గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేశ్‌.. త్వరలో కూతురి పెళ్లి | Producer Bandla Ganesh Announce his Daughter Janani Wedding | Sakshi
Sakshi News home page

బండ్ల గణేశ్‌ ఇంట శుభకార్యం.. కాబోయే అల్లుడిని పరిచయం చేస్తూ..

Apr 3 2026 11:49 AM | Updated on Apr 3 2026 12:27 PM

Producer Bandla Ganesh Announce his Daughter Janani Wedding

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఇంట శుభకార్యం జరగనుంది. అతడి కూతురు జనని పెళ్లిపీటలెక్కనుంది. ఈ విషయాన్ని బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. వివాహ పనులు కూడా మొదలైనట్లు తెలిపాడు. దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది.

పసుపు- కుంకుమ ఫంక్షన్‌
చిరంజీవి 'సూర్యతేజ చిలుకూరి'- చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 'జనని బండ్ల'ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం అని తెలిపాడు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. అందులో తమ వియ్యంకులతో పాటు కాబోయే అల్లుడి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బండ్ల గణేశ్‌ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సినిమా
బండ్ల గణేశ్‌.. కెరీర్‌ ప్రారంభంలో కమెడియన్‌గా, సహాయ నటుడిగా మెప్పించాడు. సుస్వాగతం, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, సరిలేరు నీకెవ్వరు.. ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. డేగల బాబ్జీ మూవీలో హీరోగానూ కనిపించాడు. పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ద్వారా నిర్మాతగా మారాడు. ఆంజనేయులు, గబ్బర్‌ సింగ్‌, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్‌ వంచి సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడు.

చదవండి: అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు: బుల్లితెర 'సీత'

Advertisement
 
Advertisement
Advertisement