ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Exam Series OTT Streaming Details Latest | Sakshi
Sakshi News home page

Exam OTT: కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో లొసుగులపై సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 27 2026 2:42 PM | Updated on Apr 27 2026 2:53 PM

Exam Series OTT Streaming Details Latest

సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని ‍స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్‌గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.

దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement