థియేటర్లలో బ్యాండ్‌ మేళం, సుయోధన.. ఓటీటీల్లో ఒక్క రోజే 11 సినిమాలు..! | This Friday OTT Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఈ ఫ్రైడే ఓటీటీ చిత్రాలు.. ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్..!

Mar 26 2026 7:58 PM | Updated on Mar 26 2026 8:42 PM

This Friday OTT Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు  తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్‌ ఉన్న మూవీస్‌ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్  మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్‌ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27

  • మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27

  • ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 27

  • 53 సండేస్(హాలీవుడ్ మూవీ)-  మార్చి 27

అమెజాన్ ప్రైమ్

  • ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27

  • హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27


జియో హాట్‌స్టార్

  • కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27

జీ5

  • ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27

  • హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27


ఆపిల్ టీవీ

  •    ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27

సన్‌ నెక్ట్స్‌

  • మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement