ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు.
Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb
— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026


