'మనీ హీస్ట్' ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్ | Money Heist Series New Seasons Coming Announcement | Sakshi
Sakshi News home page

Money Heist Series: 'మనీ హీస్ట్' నుంచి అదిరిపోయే ప్రకటన

May 10 2026 5:05 PM | Updated on May 10 2026 5:15 PM

Money Heist Series New Seasons Coming Announcement

ఓటీటీల్లో కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్లకు 'మనీ హీస్ట్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సీజన్ల ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చివరిదైన ఐదో సీజన్ వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. దీని తర్వాత 'బెర్లిన్' పాత్ర ఆధారంగా సిరీస్ వచ్చింది. ఇప్పుడు 'మనీ హీస్ట్' ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

2021లో ఐదో సీజన్‌తో ఈ సిరీస్‌ని ముగించినప్పటికీ.. ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త టీజర్ రిలీజ్ చేసింది. మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగనుంది అనే పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆరో సీజన్ మొదలుపెడతారా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ సిరీస్‌లోని ఫ్రొఫెసర్ లేదా ఇతర పాత్రల్ని తీసుకుని కొత్తగా సిరీస్ మొదలుపెట్టొచ్చేమో అనిపిస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అప్పటివరకు ఎదురుచూడటమే.

(ఇదీ చదవండి: చిరుని కలిసిన మలయాళ డైరెక్టర్.. రీమేక్‌పై క్లారిటీ)

Advertisement
 
Advertisement
Advertisement