చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్‌ | Actress Vedhika Upcoming Projects Details | Sakshi
Sakshi News home page

చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్‌

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:40 AM

Actress Vedhika Upcoming Projects Details

ఒక్కసారి నటుడైనా, నటి అయినా సక్సెస్‌ను అందుకంటే సినిమా వారిని అంత సులభంగా వదులుకోదు. అలా ఏళ్ల తరబడి ఈ రంగంలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి తారలలో నటి వేదిక ఒకరు. ఈ మహారాష్ట్ర భామ గత రెండు దశాబ్దాలుగా కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళంలోకి 2005లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని చేరుకున్నారు. 

ముఖ్యంగా ఇంతకు ముందు తమిళంలో పరదేశీ, కావ్యతలైవన్‌, శివలింగ, బానం వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈమె పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన వేధికకు తమిళంలో చిన్న గ్యాప్‌ వచ్చింది. అయితే దాన్ని పూర్తి చేసే విధంగా మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మహాల్‌ అనే తమిళ చిత్రంతో పాటు తమిళం,తెలుగు భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె స్థానాన్ని ఇక్కడ సుస్ధిరం పరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

 ఆకర్షనీయమైన అవయవ సంపద, అభినయం కలిగిన ఈ 38 ఏళ్ల భామ ఇటీవల వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్కా మీడియా నిర్మించిన యక్షిణి అనే వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. అందులో ఈమె బోల్డ్‌ నటనకు గానూ హిందూస్థాన్‌ టైమ్స్‌ ఓటీటీ ప్లే అవార్డును గెలుచుకున్నారు.. కాగా చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement