ఓటీటీకి సూపర్ హిట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam horror thriller movie Sambhavam Adhyayam Onnu ott date | Sakshi
Sakshi News home page

ఓటీటీకి మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 9 2026 7:58 PM | Updated on Apr 9 2026 8:10 PM

Malayalam horror thriller movie Sambhavam Adhyayam Onnu ott date

ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన సినిమాలు తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రైమ్ స్టోరీస్, హారర్, థ్రిల్లర్‌ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు మలయాళ మూవీస్‌ సైతం ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ హిట్ అయినా సినిమాలు డబ్బింగ్‌ చేసి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. 

తాజాగా మరో మలయాళ క్రైమ్‌ అండ్ మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ ‍అయిన సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్‌స్టార్‌ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. 

కాగా.. ఈ సినిమాకు జీతూ సతీషన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మాల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. మార్చి  మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్ట‌రీ హార‌ర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్‌ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement