నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా | Jyothika System Movie OTT Release Date Update | Sakshi
Sakshi News home page

OTT: న్యాయవ్యవస్థపై తీసిన మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

May 6 2026 12:50 PM | Updated on May 6 2026 1:01 PM

Jyothika System Movie OTT Release Date Update

ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా సినిమాలు జ్యోతిక.. ప్రస్తుతం ఆచితూచి మూవీస్ చేస్తోంది. ‍అలా ఈమె లీడ్ రోల్ చేసిన ఓ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామా కాన్సెప్ట్ తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలని కొంటూనే సొంతంగానూ కొన్నింటిని నిర్మిస్తున్నాయి. అలా తీసిన ఓ చిత్రమే 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు చేశారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకురాలు. ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

'న్యాయం దేవుడి లాంటిది. వెతికి పట్టుకోవడం చాలా కష్టం' అనే డైలాగ్ జ్యోతిక పాత్రతో చెప్పించారు. దీనిబట్టి చూస్తే న్యాయవ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? అనే వాటిని ఈ మూవీలో చూపించబోతున్నారనిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు సరిగా తీయాలే గానీ బాగానే వర్కౌట్ అవుతాయి. మరి 'సిస్టమ్' చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement