ఓటీటీలోకి 'బైకర్' సినిమా.. అధికారిక ప్రకటన | Actor Sharwanand Biker Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Biker OTT Release: శర్వా 'బైకర్' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 27 2026 11:52 AM | Updated on Apr 27 2026 12:22 PM

Biker Movie OTT Release Date Latest Update

ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన హీరో శర్వానంద్.. ఈ నెల తొలివారంలో మరో మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)

శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బైకర్'. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. బైక్ రేసింగ్ స్టోరీతో సరికొత్తగా దీన్ని తెరకెక్కించారు. చూసిన చాలామంది బాగానే ఉందన్నారు కానీ ఎందుకనో జనాలు ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కలెక్షన్సే దీనికి ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం మే 01వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇదే పేరుతో.. హిందీలో మాత్రం 'శర్వా' అనే టైటిల్‌తో అందుబాటులోకి రానుంది.

'బైకర్' విషయానికొస్తే.. బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్(రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. మన దేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలనేది ఈయన ఆలోచన. ఇందులో భాగంగా రేసర్లని తీర్చిదిద్దుతుంటాడు. ఈయన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్).. తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని టాప్ రేసర్ అవుతాడు. అంతర్జాతీయ పోటీలోనూ పాల్గొంటాడు కానీ కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో నిలుస్తాడు. తర్వాత రేసింగ్ నుంచే వికాస్ దూరం కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనకున్న కారణమేంటి? చివరకు ఏమైంది? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement