Vedhika
-
సస్పెన్స్... థ్రిల్
వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫియర్’. డా. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఫియర్’ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
షూట్ చేస్తూ ట్రామాలోకి వెళ్ళిపోయా..!
-
‘ఫియర్’ మూవీ టీజర్ లాంచ్‌లో నటి వేదిక గ్లామరస్ ఫొటోషూట్
-
ఫియర్ చాలా సంతృప్తినిచ్చింది : హీరోయిన్ వేదిక
‘‘ఫియర్’ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. హరితగారికి దర్శకురాలిగా ఇది తొలి చిత్రం అని ఈ సినిమా చూసినవారెవరూ నమ్మరు. ఈ మూవీ టీజర్ చూశాక నా ఒత్తిడి పోయింది. ‘ఫియర్’లో నేను చేసిన పాత్ర చాలా సంతృప్తినిచ్చింది’’ అని వేదిక అన్నారు. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. (చదవండి: ఓటీటీలో 'పేకమేడలు'.. స్ట్రీమింగ్ ఎక్కడ?)ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర చేశారు. ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను రానా, తమిళ టీజర్‌ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను దిలీప్, హిందీ టీజర్‌ను ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ అభి మాట్లాడుతూ– ‘‘ఫియర్’తో హరిత ప్రేక్షకులను భయపెడుతుంది’’ అని తెలిపారు. ‘‘కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమా కథ’’ అని చె΄్పారు హరిత గోగినేని. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫియర్’.. వేదిక ఫస్ట్‌లుక్ రిలీజ్
వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది .(చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన తారక్)తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ని స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
భయపెడుతున్న బ్యూటీ.. చూపు తిప్పుకునే సమస్యే లేదు! (ఫోటోలు)
-
మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!
చీరలో మరింత క్యూట్‌గా మెగా కోడలు లావణ్య నాభి అందాల చూపిస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ రోజురోజుకీ అందంగా 'బిగ్‌బాస్' ప్రియాంక జైన్ అప్పుడు-ఇప్పుడు ఫొటోల్లో జబర్దస్త్ కమెడియన్ రోహిణి నడుము ఒంపుసొంపులు చూపిస్తున్న శివాత్మిక రాజశేఖర్ కలర్ఫుల్గా కనిపిస్తున్న బిగ్‌బాస్ ఫేమ్ రతికా రోజ్ వయ్యారాలు ఒలకబోస్తూ కాక రేపుతున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
35 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ధగధగలు!
మూడు పదులు దాటితే చాలు కొందరి ముఖంలోనే వారి వయసు కనబడిపోతుంటుంది. కానీ నయనతార, త్రిష వంటి అతి కొద్దిమంది హీరోయిన్లు మాత్రం తమ అందంతో వయసును దాచేస్తారు. ఆ కోవలోకి హీరోయిన్ వేదిక చేరతారు. ఇంకా చెప్పాలంటే వారి కంటే కూడా చాలా స్లిమ్‌గా, యవ్వనంగా కనిపిస్తారు. ఈమె వయసు మూడున్నర పదులు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంత నాజుగ్గా కనిపించే వేదికకు తనకంటూ పెద్ద అభిమాన గణమే ఉన్నారు. ఈమె మోడలింగ్ రంగం నుంచి వచ్చి కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ అలా ఈ బ్యూటీ పలు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈమె 'మదరాసి' అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత బాల దర్శకత్వం వహించిన పరదేశి చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా సిద్ధార్ధ్ కు జంటగా కావ్య తలైవన్, రాఘవ లారెన్స్ సరసన ముని, కాంచన– 3 వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. అరడజను సినిమాలు కాగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, భాషల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా రాణిస్తున్న వేదిక ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రెండు తెలుగు, రెండు తమిళం, రెండు మలయాళం, ఒక కన్నడ చిత్రాలు ఉండటం విశేషం. చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న వేదిక, నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. అందుకే నేటికీ ఈమె కథానాయికగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) చదవండి: సోఫాజీ టాప్ 3కి వచ్చాడంటే అదే కారణం.. లేదంటే జీరోగా మిగిలేవాడు! -
సింగిల్ పీస్ డ్రస్‌లో రష్మిక.. నడుముతో ఆ హీరోయిన్ ఇలా!
సింగిల్ పీస్ డ్రస్‌లో రష్మిక.. చూస్తే అంతే ఇక హనీమూన్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్ మిర్రర్ సెల్ఫీతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ శ్రద్ధా దాస్ స్విట్జర్లాండ్ వెకేషన్ మూడ్‌లో 'కేజీఎఫ్' భామ శ్రీనిధి స్మైల్‌తో సంపేస్తున్న 'గుంటూరు కారం' హీరోయిన్ మీనాక్షి నాజూకు నడుముతో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ వేదిక రెచ్చిపోయిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి.. ఇలా చూస్తే మాత్రం 40స్లోనూ గ్లామర్‌తో టెంప్ట్ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sheena Chohan (@sheena_chohan) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by malkit gill📹🎭 (@malkit_gill2697) -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్‌ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
Vedhika Photos: అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వేదిక
అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వేదిక -
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?
Vedhika Pink Bikini Photoshoot Goes Viral: బ్యూటీఫుల్ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలరాతి శిల్పంలా మెరిసే వేదిక దశాబ్దన్నరకు పైగానే చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తోంది. తమిళంలో పరదేశి, ముని, ముని–4 తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వినోదన్, జంగిల్ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో శింబు, లారెన్స్ వంటి హీరోలతో నటించింది. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా నటిగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది వేదిక. దీంతో పాపులారిటీ కోసం తెగ ఆరాటపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకుంది వేదిక. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులో రకరకాల గ్లామరస్ దుస్తులతో ఫొటో షూట్ చేసుకుని ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అలా ఆమెకు ప్రస్తుతం 34 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా మాల్దీవుల్లో పింక్ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఈ బ్యూటీ విడుదల చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవైనా ఈ అమ్మడికి ఏ పాటి అవకాశాలు తీసుకొస్తాయో చూడాలి. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) 🧞♀️🐚 pic.twitter.com/Mx0G9NuKMv — Vedhika (@Vedhika4u) August 1, 2022 Listen to the sound of waves within you 🐚🦢 pic.twitter.com/Hipz0n2Wd7 — Vedhika (@Vedhika4u) July 29, 2022 -
కాంచన 3 హీరోయిన్ వేదిక ఫోటోస్
-
ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం
-
స్క్రీన్ టెస్ట్
► సముద్ర దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నటించిన ‘విజయ దశమి’లో ‘దీపావళి దీపావళి...’ అనే డ్యూయెట్లో కల్యాణ్‌రామ్‌తో ఆడి పాడిన హీరోయిన్ గుర్తుందా? ఎ) హన్సిక బి) వేదిక సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి ► ‘సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు..’ అంటూ విజయశాంతితో స్టెప్పులేసిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) నాగార్జున ► ‘అలుక మానవా...’ అని నరకాసురుని స్తుతిస్తూ ‘దీపావళి’ సినిమాలో నారద పాత్ర పాట పాడుతుంది. ఆ నారద పాత్ర పోషించిన నటుడెవరు? ఎ) పద్మనాభం బి) హరనాథ్ సి) కాంతారావు డి) రాజనాల ► ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి’ అనే పాటలో ఆడి పాడిన నటుడెవరు? ఎ) శోభన్‌బాబు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శ్రీధర్ ► 2007లో వచ్చిన ‘దీపావళి’ అనే సినిమాలో సటించిన హీరో ఎవరు? ఎ) సురేశ్ బి) వరుణ్ సందేశ్ సి) సాయిరామ్ శంకర్ డి) వేణు తొట్టెంపూడి ► ‘స్వప్న ప్రియ స్వప్న’ అని సాగే దీపావళి పాటలో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) కె. రాఘవేంద్రరావుసి) ఎ. కోదండ రామిరెడ్డి డి) బి. గోపాల్ ► 1960లో వచ్చిన ‘దీపావళి’ సినిమాలో నరకాసురుని పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) కైకాల సత్యనారాయణ సి) సీయస్ఆర్ డి) ధూళిపాళ ► ‘నా నవ్వే దీపావళి నా పలుకే దీపాంజలి..’ అంటూ ‘నాయకుడు’ సినిమాలోని ఈ పాటలో ఏ హీరో కనిపిస్తారు? ఎ) రజనీకాంత్ బి) కమల్‌హాసన్ సి) అరవింద్‌స్వామి డి) మమ్ముట్టి ► దీపావళి అంటే సత్యభామ గుర్తొస్తుంది... ఈ పేరుతో కమల్‌హాసన్ చేసిన సినిమా ఏంటి? ఎ) సత్యభామ బి) భామనే సత్యభామనే సి) శ్రీకృష్ణ సత్ యడి) సత్యభామనే ► భానుమతితో కలిసి సుహాసిని నటించిన ఓ సినిమాలో ‘ఇన్నాళ్లకొచ్చింది దీపావళి..’ అనే పాట ఉంది. ఆ సినిమా పేరేంటి? ఎ) ముద్దుల కూతురు బి) ముద్దుల మనవరాలు సి) ముద్దుల కోడలు డి) ముద్దుల పాప ► దీపావళి అంటే వెలుతురు పండగ. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సి. నారాయణ రెడ్ డిబి) దాశరథి సి) వేటూరి డి) సిరివెన్నెల ► ‘ఇంటింటా దీపావళి ’అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారో తెలుసా? ఎ) మురళీమోహన్ బి) మోహన్ సి) చంద్రమోహన్ డి) మోహన్‌బాబు ► వెలుగుతున్న చిచ్చుబుడ్డి పక్కనే ఎగురుతున్న హీరోయిన్... కాళ్ల పట్టీల నుండి హీరోయిన్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. ఆ బ్యూటీ ఎవరు? ఎ) అమీషాపటేల్ బి) కీర్తిరెడ్ డిసి) రేణూ దేశాయ్ డి) భూమిక ► బ్రహ్మానందం సిగరెట్ అనుకుని నోట్లో సీమ టపాకాయ్ ముట్టించుకునే సినిమా పేరేంటి? ఎ) క్షేమంగా వెళ్లి లాభంగా రండి బి) సందడే సందడి సి) తిరుమల తిరుపతి వెంకటేశ డి) అందరూ దొంగలే ► ‘అల్లరి’ నరేశ్ తన సినిమా పేరును దీపావళి టపాసుతో పెట్టుకున్నారు? ఆ సినిమా పేరేంటి? ఎ) సీమ బాంబ్ బి) సీమ టపాకాయ్ సి) సీమ చక్రం డి) సీమ శాస్త్రి ► ఈ సినిమాలో మంచు లక్ష్మి లాయర్. బాంబ్‌లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఆటమ్ బాంబ్ బి) హైడ్రొజన్ చక్రం సి) లక్ష్మీరాకెట్ డి) లక్ష్మీబాంబ్ ► ‘ఇక్కడ నా చిచ్చుబుడ్డి మర్చిపోయాను ఎవరన్నా చూశారా..’ అనే డైలాగ్‌ని ఏ సినిమాలో జగపతిబాబు చెప్పారో గుర్తొచ్చిందా? ఎ) ఫ్యామిలీ బి) అందగాడు సి) ఫ్యామిలీ సర్కస్ డి) సర్కస్ ఫ్యామిలీ ► ‘దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ పొల్యూషన్..’ అని ఏ హీరోయిన్ని ఉద్దేశించి ‘జనతాగ్యారేజ్’ సినిమాలో యన్టీఆర్ అన్నారు? ఎ) నిత్యామీనన్ బి) సమంత సి) త్రిష డి) కాజల్ అగర్వాల్ ► ‘గోపాల గోపాల అలకేలరా... దీపాల వేళాయెఅగుపించరా’ అనే పాటఏ సినిమాలోనిది? ఎ) అత్తారింటికి దారేది బి) ఖలేజా సి) జులాయి డి) అ ఆ ► ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అనే పాటలో నటించిన దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండరామిరెడ్డి సి) కె. విశ్వనాథ్ డి) దాసరి నారాయణరావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) సి5) డి 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) బి 14) ఎ 15) బి 16) డి17) సి 18) ఎ 19) డి20) డి -
వృద్ధురాలి పాత్రలో హీరోయిన్
విజయదశమి... బాణం... దగ్గరగా దూరంగా తదితర టాలీవుడ్ చిత్రాలలో నటించిన కన్నడ భామ వేదిక ఇప్పుడు కొత్త తరహ పాత్రలో నటించబోతుంది. అది కూడా పాఠశాల విద్యార్థితోపాటు 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో వేదిక ఒదిగిపోనుంది. ప్రముఖ నటుడు ప్రభుదేవ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విక్టర్ జయ్‌రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుకానుందని ఆ చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. ఈ చిత్రంలో వేదిక పాత్ర ప్రత్యేకత సంతరించుకుంటుందని తెలిపింది. అయితే వేదికను వృద్ధురాలి పాత్రలో చూపించేందుకు ఏ ప్రముఖ మేకప్ ఆరిస్ట్ వద్దకు వెళ్లడం లేదని పేర్కొంది. ఆ పాత్ర కోసం ఇప్పటికే వేదికకు మేకప్ వేసి పరీక్షించామని చెప్పింది. ఆ మేకప్‌లో ఆమె పాత్రకు సరిపోయారని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో విభిన్న పాత్రల్లో నటించేందుకు ఇప్పటికే వేదిక పలు వర్క్‌షాపుల్లో పాల్గొంటుంది. తమిళనటుడు వరణ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని వేదిక ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నా కల నిజమవుతోంది!
నా కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది అంటున్నారు నటి వేదిక. నిజానికి ఈ బ్యూటీలో మంచి నటి ఉన్నారు. పరదేశి, కావ్య తలైవన్ చిత్రాల్లో వేదిక అభినయం ప్రశంసలందుకుంది. ఎందుకనో ఆమెకు రావలసిన గుర్తింపు రాలేదు. కోలీవుడ్‌లో అవకాశాలు కూడా అంతంత మాత్రమే. కారణం వేదిక ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి సారించడం కావచ్చు. తాజాగా ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా చిత్ర నిర్మాణం ప్రారంభించి ఏక కాలంలో మూడు చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి వినోదన్. ఇందులో దివంగత సీనియర్ నటుడు ఐసరి వేలన్ మనవడు వరుణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నవ దర్శకుడు విక్టర్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పెద్ద వేటనే జరిగిందట. చివరికి నటి వేదికలో తన హీరోయిన్‌కు కావలసిన లక్షణాలు ఉన్నాయనిపించడంతో ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ దర్శకుడు విక్టర్ తనకు కథ వినిపించినప్పుడు ప్రభుదేవా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పారన్నారు. ప్రభుదేవాకు తాను వీరాభిమానినన్నారు. అలాంటిది ఆయన చిత్రంలో నటించాలన్న తన కల ఈ విధంగా నెరవేరుతుండడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. కథ విన్న తరువాత తన ఉత్సాహం రెట్టింపు అయ్యిందన్నారు. కథను దర్శకుడు అంత అద్భుతంగా తయారు చేశారని తెలిపారు. పరదేశి, కావ్యతలైవన్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రంలో తన పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇది ఫిజికో ఎమోషనల్ చిత్రం అని చెప్పారు. దర్శకుడు విక్టర్ తన పాత్ర ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో పెద్ద పరిశోధనే చేశారని అన్నారు. ఆ విధంగా నటుడు వరుణ్‌కు తనకు రిహార్స్‌ల్స్ నిర్వహించారని తెలిపారు. ఈ ప్రక్రియ నాలాంటి నటీనటులకు వరప్రసాదం లాంటిదిగా పేర్కొన్నారు.