గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.
అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
Kisi ke liye alag… kisi ke liye normal.
Sabka apna normal hota hai. ❤️
A heartwarming story of Hope, heart and healing💫
Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, streaming from 3rd April on Sony LIV#SitaareZameenParOnSonyLIV pic.twitter.com/YvBbFlOTNS— Sony LIV (@SonyLIV) March 23, 2026
రూ.120 కోట్ల డీల్‌కు నో..
అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్‌ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.


