OTT
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక) -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) ఇతడిని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)Get ready for first-of-its-kind inflight entertainment with bone-breaking action 💥 Fasten your seatbelts for a mad, turbulent ride ✈️ #JetLee is crash landing on 25th May on JioHotstar! 💫 #JetLeeOnJioHotstar A @RiteshRana's turbulence 🛫 Starring #Satya, #RheaSingha,… pic.twitter.com/mPAZ8dgFUq— JioHotstar Telugu (@JioHotstarTel_) May 17, 2026 -
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ
'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లేన్.. ఇదే మూవీ దర్శకుడితో కలిసి చేసిన చిత్రం 'ఐ యామ్ కాదలన్'. 2024లోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి?విష్ణు(నస్లేన్) తన క్లాస్మేట్ శిల్ప(అనీష్మా)ని కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణుకి జాబ్ రాకపోవడంతో శిల్ప నిరుత్సాహపడుతుంది. ఈమె.. తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంది. ఓసారి తన ప్రేమ గురించి చెప్పేందుకు శిల్ప తండ్రి దగ్గరకెళ్లిన విష్ణుకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతకీ అదేంటి? దీని తర్వాత శిల్ప తండ్రి కంపెనీని విష్ణు ఎలా హ్యాక్ చేశాడు? శిల్ప తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన విష్ణు చివరకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో ఎప్పుడూ దాదాపుగా ఒకే కమర్షియల్ ఫార్ములా చుట్టూ స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు తిరుగుతుంటారు. మలయాళంలో మాత్రం తక్కువ బడ్జెట్లోనే కాస్త భిన్నంగా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీనే ఇది. ప్రేమించిన అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం పాత కాన్సెప్టే. కానీ దానికి హ్యాకింగ్ అనే అంశం జోడించడం కాస్త చిత్రంగా అనిపించింది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే సూపర్ కాకపోయినా పర్లేదు బాగానే ఉంది.అసలు పాయింట్ చెప్పడానికి కాస్త టైమ్ తీసుకున్న దర్శకుడు.. విషయం తెలిసిన తర్వాత ఎంటర్టైనింగ్గానే సినిమాని నడిపాడు. పెద్దగా టెక్నికల్ సెటప్ లేకపోయినప్పటికీ హీరో తన దగ్గరున్న డబ్బా కంప్యూటర్‌తోనే హ్యాకింగ్ చేయడం సహజంగానే ఉంది. హ్యాకింగ్ అనగానే ఏదేదో అనుకుంటాం కానీ సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సింపుల్‌గానే చూపించారు. ఆ సీన్లు బాగానే కుదిరాయి. కాకపోతే కామెడీ లాంటి పెద్దగా ఉండవు.క్లైమాక్స్‌లో హీరో దొరికిపోతాడు అనుకున్న దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అయితే నవ్వులు పూయిస్తుంది. ఇక హ్యాకర్ అయిన హీరోని పట్టుకునేందుకు హీరోయిన్ తండ్రి నియమించుకున్న లేడీ హ్యాకర్ చాలా ట్రై చేస్తుంది. మరి హీరో దొరికాడా లేదా? హ్యాకర్లు ఇద్దరూ ఏ సందర్భంలో ఎక్కడ కలుసుకున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మలయాళంలో చాలా చిత్రాల్లో ఉన్నట్లే కాస్తంత సాగదీత కూడా ఉంటుంది. దాన్ని తట్టుకుని చూస్తే ఇదో టైమ్ పాస్ సినిమా.హీరోహీరోయిన్లు నస్లేన్, అనీష్మా బాగా చేశారు. మిగతా పాత్రధారులు కూడా సహజంగా నటించారు. టెక్నికల్ విభాగాలు కూడా తమ పని తాము చేశారు. ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ.. అలా అలా సాగిపోయేలా ఉండేది చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మలయాళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్) -
ఎట్టకేలకు OTTలోకి ధురంధర్ 2 కాకపోతే చిన్న ట్విస్ట్..!
-
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్‌లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్‌తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్‌లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్‌లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్‌కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్‌తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక హీరోతో సింగర్ బ్రేకప్!) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన
'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంకా ఓ విషయంలో సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. ఆడియెన్స్ ఏమో ఎదురుచూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థ మాత్రం షాక్ ఇచ్చింది. ఇంతకీ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ సంగతేంటి? తెలుగు వెర్షన్ ఎందులోకి వచ్చింది?గతేడాది డిసెంబరులో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1300 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మూడు నెలలు తిరిగేసరికల్లా అంటే ఈ ఏడాది మార్చి 19న రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈసారి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. సీక్వెల్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)అయితే తొలి భాగాన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా ఇదే ఓటీటీలో వస్తుందని అంతా అనుకున్నారు కానీ డిజిటల్ హక్కుల్ని మన దేశం వరకు హాట్‌స్టార్ దక్కించుకుంది. విదేశాల వరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి అమెరికా, న్యూజిలాండ్, మలేసియాతో పాటు ఇతర దేశాల్లో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరలేదు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? వచ్చే వారం స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి?'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో చాలామంది హీరోలున్నారు. అందులో నాగశౌర్య. సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. 'ఛలో' లాంటి మూవీస్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇతడికి సరైన హిట్ అనేది లేకుండా పోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదిప్పుడు ఎలాంటి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా)ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య.. 2023లో 'రంగబలి' చేశాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఈ మూడేళ్లలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం చేయగా గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే తేలిపోయింది. అసలు ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బ్యాడ్ బాయ్ కార్తీక్' విషయానికొస్తే.. కార్తీక్(నాగశౌర్య) వైజాగ్‌లో ఉంటాడు. అక్క కస్తూరి(శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. ఆమె ఓ లాయర్. రాయలసీమలోని కదిరిలో భూకబ్జాలు చేసే గోవిందప్పు(మైమ్ గోపీ), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంటుంది. దీంతో ఈమెపై దాడి జరుగుతుంది. ఆ విషయం తెలిసి వైజాగ్ నుంచి రాయలసీమకు కార్తీక్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క.. అతడిపైనే ఎందుకు కోప్పడింది? ఒకప్పుడు సఖ్యతగా ఉన్న గోవిందప్ప, వరదారెడ్డి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గోవిందప్పను చంపింది ఎవరు? వరదారెడ్డిని చంపింది ఎవరు? మధ్యలో హీరో ప్రేమకథ ఏంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్‌స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మిగతా భాషల్లోనూ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకటి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'ప్రేమిస్తే' సినిమాతో గతంలో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత కాలంలో ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాళిదాస్ 2'. గత నెల 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడుది అమెజాన్ ప్రైమ్, లయగ్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహ తమిళ, సన్ నెక్స్ట్, షార్ట్ ఫ్లిక్స్ ఇండియా ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.లయన్స్ గేట్ ప్లేలో తెలుగు వెర్షన్స్ ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం అద్దె విధానంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగం చూడకపోయినా సరే దీన్ని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు.'కాళిదాస్ 2' విషయానికొస్తే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు రాత్రి అక్కడే ఉన్న మిత్ర అనే నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని కాళిదాసు దర్యాప్తు చేస్తుంటాడు. ఓసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ల గురించి ఓ డార్క్ సీక్రెట్ కాళిదాస్‌కి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు) -
ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి రెండు నెలల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' మూడో భాగం మాత్రం ఆరు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'టైటానిక్' లాంటి మూవీ తీసిన జేమ్స్ కామెరూన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని 2009లో 'అవతార్' అనే సినిమా తీశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. రూ.14-15 వేల కోట్ల వసూళ్లు రాగా.. 2022లో రిలీజైన పార్ట్ 2 కూడా రూ.18 వేల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. గతేడాది డిసెంబరులో మూడో పార్ట్ (అవతార్: ఫైర్ అండ్ యష్) రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.మూడో పార్ట్ కూడా వేలకోట్లు కలెక్షన్స్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ వచ్చినప్పటికీ అద్దె విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్స్టార్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'అవతార్: ఫైర్ అండ్ యాష్' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్గా సినిమాలు చేసిన జ్యోతిక.. రీసెంట్ టైంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలోనూ అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'సిస్టమ్' పేరుతో తీసిన సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విని తివారీ దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే శుక్రవారం(మే 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.రిలీజ్ చేసిన ట్రైలర్ బట్టి చూస్తే కోర్టులో న్యాయవాదిగా పనిచేసే లాయర్ సోనాక్షి.. న్యాయాన్ని గెలిపించకుండా డబ్బులు తీసుకుని కేసుల్ని తారుమారు చేసే పనిచేస్తుంటుంది. దీనికి జ్యోతిక కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్ల జీవితాల్లో తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవస్థ ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
విజయ్ సీఎం.. జన నాయగన్‌కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్‌లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గత నెల 23న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ మధువిదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 22 నుంచే సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం కాగా.. ఈ సినిమాకు విష్ణు అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరఫ్, కల్యాణీ పాణిక్కర్ జంటగా నటించారు. The wedding is locked.So is the chaos.Be there to witness it all unfold on May 22nd. 💥💍#Madhuvidhu streaming from May 22 only on Sony LIV#SonyLIV #SonyLIVSouth #SonyLIVMalayalam#Sharafudheen #KalyaniPanicker pic.twitter.com/p3XaU1QHPN— Sony LIV Malayalam (@SonylivMal) May 11, 2026 -
బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్‌స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.ఇంటీరియర్, డిజైన్ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.వార్డ్ రోబ్ అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్‌తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూమ్‌ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్‌గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్‌రోబ్‌లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్‌పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002) -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఐపీఎల్, వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా జనాలు బయట తిరగట్లేదు. చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడంతో థియేటర్లకు కూడా వెళ్లట్లేదు. ఇకపోతే ఈ వారం సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి కానీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)మరోవైపు ఓటీటీల్లో 14 సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. నంబర్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటిలో చూడదగ్గవి కొన్ని ఉన్నాయి. ధురంధర్ 2 మూవీ ఈ వీకెండే విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది గానీ మన దేశంలోనే ఈ వారం వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కర్తవ్య', 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలతో పాటు 'ఎగ్జామ్' అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 11 నుంచి 17 వరకు)నెట్ఫ్లిక్స్ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13నెమిసిస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 14సోల్‌మేట్ (జపనీస్ సిరీస్) - మే 14ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15అమెజాన్ ప్రైమ్ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 13ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15హాట్స్టార్ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 12ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహాతిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్స్ట్కాళిదాస్ 2 (తమిళ చిత్రం) - మే 12జీ5టిఘీ (మరాఠీ మూవీ) - మే 15(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి) -
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
మెగాడాటర్ నిహారిక నిర్మించిన హారర్ కామెడీ సినిమా 'రాకాస'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్గా ఓటీటీలోకి కూడా వచ్చి అందులోనూ దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది. 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.సంగీత్ శోభన్ –గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి. పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. ఈ మూవీ మానస శర్మ దర్శకురాలు కాగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. (ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
'మనీ హీస్ట్' ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్
ఓటీటీల్లో కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్లకు 'మనీ హీస్ట్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సీజన్ల ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చివరిదైన ఐదో సీజన్ వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. దీని తర్వాత 'బెర్లిన్' పాత్ర ఆధారంగా సిరీస్ వచ్చింది. ఇప్పుడు 'మనీ హీస్ట్' ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2021లో ఐదో సీజన్‌తో ఈ సిరీస్‌ని ముగించినప్పటికీ.. ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త టీజర్ రిలీజ్ చేసింది. మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగనుంది అనే పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆరో సీజన్ మొదలుపెడతారా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ సిరీస్‌లోని ఫ్రొఫెసర్ లేదా ఇతర పాత్రల్ని తీసుకుని కొత్తగా సిరీస్ మొదలుపెట్టొచ్చేమో అనిపిస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అప్పటివరకు ఎదురుచూడటమే.(ఇదీ చదవండి: చిరుని కలిసిన మలయాళ డైరెక్టర్.. రీమేక్‌పై క్లారిటీ) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా ప్రపంచవ్యాప్తంగా రూ.3500 కోట్లు సొంతం చేసుకున్న ఓ హిట్ మూవీ.. సైలెంట్‌గా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)మార్చిలో దేశవ్యాప్తంగా 'ధురంధర్ 2' హవా నడిచింది. ఇదొచ్చిన వారానికి రిలీజైన హాలీవుడ్ మూవీనే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. అంతరిక్ష నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. చూసిన చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత యూట్యూబ్ మూవీస్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అసలు స్పేస్‌లోకి ఎందుకెళ్లాడు? ఇతడితో పాటు అంతరిక్ష నౌకలో ఉన్న మిగతా ఇద్దరూ ఎందుకు చనిపోయారు? తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? ఈ క్రమంలోనే ఓ ఏలియన్‌తో ఎలా స్నేహం కుదిరిందనేది మిగతా స్టోరీ.అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టముంటే మాత్రం దీన్ని కచ్చితంగా మిస్ అవ్వొద్దు. ప్రస్తుతానికి యూట్యూబ్‌లోకి రెంట్ విధానంలో వచ్చింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ తదితర ఓటీటీల్లోకి కూడా రావొచ్చు.(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి) -
ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లోకి కొత్త మలయాళ సినిమాలు ఎప్పుడొస్తాయా అని తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం డబ్బింగ్ రూపంలో పలు మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. ఈ వీకెండ్ అలా వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'భరతనాట్యం 2 మోహినియాట్టం'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?శశి(సైజు కురుప్) తండ్రి భరతన్(సాయి కుమార్) చనిపోవడం దగ్గర 'భరతనాట్యం' తొలి భాగం ఆగింది. అక్కడి నుంచి ఈ సీక్వెల్ మొదలైంది. శశి తన కుటుంబంతో కలిసి సవతి తల్లి రుక్మిణిని సొంతూరులో దిగబెట్టేందుకు వస్తాడు. ఓ వారం రోజుల పాటు వీళ్లంతా ఆ ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి చనిపోవడానికి శశి కుటుంబం కారణమవుతుంది. మరి ఈ హత్య నుంచి శశి ఫ్యామిలీ బయటపడిందా? లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'భరతనాట్యం 2 మోహినియాట్టం'.. ఈ పేరు చూసి ఇదేదో డ్యాన్స్‌కి సంబంధించిన సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇదో డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. మీరు 'దృశ్యం' చూసే ఉంటారుగా. ఇది దాని స్ఫూప్లా అనిపిస్తుంది. కాకపోతే అది పూర్తి సీరియస్. ఇందులో మాత్రం సరదాగా సాగిపోయే కామెడీతో బాగా నవ్వించారు.2024లో రిలీజైన 'భరతనాట్యం' ఓ ఫ్యామిలీ డ్రామా. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ అయింది. ఓటీటీలోనూ ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే లీడ్ రోల్ చేసిన సైజు కురుప్ నిర్మాతల్లో ఒకడు కావడంతో సీక్వెల్ తీశారు. గత నెలలో రిలీజ్ చేశారు. రూ.5 కోట్లు పెట్టి తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలా అని ఇదేదో కొత్త స్టోరీ అంటే కాదు. తెలుగు క్రైమ్ మూవీస్‌లో కనిపించిన కథే. కాకపోతే స్క్రీన్ ప్లే, స్టోరీని డీల్ చేసిన విధానం, సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యాయి.సినిమా ప్రారంభంలో మొదటి పార్ట్‌లో ఏం జరిగిందో సింపుల్‌గా చూపించేశారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వస్తాం. శశి ఫ్యామిలీ వేరే ఊరికి వస్తారు. ఇక్కడ వీళ్లకు గోవింద్ అనే పెద్దమనిషి రూపంలో సమస్య ఎదురవుతుంది. అతడిని శశి కుటుంబం ఎలా డీల్ చేసిందనేది మిగతా స్టోరీ. మూవీ మొదలైన 20 నిమిషాలు బోర్ కొడుతుంది. ఎప్పుడైతే గోవింద్ పాత్ర ఎంటర్ అవుతుందో స్టోరీలో కదలిక వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అటు థ్రిల్, ఇటు కామెడీ బాగా పండాయి. ఊహించని విధంగా క్లైమాక్స్ పడుతుంది.ఇందులో సూపర్, హిలేరియస్ కామెడీ ఉందని చెప్పాం గానీ పర్లేదు ఓ సారి చూడొచ్చనేలా ఉంది. మరి రెండో పార్ట్ చూడాలంటే తొలి పార్ట్ చూడాలా అంటే కుదిరితే చూడండి. లేకపోయినా సరే స్టోరీ దాదాపుగా అర్థమైపోతుంది. ఇలా అన్నీ ప్లస్సులేనా అంటే మైనస్సులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి మర్డర్ చేసినా సరే పోలీసులు పట్టుకోలేరా? అనే డౌట్స్ వస్తే మాత్రం కామెడీని ఎంజాయ్ చేయలేరు. మలయాళ చిత్రాల్లోని సాగదీత ఉండనే ఉంది.ఎవరెలా చేశారు?శశి పాత్రలో నటించిన సైజు కురుప్ సహా మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కారు. అయినా సరే ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి సాంకేతిక అంశాలు కూడా చక్కగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. పేరుకే డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఫ్యామిలీతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి) -
LIK Movie: 2040 డిజిటల్ లవ్ స్టోరీ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘లైక్’ మూవీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ప్రేమ గుడ్డిది అనే నానుడి వినే ఉంటారు. కానీ ఇదే నానుడి పోను పోను ప్రేమ డిజిటలైజ్డ్ అని వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనిషి తన మేధస్సుతో సాంకేతికతను బానిసగా చేసుకుంటున్నాను అనుకుంటున్న ఈ సమయంలో, అదే టెక్నాలజీ తన మనిషినే బానిసని చేసుకుంటోందని తెలుసుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా రేపటి తరం ఈ టెక్నాలజీకి ఇప్పటి నుండే దాసోహం అంటున్నారు. మన చుట్టూ టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో ఉండే స్వచ్ఛమైన భావన ప్రేమ. కానీ ఆ ప్రేమను కూడా టెక్నాలజీకి ముడి పెడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో వచ్చినదే ఈ ‘లైక్’ సినిమా. ఈ రోజుల్లో పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయేంత వరకు మనమంతా ఇప్పుడు టెక్నాలజీతోనే ఉంటున్నాం. ఆరు నుండి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు ఫోన్, ట్యాబ్‌లకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఆ అలవాటు మనకి ఎంత గ్రహపాటో వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమా చూడడం పూర్తయ్యాక మనం ఒక రోజైనా టెక్నాలజీకి దూరంగా ఉండాలని కొందరు పిల్లలు సైతం అనుకున్నారంటే... ఈ సినిమా ప్రభావం పిల్లల్లో కూడా ఎంతలా ఉందో ఆలోచించండి. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా మనకు 25 ఏళ్ళ తరువాత అంటే... 2040లో జరగబోయే కథన్న మాట. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ మరో వంద రెట్లు ఉంటుంది. అందుకే కథ ముందుగా పచ్చదనం ప్రాంతంలోని వైభవ్ వాస్ అనే యువకుడితో ప్రారంభమవుతుంది. పచ్చదనం ప్రాంతం అంటే 2040లో జైలన్నమాట. అంటే అక్కడ ఫోన్, టీవీ ఇలాంటివి ఏవీ ఉండవు. టెక్నాలజీ పెరిగిపోయి 2040లో నేరం చేసినవాళ్ళను పచ్చదనం ప్రాంతానికి శిక్షగా పంపుతారు. వాస్ వాళ్ళ నాన్న ఈ జైలుకు అధికారి. దేశమంతా లైక్ అని ఓ యాప్ ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ప్రేమించుకునే వాళ్ళకి, ప్రేమించాలి అని అనుకునేవాళ్ళకి ఈ యాప్ ద్వారా తమ ప్రేమ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇదే యాప్‌కి బానిసైన ధీమాని వాస్ ప్రేమిస్తాడు. కానీ వాస్ ప్రేమ నిజమైనది కాదు అని ఆ యాప్ స్పష్టం చేస్తుంది. ధీమాకి తనది స్వచ్ఛమైన ప్రేమ అని, డిజిటల్ ఎమోషన్ కాదు అని వాస్ ఎలా నిరూపిస్తాడో ‘లైక్’ సినిమాలోనే చూడాలి. సినిమా మొత్తం వినోదాత్మకంగా, నేటి తరం వారికి హెచ్చరికగా, రేపటి తరం వారికి పాఠంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్ల దగ్గర పిల్లలను గమనిస్తూ జాగ్రత్త పడాలి. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా
టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. చిత్రమైన మేనరిజంతో యాటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రామ్‌నగర్ బన్నీ' అనే సినిమాతో కొన్నాళ్ల క్రితం హీరోగా పరిచయం కాగా అది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి విలేజ్ రొమాంటిక్ మూవీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఏ మాత్రం సౌండ్ చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)చంద్రహాస్, మేఘనా ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్ర ప్రమోషన్లలో 'గుంజి గుంజి' అనే బూతు పాట పాడిన చంద్రహాస్.. ఓ జర్నలిస్టుతో సోషల్ మీడియా వేదికగా గొడవపడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నాడు. అలా ఈ మూవీ వార్తల్లో నిలచింది. కానీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైతే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.'బరాబర్ ప్రేమిస్తా' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలో ధర్మాని, కర్మాని అనే రెండు కులాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీళ్లకు పడదు. ఎప్పుడూ గొడవలే. ఇదే గ్రామానికి చెందిన చందు(చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. బుజ్జమ్మ తండ్రి సర్పంచ్ కాగా చందు తండ్రి సర్పంచ్‌గా ఓడిపోతూ ఉంటారు. ప్రారంభంలో చందు- బుజ్జమ్మ కొట్టుకుంటారు కానీ తర్వాత ప్రేమించుకుంటారు. ఇదే ఊళ్ళో ఉంటే పెళ్లి జరగదు అని ఇద్దరూ లేచిపోయి కేరళ వెళ్తారు. మరి చందు – బుజ్జమ్మ కేరళలో పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ రుద్రారంకు ఎందుకు తిరిగి వస్తారు? రెండు కులాల వాళ్ళు కలుస్తారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?) -
దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్‌కట్ వర్షన్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్-2 ఉండనుందని పేర్కొంది.అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్‌స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వీకెండ్ సినిమాల సందడి.. ఓటీటీల్లో ఒక్కరోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి మామూలే. ఈ వారంలో గోదారి గట్టుపైన, సతీ లీలావతి, రేజర్, స్పిరిట్ లాంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు 'రేజర్' మూవీస్‌పై ప్రేక్షకుల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. తెలుగు హిట్ మూవీ డెకాయిట్‌తో పాటు మలయాళ బ్లాక్‌బస్టర్స్ వాలా-2, భరతనాట్యం 2 ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08మై రాయల్ నెమిసిస్(కొరియన్ మూవీ)- మే 08రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్(హాలీవుడ్ సినిమా)- మే 08అమెజాన్ ప్రైమ్ డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08 లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08సతన్ ది డార్క్(తమిళ సినిమా)- మే 08నో ప్లేస్ టు బీ సింగిల్(హాలీవుడ్ సినిమా)- మే 08జియో హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08 సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08ఎమ్ఐఏ(హాలీవుడ్ సినిమా)- మే 08జీ5 లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08 సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08ఆపిల్ టీవీఅన్కండీషనల్(హాలీవుడ్ మూవీ- మే 08 -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కెమెరా అసిస్టెంట్ సాయితేజ్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే..ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One missing TV.One blamed thief.One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj— ahavideoin (@ahavideoIN) May 7, 2026 -
చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్
ఒక్కసారి నటుడైనా, నటి అయినా సక్సెస్‌ను అందుకంటే సినిమా వారిని అంత సులభంగా వదులుకోదు. అలా ఏళ్ల తరబడి ఈ రంగంలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి తారలలో నటి వేదిక ఒకరు. ఈ మహారాష్ట్ర భామ గత రెండు దశాబ్దాలుగా కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళంలోకి 2005లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని చేరుకున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు తమిళంలో పరదేశీ, కావ్యతలైవన్, శివలింగ, బానం వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈమె పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన వేధికకు తమిళంలో చిన్న గ్యాప్ వచ్చింది. అయితే దాన్ని పూర్తి చేసే విధంగా మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మహాల్ అనే తమిళ చిత్రంతో పాటు తమిళం,తెలుగు భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె స్థానాన్ని ఇక్కడ సుస్ధిరం పరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆకర్షనీయమైన అవయవ సంపద, అభినయం కలిగిన ఈ 38 ఏళ్ల భామ ఇటీవల వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్కా మీడియా నిర్మించిన యక్షిణి అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. అందులో ఈమె బోల్డ్ నటనకు గానూ హిందూస్థాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డును గెలుచుకున్నారు.. కాగా చిన్న గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నట్లు సమాచారం. -
నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్గా సినిమాలు జ్యోతిక.. ప్రస్తుతం ఆచితూచి మూవీస్ చేస్తోంది. అలా ఈమె లీడ్ రోల్ చేసిన ఓ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామా కాన్సెప్ట్ తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)ప్రస్తుతం ఓటీటీ సంస్థలు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలని కొంటూనే సొంతంగానూ కొన్నింటిని నిర్మిస్తున్నాయి. అలా తీసిన ఓ చిత్రమే 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు చేశారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకురాలు. ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'న్యాయం దేవుడి లాంటిది. వెతికి పట్టుకోవడం చాలా కష్టం' అనే డైలాగ్ జ్యోతిక పాత్రతో చెప్పించారు. దీనిబట్టి చూస్తే న్యాయవ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? అనే వాటిని ఈ మూవీలో చూపించబోతున్నారనిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు సరిగా తీయాలే గానీ బాగానే వర్కౌట్ అవుతాయి. మరి 'సిస్టమ్' చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలోకి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', స్పిరిట్ అనే తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)సతీ లీలావతి: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ట్రైలర్ బాగానే ఉంది.రేజర్: రవిబాబు దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా. ఈసారి రవిబాబు రక్తపాతాన్ని నమ్ముకున్నాడు. ఫలితం ఏమవుతుందో?గోదారి గట్టుపైన: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర దర్శకుడు. విలేజీ లవ్ స్టోరీగా దీన్ని తీశారు.స్పిరిట్: రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా సినిమా ఇది. సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకుడు.ఏ ఫిల్మ్ బై గిరి: రిషభ్ శెట్టి హీరోగా నటించిన కామెడీ సినిమా ఇది. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించారు. ఇందర్ హీరోయిన్గా చేసింది.మరోవైపు ఓటీటీల్లో చాలా తక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో చూడదగ్గవే చాలా ఉన్నాయి. అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'తో పాటు రీసెంట్ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలా 2'.. ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 04 నుంచి 10వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08అమెజాన్ ప్రైమ్లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ5లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ) -
విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్‌కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?) -
ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ. -
ఓటీటీకి సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతన్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్లపరంగా రాణిస్తున్నాయి. ఇటీవల వాలా-2 సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మరో మలయాళ మూవీ భరతనాట్యం- 2 మోహినియాట్టం సైతం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి ఓటీటీ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. Recent Malayalam Blockbuster Dark Comedy Movie 😂!!#Bharatanatyam2 : #Mohiniyattam (Malayalam) streaming from May 8 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/74wi4zutEy— OTT Trackers (@OTT_Trackers) May 3, 2026 -
ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టేస్తున్నాయి. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు తెగ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలా అని పేరెంట్స్ చాలానే ఆలోచిస్తున్నారు. అయితే ఓటీటీల్లో పిల్లలని ఎంటర్టైన్ చేస్తూ విలువలు నేర్పించే యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరొకటి చేరింది. రీసెంట్గా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'హాపర్స్' చిత్రాన్ని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా చూడొచ్చు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)కథేంటి?బీవర్టన్ అనే ఊరిలో మేబల్ అనే అమ్మాయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పెద్దయి కాలేజీకి వెళ్లినా అది తగ్గదు. ఊరిలో ఫ్లైఓవర్ కడుతున్నారని, కానీ దీనికోసం పెద్ద చెరువుని కూల్చేశారని, అందులో జంతువులని బెదరగొట్టి పంపించేశారని తెలిసి బాధపడుతుంది. ఆ జంతువులని తిరిగి ఇక్కడికి ఎలా తీసుకురావాలా, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోని విధంగా ఈమె ఆత్మ.. బీవర్ అనే జంతువులో ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైంది? బీవర్ శరీరంలో ఉన్న మేబల్.. మిగిలిన జంతువులతో కలిసి ఆ ఫ్లైఓవర్ కట్టడాన్ని అడ్డుకుందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే యానిమేషన్ సినిమాలకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. హాలీవుడ్లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఆకట్టుకున్న చిత్రమే 'హాపర్స్'. సరదా సరదాగా సాగిపోతూనే ప్రకృతి ఎంత గొప్పదో చెబుతుంది. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు.ప్రస్తుతం నాగరికత పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా చెట్లు లేదా అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. జంతువులు మూగజీవులు కాబట్టి మనుషుల్ని అవేం చేయలేవు. ఒకవేళ వాటికే మనిషిలా ఆలోచించగలిగే శక్తి వస్తే ఏం చేస్తాయి అనే చిత్రమైన కాన్సెప్ట్‌తో తీసిన 'హాపర్స్' అద్భుతంగా ఉంది.పాయింట్ పరంగా కొత్తదేం కాదు కానీ చూపించిన ఎమోషన్స్ గానీ చేసిన కామెడీ గానీ బాగా కుదిరాయి. అడవిలో జంతువుల మధ్య సాగే హంగామా కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు. పిక్సర్స్ స్టూడియోస్ తీసిన ఈ సినిమాలో నాన్నమ్మ-మనవరాలి ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మనిషి.. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు గానీ ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ప్రకృతే మనిషిని కాపాడటం అనే పాయింట్‌ని చూపించిన విధానం బాగుంది.ప్రస్తుతానికి ఈ సినిమా ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో రెంట్ విధానంలో ఉంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలకు ఏదైనా మంచి మూవీ చూపిద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
మూవీ లవర్స్ కు పండగే, ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస
-
ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యూడ్, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV— prime video IN (@PrimeVideoIN) May 1, 2026 -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమాలకు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఓటీటీల్లోకి రావడం లేటు చూసేస్తుంటారు. రీసెంట్ టైంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే అదరగొట్టేందుకు మరో మూవీ రెడీ అయిపోయింది. గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ స్కూల్ ఏజ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'వాలా' చిత్రానికి కొనసాగింపుగా.. 'వాలా 2' తీశారు. ఇన్ స్టాలో పాపులర్ అయిన కుర్రాళ్లు నలుగురిని లీడ్ రోల్స్‌గా పెట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.200 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజ్ కాగా.. ఏప్రిల్ 26న తెలుగులో విడుదలైంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం(మే 08) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వొద్దు.'వాలా 2' విషయానికొస్తే.. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన హాషిర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు కుర్రాళ్లని తల్లిదండ్రులు ఎన్నోకష్టాలు పడుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ వీళ్లు చదువుల్లో కంటే గొడవల్లోనే ముందుంటారు. గొడవల వల్ల ఓ దశలో కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితులు వస్తాయి. ఓ పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకుని వీళ్లని కాపాడతాడు. ఆ తర్వాత పరీక్షలు రాసే అవకాశం వస్తుంది. ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం యూకే వెళ్లాలనుకున్న ఈ నలుగురూ తమ కలని నిజం చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్
అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్లో చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ 1982లో వచ్చిన 'వసంత కోకిల' టాప్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశకు గురయ్యారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ రీ-మాస్టర్ చేసి ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ ఎందులోకి వచ్చిందంటే?బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దృశ్యకావ్యం 'మూండ్రం పిరై' (తెలుగులో 'వసంత కోకిల'). 1982లో థియేటర్లలో రిలీజై ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. శ్రీదేవి, కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ఇందులో నటనకుగానూ కమల్‌కి, సినిమాటోగ్రఫీ విభాగంలో బాలూ మహేంద్రకు జాతీయ అవార్డులు కూడా రావడం విశేషం.అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం రీమాస్టర్ చేసి ఫుల్ హెచ్డీ ప్రింట్‌ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. యూట్యూబ్‌లో ఈ మూవీ ఉంది గానీ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది.'మూండ్రం పిరై' విషయానికొస్తే.. ఓ ప్రమాదం కారణంగా శ్రీదేవి తన జ్ఞాపకశక్తిని కోల్పోయి చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అనాథగా మారిన ఆమెని ఓ వేశ్యాగృహం నుంచి కమల్ హాసన్ (సోమనాథన్) రక్షించి, తన ఇంట్లోనే చేరదీసి ఆప్యాయంగా చూసుకుంటాడు. ఆమెకు చికిత్స చేయిస్తూ, తనను తాను మరచి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని అర్థం చేసుకుంటుంది, ప్రేమిస్తుంది. చివరకు ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది కానీ జరిగిన సర్జరీ వల్ల కమల్‌తో గడిపిన ఆ కొంతకాలం జ్ఞాపకాలు (కమల్‌ను) మర్చిపోతుంది. తనను ఎంతో ప్రేమించిన కమల్ని గుర్తుపట్టకుండానే తన పాత జీవితంలోకి ఆమె వెళ్ళిపోతుంది. కమల్ ప్రేమ, త్యాగం చివరకు విషాదంగా ముగుస్తుంది. -
నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్‌పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్ కర్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. #Kartavya 🔥#SaifAliKhan in a gripping tale of duty vs conscience ⚖️Directed by Pulkit 🎬Streaming on Netflix from May 15 ✅ pic.twitter.com/wSQiOCnuss— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 30, 2026 -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ బైకర్ (తెలుగు మూవీ) - మే 01 రాకాస (తెలుగు సినిమా) - మే 01 గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01స్వాప్డ్(యానిమేషన్ మూవీ)- మే 01మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03క్లీకా (హాలీవుడ్)- మే 03ఆహాసోదర(తెలుగు మూవీ)- మే 01అమెజాన్ ప్రైమ్ సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01 యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01జీ5ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01హెచ్‌బీవో మ్యాక్స్..ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01సన్ నెక్ట్స్మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01హులు..హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01 -
హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్
గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026 -
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్‌గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్‌తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)నెట్ఫ్లిక్స్షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30బైకర్ (తెలుగు మూవీ) - మే 01రాకాస (తెలుగు సినిమా) - మే 01గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01హాట్స్టార్బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30అమెజాన్ ప్రైమ్ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)జీ5లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01ఆపిల్ టీవీ ప్లస్విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29ఎమ్ఎక్స్ ప్లేయర్క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు) -
ఓటీటీలోకి 'బైకర్' సినిమా.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన హీరో శర్వానంద్.. ఈ నెల తొలివారంలో మరో మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బైకర్'. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. బైక్ రేసింగ్ స్టోరీతో సరికొత్తగా దీన్ని తెరకెక్కించారు. చూసిన చాలామంది బాగానే ఉందన్నారు కానీ ఎందుకనో జనాలు ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కలెక్షన్సే దీనికి ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం మే 01వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇదే పేరుతో.. హిందీలో మాత్రం 'శర్వా' అనే టైటిల్‌తో అందుబాటులోకి రానుంది.'బైకర్' విషయానికొస్తే.. బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్(రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. మన దేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలనేది ఈయన ఆలోచన. ఇందులో భాగంగా రేసర్లని తీర్చిదిద్దుతుంటాడు. ఈయన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్).. తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని టాప్ రేసర్ అవుతాడు. అంతర్జాతీయ పోటీలోనూ పాల్గొంటాడు కానీ కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో నిలుస్తాడు. తర్వాత రేసింగ్ నుంచే వికాస్ దూరం కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనకున్న కారణమేంటి? చివరకు ఏమైంది? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
ఓటీటీలో నంబర్ వన్ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా
జీవీ ప్రకాశ్‌కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్.. విజయవంతంగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్ వాచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్ దూసుకుపోతున్నాడు.ట్రెండింగ్‌లో హ్యాపీ రాజ్తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన కొత్త సినిమా రాకాస... బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. రాకాస చిత్రంలో సంగీత్ శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్గా నటించారు. ఓటీటీ సిరీస్‌లతో బాగా పాపులర్ అయిన దర్శకురాలు మానస శర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.రాకాస చిత్రం 2026 మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సదరు ఓటీటీ యాప్ కేటలాగ్‌లో అధికారికంగా చేర్చబడింది. అయితే, ఓటీటీ ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాకాస చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓటీటీ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 10 కోట్లకు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా రాకాస చిత్రం నిర్మాత నిహారికకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ) రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) -
పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
ప్రేమమ్, సర్వం మాయ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నివిన్ పాలీ.. ఈ ఏడాది కూడా ఆయన నటించిన రెండు చిత్రాలు 'సంభవం అధ్యాయం ఒన్ను', 'ప్రతిఛాయ' మంచి విజయాన్ని అందుకున్నాయి. జియో హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. అయితే, సడెన్‌గా ప్రతిఛాయ(Prathichaya) చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఏప్రిల్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్కరోజు గ్యాప్‌లోనే తెలుగులో స్ట్రీమింగ్కు రావడం విశేషం.ప్రతిఛాయ మూవీ నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ఒక మలయాళ రాజకీయ థ్రిల్లర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో ప్రదర్శితమైనప్పుడు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇప్పుడు, నిర్మాతలు శ్రీ గోకులం మూవీస్ మరియు ఆర్డీ ఇల్యూమినేషన్స్ ఎల్ఎల్పి, ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందనే ఆశతో డిజిటల్ మాధ్యమం వైపు దృష్టి సారించారు.కేరళ రాజకీయాల చుట్టూ తిరిగే ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ ఉంటుంది. కేరళ ముఖ్యమంత్రి తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. దీంతో కొన్ని రోజుల తర్వాత మనస్తాపంతో సీఎం వర్గీస్ మరణిస్తాడు. ఇలాంటి సమయంలో ఆయన కుమారుడు జాన్ (నివిన్) రాజకీయాల్లోకి వెళతాడు. ఇష్టం లేకుండా పాలిటిక్స్‌లోకి వెళ్లిన జాన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఈ మూవీ అసలు కథ. తన తండ్రి నిజంగానే ఒక మహిళను వేధించాడా..? అనే మిస్టరీని జాన్ ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ప్రతిఛాయ చూడాల్సిందే. -
ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Behind every “perfect” romance can lie a calculated trap. Witness the moment Divya, Neha, and Surekha’s dreams spiraled into a nightmare.Watch #TheKeralaStory2, streaming from 8th May on ZEE5.#TheKeralaStory2OnZee5#TheKeralaStory2GoesBeyond #ShowYourDaughters… pic.twitter.com/TMdec083gG— ZEE5Official (@ZEE5India) April 24, 2026 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్‌తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24 నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24 ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24 సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24 అన్‌కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 మై డ్రెస్‌అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 2528యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26జియో హాట్‌స్టార్ ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24జీ5 బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24 జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24 నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24 మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24 ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లే గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్ మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24హులు..నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24ముబీ..సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 -
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. #Aadu3 (Malayalam) Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026 -
ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్ నాటక్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.కాగా.. ఈ చిత్రంలో మోల్శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్లో దొంగతనం చేస్తూ ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. Hindi LGBTQ Movie #NukkadNaatak (Hindi) streaming from April 24 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/7wt7ZEVEmO— OTT Trackers (@OTT_Trackers) April 20, 2026 -
ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్లలో చాలామందికి సరైన న్యాయం దక్కట్లేదు! ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ 'అస్సి'. రీసెంట్గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?పరిమ (కని కుస్రుతి) స్కూల్ టీచర్. భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా బతుకుతుంటుంది. ఓ రోజు స్కూల్లో ఆలస్యమై, ఇంటికొస్తుంటుంది. కానీ దారిలో ఈమెపై ఐదుగురు యువకులు దారుణానికి తెగబడతారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ అత్యాచారం చేస్తారు. చివరకు అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని రైల్వే ట్రాక్‌పై పడేస్తారు. తర్వాత ఏమైంది? పరిమకు న్యాయం దక్కిందా? ఈమె తరఫున వాదించిన లాయర్ రావి(తాప్సి)కి ఈ కేసు విచారణ సందర్భంగా ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అస్సి అంటే హిందీలో ఎనభై(80) అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపుగా 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సిన్హా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కళ్లు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు. అద్భుతమైన విజువల్స్ కనిపించవు. కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ, అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది.కథ పరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది. కొత్తగా ఏముందా అనే సందేహం కలుగుతుంది. కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన ఐదు నిమిషాలకే స్టోరీలోకి వెళ్లిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా? నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చూపించారు. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా? అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది.పోలీసులు, లాయర్లు కుమ్మక్కై.. కొన్ని కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా కనిపించదు గానీ ఓ రకమైన భయం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లోని ఆడవాళ్లకు ఇలా జరిగితే ఎలా? అని మనసులో అలజడి రేగుతుంది.ఈ సినిమాలో చూడటానికి కొన్ని సీన్స్ సాధారణంగా అనిపిస్తాయి గానీ వాటి మర్మం తెలిసినప్పుడు చిన్నపాటి షాక్ తగులుతుంది. అత్యాచారానికి గురై, కొన్నిరోజుల తర్వాత కోలుకున్న పరిమ.. తిరిగి టీచర్ ఉద్యోగంలో చేరతానని చెప్పినప్పుడు.. విద్యార్థుల గురించి స్కూల్ ప్రిన్సిపల్, పరిమ మధ్య జరిగే సంభాషణ ఒళ్లు గగుర్పొడేలా చేస్తుంది. నేటి సమాజంలో కొందరు టీనేజీ పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారో చెప్పకనే చెబుతుంది.సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చూపించే రెడ్ స్క్రీన్ గానీ, క్లైమాక్స్‌లో స్కూల్ పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి, తీర్పు ఇచ్చే సన్నివేశం గానీ బాగుంటాయి. పరిమ కొడుకు పాత్ర అయితే ఇంకా హైలైట్. తల్లిని ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుంచి కోర్టులో వాదనల వరకు ప్రతి విషయాన్ని ఈ పిల్లాడు గమనిస్తుంటాడు. చిన్నతనం నుంచే ఇలాంటివి చూస్తూ పెరిగితే.. పెద్దయ్యాక ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగల సత్తా పిల్లలకు డెవలప్ అవుతుందని ఈ సీన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.మన ఇంటిలోని ఆడవాళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా తోడుగా నిలబడాలి? ఎంత కేరింగ్‌గా చూసుకోవాలి అనే విషయాన్ని పరిమ భర్త పాత్రతో అద్భుతంగా చూపించారు. సరైన భద్రత లేని మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యమో ఈ సినిమాతో పరోక్షంగా హెచ్చరించారు. డబ్బున్న వ్యక్తుల కొడుకులు చాలామంది ఎలా తయారవుతున్నారు? ఇలాంటి వాళ్ల వల్ల సగటు మహిళలు, ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా చూపించారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశం ఆధారంగా సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎవరు మంచి? ఎవరు చెడు? అని మనం నిర్థారించలేం. దాన్ని కూడా దర్శకుడు చక్కగా బ్యాలెన్సింగ్ చేశాడు. ఇక క్లైమాక్స్‌లో ఓ చిన్న పాప చెప్పే సాక్ష్యంతో మొత్తం కేసు తీరే మారిపోతుంది. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ సీన్.ఎవరెలా చేశారు?లాయర్‌గా తాప్సి సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా పాత్రధారులు కూడా బాగా చేశారు. పరిమి పాత్రలో అత్యాచారానికి గురైన మహిళగా చేసిన కని కుస్రుతి అయితే అద్భుతంగా నటించింది. రైల్వే ట్రాక్‌పై అపస్మారక స్థితిలో పడున్నప్పుడు గానీ, కోలుకున్న తర్వాత ట్రామా అనుభవించే సీన్స్ చూస్తున్నప్పుడు నిజంగా జరిగిందేమో అనిపించేలా ఉంటుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా
మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల నటించిన 'లేచింది మహిళా లోకం' సినిమా నేడు(ఏప్రిల్ 22) ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదలా ఉండగానే మరో తెలుగు సినిమా కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చేసింది. మరో ఓటీటీలోకి వస్తుందని తాజాగా ప్రకటించారు. ఇంతలోనే ఇంకో దానిలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)హిట్, యానిమల్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా చేసిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రానికి బాల సతీష్ దర్శకుడు. మార్చి 06న థియేటర్లలో రిలీజైంది కానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.'మెన్షన్ హౌస్ మల్లేష్' విషయానికొస్తే.. పల్లెటూరికి చెందిన మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచే తాగుడికి బానిసవుతాడు. ఇతడికి తన బావ చిన్న పటేల్(రాజేష్)తో గొడవలు ఉంటాయి. ఓ సందర్భంలో తల్లి బలవంతం మీద జ్యోతి(గాయత్రి రమణ)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం రాత్రి మల్లేష్‌కి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మిగతా స్టోరీ. మగతనం నిరూపించుకుని భూమిని పొందాల్సిన పరిస్థితి ఓ యువకుడికి వస్తే ఏం చేసాడనే విషయాన్ని ఇందులో కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇది రిలీజ్ కావడానికి ముందే స్పై థ్రిల్లర్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. 'సిటాడెల్' సిరీస్ రెండో సీజన్‌పై ప్రకటన వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు చేసిన 'సిటాడెల్' సిరీస్ తొలి సీజన్.. 2023లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇది మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. మే 06వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో పాటు ఈసారి కొత్త మిషన్‌తో అలరించబోతున్నారు.'సిటాడెల్' తొలి సీజన్ విషయానికొస్తే.. ఎఫ్‌బీఐ, రా, ఐఎస్ఐలానే సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు కలిసి దీన్ని ఫ్రాన్స్ వేదికగా ఏర్పాటు చేస్తారు. ఏ ఒక్క దేశానికో అని కాకుండా ప్రజలందరిని రక్షించడమే దీని లక్ష్యం. అయితే సిటాడెల్‌ని నాశనం చేయాలని కొందరు డబ్బునోళ్లు 'మాంటికోర్' అని మరో స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హా(ప్రియాంక చోప్రా)లని అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. వీళ్ల దాడి నుంచి మేనస్, నాదియా ఎలా తప్పించుకున్నారు? అనేది తొలి సీజన్.అయితే ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ హీరోయిన్ సమంతని ప్రధాన పాత్రలో పెట్టి ఈ సిరీస్ రీమేక్ చేశారు. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా) -
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్‌కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026 -
ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా
పీరియాడిక్ సినిమాలు తీస్తూ వచ్చిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రూటు మార్చి ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు తీసిన సినిమా కొన్నాళ్ల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మరో దానిలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటి మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రస్తుతం చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న యువత డ్రగ్స్ వాడకం, మైనర్లపై అత్యాచారాలు తదితర అంశాలతో గుణశేఖర్.. 'యుఫోరియా' సినిమా తీశారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్ చేయగా భూమిక, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి రాగా రేపటి(ఏప్రిల్ 22) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'యుఫోరియా' విషయానికొస్తే.. చైత్ర(సారా అర్జున్) పెద్దింటి అమ్మాయి. చదువులో టాపర్. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటుంది. ఓ రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకు వికాశ్(విఘ్నేశ్ గవిరెడ్డి), అతడి ఫ్రెండ్స్ పరిచయమవుతారు. పబ్ నుంచి తిరిగి వెళ్తున్న టైంలో వికాశ్ గ్యాంగ్.. చైత్రని తమ కారులో ఎక్కించుకుని డ్రగ్స్ మత్తులో దారుణంగా అత్యాచారం చేస్తారు. పేరు మోసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పిల్లలు నిందితులుగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది? చైత్రకు న్యాయం దక్కిందా లేదా అనేది మిగతా స్టోరీ.ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలని స్పూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ క్రమంలోనే కొడుకు.. వావివరసలు మరిచి తల్లిపైనే దారుణానికి ఒడిగట్టడం, అత్యాచార సీన్ రీ క్రియేషన్ లాంటి కొన్ని సన్నివేశాలు డిస్ట్రబింగ్‌గా అనిపించాయి. అలా ఈ చిత్రం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో చాలామంది దృష్టి ఓటీటీలపై(OTT Movies) పడింది. వీటిలో కొత్త సినిమాలు ఏమున్నాయా? అని చూస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగు చిత్రాలు ఏమేం అందుబాటులో ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే గతవారం సంభవం అధ్యాయం ఒన్ను, సుయోధన, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, అస్సీ తదితర చిత్రాలతో పాటు పోచమ్మ అనే తెలుగు సిరీస్ కూడా రిలీజైంది.(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)మరోవైపు ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి. ఇవలా ఉండగానే రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇందులో ఒకటి స్ట్రెయిట్ మూవీ కాగా మరొకటి డబ్బింగ్ బొమ్మ.ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలోకి వచ్చిన 'జగన్నాథ్'(Jagannath Movie) అనే తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ భరత్, నిత్య, అజయ్, బాహుబలి ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇకపోతే 'ఆల్ఫా'(Alpha: Men Love Vengeance Movie) పేరుతో తీసిన కన్నడ డబ్బింగ్ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ స్టోరీగా దీన్ని తీశారు. మగాళ్లు అహంకారం, కోపం కారణంగా ఎక్కడివరకు వెళ్తారు? ఈ క్రమంలోనే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అన్నట్లు ఓ తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)అనుదీప్, అజయ్ కుమార్, వేద్విక తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'మత్తురా'. గతేడాది సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. పరిమిత బడ్జెట్, నటీనటులు కొత్తవాళ్లు కావడంతో ఇదొచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియెన్స్‌కి తెలీదు. ఇప్పుడీ మూవీ ఏడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'మత్తురా' విషయానికొస్తే.. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. మద్యం అలవాటు వారి జీవితాలని ఎలా నాశనం చేసింది? ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేలా చేసింది అనే అంశాలతో అడ్వెంచరస్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. పువ్వాళ చలపతి దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. 'గేదెల రాజు' అనే తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. మరోవైపు పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', అలానే లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ 'వాలా 2' కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం దాదాపు 19కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిఛాయ, బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం అనే తెలుగు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. హ్యాపీరాజ్ మూవీ కూడా ఇదే వీకెండ్ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఏ సినిమా ఏ రోజు ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు)హాట్స్టార్బ్రూక్లిన్ నైన్ నైన్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఏప్రిల్ 20ప్రతిఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 2424 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24 నెట్ఫ్లిక్స్రెజల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) - ఏప్రిల్ 19అన్ చూజన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 21హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 22స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 23అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్లేచింది మహిళా లోకం (తెలుగు సినిమా) - ఏప్రిల్ 22జీ5బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ఫ్రమ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కెవిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లేగ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
'యూత్'ను ఢీ కొట్టలేకపోయిన పవన్ కల్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. 'నా అభిమానుల్ని లెక్కపెట్టడానికి నీ జీవితం మొత్తం సరిపోదు' అంటూ విలన్‌కు కౌంటర్ ఇస్తారు. అయితే, రియాలిటీ మరోలా ఉంది. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పిన పవన్‌కు ఈ చిత్ర ఫలితం పునరాలోచనలో పడేసింది. కెరీర్లోనే ఎక్కువ నష్టాలను మిగిల్చిన చిత్రంగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే వాళ్లు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. చివరకు ఓటీటీలో కూడా ఒక చిన్న సినిమా ఉస్తాద్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పాపులర్ సినిమాతో యూత్ అనే చిన్న సినిమా ఢీ కొట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా యూత్ సినిమా ట్రెండింగ్ చార్టులో 2వ స్థానంలో ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. పవన్ మూవీకి స్టార్డమ్, క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన హిట్ తమిళ సినిమాతో పోలిస్తే ఉస్తాద్ సినిమా ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. -
'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
'మీర్జాపుర్' సిరీస్‌తో మున్నాభయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ఇతడు లీడ్ రోల్ చేసిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండేసరికి సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)దివ్యేందు, పులకిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'గ్లోరీ'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే నెల 01వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 'మీర్జాపుర్' సిరీస్ తీసిన కరణ్ అన్షుమన్ దీని సృష్టికర్త కావడంతో అంచనాలు నెలకొన్నాయి.'గ్లోరీ' సిరీస్ విషయానికొస్తే.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా బతికే కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ). ఇతడి కూతురు గుడియా (జన్నత్ జుబైర్)పై ఓ రోజు దాడి జరుగుతుంది. మరోవైపు వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్, అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో తండ్రి రఘుబీర్‌కి చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కొడుకులు దేవ్(దివ్యేందు), రవి (పులకిత్ సామ్రాట్) తిరిగి సొంతూరు శక్తిఘడ్కి వస్తారు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
దాదాపు పదేళ్ల క్రితం 'ప్రేమమ్' సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో నివిన్ పౌలీ.. తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత గతేడాది చివరలో 'సర్వం మాయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండు మూవీస్ చేశాడు. అందులో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)నివిన్ పౌలీ చేసిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతిఛాయ'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రొటీన్ స్టోరీ ఉండేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెలలోపే అంటే వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా రావొచ్చనే తెలుస్తోంది.'ప్రతిఛాయ' విషయానికొస్తే.. కేరళ ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పెద్ద కొడుకు జాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణలు వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అతడికి తెలిసిన నిజాలేంటి? రాజకీయాల్లో అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామంది మలయాళీ దర్శకులే గుర్తొస్తారు. మర్డర్ మిస్టరీ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికి ఎన్ని మూవీస్ తీసుంటారో లెక్కలేదు. వీటిలో చాలావరకు అద్భుతమైన హిట్స్ అయ్యాయి. ఇలాంటి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అలా గత నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ అయిన 'సంభవం అధ్యాయం ఒన్ను'.. రీసెంట్గా హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? నిజంగా అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?కేరళ-తమిళనాడు సరిహద్దులోని ఓ పోలీస్ స్టేషన్‌కి ఆనంద్(అస్గర్ అలీ) బదిలీ అవుతాడు. ఊరి లోపలికి వెళ్తుండగా వీళ్ల జీపుని ఢీకొని ఓ పోలీస్ గాయపడతాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చుతూ సదరు పోలీస్ దగ్గరున్న వాకీ టాకీని ఆనంద్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఈ క్రమంలోనే తను చేరాల్సిన స్టేషన్‌లోని అశోకన్, రెజీ అనే తోటి పోలీసులు ఆనంద్కి పరిచయమవుతారు. అనుకోని పరిస్థితుల్లో వాకీ టాకీలో తనని కాపాడమని ప్రాధేయపడుతున్న పోలీసుని కాపాడేందుకు వీరు ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్తారు. కాకి తల, మనిషి శరీరం ఉన్న ఆలయం దగ్గరకెళ్తారు. అప్పటినుంచి వింత సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? అడవిలో చిక్కుకుపోయిన పోలీసుని వీళ్లు కాపాడారా లేదా? కాకి ఆకారంలో ఉన్న గుడి మిస్టరీ ఏంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉంది?మలయాళం నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా ఇది. క్రైమ్, మిస్టరీ అనే అంశాలకు టైమ్ లూప్ అనే క్రేజీ కాన్సెప్ట్ జోడించారు. అయితే ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. కానీ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యేలా తీశారు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.1960లో ఓ విదేశీయుడు, ఓ భారతీయ మహిళ హత్యకు గురవడంతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తారు. ఆనంద్, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది నింపాదిగా చూపిస్తారు. తొలి అరగంట కాస్త ఓపిక పట్టాలి. ఎప్పుడైతే ఆనంద్, అశోకన్, రెజీ కలిసి పోలీసుని వెతికేందుకు అడవిలో వెళ్తారో అక్కడి నుంచి ట్విస్టులు మొదలవుతాయి. అప్పటివరకు సాగదీసినట్లు అనిపించిన కథ కాస్త గ్రిప్పింగ్‌గా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయి.మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌కి ముందొచ్చే సీన్, ఇంటర్వెల్ బ్లాక్‌లోని సీన్స్ ఆశ్చర్యపరుస్తాయి. అడవిలో జరిగే ఒక్కో సంఘటన చూస్తూ ఇటు ప్రేక్షకుడు, అటు ఆనంద్ మెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైతే కాకి ఆలయం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుందో.. అప్పుడు మొదట సీన్‌కి ప్రస్తుతం జరుగుతున్న దానికి లింక్ తెలుస్తుంది. చివరి అరగంట నలభై నిమిషాలైతే వరస పెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కనీసం వీటిలో ఒక్కటి కూడా మీరు ఊహించలేకపోవచ్చు. అరె అప్పుడే సినిమా అయిపోయిందా అనుకునేలోపు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి ముగించారు. బోలెడన్ని సందేహాలని వదిలేసి తర్వాత చాలానే భాగాలున్నాయని చెప్పకనే చెప్పేశారు.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన ఒక్కరూ కూడా మనకు తెలిసిన ముఖాలు కావు. అయినా సరే ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఎందుకంటే అలా నటించారు. చూస్తున్నంతసేపు వాళ్లు యాక్టర్స్, ఇది మూవీ అని అస్సలు గుర్తుకురానంత సహజంగా కుదిరేసింది. దర్శకుడు జీతూ సతీషన్కి ఇదే తొలి సినిమా అంటే అస్సలు నమ్మశక్యంగా అనిపించదు. దాదాపు అడవిలోనే తీశారు. సినిమాటోగ్రఫీ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ మరింత ఎలివేట్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.మలయాళీ దర్శకులకే ఇలాంటి క్రేజీ ఐడియాలు ఎందుకొస్తాయి? తెలుగు డైరెక్టర్స్‌కి ఎందుకు రావు అని.. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా అనిపిస్తుంది. దీని బడ్జెట్ కూడా రూ.5 కోట్లకు మించి ఉండదు. ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఓ మంచి క్రేజీ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో) -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక) -
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
మలయాళంలో తీసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీ డబ్బింగ్‌లు రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. రీసెంట్గా 'సంభవం అధ్యాయం ఒన్ను' అనే టైమ్ లూప్ థ్రిల్లర్ అలరిస్తుండగా.. ఇప్పుడు మరొకటి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 'దృశ్యం' తీసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్ నుంచి త్వరలోనే 'దృశ్యం 3' రాబోతుంది. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి రావాలి గానీ వచ్చే నెలకు వాయిదా వేశారు. ఈ దర్శకుడి తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ 'వలతు వషత్తే కల్లన్'. దృశ్యం తరహాలో మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. గత నెల చివరలో మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు.'వలతు వషత్తే కల్లన్' విషయానికొస్తే.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎథికల్ హ్యాకర్ శ్యామ్యూల్ జోసెఫ్(జోజూ జార్జ్) గతాన్ని వదిలేసి భార్యకూతురితో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటాడు. ఇతడి కూతురు లా స్టూడెంట్, యాక్టివిస్ట్. ఇకపోతే రాజకీయ నాయకుడు కొడుకు ఒకడు ఓ అమ్మాయి మరణానికి కారణమవుతాడు. స్థానిక పోలీసాఫీసర్ ఆంటోని(బిజూ మేనన్) చాలా అవినీతపరుడు. ఈ కుర్రాడిని కాపాడుతాడు. వీళ్లిద్దరిపై సదరు లా స్టూడెంట్ పోరాడుతుంది. ఇంతలోనే ఈమె దారుణ హత్యకు గురవుతుంది. మరి ఇద్దరిలో ఈమెని చంపింది ఎవరు? వారిపై జోసెఫ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్‌సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్‌గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్‌లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్‌లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్‌టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్‌ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్‌కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్‌స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్‌ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్‌కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్‌కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్‌తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి బలగం, కోర్ట్ తదితర సినిమాలతో లీడ్ రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ప్రియదర్శి లేటెస్ట్గా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ ఓటీటీల్లోకి కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సుయోధన'. వైఎస్ మాధవరెడ్డి దర్శకుడు. గత నెల 27వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కనీసం ప్రచారం చేయకుండానే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే ఎలాంటి ప్రచారం లేకుండా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది.'సుయోధన' విషయానికొస్తే.. వరుణ్ (ప్రియదర్శి) ఓ ఫోలే ఆర్టిస్ట్. అంటే సినిమాల్లో వినిపించే రకరకాల సౌండ్స్ సృష్టిస్తుంటాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ టైంలో ధుర్యోధనుడి రూపం ఇతడికి కనిపిస్తుంది. అలా జరిగినప్పుడల్లా వరుణ్ చాలా భయపడుతుంటాడు. మరోవైపు వరుణ్ తండ్రి ప్రకాశ్(సాయికుమార్) నాటకాల వేస్తుంటాడు. ఈయనకు ధుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. అలా ఓ సారి ఈ పాత్ర వేసిన తర్వాత ఈయన హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్దం వరుణ్‌కి వినిపించడానికి కారణమేంటి? ప్రకాశ్‌ని ఎవరు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా) -
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్‌బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17 -
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి యూత్, ఉస్తాద్ భగత్ సింగ్, సంభవం అధ్యాయం ఒన్ను, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటిపైనా బజ్ బాగానే ఉంది. ఇవి కాకుండా ఇప్పుడో తెలుగు చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)సాయి సింహాద్రి, మీరా రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సన్నాఫ్'. సీనియర్ నటుడ వినోద్ కుమార్ కీలక పాత్ర చేశారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కాగా ఇదొచ్చిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియలేదు. కంటెంట్ కావొచ్చు, స్టార్స్ లేకపోవడం వల్ల జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత ఆహా ఓటీటీలోకి ఏ మాత్రం హడావుడి లేకుండా వచ్చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది.'సన్నాఫ్' విషయానికొస్తే.. భార్య చనిపోవడంతో వెంకట్రావ్(వినోద్ కుమార్) తన కొడుకు ఆనంద్(సాయి సింహాద్రి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. మరోవైపు చదువులో ఫెయిల్ అవుతూ, అను(మీరా రాజ్) అనే అమ్మాయితో ఆనంద్ ప్రేమలో ఉంటాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నిశ్చితార్థం రోజు పనిపాటా లేని తన కొడుక్కి మీ అమ్మాయిని ఎలా ఇస్తారు? అని రచ్చ చేసి కార్యక్రమాన్ని ఆపేస్తాడు. దీంతో అవమానం తట్టుకోలేని ఆనంద్.. తండ్రి నుంచి వారసత్వంగా దక్కాల్సిన ఇల్లు, ఆస్తి కోసం కోర్టుకెక్కుతాడు. తర్వాత ఏం జరిగింది? ఆస్తి ఇవ్వడానికి ఆనంద్కి తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? ఆనంద్ చివరకు ఏం తెలుసుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!) -
ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026 -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్‌గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్‌ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్‌లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్కి గురైంది. ఇప్పుడీ సిరీస్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)ab rap aur badla bolega…out loud 🎤🔥#LukkheOnPrime, New Series, May 8 #King #RaashiKhanna #LakshvirSaran #PalakTiwarii #ShivankitParihar #NakulSahdev #KritikaBhardwaj @himankgaur #OptimystixEntertainment #WhiteGuerrilaLLP #VipulDShah @bahlrajesh #AgrimJoshi… pic.twitter.com/hEnvfRqdPN— prime video IN (@PrimeVideoIN) April 14, 2026 -
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్‌రూమ్ డ్రామా సినిమా
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). హిందీ వర్షన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించింది. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కన్నీళ్లు తెప్పించే పాత్రలో కనిపించింది.'అస్సీ' (Assi) చిత్రం 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పితృస్వామ్యం, సామాజిక ఉదాసీనత, బాధితులను నిందించడం, లైంగిక దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక క్షోభ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ చిత్ర కథను గౌరవ్ సోలంకి, అనుభవ్ సిన్హా రచించి నిర్మించారు. -
హారర్ థ్రిల్లర్ తెలుగు సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' తదితర తెలుగు సినిమాలతో పాటు 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం రాబోతున్నాయి. మన దగ్గర రిలీజయ్యేవన్నీ కూడా చిన్న మూవీస్, దానికి తోడు వేటిపైనా అస్సలు బజ్ లేదు.(ఇదీ చదవండి: నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్', యూత్, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మృణాల్ ఠాకుర్ 'దో దివానే షెహర్ మై' మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు చూడొచ్చనేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17అమెజాన్ ప్రైమ్ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17హాట్స్టార్సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17ఆహాపోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17జీ5రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15ఆపిల్ టీవీ ప్లస్మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 17బుక్ మై షోద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా?
పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్‌కు అదొక ఎమోషన్. కొరియన్ కల్చర్‌కు పట్టం కట్టే వెబ్ సిరీస్, కె–పాప్...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు. అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్ కల్చర్... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.విదేశీ కలల విహారం... ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే సినిమా కథలు మనం గతంలో చూశాం. పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్ ఇన్ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్ డేల్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బా అనే యువతి కలల కధే ఈ మేడ్ ఇన్ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా సాగుతుంది? అనేదే ఈ కథ.కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్‌గా, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా సాగుతుంది. ఇది కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ మనసును తాకుతాయి. యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్ డేల్ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్ కల్చర్ మిక్స్ కొత్తగా అనిపించడం మరో బలం.అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్‌గా ముగించేయడం ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే ‘‘మేడ్ ఇన్ కొరియా’’ ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా. ఒక వీకెండ్లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్ ఇన్ కొరియా బెస్ట్ ఛాయిస్. ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు డిఫరెంట్ స్టోరీలతో తీసిన బోలెడన్ని వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లలో అలా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న వాటిలో 'ఫ్రమ్' సిరీస్ ఒకటి. హీరో విశ్వక్ సేన్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరికొందరికి తెలిసింది. ఇప్పుడీ సిరీస్ నుంచి నాలుగో సీజన్ వచ్చేస్తోంది. రీసెంట్గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు అధికారిక ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)'ఫ్రమ్' సిరీస్ విషయానికొస్తే.. అమెరికాలోని ఓ రహస్య గ్రామం. ఇక్కడికి ఒకసారి వచ్చినవాళ్లు తిరిగి బయటపడలేరు. పొద్దున్న అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రయితే ఈ ఊరిలో నరరూప రాక్షసుల్లాంటి మనుషులు తిరుగుతారు. వాళ్ల నుంచి ఇక్కడ ఉండే కొందరు ఎలా తమని తాము రక్షించుకున్నారు? ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడి నుంచి బయటపడ్డారా అనేదే కాన్సెప్ట్. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 4వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని కొత్త మూవీస్ వచ్చాయి. వీటిలో తాయ్ కిళవి, శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర చిత్రాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రభాస్ 'ఈశ్వర్' సినిమాలో నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను కోట్ల.. హీరోగా చేసి, దర్శకత్వం వహించిన మూవీ 'ద డీల్'. 2024 అక్టోబరులో థియేటర్లలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా స్టార్స్ లేకపోవడం, సరైన స్టోరీ కూడా లేకపోవడంతో ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడీ మూవీ అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'ద డీల్' విషయానికొస్తే.. యాక్సిడెంట్ దెబ్బకు గతం మర్చిపోయిన భైరం(హను కోట్ల) మెలకువ వచ్చిన తర్వాత లక్ష్మి(ధరణి ప్రియా) అనే పేరు కలవరిస్తుంటాడు. ఈమె తన భార్య అని, కలవాలని అంటాడు. మరోవైపు తనని చంపాలని చూస్తున్నారనే విషయం తెలుసుకున్న భైరవ.. తాను అసలు ఎవరో అని కనుగొనే ప్రయత్నంలోనూ ఉంటాడు. మరి భైరవ జీవితంలో ఇందు, మాధవ్ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్‌తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత కనీసం నాలుగు వారాల గ్యాప్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ పవన్ కల్యాణ్ తాజాగా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెటిఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.థియేటర్స్‌లో ఫ్లాప్ టాక్.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాఖీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మరోవైపు అదే రోజు వచ్చిన దురంధర్ 2 చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఉస్తాద్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే నిర్మాణ సంస్థ కనీసం కలెక్షన్స్ పోస్టర్ కూడా వేసుకోలేకపోయింది.నెలలోపే.. వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కనీసం 5-6 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి నెట్‌ఫ్లిక్‌లో అందుబాటులోకి వస్తుంది. తెలుగులో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మరి ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే. Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu 🔥🚨 pic.twitter.com/5tYUxKmuKA— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే?
కొన్ని వెబ్ సిరీస్‌లు చూడటం మొదలుపెడితే మధ్యలో ఆపేయడం చాలా కష్టం. గంటల తరబడి స్క్రీన్కు అతుక్కుపోయి మరీ ఆ సిరీస్‌ను పూర్తి చేయాలనిపిస్తుంది. ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తూ ప్రేక్షకుల్ని తన వశం చేసుకుంటాయి. అలాంటి సిరీసే "ఫ్రమ్". ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్, హారర్ సిరీస్. జాన్ గ్రిఫిన్ సృష్టించిన ఈ సిరీస్ 2022లో ఓటీటీలో విడుదలైంది. నాలుగో సీజన్కథ, డైరెక్షన్ అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ సిరీస్‌గా నిలిచింది. దీంతో 2023లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ విడుదలయ్యాయి. కానీ నాలుగో సీజన్ మాత్రం వెంటనే రిలీజవ్వలేదు. దీంతో నాలుగో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్రమ్ సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఏప్రిల్ 20న ఫ్రమ్ నాలుగో సీజన్ విడుదలవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. దీంతో ఫ్రమ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సిరీస్‌లో అసలేముంది?రోడ్డుపై జాలీగా వెళ్తుంటే సడన్‌గా ఓ భారీ చెట్టు పడిపోతుంది. దాంతో వాహనదారులు పక్కనే ఉన్న ఇంకో దారి గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ దారి ఒక నిర్మానుష్యమైన టౌన్‌కు దారి తీస్తుంది. ఎంతసేపు ప్రయాణించినా చివరకు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వస్తారు తప్ప గమ్యాన్ని చేరుకోలేరు. దాంతో రాత్రి ఆ టౌన్లో సేద తీరేందుకు వెళ్తారు. అయితే అక్కడ రాత్రి అయిందంటే చాలు దెయ్యాలు మనుషుల్ని చంపేందుకు బయటకు వస్తాయి. అవి ఇంట్లోకి రాకుండా తలుపుకు ఒక లాకెట్ పెడతారు. కానీ కిటికీ తెరిస్తే మాత్రం అవి లోపలకు వచ్చి రక్తపాతం సృష్టిస్తాయి. రోడ్డు మీద వెళ్లే ఒక్కొక్కరూ నెమ్మదిగా ఈ టౌన్లో స్థిరపడుతూ ఉంటారు. రాత్రవగానే బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఎప్పటికైనా తిరిగి ఇంటికి చేరుకోవాలన్న ఆశతో బతుకుతుంటారు. మరి వారు ఇంటికెళ్లే మార్గాన్ని కనుగొన్నారా? అసలు ఈ భయంకర ప్రదేశాన్ని ఎవరు సృష్టించారు? అందుకు గల కారణాలేంటి? అన్నది నాలుగో సీజన్లో అయినా బయటపెడతారేమో చూడాలి! time to shut the windows 🫣#FromOnPrime, New Season, April 20 pic.twitter.com/YBOVGHAv04— prime video IN (@PrimeVideoIN) April 10, 2026 చదవండి: రూ.10 కోట్ల మోసం.. మంగ్లీపై కేసు -
ఓటీటీలో సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
ఒకప్పటి హీరోయిన్ రాధిక లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి'. నిర్మాతల్లో హీరో శివకార్తికేయన్ ఒకరు. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.81 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)కథేంటి?పపున్‌తాయ్(రాధిక) ఓ పల్లెటూరి బామ్మ. ఊరిలో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకుని పారిపోతుంటారు. దీంతో ఈమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా ముగ్గురు కొడుకులు ఈమెని వదిలేసి వెళ్లిపోతారు. కట్నంగా మాట్లాడుకున్న మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు, ఈమె కూతురు సురులి(రైచల్ రెబెకా)ని వదిలేస్తాడు. దీంతో కూతురు, మనవడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపున్తాయ్కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ మాత్రం చేస్తుంటుంది. ఈమె చనిపోవడం పక్కా అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, కోడళ్లు తిరిగొస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందనే రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీనికోసం కొడుకులు, కోడళ్లు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకపోతే సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులని పట్టించుకోరు. అలా డబ్బు వల్ల రోజురోజుకీ దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్‌గా చూపిస్తూ చివరలో అద్భుతమైన సందేశం ఇచ్చిన సినిమా 'తాయ్ కిళవి'. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు. మన పక్కనే ఉండే చాలామంది వ్యక్తులా జీవితంలా అనిపిస్తుంది.మనం ఊళ్లలో చూసే గడుసు బామ్మలు ఎలా ఉంటారో పపున్‌తాయ్ కూడా అలానే ఉంటుంది. మాటతీరు, ప్రవర్తన, ఊరిలో ప్రతిఒక్కరిపై చూపించే ఆజమాయిషీ లాంటివి చూపిస్తూ ఈమె పాత్రని పరిచయం చేశారు. ఈమెకు పక్షవాతం రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆస్తి పంచుకోవాలని ఆరాటపడుతూ తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఈమె కొడుకులు, కోడళ్లు చేసే పనులు కాస్త అతిగా అనిపిస్తాయి. నిజ జీవితంలో మరీ ఇలా ప్రవర్తించేవాళ్లు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడైతే 160 తులాల బంగారం గురించి కొడుకులకు తెలుస్తుందో స్టోరీ ట్రాక్‌లో పడుతుంది. అప్పటినుంచి వచ్చే ప్రతి సీన్, చుట్టూ ఉండే పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో పపున్తాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వ్యవహరించే తీరు కూడా నవ్విస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్న పలు విషయాల్ని గుర్తుచేస్తాయి. చివరగా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బామ్మ తన సైగలకు అర్థం చెప్పినప్పుడు ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్ అనిపిస్తుంది. నిజంగా ఈమె దగ్గర అంత బంగారం ఉందా లేదా అనే సీన్ ఆకట్టుకుంది. అలానే మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపున్‌తాయ్, ఆమె కూతురితో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురిచేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి.ఎవరెలా చేశారు?పపున్‌తాయ్ అనే వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. ప్రారంభంలో పది నిమిషాలు, చివరి అరగంట మాత్రమే ఈమె కనిపిస్తుంది. కానీ గెటప్, క్లైమాక్స్‌లో ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు అదేం పెద్ద సమస్యగా అనిపించదు. ఫస్టాప్ లో కాస్త అతి అనిపిస్తుంది కానీ కథలో లీనమైన తర్వాత అవేం పెద్దగా గుర్తుండవు. కమల్ హాసన్ పాటల రిఫరెన్స్‌లతో వచ్చే హంగామా కూడా అలరించింది.'జీవితంలో ఎవరైనా డబ్బు అవసరం లేదని అంటే వాళ్లు డబ్బు సమస్య లేకుండా బతుకుతున్నారని అర్థం. అలాంటి వాళ్ల మాటలు విని మీరు కూడా అలా బతికితే.. అమ్మ నగలు దాచిపెట్టిందా? నాన్న ఆస్తి రాకపోతుందా? అని ఎదురుచూడాల్సి వస్తుంది' అని బామ్మ చెప్పే డైలాగ్.. మనిషికి డబ్బు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రాసుకున్న స్టోరీ గానీ తీసిన విధానం గానీ సూపర్. సాంకేతికంగానూ మూవీ బాగుంది. ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే మృణాల్ ఠాకుర్ నటించిన ఓ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఓవైపు ఈమె నటించిన 'డెకాయిట్' చిత్రం థియేటర్లలోకి రాగా ఇప్పుడు మృణాల్ కొత్త మూవీ ఒకటి డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగులోనూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మృణాల్.. స్వతహాగా ముంబైకి చెందిన నటి. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయ్యేసరికి ఎక్కువ ఫోకస్ హిందీ మూవీస్‌పై పెట్టింది. అలా సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి సినిమానే 'దో దివానే షెహర్ మే'. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓ మాదిరిగా మెప్పించింది. ఇప్పుడిది రాబోయే శుక్రవారం (ఏప్రిల్ 17) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.దో దివానే షెహర్ మే సినిమా విషయానికొస్తే.. శ అనే అక్షరం సరిగా పలకడం రాని శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరోవైపు పెద్దపెద్ద కళ్లద్దాలు పెట్టుకుని తానేం అందంగా లేనని భావించే రోష్ని(మృణాల్ ఠాకుర్).. పెద్దల కుదిర్చిన పెళ్లిచూపుల ద్వారా కలుసుకుంటారు. మొదట శశాంక్ని రిజెక్ట్ చేసిన రోష్ని తర్వాత అతడితోనే ఎలా ప్రేమలో పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ప్రస్తుత జెన్-జీ జనరేషన్‌కి తగ్గట్లుగా తీసిన ఈ సినిమాలో స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేలో లోపాల కారణంగా ఓకే ఓకే అనిపించుకుంది. అయితే ఓటీటీలో హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ప్రస్తుతం అంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కావడం ఆలస్యం.. నెల, నెలన్నరలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చాన్నాళ్ల తర్వాత అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి దీని సంగతి? ఎందులో ఉంది?స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. 'శబ్దం' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 28న తెలుగు, తమిళంలో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. గతంలో ఆదితోనే 'వైశాలి' తీసిన అరివళగన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సక్సెస్‌ని రిపీట్ చేయలేకపోయారు. ఇకపోతే ఈ మూవీ తమిళ వెర్షన్.. గత నెల 24న జీ5 ఓటీటీలోకి వచ్చింది. తర్వాత కొన్నిరోజులకు హిందీ వెర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.'శబ్దం' విషయానికొస్తే.. మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీ. అందులోని విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు అనుమానస్పద రీతిలో చనిపోతుంటారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం.. ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో కాలేజీ మొత్తం పరిశోధిన జరిపించి దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం(ఆది పినిశెట్టి)ని తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలని తన దగ్గరున్న సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు.అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక(లక్ష్మి మేనన్)పై వ్యూమాకి అనుమానం మొదలవుతుంది.ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగానికి సిద్ధపడగా, అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు కనిపెడతాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
తెలుగులో హీరోయిన్, సహాయ నటిగా సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈమె నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నెలలోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)పూర్ణ, విదార్థ్, త్రిగుణ్, బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'డార్క్ నైట్'. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సంగతే జనాలకు పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు.'డార్క్ నైట్' విషయానికొస్తే.. అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ) భార్యభర్తలు. పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారు. లాయర్ అయిన అలెక్స్.. తన ఆఫీసులోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో అక్రమ సంబంధంలో ఉంటాడు. ఇది తెలిసిన హేమ.. అలెక్స్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. అలెక్స్‌తో పాటే జిమ్ ట్రైనర్తోనూ సంబంధం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అలెక్స్.. తిరిగి హేమ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోషన్(త్రిగుణ్)తో హేమకు స్నేహం కుదురుతుంది. అలెక్స్, హేమ కలవడం రోషన్‌కి నచ్చదు. మరి తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమా మొత్తం లీక్.. ఇది ఎవరి పని?) -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10 ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10జియో హాట్స్టార్తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10సోనీ లివ్ తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10సన్ నెక్స్ట్ హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10 కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లే వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10 -
ఓటీటీకి సూపర్ హిట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన సినిమాలు తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రైమ్ స్టోరీస్, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు మలయాళ మూవీస్ సైతం ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ హిట్ అయినా సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జీతూ సతీషన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. -
ఓటీటీలో 'ధురంధర్-2' ట్విస్ట్.. మరింత ఆలస్యం
రణవీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్ మూవీ 'ధురంధర్-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. హౌస్‌ఫుల్ థియేటర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు టాక్ ఉంది.సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు 8వారాల థియేటర్ రన్ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు. మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ ధురంధర్-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని జియోహాట్‌స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు. -
‘చిరయ్యా’ రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది!
ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు గాని వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబసభ్యులైనా అంతెందుకు కట్టుకున్న భాగస్వామికి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి అనే సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్యా. దివి నిథి శర్మ ఆలోచనకు శశాంత్ సింగ్ దర్శకత్వం వహించి తెర రూపమిచ్చిన సిరీసే ఈ చిరయ్యా. చాలా సున్నితమైన అంశాన్ని చక్కటి డ్రామాతో 6భాగాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు.పెళ్ళైతే చాలు కట్టుకున్న పెళ్ళాం ఇష్టం తో పని లేకుండా తనని తన సొంత ఆస్తిలా భావించే ప్రబుద్ధులకు ఈ సిరీస్ ఓ గుణపాఠమనే చెప్పాలి. హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. కాని చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సు చివుక్కుమనడం ఖాయం. పెళ్లైన ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓసారి చూద్దాం. పెద్దలు కుదిర్చిన సంబంధంతో పూజ అరుణ్ ని పెళ్ళి చేసుకుని అత్తింట్లో అడుగుపెడుతుంది. అత్తమామలు ఇద్దరితో పాటు మిగతా కుటుంబసభ్యులంతా ఎంతో అపురూపంగా చూసుకుంటారు పూజని. ఆ కుటుంబంలో అరుణ్ వదిన దివ్య మొదట్లో పూజని కాస్త బెట్టుగా చూసినా తరువాత కలిసిపోతుంది. అందరూ బాగున్నా అరుణ్ తో పూజకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య గురించి తాను ఎవ్వరితో చెప్పుకోలేదు. అప్పుడు దివ్యకి పూజ సమస్య తెలుస్తుంది. కన్నబిడ్డ కన్నా ఎంతో అనురాగఆప్యాయతలతో పెంచిన అరుణ్ అసలు స్వరూపం తెలుసుకున్న దివ్య పూజకి ఎలాంటి పరిష్కారం చూపుతుందో చిరయ్యా సిరీస్ చూసే తెలుసుకోవాలి. నిజానికి ఈ సిరీస్ లోని పాయింట్ చాలా సున్నితమైన అంశం. దర్శకుడు ఎక్కడా అశ్లీలతకు ఎక్కువగా తావివ్వకుండా ఎంతో హుందాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే ధీటుగా ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా ఉందీ సిరీస్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పరిష్కారం సూపర్ అని చెప్పాలి. పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్ కు మంచి కాలక్షేపం.-హరికృష్ణ ఇంటూరు -
ఈ వారం OTTలో సినిమాల జాతర.. ఆ చిత్రాలు మాత్రం డోంట్ మిస్ !
-
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్‌కు సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్‌కపూర్ అంతకుముందు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అడివి శేష్ 'డెకాయిట్'గా వస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదే ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ ఫలితం ఏంటనేది చూడాలి. దీనితో పాటు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', టొవినో థామస్ 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రాధిక శరత్ కుమార్ 'తాయ్ కిళవి' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. తు యా మై, హాళ్ అనే పరభాషా చిత్రాలు కూడా పర్లేదనిపించేలా అనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్‌లు ఏమైనా ఉండొచ్చనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 6 నుంచి 12 వరకు)నెట్ఫ్లిక్స్బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 0818th రోజ్ (ఫిలిప్పినో మూవీ) - ఏప్రిల్ 09బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 9త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 08క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10హాట్స్టార్తాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10సోనీ లివ్‌తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10సన్ నెక్స్ట్హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ఔట్కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లేవైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. మృత్యుంజమ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి అనే తెలుగు చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', 4వ అధ్యాయం లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు వీటితోపాటు ఓ తెలుగు హారర్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)మదనపల్లెలో తీసిన ఈ సినిమాలో సంతోశ్, సయ్యద్ ఆజం, గౌష్ బాషా, మళ్లీశ్వరమ్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. శివాజీ, సురేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి, సితారే జమీన్ పర్ తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)2024లో తమిళ వచ్చిన ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ 'అధర్మ కదైగల్'. వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కామరాజ్ వెల్ దర్శకుడు. ఇప్పుడీ ఈ సినిమానే '4వ అధ్యాయం' పేరిట తెలుగులో ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగానే స్ట్రీమింగ్ అవుతోంది.'4వ అధ్యాయం' విషయానికొస్తే.. మొదటి కథలో నందిని అనే నర్స్, గాయపడిన ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది. రెండో కథలో ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు.. డబ్బుల కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తాడు. మూడో స్టోరీలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరసగా హత్యకు గురవుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే అమ్మాయి, తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్భానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు చివరకు ఎలా ముగిశాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు) -
ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ డైరెక్ట్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు నటించారు. ఈ మూవీని రాజ్‌కుమార్ రావు సతీమణి నటి పత్రలేఖ కంపా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథ మొత్తం భార్యాభర్తల మధ్య జరగనుందని అర్థం అవుతుంది. మహా పిసినారి పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఒకరోజు పెళ్లికి వెళ్లిన రాజ్ కొత్త జంట కోసం రూ. 5వేలు విలువ చేసే ఒక టోస్టర్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. అయితే, పలు కారణాలతో ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో తాను ఇచ్చిన కానుకను తిరిగి ఇవ్వాలని పెళ్లి వారి ఇంటికి వెళ్తాడు. తను గిఫ్ట్‌గా ఇచ్చిన వస్తువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది పూర్తి స్టోరీలో రివీల్ కానుంది. -
రామాయణతో ఓటీటీ బిగ్ డీల్.. నో చెప్పిన నిర్మాత!
రామాయణ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఓటీటీ నుంచి కూడా భారీ ఢీల్ వచ్చినట్లు సమాచారం. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1 ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా, కన్నడ నటుడు యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్ల వరకు ఓటీటీ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చారట. అయితే ఈ భారీ ఆఫర్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి దీర్ఘకాలిక విలువ, ప్రపంచవ్యాప్త సామర్థ్యంపై మల్హోత్రాకు గట్టి నమ్మకం ఉన్నందువల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా, ఈ ప్రాజెక్ట్ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మరింత లాభాన్ని పొందవచ్చు అనేది నిర్మాతల వ్యూహమని అంటున్నారు. వెయ్యి కోట్ల ఓటీటీ ఆఫర్‌ను కాదనడంతో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఇంతటి భారీ అంచనాలు ఉండటం వల్లనే రామాయణ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. -
ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి
ఇప్పుడంతా ఓటీటీ జమానా. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూస్తున్నారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. భయంకరమైన మొసలి.. ఓ ప్రేమ జంటని వెంటాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. ఇంతకీ ఇది ఎందులో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన హిందీ మూవీ 'తు యా మై'. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. 2018లో వచ్చిన థాయ్ సినిమా 'ద పూల్' ఆధారంగా దీన్ని తీశారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది గానీ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.'తు యా మై' విషయానికొస్తే.. అవని(షనయ కపూర్) మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బాగా డబ్బున్న అమ్మాయి. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా(ఆదర్శ్ గౌరవ్) ఓ ర్యాపర్. గల్లీలో పెరుగుతుంటాడు. ఓ వీడియో చేసేందుకు వీళ్లిద్దరూ కలుస్తారు. తర్వాత ప్రేమలో కూడా పడతారు. కలిసి గోవా వెళ్లిన టైంలో ఓ పాడుబడిన హోటల్లో చిక్కుకుపోతారు. అక్కడి స్మిమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్లని ఓ మొసలి వెంటాడుతుంది. దీని నుంచి ప్రేమజంట బయటపడ్డారా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?) -
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఓటీటీలు అనగానే చాలామంది థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ సిరీస్ తీశారు. అదే 'పోచమ్మ'. దీని గ్లింప్స్‌ని 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి)సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ లీడ్ రోల్ చేస్తుండగా.. శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. శ్రుతి నాయుడు నిర్మించగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే.. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమని అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనేది స్టోరీ అనిపిస్తుంది.పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది.మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హనుమాన్ ఫేమ్ వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 6న విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా రాణించలేకపోయింది. ఈ సినిమాతో వరలక్ష్మీ దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడనివారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. సరస్వతి కథేంటంటే..లక్ష్మి(వరలక్ష్మి శరత్‌కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్‌స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03 -
'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో అప్పట్లో హిట్స్ కొట్టి, స్టార్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న గుణశేఖర్.. గత కొన్నేళ్ల నుంచి బాగా వెనకబడిపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి పీరియాడిక్ మూవీస్ తీసి చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర వీటికి భారీ నష్టాలొచ్చాయి. దీంతో చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పటితరం యువత కనెక్ట్ అయ్యేలా 'యుఫోరియా' సినిమా తీశారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వస్తున్న సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ తన సినిమా గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి దర్శకుల్ని ప్రోత్సహించాలని వేడుకున్నారు.(ఇదీ చదవండి: ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు)'ఫిబ్రవరి నెల ఆరంభంలో అందరికీ జీతాలు వస్తాయి. మంచి తేదీ అని 'యుఫోరియా' రిలీజ్ చేశాను కానీ జనాలు చూడలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు చూశామని చెప్పి యుఫోరియా లాంటి చిన్న చిత్రాల్ని పట్టించుకోలేదు. ఈ టైటిల్ వల్ల కూడా థియేటర్లలో మూవీ సరిగా ఆడలేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్ ఆడియెన్స్ కోసం, కానీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మమ్మల్నే అడిగారు. రిలీజ్ టైంలో తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు''భూమిక.. లండన్‌లో ఉన్నప్పుడు స్టోరీ చెప్పాను. ఈ పాత్ర నమ్మితే మీకు అవార్డ్ వస్తుందని అప్పుడే చెప్పాను. నేను చెప్పినట్లే ఆమెకు ఉత్తమ సహాయ నటిగా గద్దర్ అవార్డ్ వచ్చింది. నాకు ఉత్తమ కథా రచయితగా పురస్కారం దక్కింది. థియేటర్లలోకి వచ్చిన సినిమాలని మూడు నెలల వరకు ఓటీటీల్లో రిలీజ్ చేయకూడదు. అలా అయితేనే థియేటర్ బతుకుంది. ఇండస్ట్రీకి ఇదే నా విన్నపం. ఈ మధ్య క్లైమాక్స్‌లో దేవుడి విశ్వరూపాలు చూపించి హిట్స్ కొడుతున్నారు. కథని నమ్మి సినిమాలు తీసే నాలాంటి దర్శకుల్ని ప్రోత్సహించండి' అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)మీడియాతో చర్చించిన గుణశేఖర్.. 'మహేశ్ బాబుని యుఫోరియా చూడమని నేను అడగలేదు. కానీ తనంతట తానుగానే చూశాడు. అలానే ట్వీట్ చేశాడు. నేను సక్సెస్ మీట్ పెట్టి పిలిస్తే వచ్చేవాడు కూడా. యుఫోరియా.. ధురంధర్ రేంజ్ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే తీశాను. ఎందుకంటే ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్' అని అన్నారు.సారా అర్జున్, భూమిక, గౌతమ్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. కానీ జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. గుణశేఖర్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవడం కావొచ్చు, లేదంటే స్టార్స్ ఎవరూ లేకపోవడం కూడా ఈ మూవీ సరిగా ఆడకపోవడానికి కారణాలు కావొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్') -
ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా
తెలుగులో దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కాస్త డిఫరెంట్ చిత్రాలు చూద్దామనుకుంటే మన ప్రేక్షకులు చాలామంది తమిళ, మలయాళం వైపు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఇండస్ట్రీల నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన మూవీస్ వస్తుంటాయి. ఇవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆదరణ బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు శశికుమార్ లేటెస్ట్ తమిళ మూవీ 'మై లార్డ్'. పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్‌తో తీసిన సోషల్ డ్రామా చిత్రమిది. చైత్ర ఆచార్ హీరోయిన్ కాగా రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. మార్చి 20 నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.'మై లార్డ్' విషయానికొస్తే.. అనాథలైన ముత్తుసిరిపి(శశికుమార్), సుశీల (చైత్ర ఆచార్) అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓరోజు గుడికి వెళ్లిన సుశీల కళ్లుతిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. అలానే తమకు తెలియకుండానే తమ శరీరంలోని కిడ్నీలు దొంగిలించారని వీళ్లకు తెలుస్తుంది. వీళ్లిద్దరూ చనిపోయారని ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ కేంద్రమంత్రికి కిడ్నీ దానం చేయాలని కొందరు వీళ్లని బలవంతపెడుతూ ఉంటారు. దీంతో ఓ చిన్న జర్నలిస్టు సాయంతో ముత్తుసిరిపి, సుశీల.. తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.థియేటర్లలో రిలీజైనప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. హీరో సూర్య.. తన బ్యానర్‌పై 'మై లార్డ్'ని సమర్పించడం విశేషం. సెకండాఫ్‌లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చేసి రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడడం మిస్సయివారు ఎంచక్కా ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.The business begins!#HeyBalwanthSTREAMING NOW #TeluguZee5 #Suhas #HeyBalwanthOnZee5 pic.twitter.com/34BOOlrBJR— ZEE5 Telugu (@ZEE5Telugu) March 30, 2026 -
ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) View this post on Instagram A post shared by JioHotstar Tamil (@jiohotstartamil) -
ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
నోరు జారిన కారణంగా రీసెంట్ టైంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు శివాజీ.. గతేడాది 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. లేటెస్ట్గా ఈయన ఓ చిత్రాన్ని నిర్మించి అందులో లీడ్ రోల్ చేశారు. లయ జంటగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా శివాజీ-లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాని తొలుత ఓటీటీ కోసమే తీశారు. కానీ ఏమైందో ఏమో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(ఏప్రిల్ 03) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయానికొస్తే.. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ కార్యదర్శి. హర్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. దీపావళి నాడు వీళ్ల ఇంటికి ఎస్సై విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) వస్తాడు. ఇతడికి ఆడవాళ్ల పిచ్చి. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలిసి ఉత్తరపై బలత్కారం చేయబోతాడు. అనుకోని విధంగా బిట్టు చేతిలో ఎస్సై హత్యకు గురవుతాడు. తర్వాత ఏమైంది? హత్య కేసు నుంచి శ్రీరామ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ప్రేమిస్తే' ఆడిషన్‌కు గ్రీజు పూసుకుని వెళ్లా..) -
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనకు కాస్తా రిలీఫ్ ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలా మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడ్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం ఎంటర్టైన్ చేసేందుకు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు లెజెండ్ శరవణన్ హీరోగా వస్తోన్న లీడర్ కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. వీటిలో బైకర్, రాకాస, కార్మేని సెల్వం చిత్రాలపై బజ్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ నుంచి సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్-2 లాంటి మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే దాదాపు 16 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04జియో హాట్‌స్టార్..సెండ్ హెల్ప్(హాలీవుడ్ హారర్ మూవీ)- మార్చి 31ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..హే బల్వంత్(తెలుగు సినిమా)- మార్చి 31బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)-ఏప్రిల్ 03 -
చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?
స్టార్ హీరో అనే ట్యాగ్ లైన్.. సొంత ఇండస్ట్రీ, అభిమానుల వరకు పనికొస్తుందేమో గానీ మార్కెట్ లెక్కలు వచ్చేసరికి అవన్నీ మారిపోతుంటాయి. సక్సెస్ ట్రాక్ ఎలా ఉంది? ఏయే దర్శకులతో పనిచేస్తున్నారు? లాంటి లెక్కలు చాలా ఉంటాయి. ఇప్పుడు అలానే చిరంజీవి, ప్రభాస్ కొత్త చిత్రాలకు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అందుకే రిలీజ్ డేట్స్‌పై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?)చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకుడు. రెండేళ్ల క్రితమే దీన్ని థియేటర్లలోకి తీసుకొద్దామని అనుకున్నారు. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో లెక్కలన్నీ మారిపోయాయి. గ్రాఫిక్స్‌పై దారుణమైన విమర్శలు, ట్రోల్స్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అదలా సాగుతూనే ఉంది. ఈ మూవీకి ఇప్పటివరకు ఓటీటీ డీల్ జరగలేదు. అందుకే విడుదల తేదీపై నిర్మాతలు తేల్చకోలేకపోతున్నారు.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టారని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఓ ఈవెంట్లో చెప్పారు. ఈ సినిమాకు ఓటీటీ రేట్ విషయంలో ఇంకా తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి వేసవిలోనూ థియేటర్లలోకి రావడం కష్టమే అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జూన్ 4 టాక్సిక్ ఉంది. 26వ తేదీన అఖిల్ 'లెనిన్' రిలీజ్ కానున్నాయి. ఆపై నెలల్లోనూ 'ప్యారడైజ్' లాంటి పెద్ద మూవీస్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చిరు చిత్రం.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని ఈ ఏడాదైనా వస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. కొత్త టీజరో ట్రైలరో వచ్చి ఆకట్టుకుంటే తప్ప 'విశ్వంభర'పై ప్రేక్షకులు దృష్టిపడే అవకాశం లేదు.ప్రభాస్ 'ఫౌజీ' చిత్రానికి కూడా ఇంకా ఓటీటీ డీల్ జరగలేదు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. ప్రభాస్ గత చిత్రం 'రాజాసాబ్' ఓటీటీలో అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మ్ చేసింది. అందుకే 'ఫౌజీ' విషయంలో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ మొత్తం రేటు ఆఫర్ చేస్తున్నాయట. లెక్క ప్రకారం ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ డిజిటల్ డీల్ సెట్ అవ్వకపోతే విడుదల కచ్చితంగా వాయిదా పడుతుంది. మరి చిరు, ప్రభాస్ మూవీస్ సమస్య పరిష్కారమైతే సరేసరి. లేదంటే మాత్రం ఈ రెండింటిని వచ్చే ఏడాది చూస్తాస్తేమో?(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్) -
ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన విజయ్ వర్మ.. కొన్నాళ్ల క్రితం తమన్నాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు కూడా. ఇప్పుడు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు. విజయ్ వర్మ నటించిన క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో ఉస్తాద్ భగత్‌సింగ్..!)మట్కా పేరుతో గతంలో బెట్టింగ్ తరహా గేమ్ ఉండేది. ఇప్పుడు దీన్ని బ్యాక్‌డ్రాప్ స్టోరీగా తీసుకుని తెరకెక్కించిన సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ, కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 'సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుందని తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో ప్రకటించారు.టీజర్ బట్టి చూస్తే.. ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ క్రమంలోనే అండర్ వరల్డ్, పోలీసులని ఎలా ఎదుర్కొన్నాడు? తదితర అంశాలే స్టోరీ అని తెలుస్తోంది. గతంలో తెలుగులో 'మట్కా' పేరుతో వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చింది గానీ అది ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడొస్తున్నది సిరీస్ కాబట్టి ఇందులో స్టోరీ మరింత రియలస్టిక్‌గా చూపించే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది) -
ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది
టాలీవుడ్లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తన కామెడీ జానర్‌ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్ 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్(Netflix) అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్లో థ్రిల్ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్‌గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్‌రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్‌గా ఉన్న అచ్యుత్‌రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన
టాలీవుడ్లో అడపాదడపా కామెడీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా గత నెలలో సుహాస్ హీరోగా చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో కొందరికి నచ్చగా.. మరికొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమైనా సరే యావరేజ్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?) -
పదిరోజుల్లోనే ఓటీటీకి హెబ్బా పటేల్ సినిమా
హెబ్బా పటేల్, చైతన్య రావు నటించిన కొత్త సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'.. ఆసక్తికరమైన టైటిల్‌తో మార్చి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించారు. ఇందులో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.హెబ్బా పటేల్, చైతన్య రావు ఇదివరకు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో మెప్పించారు. ఈ క్రమంలో వారిద్దరూ మరోసారి 'రేపు ఉదయం 10 గంటలకు'(Repu Udayam 10 Gantalaku) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. థియేటర్స్‌లో పెద్దగా ఈ మూవీ మెప్పించలేదు. దీంతో కేవలం పదిరోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. -
థియేటర్లలో బ్యాండ్ మేళం, సుయోధన.. ఓటీటీల్లో ఒక్క రోజే 11 సినిమాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్ ఉన్న మూవీస్ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్ మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 2753 సండేస్(హాలీవుడ్ మూవీ)- మార్చి 27అమెజాన్ ప్రైమ్ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27జియో హాట్స్టార్కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27జీ5ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27ఆపిల్ టీవీ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27సన్ నెక్ట్స్మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27 -
ఓటీటీలో రెండు థ్రిల్లింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ప్రకటన
మలయాళ ప్రేక్షకులను మెప్పించిన మస్తిష్క మరణం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీని దర్శకుడు కృషంద్ ఆర్కే తెరకెక్కించారు. కృష్ణంద్ ఫిల్మ్స్ సహకారంతో అజిత్ వినాయక ఫిల్మ్స్ బ్యానర్‌పై వినాయక అజిత్ నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంది.‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam) మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ గురించి సరైన సమాచారం ప్రస్తుతానికి లేదు. తన బిడ్డను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడలేక, గడిచిన క్షణాలను తిరిగి అనుభవించాలనే ప్రయత్నంలో ఒక తండ్రి, అత్యాధునిక వర్చువల్ రియాలిటీ మెమరీ కన్సోల్‌ను ఆశ్రయిస్తాడు. ఇది ఒక డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ సినిమాగా, సమాజంపై వ్యంగ్య అస్త్రంగా రూపొందింది. 2046లో, ప్రజల జ్ఞాపకాలు , అనుభవాలు డిజిటల్‌గా రికార్డ్ చేయబడి, వ్యాపారంగా చేయబడతాయి. మనుషులు తమ బాధలను కూడా వైద్య చికిత్స ద్వారా మర్చిపోగలరు. ఈ కాన్సెప్ట్‌తోనే సినిమాను తెరకెక్కించారు.ఓటీటీలో వధ్-2బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘వధ్’ (2022).. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన క్రైమ్ డ్రామా చిత్రం ‘వధ్- 2’ గతేడాది థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు జస్పాల్ సింగ్ సంధు తెరకెక్కించారు. థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవాల్లకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. -
ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటించిన కొత్త చిత్రం 'మర్దానీ 3' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించారు. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.'మర్దానీ 3' మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర రీజనల్ భాషల్లో ఉండదు. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన పార్ట్-3లో జానకి బోడివాలా, జిషు సేన్‌గుప్తా, ఇంద్రనీల్ సేన్‌గుప్తా సహాయ పాత్రలలో నటించారు. ఇందులో రాణి ముఖర్జీ.. శివానీ శివాజీరాయ్ అనే పోలీసు పాత్రలో కనిపించారు.మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ‘మర్దానీ’, ‘మర్దానీ 2’ చిత్రాలు హిట్ సాధించాయి. అయితే, పార్ట్-3లో ఎనిమిది నుంచి పదేళ్ల వయసున్న 93 మంది చిన్నపిల్లల కిడ్నాప్ కేసును ఛేదించడం కనిపిస్తుంది. భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియాతో పాటు ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్పెరిమెంట్ గుట్టును శివాని శివాజీరాయ్ ఎలా ప్రపంచానికి తెలిపారనేది ఈ కథ. -
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్‌వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా
'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా)జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్‌ని అమ్మేసుకొని.. టాక్‌తో సంబంధం లేకుండా నెలలోపే ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓ హారర్ చిత్రం మాత్రం రిలీజ్ అయినా ఏడాది తర్వాత ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. అది కూడా తమిళ్ భాషలోనే స్ట్రీమింగ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏ సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం’. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనం రొటీన్‌గా ఉన్నా, టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారనే టాక్ని సంపాదించుకుంది కానీ, కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అన్ని సినిమాల మాదిరే నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఏడాది తర్వాత ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.శబ్దం కథేమింటి?కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
9 నెలల తర్వాత ఓటీటీకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. Kisi ke liye alag… kisi ke liye normal.Sabka apna normal hota hai. ❤️A heartwarming story of Hope, heart and healing💫 Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, streaming from 3rd April on Sony LIV#SitaareZameenParOnSonyLIV pic.twitter.com/YvBbFlOTNS— Sony LIV (@SonyLIV) March 23, 2026 రూ.120 కోట్ల డీల్‌కు నో..అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్‌ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు కాస్త స్పెషల్
మరోవారం వచ్చేసింది. గతవారం రిలీజైన 'ధురంధర్ 2' జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇకపోతే ఈ వారం 'కోర్ట్' జంట నటించిన 'బ్యాండ్ మేళం', ప్రియదర్శి 'సుయోధన'తో పాటు తమిళ డబ్బింగులైన 'యూత్', 'హ్యాపీరాజ్' మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. వీటితో పాటు ఓటీటీల్లోనూ చాలా తక్కువగా మాత్రమే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్, రాణిముఖర్జీ 'మర్దానీ 3' సినిమా మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ గానీ సిరీస్‌లు గానీ ఏం లేవు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్ఇన్సైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - మార్చి 23హార్ట్ బ్రేక్ హై సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25హోమీసైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టూ హ్యాపెన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 26ద రెడ్ లైన్ (థాయ్ సినిమా) - మార్చి 26డిటెక్టివ్ హోల్ (నార్వేజియన్ సిరీస్) - మార్చి 26మర్దానీ 3 (హిందీ మూవీ) - మార్చి 27హాట్స్టార్ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 23ద హన్నా మొంటానా 20th యానివర్సరీ స్పెషల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24డేర్ డెవిల్ బార్న్ ఎగైన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27అమెజాన్ ప్రైమ్బెయిట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 25ప్రెటీ లేథల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 25ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27 హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27జీ5భానుప్రియ భూటర్ హోటల్ (బెంగాలీ చిత్రం) - మార్చి 26ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27ఆపిల్ టీవీఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'మిస్టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్ ఎస్సై రాంఖీ(అబిద్ భూషన్) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసుని ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్ ఎలా ముగించాడు? ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు) -
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్‌ను చూస్తున్నారు.పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్‌ను భారత్‌కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్‌గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్‌ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్‌ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. -
సర్ఫ్రైజ్.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు.. ఆయన నటించిన తాజా చిత్రం ‘ విష్ణు విన్యాసం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించగా.. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు.థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో విష్ణు విన్యాసం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో అందుబాటులో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీకి పాన్-ఇండియన్ ఓటీటీ విడుదల లభించడంతో శ్రీ విష్ణు పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరడానికి సహాయపడుతుంది.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ ప్రపంచంలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ చూశారా?
క, కె- ర్యాంప్ సినిమాలు కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అయితే వీటి మధ్యలో వచ్చిన దిల్రూబా మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడీ హీరో. ఓపక్క వెండితెరపై సినిమాలు చేసుకుంటూనే ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.వెబ్ సిరీస్ఈసారి సినిమాతో కాకుండా వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్లాన్ చేశాడు. తాజాగా ఆ వెబ్ సిరీస్ టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వదిలారు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వం వమిస్తున్న ఈ సిరీస్‌కు గువ్వల చెరువు ఘాట్ టైటిల్ ఫిక్స్ చేశారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ పొలిటికల్ డ్రామాతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సిరీస్ఇందులో తిరువీర్, సంయుక్త మీనన్, తేజస్వి రావు, సిద్ధిఖి, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రస్టింగ్‌గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. -
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. మొదటి పార్ట్‌లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్‌గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా.. ప్రస్తుతం వేగం తగ్గించేశాడు. కొన్నాళ్ల క్రితం కూతురు ఐశ్వర్యని హీరోయిన్గా పెట్టి ఓ మూవీ మొదలుపెట్టాడు. తెలుగు హీరో విశ్వక్ సేన్‌ని హీరోగా తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సీతా పయనం'. ఇతడి కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్.. ఈ చిత్రంలో హీరో. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఉగాది కానుకగా ఈ గురువారం (మార్చి 19) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'సీతా పయనం' విషయానికొస్తే.. సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్‌కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా) -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్‌స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే ఎడిటింగ్ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) పురస్కారాలతో సిన్నర్స్ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్ (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ : జియో హాట్స్టార్సిన్నర్స్ : జియో హాట్స్టార్ఫ్రాంకెన్స్టీన్ : నెట్‌ఫ్లిక్స్F1 : యాపిల్ టీవీఅవతార్: ఫైర్ అండ్ యాష్ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.వెపన్స్: జియో హాట్స్టార్కెపాప్ డిమాన్ హంటర్స్ : ఈ యానిమేటెడ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.సెంటిమెంటల్ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది.హామ్నెట్ : యాపిల్ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్‌వన్‌గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
‘ఆస్కార్ 2026’ లైవ్..భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్ (Oscar Awards 2026) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదికైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు(మార్చి 15) సాయంత్రం ఈ వేడుక జరుగుతుంది.టైమ్ జోన్ వ్యత్యాసం కారణంగా, ఇండియాలో మనం మార్చి 16 (సోమవారం) ఉదయం చూడాల్సి ఉంటుంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రధాన అవార్డుల వేడుక ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది.లైవ్ ఎక్కడ చూడొచ్చు?టీవీలో లేదా మొబైల్లో ఆస్కార్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఓటీటీ విషయానికొస్తే.. జియోస్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టెలివిజన్ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే లైవ్ మిస్ అయితే, అదే రోజు (సోమవారం) రాత్రి 9 గంటలకు కు ఈ ఛానెల్‌లలో మళ్లీ ప్రసారం చేస్తారు.హోస్ట్ ఎవరు?ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ'బ్రియన్ (Conan O'Brien) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఏడాది అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా పాల్గొంటున్నారు.ఇండియాకు నిరాశే..98వ ఆస్కార్ అవార్డ్సులో భారత్‌కు నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ఒక్క చిత్రం కూడా అవార్డు రేసులో నిలవలేదు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్’ను పంపింది. కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సారి ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. -
ఓటీటీలో బోర్డర్-2 సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బాలీవుడ్ హిట్ ప్రాంఛైజీ చిత్రం బోర్డర్-2 ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 1997లో రిలీజై భారీ హిట్ అందుకున్న బోర్డర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తీవ్రతను, భారత సాయుధ దళాల వీరత్వాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అందరిలో దేశభక్తిని రగిల్చేలా ఈ చిత్రం ఉంటుంది.బోర్డర్ 2(Border 2) మూవీ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ. 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 485 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు.పార్ట్-1 మాదిరే ‘బోర్డర్ 2’ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటుంది. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు పాకిస్థాన్ 1971లో ఎలాంటి కుట్రలు చేసిందో ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్‌పై భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల ద్వారా భారీ దాడులకు దిగుతుంది. అయితే, భారత ప్రభుత్వం దీనిని ముందే గ్రహించి సైనికులను యుద్ధ రంగంలోకి దింపుతుంది. పాక్ సైన్యాన్ని ఎలా మట్టికరిపించారో ఇందులో చూపించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. ప్రేక్షకులకు ట్విస్ట్
ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్లో కూడా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సంతోష్ శోభన్ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత చిత్ర యూనిట్‌తో ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మంచి బజ్ క్రియేట్ అయింది. ఆపై కథలో కూడా విషయం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో కపుల్ ఫ్రెండ్లీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం వర్షన్లలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అధనంగా రూ. 279 రెంట్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మూవీ కోసం రూ. 3 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 14 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. స్టోరీ నెమ్మదిగా సాగినప్పటికీ కథ బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.కథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. -
నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు హాలీవుడ్‌ను రప్పించాలనే తన కల నెట్‌ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్‌ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, దిల్‌రాజు, రానా, సంజయ్‌జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్‌బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్‌లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్‌లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.జియో హాట్‌స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్‌గా మార్చి 27, 2026న కాట్టాన్ (Kaattaan) ప్రీమియర్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్లో వెబ్ సిరీస్ రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. -
నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.. గతేడాది అర డజను మూవీస్ చేసింది. వాటిలో దాదాపు మూడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కొత్త ఏడాదిలోనూ ఓ థ్రిల్లర్‌తో వచ్చింది. ఇప్పుడా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ')అనుపమ లీడ్ రోల్ చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ 'లాక్ డౌన్'. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులో దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ జనవరి 30న రిలీజైంది. కానీ ఫ్లాప్ అయింది. లాక్డౌన్ అనేది ముగిసిన కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించాలనుకున్నారు. అస్సలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.'లాక్డౌన్' విషయానికొస్తే.. చదువు పూర్తి చేసిన అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనిని ఇంట్లో వాళ్ల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలని లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదలో ఉన్న ప్రేమ జంటలు కూడా ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి. చివరకు అనిత జీవితం ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన
గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్‌తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్‌గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' తదితర మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా చూడొచ్చనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రవం'(Ravam Movie). శ్రీరామ్ మన్నార్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గానే ఇది ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే ఈ మూవీ చూడొచ్చు. 'రవం' విషయానికొస్తే.. ఓ ఈఎన్టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయమని, తర్వాత నేను మీ సినిమాని నిర్మిస్తానని యువ దర్శకుడు మౌళికి చెప్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీ లైన్.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ)


