వాసం పండుగ ల ప్రత్యేకమైన మిశ్రమాన్ని సృస్టించింది. రికార్డుల ప్రకారం, ఫిలిప్పీన్స్ లో మొట్టమొదటి క్రిస్మస్ వేడుక డిసెంబర్ 1565లో సెబులోని ఫోర్ట్ శాన్ పెడ్రోలో జరిగింది, కాలక్రమేణా, ఊరేగింపులు వంటి కాథలిక్ ఆచారాలు స్థానిక ఆచారాలతో విలీనం అయ్యాయి, ఇది నేటికీ పాటిస్తున్న సంప్రదాయాలకు దారితీసింది.అలాగే, శాశ్వతమైన ఫిలిప్పీన్స్ వేడుకలలో సింబాంగ్ గబీ ఒకటి, ఇది డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరిగే తొమ్మిది తెల్లవారుజామున ప్రార్థనల శ్రేణి. మొదట 1668లో నమోదు చేయబడిన ఈ ఆచారాన్ని మిషనరీలు ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం నాటికి, సేవలు తెల్లవారుజామునకు మారాయి, ఇది రైతులు పొలాల్లో పని చేయడానికి ముందు హాజరు కావడానికి వీలు కల్పించింది. దీనిని మిసా డి గాల్లో (‘కోడి ప్రార్థన‘) అని పిలుస్తారు. ప్రార్థన తర్వాత, ఆరాధకులు బిబింకా (బియ్యం కేక్) పుటో బంబాంగ్ (ఊదా రంగులో ఉడికించిన బియ్యం) వంటి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తొమ్మిది ప్రార్థనలను పూర్తి చేయడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లేదా శుభాకాంక్షలు లభిస్తాయని నమ్మకం. -
క్రిస్మస్ కాంతులు
అవి బెత్లహేము పొలాలు. చిమ్మ చీకటి రాత్రి కాపరులు గొర్రెలను కాస్తున్నారు. అడవి మృగాలు వాటికి హాని చేయకుండా కొందరు కావలిగా ఉండి, మరికొందరు నిద్రిస్తుండగా ఆకస్మికంగా పొలాలపై దేదీప్యమైన వెలుగు కనిపించి, మధురమైన గానాలు ఆకాశం నుండి వినిపించగా, గొర్రెల కాపరులు తత్తరిల్లారు. కాపరులు భయంతో ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక గొప్ప శుభవార్త పరలోకము నుండి వచ్చిన దేవదూతలు సమూహముగా ఆకాశవాణి వలే వినిపింపచేశారు.‘‘భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు.’’ (లూకా 2:10,11) మెస్సయ్య కొరకు ఎదురుచూస్తున్న యూదులకు ఆ సమాచారము సమాధానం, సంతోషం కలిగించింది. ఇట్లు ఏసుప్రభు జన్మించిన రాత్రి దూతల శుభ సమాచారం ద్వారా క్రిస్మస్ప్రారంభమైంది.దేవుని వాక్యం స్థితిగతులను సవాలు చేయు శక్తి గలదన్న విషయంలో ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాము. ఒకటి దేవుని వాక్యం, రెండు స్థితిగతులను సవాలు చేయగల శక్తి గలదన్న విషయం ఈ రెండు వాక్యాలుగా గమనార్హం. దేవుని వాక్యం అనేది చాలాప్రాముఖ్యంగా శక్తిగలదన్న విషయాన్ని పరిశీలించాలి. బైబుల్ గ్రంధంలో వాక్యం రెండు రకాలు గలదిగా ఒకటి దేవుని వాక్యాన్ని చూస్తాం. వాక్యము (వర్డ్) సజనాత్మకమైన దేవుని వాక్యము, మనతో మాట్లాడే దేవుని వాక్యం (వర్డ్ దట్ స్పీక్స్), ఈ రెండు విషయాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. బైబుల్ గ్రంధం ΄ాతనిబంధన పరిశీలించినట్లయితే ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించబడ్డాయని స్పష్టీకరించింది. ఆది: 1:1). ఆదికాండం ఒకటి, రెండు అధ్యాయాలలో సృష్టి ఏ విధంగా సృజించబడిందో స్పష్టీకరించబడింది. అయితే ప్రత్యేకంగా యోహాను సువార్తీకుడు స్పష్టంగా చె΄్పాడు. అదేమనగా ఆదియందు వాక్యముండెనని వాక్యం దేవుని వద్ద ఉన్నదని, ఆ వాక్యం దేవుడై ఉన్నదని ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నారని తెలియజేయబడింది. (పరి. యోహాను 1:1) ఇందులో మూడు విషయాలు గ్రహించగలిగితే యేసుక్రీస్తు ఎవరు? ఈ భూలోకంలో ఎలా జన్మించాడో అన్న విషయం తెలుసు కుంటాము. ఆ విషయం తెలుసుకున్నట్లయితే ‘‘క్రిస్టమస్‘ పండుగ గూర్చి స్పష్టంగా అర్థం చేసుకోగలం.క్రిస్టమస్ పండుగ గురించి, దైవజనుడైన ఆర్.ఆర్.కె. మూర్తి గురించి తెలియని ప్రజలుండరు. ఎందుకంటే రవి అస్తమించిన చోటను కూడా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించబడినట్లు గతకాలంలో ఆయన చేసిన సువార్త క్రైస్తవులు వెళ్ళలేని క్రైస్తవేతరుల గృహాల్లో ఆయన ప్రసంగాలు ‘విశ్వవాణి’ అనే సువార్త మాధ్యమం ద్వారా (రేడియో) ప్రతి రాత్రి 7 గంటలకు ప్రసారం కాబడింది. ఆ విధంగా ప్రసారాలు ఆయన వాక్యం ద్వారా ఆంధ్ర ప్రజలు, అటు భారతదేశం అంతటా ప్రసారాలు వీక్షించారని గుర్తించబడిన దైవ సేవకుడు. అంతేకాదు సువార్తలో ‘‘మతం వద్దు, యేసు వాక్యం ముద్దు’’ అని చె΄్పారు. కొందరు మారు మనస్సు కూడా పొదారన్న విషయం తెలిసినదే.క్రిస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. ఆ లాగున క్రిస్మస్ అనే దైవారాధన దినోత్సవంగా జరుపుబడు పండుగే క్రిస్టమస్.మహా దేవదూతలు సైన్యాలకు అధిపతియైన యెహోవా ‘‘పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు’’ అని నిత్యం కొలువబడు దేవుడు అనగా ‘ఎలోహీం’ అనే హెబ్రూ పదం. దీనిని ఇశ్రాయేలీయులు ఉచ్చరించరు. ఎందుకంటే అది పవిత్రనామం. దాని అర్థం సర్వశక్తిగల దేవుడని అర్థం. ఆ పదానికి బదులు ‘ఎదోనాయ్’ అని సంబోధిస్తారు. అట్టి దేవుడైన సర్వేశ్వరుడి తనయుడు శరీరధారిగా జన్మించిన రోజు క్రిస్మస్. శరీరధారిగా జన్మించాడు కాబట్టి అత్యధిక సంవత్సరాలు అనగా 969 సంవత్సరాలు జీవించిన మెతూషలా చనిపోయాడు. (ఆది: 5:27. అంతేకాదు మరణం జయించి బతుకు నరుడెవ్వరు లేరు. అందుచేత నరావతారిగా ఆయన జన్మించినందుననే మరణించాడు, నీ, నా ΄ాపమనే దోష నిమిత్తం దోషరహితుడు చనిపోయాడు.వాక్ అనే వాక్య రూపకమైన శబ్దం వివిధ భాషలలో అనగా హెబ్రూ భాషలో ‘దాబార్’ అని, గ్రీకులో ‘లాగాస్’ అని, ఇంగ్లీషులో ‘వర్డ్‘ అని, సంస్కృతంలో ‘వాక్’ అని, తెలుగు లో వాక్యమని అంటారు. భారతీయతత్వంలో ‘ప్రణవనాదం’ అంటారు. ఆ శబ్దమనే ప్రణవనాదం యేసునాథుడుగా జన్మించాడు.ఈ రక్షకుడు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో క్రై స్తవులు చర్చీలలో బాలయేసు భజన చేయుచు భక్తులు నూతన వస్త్రధారణతోనూ, సంగీతసునాదములతోను జరుపుకొంటారు. (మత్తయి: 1:21). సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తు కృప మనందరికి తోడైయుండును గాక. ఆమెన్! – కోట బిపిన్ చంద్ర΄ాల్ఏటేటా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకొనుచున్నారు. పోప్ జూలియస్ వన్, క్రీస్తుశకం 353 డిసెంబర్ 25 నాడు క్రిస్మస్పే అధికారికంగా ప్రకటించారు. తేదీ ఏమైనా ప్రభువు జన్మ చరిత్రాత్మకం యేసును పశువుల శాలయందు తొట్టిలో మొదట ఆ రాత్రి కాపర్లు చూచి ఆయన జన్మ వార్తను మొదట మిషనరీలవలే ప్రకటించారు. దేవుడు సామాన్యులను తన పనిముట్లుగా ఎన్నుకుంటే అసమానంగా ఖ్యాతి లోనికి తెస్తారు. తదుపరి కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీన 328/30 బి.సి. యేసు జన్మస్థానాన్ని కొత్తగా నిర్మించి లాటిన్ భాషలో ‘ఇచ్చట కన్య మరియ కుమారుడు పుట్టాడు,’ అని వ్రాయించాడు. నేటికిని ఏసుప్రభు జన్మస్థానం బెత్లెహేములో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు దర్శించి ధన్యలగుచున్నారు .‘‘ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్ధము.’’ (యెషయా 7:14) (మత్తయి 1:22) పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ క్రీస్తుకు జన్మనిచ్చుటచే ఆయనకు జన్మ ΄ాపము లేదు. ప్రభువు చెప్పినట్లు నాలో ΄ాపమున్నదని ఎవరు స్థాపించుదురు అన్నట్లు ఆయన జన్మ, కర్మ ΄ాపము లేని నరావతారుడు గనుక తన ప్రజలను వారి ΄ాపముల నుండి రక్షించును అని అర్థమిచ్చు విధంగా యేసు అను పేరు పెట్టబడింది. ΄ాపప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుని గొర్రెపిల్ల క్రిస్మస్ నాడు జన్మించిన యేసే. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన క్రైసట్ మాస్. ప్రభువు ముప్పదిమూడున్నర సంవత్సరాల భూలోక యాత్రలో ఆయన దైవ కుమారునిగా సామర్థ్యము, సార్ధక నామము యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించెను. ‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’’ (యెషయా 9:6)మానవులను మారుమనసు ద్వారా చనిపోయిన తర్వాత పరలోకానికి చేర్చుటకే భూలోకానికి యేసు క్రీస్తు క్రిస్మస్ నాడు అవతరించెను. సువార్తలలో యేసు చేసిన గొప్ప కార్యములు, సేవ ఫలితం చదివినప్పుడు ఇది ముమ్మాటికి నిజమని తెలియజేయుచున్నది.క్రిస్మస్ లో మానవాళి ఎడల దేవుని ప్రేమ మిళితమై ఉన్నది. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొదునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16)దేవుని కుమారుడు, మానవ కుమారులను దైవసుతులుగా చేయుటక జన్మించెనని పరిశుద్ధ అగస్టిన్ తెలిపెను. ప్రేమ లేనిచోట ప్రేమ విత్తటానికి, సమాధానం లేనిచోట సమాధానం ఇవ్వటానికి, దేవదూతలు వారి గాన ప్రతిగానములలో ΄ాడారు. ‘‘సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమను కలుగును గాక.’’(లుకా 2:14) హదయములో, కుటుంబములో, సమాజంలో, భూమిపై యుద్ధములు కలహములు లేక నెమ్మదిగా వర్ధిల్లుటయే క్రిస్మస్ యొక్క సంకల్పము.మదర్ థెరిస్సా కు ఒక విలేకరి ప్రపంచ శాంతికి సూత్రం అడిగాడు. అప్పుడు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించమని చె΄్పారట. యేసు సమాధానకర్త. ఆమె ఐదు రూ΄ాయలతో మానవసేవప్రారంభించింది. ప్రపంచ శాంతి బహుమతికి ఆమె యోగ్యురాలే. ΄ాపం, శాపం సాతాను వల్ల స్వార్థం, ఒత్తిడి, ధనాశ వల్ల అసమాధానం పొగుచున్న ఈ అల్పకాల జీవితంలో వెంట తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. మనము శూన్యమని గ్రహిస్తే శాంతికామకులము ప్రధాతలు అవుతాము. సమాధాన కుమారుడు లేకుండా దేవుడు కుమారుడు కాడని రిచర్డ్ బ్యాక్సా్టర్ అన్నారు.క్రిస్మస్ వేళ ఎక్కడ చూసినా నక్షత్రాలు చూస్తాము. దానికి కారణము బైబిల్ లో బిలాము ప్రవక్త ప్రవచించిన ప్రకారము ‘‘నక్షత్రం యాకోబులో ఉదయించును రాజ దండము ఇశ్రాయేలులో నుండి లేచును’’ (సంఖ్య 24:17). తూర్పున ఆకాశమందు ఆనాడు వెలసిన నక్షత్రము (మత్తయి 2:2) నందు నెరవేరినది. ఆ నక్షత్రం చూచి జ్ఞానులైన రాజులు బెత్లెహేములో యేసును దర్శించి వారు బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించి, సమర్పించి హేరోదు రాజు యేసుని చంపగోరుచుండగా వారు వేరొక మార్గమున స్వదేశమునకు వెళ్లి క్రిస్మస్ చరిత్రలో నిలిచిపోయారు. బంగారం దైవత్వానికి, సాంబ్రాణి యాజకత్వమునకు, బోళము ఆయన మరణమునకు సాదశ్యంగా ఉన్నది అని గ్రహించి దూరము నుండి వచ్చిరి.‘‘సత్యమైనది దూర ంగానూ బహులోతుగాను ఉన్నది’’ (ప్రసంగి7:24) అని గ్రహించారు. విలువైనవి రక్షణ, దైవ ఆరాధన ఉచితమే గాని మానవుని ఇష్టం, కొంత ప్రయాస అవసరము అని జ్ఞానుల వృత్తాంతము నందు బైబిల్లో తెలియజేస్తుంది. లోకంలో ఉన్న పలు విధాల నక్షత్రాలు ఉన్నను తోటి వారికి పరలోకం చూపగలిగితేనే చరిత్ర, నిజ నక్షత్రాలు. ‘‘బుద్ధిమంతులు అయితే ఆకాశమండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు.’’(దానియేలు 12:3). జీవించినప్పుడే కాక లోకానికి దారి చూపు ప్రకాశం కలిగియుండువారే నిజ నక్షత్రాలు. తత్కాల వుల్కల వల్ల ప్రయోజనం లేదు. ‘‘యోహాను ప్రజ్వలించు ప్రకాశించు దీపము (యోహాను 5:13). ఒకసారి ఒక పంది ఒక ఆవు, నేను సమాజానికి సేవ చేస్తున్నామని పోటీ పడినయట. అయితే ఆవు నేను బ్రతికుండగానే ΄ాలు ఇచ్చి లోకానికి మేలు చేస్తున్నాను, ఓ పంది నీవు చనిపోయిన తర్వాత మాత్రమే నీ యొక్క మాంసాన్ని ప్రజలకు ఇవ్వగలవు అని చెప్పిందట. నిజమే బ్రతికున్నప్పుడు చేయకుండా చనిపోయిన తర్వాత ఏదో చేస్తామనుకోవటం అది మిద్యమాత్రమే.క్రిస్మస్ అనగా మహా సంతోషం, మన అందరిలో మహా సంతోషం సమాదనం కలిగివుండుట. సాతాను క్రియలు విసర్జించుటవలన సమాధానకర్త ఏలును. నోవహు అనగా నెమ్మది. ఆయన కాలంలో జల ప్రళయం వచ్చినను తప్పించబడెను. గిద్యోను బైబిల్ లో సమాధాన కర్త. క్రిస్మస్ అనగా పంచుట, ఇచ్చుట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. క్రిస్మస్ లో, దేవాది దేవుడు మానవుడిగా తగ్గించుకున్నారు. (మత్త 11:28); (ఫిలిప్పి 2:5–8). దీనులదే పరలోకం. అందం, ఆస్తి, ఆధికారం మొదలైన అతిశయాలు అనర్థాలవుతాయి. యేసు పశువుల తొట్టిలో పరున్నను నేడు పరలోకములో తండ్రి కుడి ΄ార్శ్వమున నుండి ఎలుచున్నాడు. క్రిస్మస్ అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుట. కన్నులు పైకెత్తి చూచి పరలోక అశ్వర్యము పొదుట.చైనాలో మిషనరీ గా వెళ్ళిన హడ్సన్ టైలర్ ఇలా అన్నాడు – వెయ్యిపండ్లు వున్న చైనాకే. వెయ్యి జీవితాలున్న ఉన్న చైనాకే సమర్పిస్తాను. ఈనాడు అభాగ్యులు, నిరాశపరులు, వ్యాధి బాధ కరువు కాటకములలో వున్నవారి స్వరం మనం వినగలిగితే మన పరిధిలో త్యాగం, ప్రేమ, చూపగలిగితే అదే నిజమైన క్రిస్మస్. ఆ విధంగా భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఈ సువార్త వల్ల మేలు చేయుటయే నిజ క్రిస్మస్.అందరికీ క్రిస్మస్ శుభములు.– తంటిపూడి ప్రభాకరరావు ‘‘ఆది’’ అనే వాక్యం గూర్చి ఆలోచన చేస్తే ‘‘ఆది’’ అనగా ఆది లేని ఆది (బిగినింగ్ లెస్ బిగినింగ్)గా చూస్తాం. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే త్రిత్వంలోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవత్వంలోని రెండవ (కుమారుడైన) వ్యక్తే యేసు క్రీస్తుగా గమనించగలం. యెహెూవా వాక్కు చేత భూమి, ఆకాశం సృజించబడ్డాయని, ఆయన (దేవుడు) వాక్కును పంపి వారిని స్వస్థపరచాడనిస్పష్టీకరించబడింది. ఆయన (దేవుడు)వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. (కీర్తన 33:6, 107:20) వచనాలలో చూస్తాం. ఆ వాక్యమే సర్వేశ్వరుని తనయుడైన యేసుక్రీస్తుగా నరావతారిగా శరీరధారిగా దివి నుండి భువికి దిగివచ్చి అనేకులను స్వస్థపరచాడు. పడిన గోతిలో నుండి అనగా ΄ాపమనే దుష్కార్యాలను, ఉపమానాల ద్వారా ప్రబోధించి, తండ్రి ఆనుమతి ప్రకారం ఈ లోకంలో మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుగా జన్మించాడు. నేటికి 2025 సంవత్సరంలో ఆయన జయంతిని భారతదేశం, ΄ాశ్చాత్య దేశాల వారు జరుపుకొనే పండుగే క్రిస్మస్.యేసు అందరికీ రక్షకుడు గనుక అన్ని దేశముల వారికి, అన్ని తెగల, జాతుల, సకల మానవాళి కొరకై సిలువపై పాపప్రాయశ్చిత్తంగా, తన నిర్దోషరక్తము చిందించుట కొరకు వచ్చుటచే, క్రిస్మస్ లో యేసును ఆరాధించుట భావ్యమే. క్రిస్మస్ లో దేవదేవుని ప్రణాళిక ‘‘నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. (లూకా 19:10) ఈనాడు, ఈ యుగంలో సమాజం పాలకు, వ్యసనాలకు బానిసయై, వ్యాధి బాధలకు లోనగుచు నశించుచున్నారు. అందుకే రక్షకుని అవసరత ఉన్నది. ఆయన పాపులను రక్షించుటకే పుట్టెను. -
సర్వ మానవాళికి శుభ సందేశం క్రిస్మస్
దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే తొలి మానవుడిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేలమంటితో నిర్మించాడు. తొలి భార్య భర్తలైన హవ్వ ఆదాములతో అందమైన ఏదెను తోట ఏర్పాటు చేసి స్నేహితునిలా కొనసాగాడు. అయితే దుష్టుడైన సాతాను ప్రభావంతో వారు దేవుని ఆజ్ఞ మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఫలితంగా మానవులకు మరణం సం్రపాప్తమైంది. భూమి శపింపబడింది. భూమిపై మానవ మనుగడ కష్టతరంగా మారింది.అయితే తాను సృష్టించిన మానవుడిని మాత్రం దేవుడు ఎప్పుడూ విడిచి పెట్టలేదు. భూమిపై అక్రమం, స్వార్థం, హింస పెరిగిన తరుణంలో మానవులను రక్షించేందుకు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఏర్పాటు చేసినా మానవుని స్వభావంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. పాపానికి నరుడు బానిసగా మారిపోయాడు. మోసకరమైన హృదయంతో చీకటితో నిండిన జగతిలో నరకానికి వారసుడయ్యాడు. నరక పాత్రుడైన మానవుడ్ని రక్షించి నిత్య జీవం ఇచ్చేందుకు తిరిగి దేవునితో అనుసంధానం చేసేందుకు పరలోక దేవుడే నరరూపధారుడై రెండు వేల సంవత్సరాల క్రితం దివి నుంచి ఈ భువిపైకి వచ్చేందుకు సిద్ధ పడ్డాడు. మానవుల పట్ల దేవుని అపారమైన ప్రేమకు గొప్ప తార్కాణమే క్రిస్మస్.క్రీస్తు జననం సర్వాధికారియైన దేవాది దేవుని జననం ఎంతో ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం. జగముల నేలే రారాజు అతి సామాన్యుడిగా, దీనుడుగా ఈ ధరిత్రిపై అరుదెంచాడు. అందుకు యూదా దేశంలోని బేత్లెహేము వేదికైంది. ఆ కాలంలో యూదా ప్రాంతం అంతా రోమా చక్రవర్తి కైసరు ఔగుప్తు ఏలుబడిలో ఉంది. హేరోదు యూదా ప్రాంతానికి అధినేతగా యూదుల రాజుగా కొనసాగుతున్నాడు. గలిలయ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి నజరేతు వాడైన యోసేపుకు ప్రదానం చేయబడిన పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు జననం శుభవార్త దేవుని ప్రధాన దూతయైన గబ్రియేలు ముందుగా మరియకు తెలియచేశాడు. దయా్రపాప్తురాలా అంటూ శుభ వచనం పలికి దేవుని కృప పొందిన నీవు పురుష సంయోగం లేకుండా కన్యకగానే గర్భము ధరించి ఓ కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు అతడు సర్వోన్నత దేవుని కుమారుడనబడతాడు అని దేవునిదూత చెప్పడంతో నవ యవ్వనంలో ఉన్న మరియ ఎంతో భయపడింది. ఇది ఎలా సాధ్యం అంటున్న తరుణంలో ‘మరియా భయపడకు ఇది కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు...’ అన్న దూత పలుకులను మరియ వినయంగా స్వీకరించింది. మరియ తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిసిన యేసేపు ఆమెను రహస్యంగా వదిలివేయాలని భావిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం యూదుల ఆచారం. అదే సమయంలో ఈ శుభ వర్తమానం దూత ద్వారా యోసేపుకు చేరుతుంది. యేసేపూ భయపడవద్దు మరియను చేర్చుకొనుటకు సందేహింప వద్దు. పరిశుద్ధాత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. ఆమె కుమారునికి యేసు అని పేరుపెట్టాలి ఎందుకంటే తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షిస్తాడు. క్రీస్తు పుట్టుకకు వందల సంవత్సరాలకు ముందే యెషయా, మీకా లాంటి ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాల నెరవేర్పు జరిగింది. మరియ సుతుడికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. యెషయా క్రీస్తు జననాన్ని ప్రవచిస్తూ ‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని పేర్కొన్నాడు. క్రీస్తుకు ముందుగా నడవడానికి వృద్ధ దంపతులైన జెకర్యా, ఎలీసబెతులకు కుమారుడిగా బాప్తీస్మమిచ్చు యోహాను అనుగ్రహించ బడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధత కలవారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.చరిత్ర సాక్షిగా..మానవ చరిత్రలో యేసు నమోదు చేయబడ్డాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. యోసేపు దావీదు వంశములో పుట్టిన వాడు గనుక తనకు ప్రదానం చేయబడిన నిండు చూలాలైన మరియను తీసుకొని గలలియలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేముకు బయలు దేరాడు. ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం ముగించుకొని బేత్లెహేము గ్రామం చేరుకున్నారు. అప్పటికే జనాభా సంఖ్యలో రాయబడటానికి వచ్చిన ప్రజలతో బేత్లెహేము గ్రామం క్రిక్కిరిసి పోయింది. ఓ సత్రపు యజమాని దయతలచి తన పశువుల కొట్టంలో ఉండటానికి వీరికి చోటిచ్చాడు. ప్రసవ దినములు నిండటంతో మరియ శిశువును కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. అవని అంతా ఆయనదే అయినా స్థలం లేక రాజుల రాజుకు చివరకు పశువుల తొట్టె పవళించే పాన్పుగా మారిపోయింది. మనలను ధనవంతులుగా చేసేందుకు ఆయన దరిద్రుడాయేను అన్న లేఖనాల నెరవేర్పు నిజమైంది.దివిలో భువిలో సంబరాలుయేసు జన్మించిన వెంటనే అటు పరలోకంలోనూ ఇటు ధాత్రిలోనూ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరుల వద్దకు ప్రభువు దూత శుభవర్తమానం వెళ్ళింది. ఆ దూత ద్వారా కలిగిన ప్రకాశమైన వెలుగును చూసి వారు భయపడగా దూత భయపడ వద్దని చెప్పి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము తెచ్చానని ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ఆయనే ప్రభువైన క్రీస్తు’ అని ప్రకటించడం జరిగింది. అనంతరం పరలోకం నుంచి దూతల మహా సైన్యసమూహము ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక‘ అంటూ స్తోత్ర గీతాలతో దేవుని మహిమ పరచారు. గొర్రెల కాపరులు వెళ్ళి పశువుల తొట్టిలో పండుకున్న శిశువును చూచి ఎంతో సంబరపడి శిశువును గూర్చి తాము చూసిన సంగతులన్నీ ఊరంతా ప్రచారం చేశారు. యేసు జననం సందర్భంగా ఆకాశంలో ఒక అరుదైన నక్షత్రం వెలసింది. అది చూసిన తూర్పుదేశపు జ్ఞానులు ముగ్గురు తారను వెంబడించి ముందుగా యెరూషలేము చేరుకొని హేరోదు రాజును కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగి తెలుసుకొని బేత్లెహేము చేరుకొని బాల యేసును చూసి అత్యానందభరితులై సాగిలపడి పూజించి తాము తెచ్చిన బంగారము, సాంబ్రాణి, భోళము ప్రభువుకు కానుకగా సమర్పించారు. అలా క్రీస్తు జననం దివిని భువిని ఏకం చేసింది. దేవుడితో మరల మానవుడు పోగొట్టుకున్న సమాధానం కల్పించింది. అందుకే క్రిస్మస్ సర్వ లోక వేడుకగా మారిపోయింది. సామాన్యులకు, జ్ఞానులకు ఒకే పీట వేసింది. అప్పటినుంచే ప్రపంచ చరిత్ర రెండుగా విభజింపబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా పిలువబడింది.క్రిస్మస్ అంటే ఆరాధనక్రిస్మస్ అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించడం. మనకోసం పరలోక భాగ్యాన్ని వదులుకొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎలా జీవించాలో ఆచరణాత్మకంగా చూపించిన ఆ ప్రభువును వేనోళ్ళ స్తుతించడమే నిజమైన క్రిస్మస్. ఆరాధన అంటే అల్లరితో కూడిన ఆట, పాటలు కాదు అంబరాన్ని అంటే సంబరాలు జరపడం కాదు, విందులు వినోదాల్లో తెలియాడటం కాదు, హంగు ఆర్భాటం ఆడంబరాల్లో మునిగితేలడం కాదు.. దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తును హృదయం లో కలిగి ఉండటమే క్రిస్మస్. అదే క్రీస్తుకు కావాల్సిన ఆరాధన. నశించి పోయే ఆత్మలకు నిత్యజీవము వర ప్రసాదంగా అందించాడు. నీతివంతమైన జీవితం, మారుమనస్సు, రక్షణ ద్వారా ఇది సాధ్యం అని చె΄్పాడు అంతేకాదు ఈ లోకాన్ని జయించడానికి కావలసిన ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతం, సహనం, తగ్గింపు, వినయం, ఓర్పు ఎలా కలిగి వుండాలో తన జీవితం ద్వారా నేర్పించాడు. అన్నిటికీ మించి చీకటిలో బతుకుల్లో గొప్ప వెలుగు నింపేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగునైయున్నాను అని ప్రకటించాడు. ఆయనతో నడిచే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్ శుభవేళ మనందరం క్రీస్తు స్వారూప్యంలోకి మారాలన్నది ఆ కరుణామయుని అభిలాష. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక! ఆమేన్ !!!మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.దేవుడే ఎందుకు దిగి వచ్చాడు?క్రీస్తు రాకకు ప్రధాన కారణం పాపులను రక్షించుటకే. తొలి మానవుడు ఆదాము ద్వారా వచ్చిన పాపపు బీజం తీసివేయడానికి తన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువపై బలిదానం ద్వారా ధరవాసులందరికి పాప విమోచన కోసం మనుషుల మధ్య నివసించేందుకు సర్వాధికారియైన దేవుడు శరీరధారి అయ్యాడు. అంతేకాదు యేసు ప్రభు ప్రజలందరికీ రక్షణ సువార్త అందించడం, పాపపు చెరలో వున్న వారికి విడుదల, అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపడం, బాధల్లో నలిగి పోయినవారికి ఓదార్పు విడుదల ఇచ్చేందుకే నేను వచ్చానని ప్రకటించాడు.– స్టెర్జి రాజన్ బందెల సీనియర్ పాత్రికేయులు -
ఇయర్‌ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్‌ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్‌లో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్‌ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్‌ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్‌తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్‌ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్‌ఫోన్స్‌ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?) -
ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్‌లేని ప్రపంచాన్నే ఊహించలేం. అదీగాక చేతిలో ఫోన్ లేకపోతే ఏ పని సాగదు, కాలు కూడా కదపలేం. అంతలా టెక్నాలజీపై ఆధారపడిపోయాం లేదా బానిసలమైపోయాం అనొచ్చేమో..!. ఏ చిన్న సందేహమైనా..ఏదైనా.. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చిటికెలో పనైపోతుంది. అంతలా మనకు అన్నింటిని అరచేతిలోకి వచ్చేసేలా అమర్చి పెట్టేసింది. అలాంటి స్మార్ట్ పోన్ని స్వచ్ఛంధంగా వాడకూడదని నిషేధం విధించుకుంది ఓ గ్రామం. అలా ఎందుకు చేసిందో తెలిస్తే..కచ్చితంగా సెల్యూట్ చేస్తారంతా. అయితే ఇది మరోకంగా విమర్శలకు దారితీసింది. ఆ నిషేధం కూడా సమంజసంగా ఉంటే..ఇతర గ్రామాలకు ఆదర్శంగానూ, అభినందనీయంగానూ ఉండేది. ఇంతకీ ఎందుకోసం స్మార్ట్ ఫోన్‌ని సీరియస్‌గా బ్యాన్ చేశారంటే..రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయట. యావత్తు ప్రపంచం 6జీ వైపు దూసుకుపోతే అక్కడ మాత్రం మహిళలను కీప్యాడ్ పోన్ల యుగానికి వెళ్లిపోదాం అంటోంది. చౌదరి కమ్యూనిటీకి చెందిన సుంధమాతా పట్టి పంచాయితీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా అక్కడ మహిళలు, బాలికలు వినయోగించకూడదు. అత్యవసరం అనకుంటే కీప్యాడ్ ఫోన్లే ఉపయాగించాలి అక్కడి మహిళలు. ఇదంతా ఎందుకంటే..మైబైల్ ఫోన్ ఒక వ్యసనంగా మారి పక్కదారి పట్టిస్తోందని, ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందనే ఆయా గ్రామాలు స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించకూడదని నిషేధం విధించాయట. అంతేగాదు చదువుకునే పిల్లలు సైతం తమ ఇంట్లో ఫోన్ ఉపయోగించుకోవచ్చు గానీ బయటకు తీసుకురావడానికి వీల్లేదట. మహిళలే ఎందుకంటే..కచ్చితం అమ్మతోపాటు పిల్లలు ఉంటారు. దాంతో తరుచుగా చిన్నారులు వాటిని వినియోగించే అవకాశం ఉన్నందున మహిళలు కీప్యాడ్ ఫోన్లే ఉపయోగించాలని నిర్ణయించిందట పంచాయతీ. కాగా, ఆదివారం ఘాజీపూర్ గ్రామంలో జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. 14 పట్టి సమాజం అధ్యక్షుడైన సుజనారామ్ చౌదరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అక్కడి పంచాయతీ ప్రకారం..దేవరామ్ కర్నోల్ వర్గం ముందుకు తెచ్చిన ప్రతిపాదనను పంచ్ హిమ్మతారామ్ చదివి వినిపించారు. చర్చల అనంతరం, సమావేశానికి హాజరైన పంచ్ సభ్యులందరూ ఈ నిబంధనను అమలు చేసేందుకు మొగ్గుచూపారు. ఈ తీర్మానం జనవరి 26 నుంచి అమలవుతుందట.ఏయే గ్రామాల్లో ఇది అమలు అంటే..ఈ నిర్ణయం భిన్మల్ ప్రాంతంలోని పలు గ్రామాలలో అమలు చేయబడుతుంది. వీటిలో ఘాజీపూర్, పావలి, కల్డా, మనోజియావాస్, రాజికావాస్, దట్లావాస్, రాజ్‌పురా, కోడి, సిద్రోడి, ఆల్డి, రోప్సి, ఖానాదేవల్, సావిధర్, హత్మీ కి ధాని, ఖాన్పూర్ గ్రామాలు ఉన్నాయి. నిజానికి పంచాయితీ చర్య సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల సంస్థల నుంచి తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం మహిళా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఏ నిషేధం అయినా లింగ సమానత్వానికి పెద్ద పీటవేసేలా ఉండాలి గానీ, మహిళలే లక్ష్యంగా నిషేధం అంటే సహించదగినది కాదంటున్నారు సామాజికకార్యకర్తలు, మహిళా సంఘాలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది కూడా. (చదవండి: Sobhita Dhulipala: ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! నాటి రాణుల వైభవాన్ని తలపించిలా..) -
ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..!
టాలీవుడ్ నటి, అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల పలు కార్యక్రమంలో స్టైలిష్ల లుక్‌లో కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అంతేగాదు ఆమె ధరించే డిజైనర్ వేర్లు, ఆభరణాలు ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. పైగా ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రతి వేడుకలో ఆమె ఆహార్యం, లుక్ హైలెట్‌గా నిలవడం విశేషం. అక్కినేని వారి కోడలు అంటే రేంజ్ ఇది అన్నట్లుగా లగ్జరీ ఫ్యాషన్ వేర్లతో అదరహో అనేలా తళుక్కుమంటోంది. అంతేగాదు శోభితా అంటే అత్యంత శోభాయమానం అని చెప్పకనే చెబుతోంది తన స్టైలిష్ లుక్‌తో. ఈసారి ఓ ప్రముఖ లగ్జీరి మేకప్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన షార్లెట్ టిల్బరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా గోల్డ్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోయింది. అంతేగాదు ఆ లెహంగాకి బుర్గుండి దుపట్టా జత చేయడంతో అలనాటి రాణుల వైభవంలోకి తీసుకుపోయింది శోభితా స్టన్నింగ్ లుక్. చూపు తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అత్యంత బరువైన బుర్గుండి దుప్పటా మహారాణి మాదిరి రాజదర్పాన్ని అందించింది. అంతేగాదు ఆ దుస్తులు డిజైన్ చేసిన విధానం కారణంగా ఆభరణాలతో పనిలేదనిపించేలా ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దారు వాటిని. ఇక ఈ బుర్గుండి దుప్పటా డీప్ వెల్వెట్ టోన్డ్ కలర్ దానిపై బంగారు ఎంబ్రాయిడరీ అంచు..ఆ గోల్డెన్ కలర్ లెహంగా అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఒక్క దుప్పట కారణంగా రాయల్టీ లుక్ వచ్చింది ఆ లెహంగాకి. అంతేగాదు శోభితా ఈ లెహంగాలో మహారాణి మాదిరిగా, పెళ్లికూతురిలా ధగధగ మెరిసిపోయారామె. నార్మల్ మేకప్‌తో, ఆ లెహంగాకి సరిపడా చోకర్, చెవిపోగులతో చాలా సింపుల్‌గా ఉన్నా..హెవీ డిజైన్‌తో రూపొందిన ఈ లెహంగా మిగతా లోటుని భర్తించేసిందా అనేలా నిండైన అందాన్ని అందించింది. ఇక ఈ గోల్డెన్ లెహంగాను జిగర్ మాలి రూపొందించారు. ఇక రిచ్ బుర్గుండి దుప్పటాను డిజైనర్ నైషా తీర్చిదిద్దారు. కాగా అంతకుముందు శోభితా ఒక ముంబై కార్యక్రమంలో ఇలానే గోల్డెన్ లెహంగాతో పెళ్లికూతురిలా మెరిసిపోగా ఈసారి రాజుల కాలం గుర్తుకుతెచ్చేలా మరో గోల్డెన్ లెహంగాతో మంత్రముగ్ధుల్ని చేసింది. View this post on Instagram A post shared by Nykaa (@mynykaa) బుర్గండీ రంగు దుపట్ట ప్రత్యేకత.. ఇది గాఢ ఎరుపు వైన్ షేడ్‌లో రిచ్‌గా కనిపించే రంగులో ఉండటమే దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ దుస్తులతో జత చేస్తారు. ఎక్కువగా చీర సల్వార్, లెహంగాలతో జత చేస్తే ఒక్కసారిగా రాయల్టి లుక్ వచ్చేస్తంఉది. ఇక్క వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌కి జతచేస్తే..స్టైలిష్‌గా ఉంటుంది. పార్టీవేర్‌కి సిల్క్ లేదా జార్జెట్, డైలీవేర్‌కి కాటన్ లేదా లినెన్, వింటర్లో అయితే శోభితా ధరించినట్లుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో ధరిస్తే లుక్ అదుర్స్.(చదవండి: నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?) -
కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?
ఏటా పెరుగుతున్న భారతీయుల పర్యాటకాసక్తి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది కూడా మనోళ్లు టూర్ ఇష్టులుగానే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని అలీఎక్స్‌ప్రెస్ అనే సంస్థ తాజా ట్రావెల్ ట్రెండ్స్ 2026 నివేదిక వెల్లడించింది. మన వాళ్లు వచ్చే ఏడాది ఏ యే ప్రాంతాలను చూడాలని ఆశిస్తున్నారు? అనేది విశ్లేషించేందుకు అలీ ఎక్స్‌ప్రెస్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పదివేల ట్రావెల్ డేటా పాయింట్లను విశ్లేషించిన ఫలితంగా రూపొందిన ఈ నివేదిక రాబోయే సంవత్సరానికి భారతీయ ప్రయాణికుల ప్రాధాన్య జాబితాలో ఉన్న టాప్ టూరిస్ట్ ప్లేసెస్‌ను ఆవిష్కరించింది. 2026లో భారతీయులు సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న టాప్ 10 గమ్యస్థానాలు ఇక్కడ ఉన్నాయి. జోర్హాట్భారతదేశంలోని అస్సాం రాష్ట్రం ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆసక్తిని బాగా చూరగొంటోంది. అస్సాం హృదయం లాంటి ప్రదేశం జోర్హాట్, విస్తారమైన టీ ఎస్టేట్లు, గొప్ప వారసత్వం, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులికి సమీపంలో టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం చరిత్ర, పచ్చని ప్రకృతి సౌందర్యం, ఉత్సాహభరితమైన అస్సామీ సంప్రదాయాల ప్రశాంతమైన మిశ్రమానికి నెలవుగా ఉంటుంది.జాఫ్నాపామిరాతో కప్పబడిన తీరాలు, పురాతన దేవాలయాలతో, జాఫ్నా శ్రీలంక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తుంది. వచ్చే ఏడాది భారతీయ ప్రయాణికులు (Indian Tourists) ఈ ప్రాంతం చూడాలని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, తమిళ సంస్కృతి వంటకాలతో ఇది భారతీయుల మది దోచుకుంటోంది. ముఖ్యంగా కొత్తగా వృద్ధి చెందిన విమానాల సంఖ్య గతంలో కంటే అక్కడకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.మస్కట్కఠినమైన పర్వతాలు అరేబియా సముద్రం మధ్య ఉన్న మస్కట్, అరేబియా వారసత్వంతో ఆధునిక సంప్రదాయాల సొగసైన మిశ్రమంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. గొప్ప గొప్ప మసీదులు చారిత్రాత్మక కోటల నుంచి ఉత్సాహభరితమైన సౌక్లు సముద్రతీర విహార ప్రదేశాల వరకు, ఈ రాజధాని నగరం తక్కువ విలాసవంతమైన శాశ్వత ఆకర్షణను అందిస్తుంది.క్వీన్స్టౌన్న్యూజిలాండ్ దేశంలోని క్వీన్స్టౌన్ కూడా భారతీయుల ఎంపిక జాబితాలో చోటు సంపాదించింది. వాకటిపు సరస్సు ఒడ్డున ఉన్న ఇది సాహసోపేతమైన ప్రకృతి ప్రేమికులకు అంతిమ ఆట స్థలం. ది రిమార్కబుల్స్ పర్వత శ్రేణితో చుట్టుముట్టబడిన ఇది థ్రిల్, ప్రశాంతతను సజావుగా మిళితం చేస్తుంది. ఐకానిక్ అనుభవాలలో బంగీ జంపింగ్, సుందరమైన ట్రైల్స్, వైన్ తయారీ కేంద్రాలు విశ్రాంతి స్పా రిట్రీట్లు దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.చియాంగ్ రాయ్థాయిలాండ్ లోని చియాంగ్ రాయ్ ఆధ్యాత్మికత కళాత్మకతను కలిసే ప్రదేశం. వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, ప్రశాంతమైన టీ తోటలు, రోలింగ్ హిల్స్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లతో, వైవిధ్యభరిత సంస్కృతుల మధ్య కూడా ప్రశాంతతను కోరుకునే వారికి ఇది స్వర్గధామంగా నిలుస్తోంది.వారణాసిమన దేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాసి (Varanasi) ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అత్యధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. గంగా నది ఒడ్డున మంత్రముగ్ధులను చేసే సాయంత్రం హారతిని వీక్షించడం, సూర్యోదయంలో పవిత్ర స్నానం చేయడం, పురాతనమైన పురాణాలను, ఇతిహాసాల వేదికగా.. పురాతన దేవాలయాలు ఈ నగరాన్ని ఏటా భారతీయ పర్యాటకులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానంగా ఉంటోంది.మనీలాఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా అనేది వైరుధ్యాల నగరం, అక్కడ వలసరాజ్యాల యుగపు గోడలు నియాన్–లైట్ల వెలుగుల్లో దర్శనమిస్తాయి. ఉల్లాసమైన వీధులు, ఇంట్రామురోస్ వంటి చారిత్రాత్మక జిల్లాలు, సందడిగా ఉండే ఆహార మార్కెట్లు ఉత్సాహభరితమైన రాత్రి జీవితం దీనిని సాంస్కృతిక శక్తి కేంద్రం ఇది. ఫిలిప్పీన్స్‌కు చెందిన సుందరమైన ద్వీప సౌందర్యాలను ఆస్వాదించేందుకు సరైన ప్రదేశం. టిబిలిసిజార్జియాలోని టిబిలిసి పాత కాలం నాటి ఆకర్షణ, ఆధునిక సామర్ధ్యం రెండింటితో నిండి ఉంది. రాళ్లతో కప్పబడిన వీధులు శతాబ్దాల నాటి చర్చిలు, థర్మల్ బాత్‌లు సమకాలీన ఆధునిక కేఫ్‌లకు ఇది నిలయం. సృజనాత్మక శక్తి హృదయపూర్వక ఆతిథ్యంతో, జార్జియన్ రాజధాని వైవిధ్యాన్ని కోరుకునే భారతీయ ప్రయాణికుల జాబితాలో ముందుంది.హోచిమిన్వియత్నాంలోని హోచిమిన్ నగరం దాని ఆకాశహర్మ్యాలు, వలసరాజ్యాల ల్యాండ్‌మార్క్‌లు, వీధి ఆహార దుకాణాలు, ఇలా సజీవంగా ఉన్న మార్కెట్లతో అబ్బురపరుస్తుంది. పచ్చని మెకాంగ్ డెల్టా దక్షిణ వియత్నాం వారసత్వ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన లాంచ్‌ప్యాడ్ ఇది. చాలా మంది భారతీయులు ఈ ఏడాది భారీ సంఖ్యలో వియత్నాంకు ప్రయాణించారు మరింత మంది వచ్చే ఏడాది సందర్శించాలని చిస్తున్నారు,పోర్ట్ లూయిస్మారిషస్లోని మణి సముద్రాలు పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న పోర్ట్ లూయిస్ ఉష్ణమండల ఆకర్షణను కాస్మోపాలిటన్ శైలితో మిళితం చేస్తుంది. కళకళలాడే మార్కెట్లు, వలసరాజ్యాల నిర్మాణం భిన్న వైరుధ్యాలు కలిగిన ఫుడ్ కల్చర్ ఉల్లాసమైన ప్రశాంతమైన గమ్యస్థానంగా దీనిని మారుస్తున్నాయి సూర్య ప్రశాంతతను కోరుకునే వారికి అనువైనది. నివేదిక శోధనలలో 93% పెరుగుదలను చూపించింది. దీనిని అనేక మంది భారతీయుల ప్రయాణ బకెట్ జాబితాలలో ఉంచింది.చదవండి: భాయిజాన్ సల్మాన్‌ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! 60లో కూడా కండలు తిరిగిన బాడీ సొంతం కావాలంటే... -
చలికాలం... ఫుడ్ విషయంలో జాగ్రత్త!
గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా తినాల్సినవి..ఈ కాలంలో సూప్‌లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందటతేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్లు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయటఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలుచాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!) -
చిన్న కానుక... ఎంతో సంతోషం
శాంటా తాత వస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు... అని పిల్లలు అనుకోవడం ఆనవాయితీ.తల్లిదండ్రులే ఏ అర్ధరాత్రో వారి దిండ్ల వద్ద ఆ కానుకలు పెట్టి ఆశ్చర్యపరచడమూ ఆనవాయితే.కాని శాంటాలు రాని ఇళ్లుంటాయి.శాంటా బహుమతులు అందని పిల్లలుంటారు. ఈ క్రిస్మస్ వేళ పేద పిల్లలకు, హోమ్స్‌లో ఉండే నిరాధార పిల్లలకు మీరే శాంటాలుగా కానుకలు ఎందుకు ఇవ్వకూడదు? అవి అవి అందుకున్న వారి ముఖాల్లో నక్షత్ర కాంతిని ఎందుకు చూడకూడదు?శాంటా క్లాజ్‌కు దేశం లేదు.... ప్రాంతం లేదు... భాష లేదు... అందరు పిల్లలకూ శాంటా తాత ఇష్టం. తాత తెచ్చే కానుకలు ఇష్టం. అందుకే క్రిస్మస్ వస్తుందనగా తమ కోరికలన్నీ కాగితం పై రాసి జాగ్రత్తగా డబ్బాలో వేసి పెట్టడమో, ఫ్రిజ్‌కు ఉన్న అయస్కాంతం కింద వేళ్లాడగట్టడమో,పోస్ట్‌బాక్స్‌లో వేయడమో చేస్తారు. ఎప్పుడెప్పుడు శాంటా వస్తాడా... కానుకలు ఇస్తాడా అని ఉద్వేగంగా ఎదురు చూస్తారు.క్రిస్మస్ ముందు రోజు రాత్రి తప్పకుండా శాంటా వస్తాడని పిల్లల నమ్మకం. ‘జింగిల్ బెల్స్... జింగిల్ బెల్స్... జింగిల్ ఆల్ ద వే’ అని పాడుకుంటూ, మువ్వలు గలగలలాడుతున్న రైన్డీర్ల బండి ఎక్కి, కానుకల మూటతో శాంటా వచ్చి ఒక్కో పిల్లవాడికి/పాపకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చి వెళతాడని వాళ్లు భావిస్తారు. అంతేనా? మంచి నడవడిక చూపినందుకు, బాగా చదువుకుంటున్నందుకు ‘మెచ్చుకోలు పత్రం’ కూడా ఇచ్చి వెళతాడు. ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే మానుకోమని హెచ్చరిస్తాడు కూడా.అలా అని విశ్వసించే పిల్లలు క్రిస్మస్ రోజు కళ్లు తెరిచి తమ దిండ్ల పక్కనే ఉన్న బహుమతులు చూసుకుని కేరింతలు కొడతారు. శాంటా ఇచ్చాడని మురిసి΄ోయి పక్కింటి పిల్లలకు చూపిస్తారు. శాంటా లేఖను పదే పదే చదువుకుంటారు. ఇది వారి మురిపమైన అమాయక ప్రపంచం. ఆ ప్రపంచంలో వారిని ఉంచేందుకు తల్లిదండ్రులు/ బంధువులు రహస్యంగా కానుకలు ఏర్పాటు చేస్తారు. ఇలా సీక్రెట్ శాంటాలుగా కన్నబిడ్డలకే కాదు... మనసులోని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరని స్థితిలో ఉన్న పిల్లలకు కూడా కావచ్చు.సీక్రెట్ శాంటా నెట్వర్క్స్మన దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ‘సీక్రెట్ శాంటా నెట్వర్క్స్’ కలిగి ఉన్నాయి. ఇవి తమ వెబ్‌సైట్స్‌లో అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు అంటే పేద బస్తీల్లో, హాస్టళ్లలో, అనాథ గృహాలలో ఉన్నవారు కోరిన కోరికలను ఉంచుతారు. వాటిని చూసి ఆ కోరిక నెరవేర్చేందుకు సాయం చేయవచ్చు. లేదా ఆ గిఫ్ట్‌ను స్వయంగా అందే ఏర్పాటు చేయవచ్చు. శాంటా పంపినట్టే ఈ పిల్లలకు ఆ గిఫ్ట్స్ అందుతాయి. ఇలాంటి పని కోసం వలెంటీర్లుగా పని చేసే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ‘భూమి’, ‘హోమ్‌లెస్ కేర్ ఫౌండేషన్’, ‘లిటిల్ హార్ట్ ఫౌండేషన్’, ‘ది లెప్రసి మిషన్ ట్రస్ట్ ఇండియా’... వంటి సంస్థలు సీక్రెట్ శాంటాలుగా క్రిస్మస్ సమయంలో పేద పిల్లల ముఖాన చిర్నవ్వులు చిందించే ఏర్పాటు చేస్తున్నారు. నగరాలన్నింటిలోనూ ఇంకా అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎంచుకుని సహాయం చేయవచ్చు.చిన్న కానుక... ఎంతో సంతోషంక్రిస్మస్ డిసెంబర్ ఆఖరున వస్తుంది. కాబట్టి స్వెటర్లు, ఉన్ని టోపీలు, రగ్గులు ఇవ్వొచ్చు. స్కూలు బ్యాగులు, నోట్‌బుక్స్, షూస్, హైజీన్ కిట్స్... ఇవన్నీ వారికి ఆనందాన్ని ఇచ్చేవే. బొమ్మలు, బట్టలు చెప్పనక్కర్లేదు. కేక్స్, చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాలి. ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా మంచి పిల్లాడివి’ అని రాసిన శాంటా లేఖ వారికి వేయి ఏనుగుల బలం ఇస్తుంది. మనం నివసిస్తున్న చోట హౌస్ హెల్ప్‌గా పని చేసే వారి పిల్లలకు, వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలకు సీక్రెట్ శాంటాగా బహుమతులు పంపితే ఆ తర్వాత ఆ పిల్లల రియాక్షన్ తెలుసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.శాంటా కథ ‘మంచికి ప్రతిఫలం ఉంటుంది’ అని చెబుతుంది. పిల్లల్లో ఈ విశ్వాసం నింపడం ముఖ్యం. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్లో మన కోసం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది... మనకూ బహుమతులు ఉంటాయి అనే భరోసా కల్పించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రిస్మస్ చెట్టు, తార, బెల్స్... ప్రేమను పంచమనే చెబుతాయి. చిన్నపిల్లలకు ప్రేమను పంచడానికి మించిన ఆనందం లేదు. -
బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!
మెదడు ఎంతటి కీలకమైనదంటే... మన శరీరం బరువులో దాని బరువు కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం దేహానికి అందే ఆక్సిజన్‌లో 20 శాతం దానికే కావాలి. దేహం మొత్తం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే చెందాలి. ఇక అదెంతటి అద్భుతమో చూద్దాం... దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. అన్నీ కొవ్వు కణాలే. అంటే మెదడు కణాలన్నీ కొవ్వుతో నిర్మితమైనవే. కొవ్వు లేకపోతే మెదడే లేదు. అంటే... శరీరంలోని 25 శాతం కొలెస్ట్రాల్ మెదడులోనే ఉంటుంది. మన ఆలోచనలకూ, పనులకూ, తెలివితేటలకూ అదే మూలం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అది మందకొడిగానూ, మరికొన్ని ఆహారాలతో అది చురుగ్గానూ ఉంటుంది. అది చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి ఆహారం కావాలో తెలిపే కథనం.మెదడుకు హాని చేసే ఆహారాలునిల్వ ఉంచిన ఉప్పు కలిపిన పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్తోపాటు ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహార పదార్థాలు మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యానికే కాదు... మెదడుకూ చేటు చేస్తుంది. కొవ్వుల్లో డాల్డా వంటి ట్రాన్స్‌ఫ్యాట్స్, అలాగే మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం (Non Veg) తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ వంటి కొవ్వులనూ చాలా పరిమితంగానే (అరుదుగా కేవలం రుచి కోసమే) వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్తబ్ధుగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. అలాగే మెదడును ఉత్తేజపరచడానికి తాగే సిగరెట్ లాంటి పొగతాగే అలవాటు కూడా దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందకొడిగా మారుస్తుంది. మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదులనూ తగ్గిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పనిచేయాలనీ, మెదడుకు సంబంధించిన అల్జైమర్స్ వంటి జబ్బులు నివారించడానికి మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈలోకంలోని జీవులన్నింటిలోకెల్లా అత్యంత తెలివైన మెదడు మానవులని పిలుచుకునే మన హోమో సేపియన్ జీవులదే. ఈ మొత్తం కాస్మోస్‌లో ఇంకా తెలివిగల జీవం ఇంకెక్కడుందో ఇప్పటికీ తెలియదు కాబట్టి... ప్రస్తుతానికి ఈ సమస్త విశ్వంలో ఇంతటి సంక్లిష్టమైన మెదడు, అత్యంత అద్భుతమైన మెదడు మానవులది మాత్రమే. అందులో ఎన్ని కణాలు ఉన్నాయనేదానికి నిర్దిష్టమైన లెక్క లేదు. కానీ దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. కేవలం ఇసుక రేణువంత భాగంలో కనీసం లక్ష న్యూరాన్లు, పొరుగు కణాలతో అనుసంధానితమైన ఉన్న కనెక్షన్లు 100 కోట్ల వరకు ఉన్నందువల్లనే బహుశా ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక భావన.ఎదుగుదలలోనే అద్భుతాలు..తల్లికడుపులో బిడ్డ ఉండగానే మెదడు ప్రతి నిమిషానికీ 2,50,000 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా ఆ బిడ్డ.. ఈ లోకాన్ని చూసే నాటికి అతడు 1000 కోట్ల కణాలతో పుడతాడు. పన్నెండు నెలల వయసప్పుడు తీసిన మెదడు స్కాన్, దాదాపు యుక్తవయసులో ఉన్నప్పటి మెదడు స్కాన్ దాదాపు ఒకేలా ఉంటాయి. కాక΄ోతే ట్రిలియన్ల కొద్దీ సైనాప్స్‌లు ఏర్పడుతూ ఉంటాయి. పదేళ్ల వయసు నుంచి చాలా వేగంగా సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల జరుగుతుంది. మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరగడం, దృష్టి పెట్టని అంశాలు తగ్గడం జరుగుతాయి. ‘దీన్నే యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా పేర్కొంటారు. మనకు ఆనందం ఇచ్చే అంశాలనూ ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకుంటాం. దాదాపు 18 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన వికాసం దాదాపుగా పూర్తవుతుంది. ఈ వికాస క్రమంలోనూ, అటు తర్వాత మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఆహారాలు దోహదపడుతుంటాయి. మెదడు చురుగ్గా ఉండటానికి, చాలాకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పిండదశలో... పిండ దశ నుంచీ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే కీలకమైన పోషకమే ‘ఫోలిక్ యాసిడ్’. అందుకే ఓ మహిళ గర్భం దాల్చగానే లేదా దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు గర్భం దాల్చకముందు నుంచే మహిళలకు ‘ఫోలిక్ యాసిడ్’ పోషకాన్ని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ పోషకం మహిళ గర్భవతిగా ఉన్నప్పట్నుంచే మెదడు తాలూకు మంచి ఎదుగుదలకూ, పిండంలో న్యూరల్ ట్యూబ్‌కు సంబంధించిన సమస్యల నివారణకూ తోడ్పడుతుంటుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఈ పోషకం అన్ని రకాల ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది. ఫోలియేజ్ అంటే ఆకులు. అందుకే పాలకూర వంటి అన్ని ఆకుకూరల్లో సమృద్ధిగా లభ్యమవుతుంది కాబట్టే దీనికి ‘ఫోలిక్ యాసిడ్’ అని పేరు.బిడ్డ పుట్టాక...ఇక బిడ్డ పుట్టి నేల మీద పడ్డాక... ఆ చిన్నారి మెదడు ఆరోగ్యంగా ఎదగాడానికి అవసరమైనది ‘డొకోజా హెగ్జాయినోయిక్ యాసిడ్’ (సంక్షిప్తంగా ‘డీహెచ్ఏ’) అనే మరో రకం పోషకం అవసరం. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒక రకం. ఈ పోషకం తల్లిసాలలో సమృద్ధిగా లభిస్తుంది. బిడ్డలు పెరిగి పెద్దయ్యా వారికి ఇదే పోషకం కావాలంటే చేపల్లో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక బిడ్డల పెరుగుదల తర్వాత, వారు యుక్తవయస్కులుగా మారాక... అటు పిమ్మట కూడా ఆ మెదడు ఆరోగ్యం సక్రమంగా నిర్వహితం కావాలంటే అవసరమైన పోషకాలు ఇవి...సంక్లిష్టమైన పిండిపదార్థాలు(కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్)...మెదడు చురుగ్గానూ, అలాగే సక్రమంగానూ పనిచేస్తూ... అది చేసే పనిలో సునిశితత్వం, వేగం, చురుకుదనం ఉండాలంటే ముందుగా మొత్తం శరీరానికి శరీరం తీసుకునే శక్తిలో 15 శాతం దానికే కావాలి. అంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌లో 15 శాతానికి తగ్గకుండా మెదడుకు సమృద్ధిగా అందుతూ ఉండాలి. అందుకోసం... ఆ శక్తిని సమకూర్చేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనకివి పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు మొదలుకొని పొట్టు తీయని అనేక ముడిధాన్యాల నుంచి ఈ కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లు అందుతాయి. శక్తి కోసం మనం తీసుకోదగ్గ వాటిలో ఇవి ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి దొరికే గ్లూకోజ్ దేహంలోకి చేరగానే తక్షణం వినియోగితమై΄ోతుంది. ఆ తర్వాత వెంటనే మళ్లీ గ్లూకోజ్ (Glucose) అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో చాలాసేపు పాటు మెదడుకు అందుతూ ఉంటుంది.అత్యవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ )...మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన కొవ్వు పదార్థాలు ఇవి. అందుకే మెదడుకు అవసరమైన ఈ కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ (ఈఎఫ్ఏ) అంటారు. ఇవే ప్రధాన ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అయిన అల్ఫా లినోలినిక్ యాసిడ్ (ఏఎల్ఏ), ఇకోజా పెంటాయినిక్ యాసిడ్ (ఈపీఏ), డొకాజో హెగ్జాయినిక్ యాసిడ్ (డీహెచ్ఏ) వంటివి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మెదడు కణాలన్నీ కేవలం కొవ్వు కణాలే. ఒకరకంగా చూస్తే... మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను దేహం తనంతట తాను తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని ఆహారం నుంచి తీసుకోవాలి. ఆ ఎనెన్షియల్ కొవ్వుల సాయంతోనే మెదడుకు అవసరమైన కీలక కొవ్వు కణాల మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది.ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, ముఖ్యంగా సాల్మన్, మెకరెల్స్, సార్డిన్ వంటి చేపల నుంచి... ఇంకా గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.మెదడుకు మేలు చేయని కొవ్వులు...మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని రకాల కొవ్వులూ మెదడుకు మంచి చేయవు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా మారుస్తాయి. అవి ఏవంటే... ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు. ఇవి మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్‌ను అడ్డుకుంటాయి. తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేక్‌లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అవి మెదడును కాస్త మందకొడిగా చేయడంతోపాటు ఆరోగ్యానికీ అంతగా మేలు చేయవు. అందుకే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రాన్స్ఫ్యాట్స్ను నిషేధించారు.తినుబండారాలు కొంటున్నారా... తస్మాత్ జాగ్రత్త...మనం మార్కెట్లో కొనే తినుబండారాల ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితాను తప్పక పరిశీలించాలి. ఒకవేళ అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. అదికూడా అరుదుగానే ఎప్పుడైనా తీసుకోవడం మంచిది. మెదడుకు అవసరమైన కొవ్వులు (అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు (Fishes) ఎక్కువగా తినడం అన్ని విధాలా మెదడుకు మేలు చేస్తుంది. ఎందుకంటే చేపల్లో మెదడును చురుగ్గా ఉంచడానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అమైనో యాసిడ్స్...మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ సహాయంతో సమాచారం తాలూకు ట్రాన్స్మిషన్ ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు సహాయపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఇవి మనకు ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి.మన మూడ్స్ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్పైనే...మనకు కలిగే రకరకాల మూడ్స్ కూడా ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు హాయిగా, గాఢమైన నిద్ర పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు.విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు)... మెదడు పనితీరు బాగా చురుగ్గా కొనసాగడానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు చాలా ప్రధానమైనవి. ఇవి అమైనో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌లో మార్చడంలోనూ తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి విటమిన్ బీ–కాంప్లెక్స్‌లోని బి–1, బి–6, బి–12 ప్రధానంగా అవసరమైవుతాయి. మళ్లీ వీటిన్నింటోనూ విటమిన్ బి–12 ఇంకా కీలకం. ఈ విటమిన్లు తాజా కూరగాయల్లో, ముదురాకుపచ్చటి ఆకుకూరల్లో, పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి–12 మాంసాహారంలోనే ఎక్కువ. అందుకే... ఇటీవల చాలామంది స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ (వీగన్స్)లోనూ, ఎండ అంతగా సోకనివారిలో (ఎండకు ఎక్కువగా ఎక్స్΄ోజ్ కానివారిలో) విటమిన్ ‘డి’.. ఈ రెండు రకాల విటమిన్ల లోపం కారణంగా వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కారణంగా ఒక్కోసారి వారు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా జరగడాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్’ / ‘సింకోపీ’ అంటారు ఇటీవల ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇప్పుడీ కండిషన్ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటివారంతా డాక్టర్ల సూచన మేరకు విటమిన్–డి సప్లిమెంట్లతోపాటు దేహంలో విటమిన్ బి–12 మోతాదులను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా మనలో విద్యలూ–నైపుణ్యాలు నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది.నీళ్లు...మెదడులోని ఘనపదార్థంలో చాలావరకు కొవ్వులే కాగా... ఇక మొత్తం మెదడులో 80 శాతం వరకు నీళ్లే ఉంటాయి. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మనం మన మూత్రం రూపంలోనూ, అలాగే మనం ఊపిరి వదులుతున్నప్పుడు (ఉచ్ఛాస్వనిశ్వాసల్లో) రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. ఇలా బయటకు పోయే నీటిని ఎప్పటికప్పుడు మళ్లీ భర్తీ చేసుకోవడం అవసరం. దీనికోసం అదేమొత్తంలో మళ్లీ నీటినీ తీసుకోవాలి. అనేక కారణాల వల్ల కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగరు. ఎంతటి తక్కువ మోతాదులో నీళ్లు తాగేవారైనా రోజులో కనీసం 1.5 లీటర్లను తప్పక తీసుకోవాలి. (మిగతా నీళ్ల మోతాదు కాస్తా మనం రోజూ తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంటుంది. ఎవరిలోనైనా వారు రోజులో తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది వాళ్ల వాళ్ల మూడ్స్‌పై కూడా ప్రభావం చూపేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రతిఒక్కరూ రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకుంంటూ ఉండటం మంచిది. అప్పుడు... నీటితో పాటు తీసుకునే ఆ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ద్రవాహారాల్లో టీ, కాఫీల వంటివి డీహైడ్రేషన్‌ను వేగవంతం చేస్తాయి. అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే టీ, కాఫీలూ, కెఫిన్ ఉండే పానీయాలను చాలా పరిమితంగా (అంటే రోజుకు రెండు కప్పులకు మించకుండా) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే ఆ పానీయాలు తొలుత మెదడును చురుగ్గా చేసినప్పటికీ... ఇలా వేగంగా పనిచేయించడం వల్ల మెదడు అంతే వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్స్‌వల్ల కూడా ఇదే హాని జరుగుతుంది. మెదడుకి మేలు చేసే ఆహారాలు...మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలతోపాటు కూరగాయల్లో...పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ–ఆక్సిడెంట్స్ మెదడు కణాలను చాలాకాలం ΄ాటు ఆరోగ్యంగా ఉంచడంతో ΄ాటు అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో ΄ాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.చేపలు...పండుగప్ప / పండు చేప, వంజరం, కనగర్తలు (మాకరెల్), సాల్మన్, హెర్రింగ్ వంటి చేపల్లో మెదడు చురుకుదనానికి సహాయపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ.నూనెల్లో...మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్త΄ోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను ఆలివ్ ఆయిల్ కొంతమేరకు నివారిస్తుందని చెప్పవచ్చు.పండ్లు...మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మేలు చేస్తాయి. - డాక్టర్ హరిత శ్యామ్ .బి, సీనియర్ డైటీషియన్ చదవండి: భాయిజాన్ సల్మాన్‌ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! -
నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలా?
బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా పూనవాలా వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె హై-ఎండ్ డిజైనర్ దుస్తులు, అత్యంత లగ్జరీ ఆభరణాలనే ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారామె. ఇటీవల ఆభరణాల నిపుణుడు, ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త ధ్రుమిత్ మెరులియా ఆమె అరుదైన పింక్ డైమండ్ రింగ్‌పై ఫోకస్ పెట్టడమే గాక దాని ప్రత్యేకత, వెనకున్న ఆసక్తికర కథనుకూడా వివరించారు. View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) ఆ రాణికి చెందినది..ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ ఉంగరాన్ని మేరీ-థెరెస్ పింక్ డైమండ్ రింగ్ అని పిలుస్తారు అని ధ్రుమిత్ వెల్లడించారు. ఈ ఉంగరం ఫ్రాన్సక్వీన్ మేరీ ఆంటోయినెట్కు చెందినదని తెలిపారు. ఆ ఉంగరం కేంద్ర భాగం పది క్యారెట్ల విలువ చేసే పర్పుల్ అండ్ పింక్ డైమండ్ మోడిఫైడ్ కైట్ బ్రిలియంట్-కట్ డైమండ్. దీని చుట్టూ గుండ్రని 17 వజ్రాలతో అలకరించి నల్లటి ప్లాటినం బ్యాండ్‌లో ఉంది. అంతేగాదు ఆ మధ్యలోని వజ్రం 18వ శతాబ్దం కాలం నాటిదట. దీనిని క్వీన్ మేరీ ఆంటోయినెట్ కుమార్తె డచెస్ మేరీ-థెరిస్ డి'అంగోలేమ్ వారసత్వంగా పొందారు. ఈ ఉంగరం 1996లో విక్రయించబడే వరకు చాలా ఏళ్లు రాజకుటుంబం ఆభరణాల కలెక్షన్స్‌లో ఉండేదట.అంత ఖరీదా..?అయితే ప్రఖ్యాత ఆభరణాల డిజైనర్ జోయెల్ ఆర్థర్ రోసెంతల్ వజ్రం కోసం కొత్త బ్యాండ్‌ను రూపొందించారు. జూన్ 17, 2025న, ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌లోని క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్‌లో దాదాపు రూ.125 కోట్లు పైనే అమ్ముడుపోయిందట. ఫ్రెంచ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఉంగరంగా వార్తల్లో నిలిచింది కూడా. కాగా, బిలియనీర్ అదర్ పూనవాలాను వివాహం చేసుకున్న నటాషా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతేగాదు ఆమె విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్‌కు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నెదర్లాండ్స్‌లోని పూనావాలా సైన్స్ పార్క్ డైరెక్టర్‌గా, బ్రిటిష్ ఏషియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ చైర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) (చదవండి: వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి..చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా! మనసు మెలిపెట్టే భావోద్వేగ కథ) -
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్‌లో "ఇవాళ ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్‌తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్‌గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్‌గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్‌గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..) -
60లో కూడా సల్మాన్‌లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్‌కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్‌గా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్‌వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే.. -
క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..
చాలామంది విద్యార్థులు మంచి యూనివర్సిటీ డిగ్రీ, పీజీలు చేశాక ఉద్యోగ వేటలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అప్పుడే తెలుస్తుంది ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదని. అచ్చం అలాంటి పరిస్థితిని ఎదర్కోని ఎన్నో చిన్న చితకా ఉద్యోగాలతో విసిగివేసారి.. చివరికి లక్షల కోట్లు విలువ చేసే కంపెనీకి సీఈవో రేంజ్‌కి ఎదిగాడు గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లా సీఈవో డేవిడ్ బస్జుకి. పైగా విద్యార్థులకు తనలా చేయొద్దంటూ తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు కూడా. మరి అతడు ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో సవివరంగా చూద్దామా..!స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన 62 ఏళ్ల డేవిడ్ బస్జు అక్కడ విద్యార్థులతో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా గందరగోళానికి గురయ్యానని, పలు ఉద్యోగాల ఇంటర్వ్యూలో రిజెక్షన్లు, దాంతో తన అర్హతకు సరిపడని ఏవేవో ఉద్యోగాలు చేసి చాలా నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యానంటూ వివరించాడు. చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారని అన్నారడు. ఎందుకంటే సరిగ్గా మనం వచ్చేటప్పటికే ఉద్యోగ మార్కెట్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టాసాధ్యమైన విషయంగా మారిపోతుందన్నారు. అలాగే ఆ సమయంలో మనకు సలహాలిచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోతారు, పైగా అవి వినబుద్ధి కూడా కాదని అన్నారు. ఆ కష్టకాలంలో తాను తన అంతరదృష్టిపై ఫోకస్ పెట్టి అస్సలు తానేం చేయాలనుకుంటున్నాడు, ఏదైతే తన కెరీర్ బాగుంటుంది అనే వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించేవాడని చెప్పారు. తన అంతరంగా చెబుతున్నదాన్ని, ఇష్టపడుతున్నదాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేశానని, అలాగే తాను అంతకుముందు చేసిన చెత్త ఉద్యోగాలతో పొందిన అనుభవం కూడా దీనికి హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్టాన్ఫోర్డ్ విద్యార్థిని అన్న పేరు..మంచి కెరీర్‌ని సంపాదించుకోవడానికి హెల్ప్ అవ్వలేదని అంటాడు ఈ టెక్ దిగ్గజం డేవిడ్. ఎందుకంటే కాలేజ్ చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా స్థంభించిపోయినట్లు అయిపోయిందంటూ నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన డ్రీమ్ జాబ్ సంపాదించలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావని వాపోయాడు. చివరికి ఆ కష్ట సమయంలో సమ్మర్ టైంలో తన సోదరులతో కలిసి కిటికీలు శుభ్రంచేసే పనికి సైతం వెళ్లినట్లు తెలిపాడు. ఈ చిన్ని చిన్ని ఉద్యగాలుచేయలేక సతమతమవుతున్న తరుణంలోను తన అంతరంగం చెబుతున్న దానివైపు మళ్లాడానికి చాలా ధైర్యం కావలి కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో తిరస్కరణలు చూశాక..అస్సలు మనపై మనకు నమ్మకం ఉండదు. కానీ సక్సెస్ కావాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయకుడదు, అలాగే నీ సామర్థ్యంపై నమ్మకం సడలకూడదు. అప్పుడే విజయం ఒడిలోకి వచ్చివాలుతుందని అంటాడు డేవిడ్. అంతేగాదు తన మనసు ఏకంగా తొమ్మిది రకాల కెరీర్ ఆప్షన్లు ఇచ్చిందని, అయితే వాటిలో ఏది బెటర్, ఏది మంచిది కాదు అని అంచనా వేసుకుంటూ..కెరీర్‌ని నిర్మించుకున్నానని చెప్పాడు. అలా సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువచేసే గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లాక్స్కి నాయకత్వం వహించే రేంజ్‌కి వచ్చానంటూ తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు డేవిడ్ ఏకంగా రూ. 4 వేల కోట్ల నికర విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్న కుభేరుడు కూడా.(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారుమండల పూజకు నెయ్యభిషేకం సమయాలుశబరిమల య్యప్ప సన్నిధానంలో మండల పూజా ఏర్పాట్లలో భాగంగా శబరిమల వద్ద నెయ్యభిషేకం సమయాలు పరిమితం చేశారు. పవిత్ర నైవేద్యం డిసెంబర్ 26న ఉదయం 10:30 గంటల వరకు ఉండగా, డిసెంబర్ 27న ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.అందువల్ల నెయ్యభిషేకం ప్లాన్ చేసుకునే భక్తులు ముందుగానే చేరుకుని, తదనుగుణంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. మండల పూజ సమయంలో ఆచారాలు సజావుగా జరిగేలా ఆలయ అధికారులతో సహకరించాలని కోరారు.(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..) -
ఇవాళే థంక అంకి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..
శబరిమలలో మండల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటైన థంక అంకి (స్వర్ణ వస్త్రం)తో కూడిన దీపారాధన డిసెంబర్ 26 సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. అయితే అంతకంటే ముందు జరిగే ఈ థంక అంకి ప్రదక్షిణ లేదా ఊరేగింపు ఈ రోజు నుంచే మొదలవ్వుతుంది. ఇంతకీ అసలేంటి థంక అంకి ఊరేగింపు, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!థంక అంకి ప్రదక్షిణ అంటే ..శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజకు ముందు జరిగే పవిత్ర బంగారు వస్త్రాల ఊరేగింపు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.ఎప్పుడు జరుగుతుందంటే..శబరిమలలో అయ్యప్ప మండల పూజకు నాలుగు రోజుల ముందు ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది.ముందుగా పతనంతిట్టలోని అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరుతుంది. నిలక్కల్ పంప మీదుగా శబరిమల సన్నిధానానికి చేరుతుంది. ఇక "థంక అంకి" అనేది అయ్యప్ప విగ్రహానికి అలంకరించే బంగారు వస్త్రం. ఇందులో కిరీటం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, పీఠం వంటి ఆభరణాలు ఉంటాయి.ప్రాముఖ్యతఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతుంది అక్కడి వాతావరణం. వృశ్చికరాశి కాలంలో జరిగే మండల పూజలో అయ్యప్ప స్వామిని థంక అంకితో అలంకరించడం ఒక అనాదికాలపు సంప్రదాయం. థంక అంకిని దర్శించడం, ప్రదక్షిణలో పాల్గొనడం భక్తులకు మహా పుణ్యప్రదం అని నమ్మకం.చరిత్ర:ఈ థంక అంకిని 1973లో అప్పటి ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి చెందిన దివంగత చిత్తిర తిరునాళ్ బాలరామ వర్మ మహారాజు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సమర్పించారు. అరణ్ముల పార్థసారథి ఆలయం నుంచి భవ్యమైన ఊరేగింపుగా తీసుకురాబడే థంక అంకి డిసెంబర్ 26 సాయంత్రం సుమారు 5 గంటలకు శరన్ గుత్తికి చేరుతుంది.ఆ రోజు సాయంత్రం దేవాలయం తెరచిన తరువాత తంత్రిగారు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర మాలలను అలంకరించిన అనంతరం థంక అంకిని స్వాగతించేందుకు బృందాన్ని పంపుతారు. సాంప్రదాయ వాద్యబృందాలు , కఠినమైన పోలీసు భద్రత మధ్య ఈ ఊరేగింపు సన్నిధానానికి చేరుతుంది.18 పవిత్ర మెట్లు ప్రారంభంలో దేవస్వం బోర్డు అధ్యక్షులు, సభ్యులు థంక అంకిని స్వీకరించి సోపానం వరకు తీసుకువెళ్తారు. అక్కడ తంత్రి, మెల్సాంతి థంక అంకిని ఆచారపూర్వకంగా స్వీకరించి అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరిస్తారు. తదనంతరం దీపారాధన నిర్వహిస్తారు. ఈ ఘడియలోనే మండల కాలంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సన్నిధానంలో చేరుతారు.థంక అంకి ఊరేగింపు మార్గం, సమయాలుడిసెంబర్ 23–24 (మొదటి రోజు మార్గం)మూర్తిత్త గణపతి ఆలయం – 7:15 AMపున్నంథొట్టం దేవి ఆలయం – 7:30 AMచవిట్టుక మహాదేవ ఆలయం – 7:45 AMతిరువంచంకావు ఆలయం – 8:00 AMనెడుంప్రయార్ తేవరశేరి దేవి ఆలయం – 8:30 AMనెడుంప్రయార్ జంక్షన్ – 9:30 AMకోజెంచెరి పట్టణం – 10:00 AMఅయ్యప్ప మండపం (కాలేజ్ జంక్షన్) – 10:15 AMపంపడిమోన్ అయ్యప్ప ఆలయం – 10:30 AMకరిమ్వేలి – 11:00 AMఎలంతూర్ ఎడతావళం – 11:15 AMఎలంతూర్ భగవతీకున్ను ఆలయం – 11:20 AMఎలంతూర్ గణపతి ఆలయం – 11:30 AMఎలంతూర్ నారాయణమంగళం – 12:30 PMఆయతిల్ మలానాడ జంక్షన్ – 2:00 PMఆయతిల్ గురుమండిరం జంక్షన్ – 2:40 PMమెఝువేలి ఆనందభూతేశ్వర ఆలయం – 2:50 PMఎలవుంథిట్ట దేవి ఆలయం – 3:15 PMఎలవుంథిట్ట మలానాడ – 3:45 PMముట్టత్తుకోణం SNDP మందిరం – 4:30 PMకైథవాన దేవి ఆలయం – 5:30 PMప్రకణం ఎడనాడ దేవి ఆలయం – 6:00 PMచీకనల్ – 6:30 PMఉప్పమోన్ జంక్షన్ – 7:00 PMఒమల్లూర్ శ్రీరక్తకంఠ స్వామి ఆలయం – 8:00 PMడిసెంబర్ 24 – రెండో రోజు (ఉదయం 8 గంటలకు ఒమల్లూర్ నుండి ప్రారంభం)కొడుంతర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – 9:00 AMఅఝూర్ జంక్షన్ – 10:00 AMపథనంతిట్ట ఉర్మన్ కోవిల్ – 10:45 AMపథనంతిట్ట ఆలయం – 11:00 AMకరింపనక్కల్ దేవి ఆలయం – 11:30 AMశారదామఠం ముండుకొట్టక్కల్ SNDP హాల్ – 12:00 PMకడమణిట్ట భగవతి ఆలయం – 1:00 PMకొట్టపారా కల్లెలిముక్కు – 2:30 PMపెరుంకాడ SNDP హాల్ – 2:45 PMమైకోజూర్ ఆలయం – 3:15 PMమైలాప్ర భగవతి ఆలయం – 3:45 PMకుంబఝా జంక్షన్ – 4:15 PMపలమత్తూర్ అంబలముక్కు – 4:30 PMవెట్టూర్ మహావిష్ణు ఆలయం (గోపురప్పడి) – 5:30 PMఎలకొల్లూర్ మహాదేవ ఆలయం – 6:15 PMచిత్తూర్ముక్కు – 7:15 PMకొన్నీ పట్టణం – 7:45 PMకొన్నీ చిరైక్కల్ ఆలయం – 8:00 PMకొన్నీ మురింగమంగళం ఆలయం – 8:30 PMడిసెంబర్ 25 – మూడో రోజు (ఉదయం 7:30 – మురింగమంగళం నుండి)చిత్తూర్ మహాదేవ ఆలయం – 8:00 AMవెట్టూర్ ఆలయం – 9:00 AMమైలాడుంపారా – 10:30 AMకొట్టముక్కు – 11:00 AMమలయాలపుఝ ఆలయం – 12:00 PMమలయాలపుఝ తాళం – 1:00 PMమన్నరకులంజి ఆలయం – 1:15 PMరన్నీ రామపురం ఆలయం – 3:30 PMఇదక్కులం ఆలయం – 5:30 PMవడశేరిక్కర చేరుకావు – 6:30 PMప్రయార్ మహావిష్ణు ఆలయం – 7:00 PMమడమోన్ ఆలయం – 7:45 PMపెరునాడ్ ఆలయం – 8:30 PMడిసెంబర్ 26 – తుది రోజు (ఉదయం 8:00 – పెరునాడ్ నుండి)లాహా – 9:00 AMప్లప్పల్లి – 10:00 AMనిలక్కల్ మహాదేవ ఆలయం – 11:00 AMపంప – 1:30 PMశరణ్కుట్టి – 5:00 PMఅనంతరం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి థంక అంకి చేరుకుంటుంది. ఇక మండల పూజ అనంతరం థంక అంకి వస్త్రాన్ని అరన్ముల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి దేవస్వామ్లోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. తొలినాళ్లలో కొట్టాయం నుంచి హంస రథంలో ఈ థంక అంకి వస్త్రాన్ని సన్నిధానానికి తీసుకెళ్లేవారు. అయితే గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భక్తులు థంక అంగీ, దీపారాధన ఊరేగింపును చూసేందుకు భారీగా తరలివస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది కూడా మండలపూజకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. (చదవండి: శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సాద్య..! ఈ విందలో ఏం ఉంటాయంటే..) -
ప్రకృతి సేద్యం పొలాల్లోంచి వర్సిటీల్లోకి!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు. ‘సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. లాభదాయకతే గీటురాయి చెయ్యాలిప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్‌ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్‌లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు. -
ఐదడుగుల అరటి!
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్ఆర్సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు. బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి. -
ఆనియన్ క్వీన్
వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.నాసిక్‌లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్ దివస్ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘నాసిక్ దగ్గర ఉన్న లాసన్‌గావ్ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్కు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి ఫోన్ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్‌లో దిగాను’ అని తెలిపింది ఆమె.కల్యాణి షిండే రీసెర్చ్‌లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్‌కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం. ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్నోవేటర్లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్ క్వీన్’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. -
చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!
సినిమాలలో కొన్ని లొకేషన్స్ చూసి... ‘ఆహా’ అనిపిస్తుంది. ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు... ‘ఫలానా సినిమాలో ఈ సీన్ చూశాం కదా!’ అని గుర్తు తెచ్చుకుంటాం. ప్రయాణాలకు, చిత్రాలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రయాణ.. చిత్రం, చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఈ అద్భుత ప్రకృతి దృశ్యం బాలీవుడ్ సినిమా ‘3 ఇడియెట్స్’లో కనువిందు చేస్తుంది. కాలేజీ స్నేహాలు ముగిసి కలలు కనే ప్రదేశంగా ఈ ప్రదేశం దర్శనమిస్తుంది. పాంగాంగ్ లేక్ క్లైమాక్స్’గా ఈ ఎపిసోడ్‌కు పేరు వచ్చింది. యశ్ చోప్రా ‘జబ్ తక్ హై జాన్’ ఫర్హాన్ అక్తర్ ‘లక్ష్యా’ మణిరత్నం ‘దిల్ సే’లాంటి చిత్రాలలో లద్దాఖ్ కనిపిస్తుంది. ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో మిల్కాసింగ్ ట్రైనింగ్ దృశ్యాలను లద్దాఖ్‌లో చిత్రీకరించారు. ‘ట్యూబ్‌లైట్’ సినిమాను మూన్ల్యాండ్ ఏరియాలో చిత్రీకరించారు. ‘సనమ్ రే’ ‘రేస్ 3’ ‘హైదర్’ ‘తషాన్’ ‘ఎల్వోసీ: కార్గిల్’ సినిమాలలోనూ లద్దాఖ్ కనిపిస్తుంది. ‘రోడ్డ్ టు లద్దాఖ్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ వచ్చింది.సరస్సుల నగరం మెరిసింది!రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి ‘సరస్సుల నగరం’ అని పేరు. ఆడంబర వివాహాలకు కేరాఫ్ అడ్రస్.. ఉదయ్‌పూర్. ధర్మప్రొడక్షన్ ‘యే జవానీ హై దివానీ’ సినిమాలోని రాజసం ఉట్టిపడే సన్నివేశాలను ఈ అందాల నగరంలో చిత్రీకరించారు. చిత్రాలకు సంబంధించి భావోద్వేగ దృశ్యాలు పండాలంటే, పండగ సంతోషాలు వెల్లివిరియాలంటే ‘ఉదయ్‌పూర్’ సరిౖయెన నగరం అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. పీచోల సరస్సులో పడవలు వయ్యారంగా పరుగెడుతున్న దృశ్యాలు, సూర్యాస్తమయం తరువాత ప్యాలెస్ లైట్ల వెలుగులు నీటి అలలలో తేలియాడుతున్నప్పుడు.. ఉదయపూర్‌లో కనిపించిన క్షణాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. ‘యే జవానీ హై దివానీ’ ‘దడఖ్’ ‘జోదా అక్బర్’ ‘ఏక్లవ్య: ది రాయల్ గార్డ్’ ‘బాజీరావు మస్తానీ’లాంటి ఎన్నో సినిమాలలో ఉదయ్‌పూర్ కనిపిస్తుంది.గతంలోకి వెళితే...గైడ్(1965), మేరా సాయ(1966) చిత్రాలలోని సన్నివేశాలను ఉదయ్‌పూర్‌లో చిత్రీకరించారు. సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్, లేక్ పిచోలా, జగమందిర్, లేక్ ప్యాలెస్, ఫతే ఘర్, అంబ్రాయ్ ఘాట్.. మొదలైనవి సినిమాల చిత్రీకరణకు కీలకమైన లొకేషన్స్‌గా (Cinema Locations) మారాయి.ఆత్మశోధన అద్దం‘గోవా అనేది ఆత్మశోధనకు అద్దంలాంటిది’ అంటారు భావుకులు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ‘దిల్ చాహ్తా హై’లో గోవా కనువిందు చేస్తుంది. పోర్ట్ అగ్వాడా ఎంతోమందికి సినిమాటిక్ ల్యాండ్ మార్క్‌గా మారింది. గోవా బీచ్‌ల (Goa Beach) వెంట నడుస్తూ ఆలోచిస్తుంటే...అలలు ఎగిసి పడే శబ్దాలు వింటుంటే, నవ్వులు గాలిలో తేలుతుంటే, ఉరుకు పరుగుల జీవితం కాస్తా ఆ అలల ముందు ప్రశాంత చిత్తంతో చూస్తుంటే.. ఇలా ఎన్నో ఎన్నో భావాలకు గోవా కేరాఫ్ అడ్రస్ అవుతుంది. అందుకే సినీ దర్శకులకు గోవా బాగా నచ్చుతుంది. ‘డియర్ జిందగీ’ ‘గోల్మాల్ సిరీస్ (2006–2010), ‘దృశ్యం’ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ‘దిల్వాలే’ ‘ధమ్ మారో ధమ్’ ‘గో గోవా గాన్’లాంటి ఎన్నో చిత్రాలను గోవాలో చిత్రీకరించారు. గోవా ప్రత్యేకత ఏమిటంటే భారీ బడ్జెట్ సినిమాల దర్శకులకు నచ్చుతుంది. చిన్న నిర్మాతలకు సైతం అందుబాటులో ఉంటుంది.పొగమంచు కొండలలో...పొగమంచు కొండలతో స్నేహం చేసే డార్జిలింగ్ ఎన్నో సినిమాలలో కనిపించింది. నేత్రపర్వం చేసే హిమాలయ దృశ్యాలకు, విశాలమైన టీ తోటలకు డార్జిలింగ్ ప్రసిద్ధి పొందింది. డార్జిలింగ్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే, ఆ అందాలను ఆస్వాదించాలంటే బాలీవుడ్ (Bollywood) సినిమా ‘బర్ఫీ’ చూడాల్సిందే. ‘మై హూ నా’ ‘యారియాన్’ ‘పరిణిత’ ‘రాజు బన్ గయా జెంటిల్మెన్’ ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’లాంటి ఎన్నో చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు. వెనక్కి వెళితే... బర్సాత్ కి ఏక్ రాత్(1982), ప్రొఫెసర్(1962), జబ్ ప్యార్ కైసీ సే హోతా హై(1961), ఆరాధన (1969) చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు.అద్భుత కట్టడాలతో అలరించే..శతాబ్దాల సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకున్న అండలూసియా ప్రాంత చారిత్రక రాజధాని సెవిల్లె. సూర్యకాంతితో అద్భుతంగా వెలిగే కట్టడాలు, అద్భుతమైన మూరిష్ వాస్తు శిల్పానికి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది సెవిల్లె. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ ఇక్కడే చిత్రీకరించారు.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?వెనిస్ ఆఫ్ నార్త్వాయువ్య బెల్జియంలోని అందమైన చారిత్రక నగరం బ్రూజెస్. వంకర కాలువలు, మెట్ల–గేబుల్ ఇళ్ళు, రకరకాల శిల్పాలు, రాతి వంతెనలకు బ్రూజెస్ పెట్టింది పేరు. బ్రూజెస్ను ‘వెనిస్ ఆఫ్ నార్త్’గా పిలుచుకుంటారు. అమీర్‌ఖాన్ ‘పీకే’లో బ్రూజెస్ అందాలు కనువిందుచేస్తాయి. లవర్స్ బ్రిడ్జి, మిన్నె వాటర్ కాజిల్, మార్కెట్ స్క్వైర్, బ్రెల్ఫీ టవర్, వంకలు తిరిగే కాలువలు కనిపిస్తాయి. ‘పీకే’లోని ‘చార్ కదమ్’ పాటను ఇక్కడే చిత్రీకరించారు.వంద స్తంభాల నగరంఎత్తైన గోతిక్ స్తంభాలు, టెర్రకోట–ఎరుపు పైకప్పులు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి పొందింది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. ‘వంద స్తంభాల నగరం’ అని పిలవబడే ప్రాగ్లో మధ్యయుగాలనాటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వల్తావా నది ప్రవాహాన్ని చూడడం అద్భుత అనుభవం. రాతి వీధుల్లో ఈల పాట పాడుతూ వేగంగా నడుస్తుంటే, ప్రాగ్ అందాలు ఇంతియాజ్ అలీ ‘రాక్‌స్టార్’ సినిమాలో కనిపిస్తాయి. సినిమాలోని రకరకాల భావోద్వేగాలకు ప్రాగ్ (Prague) సరిగ్గా సరిపోయింది. చార్లెస్ వంతెన కింద నది వయ్యరాలను చూడడం మరో అద్భుత అనుభూతి.– పాషా -
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..) -
ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..?
డెస్టినేషన్ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్‌లు, రాజుల కాలంనాటి ఫేమస్ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్ వెడ్డింగ్ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు. ఈ ప్రముఖ రాజస్థాన్ ప్యాలెస్‌లో లగ్జరీ రిసార్ట్లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్‌లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న ఇలాంటి ప్యాలెస్‌లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్‌పూర్ ప్యాలెస్ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.పీవీ సింధు రాఫెల్స్ ఉదయ్‌పూర్ సూట్లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్నెస్ చికిత్సలు, ఆయుర్వేద సెషన్ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్ బైకింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందట.'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు..పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌ని బుక్ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.లేక్‌షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 77,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 81,000ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 87,000రాఫెల్స్ లేక్‌షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్, రాత్రికి రూ. 97,000రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట. View this post on Instagram A post shared by Raffles Udaipur (@rafflesudaipur) (చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..) -
ధ్యానం ఎందుకు చేయాలంటే..?
ధ్యానం ఇవాళ ఉరుకులు పరుగుల జీవితానికి అత్యంత అవసరం. పురాతన కాలంలో రుషులు ధ్యానాన్ని జ్ఞానోదయం కోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జీవితంలో ఎదురవ్వుతున్న ఒత్తిడి, ఆందోళన వంటి సవాళ్లను అధిగమించి మనశ్శాంతిని పొందే మార్గంగా మారింది. సమయం తక్కువగా ఉండి, చేయవలిసిన పని చాలా ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి సమయంలో మన శరీరంలో శక్తి అంతా హరించుకుపోతుంది. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరగకుండా తగ్గించడానికి ధ్యానం సమర్ధవంతంగా ఉంటుంది. పైగా శక్తివంతంగా చేస్తుంది. ఇది మన మానసిస్థితిని మెరుగుపరిచి, జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. జీవితంలో ఎంత ఎక్కువ బాధ్యతలు ఉంటే అంత ఎక్కువ ధ్యానం అవసరం ఉంటుందని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు, ఆశయాలు ఎంత ఎక్కువ ఉంటే ధ్యానం చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుందట. ఒత్తిడికి చక్కటి ఉపశమనం ధ్యానం. ధ్యానం అనేది శరీరానికి జీవననాడి, అలాగే మనసుకు మంచి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా అప్రమత్తత, అవగాహన అంతగా మెరుగవ్వుతాయట. అంతేగాదు మనలో సృజనాత్మక శక్తి పెంచుతుందట. అందరిలోనూ నిస్తేజంగా ఉన్న ఈ క్రియేటివిటీ మేల్కోంటుందట. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం అందిస్తుందట. అంతరంగంలో శాంతి లేకపోతే బాహ్య ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. ధ్యానం అంతర్గత శక్తిని సుస్థిరం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్ట్రాంగ్‌గా తయావ్వడమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సునాయాసంగా అందుకోగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారుని నిపుణులు. ఇది మానవ సంబంధాలను కూడా మెరుగుపరస్తుందట. సమాయానుసారంగా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. గందరగోళంతో సతమతమవుతున్న మనసుకు ఊరట, అలాగే దుఃఖాన్ని అధిమించగలిగే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసే శక్తి ఒక్క ధ్యానంతోనే సాధ్యమని నొక్కి చెబుతున్నారు యోగా గురుశ్రీశ్రీ రవిశంకర్, పలువురు యోగా నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరంమని వక్కాణిస్తున్నారు.(చదవండి: ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం) -
ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం
భారతదేశం, శ్రీలంక, అండోరా, మెక్సికో, నేపాల్ దేశాల శాశ్వత ప్రతినిధులతో పాటు ఇతర సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒకచోట చేరి ప్రాచీన ధ్యాన సాధనను జరుపుకున్నాయి. ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు దీని ప్రాధాన్యతను పంచుకున్నాయి.ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక రాజనీతితో సమ్మిళితం చేసిన ఒక విశేష క్షణంలో, రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గుర్తుచేసేందుకు సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యాయి. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు మరియు నాయకత్వానికి ధ్యానం ఎంతగా ప్రాసంగికమవుతోందో ఈ సమావేశం మరొకసారి స్పష్టం చేసింది.“ప్రపంచ శాంతి సమరసత కోసం ధ్యానం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేయడంతో పాటు మార్గనిర్దేశిత ధ్యానాన్ని కూడా నిర్వహించారు. భారతీయ నాగరిక వారసత్వంలో పుట్టిన ఈ సాధనను ప్రపంచంలోని అత్యంత కీలకమైన దౌత్య వేదిక కేంద్రానికి తీసుకువచ్చిన ఘట్టమిది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వక్తలు ఇదే భావనలను ప్రతిధ్వనించారు. అండోరా రాయబారి జోన్ ఫోర్నర్ రోవిరా, తన దేశ విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని సమీకరించడం వల్ల విద్యార్థుల దృష్టి సామర్థ్యం భావోద్వేగ నియంత్రణ మెరుగుపడిందని తెలిపారు. మెక్సికో ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి అలీసియా గ్వాడలూపే బుయెన్‌రోస్త్రో మాసియూ, దీర్ఘకాలిక ప్రపంచ సమరసతకు అంతర్గత శాంతే పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.నేపాల్ రాయబారి లోక్ బహాదూర్ థాపా, హిమాలయ ప్రాంతంలో ధ్యానానికి ఉన్న లోతైన నాగరిక మూలాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పు నుంచి తప్పుడు సమాచారం వరకు పరస్పరంగా ముడిపడిన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనేందులో ధ్యానం పోషించే పాత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో హాజరైన ఇతర ప్రముఖులు: మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్; యోగమాత ఫౌండేషన్‌కు చెందిన యోగమాత కేకో ఐకావా;బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ పరిపాలనా ఆధ్యాత్మిక అధిపతి బీకే మోహిని పంజాబీ; జీవన్ విజ్ఞాన్ ఫౌండేషన్ నేపాల్‌కు చెందిన ఎల్. పి. భాను శర్మ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన డా. లసంత చంద్రన గూనెతిల్లేకె; భౌతిక శాస్త్రవేత్త, శాంతి కోసం శాస్త్రవేత్తల గ్లోబల్ యూనియన్ అధ్యక్షుడు మరియు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉద్యమ నాయకుడు డా. జాన్ హాగెలిన్.ఈ కార్యక్రమం ముగింపులో, గురుదేవ్ రాయబారులు, ప్రతినిధులను 20 నిమిషాల మార్గనిర్దేశిత ధ్యానంలో నడిపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అరుదైన నిశ్శబ్ద క్షణాన్ని సృష్టిస్తూ, ప్రాచీన సంప్రదాయాల్లో పుట్టిన సాధనలు నేటి ప్రపంచ వేదికపై కూడా ఎలా కొత్త ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయో గుర్తు చేశారు.డిసెంబర్ 21న జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం వైపు ప్రపంచం ముందుకు సాగుతున్న వేళ, ఈ ఉద్యమం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పరిధిని దాటి శీర్షికల్లో నిలుస్తోంది. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ “World Meditates with Gurudev” అని ప్రకటించే బిల్లుబోర్డులతో వెలిగిపోతోంది ప్రపంచ వేదికపై ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడి నేతృత్వంలో జరుగుతున్న అరుదైన గ్లోబల్ ఘట్టానికి ఇది సంకేతం. న్యూయార్క్ నుంచే గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు. -
అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..
చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో.. ఎంతో మంది గాయకులు, రచయితలు అద్భుతం వర్ణించి రాశారు, పాడారు. అలాంటి చీర అత్యంత ఖరీదైనదిగా, కళఖండంగా రికార్డు సృష్టించింది ఆ చీరలో దాగున్న విశేషాలు చూస్తే..కంగుతింటారు. అడుగడుగున ఓ కళా ప్రతిరూపం, ఓ ప్రత్యేకత, ఓ ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిని చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంతేగాదు చీరను చూడగానే "సరికొత్త చీర ఊహించినాను" అన్న పాట స్పురణకు వస్తుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే..అంటే ఈ చీర ధరతో పల్లెటూరిలో ఓ మోస్తారు ఇల్లు కట్టేయొచ్చు లేదా ఓ మారుమూల ప్రాంతంలో సింగిల్ బెడ్రూం ధర అని కూడా చెప్పొచ్చు.ప్రపంచం చీరల దినోత్సవం సందర్భంగా..అత్యంత ఖరీదైన వివాహ పట్టు చీర, కళలకు నిలయమైన చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర విశేషాలు గురించి తెలుసుకుందామా. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. దీనిలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు.దీనిలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. నివేదికల ప్రకారం.. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇది జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఈ చీర తయారీకే దాదాపు 4 వేలు గంటలు పనైనే పట్టిందట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే..ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి. ఆ శారీ పల్లులో 'గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్' ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళలను వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. కుడివైపు ఒక ముస్లీం మహిళ, ఎడమవైపు ఒక స్త్రీ నాయర్ ముండు దుస్తులను(కేరళ నాయర్ సామాజికి వర్గానికి సంబంధించిన స్త్రీలు) ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివవరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రించడంతనే ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ చీరను రెండు వెర్షన్లలో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట.(చదవండి: Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!) -
శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సద్య..!
అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు. (చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్..!) -
అక్కడ 'చెత్త' ఆదాయంగా మారుతోంది..!
చాలాచోట్ల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అనే నినాదం మాటలకే పరిమితమైంది. కానీ కొన్నిచోట్ల కార్యరూపానికి నోచుకుని సరికొత్త విధానంతో మార్పుకి నాంది పలుకుతూ.. స్ఫూర్తిని కలిగిస్తోంది. అది ఒకరకంగా అటు పర్యావరణ పరంగా, ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది కూడా. ఇలాంటి వినూత్న మార్గాలు ఆదర్శంగానే కాదు యావత్తు దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్కి నిలయంగా ఉండేలా చేస్తాయి కూడా. అలాంటి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి..దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. అంతేకాదు చెత్తతో సంపద సృష్టించి మొత్తం దేశాన్నే ఆకర్షించింది కూడా. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.బిహార్‌లోని సివాన్ జిల్లాలోని లఖ్వా గ్రామ పంచాయతీ గృహ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చి..ఆదర్శం గ్రామంగా నిలిచింది. ఏకంగా మొబైల్ అప్లికేషన్‌తో గృహవ్యర్థాలను కొనుగోలు చేసిన తొలి గ్రామం కూడా ఇదే. లోహియా స్వచ్ఛ బీహార్ అభియాన్ (LSBA) కింద ప్రారంభించిన ఈ చొరవ గ్రామస్తులు తమ గృహ వ్యర్థాల వివరాలను 'కబాద్ మండి' యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే సంబంధిత ఏజెన్సీ అస్రాజ్ స్కేప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యర్థాలను తూకం వేసి, నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా డబ్బులను తత్క్షణమే చెల్లిస్తుంది. ఈవ్యవస్థ ఒక రకంగా పారదర్శకత, సరళత, విశ్వసనీయతను నిర్థారిస్తుంది. ఇక్కడ వాళ్లు సేకరించిన వ్యర్థాలలో ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ రేటు ఉంటుంది. దాంతో సులభంగా ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అక్కడ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సమాచార, విద్య, కమ్యూనికేషన్ సలహాదారు(ఎల్ఎస్బీఏ) సుమన్ లాల్కర్న్ ప్రకారం..ఈ కార్యక్రమం విజయానికి దాని స్పష్టమైన ధరల విధానమేనని అన్నారు. దీనివల్ల గృహ వ్యర్థాల విభజన సులభమైందని కూడా చెబుతున్నారు. ఇంతకీ వ్యర్థాల ధరలు వస్తువుల వారీగా ఎలా ఉంటాయంటే..ప్లాస్టిక్ సీసాలు: కిలోకు రూ. 15టిన్: కిలోకు రూ. 10పెద్ద కార్డ్బోర్డ్: కిలోకు రూ. 8మధ్యస్థ కార్డ్బోర్డ్: కిలోకు రూ. 6తెల్లటి పాలిథిన్ కవర్లు(ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉండేవి): కిలోకు రూ. 5చిన్న కార్డ్బోర్డ్: కిలోకు రూ. 4కాగితం: కిలోకు రూ. 3బ్లాక్ ప్లాస్టిక్: కిలోకు రూ. 2సేకరించిన వ్యర్థాలను ఏం చేస్తారంటే..సేకరించిన వ్యర్థాలను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు (PWMU), వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు (WPU) రవాణా చేస్తారు. ఆ తర్వాత వ్యర్థాలను ల్యాప్‌టాప్ బ్యాగులు, మహిళల పర్సులు, డైరీలు, కీ రింగ్‌లు, కప్బోర్డ్లు, బెంచీలు వంటి ఇతర మన్నికైన ఉత్పత్తులుగా రీసైకిల్ చేస్తారు. ఈ ప్రక్రియ పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా స్థానికులకు ఉపాధిని కూడా అందిస్తోందిరాష్ట్రవ్యాప్త ప్రభావంవ్యర్థాల నిర్వహణలో బిహార్ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని గ్రామీణాభివృద్ధి రవాణా మంత్రి శ్రావణ్ కుమార్ హైలైట్ చేశారు. ప్రస్తుతం, బీహార్‌లో దాదాపు 7 వేలకు పైగా గ్రామ పంచాయతీలలో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను, 171 ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీంతో వేల టన్నుల ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి.. తిరిగి ఉపయోగించుకునేలా మార్చి.. బిహార్ స్వావలంబన, పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది. చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. (చదవండి: అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..ఎలాగో తెలుసా..!) -
లోతైన ఆలోచన
ఒక ఊర్లో కూలీలను పెట్టి బావుల్ని తవ్వించే మేస్త్రీ ఉండేవాడు. ఆ బావి మేస్త్రీ పల్లెలన్నీ తిరిగి ఎవరు బావి తవ్విస్తారో వారికి కూలీలను ఏర్పాటు చేసి బావుల్ని తవ్వించే పని చేసేవాడు. అతడు పనికి ఒప్పుకున్నాడంటే ఆ బావిలో నీళ్ళు పడాల్సిందే. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో బాగా డబ్బు సంపాదించి కొంచెం స్థిమితపడ్డాడు.ప్రతి పౌర్ణమికీ అతడు వీలు కల్పించుకుని దగ్గరున్న పట్టణంలోని గుడికి వెళ్ళేవాడు. అక్కడ ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను, రామాయణ భారత భాగవతాలను విని ఇంటికి వచ్చేవాడు. తీరికగా ఆ విషయాలన్నీ భార్యకు చెప్పేవాడు. ఆమె చాలా ఆసక్తిగా వినేది. తనకు వచ్చిన అనుమానాలను భర్తనడిగి తెలుసుకునేది. అయితే తాము మాత్రమే వాటిని తెలుసుకోవడం ఆమెకు రుచించలేదు. ‘మరింత మందికి ఆ మంచి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది కదా’ అని ఆలోచించసాగింది.ఒకరోజు పనులన్నీ ముగించుకుని ఉపన్యాసాలు వినడానికి పట్టణానికి బయలుదేరబోయాడు మేస్త్రీ. అతడి స్నానానికని ఇంట్లోని చేదబావిలోని నీళ్ళను తోడుతూ ‘ఎవరింట్లో అయినా బావి తవ్విస్తే ఏమి జరుగుతుంది?’ అని అడిగింది. ‘ఆ ఇంట్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు తోడుకుంటారు. వంటకీ, ఇంటికీ వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు.‘అదే ఊరి మధ్యలో చేదబావి తవ్వితే ఏమవుతుంది?’ అని ప్రశ్నించింది.‘అనుమానమెందుకు? ఊర్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరు మాత్రమే విని నాకు చెబితే మనవరకే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అదే మీరు ఉపన్యాసకులను మన ఊరికి పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. మన ఊరి రాములవారి గుడిలో నెలకొకసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే పిల్లలూ, పెద్దలూ అందరూ వింటారు. నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్లు కదా’ అని మెత్తగా చెప్పింది.‘ఇన్నాళ్ళూ నా భార్యని బావిలోని కప్పనుకున్నాను. కానీ, లోతుగా ఆలోచన చేసే మనిషి’ అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఉపన్యాసకులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. తమ ఊర్లోనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. మొదటగా ఊర్లో వాళ్ళు మాత్రమే వినడానికి వచ్చే వారు. చిన్నగా చుట్టుపక్కల గ్రామాలకు విషయం పాకింది. ఇతర గ్రామాల ప్రజలు మైళ్ళ దూరం నడిచి వచ్చి శ్రద్ధగా వినడం ప్రారంభించారు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, వచ్చి నాలుగు మంచిమాటలు వినే జనాన్ని చూసిన మేస్త్రీ దంపతులకు, నిండుగా నీళ్ళున్న బావిని చూసినంత ఆనందం కలిగింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
కర్మ యోగం... కర్తవ్య పాలన
భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం. మనం చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పించే ‘నైవేద్యం’గా భావించాలి. ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం, కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవన ముక్తి. అహంకారాన్ని వీడి, ‘నేను కర్తను కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడను’ అనే భావనతో పని చేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు.ఆర్ష ధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. అయితే, ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్ష మార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి. పని చేయడంపైనే నీకు అధికారం ఉంది గానీ, ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన, భయం, అసహనం ప్రవేశిస్తాయి. అదేపనిని దైవ కార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ‘యోగం’గా మారుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో అనుసరించదగిన పరమ సత్యం.కర్మయోగం అంటే పలాయనవాదం కాదు, అది సంపూర్ణమైన క్రియాశీలత. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే, ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు. అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే, ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది. అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారం అవుతుంది. అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ, తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితం చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి, తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు. ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు, మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి.ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ‘ఫలత్యాగం’. అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు, ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం.యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మ సిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే, ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది. స్వార్థపు చీకటిని తొలగించి, సేవా భావం అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఈశ్వరార్పణమస్తు! నిప్పు నిప్పును కాల్చదు గానీ, దానిపై పడిన వస్తువును కాలుస్తుంది. అలాగే, అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే, నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలం చేస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగును ఇస్తాడు, తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకు ఉండదు. అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నిత్య జీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం, బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం. ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ, అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
కోతి నిద్ర
ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆవులిస్తూ ఏదో ఆలోచిస్తోంది. అక్కడే తిరుగుతున్న అంజి మిత్రులు ఎలుగుబంటి, నక్క, తోడేలు, నెమలి, కోకిల అంజిని గమనించాయి.‘అంజీ! ఏంటి నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి!?’ అడిగింది ఎలుగుబంటి...‘రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు!’ అంది అంజి . ‘నువ్వు రోజూ సాయంత్రం తాటికల్లు తాగు, హాయిగా నిద్రపడుతుంది!’ అంది నక్క. ‘తాటి కల్లు వద్దు, ఈతకల్లు తాగావంటే మత్తుగా నిద్రపడుతుంది’ అంది తోడేలు.‘కాదు... కాదు నీళ్లలో తేనె కలుపుకొని తాగు! వెంటనే నిద్రలోకి జారుకుంటావు!’ అంది ఎలుగుబంటి. ‘తాగుడు కాదు! నువ్వు ప్రతిరోజూ అరగంట నాట్యం చేశావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది!’ అంది నెమలి.‘నాట్యంకన్నా అరగంట పాటలు విన్నావంటే, వద్దన్నా కునుకు పడుతుంది!’ అంది కోకిల.ఇలా కోతి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి.అంజి అన్నిటి సలహాలు విని బుర్ర గోక్కుంటూ ఇంటికి పోయింది. తెల్లారి అంజి మళ్లీ నల్ల బండకు చేరింది. ‘అంజీ! రాత్రి తాటికల్లు తాగావా?’ ఆత్రంగా అడిగింది నక్క.‘లేదు!’ అంది అంజి.‘అయితే, నేను చెప్పినట్లు ఈత కల్లు తాగుంటావు!’ అంది ఆసక్తిగా తోడేలు.‘కాదు!’ అంది ‘అంజి మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది. నేను చెప్పిన తేనె నీళ్లు తాగుంటుంది’ అంది ఎలుగుబంటి. ‘లేదు... లేదు!’ అంది అంజి. ‘ఓహో! నేను చెప్పినట్లు నాట్యం చేసుంటుంది’ అంది నెమలి. ‘కాదు... కాదు’ అంది అంజి.‘ఇంకేముంది నా మాటకు విలువ యిచ్చి పాటలు విని ఉంటుంది’ అంది కోకిల. అంజికి చికాకు వేసింది. ‘ఆపండి మీగోల! నేను అసలు ఎవరి సలహానూ పాటించలేదు. మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనూ లేదు’ అంది కోపంగా. వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకు దూకి, అక్కడి నుంచి నేరుగా వైద్యుడు ఏనుగు వద్దకు పోయింది. తన సమస్య చెప్పింది. ఏనుగు అంజిని పరీక్షించి, ‘ఇంకా ఆలస్యం చేసి ఉంటే, నీ కంటికి, ఒంటికి ప్రమాదం జరిగేది’ అంటూ కొన్ని వేరు మందులు ఇచ్చింది. ‘వీటిని వాడుతూ, ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది’ చెప్పింది ఏనుగు.‘ఈలోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చే వాళ్లకు లోటులేదు. పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది’ అని తెలుసుకుంది అంజి. -
స్ట్రోక్‌కు సూపర్ హీరోలు!
రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతే వచ్చే స్ట్రోక్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయితే, ఈ ప్రాణహానికి అడ్డుకట్ట వేయడానికి స్విస్ శాస్త్రవేత్తలు కొత్త సూపర్ హీరోలను సృష్టించారు. అవే మన రక్తనాళాల్లో పరిగెత్తే సూక్ష్మ రోబోలు! ఈ చిన్న రోబోలు (Robots) రక్తప్రవాహంలో తేలికగా ప్రయాణిస్తూ, రక్తనాళం ఎక్కడైనా మూసుకుపోయిందని గుర్తిస్తే వెంటనే అక్కడికి చేరి గడ్డను కరిగించే మందును నేరుగా ఆ ప్రదేశానికే పంపిస్తాయి. రక్తం (Blood) ఎంత వేగంగా ప్రవహించినా, ఇవి అంతే వేగంగా, చురుకుగా కదులుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు వీటిని బాహ్య అయస్కాంత క్షేత్రాల సాయంతో కచ్చితంగా నియంత్రించగలమని నిరూపించారు. అంటే వైద్యులు రక్తనాళాల సన్నని దారుల్లో ఈ రోబోలను నిశితంగా నడిపించగలరు. సడన్‌గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఇప్పటి చికిత్సలు, మందులు, శస్త్రచికిత్స సమయం తీసుకుంటాయి. కాని, ఈ రోబోలు, మొదటి నిమిషాల్లోనే గడ్డపై నేరుగా దాడి చేసి, ప్రాణాలను రక్షించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, స్ట్రోక్ చికిత్సలో ప్రాణరక్షక సేనగా మారబోతున్నాయి. -
ఎప్పుడు చేయించాలి?
నా వయస్సు యాభై ఐదు సంవత్సరాలు. మా కుటుంబంలో ఇద్దరికి పూర్వం క్యాన్సర్ వచ్చింది. నాకు రాకుండా ఉండటానికి, లేదా ముందుగా గుర్తించే పరీక్షలు ఈ రోజుల్లో ఉన్నాయని విన్నాను. నిజంగా అలాంటివి ఉన్నాయా? ఎప్పుడు చేయించాలి? – సుమతి, తిరుపతిఇప్పటి వైద్య శాస్త్రం ఎంత ముందుకెళ్లిందంటే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసే పరీక్షలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవారికి ప్రమాదం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, యాభై ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పక చేయించుకోవడం మంచిది. ఇప్పుడు రక్తంతో చేసే చిన్న పరీక్షలతోనే శరీరంలో ప్రమాదం ఉందో లేదో తెలుసుకునే విధానాలు వచ్చాయి. వయస్సును బట్టి ప్రమాదం పెరుగుతుంది కాబట్టి తొందరగా తెలుసుకుంటే చికిత్స కూడా త్వరగా మొదలవుతుంది. పేగు, గర్భసంచి, రొమ్ము, అండాశయాలు, ఊపిరితిత్తులు వంటి అవయవాల్లో వచ్చే క్యాన్సర్లను ముందే కనిపెట్టే పరీక్షలు అందుబాటులోనే ఉన్నాయి. గర్భసంచి భాగంలో వచ్చే వ్యాధిని గుర్తించడానికి పాప్ స్మియర్ పరీక్షను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ల వరకు చేస్తారు. రొమ్ములో వచ్చే వ్యాధిని ముందే తెలుసుకోవడానికి మామోగ్రఫీ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. క్యాన్సర్ కుటుంబంలో ఉన్నవారికి ఇవి మరింత అవసరం. చాలామంది ‘మన ఇంట్లో ఎప్పుడూ ఎవరికీ రాలేదు కాబట్టి నాకు కూడా రాదేమో’ అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా లక్షణాలు లేకుండానే వ్యాధి ప్రారంభమై ఉంటుంది. అలాంటి దశలో రొటీన్ పరీక్షలే దాన్ని గుర్తించగలవు. శరీరంలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే అలాగే వదిలేయకూడదు. మలబద్ధకం, మలంలో రక్తం, అసాధారణ రక్తస్రావం, రొమ్ము పరిమాణం లేదా ఆకారం మారడం, వింతగా గట్టిగా మారడం, నెలసరి కాకుండా మధ్యలో రక్తస్రావం, కారణం లేకుండానే శరీరం బరువు తగ్గడం, తిన్నా తిననట్టుగా అనిపించడం, నిరంతరం అలసిపోవడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే నిపుణుడిని కలవాలి. అవసరమైతే వైద్యులు రక్తపరీక్షలు, స్కాన్లు, మరీ అవసరమైతే మరింత వివరమైన పరీక్షలు కూడా సూచిస్తారు. ముందుగా గుర్తించిన వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వయస్సు పెరిగిన తర్వాత, ముఖ్యంగా కుటుంబంలో ఇలాంటి వ్యాధి ఉన్నవారు అయితే మరింత జాగ్రత్తగా పర్యవేక్షణ చేయించుకోవడం మంచిది. -డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ , హైదరాబాద్ -
కోర్టుపైనా కన్నేశారు!
ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, కర్మాగారాలు, కార్ఖానాలు, బస్సులు, రైళ్లు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలు, చివరకు దేవాలయాల్లో జరిగిన చోరీల కథలు ఎన్నో విన్నాం. అయితే హైదరాబాద్‌కు చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా నాంపల్లి కోర్టులో చోరీకి పథకం వేసింది. రహస్య పత్రాలు, విలువైన వస్తువులు, సాక్ష్యాధారాలను చేజిక్కించుకోవడానికి ఈ పథకం వేసి ఉంటారని భావిస్తే తప్పులో కాలేసినట్లే! దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగిన ‘సిటీ డాన్’ సయ్యద్ అబెద్ హుస్సేన్ అలియాస్ అలీ భాయ్ సూత్రధారిగా జరిగిన ఈ కుట్రను అమలు చేయడం ద్వారా కోర్టు స్వాధీనంలో ఉన్న రూ.2.5 కోట్ల నకిలీ నోట్లు తస్కరించాలని భావించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 ఆగస్టులో ఈ కుట్రను ఛేదించారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన అలీ భాయ్ హైదరాబాద్‌లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడటంతో పాటు అపహరణలకు పథకం వేశాడు. 2001లో టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి కుమార్తెను కిడ్నాప్ చేయించాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు బాలికను రెస్క్యూ చేయడంతో పాటు అలీ భాయ్ అనుచరులను అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నకిలీ పాస్‌పోర్టు సాయంతో దుబాయ్ పారిపోయిన అలీ భాయ్ అక్కడే మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో చేరాడు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని పుణే, ముంబైలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ పలు నేరాలు చేయించాడు. 2007 మార్చిలో హైదరాబాద్ వచ్చిన అలీ భాయ్‌ని అరెస్టు చేసిన పోలీసులు, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదే సవుయంలో అదే జైల్లోనే ఉన్న విప్లవ దేశభక్త పులులు (ఆర్పీటీ) సంస్థ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి జైలు నుంచే బేగంపేటలోని కంట్రీక్లబ్ నిర్వాహకుడు రాజీవ్‌రెడ్డి కిడ్నాప్‌నకు కుట్ర పన్నారు. బయట ఉన్న తమ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలు చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన వుధ్య వుండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి సోదరుడితో పాటు ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు. ఆ ఉదంతం తర్వాత అలీభాయ్‌ని చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి వూర్చారు. అక్కడ అలీ భాయ్ వనస్థలిపురానికి చెందిన మహ్మద్ దావూద్ జకీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇతడిపై కర్ణాటకలోనూ భారీ చోరీలు, దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన దావుద్ అనేకసార్లు ములాఖత్‌కు వచ్చి రహస్యంగా అలీభాయ్‌కి సెల్ఫోన్లు అందించాడు. అలీ వాయిదాల కోసం నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడూ వీరిద్దరూ మాట్లాడుకున్నారు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో 2008లో చోటు చేసుకున్న వ్యాపారవేత్త రాజీవ్ సిసోడియా హత్య కేసులో అరెస్టుయిన వాళ్లల్లో జహీరాబాద్‌కు చెందిన వుక్సూద్ ఒకడు. ఇతనికి జైల్లో ఉండగా అలీభాయ్తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఇతగాడు తాను రయీజ్ అనే నేరగాడితో కలిసి జహీరాబాద్‌లో ఉన్న ఓం ప్రకాష్ దత్తప్ప జ్యువెలర్స్‌లో దోపిడీ చేయాలని 2007లోనే పథకం వేశానని, అయితే కార్యాచరణలో పెట్టలేకపోయానని అలీభాయ్‌కి చెప్పాడు. ఆ పథకాన్ని అమలు చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించాలని భావించిన అలీ భాయ్ అదే విషయాన్ని దావుద్‌కు చెప్పాడు. అలీభాయ్ ఆదేశాల మేరకు దావుద్... రయీజ్‌ను కలిసి జహీరాబాద్‌లోని ఆ జ్యువెలర్స్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆ దుకాణాన్ని యజమాని ప్రతిరోజూ రాత్రి 9.00–9.30 వుధ్య వుూసేసి, విలువైన బంగారు నగలతో ఇంటికి వెళ్తాడని గుర్తించారు. దుకాణం నుంచి ఇంటికెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయనను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని జైలులో ఉన్న అలీ భాయ్‌కు చెప్పి, అతడి ఆదేశాల మేరకు బీదర్‌కు చెందిన సంతోష్‌ను తమతో కలుపుకున్నారు. దోపిడీ కోసం బీదర్‌కు చెందిన జగ్గు అలియాస్ జగదీష్ నుంచి కొన్ని కత్తులు కొన్నారు. ఈ నగల దుకాణంతో పాటు నాంపల్లి కోర్టులోనూ చోరీ చేయాలని అలీభాయ్ పథకం వేశాడు. దీన్ని అవులు చేయాలని దావుద్, వుుస్తాక్లకు ఆదేశాలు ఇచ్చాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ అంతర్జాతీయ నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. దుబాయ్ నుంచి పాత పేపర్ల పేరుతో ముంబై మీదుగా హైదరాబాద్‌కు రూ.2.5 కోట్ల నకిలీ కరెన్సీ వచ్చాయి. పాత న్యూస్ పేపర్ల మధ్యలో ఈ కరెన్సీని ఉంచిన గ్యాంగ్ గుట్టుగా కంటైనర్‌లో పాతబస్తీకి వచ్చిన ఈ ఫేక్ కరెన్సీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉన్న పవర్ ప్రెస్‌లో ముద్రితమైన ఈ కరెన్సీ అసలు నోట్లకు దీటుగా ఉంది. నిపుణులు మినహా ఎవరూ కనిపెట్టే ఆస్కారం లేకుండా ముద్రించారు. అప్పట్లో నగర నేర పరిశోధన విభాగం దర్యాప్తు చేసిన ఆ కేసు విచారణ నాంపల్లి కోర్టులో సాగింది. దీంతో ఆ నకిలీ కరెన్సీని కోర్టులోని ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నోట్లను కూడా చోరీ చేయవుని అలీ భాయ్ చెప్పడంతో దావుద్, వుుస్తాక్లు కోర్టు పరిసరాల్లోనూ రెక్కీ నిర్వహించారు. ఈ రెండు నేరాలు చేయడానికి అనువైన సవుయం కోసం ఎదురుచూశారు. ఈ రెండు పథకాల అమలుకు ముందే కుట్రలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నేరాలు చేయడానికి అవసరమైన కారును చోరీ చేయాలనే ఉద్దేశంతో దావుద్, రయీజ్, సంతోష్‌లు నాంపల్లి ప్రాంతంలో 2009 ఆగస్టు 6న రెక్కీ నిర్వహించారు. అప్పటికే వీరిపై కన్నేసి ఉంచిన టాస్క్‌ఫోర్స్ బృందం ముగ్గురినీ పట్టుకుని, వుూడు కత్తులు స్వాధీనం చేసుకుంది. వీరి వాంగ్మూలం ఆధారంగా జగదీష్‌ను పట్టుకున్నారు. అప్పటికే జైల్లో ఉన్న అలీ భాయ్‌ని ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌పై అరెస్టు చేశారు. జహీరాబాద్ కుట్ర విజయవంతమైనా కాకపోయినా, ఆశించిన మొత్తం దక్కకపోయినా... చేతినిండా డబ్బు ఉండాలనే కోర్టులోని నకిలీ నోట్లను తస్కరించాలని భావించామని, దీన్ని సాధారణ కరెన్సీ మాదిరిగా చలామణి చేయాలని భావించామని నిందితులు బయటపెట్టారు. -
మానవాళి రక్షణకై ప్రబావించిన యేసుక్రీస్తు
‘క్రిస్టోస్’, ‘మాస్సే’ అనే రెండు పదాల నుంచి క్రిస్మస్ అను మాట వచ్చింది. దాని అర్థం క్రీస్తును ఆరాధించుట. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. క్రిస్మస్ పరమార్థాన్ని గుర్తించి దేవుని ఆరాధించుటలో తప్పులేదు గాని దానిని ఆచార ‡సంబంధమైన ఓ పండుగగా భావించి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే! ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినం క్రిస్మస్. క్రిస్మస్ సమయంలో ప్రతి చర్చిలోను, ప్రతి కార్యక్రమాలలోను క్రైస్తవులు ఈ బైబిల్ వాక్యాలను తప్పక చదువుతారు. ‘‘ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంటుండగా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే, ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు.ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు’ అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను’’– (లూకా 2:814).ఇంగ్లండు దేశంలో జన్మించిన చార్లెస్ వెస్లీ తన జీవితకాలంలో సుమారుగా 6500 పాటలు రచించాడు. తన అన్న జాన్‌వెస్లీ తన ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే, చార్లెస్ వెస్లీ తన పాటల ద్వారా అనేకులను దేవునివైపు నడిపించాడు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన చార్లెస్ దేవుని పట్ల అపారమైన భయభక్తులు కలిగియున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చిన సందర్భాన్ని తాను వ్రాసిన పాటలలో అద్భుతంగా వివరించాడు. వాటిల్లో ఒక పాట ఇలా ఉంటుంది. ‘‘దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి... ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందున. భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున మ్రోగుపాట చాటుడి.’’ దాదాపుగా అన్ని సంఘాల్లో ఈ పాట పాడి క్రిస్మస్ ఆత్మీయ అర్థాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ‘నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును’ అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? సకలలోక సృష్టికర్తయైన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన శరణు కోరిన వారిని పవిత్రపరుస్తాడు. పాపము విడిపించి ఆత్మశుద్ధిని దయచేస్తాడు. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకున్నాయి కూడా. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న ‘అపోలో–11’ అనే రాకెట్ మీద అక్షరాలా 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి, మహనీయుడైన దేవుని మనసారా స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘‘నిన్ను కాపాడువాడు’’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టియే ఇంత అద్భుతంగా ఉంటే, దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా!నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళి వచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి, కొన్ని పరిశోధనలు చేసి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు కూడా తీసుకువచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి, ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి.ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణలలో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచారు. ప్రతి సభలోనూ ఆయన ప్రకటించిన సత్యం... ‘‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు అదీ గొప్ప విషయం.’’ నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భువిపై జన్మించారన్నది లేఖన సత్యం. క్రీస్తు ప్రభువు జన్మ స్థలమైన బేత్లెహేము ప్రపంచంలోని కోట్లాదిమంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ బేత్లెహేము ఒకప్పుడు స్వల్ప గ్రామమైనను నేడు అది ప్రత్యేక ప్రదేశంగా విరాజిల్లుతోంది. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). దేవుడు తన ప్రజల జీవితాల్లో తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బేత్లెహేము నుంచి వస్తాడు అని చెప్పబడిన ప్రవచనం చాలా గొప్పది. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. రక్షకుడు పుట్టే స్థలము మాత్రమే గాక ఆయన గుణలక్షణమును, విశిష్ట అధికారాన్ని మీకా తెలియచేశాడు. దేవుడు నిత్యుడు. అందుకే ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరికి నిత్య సంపదలు అనుగ్రహిస్తాడు. నిత్యజీవం ఆయన ఇచ్చే బహుమానములలో ప్రధానమైనది. సృష్టికర్త పుడమిపై పవళించిన ఆ స్థలము పరమ పావనమై పునీతమైంది. బేత్లెహేము చరిత్రను మనం క్లుప్తంగా గమనించగలిగితే ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు విశదమౌతాయి. పరిశుద్ధ గ్రంథంలో బేత్లెహేమునకు విశిష్టమైన స్థానం ఉంది. బేత్లెహేము అనేమాటకు రొట్టెల గృహము (హౌస్ ఆఫ్ బ్రెడ్) అని అర్థం. ఇది జెరూషలేముకు దక్షిణంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాకోబు కాలంలో ఈ ప్రాంతాన్ని ‘ఎఫ్రాతా’ అని పిలిచేవారు. ఇక్కడే యాకోబు తన భార్యయైన రాహేలును పాతిపెట్టాడు. ‘‘రాహేలు మృతిబొంది బేత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.’’ పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఘట్టం రూతు చరిత్ర. రూతు కూడా తన అత్తయైన నయోమితో కలిసి మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చెను. దేవుడు రూతును బహుగా హెచ్చించెను. రూతు బోయజును వివాహమాడి ఓబెదును కనెను. ఓబెదు యెష్షయిని, యెష్షయి దావీదును కనెను. (రూతు 4:21). మోయాబు దేశం నుండి వచ్చిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడం నిజంగా ఆశ్చర్యమే కదా! దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిస్తే తన దివ్య ప్రణాళికలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడతాయి అనడానికి రూతు జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. బేత్లెహేములోని పొలాలను బోయజు పొలాలు అని కూడా పిలుస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు బేత్లెహేములోనే జన్మించి బేత్లెహేమీయుడుగా పిలువబడెను. దానినే దావీదుపురము అని కూడా కొన్ని సందర్భాలలో పిలిచారు. కారణం అది దావీదు జన్మస్థలము కాబట్టి.మరియకు ప్రధానం చేయబడిన యోసేపు కూడా బేత్లెహేములో జన్మించాడు. అది అతని జన్మస్థలము కాబట్టి ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకొనుటకు నజరేతు నుంచి ప్రయాణం చేసి బేత్లెహేము వరకు వచ్చెను. ఏ బేత్లెహేముకైతే అత్యంత పురాతన చరిత్ర ఉన్నదో అదే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించెను. బెత్లెహేము అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం అయితే, యేసుక్రీస్తు ‘‘జీవపు రొట్టె’’గా జీవాహారముగా ఆ ప్రాంతములో జన్మించి ఆ పేరును స్థిరపరచెను.ఈ బేత్లెహేము పొలములోనే గొర్రెల కాపరులు క్రీస్తు ఆగమన సందేశాన్ని పొందారు. రాత్రివేళ భయముతో తన మందను కాచుకొనుచున్న ఆ గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం మాత్రమే గాక వారి జీవితాలను కూడా క్రీస్తు ప్రేమ అనే వెలుగుతో నింపివేసెను. హల్లేలూయ! యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించాడని బైబిల్లో ఆయాచోట్ల తెలియచేయబడింది.రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసుపుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ‘‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి’’ అని చెప్పిరి. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుంచి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుంచి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? అనిరి (యోహాను 7:42). చర్చ్ ఆఫ్ నేటివిటీప్రపంచంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు, కట్టడాలు వున్నాయి. నిత్యం వేలాది యాత్రికులు ఆ ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్, చైనాలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇండియాలో ఉన్న తాజ్‌మహల్– ఇంకా ఎన్నో వింతలుగా పేర్కొనబడుచున్నవి. కాని, వీటికంటే ఉన్నతమైన రీతిలో ఒక ప్రాంతం ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకర్షిస్తూ ఉంది. అదే బేత్లెహేములో ఉన్న చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఎంతో విశాలమైన ప్రాంతంలో నిర్మించబడిన ఈ చర్చ్ ప్రాముఖ్యత మనకందరికి విదితమే! ఇదే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన స్థలం. పుడమిపై శాంతిదూత వెలసిన పుణ్యస్థలం. ఏటా కోట్లాదిమంది అనేక దేశాల నుంచి ఇక్కడకు వచ్చి దైవభక్తితో క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ బేత్లెహేములో ఉంది. ఇది ప్రపంచ నగరాలలో పోలిస్తే చాలా చిన్నది కాని, జగద్రక్షుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టీస్ మార్టెర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా; 3వ శతాబ్ద చరిత్రకారులైన ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. గొప్ప చరిత్రకారుడు, బైబిల్‌ను లాటిన్ భాషలోనికి అనువదించిన సెయింట్ జెరోవ్ు కూడా క్రీ.శ.384 సంవత్సరంలో ఇక్కడే పాతిపెట్టబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. కానీ క్రీ.శ 614వ సం.లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు.ఆశ్చర్యమేమిటంటే వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే ఆ చర్చ్‌లో వారు చూసిన కొన్ని దృశ్యాలు, యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చ్‌ని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చ్‌లో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు ప్రభువువారు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది.ఈ చర్చిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే తల వంచి వెళ్ళాలి. ఆ చర్చి ముఖద్వారం చాలా చిన్నగా ఉండడమే దానికి కారణం. ప్రపంచంలోని ఎంత గొప్పవ్యక్తి అయినా, తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే! మొన్నీ మధ్య అమెరికా ప్రెసిడెంటు కూడా తలవంచి లోపలికి వెళ్ళారు. అయితే చిన్న పిల్లలకు ఆ సమస్య లేదు. వారు చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ‘‘చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి. ఈలాటి వారిదే పరలోక రాజ్యము’’ అని ప్రభువు చెప్పిన మాట ఆ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. బేత్లెహేము నక్షత్రమని పిలువబడిన ఈ నక్షత్రాన్ని అసిస్సి వాసియగు ఫ్రాన్సిస్ సంబంధీకులు క్రీ.శ. 1717లో వుంచారు.అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అని అక్షరాలు చెక్కబడియున్నవి. క్రొత్తనిబంధన కాలంలో ఉన్న మనకు ప్రభువే ముఖ్యుడు. ప్రాంతం మనకు ముఖ్యం కాదు. క్రీస్తు రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేమునందు జన్మించడం వలన ఆ చిన్న గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినట్లుగా నేడు మనం ఆయనను మన హృదయాలలోనికి ఆహ్వానిస్తే కీర్తి, ఘనత, ఆశీర్వాదం మన సొంతమవుతాయి. మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను వ్రాయబడిన క్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీలను చూస్తాం. వాస్తవానికి సమాజంలో కొంతమంది స్త్రీలను చిన్న చూపు చూస్తుంటారు. స్త్రీ బలహీనమైనదని, ఆమెపట్ల పక్షపాతం చూపిస్తారు. యూదుల వైఖరికూడా స్త్రీల పట్ల చులకనగానే వుంటుంది. కానీ దేవుని దృష్టిలో స్త్రీ, పురుషులని భేదం లేదు. అందరికీ సమానంగా తన కృపను చూపించుచున్నాడు అనే విషయం తన వంశావళిలో స్త్రీల పేర్లను ప్రస్తావించుటను బట్టి తేటతెల్లమయ్యింది. ఏ యూదుని వంశావళిలోనూ స్త్రీ పేరు కనబడదు. స్త్రీలకు బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన స్థానం కల్పించబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన తరువాత పురుషులు, దేవదూతలతో పాటు స్త్రీలు కూడా ఆనందించారు. బైబిల్ గ్రంథంలో పురుషులు చేసిన సేవను గుర్తించిన విధంగా స్త్రీలు చేసిన పరిచర్యను కూడా ప్రభువు గుర్తించారు. పాతనిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా సేవలందించారు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా స్త్రీల సహాయం చాలా గొప్పది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతిని శిష్యులకు తెలియజేసినది కూడా స్త్రీలే. అంత గొప్ప ప్రాధాన్యతను ప్రభువు వారికి అనుగ్రహించి, స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ వారు కాదని, వారిపట్ల కూడా దేవుడు అపారదృష్టి కలవాడని నిరూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో కూడా స్త్రీలను ప్రస్తావించుట ద్వారా దేవాదిదేవుడు వారికెంత విలువ, గౌరవం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో క్రొత్తనిబంధనలో ఇద్దరు సువార్తికులు యేసుక్రీస్తు వంశావళిని వ్రాశారు. సువార్తికుడైన లూకా యోసేపు వంశావళి క్రమాన్ని అనుసరించి దావీదు కుమారుడైన నాతాను క్రమం నుంచి వ్రాసుకొస్తే, మత్తయి సువార్తికుడు మాత్రం మరియ వంశ క్రమాన్ని దావీదు కుమారుడైన సొలొమోను క్రమం నుంచి వ్రాసుకుంటూ వచ్చాడు. వీరిద్దరిలో మత్తయి పేర్కొన్న వంశావళిలో ఐదుగురు స్త్రీలను గూర్చి ప్రస్తావించాడు. పరిశుద్ధాత్ముడు అనుమతించాడు గనుకనే వీరిపేర్లు దైవగ్రంథంలో చిరస్మరణీయంగా లిఖించబడినాయి. దేవునిలో లింగభేదం, వయోభేదం, కుల మత భేదాలు లేవని; అందరినీ సమానంగా ప్రేమించుచున్నాడని దానినిబట్టి అవగతమవుతుంది. మత్తయి సువార్తికుడు ప్రస్తావించిన ఐదుగురు స్త్రీలను గూర్చి ధ్యానిద్దాం!మొదటిగా తామారు. ఆమెను గూర్చిన వివరణ ఆదికాండం 38వ అధ్యాయంలో చూడగలం. యూదా కనానీయుని కుమార్తెను పెండ్లి చేసుకొనెను. ఆమె యూదాకు ఏరు, ఓనాను, షేలా, అను ముగ్గురు కుమారులను కనెను. యూదా తన పెద్దకుమారుడైన ఏరుకు తామారును ఇచ్చి వివాహం చేసెను. అయితే ఆమెయందు సంతానమేమీ కలగకుండానే ఏరు చెడునడతను బట్టి చనిపోయాడు. తదుపరి రెండవ కుమారుడైన ఓనానుకు తామారు ఇవ్వబడింది. ఓనాను కూడా తన స్వార్థపు బుద్ధితో సంతానం లేనివాడాయెను. అప్పటికి యూదా మూడవ కుమారుడు షేలా చిన్నవాడై యుండుట వలన తామారును తన తండ్రి ఇంటికి పంపివేసెను. రోజులు గడుచుచుండగా తామారు మారువేషంలో యూదాను కలుసుకొనగా వారిరువురకు పెరెసు, జెరహు అను కుమారులు కలిగి యూదా వంశం కొనసాగించబడింది.ఇక్కడ తామారును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలోనికి అనుమతించడానికి గల కారణం ఆమె యూదాకు సంతతి కలుగజేసి, అతని వంశమును నిలువబెట్టాలనుకోవడమే! ఎందుకంటే మెస్సీయా ఈ గోత్రం నుంచే వస్తాడు గనుక సాతాను ప్రాముఖ్యంగా ఈ గోత్ర నిర్మూలనకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. సంఖ్య 24:17లో వ్రాయబడినట్లు ‘‘నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును’’అను వాక్యం నెరవేరునట్లుగా యూదా సంతతి కొరకు దేవుడు తామారును ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు, యూదా వంశమును కొనసాగించుటకు తామారు తీసుకొన్న నిర్ణయం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే హర్షించదగినదే! యూదా వంశమును కొనసాగించుటకు ఆమె తనకు తాను తగ్గించుకొని అనేకుల చేత నిందలనిపించుకొనుటకైనా సిద్ధపడింది. ఆమె సమాజం దృష్టికి నీచమైనదిగా కనబడినప్పటికీ ప్రభువు ఆమెను, ఆమె తగ్గింపును గుర్తించి తన వంశావళిలో స్థానం కల్పించాడు. రెండవ స్త్రీ రాహాబు. యెరికో ప్రాకారం మీద నివసించిన ఒక వేశ్య. ఈమె ఆ ప్రాంతంలో నివసిస్తూ అనేకులను పాపం వైపు ఆకర్షిస్తుంది. యెరికో అనే మాటకు ‘‘సువాసన’’ అని అర్థం. అయితే ఆ యెరికో ప్రాకారాల మీద నివసించు స్త్రీలు కొంతమంది ఆ సువాసన కల్గించే వాటిని ఉపయోగించి బాటసారులను పాపమునకు ఆకర్షించేవారు. పేరు మంచిదే గాని, దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిదిగా లేదు. మంచి పేరు ఉండడం తప్పు కాదు కాని, ఆ పేరుకు తగ్గ జీవితం వున్నదా లేదా అనేది ముఖ్యం. రాహాబు భయంకర పాపములో జీవిస్తుండేది. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును ముట్టడి వేయడానికి ముందు ఆ పట్టణమును వేగుచూచుటకు రాగా రాహాబు వారిని తన ఇంట చేర్చుకొని ఆ ప్రాంతపు రాజు చేతినుండి తప్పించెను.అందువలన ఇశ్రాయేలీయుల చేతిలో యెరికో పట్టుబడెను గాని రాహాబు, తన కుటుంబము మాత్రమే తప్పించబడెను. రాహాబు ఇశ్రాయేలీయులలోని శల్మాను అను వ్యక్తిని పెండ్లి చేసుకొని క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించెను. లోకరీతిగా వేశ్యలకు అంత విలువ, గౌరవం ఉండదు. కాని, ప్రభువు మాత్రం ఎంతో గొప్ప స్థానం కలుగజేశాడు. ఎందుకనగా రాహాబు జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆమె దేవుని ప్రణాళికలో భాగస్థురాలయింది. రాహాబు తన గతాన్ని సమాధి చేసి ఓ మంచి దైవికమైన భవిష్యత్తు కొరకు తనను తాను సిద్ధపరచుకున్నది. ఒక వ్యక్తి గతమెంత భయంకరమైనదైననూ ఆ వ్యక్తి ప్రభువును అంగీకరించుట ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవచ్చు అని రాహాబు ఋజువు చేసింది. మూడవది రూతు. ఆమె మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. ఇశ్రాయేలు దేశంలో కరవు వచ్చినప్పుడు నయోమి తన భర్తను, కుమారులను తీసుకొని మోయాబుకు వెళ్ళింది. అక్కడ తన కుమారులకు వివాహాలు చేసింది. పది సంవత్సరాలలో భర్త, కొడుకులు చనిపోయారు. తిరిగి బేత్లెహేముకు రావాలని నిర్ణయించుకుంది. ఒక కోడలు అత్తను విడిచి వెళ్లిపోయింది. అయితే, రూతు తన అత్తను హత్తుకొని ఆమె కోసం నిలబడింది. ఇక మంచి అత్తాకోడళ్ళ బంధాన్ని వీరిలో స్పష్టంగా చూడవచ్చు. రూతు తన అత్తతో పాటు యూదా దేశానికి వస్తున్నప్పుడు ‘‘నీ దేవుడే నా దేవుడు’’ అని పలికింది. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉందని, బహుమానం ఇచ్చువాడని గ్రహించి ఆ దేవుని విడువక హత్తుకుంది. మోయాబు దేశాన్ని విడచి దేవుని ప్రజలతో ఉండాలని బెత్లేహేమునకు వచ్చింది. బేత్లెహేములో సంపన్నుడైన బోయజు ఉన్నాడు. అతని పొలంలోకి పరిగె ఏరుకొనుటకు ఒక పరదేశిగా ప్రవేశించింది. పూర్వదినాలలో భూస్వాములు తమ పంటలో కొంత భాగాన్ని పరదేశుల కోసం విడిచిపెట్టేవారు. ఏ పొలంలోనికైతే యవలు ఏరుకొనుటకు వెళ్ళిందో తన సత్ప్రవర్తననుబట్టి ఆ పొలానికి యజమానురాలు అయ్యింది. బోయజు ఆమెను పెండ్లిచేసుకొని, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మోడుబారిన జీవితాలను సర్వశక్తుడైన దేవుడు చిగురింపచేయగలడు అనే సందేశాన్ని రూతు ప్రపంచానికి ఇచ్చింది. నాల్గవదిగా బత్షెబ. ఈమె గూర్చి సువార్తికుడైన మత్తయి ‘‘ఊరియా భార్య’’ అని ప్రస్తావించాడు తప్ప ఆమె పేరును మాత్రం తెలుపలేదు. ఈమెను గూర్చి 2 సమూయేలు 11వ అధ్యాయంలో చదువగలము.ఈమె ఏలీయాము అనువాని కుమార్తె, ఊరియా అను హిత్తీయుని భార్య. ఊరియా దావీదు సైన్యంలోని నమ్మకమైన సైనికుడు. దావీదు ఊరియా భార్యయైన బత్షెబతో పాపం చేసి, దానిని దాచుకొనుటకు తనభర్తయైన ఊరియాను యుద్ధంలో చంపించెను. తరువాత దావీదు బత్షెబను వివాహమాడి ఆమెయందు నాతాను, సొలొమోను అను ఇద్దరు కుమారులను కనెను. దావీదు బత్షెబతో పాపం చేయడం ద్వారా పుట్టిన మొదటి కుమారుడు చనిపోయెను. ప్రవక్తయైన నాతాను ద్వారా దావీదు గద్దింపబడినప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది దేవునివైపు తిరిగెను. దేవుని మహాకనికరం అతని మీద కుమ్మరించబడెను. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా తన సింహాసనం తనకు నిత్యం స్థిరపరచుదునన్న మాటను నెరవేర్చుటకు దేవుడు బత్షెబను దీవించాడు. చివరగా మరియ. గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది’. వివాహం కాకుండా గర్భం ధరించుట వలన ఎన్ని నిందలు అవమానాలు వస్తాయో ఊహించలేనంత పరిస్థితిలో మరియ లేదు. ప్రపంచం ఎదురు తిరిగినా తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంది.దూత ప్రకటన వినిన తదుపరి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని రక్షకుని ఆగమనానికి సహకరించింది. తాను పొందబోయే శ్రమల కంటే దేవుని కృప గొప్పదని గుర్తించింది. ‘‘నీవు కృప పొందితివి’’ (లూకా 1:30). ఆ ఒక్క మాట చాలు! దేవుని కృప ద్వారా ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోవచ్చు. నిండు చూలాలిగా ఉన్నప్పుడు నజరేతు నుంచి బేత్లేహేముకు ప్రయాణం, తమకు తెలియని ఈజిప్టు దేశంలో చిన్నబాలుడైన యేసుతో పాటు రెండు సంవత్సరాలు నివసించడం, అన్ని విషయాల్లో బాలుడైన యేసును అతి జాగ్రత్తగా చూసుకొనే విషయాల్లో మరియ దేవుని కృపమీద ఆధారపడింది. ∙∙ ఇకపోతే, యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే ప్రశ్నను చాలామంది లేవదీస్తున్నారు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘‘యేసు గ్రీకో–రోమన్ తత్త్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల మానసిక ఆవిష్కరణయే గాని, వాస్తవం కాదు. క్రొత్తనిబంధన ఒక పురాణమే గాని, వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు’’. దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు. ‘‘ప్రపంచంలోని చాలా విషయాలకు ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా, కేవలం మనుష్యుల ఆలోచనలపై ఆధారపడియున్నవి.కాని క్రైస్తవ్యం అటువంటిది కాదు’’. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బ్రూస్ అనే వ్యక్తి పరిశీలనాత్మకంగా ప్రకటించిన సత్యమిది. వాస్తవాలను క్రోడీకరించే ప్రతి చరిత్రకారునికి జూలియస్ సీజర్ చారిత్రకత ఎంత స్పష్టమో, యేసుక్రీస్తు చరిత్ర అంతకన్నా ఎక్కువ స్పష్టం.యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు, ఆయన మొదటి శతాబ్దకాలంలో ఈ భూమిపై సంచరించాడని, ఆయన రక్షకుడు మరియు దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రాజకీయవేత్త. రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటు కాలంలో గలిలయలోని తిరుగుబాటు దళమును నడిపిన వ్యక్తి. వెస్పాసియన్ అనే రాజుచేత చెరపట్టబడి మిగిలిన తిరుగుబాటు కాలమంతా రోమీయులకు మధ్యవర్తిగానూ, తర్జుమాదారునిగానూ పనిచేశాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు వ్రాశాడు. అవి: ‘‘ద జ్యూయిష్ వార్స్ ’’, ‘‘జ్యూయిష్ యాంటిక్విటీస్’’ ఫ్లావియస్ అనుపేరు రోమా పేరు కాగా జోసఫస్ అను పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు ‘‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’’ ఫ్లావియస్ జోసఫస్ అత్యంత అద్భుతమైన చరిత్రకారుడు. ఆయన వ్రాసిన చరిత్ర సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జన్మను, మరణాన్ని, పునురుత్థానాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గూర్చి సవివరంగా వ్రాయబడ్డాయి. ఆ సువార్తికులు ఎవరనగా– మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరిచే సువార్తలన్నీ క్రీ.శ. 70వ సంవత్సరంలోపే వ్రాయబడ్డాయి. అనగా యేసు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాలలోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. క్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతి తక్కువ సమయంలోనే వ్రాయబడింది గనుక వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనంగా బైబిల్ నిలిచింది.క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరి దేని గురించి అతడు ఆలోచించడు.కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి; వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుంచి అపరాధముల నుంచి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుచున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘‘ఏ భేదము లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు’’ అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి.పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి తన సిలువ మరణం ద్వారా విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం తరువాత కూడా ఓ ఉన్నతమైన జీవితం ఉందనే సత్యాన్ని తెలిపి మనిషికి నిరీక్షణ ప్రసాదించాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’’ అనే మాట బైబిల్లో ఉంది. ఒక మంచి వ్యక్తిని ప్రేమించడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో గాని, పాడైపోయిన మనిషిని దేవుడు ప్రేమించాడు. నిస్వార్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు లోకప్రేమల వెంటబడి తన జీవితాన్ని వృథాపరచుకోడు. క్రీస్తు ప్రభువు బోధలో చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రేమ. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాట ద్వారా నేడు అనేకులు ప్రేమ ఔన్నత్యాన్ని తెలుసుకొని సమసమాజ నిర్మాణంలో తన బాధ్యతను నెరవేస్తున్నారు.క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కాని, క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. చెట్టి భానుమూర్తి వ్రాసిన శ్రేష్టమైన ఈ పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడు మరచిపోదు. ‘రారె చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానది తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే. బాలుడిడిగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నా«థుడు’. సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.⇒ గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది.⇒ దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.⇒ ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత క్రొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి ఆ వయోలిన్ తనకిమ్మని సంఘ సేవకుణ్ణి అడిగాడు.ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి, దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయించాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సింపుల్ స్వాగ్!
యంగ్ బాలీవుడ్ జనరేషన్స్ కి కొత్త స్టయిల్ మూడ్ సెట్ చేస్తున్న అనన్యా పాండే, ఫ్యాషన్స్ లో పెద్ద హంగామా కాకుండా, తానెలా ఫీలవుతుందో అలా ధరించడమే తన సీక్రెట్ అంటోంది. ఆ స్టయిల్ విషయాలే ఇక్కడ మీ కోసం!‘ఫ్యాషన్స్ అంటే ఓ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ . నేను ఎలా ఫీలవుతున్నానో, అదే నా లుక్. డ్రెస్ ఏదైనా అయినా, నా స్టయిల్ నచ్చేలా ఉన్నప్పుడు అది సింపుల్ అయినా, క్లాసీ అయినా నిజంగా స్టయిలిష్‌గా కనిపిస్తుంది.’ జ్యూలరీ బ్రాండ్: జడావూ జ్యూలర్స్ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర.. బ్రాండ్: మనీష్ మల్హోత్ర ధర రూ. 2,25,000గ్లామర్ తాళ్లు! శారీ బ్లౌజ్ వెనుక దారాలు అంటే ఒకప్పుడు కేవలం కట్టుకునేందుకు మాత్రమే ఉండేవి కాని, ఇప్పుడు అవే దారాలు మన లుక్‌ని ‘ఓహ్ వావ్!’ అనిపించే స్టయిల్ స్టేట్మెంట్గా మారిపోయాయి. ముఖ్యంగా వెనుక భాగంలో రకరకాలుగా కట్టే డోరీస్కి గంటలు, తారలు, త్రెడ్ టసెల్స్ జత చేస్తే బ్లౌజ్ బ్యాక్ ఒక ఆర్ట్‌లా మెరిసిపోతుంది. అదేవిధంగా సారీ పల్లు దారాలను కూడా డిజైన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రత్యేకంగా పండగలు, పెళ్లిళ్లు, హల్దీ లాంటి ఫంక్షన్లలో ఈ డోరీస్ ఎంత డిజైనర్‌గా ఉంటే అంత రిచ్‌గా కనిపిస్తాయి.అలాగే ఏ రంగు శారీ అయితే దానికి తగ్గట్టుగా కాంట్రాస్ట్ లేదా టోన్స్ ఆన్స్ టోన్స్ దారాలు ఎంచుకుంటే బాగా సెట్ అవుతాయి. బ్లౌజ్ డోరీస్ అయితే కొంచెం మృదువుగా ఉండే వెల్వెట్ లేదా సిల్క్ తాళ్లు మంచివి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటే చర్మానికి గాట్లు పడే అవకాశం ఉంటుంది. పల్లు దారాలు మాత్రం కొంచెం బీడ్స్‌తో ఉంటే మంచిది, ఎందుకంటే అవే పల్లు స్లిప్ కాకుండా పట్టేసి ఉంచుతాయి. మొత్తానికి ఈ దారాలు అటూ ఇటూ ఊగుతూ అందరి మనసులు లాగేస్తాయి! -
చిన్న ప్రపంచంలో పెద్ద వెలుగులు
క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్బౌల్లో మినియేచర్ డెకర్ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్ డెకర్ బౌల్‌ను టేబుల్, షెల్ఫ్, కార్నర్లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్ క్రిస్మస్ డెకర్ బౌల్స్, జార్స్ రెడీమేడ్‌గా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.గ్లాస్ బౌల్ డెకర్పారదర్శకంగా ఉండే క్రిస్మస్ మినియేచర్ బౌల్స్, జార్స్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆకాశమే హద్దు... నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్ ఆర్ట్‌కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్ ఫిగర్స్, పైన్కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్ఈడీ ఫెయిరీ లైట్స్‌తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు. స్నో గ్లోబ్ స్టయిల్తెల్లటి ఫేక్ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్ ఫిగర్‌తో మినిమలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు. క్రిస్మస్ విలేజ్ థీమ్చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్ పాత్, ఎల్ఈడీ స్ట్రీట్ ల్యాంప్స్‌తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు. ఎక్కడ ఉంచాలంటే.. సిద్ధం చేసుకున్న మినియేచర్ క్రిస్మస్ బౌల్‌ను లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్‌సైడ్ లాంప్ పక్కన, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్‌గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది. - ఎన్నార్ -
బర్నింగ్ ది క్లాక్స్
కాలాన్ని ఒడిసి పట్టే గడియారాలను దహనం చేయడమే బ్రిటన్‌లోని ‘బర్నింగ్ ది క్లాక్స్’ ఫెస్టివల్ ప్రత్యేకత. బ్రిటన్స్ లోని ససెక్స్‌లో ఉన్న బ్రైటన్ నగరంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 లేదా 22న జరిగే అద్భుతమైన సామూహిక ఉత్సవమే ‘బర్నింగ్ ది క్లాక్స్’. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ వేడుక జరుగుతుంది. ఇది పాత సంవత్సరాన్ని గౌరవంగా సాగనంపి, రాబోయే కొత్త ఆశలకు, వెలుగులకు స్వాగతం పలికే వేడుక!ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ‘సమ్ స్కై’ అనే స్థానిక కళా సంస్థ నిర్వహిస్తుంది. రకరకాల పోటీలు కూడా ఏర్పాటు చేస్తుంది. శీతకాలపు చీకటిని పోగొట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.సాయంత్రం వేళ జరిగే లాంతర్ల ఊరేగింపు, ఈ ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైనదని చెప్పొచ్చు. బ్రైటన్ స్థానికులు, అక్కడికి వచ్చిన కొందరు ఔత్సాహికులు తమ చేతులతో తయారుచేసిన ప్రత్యేకమైన లాంతర్లను తీసుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా నడుస్తారు. వీటిలో ఎక్కువ శాతం గడియారాలు ఉంటాయి. ఈ లాంతర్లను సాధారణంగా కాగితం లేదా వెదురుతో తయారు చేస్తారు. అవి గడియారాలే కాక చంద్రుడు, నక్షత్రాలు, చిత్రవిచిత్రమైన ఎన్నో రూపాలను పోలి ఉంటాయి. ఈ చూడముచ్చటైన దృశ్యంతో వీధులన్నీ మెరుస్తాయి.ఇక చివరిగా బ్రైటన్ సముద్ర తీరం వద్ద ఈ ఊరేగింపు ముగుస్తుంది. అక్కడ, ప్రతి ఒక్కరూ తమ లాంతర్లను ఒక పెద్ద కొయ్యపై వేసి, అగ్నితో దహనం చేస్తారు. గడియారాలు కాలాన్ని సూచిస్తాయి కాబట్టి వాటిని దహనం చేయడమంటే పాత బాధలను, చెడు జ్ఞాపకాలను, గడిచిన కాలాన్ని విడిచిపెట్టడమే అని అక్కడి వారు భావిస్తారు. ఆ తరువాత, బాణాసంచా ప్రదర్శనతో ఆకాశం కాంతులీనుతుంది. చూపరుల మనసు నిండుతుంది.సంహిత నిమ్మన -
మన లోకం పిలుస్తోంది చలో చలో
ఆకాశంలో ఎగిరే ‘మేజిక్ కంబళి’... ‘ఓపెన్ ససేమ్’ అనగానే తెరుచుకునే గుహద్వారం దీపం రుద్దితే వచ్చే ‘జినీ భూతం’... దొంగల భరతం పట్టే ‘తెనాలి రామ’అక్బర్‌ని పకపకా నవ్వించే ‘బీర్బల్ గారు’ ... అమాయకుల్ని మోసం చేసే ‘బంగారు కంకణం పులి’‘కరటక దమనకులు’ ... ‘మర్యాద రామన్న’లు ... ‘హారీ పాటర్’లూ ‘సూపర్ మేన్’ సిరీస్‌లూ...బుక్‌ఫెయిర్ నిండా బాలల లోకమే... ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు వారిని అక్కడకు తీసుకెళ్లండి...వాళ్ల లోకాలను సొంతం చేసుకోనివ్వండి...‘నువ్వు ఏ దిక్కయినా వెళ్లు... ఒక్క ఉత్తర దిక్కు తప్ప’ అంటుంది పూటకూళ్ల అవ్వ రాకుమారుడితో పిల్లల కథల్లో. రాకుమారుడు పట్టుబట్టి ఉత్తర దిక్కు వైపే వెళతాడు. ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అపాయాలను దాటుతాడు. శాపాలతో బంధించబడిన వారిని విముక్తం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాజ్యానికి రాజవుతాడు. అందరూ నడిచే దారుల్లో నడవకుండా కొత్త దారుల్లో ధైర్యంగా వెళ్లమని పిల్లలకు చె΄్తాయి కథలు. ప్రస్తుతం జరుగుతున్న ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’లో అలాంటి ధైర్యాన్ని నూరి పోసే అనేక పుస్తకాలుంటాయి. వాటిని వారికి ఇవ్వండి. అక్కడకు తీసుకెళ్లండి.‘ఈసప్’ అనే పెద్దాయన కనీసం రెండు వేల ఏళ్ల క్రితం కొన్ని కథలు చెప్పి మనుషుల్ని సంస్కరించాడు. ‘బంగారు గొడ్డలి’ కథ అతడు చెప్పిందే. కట్టెలు కొట్టేవాడు తన ఇనుప గొడ్డలి నదిలో పారేసుకుంటే నదీ దేవత వెండి గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... బంగారు గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... చివరకు ఇనుప గొడ్డలే తీసుకుంటాడు... నదీ దేవత సంతోషించి మూడు గొడ్డళ్లనూ అతనికి బహూకరిస్తుంది. నిజాయితీతో ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి అని పిల్లలకు చె΄్తాయి కథలు. విలువలకు ప్రాముఖ్యం లేకుండా పోతున్న నేటి రోజుల్లో పెద్దలు వాటిని చెప్పకపోతే పోయారు... కనీసం పుస్తకాలైనా చెప్పనివ్వండి... పిల్లల్లో నిజాయితీ పాదుకునేలా చేయండి.ఇంట్లో దొంగలు పడితే వారి చేత బావి లోని నీళ్లన్నీ చేదించి పాదులకు పోయించుకున్నాడు తెలివైన తెనాలి రామలింగడు. ‘ఈ బిడ్డ నాదంటే నాది’ అని ఇద్దరు తల్లులు కొట్లాడుకుంటే వారిలో అసలు తల్లి ఎవరో యుక్తిగా కనిపెట్టాడు మర్యాద రామన్న. నమ్మించి కొంతమంది ఎలా గొంతు కోస్తారో అనడానికి ఉదాహరణగా నిలిచాడు ఆషాఢభూతి. వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్న పావురాలు అన్నీ కలిసి ఐకమత్యంతో వలతో పాటు ఎగిరి వెళ్లిపోయాయి. ఆకాశంలో కొంగలు మోసుకెళుతున్న తాబేలు నోటి తీటతో నోరు తెరిచి నేలన పడి ప్రాణం వదిలింది....ఇవన్నీ పిల్లలకు చెప్పే పాఠాలెన్నో. ఎన్నెన్నో. అందుకే వారికి మంచి స్కూలు, మంచి ట్రాన్స్‌పోర్టు, ట్యూషను ఎలా పెడతామో మంచి పిల్లల పుస్తకం కూడా అలాగే చేతికివ్వాలి. పిల్లలు నేర్చుకునే విధాలు వేయి. కాని వేయి విధాలుగా నేర్పగల ఒకే సాధనం పుస్తకం.గతంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు... పిల్లల కోసం ప్రచురితమయ్యేవి. వాటిలో కథలు, బొమ్మలు, విశేషాలు ఉండేవి. పిల్లలతోపాటు పెద్దలూ ఆసక్తిగా చదివేవారు. కాలం మారింది. పిల్లలు స్కూళ్లు, క్లాసులు, ట్యూషన్ల మధ్య హడావిడి పడుతుండటంతో మెల్లగా ఒక్కో పత్రికా మూతబడింది. ప్రస్తుతం పిల్లల కోసం నడుస్తున్న పత్రికలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు కొందరు రచయితలు పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. వాటికి ఆకర్షణీయమైన బొమ్మలు జోడించి ప్రచురిస్తున్నారు. చదవడం, రాయడం వచ్చిన కొందరు పిల్లలు తమ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కథలు, కవితలు రాసి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటికే ‘చిప్పగిరి కథలు’, ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’, ‘నల్లగొండ జిల్లా బడిపిల్లల కథలు’, ‘మా బడి పిల్లల కథలు’, ‘సిద్ధిపేట జిల్లా బడిపిల్లల కథలు’, ‘మన ఊరు–మన చెట్లు’ ‘వరంగల్ జిల్లా బడి పిల్లల కథలు’ వంటి పిల్లలు రాసిన కథలతో వచ్చిన పుస్తకాలు ఆదరణ పొందాయి. దీంతోపాటు చిట్టి పొట్టి పాటలు, బాల గేయాలు, కవితలు రాసి విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో ప్రచురిస్తున్నారు. కొందరు ఇంగ్లీషులోనూ రాసి పుస్తకాలు తెస్తున్నారు. అవన్నీ బాలసాహిత్యానికి బలమైన చేర్పుగా మారాయి. తెలుగులో బాలసాహిత్యం ఏనాటి నుంచో ఉంది. పాల్కురికి సోమనాథుడు, పోతన వంటి ప్రాచీన కవుల రచనల్లో పిల్లల కోసం తేటతెనుగు మాటలు జాలువారాయి. అనంతర కాలంలో అలపర్తి వెంకటసుబ్బారావు, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ, మహీధర నళినీమోహన్, న్యాయపతి రాఘవరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, దాసరి వెంకట రమణ, ఎం.హరికిషన్, చొక్కాపు వెంకటరమణ, భూపాల్, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి తదితరులు బాలల కోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రస్తుతం అనేకమంది రచయితలు బాలసాహిత్యకారులుగా గుర్తింపు పొందారు. రష్యన్ బాల సాహిత్యం కూడా తెలుగులో పునర్ముద్రణ అవుతోంది. అనిల్ బత్తుల ‘రష్యన్ జానపద కథలు’ పుస్తకం తీసుకొచ్చారు. ‘పిల్లల సినిమా కథలు’, ‘బాపు బొమ్మల పంచతంత్రం’ వంటి పుస్తకాలు పిల్లల కోసం తీసుకొచ్చారు. ప్రముఖ రచయిత్రి ముళ్లపూడి శ్రీదేవి రాసిన పిల్లల కథలు ప్రచురితం అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకీరామ్ ‘ఏడు రంగులవాన’ అనే బాలల కథల పుస్తకం రాయడంతోపాటు విద్యార్థుల చేత కథలు రాయించి, తన సంపాదకత్వంలో ‘ఊహలకు రెక్కలొస్తే’ అనే కథల పుస్తకం తీసుకొచ్చారు. పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి తానా, మంచి పుస్తకం 2025లో పోటీ నిర్వహించగా ‘చతుర్ముఖం’ (శాఖమూరి శ్రీనివాస్), ‘ఆలిబాబా అయిదుగురు స్నేహితులు’ (డా.ఎం.సుగుణరావు), ‘మనకు మనుషులు కావాలి’ (పాణ్యం దత్తశర్మ), ‘మునికిష్టడి మాణిక్యం’ (ఆర్.సి.కృష్ణ స్వామిరాజు), ‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’(పేట యుగంధర్) పుస్తకాలు ఎంపికయ్యాయి. ఇటీవల రచయిత దొండపాటి కృష్ణ పిల్లలకోసం ‘వింత శాపం’ అనే చిన్ని పుస్తకం తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంగ్లిష్ భాషలో ఎన్నో పుస్తకాలు పిల్లల కోసం ఉన్నాయి. ఆ నింగి నక్షత్రాలను నేలన ఉన్న తారలకు ఇవ్వండి. తెలుగు నేర్పించేందుకు కథలు చదివిస్తున్నారుఇంతకు ముందు తల్లిదండ్రులు ఇంగ్లిష్ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు తెలుగు పిల్లలకు రావాలని తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారు. ‘మంచి పుస్తకం’ సంస్థ పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తోంది. పిల్లల ఏజ్ గ్రూప్‌ను బట్టి వారి కోసం ‘గ్రీన్ సిరీస్’, ‘బ్లూ సిరీస్’... ఇలా పుస్తకాలు ప్రచురిస్తున్నాం. మనకి తెలియాల్సిన విషయం ఏమిటంటే రెండూ రెండున్నర ఏళ్ల పిల్లలు కూడా పుస్తకాలకు ఆకర్షితులవుతారు. వారి కోసం బొమ్మల పుస్తకాలు ఉంటాయి. అప్పటి నుంచి అలవాటు చేయాలి. ‘మంచి పుస్తకం’ తరఫున ‘గిఫ్ట్ ఏ లైబ్రరీ’ కాన్సెప్ట్ ఉంది. మీరు చదివిన స్కూల్‌కు 10 వేల రూపాయల పుస్తకాలు బహూకరించాలనుకుంటే వాటిని డిస్కౌంట్లో 8500 లకే మేము అందిస్తాం. ఈ ఆలోచనకు మంచి స్పందన ఎదురవుతోంది. పిల్లలకు పుస్తకాలు కొని తెచ్చివ్వడం కన్నా వారిని పుస్తకాల షాపుకు తీసుకెళితే వారికి కలిగే ఉత్సాహం వేరు అని మా అనుభవం చె΄్తోంది. ఇక బుక్‌ఫెయిర్‌కు తీసుకెళితే వారు తూనీగలే అవుతారు.– పవిత్ర, మంచి పుస్తకం ఇన్చార్జ్రికార్డుల మోతచిన్న వయసులోనే ఎక్కువ రికార్డ్‌లు సృష్టించిన యువతిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చండీగఢ్‌కు చెందిన జాన్వీ జిందాల్. ప్రీస్టైల్ స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. జాన్వీకి కోచ్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తండ్రి సహాయంతో, యూట్యూబ్ వీడియోల ద్వారా స్కేటింగ్ నేర్చుకుంది.‘భాంగ్రా ఆన్ స్కేట్స్’ ‘యోగా ఆన్ స్కేట్స్’వంటివి సృష్టించి, భారతీయ సంస్కృతిని స్కేటింగ్‌తో మిళితం చేసింది. పదకొండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న జాన్వీ, మన దేశంలో అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించిన తొలి మహిళగా నిలిచింది. -
పేరు చెప్పలేను!
యూట్యూబ్ ఫ్రేమ్ నుంచి సినిమా ఫ్రేమ్ దాకా చేరిన నటి వైష్ణవి ప్రయాణం మాటల్లో సులభం, కాని మనసుల్లో మాత్రం అద్భుతం! ఆ మార్గంలో ఆమె చూసిన ఆనందాలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ ఆమె మాటల్లోనే, మీ కోసం!⇒ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన అమ్మాయిని నేను. చిన్నప్పటి నుంచే టీవీలో పాటలు వస్తే డ్యాన్స్ చేస్తూ, పుస్తకాలలో ఉన్న కథలను యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. అదే నన్ను యూట్యూబ్ వీడియోలు చేయించి, ఈరోజు సినిమాల దాకా తీసుకువచ్చాయి.⇒ నా కెరీర్ నిజంగా ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్‌తో మలుపు తిరిగింది. ఆ సిరీస్ నాకు నటిగా నమ్మకం ఇచ్చింది. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిన్న పాత్రలో కనిపించాను. అవకాశం చిన్నదైనా, ఆ సినిమాలో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘బేబీ’ సినిమా నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సినిమాకు వచ్చిన ప్రేమ, గుర్తింపు, అవార్డులు ఇవన్నీ నాకింకా కలలా అనిపిస్తాయి.⇒ ఇష్టమైన హీరో ఎవరని అడిగితే, ఏ పేరూ చెప్పలేను. కాని, కష్టపడి ఎదిగిన నటులంటే చాలా గౌరవం.⇒ నేను పాతబస్తీ గల్లీలలో పెరిగిన అమ్మాయి కాబట్టి, ఆ ప్రదేశం ఇప్పటికీ నాకు హాయిగా అనిపిస్తుంది. తినే విషయానికి వస్తే నేనొక ఫూడీ. మసాలా నాన్ అయితే చాలు, చికెన్ ఉంటే ఇంకా ఇష్టం. టైమ్ దొరికితే సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం నాకు రిలాక్సేషన్లా ఉంటుంది.⇒ అందం గురించి చెప్పాలంటే, నేను చాలా సింపుల్. ఉదయం నీటితోనే ముఖం కడుక్కుంటాను. తేలికపాటి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడతానంతే! ఇదే నా రొటీన్. జుట్టు విషయంలో మాత్రం గోట్ మిల్క్ షాంపూ, హెయిర్ ఆయిల్ వాడతాను.⇒ ఫ్యాషన్ ట్రెండ్లు ఎలా ఉన్నా, నాకు కంఫర్ట్ ఇచ్చే దుస్తులే వేసుకుంటాను. చీరలు, అనార్కలి, లెహెంగాలు వేసుకోవడం చాలా ఇష్టం.⇒ గాసిప్స్ విషయానికి వస్తే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నేను సింగిల్‌నే. రూమర్స్ వచ్చినా వాటికి స్పందించకుండా నేను నా పనిపైనే దృష్టి పెడతాను. ‘బేబీ’ తర్వాత నా రెమ్యునరేషన్ పెరిగిందని చెబుతారు, కాని, నిజంగా పెరిగింది ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, గౌరవం.⇒ ప్రస్తుతం ఒక ఎమోషనల్ స్టోరీ చేస్తున్నా. ఆ పాత్ర కూడా చాలా డీప్‌గా ఉంటుంది. ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కాని, ఇది నా కెరీర్లో మరో ప్రత్యేక పాత్రగా నిలవడం ఖాయం.⇒ నన్ను గుర్తు చేసుకునేప్పుడల్లా నేను చేసిన మంచి పాత్రలే ముందుగా కనిపించాలి. అందుకే, చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. -
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
హైదరాబాద్: ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. ప్రతిరోజూ కొంచెం సమయమైనా ధ్యానంలో గడిపే సులభమైన అభ్యాసం ద్వారా మనం మన ప్రశాంతత స్థాయిలను, శారీరక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోగలుగుతాం.పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన "ఒక యోగి ఆత్మకథ" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత అయిన పరమహంస యోగానంద, మానవులందరికీ ధ్యానం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని నొక్కి చెప్పారు. క్రియాయోగం లాంటి శాస్త్రీయ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల - ఉన్నత ఆత్మతో అనుసంధానం చెందుతాం. క్రియా యోగం ఒక సమగ్రమైన, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానసిక శాంతిని పొందడం వైపు అభివృద్ధి సాధిస్తాడు. అంతే కాకుండా, క్రియాయోగ ధ్యాన పద్ధతి, దాని అనుబంధ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మకు ఎంతో అవసరమైన పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.'యోగ' అనే పదం వాస్తవానికి భగవంతునితో ఐక్యాన్ని సూచిస్తుంది. యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. పరమహంస యోగానంద ద్వారా 1917లో స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) , ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తుంది. ఈ బోధనలు ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గంగా క్రమం తప్పకుండా చేసే గాఢమైన ధ్యానానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.'ఒక యోగి ఆత్మకథ'లో, పరమహంస యోగానంద క్రియాయోగ ధ్యాన విజ్ఞానం అన్ని ఇతర ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల కంటే ఉన్నతమైనదని, భక్తితో కూడినప్పుడు, అది అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలం అవుతుందని పేర్కొన్నారు! ధ్యానాన్ని తమ దైనందిన దినచర్యలలో చేర్చుకోవడంలో వాయిదా వేసేవారు వివిధ రకాల వృత్తినిపుణులు తీవ్రంగా పొరపాటుపడ్డారు. తీరిక లేని జీవితానికి, అనివార్యంగా దానితో పాటు వచ్చే ఒత్తిడులను మెరుగ్గా ఎదుర్కోవడానికి ధ్యాన సాధన మరింత అవసరం.హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈఓలు వారి వృత్తి జీవితంలో కూడా స్పష్టంగా మరింత విజయవంతంగా ఉంటారని వెల్లడించింది. ఆధునిక మనస్తత్వ సంపూర్ణ ఆరోగ్య నిపుణులు కూడా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ధ్యానాన్ని ఒక అద్భుతమైన మార్గంగా ప్రతిపాదిస్తారు.ఇప్పటికే నిరంతర ఆధ్యాత్మిక సాధనను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న వారికి, వారు గాఢంగా ధ్యానం చేయడానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత మంచిది. సంవత్సరాల తరబడి చేసే ధ్యానం ప్రతి మానవుడిని మరింత ఉల్లాసంగా, సమతుల్యంగా, సమర్థవంతంగా. శారీరకంగా కూడా ఆరోగ్యంగా మారుస్తుంది, ఇది నిశ్చయం.పరమహంస యోగానంద గుర్తుండి పోయేలా ఇలా అన్నారు, "ఇది వేచి ఉండగలదు, అది వేచి ఉండగలదు, కానీ భగవంతుని కోసం మీ అన్వేషణ ఆగకూడదు!" ఆ అన్వేషణను వేగవంతం చేసే మార్గం ధ్యానమే!పరమహంస యోగానందకు గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి చెందిన వారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా ధ్యానం గురించి చెప్పారు: "మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది" ఈ జీవితంలో శాశ్వత శాంతిని, ఆనందాన్ని మనం కనుగొనాలంటే ధ్యానం ఒక ఐచ్ఛిక కార్యం కాదని, అది మన జీవితాలలో తప్పనిసరి చర్య అని ప్రపంచ ధ్యాన దినోత్సవం మనందరికీ గుర్తుచేసే విధంగా ఉండాలి. మరింత సమాచారం కోసం: yssofindia.org చూడొచ్చు. -
లైట్ వెయిట్... రిచ్ లుక్
ఏ సీజన్ అయినా ఏ వేడుకైనా చాలా సులువుగా ఎంపిక చేసుకునే జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో ఉంది క్రేప్. సంప్రదాయ పెళ్లి వేడుకలోనూ ఆధునిక కాక్టెయిల్ పార్టీలోనూ ప్రత్యేకంగా వెలిగిపోయే క్రేప్ విత్ డిజిటల్ ప్రింట్స్ చేస్తున్న హంగామా గురించి హైదరాబాద్‌లో ఉంటున్న డిజైనర్ అభిజ్ఞ చెబుతున్న విశేషాలు ఇవి..ఇప్పుడు చాలావరకు ఐదు రోజుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి మెహందీ, హల్దీ, రిసెప్షన్స్‌కి.. పువ్వుల ప్రింట్లున్న చీరలు, లెహంగాలు ధరించడం చూస్తున్నాం. అలాగే కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి చేసుకున్న పార్టీలు, బయట జరిగే కాక్టెయిల్స్కు ఫ్లోరల్స్ కనువిందు చేస్తున్నాయి. డ్రెస్ ఆధునికమైనా, సంప్రదాయం అయినా కట్, డ్రేప్‌లో చిన్న చిన్న మార్పులు తీసుకు వస్తున్నారు. ఇదంతా క్రేప్, జార్జెట్ పైన ఫ్లోరల్స్ చేసే సందడి వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పచ్చు.డిజిటల్ ప్రింటింగ్ త్రీ డీ డిజైన్స్ ఎక్కువ శాతం ఫ్లోరల్స్ ఉంటాయి. కొన్ని ప్రయోగాత్మకంగా ఫ్రూట్ డిజైన్స్ చేశాం. ఫ్యాబ్రిక్ మేనికి మృదువుగా ఉంటుంది. ఇరవై ఏళ్ల వారినీ సీతాకోక చిలుకల్లా చూపితే, యాభై ఏళ్ల వారినీ హుందాగా చూపుతున్నాయి. సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక డిజిటల్ కళ ఈ ఇయర్ బాగా నడిచింది. పెద్ద పెద్ద పువ్వులు, జామెట్రి నమూనాలు, తేలికగా ఉండే ఫ్యాబ్రిక్‌పైన అన్ని రకాల డిజైన్లు అందంగా కనువిందు చేస్తున్నాయి.లేత రంగుల ట్రెండ్ఈ ఏడాది లేత, ప్లెయిన్ కలర్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ఇలా ప్లెయిన్‌గా ఉండే ఫ్యాబ్రిక్ పైన పెద్ద పూల నుండి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వరకు చూపు తిప్పుకోనివ్వని ఆర్ట్ వీటి సొంతం. మరిన్ని హంగుల కోసం డిజిటల్ డిజైన్స్‌ను అనుసరిస్తూ ఎంబ్రాయిడరీ లేదా స్వీక్వెన్స్ వర్క్‌తో ఇంకాస్త బ్రైట్‌గా డిజైన్ చేస్తున్నాం. ఈ డిజైన్లు సెమీ క్రేప్, మైసూర్ సిల్క్పైనా అందంగా అమరుతున్నాయి. ప్రత్యేకమైన డిజైన్లు ఆర్డర్ల మీద చేస్తాం కాబట్టి, ఏ ఎంపిక అది స్టేట్మెంట్ పీస్‌గా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా ప్రత్యేకత చాటుతుంది.డిజైన్‌కే ప్రాముఖ్యంసాధారణంగా స్కిన్ టోన్ బట్టి ఫ్యాబ్రిక్ రంగుల ఎంపిక చేసుకునేవారు గతంలో. నేడు డిజైన్‌కే ప్రాముఖ్యం పెరిగింది. లేత రంగులు ఉండటం వల్ల ఏ స్కిన్‌టోన్ కైనా ఇవి బాగా నప్పుతున్నాయి. ఫ్యాబ్రిక్ మృదువుగా, తేలికగా ఉండటం, రిచ్ లుక్ ని ఇవ్వడం ఈ క్రేప్ శారీ ఎంపికలో ప్రధానమైనవి. గ్రాండ్‌గా జరిగే వివాహ వేడుకలు, పండగలు, కాక్టెయిల్ పార్టీలకూ నప్పడంతో వీటి ఎంపికలో మరో ఆప్షన్‌కు వెళ్లడం లేదు.ఇరవై నుంచి 30 ఏళ్ల లోపు అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్‌లో వెస్ట్రన్ స్టైల్ వి–నెక్స్, స్లీవ్‌లెస్.. వంటివి కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఏజ్ గ్రూప్ హై నెక్స్ ఎంపిక చేసుకుంటున్నారు. చూడండి: ఎరుపు చీర, ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీఫ్యాబ్రిక్ నాణ్యత, డిజైన్‌లో ప్రత్యేకతను అనుసరించి వీటి ధరలు ఉంటున్నాయి. ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీస్ లేదా డ్రెస్సులకు ఆభరణాల అవసరం అంతగా పడదు. సన్నటి చైన్లు లేదా ముత్యాలు లేదా బీడ్స్ నెక్‌పీస్‌లు బాగుంటున్నాయి. కేశాలంకరణలో ఎక్కువగా లూజ్ హెయిర్, ఫిష్‌టెయిల్, బన్స్.. కూడా సెట్ అవుతాయి. చిన్న పాటి కేశాలంకరణతోనూ ఈ ఫ్లోరల్ శారీస్‌కి మరింత అందాన్ని తీసుకురావచ్చు.- అభిజ్ఞ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
కోట్ల సంపద ఉన్నా దక్కని ‘మనశ్శాంతి’ యోగం
ఈ రోజుల్లో మహా సంపద...మనశ్శాంతి. ‘కోట్ల సంపద ఉంది. మనశ్శాంతి లేదు’ అనేవారు ఉన్నారు. ‘చిల్లిగవ్వ లేదు...ఎంతో మనశ్శాంతి ఉంది’ అనేవారు ఉన్నారు. మనశ్శాంతి అనేది డబ్బు, హోదాతో కొలవలేనిది. అరుదైన మనశ్శాంతి సొంతం చేసుకోవడానికి దగ్గరికి దారి...ధ్యానం....ఈ సంవత్సరానికి సంబంధించి ఉత్తేజకరమైన ధ్యాన ధోరణులలో ఒకటి....మెడిటేషన్ అప్లికేషన్లలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడం. ఈ అధునాతన యాప్‌లు వ్యక్తి గతీకరించిన ధ్యాన అనుభవాలను అందిస్తున్నాయి. మానసిక ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన ధ్యాన అభ్యాసాలను కనుగొనడాన్ని సులభతరం చేశాయి. ఆధునిక ధ్యానపద్ధతులలో వర్చువల్ రియాలిటీ(వీఆర్) కీలకపాత్ర పోషిస్తోంది. బయోమెట్రిక్ సెన్సర్లకు సంబంధించి వేరబుల్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా మారింది. ధ్యాన సమయంలో ఒత్తిడి స్థాయిలు, హార్ట్ రేట్‌ను పర్యవేక్షించడంలో ఈ సాంకేతికత అభ్యాసకులకు ఉపయోగ పడుతుంది.ధ్యానానికి ఉపకరించే సాంకేతికత వల్ల అభ్యాసకుల సంఖ్య పెరుగుతోంది. ధ్యానప్రక్రియను సులభతరం చేస్తోంది. సమూహ ధ్యానాలు పెరగడం అనేది సంవత్సరం ట్రెండ్లలో ఒకటి. సామూహిక ధ్యానాల వల్ల ధ్యాననప్రక్రియ మరింత ఆనందకరంగా, ప్రయోజనకరంగా మారుతుంది అంటారు విశ్లేషకులు. మెడిటేషన్ యాప్స్ వర్చువల్ గ్రూప్ సెషన్లకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాధకులను ధ్యానం అనే దారంతో ఒక దగ్గర చేరుస్తున్నాయి. తమ ధ్యాన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ గ్రూప్ సెషన్లు ఉపయోగపడుతున్నాయి. లేటెస్ట్ మెడిటేషన్ ట్రెండ్స్‌లో ఒకటి...పర్సనలైజ్డ్ మెడిటేషన్. వ్యక్తిగత అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన ధ్యాన అభ్యాసాలే.. పర్సనలైజ్డ్ మెడిటేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన యాప్‌లు అభ్యాసకుల మానసిక స్థితి, శారీరక ప్రతిస్పందనల ఆధారంగా ధ్యానప్రక్రియకు రూపకల్పన చేస్తున్నాయి.స్వీయ సంరక్షణ, మానసిక ఆరోగ్యాన్ని నొక్కి చెప్పే సాంస్కృతిక ఉద్యమాలు సాంకేతికతను, సంప్రదాయ ధ్యాన అభ్యాసాలతో అనుసంధానిస్తున్నాయి. గైడెడ్ సెషన్లను అందించే మొబైల్ యాప్‌లు పెరుగు తున్నాయి. ఇదీ చదవండి: టీవీ డిబేట్లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో -
ఇమ్యూనిటీ ఫుడ్ అంటే ఇదే!
మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం.బీ 12 ఫుడ్..: పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది.బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. క్యారెట్, బీట్రూట్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.క్యారట్: దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయిన సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందదారని తేలింది. క్యారెట్‌ని నేరుగా లేదా సలాడ్ రూపంలో... ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.విటమిన్ కె ఫుడ్..: విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది.గుమ్మడికాయ : విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ్ర΄ోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగినట్లే. గోధుమగడ్డి ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: టీవీ డిబేట్లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో -
వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?
చాలామంది కాఫీ తాగడం అనేదాన్ని ఒక అనారోగ్యకరమైన అలవాటుగానే భావిస్తారు. అయితే కాఫీ సేవనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల్లో ఎక్కువ భాగం పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల వల్లనే లభిస్తాయని, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని రిజిస్టర్డ్ డైటీషియన్, ఫుడ్ ట్రైనర్స్ వ్యవస్థాపకురాలు లారెన్ స్లేటస్ అంటున్నారు.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవని, హిస్పానిక్ ఫుడ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు సిల్వియా క్లింగర్ సైతం చెబుతున్నారు. శరీరంలోని అనేక విభిన్న అవయవాలకు మద్దతు ఇస్తుంది. కాఫీ అందించే ప్రధాన ప్రయోజనాలు.. ఓ ఆంగ్ల మీడియా వేదికగా వీరు చెబుతున్న ప్రకారం...–కాఫీ (Coffee) స్వల్పకాలిక ఏకాగ్రతకు సహాయపడటం తో పాటు దీర్ఘకాలంలో ఇది న్యూరోప్రొటెక్టివ్‌గా కూడా ఉంటుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి సహా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు,డిప్రెషన్, పార్కిన్సన్స్ అల్జీమర్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. – కాఫీ తీసుకోవడం గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల కారణంతో మరణించే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.– కాలేయ వ్యాధి, ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటివి నివారిస్తుంది. అలాగే కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.–కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కాఫీ మితంగా.. ప్రయోజనాలు అమితంగా...ఈ ప్రయోజనాలు లభించాలంటే మితమైన కాఫీ తీసుకోవడం అవసరం. అంటే షుమారుగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. అయితే ఈ పరిమాణం అనేది వ్యక్తుల్ని బట్టి వారి శారీరక స్థాయిలను బట్టి మారవచ్చు.– ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి మూడు లేదా నాలుగు కప్పులు లేదా దాదాపు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ వరకూ ఓకే. దీని వల్ల హాని కంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఎక్కువ.– చాలా మంది విశ్వసించినట్టుగా కాఫీ డీహైడ్రేట్ చేయదు. కెఫీన్ తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉండి ఎక్కువగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. అయితే కాఫీలోని నీటి శాతం ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.–‘చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు తీపి పదార్థాలు లాగా కాకుండా కాఫీ, దానికదే సహజమైనది, కల్తీ లేనిది, అందువల్లే పలు ప్రయోజనాలను కలిగి ఉంది. అదనపు కొవ్వు, కేలరీలు చక్కెరను జోడించడం కాఫీని అధిక కేలరీల పానీయంగా మారుస్తాయి. తద్వారా బరువు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.ఓట్ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్ లేని పాలు అయితే ఓకే. దాల్చిన చెక్క, వనిల్లా లేదా బాదం సారం, తియ్యని కోకో పౌడర్, స్టెవియా, మాంక్‌ఫ్రూట్ తక్కువ మొత్తంలో తేనె లేదా మాపుల్ సిరప్ వంటి సహజ పదార్ధాలను మేళవించవచ్చు. తక్కువ ఆమ్లత్వం, తియ్యని రుచిని కలిగి ఉండే కోల్డ్ బ్రూ కాఫీని ప్రయత్నించవచ్చు. బ్లాక్ కాఫీని తాగడం దుర్లభంగా భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.కాఫీ తాగడానికి సరైన సమయం..?నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఉదయం పూట కాఫీ తాగడం ఉత్తమం. ‘కాఫీకి ఎక్కువ అర్ధ–జీవితకాలం ఉంటుంది, అంటే‘ఇది చాలా మంది అనుకున్నదానికంటే ఎక్కువ కాలం మన శరీర వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కాఫీని నిలిపివేయాలి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సమయం సహజ కార్టిసాల్ కదలికలకు అంతరాయం కలిగించకుండా శక్తిని పెంచడానికి అనువైనది.చదవండి: కమిట్మెంట్ అంటే అది!వ్యాయామం (Exercise) చేసే ముందు కూడా కాఫీ తాగొచ్చు. ఎందుకంటే ఇది పనితీరు ఓర్పును మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది కడుపులోని పొరలకు ఇబ్బంది కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఈ సమస్యలను నివారించడానికి కాఫీ తాగే ముందు గుడ్లు, అవకాడో టోస్ట్, తృణధాన్యాలు వంటి అల్పాహారం తినాలి. అలాగే భోజనానికి ముందు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరం ఇనుమును గ్రహించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది.(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం) -
క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?
పిల్లలూ! మీ స్కూల్ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్ రాజవంశపు గవర్నర్ వెన్ వెంగ్ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్వెంగ్ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్ జియాన్ జాంగ్ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.1661లో క్వింగ్ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్ స్కూల్’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్ స్కూల్‌గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్ స్కూల్‌గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్ 4 మిడిల్ స్కూల్‌గా మార్చారు. చైనాలోని టాప్ 100 హైస్కూల్స్‌లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు. -
నెల్లూరు చేపల పులుసు
కావలసినవి: చేప ముక్కలు (కొరమీను / వంజరం / బొచ్చ చేప) – అర కిలో; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి); టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 3–4 (నిలువుగా కట్చేసినవి); వెల్లుల్లి రెబ్బలు – 8–10 ( నిలువుగా కట్చేసినవి); అల్లం – చిన్న ముక్క; కరివేపాకు – 2 కొమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; చింతపండు రసం – కప్పు (పులుపు తగినంత); నూనె – 3 టేబుల్ స్పూన్లు; పులుసు మసాలా: కారం – 2 టీ స్పూన్లు; ధనియాలపోడి – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్రపోడి – పావు టీ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్.తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టాలి. మట్టిపాత్ర లేదా మందమైన వెడల్పాటి పాత్రలో నూనె వేసి, వేడి చేయాలి. అందులో మెంతులు వేసి, వేగాక ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాలపోడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేయాలి. కదపకూడదు. మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పులుసు నుంచి నూనె పైకి తేలినప్పుడు జీలకర్రపోడి, కొత్తిమీర వేసి మంట తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.దాల్ మఖనీసంప్రదాయ ఉత్తర భారతీయ వంటకం కావలసినవి: మినప్పప్పు – కప్పు; రాజ్మా – పావు కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది); టమాటా గుజ్జు – 2 కప్పులు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి); కారం∙– టీ స్పూన్; ధనియాలపోడి – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పాల మీగడ – పావు కప్పు; కొత్తిమీర – అలంకరణకు;తయారీ: పప్పులు రాత్రిపూట నానబెడితే ఉదయానికి ఉడికించడానికి రెడీగా ఉంటాయి. నానబెట్టిన పప్పులను కుకర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి పాన్ లో నూనె, టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి టమాటా గుజ్జు వేసి, నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాలపోడి, ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన మినప పప్పు, రాజ్మా పై మిశ్రమంలో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మెల్లగా మరిగించాలి. సన్నని మంటపై అరగంటసేపు ఉడికిస్తే రుచి మరింత బాగుంటుంది. చివరగా మిగిలిన వెన్న, మీగడ, గరం మసాలా వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆఫ్ చేయాలి. పై నుంచి మరికొద్దిగా పాల మీగడ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలిదాల్ మఖానీని నాన్, రోటీ, జీరా రైస్ లేదా కుల్చాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.మటన్ రోగన్ ఘోష్ఇది కాశ్మీర్‌కు చెందిన ప్రసిద్ధ వంటకం. ఘుమఘుమలాడే మసాలా, మృదువైన మటన్ ముక్కలు, ప్రత్యేకమైన రంగు, రుచి ఈ వంటకం ప్రత్యేకత. కావలసినవి: మటన్ – పావు కిలో; పెరుగు – కప్పు; ఉల్లి పాయలు – 2 (సన్నగా తరిగినవి); అల్లం – వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్లు; కారం – పావు టీ స్పూన్ ; ధనియాలపోడి – రెండు టీ స్పూన్లు; జీలకర్రపోడి – టీ స్పూన్; సోంపుపోడి – 1 టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; యాలకులు – 3; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ – 1; నూనె లేదా నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – అలంకరణకు.తయారీ: మటన్‌కు కొద్దిగా ఉప్పు, సగం అల్లం–వెల్లుల్లి పేస్ట్ రాసి, 30 నిమిషాలు ఉంచాలి. పాన్ లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె/నెయ్యి వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలిపి 5–7 నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కశ్మీరీ కారం, కారం, ధనియాలు, జీలకర్ర, సోంపుపోడులు, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బయట గిన్నెలో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మూత తీసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉంచి, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.రోటీ, నాన్ లేదా అన్నంతో ఈ మటన్ రోగన్ ఘోష్ ను వడ్డించాలి. -
లఘు చిత్ర వైభవం..
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. అన్సెసావో.. 30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు. జహాన్–ది లాస్ట్ గిఫ్ట్.. రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. -
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే. -
ఈ సంవత్సరాన్ని కాగితంపై పెట్టండి...
డిసెంబర్ వచ్చింది. అందరి భావనా కన్ను మూసి తెరిచేంతలో కొత్త సంవత్సరం వచ్చేసిందే అని. కాని డిసెంబర్ మాసం ‘ఎగ్జామ్ ఇవాల్యుయేటర్’ వంటిది. ఈ సంవత్సరం మొత్తం మీరు కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత, స్నేహ, బౌద్ధిక, కళారంగాలలో మీ సమయాన్ని ఎలా వెచ్చించారో, ఏ మేరకు ఎదిగారో బేరీజు వేస్తుంది. అందుకే కాగితం తీసుకుని హైలైట్స్ రాసుకోండి. వచ్చిన మార్కులను బట్టి కొత్త ఏడాదికి మరింత జాగ్రత్తగా సిద్ధం కండి.కాలం దగ్గర మేజిక్ ఉంటుంది. అది కొందరికి చిటికెలో అయిపోయిన భావన ఇస్తుంది. మరొకరికి ఎంతకూ గడవని మొండిఘటంలా తోస్తుంది. అంతా మానసికమే. మన చేతుల్లో ఉన్న సంగతే. ‘గర్వించ దగ్గ విషయం’ ఏమిటంటే గతంలో కొందరికి మెల్లగా, కొందరికి వేగంగా గడిచిన కాలం ఇప్పుడు అందరికీ ఒక్కలాగే పరుగు పరుగున సాగుతోంది. కారణం? అందరి చేతుల్లో ఫోన్లు ఉండటమే. అలా రీల్స్ చూస్తూ ఉంటే డిసెంబర్ రావడం ఏమిటి... దశాబ్దాలే గడిచిపోతాయి. నిజం. ఎన్ని డైవర్షన్స్ ఇవాళ మన జీవితంలో! ఎంత తీరుబడిలేనితనం – ‘పనికిమాలిన విషయాల ఆక్రమణ వల్ల! సమయమంతా వాటికి వెచ్చించడం వల్ల. అలా వెనక్కు తిరిగి చూడండి. ఈ సంవత్సరం నిర్మాణాత్మకంగా ఏమైనా చేయగలిగారా? సాధించగలిగారా? 2024 డిసెంబర్ చివరన తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కొన్ని అమలు చేయగలిగారా? అలా గాల్లో చూస్తూ మననం చేసుకుంటే లెక్క తేలదు. పేపర్ మీద పెట్టాలి. ఒక తెల్లకాగితం తీసుకుని మీ పేరు రాసి కింద ‘హైలైట్స్ 2025’ అని హెడ్డింగ్ పెట్టి ఒక్కో విభాగంలో ఏమైనా చేశారో చేయలేకపోయారో రాసుకోండి. అప్పుడు సంవత్సరం ఎలా గడిచిందో తెలుస్తుంది. తప్పులు ఒప్పులు తెలుస్తాయి. అప్రమత్తత కలుగుతుంది. కాలం విలువైనది. కాలానికి విలువనిచ్చినవారే విలువైన జీవితాలను నిర్మించుకుంటారు.కుటుంబం: కుటుంబానికి ఎంత సమయం ఇవ్వగలిగారో రాసుకోండి. కుటుంబ సభ్యుల సబబైన ఆకాంక్షలకు ఏమేరకు సపోర్ట్ చేయగలిగారు? అసలు వారి ఆకాంక్షలేమిటో విన్నారా? ప్రతి సభ్యుడికి సమానమైన విలువ, గౌరవం ఇచ్చి తద్వారా మీరు గౌరవం పొందారా? థ్యాంక్యూలు ఎక్కువా... లేదా సారీలా? కుటుంబ ఆరోగ్యం గురించి, హెల్త్ పాలసీల గురించి, పెద్దలకు చేయించాల్సిన టెస్ట్‌ల గురించి ఎంత సమయం ఇచ్చారు? వారు మీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? పేపర్ మీద రాసుకుంటూ ఉంటే మీరు మెరుగ్గానే వ్యవహరించినట్టుగా అనిపిస్తోందా?ఆర్థికం: గత సంవత్సరం సంపాదన కన్నా ఈ సంవత్సరం సంపాదన విషయంలో కొత్త ఆలోచనలు చేశారా? ఒక ఆదాయ మార్గంపై ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలకు ప్రయత్నించారా లేదా? ఈ సంవత్సరం పొదుపు ఎంత? పెట్టుబడి ఎంత? కనీసం కాసింత బంగారం అయినా కొని దాచగలిగారా? దుబారా జరిగితే ఎందుకు జరిగినట్టు? డబ్బు విషయంలో మార్చుకోవలసిన పద్ధతులు, బలహీనతలు మార్చుకున్నారా? ఆర్థికంగా జరిగిన తప్పులు ఏమిటి? నెక్ట్స్ ఏం చేయాలి?వ్యక్తిగతం: మిమ్మల్ని మీరు పట్టించుకున్నారా? వ్యాయామం, దృఢత్వం, చలాకీతనం వీటికై ఏం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య పరీక్షలు, ‘రిపేర్లు’ చేయించుకున్నారా? కంటి, పంటి వైద్యాలు... బరువు అదుపు... కేశ, చర్మ సంరక్షణ... సమతుల్య ఆహారం... తినకూడని ఆహారాన్ని మానేయడం... ఈ సంవత్సరం ఎన్ని లెక్కలేనితనాలు... ఇవన్నీ రాబోయే సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా ఉండాలంటే పేపర్ మీద మీరు వేసుకున్న మార్కులే హెచ్చరిక.స్నేహం: స్నేహితులను నిలబెట్టుకోవడమే కాదు టాక్సిక్ స్నేహాలను, మొహమాట పెట్టి మనల్ని ఎక్స్ ప్లాయిట్ చేసుకునే స్నేహాలను వదులుకోవడం కూడా ముఖ్యమే. ఈ సంవత్సరం మీ స్నేహవాతారణం ఎలా ఉంది. మంచి స్నేహితుల కోసం మీరు ఏం చేశారు? వారికి మీ స్నేహాన్ని, ప్రేమనూ పంచారా? చెడ్డ స్నేహితులు మిగిలి మంచి స్నేహితులు మీ నుంచి దూరమై ఉంటే మీ దోషాలు ఏమిటో చూసుకున్నారా? స్నేహం వల్లే కాలం సులువుగా కదులుతుంది. స్నేహంలో మీకు వచ్చిన మార్కులు ఎన్ని?మెదడుకు ఆహారం: మనిషి మెదడు ఒక సూపర్ కంప్యూటర్. దానికి జ్ఞానం ఇచ్చే కొద్దీ అది జీవనాన్ని సులభతరం చేస్తుంది. నేర్చుకుంటూ ఉన్నప్పుడే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మెదడుకు కొత్త విషయాలు ఏం చె΄్పారు? మంచి ఆలోచనాత్మక పుస్తకాలు, వ్యాసాలు, ప్రపంచ పరిణామాలు, ప్రకృతి విషయాలు ఏం తెలుసుకున్నారు? కొత్త ప్రాంతాలు ఏం చూశారు. పోనీ పిల్లల పుస్తకాల్లో ఉన్న కనీస విషయాలైనా మనం తెలుసుకున్నామా? సమాజం ఎటు పోతున్నదో తెలుసుకోకుండా మనం సరిగ్గా వెళ్లలేం. మేధో విషయాలను తెలుసుకోవడంలో మీకు వచ్చే మార్కులు ఎన్ని?కళారంగం: ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏం ఉంటుంది’ సినిమాలో డైలాగ్. సంగీతం, నాటకం, మంచి సినిమా, సాహిత్యం... ఈ సంవత్సరం వీటికి మీరిచ్చిన సమయం ఎంత? మంచి అనుభూతులను పొందింది ఎంత? 2025లో ఎన్నో ఉత్తమ పుస్తకాలు, పాటలు, సినిమాలు వచ్చాయి. వాటికి ఏ మేరకు సమయం ఇచ్చారు? మీ ఊళ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారా? మీ కంటూ ఒక అభిమాన రచయితో, నటుడో, గాయకుడో ఉన్నాడా? జీవితం వేరు, రసాత్మక జీవితం వేరు. కళలతో జీవితం, కాలం రసాత్మకం అవుతాయి. మరి మీకొచ్చిన మార్కులెన్ని?బేరీజు వేసుకోండి. కొత్త సంవత్సరానికి సిద్ధం కండి. -
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్లో ఏఐలో బగ్ ప్రాబ్లమ్’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్‌టాప్ తీసుకొని క్రిటికల్ బగ్‌ను పది నిమిషాల్లో సాల్వ్ చేసింది గౌరీ అగర్వాల్.‘ఎక్స్’లో ఆమె తమ్ముడు మెహుల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ బోలెడు లైక్‌లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్‌ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్ (Gauri Agarwal) సోదరుడు మెహుల్.అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు గౌరీ అగర్వాల్‌కు జై కొట్టారు.కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్ పెట్టారు.‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. చదవండి: 20 ఏళ్లకే రీసైకిలింగ్ కింగ్..!People romanticize startups but it is a lot of work.This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.Not a photo op, parents yelled at both of us.When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025 -
ఎవరీ రీసైకిల్ కింగ్ కరణ్? ఏకంగా 400 టన్నుల..
ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కరణ్ తన ‘ఫినోబాదీ’ స్టార్టప్ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశాడు. 3,318 మొక్కలను నాటాడు. డైబ్భై మందికి పైగా కార్మికులకు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కల్పిస్తున్నాడు...‘స్టెబిలిటీ–క్లారిటీ–డిగ్నిటీ’ నినాదంతో ‘ఫినోబాదీ’ అనే రీసైకిలింగ్ కంపెనీని ప్రారంభించాడు కరణ్ కుమార్. కరణ్ తండ్రి అయిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆస్తిపాస్తులు లేవు. కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించాడు. ‘నాన్నకు చదువు లేదు. ఆస్తి లేదు. అయినా సరే ఏదో రకంగా జీవనోపాధిని సృష్టించుకోగలిగాడు. ఇది చూసిన తరువాత శూన్యం నుంచి అవకాశాన్ని సృష్టించుకోవచ్చు’ అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటాడు కరణ్.ఎందుకు? ఏమిటి? ఎలా?రకరకాల గాడ్జెట్స్‌కు సంబంధించి ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆసక్తి కరణ్‌లో ఉండేది. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలనుకునేవాడు. చేతికి దొరికిన ప్రతి గ్యాడ్జెట్‌ను విడదీసి, తిరిగి వాటిని యథాతథ స్థితిలోకి తీసుకువచ్చేవాడు. ఇది సరదా కోసం చేసిన పని కాదు. వాటి అంతర్గత పనితీరు తెలుసుకోవడానికి చేసింది. ఏదైనా గ్యాడ్జెట్ పనిచేయకపోతే దాన్ని బాగు చేసి పనిచేసేలా చేసేవాడు. దీంతో ఇరుగు పొరుగు వారు రిపేర్ పని ఏదైనా ఉంటే కరణ్ దగ్గరికి వచ్చేవారు. పాకెట్ మనీకి కరణ్‌కు లోటు ఉండేది కాదు.నేర్చుకున్న తొలిపాఠంకోవిడ్ టైమ్‌లో తండ్రి వర్క్‌షాప్ మూతబడడంతో తమ్ముడితో కలిసి చిన్నపాటి ‘డోర్–టు–డోర్ మిల్క్ డెలివరీ సర్వీస్’ ప్రారంభించాడు కరణ్. అయితే దీంతో నష్టమే తప్ప లాభం రాలేదు. ‘వ్యాపారం అనేది సమస్యను పరిష్కరించేలా ఉండాలి. సమస్యను కొని తెచ్చుకునేలా ఉండకూడదు అనే పాఠాన్ని ఆ అనుభవం నుంచి నేర్చుకున్నాను’ అంటాడు కరణ్.ఇంటర్మీడియెట్ చేస్తున్నప్పుడు దిల్లీ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఉద్యమ్ శిక్ష’ అనే కార్యక్రమంలో చేరాడు కరణ్. నిజజీవిత సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులకు ఉపకరించే శిక్షణా కార్యక్రమం ఇది.‘ఉద్యమ్ శిక్షలో చేరిపోవడం నా జీవితాన్ని మార్చేసింది. నేను కొత్త వారితో మాట్లాడేవాడిని కాదు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడిని. అయితే ఉద్యమ్ శిక్ష నాలోని బెరుకును పోగొట్టింది. బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోమని చెప్పింది. ఈ క్రమంలోనే నాలో చిన్నగా ఆత్మవిశ్వాసం మొదలైంది’ అంటాడు కరణ్.ఫిన్ ప్లస్ కబాదీఢిల్లీలో చెత్తకుప్పల సమస్య తీవ్రంగా ఉండేది. చెత్తకుప్పలను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలయ్యేవి. ఇది చూసి షాక్ అయ్యాడు కరణ్. ఈ చెత్త కుప్పలను కాల్చడం ద్వారా విషవాయువులు విడుదలవుతాయి అనేది ఒక కోణం అయితే, మరో కోణం వాటిని పునర్వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోవడం. సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కబాదీవాలాస్(స్క్రాప్ డీలర్లు)తో మాట్లాడాడు కరణ్. వారి పని విధానం ఎలా ఉంటుందో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకున్నాడు. ‘విలువ లేని వస్తువులను విలువైన వస్తువులుగా మారుస్తాం’ అని వారు చెప్పిన మాట కరణ్‌ను ఆకట్టుకుంది. వారి మాటల స్ఫూర్తితో ‘ఫినోబాదీ’ పేరుతో రీసైక్లింగ్ కంపెనీ మొదలు పెట్టాడు కరణ్. ఫిన్ (ఫైనాన్స్), కబాదీ(స్క్రాప్) అనే రెండు మాటలు ఒక దగ్గర చేర్చి తన కంపెనీకి ‘ఫినోబాదీ’ అనే పేరు పెట్టాడు.ఆ మొక్కలు లక్ష్యాన్ని గుర్తు తెస్తాయిస్కూలు ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీలోని చంచల్ పార్క్‌లో పునర్వినియోగపరచదగిన వస్తువులను సేకరించడం మొదలుపెట్డాడు కరణ్. అయితే వారు పనికొస్తాయనుకున్న వస్తువులలో పనికిరాని వస్తువులే ఎక్కువ! ‘ఈ అనుభవంతో ప్లాస్టిక్, మెటల్, పేపర్‌కు సంబంధించి సూక్ష్మస్థాయిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏ వస్తువు పనికొస్తుంది, ఏది పనికి రాదు అనే విషయంలో స్పష్టత తెచ్చుకున్నాం’ అంటాడు కరణ్. ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ‘బిజినెస్ బ్లాస్టర్స్ ప్రోగ్రాం’ ద్వారా సీడ్ క్యాపిటల్ సంపాదించాడు.కంపెనీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. యాప్ తీసుకువచ్చాడు. గల్లీలో మొదలైన ‘ఫినాబాదీ’ ఢిల్లి అంతటా విస్తరించింది. నోయిడా, గురుగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. వంద కిలోల వ్యర్థాలను రీసైకిల్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటడం సంప్రదాయంగా చేసుకుంది ఫినోబాదీ. ‘మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ మొక్క గుర్తు తెస్తుంది’ అంటాడు కరణ్ కుమార్.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే..) -
అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..
ఈ పిల్లి రైలులో స్టేషన్‌మాస్టర్. ఔను మీరు వింటుంది నిజం. ఇదేంటి పిల్లి స్టేషన్‌మాస్టర్ అనుకోకండి. అది చక్కగా విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకోవడమే కాదు..ఏకంగా నష్లాల్లో ఉన్న రైల్వేని లాభాల బాట పట్టించిందట. అంతేకాదండోయే ఈ పిల్లి క్రేజ్‌కి నోటమాటరాదు. విధులు నిర్విర్తిస్తూ అనారోగ్యంతో చనిపోతే..దానికి వీడ్కోలు పలికేందుకు ఏ రేంజ్లో జనాలు వచ్చారో తెలిస్తే..కంగుతింటారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేద్దామా..!.ఇప్పుడు చెప్పుకోబేయే పిల్లి పేరు నిటామా. జపాన్‌లోని వాకాయామా కిషి స్టేషన్‌కు స్టేషన్‌మాస్టర్‌గా ఉండేది. వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే కోలో స్టేషన్ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉండేది. ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఆరోగ్య క్షీణించడంతో ఇటీవలే కన్నుమూసింది. 15 ఏళ్ల వయసులో మరణించింది.పిల్లి ఎలా విధులు నిర్వర్తిస్తుందంటే..వాకాయామా నగరంలో జన్మించిన ఈ పిల్లిని ఓ వర్షం కురిసిన రోజు కారు కింద నుంచి రైల్వే వారు రక్షించారట. అప్పటి నుంచి దీని బాగోగులు అన్ని ఆ రైల్వేనే చూసుకునేదట. అంతకుముందు ఈ రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేసిన టామా నుంచి నేరుగా శిక్షణ తీసుకుందట ఈ నిటామా. అంతేకాదండోయ్ టామా వారసురాలిగా దాని స్థానంలో రానున్న ఈ నిటామా పిల్లికి అత్యంత స్ట్రిట్‌గా ట్రైనింగ్ ఇచ్చేదట ఆ టామా పిల్లి. ఎవ్వరితోనైనా సౌమ్యంగా ఉడే ఆ టామా..నిటామా పిల్లి వద్దకు వచ్చేటప్పటికీ..సరిగా పని నేర్చుకోవాలని సీరియస్ ఉండేదట. అలా ఆ టామా తదనంతర స్టేషన్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తించిందట. అయితే ఈ కిషి స్టేషన్లో పనిచేయడాని కంటే ముందు అదే ట్రాక్‌లో ఇడాకిసో స్టేషన్లో స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసేదట. ఆర్థికంగా నష్టాల్లో ఉన్నఈ రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా వీటిని స్టేషన్ మాస్టార్లుగా నియమించిందట జపాన్ ఎలక్ట్రిక్ రైల్వే కో లిమిటెడ్. అంతేగాదు ఆ రైల్వేలో సెలబ్రిటీ మాదిరిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ నిటామా పిల్లి అంత్యక్రియలకు ఏకంగా 500మంది దాక హాజరయ్యారట కూడా. అంతేగాదు ఆ పిల్లిచివరి కార్యక్రమాలన్నింటిని ఆ వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కోజిమా చూసుకున్నారట. అయితే ఈ నిటామా ఎంతమేరకు ఈ రైల్వే మార్గానికి రైడర్‌షిప్ అందించిందనేది రహష్యంగా ఉన్నా..గతంలో టామా అనే పిల్లి మాత్రం ఏకంగా రూ. 82 కోట్లు పైనే ఆదాయాన్ని ఇవ్వడమే గాక ఏకంగా 17% రీడర్‌షిప్‌ని కూడా అందించిందట.(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?) -
అక్కడ క్రిస్మస్ రోజున..దెయ్యాన్ని కాల్చడం, భోగి మంటలు..
మనలో చాలా మందికి క్రిస్మస్ పండుగ వేడుక అనగానే క్రిస్మస్ చెట్టు లేదా శాంతా క్లాజ్ మాత్రమే కావచ్చు కానీ పలు దేశాల్లో ప్రజలకు మాత్రం ఇంకా చాలా చాలా గుర్తొస్తాయి. కొందరికి దెయ్యం దహనం గుర్తొస్తే మరికొందరికి వీధుల్లో భోగి తరహాలో వేసే మంటలు గుర్తోస్తాయి. ఈ అంతర్జాతీయ పండుగను ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారం ఇది..ఐస్లాండ్లో క్రిస్మస్ జానపద కథలు సంప్రదాయాలతో నిండి ఉంటుంది. ఇక్కడి శాంతా క్లజ్ లాగానే అనిపించే దుష్ట సోదరుల సమూహం అయిన యూల్ లాడ్స్ చిన్నారులను అలరిస్తారు. మొత్తం 13 రోజుల పాటు ప్రతి చిన్నారికి రాత్రి వేళల్లో చిన్న చిన్న బహుమతులు అందిస్తారు అది కూడా కిటికీల దగ్గర ఉంచిన బూట్లలో వాటిని పెట్టి వెళ్లిపోతారు. వారి రాక పండుగ సీజన్ అంతటా ఉత్సాహాన్ని సృష్టిస్తుంది.జపాన్‌లో క్రిస్మస్ ఉల్లాసంగా చాలా ఆధునికంగా ఉంటుంది. నగరాలన్నీ విద్యుత్ కాంతులతో మెరుస్తాయి క్రిస్మస్ ఈవ్‌ను ఒక రొమాంటిక్ అకేషన్‌గా భావిస్తారు. దాంతో జంటల సందడి కనిపిస్తుంది. అలాగేక్రిస్మస్ విందులో భాగంగా కెఎఫ్‌సిని ఆస్వాదించడం అనేది 1970లలో ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా కెఎఫ్సి బకెట్ల కోసం కుటుంబాలు ముందస్తుగా భారీ ఆర్డర్లు ఇస్తాయి. అలాగే క్రీమ్ స్ట్రాబెర్రీలతో అలంకరించిన క్లాసిక్ క్రిస్మస్ కేక్‌ను కూడా వీరు ఆస్వాదిస్తారు.ఇండోనేషియా దేశం ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ, అక్కడి క్రై స్తవ సమాజాలు ఈ పండుగను గొప్పగా వైభవంతో జరుపుకుంటాయి. ఆ దేశంలోని ఉత్తర సుమత్రాలో, బటాక్ జాతీయులు ఈ పండుగ సందర్భంగా మార్బిండా అనే సంప్రదాయాన్ని పాటిస్తారు దీనిలో భాగంగా జంతు బలి కూడా ఉంటుంది. బంధుత్వాన్ని గౌరవించడానికి విందును పంచుకుంటారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రమైన బాలిలో, పెంజోర్ బాంబూ పోల్స్‌తో వీధుల్ని అలంకరిస్తారు. కుటుంబాలు ఇంట్లో తయారుచేసిన వంటకాలను బహుమతిగా పంచుకునే న్గేజోట్ అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.గ్వాటెమాలాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా లా క్వెమా డెల్ డయాబ్లో పేరిట దెయ్యాన్ని దహనం చేయడం అనే విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. డిసెంబర్ 7న, కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దుష్టశక్తులను తరిమికొట్టడానికి అదృష్టాన్ని స్వాగతించడానికి పాత చెత్తతో పాటు దెయ్యం ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. వీధులు భోగి మంటల తరహాలో మంటలు, సంగీతం సమావేశాలతో వీధులన్నీ కళకళలాడతాయి. ఈ సీజన్ అర్ధరాత్రి వేడుకల్లో బాణసంచా కుటుంబ విందులతో కొనసాగుతుంది,గ్రీస్ పండుగ పడవ సంప్రదాయం గ్రీస్‌లో కరవాకి అని పిలిచే రంగురంగుల చెక్క పడవలు గ్రీస్ సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే పండుగ చిహ్నాలుగా వెలిగిపోతాయి. క్రిస్మస్ సందర్భంగా, పిల్లలు ఇంటి నుంచి ఇంటికి వెళ్లి కలంద అనే సాంప్రదాయ కరోల్లను పాడుతూ, త్రిభుజాలు లేదా డ్రమ్స్ వాయిస్తారు. ఇళ్ళు మెలోమకరోనా (సాంప్రదాయ గ్రీకు క్రిస్మస్ కుక్కీలు) వంటి తేనె బిస్కెట్ల సువాసనతో నిండిపోతాయి, కుటుంబాలు క్రిస్టోప్సోమో (క్రీస్తు రొట్టె)ను ప్రతీకాత్మక విందు గా కాలుస్తాయి(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?) -
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్‌గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం) -
డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ మెడిసిన్ సదస్సులో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..!
డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషన్ మెడిసిన్ సమ్మిట్‌లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025కి భారత్ వేదికగా మారింది. సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లేలా భారత్ నాయకత్వం వహించడంతో అశ్వగంధ ప్రధాన టాపిక్‌గా మారింది. అంతేగాదు 'అశ్వగంధ: ట్రెడిషనల్ విజ్డమ్ టు గ్లోబల్ ఇంపాక్ట్ - పెర్స్పెక్టివ్స్ ఫ్రమ్ లీడింగ్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్' అనే సెషన్‌ను ఆయుష్ మంత్రిత్వ సహకారంతో భారత్‌లో ఈ వేడుకను నిర్వహించింది. ఈ అశ్వగంధలో అడాప్టోజెనిక్, న్యూరోప్రొటెక్టివ్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న తరుణంలో శాస్త్రీయ సమకాలిన వైద్యం బలోపేతం చేసే దిశగా చర్చలపై దృష్టి సారించింది. యావత్తు ప్రపంచం క్లినికల్ మద్దతు ఇచ్చేలా దాని ప్రామాణికత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారత్. అందరూ వినియోగించేలా భద్రత, నాణ్యత, చికిత్స అనువర్తనాలను హైలెట్ చేసింది. అయితే మిస్సీసిపీ విద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఇఖ్లాస్ ఖాన్ అందరూ వినియోగించేలా చేయడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా దీనిపై శాస్త్రీయ పరిశోధనలకు పిలుపునివ్వడమే కాకుండా వినియోగించేలా చేయాలనే చర్చలకు వేదికైంది భారత్ అశ్వగంధతో కలిగే లాభలు..ఆధునిక కాలంలో అంటువ్యాధులులా మారిన ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది "ఆయుర్వేద మూలికల రాజు" అశ్వగంధ.నిద్రలేమిని నివారిస్తుంది. దీనిలో ప్రధాన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను నియంత్రించే సామర్థ్యం ఉందటకండరాల ద్రవ్యరాశి, బలాన్ని పెంచి శారీరక పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి మెరగవ్వుతుంది, మెదుడు ఆరోగ్యం బాగుంటుందిరోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిరక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుందిటెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచుతుంది, ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.ఉపయోగించే విధానం..కనీసం 60 రోజుల పాటు వినియోగిస్తే.. మంచి సత్ఫలితాలను పొందగలమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వెచ్చని పాలలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి పలితం ఉంటుందటదీన్ని ఆవునెయ్యిలో కలిపి మాత్రల మాదిరిగా కూడా తీసుకోవచ్చట. ఉయదం బ్రేక్ ఫాస్ట్ స్మూతీ లేదా ఓట్ మీల్‌కు ఈ పొడిని జోడించి తీసుకోవచ్చట.వాళ్లకి మాత్రం మంచిది కాదు..గర్భిణీ స్త్రీలు హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అశ్వగంధని వినియోగించపోవడమే మేలుథైరాయిడ్ రుగ్మతలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వాడటమే మంచిది. ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఉన్నవారు కూడా వైద్యుల సూచనలు మేరకు తీసుకోవడం మంచిది.గమనిక: ఇది కేవలం అవగాహన మన సంప్రదాయ వైద్య విధానం గొప్పతనం తెలియజేయడం గురించే ఇచ్చాం ఈ కథనం. ఈ మూలికను వినియోగించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణును సంప్రదించడం ఉత్తమం. చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే.. -
ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!
ధీరూభాయ్ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్‌లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్‌ని బట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ స్కూల్ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్ ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. స్టైలిష్‌గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్ లుక్ దటీజ్ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్‌ని ప్రజెంట్‌ని చేశారు నీతా. ఈ కార్యక్రమంలో ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ తదితరులు పాల్గొనన్నారు. బాస్రా ముత్యాల ప్రత్యేకత..హైదరాబాద్ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్‌లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. ప్రస్తుత ఇరాక్ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్‌గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి) -
ఆర్మీ లెఫ్టినెంట్‌గా ఆయమ్మ కొడుకు!..!
కొన్ని సక్సెస్‌లు సంవత్సరాల తరబడి నిరీక్షణ, అంకితభావం, ఓపికతో సాకారం అవుతాయి. అలాంటి కథలు ఎప్పటికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం.చిన్ననాటినుంచి కష్టాలు, తగినన్ని వనరుల కొరత ఇన్ని ఉన్నా..ఎలాగైన అద్భుతమైన విజయం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగి గెలుపు తీరాలకు చేరుకున్నవారని జగజ్జేతలు అనొచ్చు. కలను నిజం చేసుకోవడంలో మార్గదర్శకులు కూడా. అలాంటి ప్రేరణాత్మక సక్సెస్ స్టోరీ ఈ లెఫ్టినెంట్ హర్దీప్ గిల్. హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన హర్దీప్గిల్ చిన్ననాటి నుంచి ఆర్మీలో సేవ చేయాలనేది డ్రీమ్. బాల్యంలో స్కూల్లో మాస్టర్ల వల్ల మదిలో పురుడుపోసుకున్న డ్రీమ్ అతడితోపాటు పెరిగిందే కానీ కనుమరగవ్వలేదు. అయితే హర్దీప్ రెండేళ్ల వయసు నుంచి కన్నీళ్ల కష్టాల కడలిని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రిన పోగొట్టుకున్నాడు. కుటుంబ భారం అంతా అమ్మమీదే పడింది. ఆమె మధ్యాహ్నా భోజన పథకం వంటమనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేది. అలాగే కొంత ఆదాయం కోసం చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తుండేది అప్పడప్పుడూ. ఇంట్లో ఉన్నత చదువుకు తగినన్ని వనరులేమి లేవు. కానీ ఆ వాతావరణమే గిల్‌కి నిలకడను, క్రమశిక్షణ, బాధ్యతలను అలవర్చాయి. తనచుట్టూ ఇన్ని సవాళ్లు ఉన్న గిల్ తన ఆశయాన్ని కొనసాగించాడమే కాకుండా, ఎలాగైన ఆర్మీలో చేరి సేవ చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు. ఆనేపథ్యంలో తన గ్రామంలోనే పాఠశాల విద్య, ఇగ్నో ద్వారా బీఏ పూర్తి చేసి చదవు తోపాటు ఇతర రక్షన పరీక్షలకు సిద్ధమవ్వడం కొనసాగించాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గిల్ భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌గా ఎంపికయ్యాడు. అతని విజయం కుటుంబంలో కొండంత ఆశను నెప్పింది. శిక్షణా ప్రక్రియ పూర్తి అయ్యి సర్వీస్‌లో చేరతాడు అనగా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టి..మునుపటి నియమాకాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ తన ప్రస్థానం మొదట నుంచి మొదలుపెట్టాల్సి వచ్చినందుకు నిరాశ పడలేదు. ఈసారి ఏకంగా కమిషన్డ్ అధికారి అవ్వడమే లక్ష్యంగా ఎస్ఎస్సీ పరీక్షలపై ఫోకస్ పెట్టాడు. పదేపదే ఓటములు..గిల్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు అనేకసార్లు హాజరవ్వుతూనే ఉండేవాడు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉండేది. రాతపూర్వక పరీక్షలోనే విజయవంతమవ్వలేక నానా తిప్పలు పడ్డాడు. పాపం అది తన ఆత్మవిశ్వాసానికి, సహనానికి పరీక్షలా మారింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్నికొనసాగించాడు. చివరికి తొమ్మిదో ప్రయత్నంలో సక్సెస్ అందుకుని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్‌లో 54వ ర్యాంక్‌ను సాధించాడు.ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణగిల్ 2024లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. కఠినమైన శిక్షణా షెడ్యూల్ ఉండేది. ఆ దినచర్య చాలా సవాలుతో కూడినది. ముందుకుసాగడం అంత సులభం కాదు. కానీ అందుకు తగ్గట్టుగా తనను తాను రాటుదేల్చుకుని మరి నిలబడ్డాడు. అనుకున్నట్లుగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో లెఫ్టినెంట్ కమిషన్డ్ అధికారిగా నియమించబడ్డాడు. గిల్‌ని సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ 14వ బెటాలియన్‌కు అదికారిగా నియమించారు. ఇది క్రమశిక్షణ, కార్యచరణ సింసిద్ధతలకు పేరుగాంచిన యూనిట్. ఈ దృఢ సంక్పలం తన తల్లిన నుంచి వచ్చిందని చెబుతున్నాడు గిల్. ముఖ్యంగా ఎయిర్‌మ్యాన్ అవకాశాన్ని కోల్పోవడాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కొండంత ఆశతో మొదటి నుంచి మొదలుపెడుతే..తీరా పదేపదే పలకరించే వైఫల్యాలను అధిగమించి సక్సెస్ అందుకోవడం అనేది మాటల్లో చెప్పగలిగేంత సులభం కాదు అని అంటాడు గిల్. ఇది అలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీ కాదుకదూ..!(చదవండి: ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్ -
పుస్తకాలు ఎందుకు చదవాలి?
38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి)లో జరగనుంది. రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9వరకు ప్రవేశవేళలు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు చోటు చేసుకుంటాయి.‘పుస్తకం చదివితే వేయి జీవితాలు జీవించవచ్చు. చదవకుంటే ఒక్కటే’...అన్నాడో మహానుభావుడు. పుస్తకం చదవడమంటే మనకోమెదడు ఉందని గుర్తు చేసుకోవడం. పుస్తకం చదవడమంటే మనకో కుతూహలం ఉందని తెలుసుకోవడం. ఫో¯Œ ... మనకు అక్కర్లేని వినోదాలను ఇస్తోంది. పుస్తకం... కచ్చితమైన దిశను సూచిస్తుంది. దిశాబద్ధులై ఉండేందుకు బుక్‌ఫెయిర్ బాట పట్టండి.‘పుస్తకాలు అపరిచిత మిత్రులకు స్వాగత ద్వారాలు’.మనిషికి ఏం కావాలి? తనను తాను వ్యక్తపరుచుకోవడం కావాలి. అందుకే మాట్లాడాడు. పాడాడు. ఆడాడు. బొమ్మలు గీశాడు. రాశాడు. వాటి ద్వారా తనేమిటో చె΄్పాడు. ఇదే మనిషికి సాటి మనిషి ఎలా వ్యక్తమవుతాడో కూడా కావాలి. అతని జీవితం ఎలా ఉంది... ఆలోచనలు ఏమిటి... సమస్యలు ఏమిటి... వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.... అందుకే ఆట, పాట, బొమ్మ, కథల్లో సాటి మనిషి గురించి తెలుసుకోవడానికి ఉబలాట పడ్డాడు.ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు సజీవంగా ఉన్నంత కాలం మనిషి సజీవంగా ఉన్నట్టే లెక్క. లేకుంటే పాకుడు నీళ్లతో సమానం. అందుకే పుస్తకాలు చదవాలి. తనను తాను తెలుసుకునేందుకు, ఇతరుల గురించి తెలుసుకునేందుకూ. ఈ విశాల సృష్టిలో మనుషులంతా ఒక్కలాంటి వాళ్లే... రకరకాల పద్ధతుల్లో జీవిస్తూ ఒకేరకమైన ఉద్వేగాలను అనుభవిస్తుంటారని తెలుసుకుని... అందరి నుంచి ఉమ్మడి శక్తిని పొంది వ్యక్తిగత జీవితాన్ని ఒడ్డున చేర్చుకునేందుకు పుస్తకాలు చదవాలి.పెద్దబాలశిక్షతో మొదలుపుస్తకం ప్రాథమిక కర్తవ్యం జ్ఞానాన్ని ఇవ్వడమే. అందుకే పుస్తకం విద్యాసాధనం అయ్యింది. అయితే విద్యతో మనిషి ఆగడు. కడుపు నిండిన మనిషి కళ కోసం చూసినట్టే విద్య నేర్చిన మనిషి వికాసం వైపు చూశాడు. వికాసానికి పుస్తకం దారి చూపింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర... ఇవన్నీ పుస్తకంలో నిక్షిప్తమయ్యి తరం నుంచి తరానికి అందాయి. అయితే వికాసంతో కూడా మనిషి ఆగడు. వినోదం కావాలి, ఆహ్లాదం కావాలి, అనుభూతి కావాలి, ఉద్వేగం కావాలి, కల్పిత గాథలు... పుక్కిటి పురాణాలు కావాలి... ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలి... అవన్నీ పుస్తకమే ఇచ్చింది. పుస్తకం ఇచ్చేలా చేసుకున్నాడు. పుస్తకాలను నిచ్చెనమెట్లుగా చేసుకుని మనిషి దినదిన ప్రవర్థమానమయ్యాడు. అయితే పుస్తకాన్ని వదిలిపెట్టిన, నిర్లక్ష్యం చేసిన జాతి చీకటిలో ప్రయాణిస్తుంది. కొనసాగింపు ముఖ్యం. అందుకే యూరోపియన్ దేశాలలో పుస్తకాన్ని వదిలిపెట్టడం అనేది అక్కడివాళ్లు కల్లో కూడా ఊహించరు. మనవాళ్లు పుస్తకం విలువ కనిపెట్టారు కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం పెద బాలశిక్ష అయినా ఉండాలని తలిచారు. నేడు మన ఇళ్లల్లో పెద బాలశిక్షకు బదులు ఫోన్లు చేరాయి.జీవితాన్ని మార్చే పుస్తకాలుపుస్తకాలు జీవితాలను మార్చేస్తాయి. ఒక్క పుస్తకం చదివి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవాళ్లు, ఒక్క పుస్తకం చదివి జీవితాన్ని మార్చుకున్నవారు, ఒక్కపుస్తకం చదివి శాసనంగా మలుచుకున్నవారు ఉన్నారు. ‘విద్య లేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు గానీ ‘పుస్తకం చదవని వాడే వింత పశువు’ అనుకోక తప్పదు. ‘తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏం ఉంటుంది’ అన్నట్టుగా పుస్తకం చదవకపోతే వివేచన, వివేకం ఎలా జాగృతమవుతాయి? ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎలా తెలుస్తుంది? మనిషిగా పుట్టినందుకు మంచివైపు నిలబడాలన్న బాధ్యత ఎక్కడినుంచి వస్తుంది?పుస్తకం చిరంజీవిపుస్తకాన్ని చంపే మారణాయుధాలు ఎన్నో వచ్చాయి. సినిమాలు, టీవీలు, వీడియో కేసెట్లు, వీడియో గేమ్స్, ఓటీటీలు, రీల్సు... ఎన్నో. కాని పుస్తకం చిరంజీవిగానే ఉంది. పుస్తకం వేయి పుటలతో లక్ష కన్నులతో లోకాన్ని చూపుతుంది. సినిమా ఆ పని చేయదు. పుస్తకం ఒక గాథను వాస్తవ పరిథిలో చూపి కొంత ఊహకు వదిలిపెడుతుంది. అది వీడియో చేయదు. పుస్తకం ప్రశ్నను లేవనెత్తుతుంది. వెంటాడుతుంది. ప్రశ్న లేని మనిషి, ప్రశ్నించని మనిషి శిథిలమయ్యి మానసిక సంపద కోల్పోతాడు. అందుకే ‘మనీప్లాంట్ సరే. పుస్తకం ఉంచుకోవడం కూడా సంపదతో సమానమే’ అని గ్రహించాలి. మనుషులకు పండగ ఉన్నట్టు పుస్తకాలకు కూడా పండగ ఉంటుంది. ప్రతి సంవత్సరం ‘హైదరాబాద్ బుక్‌ఫెయిర్’లో పుస్తకాలన్నీ కూడబలుక్కుని ఒకచోటకు చేరుతాయి. వాటిని చూడటానికి వెళ్లాలి. చేతుల్లోకి తీసుకోవాలి. వాటితో స్నేహం చేయాలి. ఇంటికి పిల్చుకోవాలి. పుస్తకాలు ఇంటికి వచ్చాక దీపాలుగా మారడం మీరే గమనిస్తారు. ఆ కాంతులు ఇంటిని వెలిగించడం చూస్తారు. ఆ కాంతుల్లో వర్థిల్లడం ఎంతటి భాగ్యమో తప్పక తెలుసుకుంటారు.అందరికీ తల ఊపడం మానేలా చేస్తాయిపుస్తకాలు ఎందుకు చదవాలి? నా చిన్నప్పుడు నన్నెవరన్నా ఈ ప్రశ్న అడిగి ఉంటే ఆశ్చర్యపోయి ఉండేవాడిని. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్లనే నాకు లోకం తెలిసింది. ప్రపంచపు పోకడ తెలిసింది. మానవజాతి గతం గురించీ, వర్తమానం గురించీ తెలిసింది. మానవుడి భవిష్యత్తు ఎలా ఉండాలన్న దాని మీద కవులూ, రచయితలూ, తత్త్వవేత్తలూ శాస్త్రవేత్తలూ ఎటువంటి కలలుగన్నారో తెలిసింది. నేను పుట్టి పెరిగిన మారుమూల కొండ కింద పల్లెలో ఆ రోజుల్లో నాకు దొరికిన ఆ కొద్దిపాటి పుస్తకాలు ఆ రోజు దొరకకపోయి ఉంటే నా జీవితం గురించి నాకు ఎప్పటికీ అర్థమయ్యే దారి దొరికి ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని మాధ్యమాలు మన అరచేతుల్లోకి అందుబాటుకొచ్చాక పుస్తకాలు ఎందుకు చదవాలి అన్న ప్రశ్న తలెత్తుతున్నదేమో! ఇన్ని మాధ్యమాలున్నా, పుస్తకాలు చదవకపోతే మనం ఎప్పటికీ పక్కవాడి అభి్రపాయాలకే తలూపుతూ బతుకుతుంటాం. కాబట్టి ఈ మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత విశ్వసనీయమైన మాధ్యమం పుస్తకాలు మాత్రమే.– వాడ్రేవు చినవీరభద్రుడు,సుప్రసిద్ధ రచయితపుస్తకాలు అందరినీ మనవాళ్లను చేస్తాయిపుస్తకాలు అనేక మానవ జీవిత అనుభవాల సారాన్ని నింపుకున్న పాత్రలు. అమూల్యమైన జ్ఞానాన్ని పొందడానికి మన కళ్లను తెరిపించే వెలుతురు కిరణాలు. బలహీనులకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే టానిక్‌లు. ప్రపంచాన్నంతా మనకు పరిచయం చేస్తాయి. మన జీవితాలను అర్థం చేసుకోవడం ఎలాగో నేర్పుతాయి. పుస్తకాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, దయ, జాలి, కరుణ, ప్రేమ, సహోదర భావనలను మన హృదయాల్లో నింపుతాయి. వాట్సప్, యూట్యూబ్‌ల వంటివి మనల్ని మనం పరాయివారిగా చేస్తే పుస్తకాలు అందరినీ మనవాళ్ళుగా చేసుకోవటం నేర్పుతాయి. పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాదు. అసలైన వివేకం. పుస్తక స్పర్శ కోసం, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోవడం కోసం పుస్తక ప్రదర్శనలకు వెళ్ళాలి. మనం స్వయంగా ఎంచుకుని స్వంతం చేసుకొన్న పుస్తక పఠన అనుభూతికి సాటివచ్చేది లేదు. పుస్తకం కోసం తహతహలాడటమంత అందమైన అనుభూతి మరొకటి లేదు.– ఓల్గా, సుప్రసిద్ధ రచయిత్రి -
ఆధ్యాత్మిక ఆవాసం ధనుర్మాసం!
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసంధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.సుప్రభాతానికి బదులు తిరుప్పావై ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజపవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.చదవండి: నెలగంట కట్టడం అంటే.. ఎంటే తెలుసా?గోదా రంగనాథుల కల్యాణం గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం. -
శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం
శబరిమలలో అత్యధిక భక్తుల రద్దీ తర్వాత భారీ ఆదాయం వచ్చినట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు కేకే విజయకుమార్ పేర్కొన్నారు. ఇందులో 106 కోట్ల రూపాయలను అమ్మకానికి కేటాయించారు. గతేడాది ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం గణనీయంగా పెరిగింది. అలాగే భక్తులకు ముందుగా చెల్లించిన డిపాజిట్ మొత్తాన్నితిరిగే చెల్లించలేదనే ఫిర్యాదుకు ప్రతిస్పందనగా..అందుకోసం ప్రత్యేక కౌంటర్ తెరవనున్నట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. కౌంటర్ వద్ద రద్దీ కారణంగా చాలామంది ప్రజకలు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కౌంటర్ ఆఫీసు పనిచేస్తుందని,భక్తుల మొత్తాన్ని తిరిగి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి 500 గదులు ఉన్నాయన్నారు. సాఫ్టవేర్ కూడా మారనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో గది బుక్ చేసుకోవడానికి ముందస్తు డిపాజిట్లు చెల్లించన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని అన్నారు.ఆన్లైన్లో బుక్‌చేసిన మొత్తం తిరిగి ఖాతాలో జమ చేయబడుతుందని అన్నారు. యథావిధిగా నియంత్రణఒక వ్యక్తికి 20 టిన్లు ఇవ్వాలనే నిర్ణయం కొనసాగుతుందని రాష్ట్రపతి అన్నారు. ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్లు కల్పించడానికి ఇలాంటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదప్రజలకు అసౌకర్యం కలిగించదని అన్నారు. మండల పూజ తరువాత, ప్లాంట్ 27 న మూసివేసి అనంతరం మూడు రోజుల తర్వాత తెరుస్తానమని అన్నారు. ఈ ఏడాది దాదాపు 45 లక్షల అరవణ నిల్వల సేకరణతో తీర్థయాత్ర సీజన్ ప్రారంభమైంది. కానీ అవన్నీ అనూహ్యంగా అమ్ముడయ్యాయని అన్నారు. రోజుకు 3.5 లక్షల మేర టిన్లను విక్రయించాలని అనుకున్నా..సగటున్న నాలుగున్నర లక్షలు పైనే అమ్ముడయ్యాయని అన్నారు. ప్రస్తుతం. ఒక మిలియన్ కంటే ఎక్కువ టిన్లు నిల్వలు ఉన్నట్లు తెలిపారు.(చదవండి: శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి) -
ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలిమహిళా ఆఫీసర్! 93 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) నుంచి పాసైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల అమ్మాయి. ఆమె నియామకంతో 93 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు ఆమె నియామకంతో తెరపడింది. 1932లో అకాడమీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,000కు పైగా ఆఫీసర్ క్యాడెట్లు పాసయ్యారు. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి. ఈ ఘనతను ఎలా సాధించిందంటే..డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్లు పాసవుట్ పరేడ్ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. సాయి ముత్తాత బ్రిటిష్ సైన్యంలో, తాత భారత సైన్యంలో పనిచేశారు. నాన్న సందీప్ జాదవ్ ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో తరం సైనిక అధికారిగా ప్రయాణం మొదలుపెట్టింది సాయి జాదవ్. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది.మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాయి కర్నాటకాలో బెల్గాంతో సహా అనేక రాష్ట్రాలలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ తరువాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) పరీక్ష రాసి తన ప్రతిభతో అన్ని దశల స్క్రీనింగ్‌లలోనూ అర్హత సాధించింది. ఇండియన్ మిలిటరీ అకాడమీలో అందరూ పురుషులే కావడంతో అందులో శిక్షణ పొందిన వారిని ‘జెంటిల్మెన్ క్యాడెట్స్’ అని పిలిచేవారు. ఇప్పుడది ‘ఆఫీసర్ క్యాడెట్స్’గా మారనుంది.‘ఐఎంఎ’లో నిర్వహించిన వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి జాదవ్ యూనిఫామ్‌పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్ చేశారు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్‌గా ర్యాంకింగ్‌ను కేటాయించారు. చారిత్రక ఘనత సాధించిన సాయి గురించి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించి టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి మహిళగా సాయి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. జూన్ 2026లో డెహ్రాడూన్ ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’లో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్‌ను పూర్తిగా మహిళలతో కూడిన తొలి ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనుంది. ఇది చారిత్రక మలుపు అని చెప్పుకోవచ్చు.(చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..) -
ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..
ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్ లేదా రెస్టారెంట్) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..అమెరికాలో జరిగి అరుదైన సందర్భం. 78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ స్టాఫ్‌కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్ రాలేకపోతాడు. ఇంతలా సడెన్‌గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్‌లోని 45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్‌వర్త్ ఆరా తీశారు. దశాబ్దకాలంగా అతనికి సర్వీస్ అందిస్తున్న ఆ చెఫ్ వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్‌చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్‌ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్‌తో ఆ చెఫ్ డోనెల్ స్టాల్‌వర్త్ అతని డోర్ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్ నేలపై పడి ఉండటం చూసి షాక్ తింటాడు చెఫ్ డోనెల్. అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్‌కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్ డోనెల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్ తీసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్ పక్క అపార్ట్మెంట్లోకే షిఫ్ట్ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.అయితే చెఫ్ డోనెల్ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్ డోనెల్. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.) -
'ప్రశాంతతకు తాళం మన మనసులోనే'..!
ఒకప్పుడు సామాన్యులకు నిషిద్ధంగా భావించిన ధ్యానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ప్రపంచంలో అశాంతి మరింత పెరుగుతున్న ఈ కాలంలో ధ్యానసాధనను శాశ్వతంగా మన జీవితాలలో భాగంగా స్వీకరించాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించాలని, విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక గురువు మానవతావాది గురుదేవ్ విశంకర్ బుధవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భవనం నుంచి పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకేసారి ధ్యానం చేసి, ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన విషయం విదితమే. వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా, అలసట, ఒత్తిడి, సంఘర్షణలు, అనిశ్చితి, భావోద్వేగ వేదనలతో పోరాడుతున్న సమాజాలకు ధ్యానం ఎంత అవసరమో గురుదేవ్ తన ప్రసంగంలో వివరించారు.ప్రపంచ శాంతి కోసం ధ్యానంఈ సందర్భంగా భారతదేశ శాశ్వత ప్రతినిధి కార్యాలయం (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రపంచ శాంతి కోసం ప్రపంచం ధ్యానం చేస్తోంది’ అనే అంశంపై గురుదేవ్ ప్రసంగించారు. వయస్సు, ప్రాంతం అనే భేదం లేకుండా ఆందోళన, బర్నౌట్, ఒంటరితనం పెరుగుతున్న ఈ సమయంలో, సమస్యలకు బాహ్య పరిష్కారాలు కాకుండా, మానవ మనసును స్థిరపరిచి శాశ్వత పరిష్కారాన్ని అందించే దిశగా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.“ఈ రోజుల్లో ధ్యానం ప్రపంచానికి ఒక విలాసం కాదు,” అని గురుదేవ్ అన్నారు. “మన జనాభాలో మూడో వంతు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనల్ని మనతోనే కలిపే, మనలో దాగి ఉన్న ఒత్తిడిని తొలగించే ఒక సాధనం అవసరం. అప్పుడే ధ్యానానికి ప్రాముఖ్యత వస్తుంది.”ధ్యానం - మానసిక పరిపూర్ణతధ్యాన సందర్భంలో మానసిక పరిపూర్ణత (మైండ్ ఫుల్ నెస్) గురించి వివరిస్తూ గురుదేవ్ ఇలా అన్నారు: “మైండ్ ఫుల్ నెస్ మీ ఇంటికి వెళ్లే దారి లాంటిది, ధ్యానం మీ ఇల్లు. ధ్యానం మనల్ని మన అంతర్లీన లోకంలోకి తీసుకెళ్లి అవసరమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇది చేయడం కష్టమేమీ కాదు. స్థూలంగా చెప్పాలంటే ధ్యానం అనేది మనసు అనే కంప్యూటర్లో అనవసరంగా నిల్వ చేసిన ఫైళ్లన్నింటినీ ‘డిలీట్’ బటన్ నొక్కి ఖాళీ చేయటమే.”శక్తి, సమన్వయం: ధ్యానం“మనమంతా శక్తే,” అని గురుదేవ్ పేర్కొన్నారు. “ఈ శక్తి సమన్వయంతో ఉందా? మన పరిసరాలలో ఐక్యతను సృష్టిస్తున్నదా? అనే ప్రశ్నలకు ధ్యానంలోనే సమాధానం ఉంది. ధ్యానం మన చుట్టూ అవసరమైన సామరస్యాన్ని సృష్టిస్తుంది. మన వైబ్రేషన్లను శుద్ధి చేస్తుంది.”చరిత్ర సృష్టించిన ప్రపంచ ధ్యానంగత ఏడాది డిసెంబర్ 21న ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి ధ్యానం చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధ్యాన సమూహంగా నిలిచి, ఆరు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది.ఈ కార్యక్రమం ప్రత్యేకత కేవలం సంఖ్యల్లోనే కాకుండా, పాల్గొన్న వారి వైవిధ్యంలోనూ కనిపించింది — నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు, సామాజిక కేంద్రాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల అన్ని వర్గాల ప్రజలూ ఇందులో భాగమయ్యారు.భారత శాశ్వత ప్రతినిధి అభిప్రాయంజెనీవాలోని ఐక్యరాజ్యసమితి, సంబంధిత అంతర్జాతీయ సంస్థల భారతదేశ శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, “గతేడాది అంతర్జాతీయ సదస్సు నాటి గురుదేవుల జెనీవా సందర్శనను మేము ఆత్మీయంగా గుర్తుచేసుకుంటున్నాము. లోతైన సంఘర్షణలు, అవిశ్వాసంతో నిండిన ప్రపంచంలో, ధ్యానం కేవలం వ్యక్తిగత స్వీయాభివృద్ధి సాధన మాత్రమే కాదు అది సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విశ్వాసాన్ని పరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనం,” అని తెలిపారు.బాహ్య ఆడంబరాల నుంచి అంతరంగ కేంద్రానికి ప్రయాణం ఆధునిక కాలంలో పశ్చిమ దేశాలలో ధ్యానం ఒకవైపు కొత్త ఫ్యాషన్‌గా, విభిన్నంగా ప్రాచుర్యం పొందగా, మరోవైపు అది పాతకాలపు ఆధ్యాత్మిక సాధనంగా, ఈ కాలానికి సరిపడదని కూడా భావించారు. 1980ల ప్రారంభంలో, మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగే ఈ శాస్త్రానికి పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలోనే, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచానికి ధ్యానాన్ని మరలా పరిచయం చేసే బృహత్తర ప్రయాణాన్ని ప్రారంభించారు.విద్య, సంఘర్షణల పరిష్కారం, రైతు సంక్షేమం, జైలు ఖైదీల పునరావాసం, యువ నాయకత్వం, కార్పొరేట్ రంగంలో ఒత్తిడి నిర్వహణ, సమాజ పునర్నిర్మాణం వంటి అనేక రంగాల్లో ధ్యానం ఆయన సేవలకు కేంద్రబిందువుగా మారి, 182కు పైగా దేశాలలో కోట్లాది మందిని చేరుకుంది.బుధవారంనాటి తన ప్రసంగంలో గురుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన సభ తీర్మానాన్ని ఆమోదించిన 192 దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత సాధన ఇంత విస్తృతమైన సాంస్కృతిక, శాస్త్రీయ, సంస్థాగత గుర్తింపును పొందడం అరుదైన విషయం. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.ముందుకు సాగుతున్న ప్రపంచ ఉద్యమంఈ విశ్వవ్యాప్త స్ఫూర్తిని కొనసాగిస్తూ.. గురుదేవ్ డిసెంబర్ 19న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి కీలక ప్రసంగం చేయనున్నారు. భిన్న ధృవాలుగా విడిపోతూ, విభిన్న అభిప్రాయాల సంఘర్షణకు లోనవుతున్న నేటి ప్రపంచంలో మానసిక ధైర్యం, పరస్పర చర్చలను, శాంతిని పెంపొందించడంలో ధ్యానం మరింత కీలకపాత్ర పోషించనుందిఈ ఏడాది డిసెంబర్ 21న, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ప్రతిష్టాత్మక ‘ఒక్యులస్’ నుంచి రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గురుదేవ్ నేతృత్వంలో కోట్లాది మంది ధ్యానం చేయనున్నారు.నిరంతర ప్రయాణంగా సాగే ఈ ప్రపంచంలో, ఒక క్షణకాలపు నిశ్శబ్దం, సరిహద్దులను దాటి సామరస్యాన్ని వ్యాపింపజేసే ఒక శ్వాస.. అదే ధ్యానం. వేగంగా మారిపోతున్న అనిశ్చితమైన కాలంలో సైతం, మన ప్రశాంతతకు తాళం మన మనసులోనే ఉందని గుర్తుచేసే సున్నితమైన సందేశంగా ఈ కార్యక్రమం నిలవనుంది.(చదవండి: కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!) -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు) -
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్‌లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్‌గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్‌గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్‌లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్‌గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా) -
ఒట్టు... ఇలాంటి పెళ్లి చూసి ఉండరు!
‘ఇది పెళ్లి వేడుకా? పాన్ ఇండియా సినిమానా?’ అని ఆశ్చర్యపోయారు అతిథులు. వేడుకలో అడుగడుగునా సినిమాటిక్ ట్రిక్స్‌ను ఉపయోగించడమే దీనికి కారణం. వేదికపై రైలు పట్టాలు కనిపిస్తాయి. అయితే ఆ పట్టాల మీది నుంచి రైలు కాదు... అటు నుంచి హంసతూలికా వాహనంలో వధువు, ఆమెకు ఎదురుగా మరో హంసతూలికా వాహనంలో వరుడు వస్తుంటాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో అలనాటి ‘మహాభారత్’ టీవీ సీరియల్లోని పాటలు వినిపిస్తుంటాయి. వధూవరుల చేతిలో స్పార్క్–షూటింగ్ గన్స్ ఉంటాయి. ఇద్దరూ ఒకే చోటుకి రాగానే పూల వెలుగు వాన కురుస్తుంది. బాణసంచా పేలుతుంది.ఒక్కటా రెండా... ఈ పెళ్లి వేడుకలో ఎన్నో వింతలు.‘ఎంత గొప్ప క్రియేటివిటో... ఆహా!’ అని ఆకాశానికెత్తారు కొందరు. చాలామంది మాత్రం... ‘ఎవరి పిచ్చి వారికి ఆడంబరం’ అన్నట్లుగా కామెంట్స్ పెట్టారు. అయినప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. రాబోయే కాలంలో ఇదొక ట్రెండ్‌గా కూడా మారవచ్చు! View this post on Instagram A post shared by युक्ति (@lil_dicey_ybz) -
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్‌ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్‌తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!) -
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా శోభితా ధూళిపాళ..!
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్‌లు లెహంగాకి గ్రాండ్ లుక్‌ని తెప్పించాయి. నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్‌కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్‌గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్‌తో కూడిన ఎంబాలిష్మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది. ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్మెంట్రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్‌ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్‌గ్రీన్‌గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) (చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..) -
గ్రహాంతర వాసులున్నారా?
అల్లాహ్ నిదర్శనాలలో భూమి ఆకాశాల సృష్టి కూడా ఒకటి. ఆ రెండింటి లోనూ జీవరాశులను వ్యాపింపజేసి ఉంచాడు. తాను తలుచుకున్నప్పుడు వాటిని పరలోకంలో ఒక చోట సమీకరించగలడు. ఖుర్ఆన్ భావామృతం: 42:28–29 వివరణ: ఈ సూక్తిని బట్టి జీవరాసులలో మన భూమి పైననే గాక ఇతర గ్రహాలలో కూడా జీవరాసులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ దేవుడే ఏడు ఆకాశాలు సృష్టించాడు. అలాంటివే భూమిని పోలిన వాటిని కూడా సృష్టించాడు. వాటిపై కూడా ఆయన ఆజ్ఞలు అవతరిస్తూ ఉంటాయి. దేవుడు ప్రతిదానిపై అదుపు ,అధికారం గల సమర్థుడు. సర్వశక్తిమంతుడని ఆయన జ్ఞానం ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని పరివేష్టించి ఉందని మీరు తెలుసుకోవడానికే ఈ సంగతి తెలియజేయబడుతోంది. (ఖుర్ఆన్ భావామృతం:65:12) వివరణ: ఇలాంటివే మీ భూమిని పోలిన వాటిని కూడా సష్టించాడు అంటే ఏడు ఆకాశాల్లో ఏడు భూములు మాత్రమే సష్టించాడని కాదు. ఇది అర బి భాషలో పెద్ద సంఖ్యను కూడా సూచిస్తుంది. భూమిని పోలిన వాటిని అంటే బుద్ధి జీవులు గల మన భూమిని పోలిన భూములు అని అర్థం. దీన్నిబట్టి మన విశ్వంలో మనలాంటి బుద్ధి జీవులు ఉండే అనేక గ్రహాలు ఉన్నాయని తెలుస్తోంది. హజ్రత్ ఇబ్నెఅబ్బాస్ రజి ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: వాటిలోని ప్రతి భూమండలంలో ముహమ్మద్ ప్రవక్తను పోలిన ప్రవక్తలు ఉన్నారు; ఆదం అలైను పోలిన ఆదంలు ఉన్నారు; నూహ్ అలైను పోలిన నూహ్ లు ఉన్నారు. ఇబ్రాహీం అలైను పోలిన ఇబ్రాహీంలు ఉన్నారు; ఈసా అలై ను పోలిన ఈసాలు ఉన్నారు. క్వాంటం సిద్ధాంతం ఆధారంగా హ్యూగ్ ఎవరెట్ ప్రతిపాదించిన మల్టీ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మన భూమండలానికి ఇక్కడున్న సృష్టి రాశులకు నకళ్లు ఉంటాయట! ఎకానమమిస్ట్ (లండన్) అనే పత్రిక 26–7–1969 సంచిక ప్రకారం అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్ సంస్థ ఇతర గ్రహాలలో బుద్ధి జీవుల ఉనికిని గురించి పరిశోధన జరిపింది. దాని ప్రకారం మన పాలపుంతలో మన భూమి వాతావరణాన్ని పోలిన అరవై కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో జీవరాసులు ఉండవచ్చని కూడా ఈ పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ యథార్థాన్ని 1400 సంవత్సరాల క్రితమే ముస్లిం పండితులు తెలియజేశారు.(ఖుర్ ఆన్ భావామృతం 65:12). – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..
భారత్‌లో అంతగా ఫ్యాషన్ , అందాల పోటీలకు ప్రాచుర్యం లేని సమయంలో ముంబైకి చెందిన మెహర్ కాస్టెలినో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఈ ఘనత సాధించిన తొలిభారతీయ మహిళ నిలిచింది. ఆడవాళ్లు ధైర్యంగా తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా దూసుకుపోవచ్చు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె. ఈ రోజు ఇంతలా అందాల పోటీలకు క్రేజ్ వచ్చిందంటే అందుకు కాస్టలినోనే కారణమని చెప్పొచ్చు. అలాంటి శక్తిమంతమైన మహిళ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డిసెంబర్17న(బుధవారం) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కోడలు నిషా, మనవరాలు క్రిస్టినా ఉన్నారు. ఫ్యాషన్ ప్రపచంలో భారతీయ మహిళలకు మార్గదర్శకురాలిగా ఉన్నా ఆమె ప్రస్థానం, సాధించిన విజయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.భారత్‌కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో(Meher Castelino). 1964లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. దీని తర్వాత కూడా ఈమె మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. తొలి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్‌గా, ఆమె విజయం భారత అందాల పోటీల చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. కాస్టెలినోని నిశ్శబ్ద బలానికి చిహ్నంగా అభివర్ణిస్తూ, భారతదేశంలో ప్రారంభ ఫ్యాషన్, అందాల పోటీల దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడిన మార్గదర్శకురాలిగా ఫ్యాషన్ ప్రపంచం ఆమెను సదా కీర్తిస్తుంది.తొలితరం ఫ్యాషన్ జర్నలిస్టు కూడా..!మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్‌స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు. సింపుల్‌గా చెప్పాలంటే..భారత్‌లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్‌గా పేర్కొనవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్‌గా పనిచేశారు. ఫ్యాషన్‌ను కేవలం సెలబ్రిటీల గ్లామర్‌గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు. భారతదేశంలో ఫ్యాషన్ రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక మహిళగా ప్రభంజనం సృష్టించి చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిగా నిలిచారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
పెళ్లైన లెక్చరర్ మాయలో 19 ఏళ్ల కూతురు..!
మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది. అక్కడ తను చదువుకునే కాలేజీ లెక్చరర్‌తో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉందని, ఆ లెక్చరర్‌కి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని తెలిసింది. అంతేకాదు, నేను కనక తన మాట కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని కూడా తెలిసింది. నాకు నా కూతురు తప్ప వేరే లోకం లేదు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.– రామరాజు, భీమవరంమీ సమస్య చదువుతుంటే మనసు కలచి వేస్తోంది. మీరు వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా మీ కూతురే ప్రపంచంగా బతికారు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి సందర్భాలలో మీరు భావోద్వేగానికి లోనై అమ్మాయి మీద అరవడం, కోప్పడి మీవైపు లాక్కోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంత బలంగా తనని మీవైపు లాక్కోవాలనుకంటే తను అంతకన్నా బలంగా మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ వయసులో ఆకర్షణలు, ప్రేమ భావాలు సహజం. కానీ ఇప్పటికే వివాహమై, కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తితో జీవితం ప్రారంభించాలనుకోవడం ఆమె అపరిపక్వతను సూచిస్తుంది. మందుగా మీ కుమార్తెను నిందించకుండా ఒత్తిడి లేకుండా ఫ్రశాంతంగా మాట్లాడండి. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు అన్న భావన కలిగేలా నెమ్మదిగా విషయాలను వివరించండి. సాధ్యమైనంత వరకు మూడోవ్యక్తి ద్వారా ప్రాఫెషనల్ కౌన్సెలింగ్ చేయించడం మంచిది. క్లినికల్ సైకాలజిస్టులు ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలు చూపించి ఆమెకు స్వతంత్రంగా ఆలోచించడానికి దారి చూపగలరు. అదే సమయంలో మీరు మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని ఆమెతో పదే పదే అనడం వల్ల ఆమె మిమ్మల్ని అ΄ార్థం చేసుకుని మీకు మరింత దూరం అవుతుంది. వీలయితే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తను ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది కాబట్టి అసలు ఒంటరిగా వదలకండి. జీవితంలో ఒకోసారి అన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలో ఉండచకపోవచ్చు. కాలాన్ని మించిన వైద్యుడు, అనుభవాన్ని మించిన గురువు లేడనే సత్యాన్ని గ్రహించండి. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలే దని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’ అన్న తాత్త్విక ధోరణి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అనిపిస్తుంది. మీరు మనసు గట్టి చేసుకుని ధైర్యంగా ఉండండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
యూట్యూబ్ పేరెంటింగ్ ఎంతవరకు?
డిజిటల్ లెర్నింగ్ అనివార్యంగా పిల్లల జీవితంలో భాగమైన రోజులొచ్చాయి. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలు, నోట్సులతో విద్య సాగితే ఇప్పుడు స్కూలు, కాలేజీలకు సమాంతరంగా పిల్లలు ఇంట్లో యూ ట్యూబ్ పాఠాలతో చదువుతున్నారు. అయితే ఈ చదువు ఎంత వరకు ఉండాలి? ఈ చదువును పిల్లలకు ఎంత మేరకు తల్లిదండ్రులు అనుమతించాలి? పరీక్షలు దగ్గర పడుతున్న సమయం ఇది.పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దే కాలం నుంచి డిజిటల్ స్లేట్ మీద అక్షరాలు రాసే కాలం దాకా చిన్నారులు ఎదిగారు. ఒకప్పుడు పాఠాలంటే పుస్తకాల్లో చూసి చెప్పేవే. కానీ మారిన కాలంలో పాఠం డిజిటలైజ్ అయిపోయింది. అచ్చయిన అక్షరం కన్నా కంటి ముందు కనిపించే రూపాలను చూపిస్తూ పాఠం చెప్తున్నారు టీచర్లు. ఈ ట్రెండ్ మరింత ముందుకు వెళ్లి, యూట్యూబ్ సరికొత్త టీచర్‌గా మారిపోయింది. ఏ అంశమైనా అర్థం కాకపోతే విద్యార్థులు అందులో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. కేవలం పుస్తకాలనే నమ్ముకోకుండా టెక్నాలజీ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది మంచా, చెడా, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది ప్రస్తుతం చర్చగా మారింది.వ్యూస్ ప్రభావితం చేస్తున్నాయిగతంలో పిల్లలు టీచర్ పాఠం చెప్తున్నప్పుడు అర్థం కాకపోతే లేచి అడిగేవారు. సందేహాలు తీర్చేందుకు ఇంట్లో పెద్దలు, ట్యూషన్ టీచర్లు ఉండేవారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు వెనుక స్థానం తీసుకున్నాయి. ఓపిక లేని టీచర్లు, తీరిక లేని తల్లిదండ్రులు యూట్యూబ్‌ను పిల్లల చేతుల్లో పెట్టారు. అందులో అనేకమంది ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే సులభరీతిలో అంశాలను బోధిస్తున్నారు. అవన్నీ ఉచితం కావడంతో చిన్నారులు వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో కొన్ని వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ ఉంటున్నాయి. వ్యూస్‌ను చూసి పిల్లలు మరింతగా ఆ వీడియోస్‌ను ఫాలో అవుతున్నారు.ఎందుకీ మార్పు?ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ విప్లవం మొదలైంది. రాన్రానూ అది మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో చిన్నారులకు సాంకేతిక అనుభవం అవసరం అనేది తల్లిదండ్రుల వాదన. ఈ సమయంలో పాఠాలకు కేవలం పుస్తకాల మీద, టీచర్ల మీద మాత్రమే ఆధారపడితే కష్టమని, యూట్యూబ్ ద్వారా నేర్పే పాఠాలు చిన్నారులకు చేరాలని వారి మాట. పైగా పుస్తకాల్లోని అంశాలు పేరాల కొద్దీ రాసినా అవి చిన్నారులకు అనుభవపూర్వకమైన జ్ఞానం అందించలేవు. వీడియోలో అయితే వారి కంటికి అన్నీ కనిపిస్తూ వివరించడం వల్ల మరింత స్పష్టంగా నేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.చెడు ప్రభావాల మాటేమిటి?యూట్యూబ్ పాఠాలు మంచివే అని అంటున్నా, దానివల్ల కలిగే చెడు ప్రభావాల మాటేమిటని విద్యావేత్తల ప్రశ్న. ఏదైనా అంశం గురించి చెప్పే వీడియోలను ఏ మేరకు నమ్మాలి, అందులోని అంశాలలో వాస్తవికత అనేది ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది తప్పూ, ఏది ఒ΄్పో తెలియని చిన్నారులు వాటినే నమ్మితే రాబోయే కాలంలో అది ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. దీంతోపాటు యూట్యూబ్ అలవాటైన చిన్నారులకు బడి మీద అయిష్టత పెరుగుతుందని, రోజంతా నెట్లో గడిపేందుకు ఆసక్తి చూపుతారని అంటున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. పుస్తకాల్లో ఉన్నది చదవడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందని, అన్నీ కంటి ముందు చూపించే వీడియోల వల్ల వారు సొంత బుర్ర వాడటంలో శ్రద్ధ పెట్టలేకపోతున్నారని అంటున్నారు. ఇలా చేస్తే మేలు..→ ఏ ఛానెల్ అయితే మేలైన, నిజమైన కంటెంట్ అందిస్తుందో ముందుగా తల్లిదండ్రులు తనిఖీ చేయాలి. అందులోని పాత వీడియోలు, దాని కింద కామెంట్లు పరిశీలించాలి. అది నమ్మదగినది అనిపిస్తేనే పిల్లలకు చూపించాలి.→ యూట్యూబ్ పాఠాలను కొందరు నిపుణులకు పంపి, అవి సరైనవని నిర్ధారణకు వచ్చాకే పిల్లలకు సూచించడం మరింత మేలు. → స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు అర్థం కాలేదని పిల్లలు అంటే, ముందుగా ఆ విషయాలేమిటో తల్లిదండ్రులు కనుక్కోవాలి. దాని గురించి వారికి వివరించి, ఆ తర్వాత వారి పక్కనే కూర్చుని యూట్యూబ్ వీడియోలు చూడాలి. అందులోని చెప్పేదానికి తోడు మీరూ కొన్ని అంశాలు జతచేయాలి. → యూట్యూబ్ పాఠాలకు టైం కేటాయించాలి. ఎక్కువ సమయం పిల్లలు అవే చూడకుండా, వారికి ఇతర పనులూ కేటాయించాలి. → పిల్లలు ఏమేం వీడియోలు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు వంటి విషయాలు పెద్దలు గమనిస్తూ ఉండాలి. → కావాలని స్కూల్ మానేసి, పిల్లలు పాఠాల కోసం ఈ వీడియోల మీద ఆధారపడటాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. → వీడియోల మధ్యలో సినిమాలు చూడటం, ఇతర అంశాలను చూడటం వంటివి పెద్దలు నిరోధించాలి. → వీడియోలు చూసి ఆగకుండా, అందులోని పాయింట్లను నోట్ చేసుకోమని సూచించాలి. వాటిని పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో సరిచూసుకోమని చెప్పాలి. → యూట్యూబ్‌లో చూపించిన అంశాల గురించి పిల్లలతో చర్చించాలి. అవి వారికి ఎలా అర్థమవుతున్నాయో అంచనా వేసి, మార్పుచేర్పులు చెప్పాలి. -
గోరంత సేవైనా గౌరవమే!
అది... రెండేళ్ల కిందటి సంఘటన. హైదరాబాద్ నగరంలో ప్రజాదర్బార్. పదుల కొద్దీ వీల్ చెయిర్లలో దివ్యాంగులు. వారి కష్టాన్ని సీయంకి వివరిస్తోందో మహిళ. అందరూ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్లే. ప్రభుత్వం పెన్షన్ ఇస్తే అడుక్కోవడం మానేస్తారు. పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు రావాలంటే వారికో అడ్రస్ ఉండాలి. ఉండడానికి ఇల్లులేక, తినడానికి తిండి లేక రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్న వారిని అడ్రస్ అడిగితే ఏం చెప్పగలుగుతారు? ప్రభుత్వ వైఫల్యమే వీరి అడ్రస్, ఈ ప్రజాభవనే వీరి అడ్రస్... అని వాదించింది. సీయం పక్కనే రెవెన్యూ మినిస్టర్ కూడా ఉన్నారు. అడ్రస్ అవసరం లేకుండా ఆధార్ కార్డులు జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ నియమావళికి, ఆపన్నుల అవసరానికి మధ్య ఉన్న అగాధం తొలగిపోయింది. దిక్కులేని వారికి ఆధారం దొరికింది. సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే సమస్యను సింపతీతో చూసినంత కాలం పరిష్కార మార్గం కనిపించదు, ఎంపతీతో చూసినప్పుడే ఆ దారి గోచరమవుతుంది. బాధితుల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించే మనసు ఉండడంతోనే ఆమెకు పరిష్కార మార్గం కనిపించింది. ఆమె సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి.‘నాకు వందమంది శక్తిమంతులైన యువతను ఇవ్వండి, భారతదేశాన్ని మార్చి చూపిస్తాను’ అన్న వివేకానందుడే తనకు స్ఫూర్తి అంటారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మిరెడ్డి. భర్త, ముగ్గురు పిల్లలతో గృహిణిగా ఖమ్మంజిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆమె రామకృష్ణ మఠం బోధనలతో స్ఫూర్తి పొందారు. తొంభయ్యవ దశకం మొదట్లోనే లయన్స్ క్లబ్ సభ్యురాలిగా సేవాపథంలో నడిచారు. చదువంటే ఆమెకు తీరని దాహం. ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడంతోపాటు పెళ్లి కారణంగా ఆగిపోయిన తన చదువును కొనసాగించారు. ఇప్పుడామె ఎల్ఎల్బి స్టూడెంట్. ‘మహిళలు కుటుంబ సమస్యలతో వస్తుంటారు. వారి కాపురం నిలబెట్టడానికి లోకజ్ఞానంతో కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. న్యాయపరమైన సలహా కోసం తరచూ మా వారిని విసిగించాల్సి వస్తోంది. నా ఫ్రీ సర్వీస్ కోసం ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ కోర్సు నేనే చేస్తే మంచిది కదా అని చదువుతున్నాను’ అంటూ తన జీవితాన్ని సేవాపథంలోకి నడిపించిన సంఘటనను గుర్తు చేసుకున్నారామె. మహిళాౖ ఖెదీ వార్త ‘‘న్యూస్పేపర్లో ‘అత్త తల పగుల కొట్టిన మహిళ’ అనే వార్త నన్ను కదిలించి వేసింది. ఆ మహిళది సత్తుపల్లి. మా మండలమే. ఎందుకిలా చేసి ఉంటుంది... ఒకసారి మాట్లాడదాం అని చంచల్‌గూడ జైలుకెళ్లి ఆమెను కలిశాను. వ్యభిచారం చేసి డబ్బు సంపాదించమని ఒత్తిడి చేయడం, భర్త ముందు దోషిగా నిలబెట్టడం వంటి బాధలు తట్టుకోలేకపోయింది. మనసు చంపుకుని బతకలేక, పట్టలేని కోపంలో రోకలితో తల మీద మోదింది. చట్టపరంగా ఆ మహిళ చేసింది తప్పే కాబట్టి న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెకు చదువు లేదు. శిక్ష పూర్తయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలా బతకాలి అనే ప్రశ్న చాలారోజులు నన్ను తొలిచేసింది. జైలు శిక్షణ జైలు శిక్ష కోసం మాత్రమే కాదు శిక్షణ కూడా ఇవ్వాలని మహిళా ఖైదీలకు ఫినాయిల్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులు నేర్పించడం మొదలుపెట్టాను. డ్వాక్రా గ్రూపు లీడర్ల కు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్‌లో వందలాది మహిళలకు శిక్షణనిచ్చాను. సమాజంలో నేను చూసిన సమస్యలు, నాకు ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాలే నా సేవకు సోపానాలు. మా ఉమ్మడి కుటుంబంలో ఏడాది బిడ్డ కంటిని కోల్పోయింది. ఇంటిల్లిపాదీ అనుభవించిన మానసిక క్షోభను దగ్గరగా చూశాను. అందుకే కంటి ఆపరేషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయించడానికి హోమ్ మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ‘జైలు నుంచి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత తిరిగి జైల్లో దించడంలో ఏ మాత్రం తేడా జరిగినా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందమ్మా జాగ్రత్త’ అని హెచ్చరించారు అప్పటి హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కానీ నేను చాలా పెద్ద సాహసం చేశానని తెలియలేదు. నిస్వార్థంగా గోరంత సేవ చేస్తే ఆకాశమంత గౌరవం దక్కుతుందని తెలిసింది. పాతికేళ్లు నిండిన సామాజిక సేవలో వర్మీ కంపోస్ట్ సర్వీస్‌కు రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోవడం, రామకృష్ణ మఠం నుంచి మదర్ థెరిస్సా పురస్కారం నా మది నిండిన జ్ఞాపకాలు’’ అన్నారీ సామాజిక ఉద్యమకారిణి.ఆటా సభల్లో కొత్త భారతంజీవితం అంటేనే సవాళ్లమయం. కష్టం వచ్చిందని ఏ ఆడపిల్లా చనిపోకూడదు... తమ కాళ్ల మీద తాము నిలబడాలి, కష్టపెట్టిన వాళ్లు తలదించుకునేలా జీవించి చూపించాలనేదే నా సందేశం. అందుకే నా సర్వీస్‌లో హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనమిక్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టాను. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన పేదింటి ఆడపిల్లలకు ఉచితంగా బస, భోజనం అందిస్తున్నాను. మా తరంలో మహిళలకు అందని అభివృద్ధిని ఈ తరం యువతుల్లో చూస్తున్నాను. అయితే మనదేశంలో ఆడవాళ్లు ఎంత చదివినా, ఎంత పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే... ఇంటికి వచ్చేటప్పటికి ఆమె గృహిణిగా మారిపోవాల్సిందే. గరిట ఆమె కోసం చూస్తూ ఉంటుంది. 2012లో ఆటా సభలకు యూఎస్‌లోని ఆట్లాంటాకు వెళ్లినప్పుడు మనం కోరుకుంటున్న స్త్రీ సమానత్వాన్ని అక్కడ చూశాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటిపనులను పంచుకుంటారు. యువతరం ఆలోచనలు సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నందుకు సంతోషం కలుగుతోంది.– శ్రీలక్ష్మి రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్– వాకా మంజులారెడ్డి‘సాక్షి’ స్టేట్ బ్యూరోఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!
పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.బ్రేక్ ప్రాముఖ్యత...కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. ధ్యానం అంటే..ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది. -
సరికొత్త టెక్నాలజీతో మోకాళ్ల నొప్పులకు ఉపశమనం..! నాగార్జున సైతం..
మోకాళ్లు నొప్పులు ఎంతలా వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. బాధితులు తాళలేక ఎంతలా ఇబ్బంది పడతారనేది మాటలకందనిది. టాలీవుడ్ నటుడు నాగార్జున సైతం తానుకూడా ఆ సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వాళ్ల అమ్మ కూడా ఆ సమస్యతో బాధపడేదని, తన బాధను చూడలేపోయేవాడినని అన్నారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో తనకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అదెలాగో నటుడు నాగార్జున మాటల్లోనే తెలుసుకుందామా..!.మా అమ్మకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉండేవి. దీంతో అప్పట్లో ఆమె బాధ చూడలేకపోయేవాడిని.. నొప్పులతో ఓ వైపు అమ్మ బాధ పడుతుంటే.. ఆమెను చూసిన నాకు ప్రాణం విలవిలలాడిపోయేది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం నన్ను బాధించింది.. ప్రస్తుతం నగరంలో ఈ మోకాళ్ల నొప్పులకు స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.. అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. భాగ్య నగరంలోని గచ్చిబౌలిలో ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ టెక్నాలజీని బంజారాహిల్స్‌లోని లీలా గ్రాండ్లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. శరీరంలో కృత్రిమ అవయువాలు అమర్చడం, అవయవ మార్పిడి వంటి చికిత్సలు విజయవంతంగా చేపడుతున్నారు. గతంలో ఇటువంటి వైద్య సేవలు అందుటులో ఉండేవి కావు. దీంతో బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ఇందుకు మా అమ్మే ఉదాహరణ. నా కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయేవాడిని. ఆర్టిఫిషియల్ అవయవాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పెయిన్ ఫ్రీ లైఫ్ చూస్తున్నాం. ప్రయాణ సమయంలో, ఎయిర్ పోర్టులు, ఇతర ప్రదేశాల్లో మోకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొత్త టెక్నాలజీ గౌరవంగా బతకడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో శరీరానికి ఫిట్నెస్ అవసరం. అదే మంచి జీవితాన్ని అందిస్తుంది. కులూమనాలీ షూటింగ్ సమయంలో నీ పెయిన్ సివియర్‌గా బాధించింది. కుంటుకుంటూ వెళ్లాను. అమ్మను చూసిన తరువాత నాకు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా స్నేహితులు డా.ప్రభాకర్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఐదేళ్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు’అని నాగార్జున తెలిపారు. అక్కడి నుంచి ఏదైనా కొత్తగా మందులు, టెక్నాలజీ వస్తే పరస్పరం షేర్ చేసుకుంటాం. స్కైవాకర్ బిగ్ హీల్ ఫర్ మీ అని పేర్కొన్నారు నాగార్జున . కార్యక్రమంలో ఆరిట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్‌తో కంటి చూపుకే ముప్పు..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
వెయిట్ లిఫ్టింగ్‌తో తస్మాత్ జాగ్రత్త..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
చాలామటుకు ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్లిప్టింగ్తో ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్‌లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్ లిఫ్టింగ్‌లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్.27 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్ లిఫ్టింగ్ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్ సెషన్ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్‌లో డెడ్‌లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు. ఎందువల్ల ఇలా అంటే..అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని సబ్హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు. వల్సాల్వా రెటినోపతి అంటే..వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట. లక్షణాలునిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు. అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యంముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.ఎలా చికిత్స చేస్తారంటే..ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు. చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .యాగ్ లేజర్ చికిత్సరక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. . -
దేవుడి ఖజానా ఏమైంది?
బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది. అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.ఖజానా వివాదం..అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. అయితే ఆ గదిలో ప్యానెల్ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. విశేషం ఏంటంటే..ఈ బృందావన్‌లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్‌ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్ ఆదేశించింది.(చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
మనసు దోచే వరమాల..! పూలతో చేసింది కాదు..
ఈ వెడ్డింగ్ సీజన్ ట్రెండ్... ‘క్రోచెట్ వరమాల’. కాస్త వెనక్కి వెళితే... వివాహం చేసుకోబోయే ఒక జంట నుంచి ఒక మహిళకు ‘వరమాల’ తయారుచేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది.‘ఎప్పుడూ పూలతోనే చేస్తే ఏం వెరైటీ ఉంటుంది. కొత్తగా చేయాలి’ అని ఆలోచించింది. ఆమె ఆలోచనలో నుంచి వచ్చిందే... క్రోచెట్ వరమాల. మృదువైన రంగుల ఉన్ని దారాలను ఉపయోగించి ఆమె తయారుచేసిన ‘వరమాల’ ఆహా అనిపించింది. వరమాల మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వరమాలకు ‘క్రోచెట్ వరమాల’గా పేరు వచ్చింది. ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. ఇలాంటి అందాల వరమాలను మీరు కూడా తయారుచేయాలనుకుంటున్నారా? ‘క్రోచెట్’ హ్యాండిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నేర్చుకోండి. వధూవరులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి!. View this post on Instagram A post shared by Hot_Knot (@hot_knot_by_sumee) (చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?) -
పిల్లల్ని కలిసే హక్కు తండ్రిగా నాకు లేదా?
నాకు ఇద్దరు కూతుళ్ళు. వయసు 8ఏళ్ళు, 6 ఏళ్ళు. మేము విడిపోయి 2 సంవత్సరాలవుతోంది. పిల్లలు నా భార్య వద్దనే ఉన్నారు. వాళ్లని చూడాలని ఉంది కానీ ఆమె నాకు చూపించకపోగా నామీద క్రిమినల్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసింది. పిల్లల్ని చూడాలంటే వారికి నానుంచి హాని ఉంది అని చెప్తుంది. పిల్లల్ని ఒకసారి కోర్టుకు తెస్తే, జడ్జిగారికి పిల్లల చేత ‘మా నాన్న మంచివాడు కాదు’ అని చెప్పించారు. నిజానికి పిల్లలు నాతో చాలా బాగా ఉండేవారు. తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా? నాతో ఎంతోబాగుండే పిల్లలు ఇలా అయ్యారు అంటే, తనే నేర్పించింది అని అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పగలరు.– సంపత్, విశాఖపట్నంఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. చాలా కేసులలో ఇలాంటి ధోరణి చూస్తుంటాము. అనేక కారణాలు ఉంటాయి. ‘‘తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా?’’ అని అడిగారు. తల్లిదండ్రులకి పిల్లలపై హక్కు మాత్రమే కాదు బాధ్యత ఉంటుంది. తల్లితండ్రుల ప్రేమ, ఆదరణ సమానంగా పొందే హక్కు పిల్లలకు ఉంటుంది. అంటే ప్రథమంగా అది పిల్లల హక్కు. మీ హక్కు కాదు. చట్టాలు చిన్నపిల్లల శ్రేయస్సు కోసమే ఉన్నాయి. వారి శ్రేయస్సు ముందు ఎవరి హక్కు అయినా చిన్నదే! భార్యాభర్తలు విడిపెయిన సందర్భాలలో పిల్లలను ఆయుధంగా వాడుకోవాలి అనుకోవడం దాదాపుగా అన్ని కేసులలో చూస్తుంటాము. అది తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచివారు కాక΄ోయి ఉండొచ్చు. అంతమాత్రాన మంచి తల్లిదండ్రులు కాదని చెప్పలేము. విడి΄ోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు సాధారణంగానే అవతల వారిపై వ్యతిరేక భావనను పిల్లలలో పెంచుతుంటారు. విజ్ఞత కోల్పోతుంటారు. చిన్నారుల పసి హృదయాలపై వారు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో ప్రవర్తన మారి΄ోతూ ఉంటుంది. మీ విషయానికి వస్తే, రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న మీరు పిల్లలు కావాలి అని కేసు ఎందుకు వేయలేదు? పిల్లల శ్రేయస్సు కోసం మీరు ఏం చేశారు? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? ఇలాంటివి కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసులో లబ్ధి కోసం ఉన్నట్లుండి పిల్లలపై ప్రేమ ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే కోర్టులు నమ్మవు! ఇప్పటికైనా పిల్లలపై బాధ్యతను నెరవేరుస్తూ, వారికి కస్టడీ మీకు కూడా కావాలి అని గార్డియన్స్ అండ్ వర్డ్స్ చట్టం కింద కేసు వేయవచ్చు. పిల్లల అభిప్రాయాలను బలవంతంగా మార్చారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ ఇద్దరు పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు పంపాలి అని మధ్యంతర దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడాలి. తల్లిపైన లేదా తండ్రిపైన విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తున్నవారికి నా విన్నపం ఏంటంటే: మీరు కేసులు గెలవచ్చు కానీ మున్ముందు పిల్లల భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త వహించాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
గాన మాధుర్యంతో దూసుకుపోతున్న అమిత
విశాఖపట్నం: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా, చిన్న వయసులోనే తన పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది పీఎం పాలేనికి చెందిన చింతకాయల అమిత. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఈ యువ గాయని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే పలు టీవీ షోలలో పాల్గొని తన గాత్ర మాధుర్యాన్ని పరిచయం చేసింది. ఏ పాటనైనా అవలీలగా ఆలపిస్తూ, అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోంది. తాత నుంచి వారసత్వంగా సంగీతం అమిత తాతయ్య..పూర్ణ చంద్ర రావు ప్రముఖ సంగీత విద్వాంసులు, హార్మోనీ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే అమిత శ్రీకాకుళంలో గురువు దుర్గా ప్రసాద్ వద్ద సంగీతాన్ని నేర్చుకుని తన కళకు మెరుగులు దిద్దుకుంది. సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఐదో తరగతి చదువుతుండగా ఒక చానల్లో నిర్వహించిన ‘అమూల్ బోల్ బేబీ బోల్’ కార్యక్రమంలో పాల్గొని మొదటిసారిగా తన ప్రతిభను చాటుకుంది. ఆరో తరగతి చదువుతున్నప్పుడు మరో టీవీ చానల్లో నిర్వహించిన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. 2023లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ టీవీ షోలో ఫైనలిస్ట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ‘ఖడ్గం’ సినిమాలోని ‘అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే’ పాటకు స్టేజీపై పాడుతూ మంచి గుర్తింపు పొందింది. మిలియన్ వ్యూస్‌తో దూకుడు అమిత తాను పాడిన పాటలతో ఎందరినో ఆకట్టుకోవడమే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ తన ప్రతిభను మరింత చాటుకుంది. ‘విడలేని ప్రేమని’, ‘రాయే రాయే పిల్లా’, ‘ముద్దుముద్దు గుంటడే నా బావగాడు’ వంటి పాటలతో సోషల్ మీడియాలో సైతం తన అభిమానులను పెంచుకుంది. ఈ పాటలు ప్రతిదీ మిలియన్ వ్యూస్‌తో దూసుకుని పోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు ఆరేయ్’ చిత్రంలో పాటతో మరోసారి తన గాత్ర ప్రత్యేకతను చాటుకుంది.సినిమాల్లో అవకాశం ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించినట్లు అమిత తెలిపింది. తన తండ్రి అంబేడ్కర్, విజయనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్, తల్లి గౌరి తనకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని పేర్కొంది. ఒకవైపు బీటెక్ చదువుతూనే, మరోవైపు పాటలు పాడుతూ, గ్రూప్స్‌లో ఉత్తీర్ణత సాధించడం తన లక్ష్యమని చెప్పింది. సినిమాల్లో అవకాశాలు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అమిత పేర్కొంది. -
అమ్మకు ‘కట్టుబాటు’
ఆమె తానొక స్త్రీ అనే మర్చిపోయింది. పల్లెటూళ్లో ఒక గొడ్డులా కష్టపడి ఇద్దరు కొడుకులను సాకింది. పల్లెటూరి పలుకుబడి... పల్లెటూరి కట్టుబడి... ఇవి మాత్రమే ఆమెకు తెలుసు. కొడుకు ప్రయోజకుడై నగరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ తల్లికి ఒక కండిషన్ పెట్టాడు. ఆమె సంస్కృతిని తక్కువ చేస్తూ బట్టలు కట్టుకునే పద్ధతి మార్చుకోవాలన్నాడు. తమిళంలో తాజాగా విడుదలైన ‘అంగమ్మాల్’ ఆలోచనలు రేకెత్తిస్తోంది.జీవితాంతం పంచె కట్టులో, భుజం మీద తుండుతో వ్యవసాయం చేస్తూ వచ్చిన తండ్రిని తన పెళ్లి కోసం ‘నువ్వు సూట్ వేసుకోవాల్సిందే నాన్నా’ అని కొడుకు పట్టుబడితే ఆ తండ్రికి ఊపిరి ఆడుతుందా? అసలు సూట్ వేసుకుని తిరగ్గలడా? బట్టలతోనా తండ్రికి గౌరవం? అయితే తండ్రి తొడుక్కునే బట్టలు ‘తక్కువ రకానివి’ అని నిర్ణయించేదెవరు?అలాగే జీవితాంతం రవికంటే ఏమిటో ఎరగక బండ చాకిరీ చేస్తూ వచ్చిన తల్లిని మాత్రం ‘నువ్వు నా పెళ్లి సందర్భంగా రవిక తొడగాల్సిందే’ అని కొడుకు పట్టుబడితే?ఆ తల్లి ఏం చేస్తుంది? ఏం చేయాలి? అటు కొడుకు మథనం... ఇటు తల్లి అంతర్మథనం. వెరసి ‘అంగమ్మాల్’ చిత్ర కథనం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘కొడు తుని’ అనే కథ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ఇది. దిగ్దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీతా కైలాసం ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘అంగమ్మాల్’గా నటించారు. ఆమె పెద్దకొడుకుగా భరణి, చిన్నకొడుకుగా శరన్ శక్తి నటించారు. భర్త పోయిన తర్వాత ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాక్కున్న తల్లి అంగమ్మాల్ జీవిత పద్ధతి వేరే, ఆమె తీరు వేరే. భర్త లేని స్త్రీ ఊళ్లో బతకడం కష్టం కనుక ఆమె బండగా మారిపోయింది. మగరాయుడిలా తనను తాను మలుచుకుంది. జాకెట్ వేసుకోవడం ఆమె ఎరుగదు. బీడీ తాగుతూ, అందర్నీ అదిలిస్తూ, కుటుంబాన్ని అధీనంలో ఉంచుకొని బతకడం అలవాటైన మనిషి. కోపధారి, రోషనారి. ఇటువంటి మనిషికి ఇప్పుడు చిన్నకొడుకు వల్ల కలిగిన సంకటమే ఈ కథలోని మూలాంశం. కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. సంబంధం మాట్లాడటానికి అతని ఊరొస్తామంటున్నారు. వాళ్లు పట్నవాసపు మనుషులు. హైక్లాసులో పెరిగినవారు. వారు వచ్చి, తన అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? పెళ్లి విషయంలో పేచీ పెట్టరా? రవిక లేకుండా ఆమెను చూసి హవ్వా అనుకోరా? ఇదంతా ఆలోచించిన చిన్నకొడుకు రవిక వేసుకోమని పట్టుబట్టాడు. ఆమెతో పంతానికి పోయాడు. తల్లికి కొడుకు మీద ప్రేమ, అతని బతుకు మీద ఆరాటం. కానీ తన అస్థిత్వాన్ని తానెలా వదులుకోగలదు? ఆమె భుజం మీద ఒక అడవి పువ్వు పచ్చబొట్టు ఉంటుంది. అది ఆ ప్రాంతంలో కొండల్లో పాతికేళ్లకు ఒకసారి పూస్తుంది. భలే సువాసన. ఆ పువ్వు ఆమె భుజం మీదఆమెకో అస్తిత్వంలా ఉంటుంది. ఆ అడవి పువ్వు పాతికేళ్లకు ఒకసారే ఎందుకు పూస్తుంది అనంటే ఏం చెప్పగలం? అది దాని స్వభావం. దానిని ప్రతి సంవత్సరం పూయమంటే పూస్తుందా? అంగమ్మాల్ రవిక వేసుకోకుండా ఎందుకుంది అనంటే ఆమెకు అలా అలవాటైంది. చీరను ఒంటికి కప్పుకుని ఇన్నాళ్లు బతికింది. ఊరికి కూడా అదే అలవాటైంది. వారికి లేని ఇబ్బంది. అంగమ్మాల్కు లేని చింత ఇప్పుడు కొడుక్కు వచ్చింది– అదీ పట్నం నుంచి వచ్చే ఎవరి కోసమో. ఆమె బాగా ఆలోచించింది.చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకూ, ఆమె కుటుంబంలోని వారికీ ఎలాంటి పరిస్థితులను కల్పించిందనేది చిత్రకథ. తమిళనాడులోని ఓ పల్లెలో కెమెరాను పాతి, చుట్టూ జరుగుతున్న అంశాలను చూపించిన సినిమా ఇది. అంత సహజమైన లొకేషన్లు, అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను ఈ చిత్రంలో చూపించారు. వారికి తగ్గ భాషనే డైలాగుల్లో వాడారు. గతంలో నిర్మాతగా వ్యవహరించిన గీతాౖ కెలాసం అనంతరం నటిగా మారారు. ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోదగ్గ సినిమా ఇది. ఈ సినిమా మొత్తానికి ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. కుటుంబం కోసం రాయిలా మారిన మనిషి పద్ధతి చివరకు ఆ కుటుంబానికే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఆ అమ్మ ఏం చేయాలో ఈ చిత్రం చూసి ఆలోచనలో పడాలి.పైకి ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల సంస్కృతిని వెనుకబాటుగా చూడటం, వారిని నలుగురి ఎదుటకూ తేకపోవడం, వారిని ‘సంస్కరించాల’ని చూడటం మన సమాజంలో వినబడుతూనే ఉంది. మనల్ని కన్నవాళ్లను మనం ‘కరెక్ట్’ చేయాలనుకోవడం వారు ‘గాయపడే’ స్థాయిలో జరగాలా? వారిని వారిలా ఉండనివ్వండి అని చెప్పే సినిమా ‘అంగమ్మాల్’. త్వరలో ఓటీటీలో రావచ్చు. -
ఆమె ఆత్మవిశ్వాసం ఎవరెస్ట్
‘నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను’ అనే మాట తిరుపతమ్మ నోటి నుంచి వినిపించినప్పుడు ఎంతమంది సీరియస్‌గా తీసుకొని ఉంటారో తెలియదు. ఆమె మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ‘నువ్వు పోటీ చేయడం ఏమిటి!’లాంటి వెక్కిరింపులకు తన విజయంతో దీటైన సమాధానం ఇచ్చారు తిరుపతమ్మ. ఆమె ఎత్తు మూడు అడుగులు. ఆమె ఆత్మవిశ్వాసం... ఎవరెస్ట్ అంత!తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామ చరిత్రలో తొలిసారి విశేష ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. ఆమెతో పాటు ఆమె ప్యానెల్‌లోని పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయం మహిళలకు, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.రెక్కల కష్టం నమ్ముకొని...తిరుపతమ్మ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం తిరుపతమ్మ, సోదరుడు సుదర్శన్ భుజాలపై పడింది. ఇద్దరు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత తిరుపతమ్మ ఉపాధి హామీ పథకంలో వాచర్‌గా ఉద్యోగం సంపాదించారు. వాచర్‌గా పనిచేస్తూ ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు. గ్రామస్తుల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజల తలలో నాలుక అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు# ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఒక్కపూట భోజనానికే ఇబ్బంది పడిన రోజులు ఉన్నా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు.నా విజయ రహస్యం... ఆత్మవిశ్వాసంఎన్ని కష్టాల్లో ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే నా బలం. ఎన్నికలు నాకు కొత్త కావచ్చు. కాని గ్రామ ప్రజలు కొత్తవారు కాదు. వారు నా కుటుంబ సభ్యులు. ‘మంచి చేస్తే మంచే జరుగు తుంది’ అని బలంగా నమ్ముతాను. తమ్ముడు సుదర్శన్ చేసిన సేవలు, ప్రజలకు నాపై ఉన్న నమ్మకం సర్పంచ్‌గా నా గెలుపుకు కారణం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. – ఇల్లందుల తిరుపతమ్మ– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ -
నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?
ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.ఈ సమయంలో ఏం చేస్తారంటే..పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..) -
'అందరికీ ఫిర్యాదురహిత, సౌకర్యవంతమైన దర్శనం'
సాక్షి శబరిమల: "అందరికి ఫిర్యాదురహిత సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్‌ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గత ఏడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా ఎక్కువ మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్‌గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 24న కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.ఇదంతా అయ్యప్ప మహిమే..దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్‌లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు. చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్‌లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. స్పాట్ బుకింగ్ పెంపు ఎప్పుడంటే..సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్‌లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!
ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్వతహాగా ఆహారప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లో ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అలానే ఈసారి కూడా గజగజ వణికించే ఈ చలిలో తనెంతో ఇష్టంగా తినే ఆహారాన్ని షేర్ చేశారు. దీన్ని శీతకాలపు చిరుతిండిగా అభివర్ణిస్తూ..ఆ రెసీపి తయరీతో సహా వివరించారు. నిపుణుల సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం.గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల కాలానుగుణ వంటకాన్ని నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. ఇది శీతకాలపు చిరుతిండి అని, తనకెంతో ఇష్టమని అన్నారు. పోంక్ రెసిపీ వ్యవహరిస్తారని చెప్పారు. ఇది ఆకుపచ్చని జొన్నలు,నిమ్మకాయ, మఖానా, కొద్దిగా సేవ్ జోడించి తయార చేసి స్మోకీ వంటకమట. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్లిపోవాల్సిందేనట. దీనికి వెల్లుల్లి చట్నీ జోడిస్తేనే మంచి రుచి వస్తుందని చెప్పారు గోయెంకా. ఎలా చేస్తారంటే..తాజా పోంక్(ఆకుపచ్చని జొన్నలని) పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం జల్లుకోవాలి. క్రంచిగా ఉండేలా మఖానా చక్కెర బంతులను జోడిస్తూ..స్సైసీ పంచ్ ఇచ్చేలా వెల్లుల్లి చట్నీ జోడిస్తే చాలట. కాస్త ఆకర్షణీయంగా కనిపించేలా క్రిస్పిసేవ్ చలులుకుంటే..ఎంతో రుచికరమైన పోంక్ రెడీ..!.ఆరోగ్య లాభాలు..ఇది కేవలం చిరుతిండి కాదు. లేత దశలో ఉండే ఈ జొన్నలు ప్రత్యేకమైన వగరు రుచి కలిగి నోటిలే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఫైబర్ మూలం. ఇందులో ఉపయోగించే జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి. అందువల గ్లూటెన్ అంటే పడినివాళ్లకి లేదా సెలియాక్ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మంచిది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని అందివ్వడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలుగజేస్తుంది. అలాగే ఇందులో ఐరన్, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఇది మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.My favourite winter snack is ‘ponk’. Its green jowar, lightly roasted, rushed daily from Surat to Mumbai. Add salt, lemon, makhana sugar balls, sev, a spoon of garlic chutny, and you’ll be transported to heaven. This version has a little hara chana twist. pic.twitter.com/IzDOvUctIT— Harsh Goenka (@hvgoenka) December 13, 2025 (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!
"నిస్వార్థమెంత గొప్పదో…నీ పదము రుజువు కట్టదా..సిరాలు లక్ష ఓంపదాచిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్‌లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.ఆ సేవ వృధాగా పోలేదు..ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్‌గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్‌లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
ఆ కారు నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..! వైరల్‌గా ఓ తండ్రి పోస్ట్..
కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు. తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్‌పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట. ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్‌లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్‌లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!) -
వాటర్ పూల్..బీచ్ ఫీల్..!
ఇక భాగ్యనగరవాసులు బీచ్ వైబ్స్ ఆస్వాదించడానికి గోవా, వైజాగ్, బందరు అంటూ దూరభారం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సిటిజనుల కోసం నగరానికి కూతవేటు దూరంలోనే ఆర్టిఫిషియల్ సముద్ర తీరం అవతరించనుంది. సముద్రం అనేది లేకుండానే తీరం ఎలా అనే ప్రశ్నకు మానవ మేధస్సుతో సమాధానం చెబుతున్న దేశపు తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. ఈ బీచ్ పరిసరాలు విందు, వినోదాలతో పాటు సకల సౌకర్యాలకు కేరాఫ్‌గా నిలువనుంది. పర్యాటక ఆకర్షణను దృష్టిలోపెట్టుకుని దీనిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్, దుబాయ్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలో పలు మానవ నిర్మిత బీచ్‌లు సందడి చేస్తున్న క్రమంలో దేశంలోనూ అదీ హైదరాబాద్‌లో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మితం కానుండడం విశేషం. చారిత్రక నేపథ్యానికి కొదవలేదు.. సాంస్కృతిక వారసత్వానికీ లోటు లేదు. సంప్రదాయ వంటకాల సంపదకు కరవు లేదు.. ఆధునిక పార్టీ కల్చర్కూ అడ్డు లేదు.. ఇలా పర్యాటకులను ఆకట్టుకునే అనేక హంగులు ఉన్న నగరంలో చెప్పుకోదగ్గ లోటు అంటూ ఏదైనా ఉందంటే అది బీచ్ ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు ఆ వెలితిని కూడా పూడ్చే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ప్రకృతి సిద్ధంగా మాత్రమే సాధ్యమయ్యే సాగర తీరపు అందాలను మానవ శక్తితో పునర్సృష్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం, నగరానికి సమీపంలోని బీచ్ అంటే అది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక బీచ్ మాత్రమే. అది కూడా దాదాపు 320 కి.మీ దూరంలో ఉంది. అయితే తెలంగాణ తొలి మానవ నిర్మిత బీచ్ గచి్చబౌలి నుంచి కేవలం 20 కి.మీ దూరంలో కొలువుదీరనుంది. భూమి లభ్యత, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా చేరుకోగలిగే రాకపోకల సౌలభ్యం కారణంగా కొత్వాల్ గూడను బీచ్ కోసం ఎంపిక చేశామంటున్నారు. దీనికి సంబంధించిన తుది ప్రాజెక్ట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విశేషాలెన్నో.. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ బీచ్‌ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దాదాపు రూ.225 కోట్ల నుంచి రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం. ఇసుక, నీరు మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా తేలియాడే విల్లాలు, లగ్జరీ హోటళ్లు, సాహస క్రీడలు, సెయిలింగ్, బంగీ జంపింగ్, స్కేటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కానున్నాయి. ఇతర ఆకర్షణల్లో భాగంగా వేవ్ పూల్, ఫౌంటైన్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, షాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కూడా... ఈ ప్రాజెక్టు సాకారమైతే, ఇది ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారుతుందని, హైదరాబాద్ స్థాయిని పెంచుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. దీనిలో పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులు ఖచి్చతంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను కూడా ఆకర్షిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోనూ ఒక అర్బన్ బీచ్ నిర్మించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ చాంపియన్స్ ఇన్ఫ్రాటెక్ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే హైదరాబాద్‌కు ఒకటి కాదు రెండు బీచ్‌లు అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కృత్రిమ బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని అధికారులు పరిశీలిస్తున్నారు. పారిస్ స్ఫూర్తితో.. ఫ్రెంచ్ రాజధాని సీన్ నదిని ఆనుకుని కృత్రిమ బీచ్‌లను సృష్టించిన పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ నుంచి సిటీ బీచ్ ఆలోచన ప్రేరణ పొందింది. తాము పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్‌ను పరిశీలించామని, అక్కడ భౌగోళిక పరిస్థితులతో పోల్చే పరిస్థితులు అనుకూలంగా ఉన్న నగరం కాబట్టి, ఇక్కడ అదే రీతిలో బీచ్ సృష్టికి పారిస్ ప్లేజెస్ మాదిరి నమూనాను అనుసరించాలని భావిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరికొన్ని కృత్రిమ బీచ్‌లు కూడా అంతర్జాతీయంగా పేరొందాయి. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్‌లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్‌లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. బీచ్‌తో పాటు విందు, సకల వినోదాలకు కేరాఫ్ మాల్దీవ్స్ రాజధాని నగరం మాలేలోని తూర్పు తీరంలో కృత్రిమ బీచ్ క్రీడా కార్యక్రమాలు, కవాతు, కారి్నవాల్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను నిర్వహించడానికి అనుకూలమైన వేదికగా మారింది. జపాన్‌లోని టోక్యోలో ఉన్న ఒడైబా సీసైడ్ పార్క్ పేరతో బీచ్ నిర్మించారు. టోక్యో బేలో ఒక ప్రసిద్ధ ప్రదేశంగా వినోద కార్యకలాపాలను అందిస్తుంది. అమెరికాలోని మిసిసిపీలో బిలోక్సీ మరొక ప్రసిద్ధ బీచ్. ఇది గల్ఫ్ తీరం వెంబడి ఉన్న 26 మైళ్ల పొడవైన మానవ నిర్మిత తీరప్రాంతంలో ఇది ఒక భాగం. సింగపూర్‌లోని 1,235 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెంటోసా మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకను కలిగి ఉన్న మూడు షెల్టర్డ్ బీచ్‌లు ఉన్నాయి. యూరప్‌లోని మొనాకో సిటీలో ఉన్న ఏకైక పబ్లిక్ బీచ్‌గా లార్వోట్టో బీచ్ పేరొందింది. రెస్టారెంట్లు, దుకాణాలు, కేఫ్‌లతో కళకళలాడే ఈ బీచ్‌లో కృత్రిమ ఇసుక కొంతవరకూ గులకరాళ్లలా ఉంటుంది. బీచ్‌కి వెళ్లేవారు దృఢమైన బూట్లు ధరించవలసి ఉంటుంది. పిల్లలు ఆట స్థలం కార్యకలాపాలు, బైక్ రైడ్లు ట్రాంపోలిన్ వినోదాన్ని అక్కడ ఆస్వాదించవచ్చు. (చదవండి: కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?) -
వయసులో ఫిట్..పరుగులో హిట్..!
ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్లు, అల్ట్రా మారథాన్లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్ మారథాన్ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్‌కు చెందిన సీనియర్ రన్నర్ నాగభూషణరావు చలమలశెట్టి..కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్‌లోని కేఎల్ రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు. అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్లలో నిలబెట్టేలా చేసింది.ఇది ఆయన రికార్డు..ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్లతో పాటు లోనావాల నైట్ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్ మారథాన్ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్‌ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్ మారథాన్లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.వచ్చే ఏడాది బోస్టన్ మారథాన్‌కు..ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్‌ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న 130వ బోస్టన్ మారథాన్‌కు అర్హత సాధించారు. భారత్ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలవనున్నారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..) -
కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?
ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు. తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్‌కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం. ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్‌కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. యాత్ర సాగిన విధానం..బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్‌ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.అనధికారిక సరిహద్దు పాయింట్లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి. ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్‌బైజాన్‌కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్‌లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు. అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు. చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..) -
క్రిటికల్ కేర్ తక్షణ.. రక్షణ!
‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్‌లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్‌లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్‌కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్‌లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.క్రిటికల్ కేర్కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు. ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్‌ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్‌లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్‌ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తారు.అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు ఒక పేషెంట్స్‌కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్‌తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్‌కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్‌కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్‌తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా... దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్‌కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్‌ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్‌కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్‌ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్‌స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి. ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్‌ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్‌కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్‌కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్‌గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్‌తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్‌లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.ఇదో టీమ్ స్పిరిట్‌తో కూడిన ప్రక్రియఅత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్‌లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్‌గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్‌స్పిరిట్‌తో పేషెంట్‌ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...? సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్‌లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్‌కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం. -
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్‌తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్‌తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్‌గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్‌లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్‌తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్‌కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్‌కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్‌కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్‌తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్‌ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది. -
పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..
ఫర్నీచర్ అనగానే చాలామటుకు ప్లాస్టిక్ ఏదో రూపంలో వినియోగిస్తున్నాం. ముఖ్యంగ కుర్చీలు, సోఫాసెట్ల వరకు అన్నింట్లో ప్లాస్టిక్ మయం. కాస్త డబ్బులు బాగా ఉంటే..మంచి వుడ్‌తో చేసిన ఫర్నీచర్ ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఖరీదు కూడా. ఇలా అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్ ఫర్నీచర్‌కి అడ్డుకట్ట వేసేలా ముంబైకి చెందిన దంపతులు విన్నూతన ఆవిష్కరణకు తెరలేపారు. భూమాతకు హానికరం కానీ మట్టిలో కలిసిపోయే ఫర్నీచర్‌ని అన్వేషించి మరి సరికొత్త ఆవిష్కరణకు పూనుకుని అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు ఆ ఫర్నిచర్‌ని ఏవిధంగా తయారు చేశారంటే..మష్రూమ్‌తో ఫర్నిచర్ డిజైన్‌కి శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన భక్తి లునావత్, సుయాష్ సావంత్ దంపతులు. 2010లో ముంబైలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్లో ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇద్దరూ బార్సిలోనాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియా (ఐఏఏసీ)కి పై చదువుల కోసం వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇద్దరి వేర్వేరు మార్గాల్లో పయనించారు. భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్‌తో కలిసి పనిచేస్తే.. సుయాష్ లిస్బన్లో ప్రాక్టీస్ చేశాడు. కానీ.. ఇద్దరూ 2022లో తిరిగొచ్చి ముంబైలో కలుసుకున్నారు. అదే సంవత్సరం వాళ్లు 'అనోమాలియా' పేరుతో స్టార్టప్ పెట్టారు.సాధారణంగా కన్స్ట్రక్షన్, డిజైన్ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు వస్తుంటాయి. వాటిని తగ్గించే మార్గాల కోసం ఇద్దరు అన్వేషించారు. వారిద్దర్ని కలిపింది కూడా ఆ ఆలోచనే. అప్పుడే వాళ్లు మైసిలియం రీ జెనరేటివ్, సర్క్యులర్ నేచర్ గురించి తెలుసుకున్నారు. దాంతో ఫర్నిచర్ తయారుచేస్తే లైఫ్ స్పాన్ పూర్తి కాగానే బయోడీగ్రేడ్ అవుతుంది. అంటే నేచర్‌లో కలిసిపోతుంది. ఇతర ఫర్నిచర్ మెటీరియల్స్‌లా భూమిపై పేరుకుపోదని గుర్తించారు.దీనిపై ప్రయోగాలు చేసేందుకు కరోనా టైం కలిసొచ్చింది. అప్పుడే వాళ్లు దీనిపై రీసెర్చ్, ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు కప్ కేక్ ట్రేల్లో మష్రూమ్స్‌ని పెంచారు. అవి తేలికగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అప్పటినుంచి వాటితో ఇటుకలు, పార్టిషన్స్, క్లాత్ తయారుచేశారు. చివరికి ఫర్నిచర్‌తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.ఇది పెరుగుతుందే గానీ..తయారవ్వదు..ఇప్పుడు వాళ్లు అనోమాలియాలో ఫర్నిచర్ తయారుచేయడం లేదు. పెంచుతున్నారు. అందుకే 'గ్రోన్ నాట్ బిల్ట్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. మైసిలియంని అగ్రికల్చర్ వేస్ట్‌తో కలిపి మాడ్యులర్ 'మైక్రోబ్లాక్‌లను' తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్‌ను తట్టుకోగలదు. ఈ బ్లాక్‌లను స్టూల్స్, టేబుళ్లు, అల్మారాలు.. ఇలా ఏ ఫర్నిచర్ తయారీలో అయినా వాడుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీంతో 'మైకోలైవింగ్' అనే మైసిలియం క్లాత్‌ని కూడా తయారుచేస్తున్నారు.మైసిలియం ఓవర్ గ్రోత్ దశలో ఉన్నప్పుడు దాని పొరని ఒలిచి, ప్రాసెస్ చేసి సీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. పెరిగిన మైసిలియం బ్లాక్స్‌ను కాల్చడం, ఎండలో ఆరబెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. దానికి తేనె తెట్టె మైనం, లైమ్ ప్లాస్టర్ లాంటి న్యాచురల్ కోటింగ్స్ వేస్తారు. వీళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్ 10 నుంచి 12 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఆ తర్వాత చెత్తలో వేస్తే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే ఈ పుట్టగొడుగులు పెంచడం అంత సులభం కాదు. అందుకు సవాళ్ల తోపాటు, ఓపిక చాలా అవసరం. ఆర్థికంగా కూడా ఈ స్థార్టప్ ప్రయాణం చాలా కష్టమే. ఇక భక్తి, సయాష్లు ఉద్యోగాలు చేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టేశారు. అలాగే దీనికి గోద్రేజ్ లాంటి ఫెలోషిప్స్, గ్రాంట్ల వల్ల కొంత ఆర్థికసాయం కూడా తోడైంది. అలా 2022లో అనోమాలియాను ప్రారంభించారు. మొదట్లో తమ ప్రొడక్ట్‌ని కొంటారో లేదో అని భయపడ్డారు. కానీ మూడేళ్లకే వాళ్ల ప్రొడక్ట్స్‌కి మంచి గుర్తింపు లభించింది. 2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ వేదికల్లో ఒకటైన వెనిస్ బిన్నెలేలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని ఎంవైసీఎల్ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైసిలియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేయాలని చూస్తున్నారు ఇద్దరూ. వాళ్ల సాయంతోనే వ్యర్థాలను సేకరించి పర్యావరణానికి మేలుచేసే ఫర్నీచర్ ఉత్పత్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు భక్తి, సుయోష్లు.(చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
సంచలన విజయం.. ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 101 వార్డులకు జరగిన ఎన్నికల్లో 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో తిరువనంతపురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి దక్కింది. అయితే మేయర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ రేసులో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగళం వార్డు నుంచి ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.మోదీ స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేరళలో తొలి మహిళా ఐపీఎస్‌గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాదస్పద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అనేక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ వస్తున్నారు. 2024, అక్టోబర్‌లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.లెక్చరర్ టు ఐపీఎస్శ్రీలేఖ తిరువనంతపురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్‌లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు సర్వీసులో చేరారు. మహిళలు పోలీసు ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.తల్లి ప్రోత్సాహంమహిళా ఐపీఎస్ అధికారిగా మొదటి పదేళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువతులు తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆనందం కలిగించే విషయమని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మహిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాను ఐపీఎస్ సాధించానని శ్రీలేఖ వెల్లడించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.'రైడ్ శ్రీలేఖ'చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు శ్రీలేఖ. తన పనితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు పనిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గానూ సేవలు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్‌కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణలో భాగంగా దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బట్టబయలు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వచ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.నిందితురాలికి చెంపదెబ్బకేరళ సంచలనం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్‌ను చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు శ్రీలేఖ. ఇలా కొట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ తన చర్యను సమర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒకరిని అప్పట్లో శ్రీలేఖ కలిశారు. తమకు ఈ గతి పట్టించిన దుర్మార్గులను పట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్టమని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేరకు నిందితురాలిని చెంపదెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంపదెబ్బ కొట్టనందుకు బాధ పడుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బహిరంగంగానే ప్రతిఘటించారు.చదవండి: సివిల్స్ విజేతల్లో ఎక్కువ మంది వారే!చిన్ననాటి స్నేహితుడే భర్తశ్రీలేఖ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సేతునాథ్ ఆమె చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా. 'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్‌కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్‌పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్‌ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్‌ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్‌లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్‌ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్‌కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..
వెర్రి వేయి తలలు.. అంటే ఇదేనేమో?!.. దీనికి తాజా ఉదాహరణే ఇది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భాగ్యనగరంలో గడిపింది కేవలం కొన్ని గంటలే. ఆయన పర్యటన శంషాబాద్ విమానాశ్రయం–తాజ్ ఫలక్‌నుమ–ఉప్పల్ స్టేడియం మధ్యే జరిగింది. అయినప్పటికీ మెస్సీతో వేల మంది ఫొటోలు దిగారు. కొందరైతే తాము వండిన వంటల్నీ ఆ ఆటగాడికి రుచి చూపించారు. మరికొందరు ఫుట్‌బాల్‌తో పాటు ఇతర ఆటలు సైతం మెస్సీతో ఆడించేశారు. వీటిని సంబంధించిన ఏఐ ఫొటోలు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ కల్పిత ఫొటోల హడావుడి నేపథ్యంలో నిజంగా మెస్సీతో ఫొటో దిగిన వాళ్లు తమ ప్రత్యేకతను చాటుతూ పోస్టు చేయలేని, చేసినా నమ్మలేని పరిస్థితి నెలకొంది. సామాజిక మాధ్యమాల రాకతో ప్రతి ఒక్కరూ గ్లోబల్ ప్లాట్ఫామ్లో భాగస్వాములయ్యే అవకాశం దక్కింది. దీంతో పాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ వంటి మాధ్యమాల రాకతో నిజానికి, అబద్దానికి మధ్య తేడా గుర్తించడం సామాన్యులకు కష్టమైన పరిస్థితిగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా, ఆనందంగానూ అనిపిస్తుంటి.. మరికొన్ని బాధను కలిగించే పోస్టులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అదే అర్జంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ఫొటోలు. మెస్సీతో మేముసైతం.. మెస్సీ హైదరాబాద్ టూర్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ తదితరాలకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే అప్డేట్ వచ్చింది. అయితే మూడు రోజుల క్రితం వరకు ఏఐ చిత్రాల హడావుడి సోషల్‌మీడియాలో కనిపించలేదు. ‘మెస్సీతో సెల్ఫీ దిగడానికి రూ.10 లక్షలు చెల్లించాలి.. అది కూడా కేవలం వంద మందికి మాత్రమే అవకాశం’ అంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఈ ఏఐ చిత్రాల ప్రతిసృష్టి ప్రారంభమైంది. తాము మెస్సీ వద్దకు వెళ్లి, రూ.10 లక్షలు చెల్లించి ఫొటో ఎందుకు దిగాలంటూ కామెంట్స్ చేస్తున్న సిటిజనులు ఆ ఫుట్‌బాల్ దిగ్గజంతో రూపొందించిన ఏఐ చిత్రాలను తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్టు చేస్తూ మెస్సీనే వారి వద్దకు వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంగా, విచిత్రంగా.. ఉప్పల్ స్టేడియంలో ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా కీడ్రాభిమానుల సోషల్‌మీడియా ఖాతాలన్నీ సంబంధిత ఫొటోలతో నిండిపోతాయి. స్పోర్ట్స్ టీషర్టులు, ముఖానికి రంగులతో స్టేడియం లోపల, చుట్టుపక్కల దిగిన ఫొటోలను పోస్టు చేస్తుండటం పరిపాటే. మెస్సీ టూర్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ‘సెల్ఫీ–రూ.10 లక్షల’ అంశంతో వీటితో పాటు ఏఐ చిత్రాలూ సోషల్‌మీడియా ఖాతాలను ముంచెత్తాయి. కొందరు మెస్సీని స్టేడియంలోని తమ గ్యాలరీల్లోకి వచ్చి, తమతో ఫొటోలు దిగినట్లు సృష్టిస్తున్నారు. మహిళలు, యువతులైతే మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా మెస్సీని నేరుగా తమ ఇళ్లకే తీసుకెళ్లిపోయారు. హాలు, వంటిల్లు అన్న తేడా లేకుండా కూర్చోబెట్టి బిర్యానీ, పులిహోర తినిపిస్తున్నట్లు, వండిస్తున్నట్లు కూడా ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్‌మీడియాల్లో పోస్టు చేశారు. ఆడించి.. ఓడించి.. సిటీ టూర్లో భాగంగా మెస్సీ–సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్, సింగరేణి ఆర్ఆర్–9 జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు, ప్రముఖులు, యాంకర్లతో కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 50 మంది కూడా పాల్గొనలేదు. అయితే సోషల్‌మీడియా వేదికగా మాత్రం మెస్సీ లక్షల మందితో ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్‌తో పాటు కబడ్డీ కూడా ఆడేశాడు. ఆయన తమతో ఆయా ఆటలు ఆడినట్లు, ఆడలేక ఓడినట్లు ఏఐ చిత్రాలను సృష్టించిన నెటిజనులు సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. కొందరైతే చారి్మనార్, గోల్కొండ, ఫలక్‌నుమ ప్యాలెస్ వద్ద మెస్సీతో కలిసి హైదరాబాద్ చాయ్ తాగుతున్నట్లు, ఆయనే ఫాస్ట్‌ఫుడ్ తయారు చేస్తున్నట్లు సృష్టించారు. ఈ ఏఐ ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన వారిలో సమాన్యులే కాదు.. కొందరు ప్రముఖులు, నాయకులు, యాంకర్లు సైతం ఉండటం గమనార్హం. (చదవండి: ఆ దేశంలో న్యాప్ కేఫ్‌లు ఉంటాయి!) -
శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు
శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో 328 , సన్నిధానంలో 302 తనిఖీలు పూర్తయ్యాయి.పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై 6 కాంపౌండ్ ఫుడ్ నోటీసులు, 21 సవరణ నోటీసులు జారీ చేశారు. సన్నిధానంలోని 24 సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా , కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంస్థల నుంచి రూ.30,000 జరిమానా వసూలు చేశారు.పంబ, సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో 69 ఆహార నమూనాలు, సన్నిధానంలో 62 ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.ఆహార భద్రతకు సంబంధించిన టోల్ - ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. కాగా, సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం తోపాటు ఇటీవల అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలున్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహారభద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
ఆ దేశంలో న్యాప్ కేఫ్‌లు ఉంటాయి!
దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్‌లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.ఫిబ్రవరి మాసంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి. క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్‌ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ. View this post on Instagram A post shared by Santosh Jha (@career_first_) (చదవండి: వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్) -
వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్
ఇప్పుడంటే...ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్‌లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్కు సంబంధించిన పోస్టర్లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్‌లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్కు సంబంధించిన అద్భుత పోస్టర్ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్‌లోని ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...1920లలో...మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.అలా మొదలైంది...దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోస్టర్లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్టైజ్మెంట్. అద్భుతమైన లేఔట్‌తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్‌ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.కళాత్మక విలువలునవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్‌ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.ఆ కాలానికి స్వాగతంఅలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్‌లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. -
పర్యాటకం: ఫ్లెమింగో! పింక్ సీజన్..ఫుల్ స్వింగ్..!
పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ నేలంతా పరుచుకున్న పచ్చదనం చూసి ముగ్దులవుతుంటాం. కానీ, ఈ సీజన్లో ప్రత్యేకంగా నేలంతా గులాబీ రంగుపరుచుకున్నట్టుగా.. అలల్లా ఎగిసిపడుతున్న ఆ అందం చూడాలంటే మన దేశంలోనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వీకెండ్లో ఈ పింక్ సీజన్.. మీలో ఫుల్ స్వింగ్‌ను ఇట్టే తెచ్చేస్తుంది. అతిథులుగా విచ్చేసి, సందడి చేస్తున్న పింక్ ఫ్లెమింగోలు బారులు బారులుగా తేరు కట్టి, తీరుగా మనల్ని అలరిస్తున్నాయి. ఆ అందాల ఆనందాన్ని తిలకించడానికి ముందుగా ముంబై మీదుగా ప్రయాణిద్దాం... భారతదేశంలో అధికారికంగా ఫ్లెమింగో సీజన్ వచ్చేసింది. పిలవకుండా వచ్చే ఈ శీతాకాలపు అతిథులు ముంబైతోపాటు నవీ ముంబైలలోని కొన్ని బెస్ట్ సైట్ సీయింగ్ ఫ్లెమింగో ప్రదేశాలు ఉన్నాయి. పొడవాటి కాళ్ళు, వంగిన మెడలు, విలక్షణమైన కిందికి వంగిన ముక్కులతో సొగసైన ఈ నీటి పక్షులు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను గులాబీ రంగుతో చిత్రించడం ప్రారంభించాయి. ప్రతి యేటా అక్టోబర్ చివరి నుండి మే మొదటి వారం వరకు ఫ్లెమింగోలు భారతదేశానికి వలస వస్తుంటాయి. ఫిబ్రవరి నుండి మార్చి వరకు వీటి సంఖ్య గరిష్టస్థాయిలో ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ కొంచెం పెరగడంతో ఈ పక్షుల రాకలో కొంచెం ఆలస్యం జరిగిందని పక్షి పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, ఈ అద్భుతమైన పక్షుల మొదటి గుంపు ముంబై, నవీ ముంబై అంతటా ఐకానిక్ ప్రదేశాలలో వచ్చి చేరాయి. దీంతో వీక్షకుల ఉత్సాహం మిన్నంటుతోంది. థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంపక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామమే. ఈ అభయారణ్యం ఐరోలి, వాషి మధ్య విస్తరించింది. ఉల్హౌస్ నది సల్సెట్ ద్వీపం ఈశాన్య మూలలో రెండు ఉపనదులుగా విడి΄ోతుంది. మరొకటి వాసాయి క్రీక్. ఈ రెండూ అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి. క్రీక్ సాల్సెట్ ద్వీపం తూర్పు సరిహద్దును ఏర్పరచడం, కొంకణ్ ప్రధాన భూభాగం నుండి ద్వీపాన్ని వేరు చేస్తుంది. దీనినే థానే క్రీక్ అంటారు. ఈ ్ర΄ాంతం వివిధ ఏవియన్ జాతులకు నిలయంగా ఉండటంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ముఖ్యమైన పక్షి ప్రాంతంగా గుర్తించబడింది. ముఖ్యంగా ఇది ఫ్లెమింగోలు, అనేక ఇతర వలస, నీటి పక్షుల జనాభాకు నిలయంగా ఉంది. ఫ్లెమింగోలను దగ్గరి నుంచి వీక్షించడానికి కోస్టల్ – మెరైన్ బయోడైవర్సిటీ సెంటర్ నుండి ప్రసిద్ధ బోట్ సఫారీ ఉంది.సేవిరి మడ్ ఫ్లాట్స్ ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ΄ోషకాలతో కూడిన బురద ఫ్లాట్లు వేలాది ఫ్లెమింగోలను ఆకర్షిస్తాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇక్కడ గైడెడ్ వాక్‌లు మరియు ఫ్లెమింగో–వాచింగ్ ఈవెంట్లను నిర్వహిస్తుంది.భండప్ పంపింగ్ స్టేషన్తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేకి దూరంగా ఉన్న ఈ క్రీక్సైడ్ స్పాట్ పక్షులను చూసేవారికి, ముఖ్యంగా సూర్యోదయ– సూర్యాస్తమయ సమయంలో చాలా ఇష్టమైనది. ఈ ప్రాంతం మడ అడవులతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల నీటి బాతులు, వలస పక్షులను ఆకర్షిస్తుంది.డీపీఎస్ ఫ్లెమింగో సరస్సుఇప్పుడు నవీ ముంబైలోని నెరుల్ ప్రాంతంలో ఒక పరిరక్షణ అభయారణ్యం, ఈ సరస్సు సూర్యోదయం– సూర్యాస్తమయ సమయాలలో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది ఫొటోగ్రాఫర్ల కంటికి కళల దృశ్యమై కనువిందు చేస్తుంది. ఇది నగరంలో ప్రశాంతమైన ప్రదేశం, ప్రకృతి నడకలు, పక్షుల ఫోటోగ్రఫీకి అనువైనది.కరావే ఫ్లెమింగో పాయింట్నవీ ముంబైలోని సీవుడ్స్లో టీఎస్ చాణక్య సమీపంలో, సుందరమైన వెట్ల్యాండ్స్లో నడుస్తూ ఫ్లెమింగోలను చూడొచ్చు. ప్రశాంతమైన పరిసరాలు, కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు, పర్యావరణ పర్యాటకానికి గొప్ప ప్రదేశంగా మారాయి. ఫ్లెమింగో గుంపులను దగ్గర నుంచి చూసేందుకు సీజనల్ బోట్ రైడ్లు అందుబాటులో ఉంటాయి.భిగ్వాన్లోని ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్స్తరచుగా మహారాష్ట్ర భరత్పూర్ అని పిలువబడే భిగ్వాన్ పక్షి ప్రేమికులకు అంతగా తెలియని రత్నం. పూణే సమీపంలోని యశ్వంత్ సాగర్ జలాశయం ఫోటోగ్రాఫర్లకు మరొక హాట్‌స్పాట్.కర్నాల పక్షుల అభయారణ్యం ముంబైకి సమీపంలో ఉన్న ఈ అభయారణ్యం ట్రెక్కింగ్ ట్రైల్స్, ఇతర వలస జాతులతో పాటు ఫ్లెమింగోలను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చారిత్రాత్మక కర్నాల కోటకు నిలయం. అంతేకాదు, పక్షులను చూడటానికి గొప్ప ప్రదేశం.నందూర్ మధమేశ్వర్ పక్షుల అభయారణ్యం : నాసిక్‌లోని ఒక ముఖ్యమైన చిత్తడి నేల ఇది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు అనువైనది. ఈ అభయారణ్యం రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది, శీతాకాలంలో వేలాది వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది. ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకునే వారికి కోయ్నా వన్యప్రాణుల అభయారణ్యం, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌తోపాటు మహారాష్ట్ర నేచర్ పార్క్‌లను కూడా సందర్శించవచ్చు. ఫ్లెమింగోలను చూడటం అనేది కేవలం దృశ్యాలను వీక్షించే కార్యక్రమం కాదు. వేగవంతమైన ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉండే అందమైన, ఆహ్లాదకరమైన దృశ్యాలను మనసులో ముద్రించుకోవచ్చు. నిశ్శబ్దంలో నీటి అలలు, తెల్లవారుజామున ఆకాశంలో మెత్తటి రెక్కల శబ్దంలో నవీ ముంబై విలువైన అరుదైన సహజ విహారయాత్రను అందిస్తుంది.సూర్యోదయం–సూర్యాస్తమయాలు అత్యుత్తమం...ఉదయం 7 నుండి 9 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 4 నుండి 6 గంటల మధ్య, పక్షులు చురుకుగా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ విహరించవచ్చు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.50, గైడెడ్ బోట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.500..పడవ ప్రయాణానికి..ఈ ప్రదేశాలలో స్థానిక మత్స్యకారులు నేచర్ లవర్స్‌కి సూర్యోదయ పడవ ప్రయాణాలను అందిస్తారు. పక్షులకు దాణా వేయడం, వాటిని అందుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు ఎగరడం.. ఆహ్లాదంగా అనిపించే ఉదయాలే దీనికి ఉత్తమ సమయం. అభయారణ్యం వెలుపల పడవ ప్రయాణాలు సాధారణంగా ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పడవ ప్రయాణానికి సీజన్, వ్యక్తుల సమయాన్ని బట్టి వ్యక్తికి రూ.900 – రూ.1,500 మధ్య ఖర్చవుతాయి.ఇలా చేరుకోవచ్చు...హైదరాబాద్ ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి రెండు గంటల విమాన ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. తరువాత రైలు లేదా టాక్సీ ప్రయాణం ద్వారా నవీ ముంబైకి వెళ్లచ్చు. వాషి, నెరుల్, సీవుడ్స్లో వసతి సదుపాయం లభిస్తుంది.మన దేశానికి అరుదెంచే వలస పక్షుల సమయాలు...పింక్ ఫ్లెమింగోలు శీతాకాలంలో దాదాపు నవంబర్ నుండి మే వరకు భారతదేశానికి వస్తాయి. జనవరి నుండి మార్చి వరకు విస్తృతంగా సందడి చేస్తాయి. ఫ్లెమింగో సీజన్ మాత్రం నవంబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. కాక΄ోతే వాటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ సీజన్లో నివాసి లెస్సర్ ఫ్లెమింగోలు, వలస వచ్చిన గ్రేటర్ ఫ్లెమింగోలు రెండూ కనిపిస్తాయి. ట్రావెల్ ట్రెండ్స్జెన్ ఏఐ వోవర్ అడ్మిన్ రాబోయే కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగబోతోంది. ప్రయాణికులు ఇప్పటికే ట్రావెల్ ప్లాన్, బుకింగ్‌ల కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ కూడా రంగంలోకి దిగడంతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులువు అయింది. ప్రయాణాలకు సంబంధించి ఏఐ సాంకేతికతను వాడుకోవడానికి సంబంధించి మంచితోసాటు చెడు కూడా ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఆల్గోరిథమిక్ సిఫారసులు వోవర్ టూరిజానికి కారణం అవుతాయని, ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రయాణానికి సూచిస్తాయని, ట్రావెల్ స్కామ్స్ జరగడానికి కూడా అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘ప్రయాణాల కోసం ఏఐ సాధనాలను వాడుకోవడానికి సంబంధించి ఎన్నో పరిమితులు ఉన్నాయి’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మీన్ బినా.ఇతర రాష్ట్రాలలోనూ...మహారాష్ట్రలోని చిత్తడి నేలలు, సరస్సులతోపాటు గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్, ఒడిశాలోని చిలికా సరస్సు వంటి తీర్ర΄ాంతాలలో ఫ్లెమింగోలు అద్భుతమైన అందాలలో కనువిందు చేస్తాయి. మహారాష్ట్రలో భిగ్వాన్ ‘దక్షిణ భారత్పూర్‘ అని పిలుస్తారు, ఉజాని ఆనకట్ట బ్యాక్ వాటర్ ఫ్లెమింగో గుంపుకు ప్రసిద్ధి చెందింది.గుజరాత్లో...అతిపెద్ద లెస్సర్ ఫ్లెమింగో బ్రీడింగ్ గ్రౌండ్ (ఫ్లెమింగో సిటీ) కు నిలయం. నల్ సరోవర్, థాల్ లేక్ పక్షుల కేంద్రం, ఖిజాదియా పక్షుల అభయారణ్యంలో శీతాకాలంలో ఫ్లెమింగోలు పుష్కలంగా కనువిందు చేస్తాయి. చేరుకోవడానికి ప్రయాణ మార్గం...విమానంలో... హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఎయిర్ ΄ోర్ట్ నుంచి అహ్మదాబాద్ లేదా జామ్ నగర్‌కు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి నల్ సరోవర్, థాల్ ్ర΄ాంతాలకు కారు లేదా లోకల్ ట్రైన్లో చేరుకోవచ్చు. కచ్‌కు విమానంలో లేదా రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకొని తర్వాత రాన్‌కు ప్రయాణించవచ్చు. రాజస్థాన్సాంబార్ సరస్సు ఫ్లేమింగోలకు శీతాకాలపు విడిది ప్రదేశం. హైదరాబాద్ నుండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది సాంబార్ లేక్. విమానం /రైలు మార్గాల్లో వయా జైపూర్‌కు చేరుకొని వెళ్లాలి. రైలు మార్గంలో నాగ్‌పూర్, ఫులేరా కు చేరుకోవచ్చు. ఒడిశాభారతదేశంలోని అతిపెద్ద తీర్రప్రాంత సరస్సు అయిన చిలికా సరస్సు వేలాది మందిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ నుంచి చిలికా సరస్సు రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్లైట్/ ట్రెయిన్/ బస్ మార్గాల ద్వారా విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా చేరుకోవచ్చు. భువనేశ్వర్‌కి విమానంలో వెళ్లి అక్కణ్ణుంచి టాక్సీ లేదా ట్రెయిన్ ద్వారా సరస్సుకు చేరుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?
వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్లో టీ హంటర్స్‌గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లో ఈ సీజన్లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన. శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్‌గా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్‌పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది. అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
జీవన నావకు స్నేహ సారథి
ఆపదలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. యుద్ధంలో ధైర్యం చూపించేవాడే అసలైన వీరుడు. దానగుణం కలవాడే నిజమైన ధనవంతుడు. పేదరికంలోనూ పక్కన నిలబడేదే ఉత్తమ భార్య. కష్టాల్లో ఆదుకునేవారే నిజమైన బంధువులు. నిజమైన గుణగణాలు కష్ట సమయాలలోనే బయటపడతాయి. సుఖంలో నవ్వు పంచుకున్నవారంతా స్నేహితులు కారు; కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేవాడే కల్మషం లేని బంధువు అని ఇది స్పష్టం చేస్తుంది. వారిచ్చే మానసిక ధైర్యం, ఆపత్కాలంలో మనకు పెద్ద ఆసరా.జీవితం ఓ అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాలలోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేసి, దుఃఖాన్ని అర్థం చేసుకుని, భారంగా ఉన్నప్పుడు భుజం తట్టి, విజయాలను ఉత్సాహంగా పంచుకుని, వైఫల్యాలలో ఓదార్పునందించే అమృత భాండం. జీవితంలోని ప్రతీ మైలురాయి వద్ద తోడు నిలిచే స్నేహం, కాలంతో పాటు మరింత గాఢమవుతుంది. స్నేహం లేని జీవితం, రంగులు లేని చిత్రలేఖనంలా, సంగీతం లేని రాగంలా వెలవెలబోతుంది.స్నేహం – జీవన గీతంమన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. శ్రీ కృష్ణుడు, కుచేలుడు; రాముడు, సుగ్రీవుడు వంటి అనన్య స్నేహ బంధాలు మన ఇతిహాసాలలో నిబిడీకృతమై ఉన్నాయి. భగవద్గీతలో సైతం స్నేహితుని పట్ల ఉండాల్సిన ఆత్మీయత, త్యాగ భావన పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి.‘న మిత్రార్థే పరిత్యజేత్ ప్రియమాత్మానమాత్మనః’. అంటే స్నేహితుడి కోసం తన ప్రియమైన ఆత్మను కూడా త్యజించకూడదు (అంటే, తన ఉనికిని కోల్పోకుండానే స్నేహితునికి ఎంతటి సహాయమైనా చేయాలి). ఇది స్నేహం తాలూకు ఉన్నతమైన ఆత్మార్పణ భావనను తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు మన ఎదుగుదలకు తోడ్పడతాడే తప్ప, మన అస్తిత్వాన్ని హరించడు. స్నేహం పేరుతో ఒకరిపై ఒకరు ఆధారపడటమో, బలహీనతలను ఆసరాగా తీసుకోవడమో కాకుండా, ఇరువురూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే పరస్పరం శక్తిగా మారతారని ఈ సూక్తి తెలియజేస్తుంది.కష్టసమయాల్లో మనం కృంగి΄ోకుండా, మనలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది పరస్పర గౌరవం, నమ్మకం, నిస్వార్థ ప్రేమల కలయిక.‘దద్యాత్ దద్యాన్న దద్యాత్ ఖలు మిత్రస్య మిత్రః సదా ప్రార్థనాశీలో న మిత్రం స్యాత్ సదా ప్రార్థనాశీలః.‘అనగా... ఇచ్చేవాడు స్నేహితుడు, కానీ ఎప్పుడూ యాచించేవాడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహం ఇవ్వడం, తీసుకోవడం అనే సమతుల్యతతో కూడుకున్నదని ఈ సుభాషితం తెలుపుతుంది. స్నేహంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడమే గొప్పతనం. నిరంతరం ఏదో ఒకటి ఆశించే వ్యక్తి, నిజమైన స్నేహితుడు కాలేడు. స్నేహం అనేది త్యాగం, నిస్వార్థ ప్రేమల పునాదులపై నిర్మితమైన గొప్ప అనుబంధం. ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, స్నేహ మాధుర్యం దాగి ఉన్నాయి.జీవిత గమనంలో స్నేహితుల చేయూత ఎల్లప్పుడూ తోడుగా నిలిచి, ప్రతీ అడుగులోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతుంది. మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అమూల్యమైన స్నేహ బంధాలను పదిలంగా కాపాడుకుంటూ, ప్రతిరోజూ ఆనందాన్ని, శక్తిని పొందుదాం.నిజమైన స్నేహితుడు మనకు లభించిన ఒక వరం. అటువంటి స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి అసలైన సంపద. మనసులోని మాటను పంచుకోవడానికి, ఆశలను, కలలను సాకారం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహం కంటే గొప్ప ఔషధం లేదు.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..
సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: శబరిమలలో మరో అపచారం) -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్‌చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్‌ఎహెచ్‌ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్‌లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్‌మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్‌గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
శీతాకాలంలో ముఖం మెరుస్తూ ఉండాలంటే..!
ముఖంపై బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, నల్లటి మచ్చలు లేకుండా కాంతిమంతంగా ఉండాలంటే ఈ డివైజ్ బెస్ట్. అలాగే శీతాకాలంలో ముఖం వడిలిపోకుండా తాజాగా ఉండాలంటే మాత్రం ఈ సింపుల్ టిప్ ఫాలో అయ్యిపోండి చాలు..మరి సులభమైన చిట్కాలు, హెల్ప్ అయ్యే బ్యూటీ డివైజ్‌ల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, నల్లటి మచ్చలు, గీతలు, మొటిమలు ఇవి ముఖాన్ని కళావిహీనంగా మారుస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చెయ్యడానికి ఇప్పుడు సాంకేతికత బాగానే తోడవుతోంది. చిత్రంలోని ఈ స్కిన్ క్రష్ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్ – చర్మాన్ని మెరిపించడానికి రూపొందించిన ఒక అధునాతన సాధనం. ఈ డివైస్‌తో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మం పైపొర నుంచి నిర్జీవ కణాలను ఇట్టే తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత నునుపుగా, తాజాగా మారుతుంది. నిగారింపుకు రాసే సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేసుకునే సమయంలో కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.ఈ మెషిన్‌తో పాటు చాలా హెడ్స్ లభిస్తాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. నిజానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా తేలిక. మొదటగా చర్మాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత, చర్మాన్ని కొద్దిగా సాగదీస్తూ ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి, పైకి లేదా వెలుపలి దిశలో నెమ్మదిగా కదిలించాలి. దీనిలో ఆన్, ఆఫ్‌తో పాటుగా ‘లో, మీడియం, హై’ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే, మీడియం మోడ్ సౌకర్యంగా అనిపిస్తేనే, హై మోడ్ పెట్టుకోవచ్చు. చర్మం ఎర్రబడినా, మంటగా అనిపించినా వెంటనే దీని వాడకం ఆపెయ్యడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా సీరమ్ రాసుకోవాలి. మంచి ఫలితాల కోసం, దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. అయితే, ఈ చికిత్స తర్వాత 24 గంటల పాటు లేదా చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ‘విటమిన్ ఏ’ లేదా రెటినోల్స్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకూడదు.మెరుపునిచ్చే చిట్కాశీతకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మం వడిలిపోయినట్లు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. పొడి చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి, ఇలా ప్రయత్నిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ బాదం పేస్ట్ (4–5 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసుకోవాలి.), 2 టీస్పూన్లు చిక్కటి పచ్చి పాలు, 4 చుక్కల గ్లిజరిన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 15 లేదా 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి. ప్యాక్ తొలగించిన తర్వాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఎందుకంటే బాదంలో విటమిన్–ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి చర్మానికి చక్కటి పోషణనిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తూ, తేమగా ఉంచుతాయి. అలాగే గ్లిజరిన్ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. దాంతో వారానికి ఒకసారి ఈ మాస్క్ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..!
చెట్టును కావలించుకుని ఉండి ప్రపంచ రికార్డు స్థాపించింది. కెన్యాలో అడవుల నరికివేతపై అందరి దృష్టి పడేలా ఆమె ఈ నిరసన తెలియచేసింది. ప్రజలు ఆమె మద్దతుకు తండోప తండాలుగా కదిలి వచ్చారు. కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని నాలుగు రోజుల క్రితం ఒక చెట్టును పట్టుకుని నిలబడిపోయింది. 72 గంటల పాటు ఆ చెట్టును వదలకుండా ఉంది. నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. కాలకృత్యాల కోసం కూడా అతి తక్కువ సమయమే తీసుకుంది. ఒక దశలో వాటి అవసరమే రాలేదు. 72గంటల పాటు ఆమె చేస్తున్న నిరసనను ఆన్లైన్లో సోషల్ మీడియాలో జనం చూశారు. చాలామంది నేరుగా వచ్చి చూశారు. మరెంతో మంది దశలు దశలుగా చూస్తూ ఉండిపోయారు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. జనం చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచి 72 గంటల తర్వాత నిరసనను ముగించేలా చూశారు. ముతోని గతంలో కూడా ఇలాగే 48 గంటల పాటు చెట్టును కావలించుకుని ఉండిపోయి రికార్డు స్థాపించింది. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇది గిన్నెస్ రికార్డు అని పరిశీలకులు భావిస్తున్నారు. ‘నేను ఈ పని ప్రచారం కోసమో, డబ్బు కోసమో చేయడం లేదు. నాలాంటి యువతీ యువకులు పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని చేస్తున్నాను. నన్ను చూసి ఏ మూల ఏ ఒక్కరైనా ఒక్క చెట్టు నాటినా నా నిరసనలోని ప్రతి సెకండ్ సద్వినియోగం అయినట్టే భావిస్తాను’ అని నిరసన ముగించాక ముతోని మీడియాతో అంది. ఈ 72 గంటలలో ఒక రాత్రి భారీగా వాన పడింది. అయినా ముతోని చలించలేదు. చెట్టును కరుచుకుని ఉండిపోయింది. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో స్పందన వచ్చింది. కెన్యాలో అడవుల నరికివేత మాత్రమే కాదు మృగాల సంహారం కూడా సాగుతూ ఉన్న దరిమిలా ఈ నిరసన ఏ మార్పుకు కారణమవుతుందో చూడాలి.(చదవండి: మట్టితో... ఫేస్‌మాస్క్‌లు) -
మట్టితో... ఫేస్‌మాస్క్‌లు
సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్‌తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు. అలాంటి మాస్కులకు అస్సాంలోని మాజూలీ ప్రసిద్ధిగాంచింది. శ్రీమంత శంకరదేవుల వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన సంప్రదాయ మాస్క్‌లు ప్రసిద్ధికెక్కాయి. ఈ మాస్కుల తయారీ కళ 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. వారసత్వ కళగా ఉన్న ఈ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం వారధిగా నిలిచింది. మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఈడీపీ)లో భాగంగా కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధిబాట పట్టించింది. వారి వారసత్వ కళను ప్రోత్సహించి వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటు చేసింది. కళాకారుల కుటుంబాల్లోని మహిళలతో స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ)గా ఏర్పాటు చేసింది. పదిహేను మంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇలా రెండు బృందాలు ఈ మాస్కులను తయారు చేస్తున్నాయి. సహజసిద్ధ రంగులతో తయారు చేసే ఈ మాస్కులను బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయించడమే కాకుండా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టింది. వీటికి గతేడాది మార్చిలో జీఐ ట్యాగింగ్(భౌగోళిక గుర్తింపు)ను ప్రభుత్వం ఇచ్చింది.సహజసిద్ధ సరుకుతో...అస్సాం రాష్ట్రంలోని మాజూలీ ద్వీపంలోని కళాకారులు ఈ ఫేస్ మాస్కులను తయారు చేస్తున్నారు. వెదురు కర్ర ముక్కలు, బ్రహ్మపుత్ర నదీలో లభించే బంక మట్టి, ఆవుపేడ, జూట్, పేపర్, కాటన్‌తో ఈ మాస్కులు తయారు చేస్తారు. ముందుగా తయారు చేసే ముఖ ఆకృతిని వెదురు ముక్కలతో ఫ్రేమ్ మాదిరి తయారు చేసి వాటికి బంకమట్టి, ఎండిన ఆవుపేడ పొడి కలిపిన మిశ్రమంతో ఆ ఫ్రేమ్‌పైన పూతలా అద్దుతారు. ఈ ప్రక్రియలో జూట్, పేపర్, కాటన్‌ను అనువైన రీతిలో వినియోగిస్తారు. ఈ నమూనా పూర్తిగా ఎండిన తర్వాత వాటికి అవసరమైన రంగులు అద్దుతారు. ప్రస్తుతం సూరత్ నుంచి దిగుమతి చేసుకునే రంగులను వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వినియోగం ఖరీదవుతుందని, త్వరలో ఈ రంగులను స్థానికంగా తయారు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వీటినే వినియోగిస్తామని వాటిని తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ మాస్కులు మూడు రకాల పరిమాణంలో ఉంటాయి. మొదటి రకం కేవలం మొహాన్ని మాత్రమే కవర్ చేస్తుండగా... రెండో రకం నటుడి శరీరంలో మెజార్టీ భాగాన్ని కవర్ చేస్తుంది. మూడో రకం మాత్రం అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేస్తారు. ఈ కళను పరిరక్షించి ఆధునీకరించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హేమ్చంద్ర గోస్వామి కృషి చేశారు. ప్రస్తుతం వీటిని నాటకాల్లో మాత్రమే వినియోగించకుండా పర్యాటకుల జ్ఞాపికలుగానూ, అలంకరణ వస్తువులగానూ వినియోగిస్తున్నారు.మార్కెట్లో ఇలా...కళాకారులు తయారు చేసే మాస్కులపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఒక్కో మాస్కుపైన రూ.100 పెట్టుబడి పెడితే చాలు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మహిళలు తయారు చేసే ఒక్కో మాస్కు కనీస ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. ఫేస్ మాస్క్ పరిమాణం ఆధారంగా వీటి ధర రూ.3వేల వరకు ఉంటుంది. ఈ మాస్కుల తయారీ ద్వారా మహిళా సంఘానికి నెలకు కనీసం రూ.50 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ తయారీ ప్రక్రియ ప్రారంభదశలో ఉండగా... రానున్న ఏడాదిలో ఆర్థిక స్థితి భారీగా వృద్ధి సాధిస్తుందని, ఈమేరకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మాజూలీ నుంచి– చిలుకూరి అయ్యప్ప, సాక్షి, (చదవండి: 'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్) -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్‌గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్‌జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్‌కాస్టర్‌తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా!
ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా ఆశ్చర్యపర్చవచ్చు లేదా మీరు అస్సలు నమ్మలేక పోవచ్చు. కాన్సెప్ట్ అలాంటిది. ఈ కథనంలో విషయం విన్న తరువాత ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తాను, చకచక చదివేయండి మరి..!. ఈ ఆధునిక సమాజంలో బంధం అనేది పిడికిలిలో ఉన్న మట్టి లాంటిది. ఎంత సేపు ఒడిసి పట్టుకున్నా వేళ్ళ సందుల్లోంచి జారిపోతాయి ఈబంధాలు. అటువంటి బంధాలకు సంబంధించినదే ఈ స్టోరీ. ఇటీవల ఓ సర్వే ప్రకారం మగవాళ్ల గురించి పెద్ద మార్కులే వేసింది. అది మార్క్ డీబుల్ సర్వే. దీని ప్రకారం 66శాతం మగవాళ్లు ఏకపత్నీవ్రతులుగా తేలారు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఓ సారి చూద్దాం. అసలు ముందు మార్క్ డీబుల్ అనేది డాక్టర్ మార్క్ డైబుల్ అనే సైంటిస్టు నుంచి పుట్టిన పేరు. ఆయన 2025లో *Proceedings of the Royal Society: Biological Sciences*లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మగవాళ్ళలో 66 శాతం ఏకపత్నీత్వ రేటు ఉంది. ఇది సాదా సీదా సర్వే కాదు, అంటే ఆయన ప్రపంచంలోని అన్నీ జీవచరాలలో ఉన్న మగజాతిపై చేసిన సర్వే. అసలు ఆయన ఈ సర్వే ఎలా చేశాడంటే.. ఏకంగా 11 జాతుల మామల్స్ తోపాటు 94 మానవ సమాజాల డేటాను వాడి, కంప్యూటేషనల్ మోడల్‌తో విశ్లేషించారు. ఈ సర్వే ప్రకారం ఏకపత్నీతత్వంలో ఏఏ జాతులు, ఏఏ ప్రాంతంలో ఉన్నాయో ఓ సారి చూద్దాం. టాప్‌లో కాలిఫోర్నియా ప్రాంతంలోని డీర్మౌస్ వందశాతంతో , ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ లు 85శాతంతో ఉన్నాయి. ఇక చివర్లో మౌంటైన్ గొరిల్లాలు 6శాతం చింపాన్జీలు 4శాతంగా ఉన్నాయి. అంటే వీటికి అచంలత్వం ఎక్కువ. ఇక మనుషులు 4 శాతం మాత్రం ఉన్నారు. భారతదేశంలో ఏకపత్నీత్వం సాంప్రదాయం ఎక్కువగా ఉండేది . కానీ ఓ బ్రిటిష్ సర్వే ప్రకారం ఆధునిక యువతలో 31శాతం దీన్ని అసాధ్యం అని చెబుతున్నారు.ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఏకపత్నీత్వం అనేది మన జీన్స్‌లో లేదు, సమాజంలో ఏర్పడింది. ఇది మనల్ని ఓ విధంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఆధునికంగా, జెన్ Zలో 50శాతం మంది మోనోగమీని అంటే ఏకపత్నీత్వం ఔట్‌డేటెడ్ అని చెబుతున్నారు – ఓపెన్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. మగవాళ్లు పాలిగినీకి అంటే ఒకరి కన్నా ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం పట్ల 6 రెట్లు ఆసక్తి చూపుతున్నారని మరో అధ్యయనం చెబుతుంది. అయితే మన తెలుగు సంస్కృతిలో "ఒక్కటి మంచిది" అనే సామెత ఉంది, కానీ ఈ డేటా మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది: మన సంబంధాలు ఎంత "నేచురల్" అనే ప్రశ్న పెరుగుతుంది.ఫ్రెండ్స్..ఒకరితో బంధం అంటే జీవితాంతం అది అనుబంధం అవుతుంది. అదే ఒకరి కన్న ఎక్కవైతే అది బంధాలకు అతీతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జీవితబంధమా లేక అతీతసంబంధమా అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి మరి..!. (చదవండి: 'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..ముఖ్యంగా భారతీయులే..) -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్‌లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్‌లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్‌జీపీటీతో ఇంగ్లిష్‌లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్‌లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్‌లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్‌లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్‌తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్‌ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్‌లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్‌లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
కార్తవీర్యార్జునుడి దత్తోపాసన
హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు. -సాంఖ్యాయన -
ఆయ్! నాకేం వద్దండీ!
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు. ‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్‌లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్‌కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్‌కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్‌గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది. ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది. అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు. ‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్‌రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్‌మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్‌లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్‌రావు కూడా తన చాంబర్‌కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు. ‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్‌రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్‌రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్‌కు వచ్చాడు భాస్కర్‌రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్‌కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్‌రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్‌రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్‌రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి. ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్‌రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు. ‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్‌రావు. అతని బ్యాగ్‌లోంచి బాక్స్‌లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్‌రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్‌రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్‌రావు. ‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు. ‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు. ‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్‌రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు. ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్‌రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్‌రావు. భాస్కర్‌రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్‌రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు. ‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి. ‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్‌రావు. తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్‌రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్‌రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్‌రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్‌రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు.నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. -
వైబ్ వావ్!
ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్‌తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!కూల్ పార్టీ!సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్‌లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్లెస్ కరవోకే మైక్‌తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్‌కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్‌లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్‌తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్‌లోనైనా పార్టీ మూడ్‌ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.స్పిరిట్ స్టార్ట్! ఐస్.. గ్లాస్లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్‌తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్‌లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!పాన్ చాట్కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగాకారం– ఒక టీ స్పూన్ , ఆమ్చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగాతయారీ: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.వెలుగుల బుడగలు!బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్‌తో మెరిసి, వేడుకకు రాక్‌స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!ఐస్ క్రీమ్ బర్గర్కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్‌క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్‌లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా బన్స్‌ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.అరటిపువ్వు సమోసాకావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్‌లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్‌గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ఫీల్డ్‌లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్‌శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్‌వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్‌లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్‌లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్‌లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్‌తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్‌గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్‌కు కలర్‌ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్‌గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్‌ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్‌కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్‌కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్‌లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్‌కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్‌కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్‌పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్‌ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్‌ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్‌లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్‌ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్‌కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇంటికీ నగధగలు
ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్ డెకర్ ప్రత్యేక ఈవెంట్స్‌కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్ అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్ టచ్‌ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్‌లు, హోల్డ్బ్యాక్లు, రింగులు అంటూ కర్టెన్ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి. ముత్యాల వరసవాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.క్రిస్టల్ వెలుగులుకొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్‌స్టోన్‌లు మంచి మెరుపునిస్తాయి.లోహాల ధగధగలుఅందమైన డిజైన్లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయిహుక్ రింగ్స్ కర్టెన్ హార్డ్‌వేర్ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్ లేదా ప్లాస్టిక్‌లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు. ఈ ఆభరణాలు కర్టెన్ రాడ్ చివరన, డ్రేప్లపైన సెట్ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది. – ఎన్నార్ -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్‌బాస్‌లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్‌గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్‌హీరో ఫిల్మ్‌లో ఫీమేల్ లీడ్‌గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్‌తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్‌కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్‌ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్‌ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్‌నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్‌ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్‌ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్‌గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్‌కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్‌ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్‌ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్‌ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్‌ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్‌ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్‌హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్‌గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్‌గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్‌బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్‌తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్‌బాల్ స్పెషల్ ఈవెంట్స్‌లో పాస్‌తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్‌తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్‌తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్‌లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్‌గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్‌ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్‌లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్‌గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్‌బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్‌లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
ఎందుకొచ్చిన తలనొప్పి ఇది?
ఒక విచిత్రమైన విషయం తెలుసా? మన ఎమోషన్స్‌కూ, ఆలోచనలకూ, ఉపాయాలకూ, బాధలకూ, సంతోషాలకూ కారణమైన మెదడులో ఉండేదంతా కేవలం కొవ్వుల కణజాలం మాత్రమే. అయినా ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ తాను ఇట్టే తెలిసేలా చేస్తుంది కదా... కానీ ఇంతా చేసి ఇలా అన్ని నొప్పుల్నీ తెలియజేసే ఈ మెదడుకు మాత్రం నొప్పి తెలియదు. తనను కోస్తున్నా తనకు నొప్పే తెలియని ఇదే మెదడు... మిగతా ‘తల’నొప్పులను మాత్రం ఎందుకు తెలియజేస్తుంది? అసలు తలనొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు.మామూలుగా తలనొప్పి అనగానే తేలిగ్గా తీసుకున్నా... ‘అబ్బ... అదో తలనొప్పి రా’ అనే వాడుక మాట వల్ల అదెంత దుర్భరంగా ఉంటుందో, ఎలా మన రోజునూ, సంతోషాలనూ పాడుచేస్తుందో చెప్పకనే చెప్పినట్లవుతుంది. అన్నట్టు తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదేమిటంటే... మెదడుకు నొప్పి అనే అనుభూతే కలగక΄ోతే... తలనొప్పి సమయంలో ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? అప్పుడు తలలో ఏం జరుగుతుందంటే... ఎప్పుడెప్పుడు...? నాడీ వ్యవస్థలో ఏమైనా సమస్యలున్నా, మైగ్రేన్ వంటి సమస్య లేదా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు... ఈ తలనొప్పుల రహస్యాలను ఇంకా ఎందరో పరిశోధకులూ, వైద్యశాస్త్రవేత్తలూ శోధిస్తూ తలనొప్పుల కారణాలను అన్వేషిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తోడు తెచ్చుకునే ఇతర నొప్పులెన్నో! సాధారణంగా తలనొప్పి ఒంటరిగా రాకుండా... మరికొన్ని నొప్పులతో పాటు వస్తుంటుంది. ఉదాహరణకు... ∙వికారం ∙ముక్కు కారుతుండటం కళ్ల నుంచి నీళ్లు కారుతుండటం ∙దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేని సమయాల్లో... ఇలా పైన పేర్కొన్న లక్షణాలతోపాటు తలనొప్పి ఎందుకు వస్తుంటుందన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పటికి తెలిసిందల్లా... దేహాన్ని రక్షించే ప్రక్రియలో భాగంగానే ఇలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం. ఎందుకు వస్తాయి? సాధారణంగా శరీరం ఏదో రకమైన ఒత్తిడి.. శారీరకమైన ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల లేదా పర్యావరణపరమైన ఒత్తిడుల వల్ల కావచ్చు. మెదడు, మెడ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు చాలా సున్నితమైన మార్పులకూ తేలిగ్గా ప్రతిస్పందించేలా ఉంటాయి. దాంతో పైన పేర్కొన్న ఏ మార్పులు కలిగినా వెంటనే ఇరిటేట్ అయి నొప్పిని కలిగించేలా చేస్తాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కౌమారసమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), ఆహారం తీసుకోక΄ోవడం, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వంటి వాటితో తలనొప్పులు రావచ్చు. అలాగే తీవ్రమైన భావోద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు బాగా ఉద్విగ్నతకు లోనుకావడం, తీవ్రంగా ఎక్సైట్ కావడం, తీవ్రమైన విచారంలో మునిగి΄ోవడం వంటి చర్యలు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యతను భగ్నం చేస్తాయి. కండరాల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి తలనొప్పులను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వాతావరణంలో తీవ్ర మార్పు... ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వాతావరణ ఒత్తిడి కారణంగా సైనస్లలో ఒత్తిడి పెరిగి అది ముఖం కండరాల్లో ముఖ్యంగా నుదురు వెనకనుండే ప్రదేశం, చెంపలు, కళ్ల దగ్గర ఉండే కండరాల్లో టెన్షన్ వృద్ధి చేయడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. నివారణ / చికిత్స తలనొప్పులకు చికిత్స అందించాలంటే ముందుగా దానికి నిర్దిష్టమైన కారణం ఏదో తెలుసుకోవాలి. మైగ్రేన్ లాంటి తీవ్రమైన, డాక్టర్ దగ్గర చికిత్స అందించాల్సిన తలనొప్పి మినహా చాలా రకాల తలనొప్పులు సింపుల్‌గా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్లనే తగ్గి΄ోతాయి. ఉదాహరణకు నీళ్లు ఎక్కువగా తాగుతూ దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం లాంటి సాధారణ సూచనలతోనూ తగ్గుతాయి. ఇక వేళకు తినడం, వేళకు నిద్ర΄ోవడం వల్ల నాడీవ్యవస్థలో సమతౌల్యత, క్రమం తప్పని వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం వంటి చర్యలతో చాలావరకు నివారితమవుతాయి లేదా అవి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడుగా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానూ నివారించుకోవచ్చు. చికిత్స విషయానికి వస్తే... ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాక అప్పటికీ తలనొప్పలు వస్తూనే ఉంటే.... దానికి ఇంకేదో కారణం (అండర్ లైయింగ్ కాజ్) ఉంటుందని గ్రహించి, దానికి చికిత్స తీసుకోవాలి. ఇక మైగ్రేన్‌కు డాక్టర్లు అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేందుకు ఒక రకం, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మరో రకం... ఇలా రెండు రకాల మందులు వాడతారు. ఇలా తలనొప్పులకు కారణాలు తెలుసుకునే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయి. – యాసీన్తలనొప్పి అంటే ఏమిటి?తలనొప్పిని అర్థం చేసుకోవాలంటే మొదట మెదడు నొప్పిని అనుభవించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడులో నొప్పిని తెలుసుకునే పెయిన్ రిసె΄్టార్స్ ఉండవు. దాంతో మెదడుకు గాయమైనా లేదా మెదడును కోస్తున్నా అది నొప్పిని అనుభవించదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మెదడుకు సర్జరీ చేస్తుంటే బాధితుడికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించామంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో చూసిన సంఘటనలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే అనేక పొరలు, రక్తనాళాలు, వాటిని రక్షించే కణజాలం, నాడీతంత్రులు, నరాల్లో నొప్పిని గ్రహించే పెయిన్ రిసె΄్టార్స్ వల్లనే తలనొప్పి అనుభవంలోకి వస్తుంది.మైగ్రేన్ అంటే ఏమిటి?మైగ్రేన్ అనేది తలనొప్పుల్లో చాలా తీవ్రంగా నొప్పిని కలగజేస్తుంటుంది. తలబద్దలవుతున్నట్లుగా వచ్చే ఈ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, వెలుతురు చూడలేక΄ోవడం/ శబ్దాలు వింటుంటే చికాకు, కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా వింతకాంతులు ఇలాంటి లక్షణాలూ కలగలసి బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రతి పదకొండు మంది పిల్లల్లో ఒకరిని బాధించే ఈ మైగ్రేన్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడతారు. ఆడుకోలేరు, గదిలోంచి కదల్లేనంతగా బాధపడుతుంటారు. తమకు సరిపడని ఏదో అంశం పిల్లలను ట్రిగర్ చేయడం వల్ల వచ్చే ఈ తలనొప్పిలో మెదడులోని నొప్పిని తెలిపే పాత్‌వేస్ అవసరానికంటే ఎక్కువగా... అంటే మరింతగా ప్రతిస్పందించడం వల్ల నొప్పి కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నవారి పిల్లల్లో ఇది అనువంశీకంగా కూడా రావచ్చు. తీవ్రమైన ఎండ, గాఢమైన వాసనలు, చెవులు బద్దలయ్యే శబ్దాలు, వేళకు తినక΄ోవడం / వేళకు నిద్ర΄ోక΄ోవడం వంటి అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపించవచ్చు. -
ఉత్సాహానికి ఉల్లాసానికి లైన్ డ్యాన్సింగ్
డాన్స్ చేయడమంటేనే ఉత్సాహం. అందరూ కలిసి ఒక వరుసలో చేస్తూ ఉంటే భలే ఉల్లాసం. ఇవాళ రేపు లైన్ డాన్సింగ్ చిన్నా పెద్దల్లో ట్రెండ్ అవుతోంది. మన పల్లెల్లో ఎప్పటి నుంచో కోలాటం, భజనల్లోఉండే లైన్డాన్స్ ఇప్పుడు ఫిట్నెస్ మంత్రగా ఉంది. వివరాలు.చిన్నప్పుడు పాఠశాలల్లో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు టీచర్లు పిల్లల చేత డ్యాన్స్ చేయించేవారు. అందర్నీ ఒక వరసలో నిలబెట్టి, వారికి తగ్గ స్టెప్పులు నేర్పించి, అందరూ ఒకేలా చేసేందుకు శిక్షణ ఇచ్చేవారు. దీన్ని ‘లైన్ డ్యాన్సింగ్’ అనేవారు. అందరూ ఒకే లైన్ లో నిల్చుని చేసే డ్యాన్స్ ఇది. ప్రస్తుతం ఇది సరికొత్త ట్రెండ్‌గా మారింది. చిన్నాపెద్దా, యువత, ముసలి అనే తేడా లేకుండా చాలామంది ఇందులో పాల్గొంటున్నారు. ఈ లైన్ డ్యాన్స్ ను వీడియోలు తీసి నెట్లో ట్రెండ్ అవుతున్నారు.ఈ ట్రెండ్ ఎలా మొదలైంది?లైన్ డ్యాన్సింగ్ అనేది కొత్త పద్ధతి కాదు. అయితే కొవిడ్ అనంతర కాలంలో ఈ డ్యాన్స్ ట్రెండ్‌గా మారింది. ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు, తోడు లేదని బాధపడేవారు, ఇతర మానసిక సమస్యలున్నవారు ఒకచోట చేరి లైన్ డ్యాన్స్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా నిలబడి, సంగీతానికి తగ్గట్లు లయబద్ధంగా నృత్యం చేయడం ద్వారా తాము ఒంటరివాళ్లం కాదు అనే భావనను పెంచుకున్నారు. మెల్లగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలామంది ఈ లైన్ డ్యాన్సింగ్‌ను ఒక విధానంగా పాటిస్తున్నారు. అందరిముందూ డ్యాన్స్ చేసేందుకు భయపడేవారు, సిగ్గు, మొహమాటం కలిగినవారికి ఇది సౌకర్యవంతంగా మారింది. డ్యాన్స్ రాకపోయినా ఇతరుల నుంచి స్టెప్స్ నేర్చుకొని నాట్యం చేయడం మొదలుపెట్టారు.శారీరక ఆరోగ్యానికి మేలుగా..లైన్ డ్యాన్సింగ్ అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో భారీ స్టెప్స్, స్పీడ్ మూమెంట్స్ ఉండవు. చేసేవారి వయసు, వారి శరీరాకృతి, వయసును బట్టి కొందరు ఈ లైన్ డ్యాన్సింగ్కి డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఎవరికి నచ్చినట్లు వారు కూడా డ్యాన్స్ చేయొచ్చు. ఒకరితో కలిసి మరొకరు డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని పలు సమస్యలు దూరమవుతాయి. యువత ఎక్కువగా కొత్త రకాల స్టెప్స్ ఫాలో అవుతుండగా, వయసు పైబడినవారు నిదానంగా, హాయిగా సాగే డ్యాన్స్ ని ఇష్టపడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని బట్టి, వారికి అనువైన రీతిని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా కీళ్లనొప్పులు, నడుమునొప్పి తగ్గి శరీరం చురుగ్గా ఉంటుందని వారు అంటున్నారు.మానసిక ఆరోగ్యానికి ఊతంలైన్ డ్యాన్స్ కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేయడం ద్వారా శరీరంలో నొప్పి, బాధ తగ్గించే రసాయనాలు విడుదలై వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. ఈ నృత్యం చేసిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తమలో ఆందోళనలు తగ్గాయని అంటున్నారు. లైన్ డ్యాన్స్ చేసేవారే కాదు, చూసేవారు కూడా ఆహ్లాదాన్ని ΄÷ందుతున్నామని అంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి కొందరు వైద్యులు ఈ డ్యాన్స్ చేయమని సలహా ఇస్తున్నారు.సామాజిక బంధాలూ పదిలంలైన్ డ్యాన్సింగ్ ద్వారా సామాజిక బంధాలూ పదిలమవుతున్నాయి. ఒంటరిగా బాధపడే లైన్ డ్యాన్స్ చేయడం ద్వారా ఇతరులతో కలిసిపోతున్నారు. తమ మనసులోని బాధల్ని దూరం చేసుకుంటున్నారు. సుమారు 43 శాతం మంది యువత ఇదే మాట చెప్తున్నారు. ఈ లైన్ డ్యాన్స్ తమకు బోలెడంత మంది మిత్రుల్ని దగ్గర చేసిందనేది వారు చెప్పే మాట. వయసు మళ్లినవారు సైతం ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇటువంటి లైన్ డ్యాన్స్ క్లబ్‌లలో చేరుతున్నారు. ఇతర వ్యాపకాలతో పోలిస్తే మానసిక ఆందోళన, ఒంటరి భావనలు దూరం చేసుకునేందుకు ఇది మేలైన మార్గం అని నిపుణులు అంటున్నారు. -
పెద్దవారికీ కావాలి జి.పి.ఎస్.
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్‌లోని జీపీఎస్.మనవడి ముందు చూపువయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్‌లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు. అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి. ధరలు అందుబాటులోనే..జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్‌గా ఉండటమే కాదు, స్టైలిష్‌గా డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్‌స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్‌లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెరడాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.2. తెల్ల ఉప్పుపరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు3. తెల్ల బియ్యందీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని. 4. మైదాబియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులుఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini) చదవండి: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్‌కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ..


