విజయ్ సీఎం.. జన నాయగన్‌కు ఫుల్ డిమాండ్..! | Vijay Latest Movie Jana Nayagan OTT Deals Goes Viral | Sakshi
Sakshi News home page

Jana Nayagan Movie: జన నాయగన్ మూవీ.. ఓటీటీ డీల్‌కు మళ్లీ డిమాండ్..!

May 12 2026 2:22 PM | Updated on May 12 2026 2:26 PM

Vijay Latest Movie Jana Nayagan OTT Deals Goes Viral

రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్‌లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement