ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..! | Prabhas Latest Movie Spirit Ott Deal Close for huge Margin amount | Sakshi
Sakshi News home page

Spirit Movie Ott Deal: ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!

Apr 14 2026 4:16 PM | Updated on Apr 14 2026 4:32 PM

Prabhas Latest Movie Spirit Ott Deal Close for huge Margin amount

ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్‌ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్‌ టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

రూ.250 కోట్ల ఆఫర్..!

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల  థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement