ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్ | Pochamma Series OTT Telugu Streaming Update | Sakshi
Sakshi News home page

OTT: ‍థ్రిల్లర్ 'పోచమ్మ'.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్

Apr 3 2026 3:07 PM | Updated on Apr 3 2026 3:33 PM

Pochamma Series OTT Telugu Streaming Update

ఓటీటీలు అనగానే చాలామంది థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ సిరీస్ తీశారు. అదే 'పోచమ్మ'. దీని గ్లింప్స్‌ని 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేశ్‌.. త్వరలో కూతురి పెళ్లి)

సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ లీడ్ రోల్ చేస్తుండగా.. శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. శ్రుతి నాయుడు నిర్మించగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే.. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమని అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనేది స్టోరీ అనిపిస్తుంది.

పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది.మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement
 
Advertisement
Advertisement