ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | bollywood movie Nukkad Naatak Ott Streaming date | Sakshi
Sakshi News home page

Nukkad Naatak Ott: ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 22 2026 6:57 PM | Updated on Apr 22 2026 7:03 PM

bollywood movie Nukkad Naatak Ott Streaming date

మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్‌ నాటక్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది.  ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

కాగా.. ఈ చిత్రంలో మోల్‌శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్‌లో దొంగతనం చేస్తూ  ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. 


 

 

Advertisement
 
Advertisement
Advertisement