రణవీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్ మూవీ 'ధురంధర్-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు రావచ్చని సమాచారం. హౌస్‌ఫుల్ థియేటర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు టాక్ ఉంది.
సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు 8వారాల థియేటర్ రన్ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు.
మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ ధురంధర్-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని జియోహాట్‌స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు.


