ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.
‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.
ఈ మార్పుకు కారణం ఏమిటి?
‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్‌టెక్ ఇన్నోవేషన్‌తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్‌పీఎల్) స్కీమ్‌లు యువతరానికి స్పీడ్‌గా చేరువవుతున్నాయి.
వాళ్ళు అలా... మనం ఇలా...
చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్‌గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.
ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?


